ఆంద్ర ప్రదేశ్ చరిత్రలో 2012-13 చాల ప్రాముఖ్యం కల్గిన సంవత్సరం, ఎందుకంటే తెలుగు నేలను సమైక్యపరచి తెలుగు వారందరినీ ఐక్యం చేసిన కాకతీయుల పరిపాలనకు సంబంధించిన అనేక ప్రాముఖ్యతలను కల్గిన సంవత్సరం ఇది, తెలుగు నెలకు త్రిలింగ దేశం అనే నామకరణం జరిగింది కూడా వీరి పాలనా సమయంలోనే.
2012-13 : రుద్రదేవ మహా రాజు కాకతీయ సామ్రాజ్యాన్ని స్వతంత్ర రాజ్యంగా నెలకొల్పి ఈ ఏటికి 850 సంవత్సరాలు, కాకతీయ మహా సామ్రాజ్ఞి రుద్రమదేవి పట్టాభిషేకం జరిగి ఈ ఏటికి 750 సంవత్సరాలు, హనుమ కొండలో వేయి స్థంబాల గుడి నిర్మించి ఈ ఏటికి 850 సంవత్సరాలు, అంతే కాదు పాలం పేటలోని ప్రసిద్ద రామప్ప దేవాలయం నిర్మించి కూడా ఈ ఏటికి 800 సంవత్సరాలు..
ఇంతటి ప్రాముఖ్యత ను గుర్తించిన ప్రభుత్వం ఏడాది పాటు కాకతీయ ఉత్సవాలను ఘనం గా నిర్వహిస్తామని ప్రకటించింది, కాని సరిగ్గా సమయానికి మాత్రం వెనక్కి వెళ్ళింది, మరో 15 రోజుల్లో ప్రారంభమయ్యే ఉత్సవాలు వారం పాటు నిర్వహిస్తామని మొదట తెల్పిన ప్రభుత్వం ఇప్పుడు మాత్రం కేవలం 3 రోజులే నిర్వహిస్తామని అంటుంది, ఎక్కడో కర్ణాటక లోని హంపి రాజధానిగా పరిపాలించిన కన్నడ రాజు శ్రీ కృష్ణ దేవా రాయలు 500 ఏళ్ళ పట్టాభిషేక మహోత్సవాన్ని ఘనం గా నిర్వహించిన రాష్ట్ర ప్రభుత్వం తెలుగు నేలను మొత్తం పరిపాలించిన కాకతీయుల ఉత్సవాలకు మాత్రం రూపాయి కూడా విదిల్చలేదు, మూడు రోజుల పాటు ఏవో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి చేతులు దులుపుకున్దామని అనుకుంటున్నది ఈ సీమంద్ర ప్రభుత్వం, ఇదేదో కేవలం ఒక జిల్లా ఉత్సవంగా భావిస్తూ తెలంగాణా పై తన పక్షపాత బుద్ధిని చాటుకున్నది సీమంద్ర సర్కార్,.
మొత్తం తెలుగు వారందరిని పరిపాలించి, విదేశియులనుండి తెలుగు నేలను నిరంతరం కాపాడిన కాకతియుల ఉత్సవాలపై వివక్ష చూపడం అంటే తమ సంస్కృతిని కించ పర్చుకోవడమే, దీనిపై ఆంద్ర మేధావులు సైతం పెదవి విప్పడం లేదు, కాకతీయులను కేవలం తెలంగాణా పాలకులుగానే చూస్తూ వివక్ష చూపుతున్నది ఈ ప్రభుత్వం, దీనికి ఓరుగల్లు లో అడుగడుగునా సాక్ష్యాలు కనిపిస్తాయి, వేయి స్తంభాల గుడిలోని కళ్యాణ మండపాన్ని తిరిగి నిర్మిస్తామని చెప్పి ఆ మండపాన్ని కనుమరుగు చేసారు, ఓరుగల్లు కోట ప్రాంతం అభివృద్ధికి నోచుకోక ఆక్రమనలపాలయ్యింది, శిలా తోరనాలకు రక్షణ కరువయ్యింది, ఇక రామప్ప గుడి సంగతి చూస్తే, కాకతీయ ఉత్సవాలకు ముందే పశ్చిమ ద్వారం కూలి పోయింది, ఇవన్ని చూస్తేనే అర్థం అవుతుంది ఈ ఉత్సవాలపై ప్రభుత్వానికి ఎంతటి చిట్టా శుద్ది ఉందొ, ఉత్సవాలను జరపడం కాదు ఉన్న వాటిని కాపాడమంటూ తెలంగాణా వాదులు ప్రభుత్వం పై మండి పడుతున్నారు.
సమైక్యంద్ర గురించి జబ్బలు చరిచి తొడలు కొట్టిన నాయకులు ఇప్పుడు ఏమయ్యారు, తెలుగునేలను ముక్కలు చెయ్యొద్దు తెలుగు వారి మధ్య గోడలు కట్టొద్దు అని నినదించిన వారి చిత్తశుద్ది ఇంతేనా.? కర్ణాటక కు చెందినా కృష్ణ దేవరాయల పట్టాభిషేక ఉత్సవాలలో పాల్గొన్న వారు నేడు కాకతీయ ఉత్సవాలు ఘనం గా నిర్వహించాలని ఎందుకు కోరడం లేదు..? సమైక్యంద్ర పై ఈ నేతలకున్న చిత్త శుద్ది ఎ పాటిదో ఇప్పటికైనా సీమంద్ర జనం తెలుసుకోవాలి రాష్ట్ర విభజనకు సహకరించాలి..
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి