హోం

27, డిసెంబర్ 2012, గురువారం

చంద్రబాబుకు మల్లయ్య భయం..!


టీడీపీ అధినేత చంద్రబాబు వస్తున్నా-మీకోసం అం టూ చేపట్టిన పాదయాద్ర నేడు జిల్లా పొలిమేరల్లోకి కాలుమోపనుంది. టీడీపీ అగ్రనాయకులు సైతం తమ అధినేతకు తమ మనసులోని మాటను వెల్లగక్కలేని పరిస్థితు ల్లో ఒక సామాన్య రైతుకూలీ చంద్రబాబును తెలంగాణపై నిలదీసిండు. చంద్రబాబుకు అప్పటి నుంచి మొదలైన తెలంగాణ సెగ ఇప్పటీకీ వెంటాడుతున్నది. మూడేళ్ల తరువాత కేంద్రం మళ్లీ తెలంగాణపై కీలమైన అఖిలపక్ష సమావేశం నేడు ఢిల్లీలో నిర్వహించబోతున్నది. తెలంగాణపై టీడీపీ వైఖరి ఏమిటో అనేది ఆసక్తికరంగా మారింది. టీడీపీ నాయకులకే కాదు ఆ పార్టీ శ్రేణులకు ఉత్కం రేపుతున్నది. తెలంగాణపై తమ పార్టీ అనుకూల వైఖరి వెల్లడిస్తే చంద్రబాబు పాదయావూతకు పూలస్వాగతం..లేదంటే ముళ్లబాటగా మారే పరిస్థితి ఉందని ఆ పార్టీ నేతలు అంటున్నారు. తెలంగాణకు అనుకూలంగా స్పందించకుంటే ప్రతికూల పరిస్థితులు తప్పవని ఇప్పటికే తెలంగాణ వాదులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఏం జరుగుతుందోనని పోలీసు లూ టెన్షన్‌కు గురవుతున్నారు. ఇటీవల రాష్ట్రముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి కాకతీయ ఉత్సవాల ప్రారంభానికి వస్తేనే ఆయనపై కోడిగుడ్లు, రాళ్లు, చెప్పులతో తెలంగా ణ వాదులు నానా హంగామా చేశారు. వేలాది మంది పోలీసులున్నా వారి కళ్లుగప్పి తెలంగాణవాదాన్ని చాటారు.

అటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు పాదయాత్ర ఎట్లా ముగుస్తుందా.. అనే అనుమానంతో పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. చేసేది ఏమీలేక టీఆర్‌ఎస్ నా యకులను, తెలంగాణ వాదుల్ని, విద్యార్థులను ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. ఒక రకంగా ఉత్కంఠ వాతావరణం నెలకొన్న ఈ సంకట పరిస్థితుల నేపథ్యంలో చంద్రబాబు పాదయావూతతో జిల్లాలో కాలుపెడుతున్నారు. తెలంగాణ వాదుల్లో ఎవరు గుర్తున్నా గుర్తుండకపోయినా సాధారణ రైతుకూలీ గుర్తుంటాడు. కరడుగట్టిన తన సమైక్యావాదాన్ని మార్చగలిన మొనగాడు ఆ రైతుకూలీ. అతను ఏ రాజకీయ పార్టీకి సబంధించిన వ్యక్తికాదు. రాజకీయ శిక్షణ తరగతుల్లో నిపుణత కలిగిన, విపక్షాన్ని ముప్పుతిప్పలు పెట్టే రాజకీయ చతురత కలిగిన వ్యక్తి అంతకంటే కాదు.. ఆయన కేవలం సగటు తెలంగాణ వాది. తెలంగాణ రావడం కోసం కలలు కంటున్న అతిసాధారణ తెలంగాణ బిడ్డ. ఆయనకు తెలిసిందల్లా తెలంగాణ రాష్ట్రం సిద్ధించాలనే కోరికే. ఆ బలమైన ఆకాంక్ష వల్లే రాష్ట్రంలో తొమ్మిదేళ్ల ఏకచ్ఛవూతాధిపత్యంగా ఏలిన చంద్రబాబునే నిలదీశాడు. ఇప్పుడు చంద్రబాబుకు ఆయన భయం పట్టుకుంది. ఆనాడైతే ఒక్కడే వ్యక్తి కానీ, ఇవ్వాళ ప్రతి ఊరిలో ప్రతిమనిషి అటువంటి డిమాండ్‌నే చంద్రబాబు ముందు పెడుతున్నారు. ఆయనెవరో ఈ పాటికి అర్థమైపోయుంటుంది. అతనే ఫణికర మల్లయ్య. 

రాయపర్తి మండల కేంద్రంలో కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న ఇంట్లో ఆయన కాలం వెళ్లదీస్తున్నారు. తన బతుకులాగే ఛిన్నాభిన్నమైన తెలంగాణ బతుకును బాగుచేయాలని కలలు కన్నవాడు. తన గ్రామం లో చదువుకున్న ఎంతోమంది పిల్లలు ఉద్యోగాలు రాక, ఉ పాధి కరువై బతుకు భారమై ఉన్నారు. ఈ పరిస్థితుల్ని అనుభవించిన వ్యక్తిగా ఫణికర మల్లయ్య 200లో చంద్రబాబు నాయుడును నిలదీసేలా చేసింది. ‘మీరు జేయబట్టే తెలంగాణ వత్తలేదట. మీరు అన్ని ఇస్తానంటున్నారు. మంచిదే గాని, మా ఊళ్లే పోరగాండ్లు, పెద్దోళ్లు అందరూ అడుగుతున్నట్టుగా తెలంగాణ ముచ్చెట చెప్పరాదుండ్లి. మీరొక్కపాలి తెలంగాణ తెచ్చేముచ్చట చెప్పితే మంచిగుంటది గదా’ అని చంద్రబాబు మొహం మ్మీదే త న ఆత్మగౌరవ ఆకాంక్షను వెల్లడించారు. అటువంటి ఫణికర మల్లయ్యలు ఇంటికొకరున్నారు. చంద్రబాబు గతం లో పాలకుర్తి పర్యటన సందర్భంగా ఫణికర మల్లయ్యను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. జిల్లాలో ఎవరు గుర్తున్నా ఉండకపోయినా చంద్రబాబుకు ఫణికర మల్లయ్య బాగా గుర్తుంటారు. అటువంటి ఫణికర మల్ల య్య వల్లే చంద్రబాబుకు చిక్కులుంటాయా? అని తెలుగు తమ్ముళ్లు మథనపడుతుండటం కొసమెరుపు.

from namaste telangana

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి