(25/10/2011)కే సి ఆర్ నిరాహార దిక్ష తర్వాత ఉదృతంగా సాగుతున్న ఉద్యమానికి మద్దతుగా, నల్గొండలో జరిగిన ధూంధాం లో పాల్గొని తెలంగాణకు మద్దతు తెలిపాడు తెలంగాణా ముద్దు బిడ్డ డైరెక్టర్ ఎన్. శంకర్, ఆ మరుసటి రోజే ఆయనతో గతంలో పనిచేసి రెండు హిట్స్ అందుకొన్న సీమంద్ర హీరో ఒకడు అయన గురించి చులకనగా మాట్లాడాడు, దానికి స్పందనగా ఆయన తెలంగాణా పై ఒక ఉద్యమ సినిమా తీస్తానని ప్రకటించారు, అన్నట్టుగానే కొత్త నటి నటులతో జై భోలో తెలంగాణా సినిమాను ప్రారంబించారు, అయితే ఈ చిత్రం తీయడానికి నిర్మాతలెవరు ముందుకు రాకపోయే సరికి శంకర్ స్వయంగా నిర్మాణ బాధ్యతలు తీసుకున్నారు, ఈ సినిమా ప్రారంబించిన నాటినుండి సీమంధృలు అనేక రకాల ఇబ్బందులకు గురి చేసారు, సినిమా షూటింగ్ పూర్తైన పోస్ట్ ప్రొడక్షన్ కు స్టూడియో లు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారు, సినిమా సంక్రాంతి బరిలో లేకుండా చేసారు, ఈ సినిమా కోసం శంకర్ తన ఇంటిని కూడా తాకట్టు పెట్టారంటే ఈ సినిమా కోసం ఆయన ఎంత కష్ట పడ్డారో, ఆయనకు తెలంగాణా పై ఎంతటి కమిట్మేంట్ ఉందో అర్థం చేసుకోవచ్చు, సినిమా రిలీజ్ డేట్ 28 జనవరి 2011 న అనుకున్నారు కానీ, సెన్సార్ రూపంలో సినిమాను అడ్డుకున్నారు సీమంధృలు , చుసిన సబ్యుల్లో ఎక్కువమంది సర్టిఫీకేట్ ఇవ్వడానికే మోగ్గుచూపిన, ఒక ఆంద్ర అధికారి మాత్రం ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ముంబైకి పంపించింది సినిమాను, అయితే ముంబైకి వెళ్లిందంటే ఆ సినిమా మూడు నలుగు నెలలు దాటితే కాని సర్టిఫీకేట్ ఇవ్వరు, ఆలోగా జనం ఆ సినిమా ను గురించి మరచిపోతారు, మనసు పెట్టి తీసిన సినిమా అలా అయిపోవడంతో శంకర్ కంట కన్నీరు ఆగలేదు, ఆ దృశ్యాల్ని టివి లో చుసిన తెలంగాణా జనం రగిలి పోయారు, తెలంగాణా లో అన్ని జిల్లాల్లో నడుస్తున్న సినిమాలన్నీ నిలిపివేయించారు, సీమంద్ర సెన్సార్ బోర్డు దిష్టిబొమ్మలు తగులబెట్టారు, కొన్ని చోట్ల సినిమా రీళ్ళను తగులబెట్టారు, ఓ యు జాక్ సెన్సార్ బొర్ ఆఫీసును ముట్టడించింది, కొందరు యువకులు సెల్ టవర్ ఎక్కారు, ఆ తర్వాత లాయర్లు కూడా సెన్సార్ బోర్డు ఆఫీసును ముట్టడించారు, జిల్లాల్లో థియేటర్ల ముందు నిరసనలు కొనసాగాయి, పరిస్థితి చేయి దాటుతుందని తెలుసుకున్న సెన్సార్ వాళ్ళు శంకర్ను పిలిచి A సర్టిఫికేట్ ఇవ్వడానికి ఒప్పుకున్నారు, రక్త చేరిత్రలాంటి సినిమాలకు సెన్సార్ చేసి సర్టిఫికేట్ లు ఇచ్చే వాళ్ళు మానవత విలువల్ని పెంపొందించే ఇలాంటి సినిమాలకు సర్టిఫికేట్ ఇవ్వకపోవడాన్ని తెలంగాణా వాదులంత ముక్త క౦టం తో కండించారు, ఇక విడుదల కాదేమో అనుకున్న సినిమా తెలంగాణా ప్రజల పోరాటం తో 4 ఫిబ్రవరి 2011 న విడుదలైంది,
సినిమాలో ఎన్నో ప్రత్యేకతలు జగపతి బాబు బందగి గోపన్న అనే తెలంగాణా సమర యోదుడిగా నటించగా, స్మృతి ఇరానీ తల్లి పాత్రలో నటించి మెప్పించారు,హీరోయిన్ మీరా నందన్ అచ్చమైన తెలుగమ్మాయిల ఉంది, తెలంగాణా ఉద్యమ కారులు మల్లేపల్లి లక్ష్మయ్య, ప్రో.కొదందారం, శ్రవణ్, వేద వ్యాస్, అల్లం నారాయణ, దేశపతి శ్రీనివాస్, ఇలా చాల మంది నటించారు, ఈ సినిమా కు సంగీతం తెలంగాణా ముద్దు బిడ్డ చక్రి అందించారు, పాటలు గోరేటి వెంకన్న, నందిని సిద్దారెడ్డి, సుద్దాల అశోక్ తేజ అందించారు, కే సి ఆర్ ఒక సన్నివేశంలో కనిపిస్తారు, ఈ చిత్రం కోసం ఒక పాటను కూడా రాసారు, ఇక ఈ సినిమాకు హై లైట్ గద్దర్ అని చెప్పుకోవచ్చు, ఈ సినిమా కోసం అయన ఒక పాట రాసి, పాడి, దానిపై ఆయన అబినయించారు, సినిమా చేరిత్రలోనే ఎప్పుడు రానంత స్పందన ఈ చిత్రం లోని ఆ పాటకు వచ్చింది, థియేటర్ లోని జనమంతా లేచి డాన్సు చేసరంటేనే ఈ పాట ఎంతగా జనం లోకి వెళ్లిందో చెప్పవచ్చు, అందే శ్రీ రాసిన జై భోలో తెలంగాణా పాత కూడా జనానికి నచ్చింది, ఈ సినిమా 50 రోజులు దిగ్విజయంగా పూర్తి చేసుకుంది, తెలంగాణా నుండి 60 % కలేక్షణ్ లు పొందే ఆంధ్రులు ఈ సినిమాను చూడలేదు, కేవలం తెలంగాణా జిల్లాల్లో మాత్రమే నడిచి 60 % కలేక్షణ్ సాదించి ఈ సంవత్సర విజయాలలో ఒకటిగా నిలిచింది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి