హోం

28, డిసెంబర్ 2012, శుక్రవారం

ఇదిగో.. షిండేకు టీడీపీ ఇచ్చిన లేఖ!

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కేంద్రం ఏర్పాటు చేసిన అఖిలపక్ష భేటీలో కేంద్ర హోంమంత్రి షిండేకు టీడీపీ ఇచ్చిన లేఖలో ఏముందో తెలంగాణ ప్రజలకు తెలియాల్సిన అవసరముంది. ఆలేఖలో తెలంగాణపై ఆ పార్టీ చిత్తశుద్ది ఏంటో ప్రజలకు తెలియాల్సిన అవసరముంది. అందుకే లేఖ ప్రతిని నమస్తే తెలంగాణ ఇంటర్నెట్‌ ఎడిషన్లో పోస్ట్ చేశారు. 

వినేటోడు వెర్రిబాగులోడు అయితే చెప్పేటోడు చంద్రబాబు అని ఇప్పుడు తెలంగాణ ప్రజలు అనుకుంటున్నరు. కొండంత రాగం తీసిన తెలుగు దేశం పార్టీ అఖిలపక్షంలో కొత్తగా చెప్పిందేమీ లేకపోగా ఏదో పొడిచేశామని తెలంగాణ తెదేపా నాయకులు ఇక్కడ శిగాలు ఊగుతున్నారు.

చంద్రబాబు పంపిన సీల్డ్ కవర్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఉపకరించే మాట ఒక్కటంటే ఒక్కటి లేకపోగా ఒక పచ్చి అబద్ధం ఉన్నది. అదే ప్రణబ్ ముఖర్జీ కమిటీకి తెలుగుదేశం పార్టీ ఇచ్చిన లేఖలోని అంశాలకు కట్టుబడి ఉన్నామనడం.

ఇవ్వాళ ఈ లేఖను డిల్లీకి మోసుకుపోయిన యనమల రామకృష్ణుడు స్వయంగా గత యేడాది మీడియాతో మాట్లాడుతూ 2008 నాటి లెటర్ ఇప్పుడు పనికిరాదని, 2011 మహానాడులో తెలంగాణపై తీసుకున్న వైఖరే ఫైనల్ అని తేల్చాడు. 
పార్లమెంటులో తెలంగాణ బిల్లుకు టీడీపీ అనుకూలంగా ఓటిసననాడు చంద్రబాబును తెలంగాణ ప్రజలు నమ్ముతరు తప్ప అప్పటివరకు తెలంగాణలో టీడీపీని చిన్న పిల్లగాడు కూడా నమ్మరనే విషయం తెలిసిందే.

(from namaste telangana)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి