తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం నేపథ్యంలో ఆనాటి సంఘటనల స్ఫూర్తితో రూపొందుతున్న చిత్రం ‘రాజన్న’. నాగార్జున కథానాయకుడిగా నటిస్తున్నారు. రజాకార్ల, భూస్వాముల ఆగడాలపై సమరశంఖం పూరించిన తెలంగాణ పోరాట యోధుడు, స్వాతంత్య్ర సయరయోధుడు ‘రాజన్న’గా ఆయన ఈ చిత్రంలో కనిపించనున్నారు. స్వీయనిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై ఆయన ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యస్.యస్.రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలోని పోరాట సన్నివేశాల్ని యస్.యస్.రాజమౌళి పర్యవేక్షణలో తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం పాట మినహా చిత్రీకరణ పూర్తిచేసుకుంది. నాగార్జున చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘ తెలంగాణ సాయుధ పోరాటంలో జరిగిన నాలుగు యదార్థ సంఘటనలను ఆధారంగా తయారుచేసుకున్న కథాంశమిది.
విజయేంద్ర ప్రసాద్ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కిస్తున్నాడు. రాజమౌళి పర్యవేక్షణలోని యాక్షన్ సన్నివేశాలు సినిమాకి ప్రధానాకర్షణగా వుంటాయి. ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో ఎనిమిదేళ్ల పాప ఏని అద్భుతంగా నటించింది. ఈ సినిమాలో పాప పాత్రకు చాలా ప్రాముఖ్యత వుంది. ఈ చిత్రం కోసం భారీ సెట్స్ వేసి స్వాతంవూతోద్యమ కాలం నాటి వాతావరణాన్ని సృష్టించాం. రాజన్న చిత్రాన్ని చేయడం వ్యక్తిగతంగా నాకెంతో సంతృప్తినిచ్చింది. మా సంస్థలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. దేశభక్తిని రగిలిస్తూ, పోరాట స్ఫూర్తిని చాటే ఈ చిత్రం అందరినీ ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్షికమాల్ని జరుపుతున్నాం. ఆర్.ఆర్.ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా డిసెంబర్ మూడో వారంలో ఈ చిత్రాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’ అన్నారు.
స్నేహ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో బేబి ఏని, శ్వేతమీనన్, నాజర్, అజయ్, సుప్రీత్, ప్రదీప్‌రావత్, ముఖేష్‌కాలే, గాంధీ తదితరులు ముఖ్యపావూతల్ని పోషించారు. ఈ చిత్రానికి సినిమాటోక్షిగఫీ: శ్యామ్ కె నాయుడు, అనిల్‌బండారి, పూర్ణ, ఆర్ట్: రవీందర్, ఫైట్స్: విజయ్, రామ్‌లక్ష్మన్, సంగీతం: యం.యం.కీరవాణి, సమర్పణ: అక్కినేని అన్నపూర్ణ, కథ-వూస్కీన్‌ప్లే-మాటలు-దర్శకత్వం: విజయేంవూదవూపసాద్.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి