న్యూఢిల్లీ: తెలంగాణ ఉద్యమానికి, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు సర్వత్రా సానుకూలత వ్యక్తమవుతుంది. ఉద్యమించిన ప్రతిచోటా బాసట దొరుకుతూనే ఉంది. తాజాగా, నిన్నగాక మొన్న పుట్టిన ‘ఆమ్ ఆద్మీ పార్టీ’ తెలంగాణ ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఈమేరకు ఇవాళ ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ఓయూ జేఏసీ విద్యార్థులు చేపట్టిన దీక్షా శిబిరానికి ఆమ్ ఆద్మీ పార్టీ నేత మనీష్ శిశోడియా వచ్చారు. తెలంగాణ విద్యార్థుల దీక్షకు సంఘీభావం ప్రకటించారు.
తెలంగాణ, సీమాంధ్రకు వేరువేరు శాఖలు
తమ పార్టీకి తెలంగాణ, సీమాంధ్రల్లో వేరు వేరు శాఖలు ఉంటాయని ఆమ్ ఆద్మీ పార్టీ నేత మనీష్ శిశోడియా తెలిపారు. ఇవాళ ఆయన జంతర్‌మంతర్ వద్ద తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం దీక్ష చేస్తున్న ఓయూ జేఏసీ విద్యార్థుల వద్దకు వచ్చిన సందర్బంగా ఈ విషయం చెప్పారు. తెలంగాణ, సీమాంధ్రలు రెండు వేర్వేరు రాష్ట్రాలుగా ఉండాల్సిందేనని ఆయన అభిప్రాయపడ్డారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి