హోం

29, డిసెంబర్ 2012, శనివారం

అమాస చంద్రుడు...


టిడిపీ - తెలుగు వారి ఆత్మగౌరవాన్ని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఢిల్లీ లో తాకట్టు పెడుతున్నారని, తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని కాపాడడమే ప్రధాన ఎజెండాగా ఏర్పడ్డ పార్టీ, తెలుగు జాతి మనది నిండుగా వెలుగు జాతి మనది, అని అన్ని ప్రాంతాలవారు కలిసి మెలిసి ఉండాలని ఆకాంక్షను వెళ్ళగక్కాడు ఆ పార్టీ వ్యవస్థాపకుడు, అప్పటికే రెండు ఉద్యమాలు రాష్ట్రంలో జరిగాయి, తెలంగాణా, జై ఆంద్ర ఉద్యమలతర్వత తెలంగాణా నినాదమే కనబడకుండా తెలుగు  తెర వేలుపు గా కొనియాడబడిన ఎన్ టి అర్ తెలుగు దేశం పార్టీ ని స్థాపించాడు, తెలుగు వారి ఆత్మగౌరవాన్ని విశ్వవ్యాప్తం చేస్తానని ప్రతినబూనాడు, జనం తెలంగాణా అనే పదాన్నే మరచి పోయారు, ఎన్ టి ఆర్ కు బ్రహ్మరథం పట్టారు, ఎన్టిఆర్ తర్వాత అధికారం లోకి వచ్చిన చంద్రబాబు హయాంలో అయితే తెలంగాణా అనే పదమే నిషేధం, 2001 లో తెలంగాణా రాష్ట్ర సమితి ఆవిర్భవించింది.
1) కె సి అర్ మీ పార్టీని వీడి టి అర్ ఎస్ అనే పార్టీ పెట్టారు కదా అని విలేకరులు అడిగిన ప్రశ్నకు, "టి అర్ ఎస్ ఆ అలంటి పార్టీ కూడా ఉందా రాష్ట్రంలో" అని అన్నారు బాబు.
* కాని 2009 లో మాత్రం ఆయనకు టి అర్ ఎస్ గుర్తుకు వచ్చింది, మహా కూటమి ఏర్పాటు చేసుకున్నారు, దీని కోసం తెలుగువారి ఆత్మ గౌరవం అనే తమ పార్టీ సిద్ధంతాన్ని పక్కన పెట్టి తెలంగాణకు జై కొట్టారు, ప్రణబ్ ముఖర్జీ కి లెటర్ కూడా రాసారు.
2) 2009 ఎన్నికలలో ఓడిపోగానే టి అర్ ఎస్ తో పొత్తు వల్లే ఓడిపోయామని, టి అర్ ఎస్ తో కలవక పోతే విజయం తమదే అని వ్యాక్యనించారు, కాని చంద్రబాబు గుర్తించాల్సింది ఇక్కడ ఒక్కటి ఉంది, టి డి పీ కి అప్పుడు ఉన్న ఎం ఎల్ ఎ లలో ఎక్కువమంది గెలిచింది తెలంగాణాలోనే, ఆంద్ర లో స్థానాలు ఎక్కువగా ఉన్న గెలిచింది తక్కువ.
3) 2009 డిసెంబర్ 7 న అఖిలపక్ష సమావేశంలో   తెలంగాణకు తీర్మానం అసెంబ్లీ లో పెడితే మొదట మద్దతు ఇచ్చేది తామేనని పేర్కొన్నారు.
* డిసెంబర్ 9 న కేంద్రం నుండి ప్రకటన వచ్చింది, డిసెంబర్ 10 న రాష్ట్రాన్ని విభజించే నిర్ణయాన్ని అర్థరాత్రి ప్రకటి0చడం ఏమిటి..? అని వీరప్ప మొయిలి, చిదంబరం పై నిప్పులు చెరిగారు. తెలంగాణా ను అడ్డుకోవడానికి ఆయన తన శక్తులన్నింటిని వాడుకున్నారు.
4) తమకు రెండు ప్రాంతాలు రెండు కళ్ళు అని రెండుకాళ్ళ సిద్ధంతాన్ని ఎత్తుకున్న బాబు ఆ సిద్ధాంతం అట్టర్ ఫ్లొప్ కావడంతో కొత్త పథకం కోసం వెదికాడు.
* జనవరి 5 న అఖిలపక్షంలో రెండు ప్రాంతాలనుండి ఇద్దరు ప్రతినిధులను పంపి తెలంగాణా, సమైక్యంద్ర రెండు కాళ్ళ సిద్ధాంతాన్ని వల్లే వేసాడు.
5) ఎన్నికల్లో లబ్ధి కోసం బాబ్లి జాబిల్లి ఆటలు ఆడిన జనం నమ్మలేదు, ఇలాగైతే లాభం లేదు అనుకున్న బాబు అనుచరులు పార్టీ నుండి బయటికి క్యు కట్టారు.
6) సీమంద్ర ప్రాంతంలో టిడిపీ వాళ్ళు సమైక్యంద్ర అంటూ కాంగ్రెస్ వాళ్ళ గుడారాల్లో దూరి దొంగ దీక్షలు చేసిన, కాంగ్రస్ ఎంపీ ని వాళ్ళ ఎమేల్సి ముద్దాడిన ఎ విధమైన చర్యలు తీసుకోలేదు.
7) ఇక 2014 లో అధికారమే పరమావధిగా వస్తున్న మీ కోసం అంటూ పాద యాత్ర చేస్తున్న బాబు, తాము తెలంగాణా కు వ్యతిరేఖం కాదు అని, తెలంగాణా కు వ్యతిరేకం గ తాను ఇంతకు ముందు మాట్లాడలేదని, ఇకపై మాట్లాడభోనని చెప్పుకొస్తున్నారు.
* అయితే తెలంగాణా ఏర్పాటుకు తమ పార్టీ అనుకూలం అని ఒక్క మాట చెప్పలేఖ పోతున్నారు.
8) అఖిల పక్ష భేటి నిర్వహించాలని అందులో తమ అభిప్రాయం చెఉథామని చంద్రబాబు కేంద్రానికి లేఖ రాసారు, తన అభిప్రాయాన్ని చెప్పాలనుకునే వారు అఖిలపక్షం లోనే చెప్పాల్సిన అవసరం లేదు, జనానికి చెప్పొచ్చుకద..?

9) కేంద్రం అఖిల పక్ష భేటి నిర్వహించింది,  అందులో చంద్ర బాబు రాష్ట్రం లో పాలన అవినీతి, అస్థిరత, నిరుద్యోగం గురించి ఏకరవు పెట్టారు కాని ఎక్కడ తెలంగాణా రాష్ట్రం ఏర్పరచాలని కాని, తెలంగాణా ఏర్పాటుకు తాము అనుకూలం అని మాత్రం లేదు, సీల్డ్ కవర్లో చంద్రబాబు లేఖను షిండే కు అంధచేసాడు యనమల రామకృష్ణుడు, తమ పార్టీ స్పష్టంగా తెలంగాణా పై వికారి చెప్పిందని ఇక్కడి ప్రజా ప్రతినిధులు చంకలు గుద్దుకుంటున్నారు.
* ఇంతకి ఆ లేఖలో ఏమంది..? తాము 008 లోనే ఒక లేఖ ఇచ్చామని దానిని వెనక్కి తీస్కోలేదని దానికే కట్టుబడి ఉన్నామని స్పష్టం చేసామని ఆ పార్టీ వాళ్ళు చెబుతున్న అది నిజం కాదని, అంధులు 2008 లేఖను బాల పరుస్తున్నామని ఎక్కడ లేదని ఇతర పార్టీల వాళ్లు అంటున్నారు.
* ఐన నిజంగా తెలంగాణా పై స్పష్టమైన వికారి టి డి పీ కి నటే ఈ డొంకతిరుగుడు అంతా ఎందుకు..? తెలంగాణా కు అనుకూలం అని ఒక్క మాట చెబితే సరిపోదా..? చంద్ర బాబు వంద సార్లు మేం తెలంగాణా కు వ్యతిరేఖం కాదు అని చెప్పే బదులు తెలంగాణా కు అనుకూలం అని ఒక్కసారి చెప్పవచ్చు కదా..?

1 కామెంట్‌:

  1. కొందరు మగాళ్ళ కంటే మృగాలు నయం అనిపించే హేయమైన సంఘటన డిల్లీ అత్యాచార సంఘటన ఆమెకు అశ్రునివాళి........................................................................రాజకీయాలు వ్యభిచారం లా తయారయ్యాయని అనిపించే పత్రికా గోష్ఠి నేడు బాబు ఖండన............ఈ 90 రోజుల పాదయాత్ర లో మొదటిసారి ప్రెస్మీట్ పెడుతున్నా అని మొదలు పెడితే బంధ్ పాటిస్తున్న తెలంగాణా ప్రజలకు క్లారిటీ ఇస్తాడేమో అనుకున్నం.............ఆయనగారు జాతీయనాయకుడి హోదాలో జాతీయ మీడియా తో మాట్లాడిన బిల్డప్ ఈ హత్యాచారాలు తన రాజకీయ జీవితంలో మొట్టమొదటి సారి చూసినట్టు....దానికి రాజకీయ కోణాన్ని కలిపి అసలు కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉంటే ఇంతే అన్నట్లు దేశం మొత్తంలో జరిగిన సంఘటనలు వల్లె వేశాడు.....తన హయాంలో కూడా ఎన్నో జరిగాయి.......ముఖ్యంగా సినీ నటి "ప్రత్యూష"పై అత్యాచారం ,హత్య జరిగి...తన కాబినెట్ సహచరిడి కుమారుడి పేరు బయటకు వస్తే ఏం చర్య తీసుకున్నాడు...........................1]నా అభిప్రాయమల్లా ఈ అత్యాచార సంఘటనను అందరు త్రికరణ శుద్దిగా ఖండించాలి...కాని ఆమె చావును కూడా రాజకీయాలకు వాడుకుంటె ఆమె ఆత్మ క్షోభిస్తుంది.......2] ప్రపంచ తెలుగు మహాసభలు జరుగుతున్న ఈ సమయానా ఎవ్వరికి బాబు గారికి తెలుగు నేర్పాల్సి రావడం దుర్దృష్టం......తెలంగాణా ప్రజలు తెలంగాణాకు మీరు సానికూలమా ?కాదా? కాని ,,అడిగితే......బాబు గారి లేఖలో ఆ ఒక్క విషయం తప్ప.....కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి లేదని,ముఖ్యమంత్రులు అసమర్ధులని,పెట్టుబడులు రావడం లేదని,యువకులు చనిపోతున్నరని...అనిచ్చితి తొలగించాలని....లేఖ నిండా రాజకీయ ఆరోపనలే..........సిగ్గుపడేలా...రాజకీయాలంటే ఏవగింపు కలిగేలా....

    రిప్లయితొలగించండి