హోం

3, డిసెంబర్ 2012, సోమవారం

తెలంగాణ అవసరం లేదు


jaggareddy- రాష్ట్రం వల్ల ఏమీ జరగదు.. అభివృద్ధి ప్యాకేజీ చాలు
- అధిష్ఠానానికి లేఖ రాస్తా.. 9న సోనియాను కలుస్తా
- ప్రత్యేక రాష్ట్రం వస్తే.. నా రాజకీయం వేరే
- డబ్బు ఉంటే రాజకీయాల్లో ఏదైనా చేయొచ్చు
-సంగాడ్డి ఎమ్మెల్యే జగ్గాడ్డి సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్, డిసెంబర్ 2 (టీ మీడియా): తెలంగాణకు ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు వల్ల ఏం జరగదని, అభివృద్ధి ప్యాకేజీ ప్రకటిస్తే చాలని మెదక్ జిల్లా సంగాడ్డి నియోజకవర్గం నుంచి అధికార కాంగ్రెస్ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే తూర్పు జయవూపకాశ్‌డ్డి (జగ్గాడ్డి) అన్నారు. ఈ విషయమై తాను కాంగ్రెస్ అధిష్ఠానానికి లేఖ రాస్తానని, యూపీఏ చైర్‌పర్సన్, కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని కలుస్తానని చెప్పారు. ఆయన ఆదివారం అసెంబ్లీ లాబీలో తనను కలిసిన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఈ నెల 9న సోనియాగాంధీని కలిసి తెలంగాణ రాష్ట్రం అవసరం లేదన్న తన అభివూపాయాన్ని చెప్తానన్నారు. రాష్ట్రం ఏర్పాటుకు బదులు అభివృద్ధి కోసం ప్రత్యేక ప్యాకేజీ కోరుతానని స్పష్టం చేశారు. తెలంగాణ ఎందుకు ఇవ్వొద్దో చెప్పడానికి తన వద్ద అనేక ఆధారాలు ఉన్నాయని తెలిపారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే ఎంఐఎం వంటి మతతత్వ శక్తులు పుంజుకుంటాయని చెప్పారు.

సిద్ధాంతాల ప్రాతిపదికన ఎదిగిన తాను తెలంగాణ విషయంలో అధిష్ఠానం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానన్నారు. అయితే తన అభివూపాయంలో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేశారు. ఈ విషయంలో తనపై ఎలాంటి విమర్శలు వచ్చినా ఎదుర్కొంటానని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే తన రాజకీయం వేరే విధంగా ఉంటుందన్నారు. డబ్బు ఉంటే రాజకీయాల్లో ఏదైనా చేయొచ్చు అని వ్యాఖ్యానించారు. తాను ఎస్సీ వర్గీకరణకు అనుకూలమని చెప్పారు. నిజాం హయాంలో ఉర్దూ తప్ప మరోభాష లేకపోవడంతో ఈ ప్రాంత యువతకు ఉద్యోగ అవకాశాలు రాలేదని తెలిపారు. ఉద్యోగ అవకాశాల కోసం ప్రత్యేక చట్టం తీసుకొని రావాలని అధిష్ఠానాన్ని కోరుతానని చెప్పారు. తెలంగాణలో భారీ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం సాధ్యం కాదని, అందుకు చిన్ననీటి సాగునీటి ప్రాజెక్టులను అభివృద్ధి చేయాలని కోరుతానని తెలిపారు. అభివృద్ధి కోసం ఒక్కో జిల్లాకు రూ చొప్పున మొత్తం పది జిల్లాలకు రూ.10వేలకోట్లు కేటాయించినట్లయితే తెలంగాణ అభివృద్ధి చెందుతుందన్నారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు కోసం రూ.40 వేల కోట్లు మంజూరు చేయాలని కోరుతానని చెప్పారు.
(from namaste telangana)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి