హోం

10, డిసెంబర్ 2012, సోమవారం

నా తెలంగాణ



ఘనమైన సంస్కృతి
గలది నా తెలంగాణ
గొప్ప సంప్రదాయపు
వలపు నా తెలంగాణ

యాస భాషపూన్నో
కలది నా తెలంగాణ
మోసమెరగని
కల్పవల్లి నా తెలంగాణ

వీర వనితల గన్న
నారి నా తెలంగాణ
పోరుబిడ్డల గుండె
ధైర్యం నా తెలంగాణ
నైజాం పాలనలో
నలిగి నా తెలంగాణ
పోరు సలిపి వీరుల
నిల్పె నా తెలంగాణ

నల్ల బంగారం
సిరుల నా తెలంగాణ
కనక వర్షపు ధార
గిరులు నా తెలంగాణ

అడవి సంపద కళ
నిడివి నా తెలంగాణ
ఆదివాసుల జీవ
విడిది నా తెలంగాణ

కల్ల కపటం లేని
అవ్వ నా తెలంగాణ
శిల్పకళలకు పురిటి
గడ్డ నా తెలంగాణ

నిండు ముత్తైదువు
అమ్మ నా తెలంగాణ
వలస పాలకులంత
దోచె నా తెలంగాణ!
- ఆనంద మహి ,ఖమ్మం
(from namaste telangana)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి