హోం

28, డిసెంబర్ 2012, శుక్రవారం

తెలంగాణా గోడు వినిపించదు, కనిపించదు...

ఆల్ ఇండియా మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ All India Majlis-e-Ittehadul Muslimeen, (MIM) 



              తెలంగాణా ప్రాంతంలో పాత నగరానికి పరిమితం ఐన ఈ పార్టీ తెలంగాణా కు పూర్తి వ్యతిరేఖం గా పనిచేస్తుంది, తెలంగణా రాష్ట్ర ఏర్పాటుపై స్పష్టమైన నిర్ణయం తెలియజేయకుండ రాయలతెలంగాణా అంటూ పసలేని డిమాండ్లను ముందుకు తెస్తుంది, తెలంగాణా వస్తే బి జె పీ బలపడుతుంది కావున తాము తెలంగాణా కు వ్యతిరేఖం అని చెప్పకున్న ఆ పార్టీ అధ్యక్షుడు, చాపకింద నీరులా ఎక్కడ ముస్లిం జనాభా ఎక్కువగా ఉంటె అక్కడకు తమ పార్టీని విస్తరించాలని చేస్తున్నాడు, హిందులకు గాని బి జె పీ కి మద్దతు ఇచ్చిన వారిని మతతత్వ వాదులని ఎదుటి వారిపై భురధజల్లె ఈ పార్టీ నాయకులు, తమ పార్టీ మతం లోనే పుట్టి మతం లోనే పెరిగిందనే విషయం గుర్తించకపోవడం విడ్డూరం.
                         ఇంతకి ఈ పార్టీ ప్రస్థానాన్ని చూసినట్లయితే,  సలాహుద్దీన్ ఒవైసీ పునః ప్రారంభించిన ఈ పార్టీ చరిత్ర మూలాలను తెలుసుకోవాలంటే నిజామ్ కాలం లోకి వెళ్ళాలి.దీనిని 1927 అబుల్ బయాన్ ఖ్వాజా బహావుద్దీన్స్థాపించాడు. ఈ పార్టీ నిజాం కాలం నాటి పార్లమెంటరీ పార్టీ. భారత్ స్వాతంత్ర్యం సాధించిన తరువాత, హైదరాబాదు ప్రత్యేక ప్రాంతంగా వుండాలని కాంక్షించింది.రజాకార్లు (వాలంటీర్లు), ఒక ముస్లిం పారా-మిలిటరీ సంస్థ. ఇది మజ్లిస్ పార్టీతో సంబంధాలు కలిగివుండేది. దాదాపు లక్షా యాభైవేలమంది రజాకార్లు, కాసిం రిజ్వీ నాయకత్వాన భారత రక్షక దళాలతోనూ కమ్యూనిస్టులతోనూ స్వతంత్ర హైదరాబాద్ కొరకు పోరాడాయి. పోలీస్-యాక్షన్ ద్వారా హైదరాబాదు సంస్థానాన్ని భారత-యూనియన్ లో కలుపబడినది. కాసిం రిజ్వీని కారాగారంలో బంధించి, శాంతిభద్రతల దృష్ట్యా పాకిస్తానుకు పంపించివేశారు. మజ్లిస్ పార్టీ బ్యాన్ చేయబడినది.
1957లో మజ్లిస్ పార్టీ నూతన హంగులతో పునస్థాపించబడినది. 1970లో రాజకీయ ప్రవేశం గావించింది.ఆల్ ఇండియా అనే ప్రజాస్వామ్య పేరును తగిలించడం జరిగినది.పునః స్థాపించబడిన ఈ పార్టీ ని సలావుద్దీన్ ఒవైసీ పెంచి పోషించాడు, 1960 లో మల్లేపల్లి కార్పోరేటర్ గా ఎన్నికయ్యారు. 1962,67,78,83లలో ఎమ్మెల్యే గా 1984 నుంచి 2004 వరకు, వరుసగా హైదరాబాదు లోక్‌సభ నియోజకవర్గం నుండి 6 సార్లు ఎన్నికైన పార్లమెంటు సభ్యుడు. హైదరాబాద్ నగర మేయర్లుగా ఇద్దరు హిందువులను దళితులను మజ్లిస్ పార్టీ తరపున గెలిపించారు. ఈయన కుమారులు అసదుద్దీన్ అక్బరుద్దీన్ ఒవైసీలు ఎంపీ, ఎమ్మెల్యేలుగా పనిచేస్తున్నారు.

                 2008 లో ఈయన మరణం తర్వాత పార్టీ అధ్యక్షా బాధ్యతలు ప్రస్తుత హైదరాబాద్ ఎం.పీ అసదుద్దీన్ ఒవైసీ నిర్వహిస్తున్నాడు.ఈ పార్టీకి ఒక ఎం.పీ, 7 గురు ఎం.ఎల్.ఎ లు ఉన్నారు, హైదరాబాద్ కార్పోరేషన్ ఎన్నికలలో 45 స్థానాలను గెలిచి మేయర్ పదవిని పొందిన ఈ పార్టీలో ముస్లింలే కాదు హిందువులు కూడా ఉన్నారు, ఇదే ఉత్సాహంతో అత్యదిక ఎం ఎల్ ఎ స్థానాలు గెలుచుకోవాలని, పార్టీని విస్తరింపజేయాలని ఆరాటపడుతున్నారు, అయితే ముస్లింలు అధికంగా ఉండే తెలంగాణా లో, రాయలసీమలోనూ తమ ఉనుకుని నిలుపుకోవాలని రాయల తెలంగాణా వాదనను తెరపైకి తెస్తున్నారు, ముస్లిం జనాభా అధికంగా ఉండే స్థానాల్లో ముస్లిం అభ్యర్థుల్ని, హిందు ముస్లిం లు దాదాపు సమానంగా ఉన్న స్థానాల్లో హిందువులను నిలబెట్టి సునాయాసం గా గెలవవచ్చనే ఫార్ములాతో ముందుకు వెళ్తున్నారు, గతంలో గ్రేటర్ ఎన్నికల్లో ఇదే స్ట్రాటజీ తో ముందుకు వెళ్లి మంచి ఫలితాల్ని సాధించారు, ఇంకా మస్జిద్ లలో ప్రార్థనలలో పార్టీ ప్రచారం చెయ్యడం కూడా వీరికి అలవాటే, ఎలాగో అధికారం కోసం ఎంతకైనా తెగించే నాయకులు ఉండనే ఉన్నారుగా వారు ముస్లిం పార్టీ ఐన మరే పార్టీ ఐన అధికారం వస్తుందంటే హాయిగా వెళ్లి వాలిపోతారు.ఆగస్టు 92007తస్లీమా నస్రీన్ తన పుస్తకం "శోధ్" తెలుగు భాషలో ఆవిష్కరిస్తున్న వేదికపై మజ్లిస్ పార్టీ ముగ్గురు శాసనసభ్యులు మరియు కార్యకర్తలు పూలకుండీలు, కుర్చీలతో దాడి చేశారు. తస్లీమా నస్రీన్ ను ఇస్లాం-ద్రోహిగా వర్ణిస్తూ నానా హంగామా సృష్షించారు.  వీరికి వ్యతిరేకంగా క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. పక్క వారిని అనునిత్యం మతతతవ పార్టీలు అని దుమ్మెత్తి పోసే ఈ పార్టీ నాయకులు ఎర్రగురివింద తన నలుపెరుగనట్లు ప్రవర్తిస్తుంటారు, వీరిని పల్లెత్తు మాట అనే ధైర్యం ఈ పార్టీ వారికి లేదు, ఎందుకంటే వీళ్ళను ఏమైనా అంటే ముస్లిం ఓట్లు పడవు అనే భయం..
1990 లో మజ్లిస్ పార్టీ చీలిపోయి, అమానుల్లా ఖాన్ (శాసనసభ్యుడు) నాయకత్వంలో మజ్లిస్ బచావో తెహ్రీక్(MBT ) అనే గ్రూపు బయలు దేరినది. ఇది పూర్తిగా తెలంగాణాకు మద్దతు ఇస్తుంది..
           ఒకప్పుడు హైదరాబాద్ రాష్ట్రంలో ప్రజలపై దాడులు చేసి, దోపిడిలు, లూటీలు, మానభంగాలు చేసిన కాసిం రజ్వి సేన పార్టీ పేరును పెట్టుకున్న  ఈ MIM పార్టీకి లక్ష్యాలు ఏముంటాయి, సిద్ధాంతాలు ఏముంటాయి..? తెలంగాణా ప్రజలను తమ బానిసలుగా చేసుకొని, వారి ధన,మాన,ప్రాణాలు దోచుకున్న కాశీం రజ్వి ఆశయాల కొనసాగింపుగా పుట్టిన వారు తెలంగాణా ను ఎందుకు కోరుకుంటారు..? 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి