- కేసీఆర్ ఆమరణ నిరశనకు నేటితో మూడేళ్లు
- ఉద్యమాన్ని మలుపు తిప్పిన అపూర్వ ఘట్టం
- కేసీఆర్ దీక్షకు ముందు.. తర్వాత..
- మైలురాయిగా నిలిచిపోయిన పోరాటం
- నేడు ఇందిరాపార్క్ వద్ద సామూహిక దీక్షలు
హైదరాబాద్, నవంబర్ 28 (టీ మీడియా):తెలంగాణ రాష్ట్ర సాధన కోసం టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కే చంద్రశేఖర్‌రావు చారివూతాత్మక ఆమరణ నిరశనకు పూనుకొని గురువారానికి సరిగ్గా మూడేళ్లు పూర్తవుతున్నాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని తెలంగాణవ్యాప్తంగా గురువారం దీక్షా దివస్‌ను టీఆర్‌ఎస్, టీజేఏసీ, ఉద్యోగసంఘాల జేఏసీతో పాటు.. తెలంగాణ ఉద్యమశక్తులు పాటించనున్నాయి. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి మహత్తర స్ఫూర్తినిచ్చిన ఆ రోజును జ్ఞాపకం చేసుకుంటూ తెలంగాణలో మరోసారి మహోద్యమానికి శ్రీకారం చుట్టనున్నారు. తెలంగాణవ్యాప్తంగా జిల్లా, నియోజకవర్గ కేంద్రాల్లో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, నాయకులు ఎక్కడికక్కడ దీక్షా దివస్‌లో పాల్గొననున్నారు. గ్రేటర్ హైదరాబాద్, రంగాడ్డి జిల్లాల నాయకులు రాజధాని నగరంలోని ఇందిరాపార్క్ వద్ద దీక్షా దివస్ పాటించనున్నారు. టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం, ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకులు జీ దేవీవూపసాద్, వీ శ్రీనివాస్‌గౌడ్. సీ విఠల్ ఆధ్వర్యంలో వేలమంది ఉద్యోగులు, కార్యకర్తలు ఇక్కడ సామూహిక దీక్షను చేపడుతున్నారు. ప్రతి శిబిరంలోనూ వేయిమందికి తక్కువ కాకుండా దీక్షలో పాల్గొనాలని నేతలు ఇచ్చిన పిలుపు మేరకు టీఆర్‌ఎస్ శ్రేణులు ఆ ఏర్పాట్లలో ఉన్నాయి.
ఇదీ నేపథ్యం..
తెలంగాణ ఉద్యోగ సంఘాల సారధ్యంలో పెల్లుబికిన ‘రాష్ట్రపతి ఉత్తర్వులలోని 14 ఎఫ్ పేరా తొలగింపు ఉద్యమం’ నిప్పు రాజుకుని.. అగ్నికీలలైనట్లు.. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమాన్ని కీలక దశకు తీసుకువచ్చింది. తెలంగాణ నినాదంతో పది జిల్లాలలో ప్రజలను మహోద్యమశక్తిగా తీర్చిదిద్దిన కేసీఆర్ 2009లో నవంబర్ 29న ఆమరణ నిరశనకు దిగారు. ఒకవైపు గిర్‌గ్లానీ సిఫారసులు, 610 జీవో అమలు చేయాలని, రాష్ట్రపతి ఉత్తర్వులలోని 14ఎఫ్ పేరా తొలగించాలని, హైదరాబాద్ తెలంగాణ అంతర్భాగమేనని ఉద్యోగ సంఘాలు 2008 డిసెంబర్ నుంచి ఉద్యమిస్తున్న సమయమది.
ఉద్యోగ సంఘాల మహాసభలలో మాట్లాడిన కేసీఆర్.. తెలంగాణ రాష్ట్ర సాధనకోసం అవసరమయితే ఆమరణ దీక్షకు దిగుతానని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించారు. ఈ క్రమంలోనే అక్టోబర్ 9, 2009లో హైదరాబాద్ ఫ్రీజోన్ అంటూ సుప్రీం కోర్పు తీర్పు వచ్చింది. దీనిపై ఉద్యోగ సంఘాలు, టీఆర్‌ఎస్ శ్రేణులు తెలంగాణలోని రాజకీయ పార్టీలన్నింటినీ నిలదీశాయి. అక్టోబర్ 12న ఉద్యోగ సంఘాలు చలో అసెంబ్లీకి పిలుపునిచ్చాయి. తెలంగాణలోని రాజకీయ శక్తులన్నీ 14ఎఫ్ పేరా తొలగింపుకోసం కలిసి ఉద్యమించాలని ఉద్యోగ సంఘాలు అక్టోబర్ 12, 2009న పిలుపునిచ్చాయి. నవంబర్ 21, 2009లో సిద్దిపేటలో ఉద్యోగ గర్జన సభ జరిగింది. కనీవినీ ఎరుగని రీతిలో లక్షల సంఖ్యలో జనం హాజరయ్యారు. నవంబర్ చివరి వరకు 14 ఎఫ్ తొలగింపుపై రాష్ట్ర ప్రభుత్వం విస్పష్టంగా ప్రకటించని పక్షంలో నవంబర్ 29 నుండి పెన్‌డౌన్ చేస్తామని టీఎన్జీవో అప్పటి అధ్యక్షుడు కే స్వామిగౌడ్, ప్రధానకార్యదర్శి జీ దేవీవూపసాద్ ఆ సభలో ప్రకటించారు. అంతే వేగంగా కేసీఆర్ నవంబర్ చివరలో ఆమరణ నిరశన దీక్ష చేపడుతానని, కొద్ది రోజులలో ఎక్కడ దీక్షకు దిగేదీ ప్రకటిస్తానని పేర్కొన్నారు.
ఈ క్రమంలో నవంబర్ 29న సిద్దిపేటలో కేసీఆర్ చరివూతాత్మక ఆమరణ దీక్షకు సిద్ధమయ్యారు. కేసీఆర్ ప్రకటన వెలువడిన మరు క్షణం నుంచి తెలంగాణలో అప్రకటిత ఎమ్జనీ వాతావరణం నెలకొన్నది. కరీంనగర్ నుంచి దీక్షావేదిక వద్దకు బయలుదేరిన కేసీఆర్‌ను.. కరీంనగర్ శివారులోని మానకొండూర్ వద్ద పోలీసులు నాటకీయంగా అరెస్టు చేసి ఖమ్మం తరలించారు. అక్కడ సెకండ్‌క్లాస్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. 14 రోజుల రిమాండ్ విధించడంతో కేసీఆర్‌ను ఖమ్మం సబ్‌జైలుకు తరలించారు. అప్పటినుండి
తెలంగాణ ప్రజల ఆకాంక్షలపైన సీమాంధ్ర కర్కశ నిర్బంధకాండ పాశవికంగా కొనసాగింది. నవంబర్ 30న కేసీఆర్ ఆరోగ్యం బాగోలేదని సాకు చెప్పి పోలీసులు ఆయనను ఖమ్మం ప్రభుత్వాస్పవూతికి తీసుకువచ్చి బలవంతంగా దీక్షను భగ్నం చేయించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ తాను జైలులో దీక్షను కొనసాగిస్తానని కేసీఆర్ ప్రకటించారు. మరోవైపు ఉద్యోగుల పెన్‌డౌన్ తారస్థాయికి చేరుకున్నది. తనకు బలవంతంగా వైద్యం చేయించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని, ఈ దుర్మార్గాన్ని ఇదే విధంగా కొనసాగిస్తే తాను ఆత్మహత్య చేసుకుంటానని డిసెంబర్ 1న కేసీఆర్ హెచ్చరించారు. తనను పోలీసులు క్రూరంగా హింససిస్తున్నారని హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. తనను హైదరాబాద్‌కు తరలించాలని న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు.
డిసెంబర్ 2న మంత్రి రాంరెడ్డి వెంకటడ్డిని ప్రభుత్వం దూతగా కేసీఆర్ వద్దకు పంపింది. అయినా దీక్ష విరమించేందుకు కేసీఆర్ ససేమిరా అన్నారు. ఖమ్మం ఆస్పవూతిలో కేసీఆర్ ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో డిసెంబర్ 3న హైదరాబాద్ నిమ్స్‌కు తీసుకువచ్చారు. అక్కడ ఆయన ఆమరణ నిరశనను కొనసాగించారు. డిసెంబర్ 4న రాష్ట్ర ప్రభుత్వ దూతగా మంత్రి దానం నాగేందర్ వచ్చినా కేసీఆర్ తన వైఖరిని పునరుద్ఘాటించారు. మరుసటి రోజు అప్పటి సీఎం రోశయ్య తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయం తన చేతిలో లేదని చేతుపూత్తేశారు. టీఆర్‌ఎస్, ఉద్యోగ, విద్యార్థి సంఘాలు 48 గంటల తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చాయి. అసెంబ్లీ ముట్టడికి విద్యార్థులు సిద్ధమయ్యారు. డిసెంబర్ 6న కేసీఆర్‌ను రోశయ్య పరామర్శించారు. దీక్ష విరమించాలని విజ్ఞప్తి చేశారు.
14ఎఫ్ పేరా తొలగింపునకు అనుకూలంగా శాసనసభలో తీర్మానం చేస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ అధిష్ఠానం కేసీఆర్ ఆరోగ్యంపై శ్రద్ధ కనబరిచింది. తెలంగాణ జిల్లాలు బంద్‌తో దద్దరిల్లడంతో ఢిల్లీ పెద్దల ఆదేశాలతో రోశయ్య ఢిల్లీ నుంచి హుటాహుటిన హైదరాబాద్ చేరుకొని డిసెంబర్ 7న అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించారు. వాటి మినిట్స్‌ను ఢిల్లీకి పంపించారు. తెలంగాణకు టీడీపీ, పీఆర్పీ, కాంగ్రెస్ సై అన్నాయి. డిసెంబర్ 8న కేసీఆర్ ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. కేసీఆర్ దీక్ష విరమంచని పక్షంలో ఏదైనా జరుగవచ్చునని నిమ్స్ వైద్యులు ఆందోళన వ్యక్తం చేశారు. శాసనసభ తెలంగాణ నినాదాలతో ప్రతి ధ్వనించింది.
తెలంగాణ ఇవ్వడం మినహా మరో గత్యంతరం లేదని తెలంగాణ మంత్రులు సోనియాగాంధీకి లేఖ రాశారు. డిసెంబర్ 9న ఢిల్లీలో కోర్‌కమిటీ సభ్యులు అత్యవసరంగా రెండు సార్లు భేటీ జరిపారు. చివరకు కేంద్ర హోంమంత్రి చిదంబరం యూపీఏ ప్రభుత్వం తరఫున డిసెంబర్ 9న రాత్రి 11 గంటలకు తెలంగాణ రాష్ట్ర ప్రక్రియను ప్రారంభిస్తున్నామని ప్రకటించారు. కేసీఆర్ దీక్షను విరమించారు.
(from namaste telangana)

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి