మొట్టమొదటి సారిగా తెలంగాణా ఇతివృత్తం తెరపై దర్శనమిచ్చింది, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట విశేషాలు కళ్ళకు కట్టినట్టు సహజత్వం ఉట్టిపడేలా తీసారు, మాభూమి ఒక సినిమాలా కాకుండా వస్తవా పరిస్థితులు మన కాళ్ళ ముందు జరుగుతున్న అనుభూతికి ప్రతి ప్రేక్షకుడు లోనవుతాడు, తెలంగాణా గ్రామాల్లోని కల్మషం లేని మట్టి మనుషుల హృదయాలను తెరపై ఆవిష్కరించిన ఘనత దర్శకుడు గౌతం ఘోష్ కే దక్కుతుంది., తెలంగాణా రైతులు పోరాట యోధులుగా ఎలా మారారు అనేది సవివరంగా తెలియజెప్పిన చిత్రం ఇది, పాత్రల చిత్రణ వేషధారణ, భాష, యాస లు సహజంగా ఉండడం వాళ్ళ ఈ సినిమాను సినిమాలగా కాకుండా మన ముందు నిజం గా జరుగుతుండ అనే అనుభూతికి లోనవుతాడు ప్రేక్షకుడు, ఈ సినిమా అనేక అవార్డు లను గెలుచుకుంది, అంతేకాదు వాణిజ్య పరంగా కూడా ఇది ఘన విజయం సాధించింది, హైదరాబాద్ లో ఒక టాకీస్ లో 200 ల రోజులు నడిచింది, తెలంగాణా సాయుధ పోరాటానికి సంబంధించి ఇంత విపులంగా చర్చించిన సినిమా ఇంకోటి లేదు, ఇందులో ప్రజా గాయకుడు గద్దర్ బండెనక బండి కట్టి అనే పాటలో కనిపిస్తాడు, ఇదే అతని మొదటి చిత్రం. ఈ చిత్రంలో సాయుధ పోరాట యోధుడు యాదగిరి వేషంలో కనిపిస్తాడు గద్దర్.
రామయ్య పాత్ర ఇందులో హీరో, గ్రామాలపై పది కాశీం రజ్వి సేనలు ప్రజలను దోచుకుంటాయి, అలంటి సమయంలో గ్రామాల్లోని ప్రజలు కమూనిస్ట్ ల సహకారంతో సంగాలుగా ఏర్పడి దొరలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తారు, దొరలను గడీల నుండి తరిమి తరిమి కొడతారు, చివరికి నిజాం భారత ప్రభుత్వానికి లోన్గిపోతారు, ఆ తర్వాత కొంతమంది దొరలకు అధికారం తిరిగి కట్టబెట్టాలని చూస్తారు, అయితే సంఘం మాత్రం దోరాలపై యుద్ధం అలాగే కొనసాగిస్తుంది, 1930 నుండి 1951 లో సాయుధపోరాటం విరమించే వరకు ఈ చిత్రం కొనసాగుతుంది, ఈ చిత్రాన్ని 1999 లో పబ్లిక్ గార్డెన్ హైదరాబాద్ లో ప్రదర్శించినప్పుడు చాల గొప్ప రెస్పాన్సు వచ్చింది, ప్రాంతీయ భేదాలు లేకుండా అందరు ఈ చిత్రాన్ని చూసి ఆనందించారు.
ఈ చిత్రం ప్రస్తుతం మార్కెట్ లో లభించడం లేదు, కేవలం ఒక గంట యాభై రెండు నిమిషాల సినిమా మాత్రమే ఆన్ లైన్ లో లభిస్తుంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి