తెలంగాణా కు మేం వ్యతిరేఖం కాదు, తెలంగాణా సెంటిమెంట్ ను మేం గౌరవిస్తున్నాం అని మా ప్లినరిలోనే స్పష్టంగా మా వైఖరి చెప్పం, ఇది వై ఎస్ అర్ పార్టీ వారి మాట. తెలంగాణా అవసరమే లేదని, తనకు సమైక్యంద్ర ఉంటేనే బాగుంటుందని ఆ పార్టీ తెలంగాణా కు చెందినా నాయకురాలు కొండా సురేఖ వ్యాక్యనించడం, జగన్ పార్లమెంట్ లో సమైక్యంద్ర ప్ల కార్డ్ పట్టుకోవడం ఆ పార్టీ విదాన్నాన్ని చెప్పకనే చెబుతున్నాయి, జగన్ పార్టీ తెలంగాణా లో పట్టు నిలుపు కోవడానికి తహః తహ లాడుతుంది, ఆంధ్రలో కాంగ్రెస్ ను నమ్ముకుంటే ఓట్లు పడవు, టి డి పీ కథ ముగుసింది కావున నాయకులందరికీ కొత్త పార్టీ అవసరం ఏర్పడింది, రాజశేకర్ రెడ్డి పేరు చెప్పుకొని సెంటిమెంట్ అనే పేరుతో కొత్త సీస లో పాత సార పోస్తున్నారు. కొత్త పార్టీ ని ఎన్నుకున్న వచ్చే వారు మాత్రం పాత నాయకులే.
ఇక తెలంగాణా లో పరిస్థితులు భిన్నం, తెలంగాణా సెంటిమెంట్ బలంగా ఉండటం తో నాయకులూ సీమంద్ర పార్టీల వైపు వెళ్ళడానికి భయపడుతున్నారు, తమ రాజకీయ భవిష్యత్తు ఏమవుతుందో అని సంశయం వ్యక్తం చేస్తున్నారు, దీనికి బలం చేకూరుస్తు పర్కాల్ బై ఎలెక్షన్ లో ఆ పార్టీ లో బలమైన నాయకురాలు కొండా సురేఖ ఓడిపోవడం, ఇప్పుడు ఆ దంపతులు రాజకీయ నిరుద్యోగులుగా మారడం కూడా నాయకులను ఆలోచనలో పడేస్తుంది. ఇప్పటి వరకు వరంగల్, కరీం నగర్, వంటి జిల్లాల్లో వై సి పీ కి అతి గతి లేదు, ఆదిలాబాద్, నల్గొండల్లో మాజీలు ఆ పార్టీలో చేరారు, కోమటి రెడ్డి బ్రతర్స్ తాజాగా వై సి పీ లోకి వెళ్ళేది లేదని చెప్పారు, రెడ్డి కార్డ్ తో రెడ్డి మాజీ ఎం ఎల్ ఎ లను, నాయకులను ఆకర్షిస్తున్నాడు జగన్.
ఇక గ్రేటర్ హైదరాబాద్ లో ఎం ఐ ఎం పార్టీ ఎ పార్టీ కి మద్దతు ఇస్తే ఆ పార్టీ లోకి వెళ్ళే0దుకు సిద్ధంగా ఉన్నారు అధికార పార్టీ సభ్యులు, చేరికలు గెలుపులు అన్ని కేంద్రం నెలరోజుల్లో తీసుకునే నిర్ణయం పై ఆధారపడి ఉంటాయి, కేకే తాజాగా చేసిన వ్యాక్యాల ప్రకారం తెలంగాణా ను కాంగ్రెస్ ఇస్తే కె సి అర్ తమ వెనక ఉంటాడని, తెలంగాణా ను కాంగ్రెస్ ఇవ్వకపోతే తామే కె సి అర్ వెనక నడుస్తామని చెప్పారు, కాబట్టి రాజకీయాలు ఎ రకం గా నైన మారవచ్చు , కాని ప్రధానమైన పోటి మాత్ర0 టి అర్ ఎస్, వై సి పీ ల మధ్య ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
తెలంగాణా లో పాదయాత్ర చేసిన షర్మిల తాను రాజన్న బిడ్డనని, జగనన్న చేల్లెనని, జగన్ వదిలిన బానాన్నని, చెప్పుకుంటూ ఊర్లని తిరిగారు, అయితే తెలంగాణా వాదులు అడిగిన ప్రతిసారి తాము తెలంగాణా కు వ్యతిరేఖం కాదని, తమ పార్టీ తెలంగాణా సెంటిమెంట్ ను గౌరవిస్తుందని చెప్పుకొచ్చారు, ఇదే అభిప్రాయాన్ని అఖిలపక్ష సమావేశం లో చెప్పారు, తెలంగాణా గురించి తమ అధినేత పార్టీ ప్లీనరీ సమావేశం లోనే స్పష్టత ఇచ్చారని, కేంద్రం ఆర్టికల్ 3 ప్రకారం నిర్ణయం తీసుకోవచ్చని, కాంగ్రెస్ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెప్పారు, రాష్ట్రం లో ఒక ప్రతిపక్ష పార్టీ గా ఉన్న వై సి పీ రాష్ట్ర విభజన విషయం లో సరైన నిర్ణయం చెప్పకుండా కాంగ్రెస్ కె నిర్ణయాధికారం వదిలి వెయ్యడం ఏమిటి..? ఇంతదానికి వాళ్ళకు ఒక పార్టీ ఎందుకు..?
కాంగ్రెస్ తెలంగాణా ఇవ్వకపోతే మీరు ఎం చేస్తారు..? 2014 లో తెలంగాణా గురించి మీ వైకరి ఏమిటి..? 2014 లో ఒకవేళ మీ పార్టీ గేలిస్తే తెలంగాణా కు ఎం చేస్తారు..? కేంద్రం లో చక్రం తిప్పగలిగే సంఖ్యలో ఎం పీ లు ఉంటె అప్పుడు మీ పార్టీ ఎం చేస్తుంది..? తెలంగాణా పల్లెల్లో తిరుగుతూ రాజన్న రాజ్యం తెస్తానని ప్రజలకు కళ్ళే బుల్లి మాటలు చెప్పటం కాదు, మేము అధికారం లో లేము, రాష్ట్రం ఇచ్చే శక్తి మాకు లేదు అని తప్పించుకోవడం కాదు, 2014 లో అధికారం ఇవ్వండి తెలంగాణా తీర్మానం అసెంబ్లీ లో చేస్తాం, కేంద్రం పై ఒత్తిడి తెచ్చి తెలంగాణా సాధిస్తాం అని ఎందుకు చెప్పడం లేదు..? ఇవే ప్రశ్నలు సీల్డ్ కవర్ డ్రామాల బాబు కు చెందు తాయి..పాద యాత్రను అడ్డుకుంటే నానా రాదంతం చేసే వారి అనుచరులు ఈ విషయం లో ఎందుకు స్పష్టత ఇవ్వరు, తెలంగాణా పై స్పష్టత లేకుండా ఎవరిని మోసం చెయ్యడానికి ఆ పార్టీ లో చేరారు ఈ ప్రాంతపు దొంగలు, టి డి పీ లో చేరిన వై సి పీ లో చేరినా ఒక్కటే, టి డి పీ వాళ్ళు తెలంగాణా ను అడ్డుకున్న ద్రోహులే, వై సి పీ నాయకులు కూడా, ఎందుకంటే 2009 ఎన్నికల ప్రచారంలో హైదరాబాద్ కు వెళ్ళాలంటే వీసా పాస్పోర్ట్ అడుగుతారని వెకిలి నవ్వుల రాజశేకర్ తన కడుపులో ఉన్న విశాన్నంత తెలంగాణా పై కక్కాడు, ఆయన కుమారుడు పార్లమెంట్ లో సమైక్యంద్ర ప్ల కార్డ్ పట్టుకున్నడు, ఆమరణ నిరాహరదిక్ష చేసిన అతని బాబాయి మామయ్యలు, ఇవన్ని మరచి పోయి కులపిచ్చితో, డబ్బుకు అమ్ముడుపోయి ఈ ప్రాంత ప్రజల ఆశయాలను తాకట్టు పెట్టి సీమంద్రులకు వారి నల్ల దానానికి దాసోహం అనడం ఈ ప్రాంత నాయకులకు సిగ్గుచేటు, తెలంగాణా ప్రజల ఆకాంక్షలు అక్కర లేదు, కాని జగన్ బాబు కావాలి, జనం పై తుపాకి తో కాల్చాలి, బూతులు తిట్టాలి, కాని జగన ను ఘనం గా పొగడాలి ఇదే విధానం తో ముందుకు వెళ్లి మంత్రి పదవికి రాజీనామా చేసి, ఎం ఎల్ ఎ గా అనర్హత వేటు వెయ బడిన కొండ సురేఖ కు పట్టిన రాజకీయ నిరుద్యోగమే ఇతర నాయకులకు పడుతుంది, తమ వ్యక్తిగత అవసరాల కొరకు ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షలను తాకట్టు పెడితే, కాలోజి చెప్పినట్లుగా ప్రాంతేతరులను ప్రాంతం దాటే వరకు తరిమి కొడతా, ప్రా0తీయులను ప్రాంతం లోనే బొంద పెడుత0...
రాజన్న రాజ్యం లో తెలంగాణా భూములు స్వాహ చేయ బడ్డాయి, రంగా రెడ్డి జిల్లా తన అస్తిత్వాన్ని కోల్పోయింది, దేవుడి పాలనలో దయ్యాలు ఎవరు..? ఆ దేవుడు దేవుడేనా దయ్యమ..? తన కొడుకు కడుపు నింపడానికి ఆ భు బకాసురుడు చేసిన భు దందాలు చుడండి....
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి