హోం

24, నవంబర్ 2011, గురువారం

ట్యాంక్ బండ్ పై విగ్రహాలు..



హుస్సేన్ సాగర్‌ హైదరాబాదు నగరపు నడిబొడ్డున ఒక మానవ నిర్మిత సరస్సు. ఈ జలాశయాన్ని 1562లోఇబ్రహీం కులీ కుతుబ్ షా పాలనా కాలములో హజ్రత్ హుస్సేన్ షా వలీచే నిర్మింపబడింది. 24 చదరపు కిలోమీటర్ల వైశాల్యమున్న ఈ సరస్సు నగరము యొక్క మంచినీటి మరియు సాగునీటి అవసరాలను తీర్చటానికి మూసీ నదియొక్క ఒక చిన్న ఉపనదిపై నిర్మించబడింది. చెరువు మధ్యలో హైదరాబాదు నగర చిహ్నముగా ఒక ఏకశిలా బుద్ధ విగ్రహాన్ని 1992లో స్థాపించారు. దీనికి పక్కన నెక్ లెస్ రోడ్ ఉంది
1562లో హుస్సేన్ సాగర్ నిర్మాణాన్ని ఇబ్రహీం కులీ కుతుబ్ షా కట్టించినా, దాని నిర్మాణ పర్యవేక్షణ మాత్రం ఇబ్రహీం కులీ అల్లుడు, పౌర నిర్మాణాల సూపరిండెంటైన హుస్సేన్ షా వలీ చేపట్టాడు.చెరువు తవ్వకం పూర్తయినా నీరు నిండకపోవటంతో మూసీ నదికి అనుసంధానం చేశారు. 24 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం, 32 అడుగుల లోతుతో చెరువు ఉండేది. కుతుబ్ షా ఈ సరస్సుకు ఇబ్రహీం సాగర్ అని పేరుపెట్టాలని అనుకున్నాడు, కానీ హుస్సేన్ వలీ యొక్క ప్రాచ్యుర్యము వలన ప్రజలు ఆయన పేరు మీదుగా హుస్సేన్ సాగర్ చెరువు అని పిలవటం ప్రారంభించారు. ఈ విషయం తెలుసుకున్న సుల్తాను చెరువులకున్న ప్రజాదరణను గమనించి వెంటనే తన పేరు మీద గోల్కొండకు 16 మైళ్ళ దూరములో ఇబ్రహీంపట్నం చెరువును నిర్మింపజేశాడు1568లో హుస్సేన్‌ సాగర్‌ చుట్టూ గట్టుగా నిర్మించబడిన రోడ్డును టాంక్ బండ్ అంటారు. ఈ రోడ్డు హైదరాబాదు మరియు సికింద్రాబాదు జంట నగరాలను కలుపుతుంది . ఈ గట్టుమీద నుండి వెళ్ళే ట్యాంక్ బండ్ రహదారికి, జంటనగరాలలో ఒక విశిష్టమైన గుర్తింపు ఉంది. పొద్దున్న పూట వ్యాయామంలో భాగంగా ఉదయం నడక సాగించేవారికి, సాయంకాలం వాహ్యాళికి వెళ్ళేవారికి(ముఖ్యంగా ఆదివారం మరియు ఇతర శెలవు రోజుల సాయంత్ర సమయాలలో), స్నేహితులను కలుసుకొనేవారికి, ఇది ఒక ఇష్టమైన ప్రత్యేక స్థలం.
టాంక్‌బండ్ ప్రక్కనున్న హుస్సేన్ సాగర్‌లో 'జిబ్రాల్టర్ రాక్' అనబడే రాతిపైన ఒక పెద్ద బుద్ధ విగ్రహాన్ని అమర్చారు. ఒకే రాతిలో మలచబడిన ఈ విగ్రహం 17.5 అడుగుల ఎత్తు ఉండి 350 టన్నుల బరువుంటుంది. గణపతి స్థపతి నేతృత్వంలో 40 మంది శిల్పులు రెండు సంవత్సరాలు శ్రమించి మలచిన ఈ శిల్పం 60 కి.మీ. దూరంనుండి 192 చక్రాలు గల వాహనంపై ఇక్కడికి తీసుకురాబడింది. అయితే స్థాపన సమయంలో విషాదం చోటు చేసుకొంది. బార్జ్‌తో పాటు విగ్రహం మునిగి కొందరు శ్రామికులు ప్రాణాలు పోగొట్టుకొన్నారు. మళ్ళీ డిసెంబరు 1992లో దీనిని వెలికితీసి ప్రతిష్టించారు. హైదరాబాదు నగర చిహ్నంగా చార్మినార్‌తో పాటు ఈ విగ్రహాన్ని కూడా పలు సందర్భాలలో చూపుతారు.


 టాంక్ బండ్ పై విగ్రహాలు: తెలంగాణా సంస్కృతిని ప్రజలకు చేరకుండా, అన్ద్రవారి విజయ చిహ్నాలుగా ట్యాంక్ బండ్పై విగ్రహాలు పెట్టడానికి అప్పటి ముఖ్య మంత్రి ఎన్టి ఆర్, సంకల్పించారు. ఇందులో ఎవరెవరి విగ్రహాలు పెట్టాలి అని ఎంపిక చెయ్యడం కోసం డా. సి. నారాయణ రెడ్డి తో ఒక కమిటి వేసారు, ఆయన ఎంపిక మేరకు విగ్రహాలను తాయారు చేయించి ప్రతిష్టించారు.( ఆయన ఎంపిక ఏమి లేదు, ఎన్ టి ఆర్ ముందు ఎవరి విగ్రహాలైతే పెట్టలనుకున్నదో వారివే పెట్టారు, ఈ కమిటి ఎందుకంటే తెలంగాణా వాడి సంస్కృతి మీద దాడి చేయించేది సీమంద్ర సర్కార్ ఐన చేసేది తెలంగాణా వాడు.( కత్తి వాడిది పొడిచేది మనవాడు). ఇందులో తెలంగాణా తో, ఉమ్మడి రాష్ట్రంతో  ఎ మాత్రం సంబంధం లేని అల్లూరి, టంగుటూరి ప్రకాశం, పొట్టి శ్రీ రాములు, సర్ ఆర్ధాన్ కాటన్, బళ్ళారి రాఘవ, శ్రీ కృష్ణ దేవరాయలు లాంటి అనేక మంది విగ్రహాలు పెట్టారు, అయితే విచిత్రం ఏమిటంటే హైదరాబాద్ ను, అందున ట్యాంక్ బండ్ ను నిర్మించిన కూలి కుతుబ్ష విగ్రహం లేదు, కన్నడ రాజు శ్రీ కృష్ణ దేవరాయలు విగ్రహం ఉంది కాని గణపతి దేవ చేక్రవర్తి, ప్రతాప రుద్రుల విగ్రహాలు లేవు, అల్లూరి విగ్రహం పెట్టిన వారు కొమురం భీమ విగ్రహాన్ని పెట్టలేదు, తెలంగాణా సాయుధ పోరాట వీరులలో కనీసం ఒక్కరికి కూడా ఇక్కడ చోటు దక్కలేదు, హైదరాబాద్ ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణ రావు, తెలంగాణా లో కాంగ్రెస్ వ్యవస్థాపకుడు రామానంద్ తీర్ధ, ప్రముఖ జర్నలిస్ట్ షోయబుల్ల ఖాన్, తెలుగు సినిమాకు జాతీయ అవార్డు తెచ్చి పెట్టిన డైరెక్టర్ బి ఎస్ నారాయణ, లే కాకుండా తెలంగాణాను సుధీర్గ కాలం పరిపాలించి తెలంగాణకు రైల్, రోడ్ మార్గాలు, విద్యుత్ సదుపాయం, కర్మాగారాల ఏర్పాటు, నదుల పై ప్రాజెక్ట్ లను నిర్మించిన నిజాం రాజుల్లో ఒక్కరి విగ్రహం కూడా అక్కడ లేదు, అమరావతి బౌద్ధ స్తూపం లాంటి నిర్మాణాన్ని అక్కడ ఏర్పాటుచేసారు, కాని తెలంగాణా సంస్కృతక చిహ్నాలని ఏర్పాటు చెయ్యలేదు.

విగ్రహాల విధ్వంసం: అనేక సంవత్సరాల ఓపిక తర్వాత ఒక రోజు తెలంగాణా తిరగ బడింది, తనపై విజయట్టహాసం చేస్తున్న అన్ద్రవారి అరువుతెచ్చుకున్న విగ్రహాలను పునాదులతో సహా పెకిలించింది, అదే మిలియన్ మార్చ్, 2011 మార్చ్ 10 న మిలియన్ మార్చ్ కు తెలంగాణా జే ఎ సి పిలుపునిచ్చింది, పోలిసుల నిర్భంధాలను తేన్చుకుంటూ తెలంగాణా సమాజం ఆ రోజు ట్యాంక్ బండ్ పైకి వచ్చి చేరింది, పోలిసుల అతితో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి, జనం చూపు ఆంద్ర విగ్రహలపై పడింది తెలంగాణా నడిబొడ్డున ఉన్న ఆంద్ర బొమ్మలను పగలగొట్టారు, నీటిలో నిమర్జనం చేసారు, తరతరాల తమ అస్తిత్వ పోరాటానికి పదును పెట్టారు, ఈ సంగాతనతో తెలంగాణా ప్రజలంతా ఉత్సాహం పొందారు, మరో మహోద్రుత ఉద్యమ రూపం కోసం ఎదురు చూస్తున్నారు.....




23, నవంబర్ 2011, బుధవారం

తెలంగాణ కో దిల్‌సే సమర్థన్ కరెంగే: లాలు



టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ రాకతో లోక్సభలోనే కాదు సభ వెలుపలా తెలంగాణ సందడి నెలకొంది. పార్లమెంటు ప్రాంగణంలో, సెంట్రల్ హాల్‌లో ఆయనకు తారసపడ్డ వివిధ పార్టీల ఎంపీలు జై తెలంగాణ అంటూ తమ సంఘీభావాన్ని తెలిపారు. మరీ ముఖ్యంగా శివసేన, జేడీ(యూ), అకాలీదళ్, బీజేడీ తదితర పార్టీల నాయకులు తెలంగాణ బిల్లుకు మద్దతిస్తామని ఆయనకు హామీ ఇచ్చారు. ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ తమ పార్టీ తెలంగాణకు మద్దతిస్తుందన్నారు. ‘తెలంగాణ కో దిల్‌సే సమర్థన్ కరెంగే’ అని లాలూ అన్నారు. బీజేపీ సభ్యులు సైతం తమ సంఘీభావాన్ని తెలిపారు. అదే సమయంలో కేసీఆర్‌ను కలిసిన ఉత్తరాది కాంగ్రెస్ ఎంపీలు తెలంగాణలో నెలకొన్న పరిస్థితులను తెలుసుకోవడానికి ఉత్సాహం చూపారు. కొందరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లో చేరారట కదా.. అని వాకబు చేశారు. తెలంగాణలో అన్ని పక్షాలు మద్దతిస్తున్నప్పుడు తెలంగాణ ఏర్పాటుకు తమ పార్టీకి అభ్యంతరం ఎందుకని అసంతృప్తిని ప్రదర్శించారు. 

ఉద్యమ కార్యాచరణ....

మహాత్మా జ్యోతీరావు పూలే వర్ధంతి సందర్భంగా ఈ నెల 28న ‘తెలంగాణ విద్యార్థి ఆత్మగౌరవ సభ ’ నిర్వహిస్తున్నట్లు విద్యార్థి జేఏసీ నాయకులు తెలిపారు. ఈరోజు సోమాజీగూడలోని ప్రెస్‌క్లబ్‌లో పోస్టర్‌లను విడుదల చేశారు. కార్యక్రమంలో పిడమర్తి రవి, రాజారాం మాట్లాడుతూ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేయాలని కోరారు. తెలంగాణ పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనగా 24వ తేదిన కళాశాల ఎదుట కాంగ్రెస్ దిష్టిబొమ్మను దహనం చేయాలని పిలుపునిచ్చారు.
తెలంగాణా జే ఎ సి కూడా ఉద్యమ కార్య చరణను ప్రకటించింది, డిసెంబర్ 1 వ తేదిని నిరసన దినం పాటించాలని, 9 వ తేది తెలంగాణా ప్రకటన వచ్చిన రోజు కావున ఆత్మ గౌరవ దినంగా జరుపుకోవాలని పిలుపునిచ్చింది.....

22, నవంబర్ 2011, మంగళవారం

ప్రారంభం నాడే ప్రతిష్టంభన..!

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఈ రోజు ప్రారంభమయ్యాయి, ప్రారంభం కాగానే విపక్షాలన్నీ చిన్న రాష్ట్రాల ఏర్పాటు గురించి పట్టుబట్టడంతో సభలో గంధర గోల పరిస్థుతులు ఏర్పడ్డాయి. దీనితో సభను స్పీకర్ సభను రేపటికి వాయిదా వేసారు.
        తెలంగాణా బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టాలనే ఆశయంతో బి జే పి ఆధ్వర్యంలో తెలంగాణా పది జిల్లాల్లో నిరసన ధీక్ష లు కొనసాగాయి, అలాగే న్యూ డెమోక్రసి ఆధ్వర్యంలో కలెక్టరేట్ ల ముట్టడి విజయ వంతంగా కొనసాగింది..

21, నవంబర్ 2011, సోమవారం

2014 ప్రధాని పీటంపై కన్నేసిన మాయ..


ఉత్తర ప్రదేశ్ ను విబజించాలంటూ యు పీ సి ఎం మాయావతి ఈ రోజు ఆ రాష్ట్ర అసెంబ్లీ లో తీర్మానం ప్రవేశపెట్టారు, ఈ సందర్భంగా ఆమె మీడియా తో మాట్లాడారు, ఆంద్ర ప్రదేశ్ విబజన విషయంలో ఆ రాష్ట్ర అసెంబ్లీ లో తీర్మానం పాస్ చేస్తేనే కేంద్రం ముందుకు వెల్ల గలుగుతుంది అని చెప్పిన కాంగ్రెస్ కు సమాధానం గా ఆమె అసెంబ్లీ లో యు పీ ని విబజించాలంటూ తీర్మనంచేసి౦ది. అసెంబ్లీ తీర్మానం కావాలని కేంద్రం తెలంగాణా విషయంలో చెప్పింది, ఇప్పుడు మేము అదే చేసాం మరి ఇప్పుడు కేంద్రం యు పీ ని చిన్న రాష్ట్రాలుగా విబజిస్తుంద లేకపోతే ఆడిన మాట తప్పుతుంద అని ఆమె నిలదీసింది.
      ఈ పరిణామాలన్నీ చూస్తుంటే, గతంలో యు పీ ని మూడు రాష్ట్రాలుగా విబజించడానికి సుముకంగా ఉన్నామని చెప్పిన కాంగ్రెస్ వైకరిని నగ్నంగా ప్రజలమున్దుంచడమే కాకా, చిన్న రాష్ట్రాల విషయంలో కాంగ్రెస్ ఆడుతున్న దొంగ నాటకాలను దేశానికి ఎత్తి చూపించి రాబోయే యు పీ ఎన్నికలలోనే కాకుండా 2014 లో తెలంగాణా లో కూడా పాగా వెయ్యాలని చూస్తుంది, తాను ప్రధాని కావడానికి ఉన్న అన్ని అనుకులతలను మాయ ఉపయోగించుకుంటుంది, ఈ పరిణామం ద్వార కాంగ్రెస్ ను ఇరుకున పెట్టడమేకాక చిన్న రాష్ట్రాలకు అనుకూలం అని చెప్పే బి జే పీ ని కూడా ఇరుకున పెటింది, యు పీ, తెలంగాణా ప్రజల ముందు కాంగ్రెస్, బి జే పీ ల వైకరులను తెలియజెప్పి తాను లాభం పొందాలని చూస్తుంది.....

19, నవంబర్ 2011, శనివారం

తెలంగాణా సాయుధ పోరాటం


1946-51 మధ్యన కమ్యూనిస్టుల నాయకత్వంలో ఏడవ నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కు వ్యతిరేకంగా జరిగింది.ఈ పోరాటంలో నాలుగున్నర వేల మంది తెలంగాణ ప్రజలు తమ ప్రాణాలు కోల్పోయారు.హైదరాబాద్‌ స్టేట్‌లో అంతర్భాగంగా తెలంగాణ ప్రాంతం బ్రిటిష్‌ పాలనతో ఎలాంటి సంబంధం లేకుండా ఆసఫ్‌ జాహీల పాలనలో ఉంది.నిజాం హాలీ సిక్కా, ఇండియా రూపాయి రెండూ వేర్వేరు.1948లో కలకత్తాలో అలభారత కమ్యూ నిస్టు పార్టీ మహాసభ "సంస్థానాలను చేర్చుకోవడానికి ఒత్తిడి చేసే అధికారం యూనియన్‌ ప్రభుత్వానికి లేదు' అని తీర్మానించింది.మఖ్దుం మొహియుద్దీన్‌ సహా మరో ఐదుగురు కమ్యూనిస్టు నాయకులపై ఉన్న వారంట్లను నిజాం ప్రభుత్వం ఎత్తివేసింది.కమ్యూనిస్టు పార్టీ మీద ఉన్న నిషేధాన్ని తొలగించింది. హైదరాబాద్‌ రాజ్యం స్వతంత్రంగా ఉండాలని, అదే కమ్యూనిస్టు పార్టీ విధానమనిరాజబహదూర్‌ గౌర్‌ ప్రకటించారు.ఖాసిం రజ్వీ నేతృత్వంలోని రజాకార్లు,దేశ్ ముఖ్ లు,జమీందారులు,దొరలు గ్రామాలపై పడి నానా అరాచకాలు సృష్టించారు.ఫలితంగా ఆనాటి నుంచి కమ్యూనిస్టుల వైఖరిలో మార్పు వచ్చింది.రజాకార్‌ సైన్యాన్ని ప్రజాసైన్యంగా అభివర్ణించిన కమ్యూనిస్టులు సాయుధ పోరాటాన్ని ప్రారంభించారు.
                           మొదట నల్లగొండ జిల్లాలో పుట్టిన సాయుధ విప్లవం త్వర త్వరగా వరంగల్, బీదర్ జిల్లాలకు వ్యాపించింది. రైతులు, రైతు కూలీలు నిజాం నవాబుకు, ప్రాంతీయ ఫ్యూడల్ జమీందారులకు వ్యతిరేకంగా సాహసోపేతమైన పోరాటం చేసారు. వారి పోరాటం వెట్టి చాకిరి కి వ్యతిరేకంగా మొదలైంది. అయితే వెట్టి చాకిరీ నుంచి విముక్తి చేయడానికి ఆనాటి రాజులు, జమీందారులు సిద్ధంగా లేరు.
మన కొంపలార్చిన, మన స్త్రీల చెరచిన,
మన పిల్లలను చంపి మనల బంధించిన
మానవాధములను మండలాధీశులను
కండ కండగ కోసి కాకులకు వెయ్యాలె,
కాలంబు రాగానే కాటేసి తీరాలె” -- కాళోజీ
అదే సమయంలో నిజాం నవాబు హైదరాబాద్ రాజ్యాన్ని భారత దేశంలో విలీనం చేసే ప్రయత్నాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాడు. భారత ప్రభుత్వం సెప్టెంబరు 1948 లో నిజాం పైకి తన సైన్యాన్ని పంపింది. అయితే కమ్యూనిస్టుల నాయకత్వంలో గెరిల్లా యుద్ధ తంత్రంతో 3000 లకు పైగా గ్రామాలను విముక్తం కాబడ్డాయి. ఈ ప్రాంతంలోని జమీందారులను దొరికిన వారిని దొరికినట్టుగా చంపి వేసారు. చావగా మిగిలిన వారు పారి పోయారు. విముక్తి చేయ బడిన గ్రామాల్లో సోవియట్ యూనియన్ తరహా కమ్యూన్లు ఏర్పరచారు. ఈ కమ్యూన్లు కేంద్ర నాయకత్వం క్రింద పని చేసేవి. ఈ పోరాటానికి 'ఆంధ్ర మహాసభ' పేరుతో భారత కమ్యూనిస్టు పార్టీ నాయకత్వం వహించింది. ఈ పోరాటానికి నాయకత్వం వహిచిన వారిలో మగ్దూం మొహియుద్దీన్, రావి నారాయణరెడ్డి, ఆరుట్ల రామచంద్రారెడ్డి మరియు హసన్ నాసిర్ లు ముఖ్యులు.
రజాకారు సేన ను తయారు చేసి మత విద్వేషాన్ని రెచ్చగొట్టి, దాడులు, హత్యలు, హత్యచారాలు నిర్వహించిన వాడు కాశీం రజ్వీ. ప్రోత్సాహించినవాడు మీర్ ఉస్మాన్ అలీఖాన్. 1947 ఆగస్టు15 నుంచి 1948 సెప్టెంబర్ 17 వరకు ఈ రాజాకార్లకు గ్రామాల్లో దొరలు, పెత్తందార్లు నాయకత్వం వహించారు.ఈ దొరలు, పెత్తం దార్లు 17 సెప్టెంబర్ 1948 దాకా షేర్వానిలు, చుడేదార్ పైజామా లు వేసుకుని కుచ్చుటోపీలు పెట్టుకొని నైజాం సేవ చేశారు. 1948 సెప్టెంబర్ 17 తర్వాత గ్రామాల్లో ఖద్దరు బట్టలు, గాంధీ టోపీల తో ప్రవేశించి ప్రజలు స్వాధీనం చేసుకున్న భూమిని అక్రమించి 1951 అక్టోబర్ దాకా యూనియన్ సైన్యాలు కమ్యూనిస్టులను వేటాడడంలో సహకరించారు. ముస్లింలను వేటాడడంలో పురికొల్పారు. ముఖ్యంగా మరట్వాడలో లక్షలాదిమంది ముస్లింలను హత్య చేయడంలో కేంద్ర బలగాలకు అండగా నిలిచారు. 1956 దాకా మీర్ ఉస్మాన్ అలీఖాన్ రాజప్రముఖ్‌గా ఉన్నట్లుగానే- జమీందారీ, జాగీర్దారీ చట్టం రద్దయి రక్షిత కౌల్దారీ చట్టం వచ్చేదాకా-దేశ్‌ముఖ్, దేశ్‌పాండే, ముక్తేదార్‌లుగా దొరలు కొనసాగారు. మీర్ ఉస్మాన్ అలీఖాన్ రాజభరణాలు ప్రభుత్వం నుంచి పొందినట్లుగా వీళ్లు నష్టపరిహారాలు, ఇనాములు పొందారు.
కమ్యూనిస్టులు హైదరాబాదుని ఆక్రమించే చివరి దశలో ప్రాణాలపై ఆశ వదులుకున్న నిజాం నవాబు భారత ప్రభుత్వానికి లొంగి పోతున్నట్టుగా ప్రకటించాడు. తద్వారా 1948 లో హైదరాబాదు రాష్ట్రం భారత దేశంలో కలవడం, తెలంగాణా సాయుధ పోరాటానికి ముగింపు జరిగాయి.1952 మార్చి 6 న హైదరాబాద్‌ రాజ్యంలో బూర్గుల రామకృష్ణారావునేతృత్వంలో ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడింది.

తెలంగాణా సాయుధ పోరాటయోధులు:
మగ్దూం మొహియుద్దీన్: ఆంధ్ర ప్రదేశ్ లోని మెదక్ జిల్లా ఆందోల్ లో 1908 ఫిబ్రవరి 4 న జన్మించాడు. ఆయన పూర్తిపేరు మహ్మద్‌ మగ్దూం మొహియుద్దీన్‌ హుజ్రీ. వీరి పూర్వీకులది ఉత్తర ప్రదేశ్ లోని ఆజంగఢ్‌. ఆయన తండ్రి నిజాము ప్రభుత్వంలో సూపరింటెండెంటు గా పనిచేసేవాడు. మగ్దూం చిన్నతనంలోనే తండ్రి చనిపోయాడు. తల్లి మరో పెళ్ళి చేసుకోవడంతో మగ్దూం తన బాబాయి వద్ద పెరిగాడు. ప్రాథమిక విద్య హైదరాబాదు లోని ధర్మవంత హైస్కూల్లోను, మెట్రిక్యులేషనుసంగారెడ్డిలోను చదివాడు. మఖ్దూం తండ్రి పరమ భక్తుడు- మహమ్మద్ గౌస్ మొహియుద్దీన్. తల్లి- ఉమ్దా బేగం. భర్త మరణానంతరం ఆమె వేరే వివాహం చేసుకుంది. పినతండ్రి బషీరుద్దీన్ పెంచాడు. మఖ్దూం విద్యాభ్యాసం ఆందోల్ నుండి హైదరాబాద్ చేరి 1929లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పూర్తయింది. ఇంటా బయటా విరివిగా పుస్తకాలు చదవటం, సాహిత్య అధ్యయనాలు, తాత్విక విషయాల పరిశోధన మఖ్దూం నిత్యకృత్యాలైనాయి.

ప్రముఖ అధ్యాపకుడు, ఉర్దూ కవి. 'షాయరే ఇంక్విలాయ్' (ఉద్యమ కవి, విప్లవ రచయిత) బిరుదాంకితుడు. కవియేగాక నాటక కర్త, గాయకుడు మరియు నటుడు కూడా. ఇతని గజల్ లు, పాఠ్యకాంశాలలోను, సినిమాలలోనూ ఉపయోగించారు.
'ఫిర్ ఛిడీ బాత్, బాత్ ఫూలోం కి' అను గజల్(గేయం) సుప్రసిధ్ధి.
1944లో సుర్ఖ్ సవేరా (అరుణోదయం),
1961లో గుల్ ఎ తర్ (తాబీపూవు),
1966లో బిసాతె రక్స్ (నాట్య వేదిక) పేర మూడు కవితా సంపుటాలను రచించినాడు.
1944-51 మధ్యకాలంలో 'తెలంగాణ' అనే కవిత రాశాడు.
మెట్రిక్యులేషన్ తరువాత మఖ్దూం ట్యూషన్లు చెప్పినాడు. చిత్రపటాలు విక్రయించాడు. పత్రికలకు వ్యాసాలు రాశాడు. కొన్నాళ్లు హైదరాబాద్ రాష్ట్ర దఫ్తర్‌లో గుమాస్తాగా ఆ తరువాత హైదరాబాదులోని సిటి కాలేజీలో ఉపాధ్యాయవృత్తిలో చేరాడు.1941లో హైదరాబాద్ ఉర్దూ అభ్యుదయ రచయితల సంఘ స్థాపనకు పూనుకున్నాడు మఖ్దూం. 1944లో అఖిల భారత అభ్యుదయ రచయితల సమావేశాన్ని హైదరాబాదులో ఏర్పాటు చేసినాడు.
మఖ్దూం కార్మిక నాయకుడు, కమ్యూనిస్టు కార్యకర్త, శాసన మండలి సభ్యుడు. ఫాసిజానికి వ్యతిరేకంగా సమసమాజ స్థాపనకోసం క్రియాశీలంగా రాజకీయాల్లో పాల్గొన్నాడు. అందరూ కలిసి భోజనం చేసే దస్తర్‌ఖాన్ల గురించి కల గన్నాడు మఖ్దూం. ప్రగతిశీల భావాలతో పీడితుల పక్షాన కలమెత్తి నమ్మిన సిద్ధాంతానికి జీవితాన్నంకితం చేసి అమరుడైనాడు. కమ్యూనిస్టు అయిన మఖ్దూం. మతాన్ని దూషించలేదు అనుసరించలేదు. 25.08.1969 తేదీన ఆయన చనిపోయాడు.
నిజాము కు వ్యతిరేకంగా తెలంగాణా సాయుధ పోరాటం లో కీలకపాత్ర పోషించాడు. 
                                       (రావి నారాయణ రెడ్డి)                                                                       రావి నారాయణ రెడ్డి: హైదరాబాద్ సమస్తాన విమోచనకు పోరాడిన కమ్యునిస్ట్ యోధుడు..
1908 జూన్ 4న జన్మించాడు. ఆంధ్ర మహాసభకు ఆధ్యక్షుడుగా పని చేశాడు. తెలంగాణ విమోచన తరువాత ఆయన సిపిఐలో చాలాకాలం పని చేశాడు. రావి నారాయణరెడ్డి విశాలాంధ్ర కోసం ఎంతో శ్రమించాడు. నిజాం ప్రభుత్వం మీద ఆయన చేసిన సాయుధ పోరాటం చిరస్మరణీయం. 1946-48 కాలంలో హైదరాబాదు సంస్థానంలో నిజాం పోలీసుల దాష్టీకానికి, మతదురహంకారులైన రజాకార్ల ఆగడాలను అరికట్టడ్డడానికి అజ్ఞాతంగా ఎన్నో గెరిల్లా దళాలను ఏర్పాటుచేసినాడు. నిజం వ్యతిరేక పోరాటంలో విజయం సాధించి౦ది.

కొమురం భీం : గిగిజన గోండు తెగకు చెందిన కొమురం చిన్నూమ్ సోంబాయి దంపతులకు 1900 సంవత్సరంలో ఆదిలాబాద్ జిల్లా, ఆసిఫాబాద్ తాలూకా లోని సంకేపల్లి గ్రామంలో జన్మించాడు.
భీం కుటుంబం పదిహేడేళ్ళ వయసులో అటవీశాఖ సిబ్బంది జరిపిన దాడిలో తండ్రి మరణించగా కరిమెర ప్రాంతంలోని సర్దాపూర్ కు వలస వెళ్లింది. అక్కడ వాళ్ళు సాగుచేసుకుంటున్న భూమిని సిద్దిఖీ అన్న జమీందారు ఆక్రమించుకోవడంతో ఆవేశం పట్టలేని భీమ్ అతన్ని హతమార్చి అస్సాం వెళ్ళిపోయాడు. అక్కడ ఐదేళ్ళపాటు కాఫీ, తేయాకు తోటల్లో పనిచేస్తూ గడిపిన భీమ్ తిరిగి కరిమెర చేరుకున్నాడు. నిజాం నవాబు పశువుల కాపర్లపై విధించిన సుంకానికి వ్యతిరేకంగా గిరిజనులను ఒక్కతాటిపై నడిపించి ఉద్యమించాడు. ఆసిఫాబాద్ పరిసర ప్రాంతాలు మరియు జోడేఘాట్ గుట్టలు కేంద్రంగా నిజాం నవాబు పై గెరిల్లా పోరాటాన్ని కొనసాగించాడు. కుర్దు పటేల్ అనే నమ్మకద్రోహి ఇచ్చిన సమాచారంతో నిజాం సైన్యం 1940 సెప్టెంబర్ 1 న జోడేఘాట్ అడవుల్లోని కొమురం భీమ్ స్థావరాన్ని ముట్టడించి భీమ్ ని హతమార్చాయి. అది గిరిజనులు పవిత్రంగా భావించే ఆశ్వీయుజ శుద్ద పౌర్ణమి కావడంతో అప్పటి నుండి ఆ తిధి రోజునే ఆదివాసీలు కొమురం భీమ్ వర్ధంతిని జరుపుకొంటూ వస్తున్నారు.
కొమరంభీమ్ (సినిమా) - కొమురం భీమ్ జీవితగాధ ఆధారంగా రూపొంది రెండు నంది పురస్కరాలను గెలుచుకున్న చిత్రం.

http://naatelangaana.blogspot.in/2011/11/blog-post_16.html 



బద్ధం ఎల్లారెడ్డి : 1906  వ సంవత్సరంలో కరీంనగర్ జిల్లా గాలి పల్లి లో జన్మించారు. 1930 లో శాసనోల్లంగన ఉద్యమ సమయంలో రాజకీయ రంగ ప్రవేశం చేసారు.
      ఉప్పు సత్యాగ్రహం లో బాగంగా కాకినాడ తీరానికి వెళ్లి ఉద్యమం సాగిస్తుండగా పోలీసులు అరెస్ట్ చేసి మద్రాస్ లో వదిలి వేసారు, ఆయన భీమవరం చేరుకొని బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పికెటింగ్ నిర్వహించారు, ఆతర్వాత 7 నెలల జైలు శిక్ష అనుభవించారు. విడుదలయ్యాక కరీంనగర్ చేరుకొని ఖాది వస్త్రాలు ధరించి గాంధీ ఉద్యమాన్ని కొనసాగించారు, తన సొంత ఊరిలో హరిజనులకోసం పాతశాలను నెలకొల్పారు.
       1934 లో తొలిసారి ఆంద్ర మహా సభలలో పాల్గొన్నారు, ఆ తర్వాత మిత వాదులు, అతి వాదులుగా ఆంద్ర మహా సభ విడిపోయింది, అసిఫాబాద్లో కొమురం భీంనాయకత్వంలో జరుగుతున్న గోండుల తిరుగుబాటును గురించి తెలుసుకొని అక్కడికి వెళ్లి అందులో పాల్గొన్నారు, తర్వాత కరీం నగర్ జిల్లా మొత్తం తిరిగి 2500 గ్రామాలను మేల్కొల్పారు. నిజాం ప్రభువుకు వ్యతిరేక ప్రచారం చెయ్యడంతో ఆయనపై రాజద్రోహం కేసు పెట్టి సంవత్సరం జైలు, 200 రూపాయల జరిమానా విధించారు, అయితే ఆయన దగ్గర జరిమనకు డబ్బు లేకపోవడంతో మరో మూడు నెలలు జైలులోనే ఉన్నారు. 1947 లో సాయుధ సమరం ఒక్కటే మార్గమని రావి నారాయణ రెడ్డి, బద్దం ఎల్లా రెడ్డి, ముగ్ధుం మొహినోద్దిన్ లు పిలుపునిచ్చారు, 1948 లో నిజాం గద్దె దిగారు, ఆ తర్వాత ఒకసారి లోక్సభకు, 2 సార్లు శాసన సభకు, మరో సారి రాజ్య సభకు ఎన్నికయ్యారు, ఆయన రాష్ట్ర కమూనిస్ట్ పార్టీ కార్య దర్శి గా పనిచేసారు.
సాయుధ పోరాటయోధుడు బద్దం ఎల్లారెడ్డి 1978 లో మరణించారు...


తెలంగాణా చరిత్రకు సంబంధించిన పూర్తి వీడియో :


17, నవంబర్ 2011, గురువారం

తెలంగాణ సాధన పాదయాత్రలు



ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో భాగంగా బుధవారం టీఆర్‌ఎస్ చేపట్టిన ‘తెలంగాణ సాధన పాద యాత్ర ’లో పార్టీ శ్రేణులు, తెలంగాణవాదులు భారీ ఎత్తున పాల్గొన్నారు. యాత్రకు అడుగడుగునా మహిళలు మంగళహారతులతో ఘనస్వాగతం పలికారు. ఆరు రోజులు సాగే ఈ యాత్రలను వరంగల్‌లో తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం ప్రారంభించారు. యూపీ సీఎం మాయావతికి ఉన్న సోయి సీఎం కిరణ్‌కుమార్‌కు రావాలన్నారు. కాంగ్రెస్‌కు పోయేకాలం వచ్చిందని కరీంనగర్ జిల్లా యాత్రలో ఈటెల రాజేందర్ ధ్వజమెత్తారు. రంగాడ్డి జిల్లా యాత్రలో పాల్గొన్న ఎమ్మెల్యే కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణ వచ్చే దాకా పోరాటం ఆగదన్నారు.
పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు పెట్టకపోతే గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఉద్యమిస్తామని పాలమూరు పాద యాత్ర లో ఎమ్మెల్యే జూపల్లి, నిజామాబాద్ యాత్రలో ఎమ్మెల్యేలు పోచారం, గంప గోవర్ధన్, ఏనుగు రవీందర్‌డ్డి హెచ్చరించారు. తెలంగాణకు అడ్డుపడుతున్న కిరణ్ సర్కార్‌కు దమ్ముంటే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని మెదక్ జిల్లా యాత్రలో ఎమ్మెల్యే హరీష్‌రావు సవాలు విసిరారు. యాత్రద్వారా కాంగ్రెస్ మోసాన్ని ఎండగడుతామని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న పేర్కొన్నారు. ద్రోహులను తరిమి కొట్టాలని నల్లగొండ యాత్రలో ఎమ్మెల్యే సోమారపు, పొలిట్‌బ్యూరో సభ్యుడు జగదీశ్వర్‌డ్డి పిలుపునిచ్చారు. 

కాంగ్రెస్ కో ఖతం కరో.. తెలంగాణ హాసిల్ కరో నినాదంతో టీఆర్‌ఎస్ చేపట్టిన తెలంగాణ సాధన పాద యాత్రకు  కరీంనగర్ జిల్లాలో ప్రజలు బ్రహ్మరథం పట్టారు. బుధవారం కోరుట్ల నియోజకవర్గ పరిధిలోని ఇబ్రహీంపట్నం మండలం బండలింగాపూర్ శివారులోని గండి హనుమాన్ దేవస్థానం నుంచి ఈ పాదయావూతను టీఆర్‌ఎస్ శాసనసభాపక్ష నేత, పాదయాత్ర ఇన్‌చార్జి ఈటెల రాజేందర్ ప్రారంభించారు. కాంగ్రెస్కు పోయేకాలం దగ్గరపడ్డదని ధ్వజమెత్తారు. తొలుత దేవాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు కెప్టెన్ లక్ష్మీకాంతరావు, కోరుట్ల, ధర్మపురి ఎమ్మెల్యేలు కే.విద్యాసాగర్‌రావు, కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, టీఆర్‌ఎస్8 మహిళావిభాగం అధ్యక్షురాలు తుల ఉమ తోపాటు జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ముఖ్య నేతలు పూజలు నిర్వహించి యాత్ర ప్రారంభించారు.
గండిహనుమాన్ నుంచి బయలుదేరిన పాదయాత్ర రాజేశ్వరావుపేట, సత్తక్కపల్లి స్టేజీల మీదుగా బండలింగాపూర్, మేడిపల్లి, వెంకట్‌రావుపేటల నుంచి మెట్‌పల్లికి మధ్యాహ్నం చేరుకుంది. భోజన విరామం అనంతరం ఆరపేట, మారుతీనగర్, మేడిపల్లి మీదుగా కొరుట్లకు రాత్రి 7గంటలకు చేరుకుంది. మార్గమధ్యంలో విద్యార్థులు, మహిళలు, పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. మెట్‌పల్లిలో ఈటెల మాట్లాడుతూ ప్రజాస్వామ్యంగా ఎదుర్కోలేక కాంగ్రెస్8 ప్రభుత్వం పీడీ యాక్ట్‌ను ప్రయోగిస్తోందని, ఇది రాజ్యాంగ విరుద్ధమని, చివరి అస్త్రంగా నిర్బంధకాండను ప్రయోగిస్తోందని, పోయేకాలం వచ్చినపుడు ప్రభుత్వాలు ఇలానే ప్రవర్తిస్తుంటాయని విమర్శించారు. పీడీ యాక్ట్ కింద అరెస్టు చేసిన పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు చెరుకు సుధాకర్‌ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై మరింత ఒత్తిడి పెంచేందుకు ఈ యాత్ర కొనసాగిస్తున్నామని తెలిపారు. తెలంగాణ మొత్తాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు.

లగడపాటి తెలంగాణ వ్యతిరేకి కాదు:ఎర్రబెల్లి

 సీమాంధ్ర నేతలపై టీడీపీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకరరావుకు ఒక్కసారిగా ప్రేమ పుట్టుకొచ్చింది. లగడపాటి రాజగోపాల్, పరకాల ప్రభాకర్ ఎప్పుడు కూడా తెలంగాణకు వ్యతిరేకంగా గానీ, అనుకూలంగా గానీ మాట్లాడలేదని ఎర్రబెల్లి అన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ నిర్వహించిన సధ్భావన సదస్సుకు లగడపాటి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి, లగడపాటి కలిసి భోజనం చేశారు. స్పీకర్ రాజీనామాల విషయంలో తమను ఇంకా చర్చలకు ఆహ్వానించలేదని తెలిపారు. ఒక వేళ పిలిస్తే రాజీనామాలను ఆమోదించాలని స్పీకర్‌ను కోరుతామని పేర్కొన్నారు.

16, నవంబర్ 2011, బుధవారం

జల్..జంగల్..జమీన్ హమారా!!



కొమురం భీమ్: గిగిజన గోండు తెగకు చెందిన కొమురం చిన్నూమ్ సోంబాయి దంపతులకు 1900 సంవత్సరంలో ఆదిలాబాద్ జిల్లా, ఆసిఫాబాద్ తాలూకా లోని సంకేపల్లి గ్రామంలో జన్మించాడు.
భీం కుటుంబం పదిహేడేళ్ళ వయసులో అటవీశాఖ సిబ్బంది జరిపిన దాడిలో తండ్రి మరణించగా కరిమెర ప్రాంతంలోని సర్దాపూర్ కు వలస వెళ్లింది. అక్కడ వాళ్ళు సాగుచేసుకుంటున్న భూమిని సిద్దిఖీ అన్న జమీందారు ఆక్రమించుకోవడంతో ఆవేశం పట్టలేని భీమ్ అతన్ని హతమార్చి అస్సాం వెళ్ళిపోయాడు. అక్కడ ఐదేళ్ళపాటు కాఫీ, తేయాకు తోటల్లో పనిచేస్తూ గడిపిన భీమ్ తిరిగి కరిమెర చేరుకున్నాడు. నిజాం నవాబు పశువుల కాపర్లపై విధించిన సుంకానికి వ్యతిరేకంగా గిరిజనులను ఒక్కతాటిపై నడిపించి ఉద్యమించాడు. ఆసిఫాబాద్ పరిసర ప్రాంతాలు మరియు జోడేఘాట్ గుట్టలు కేంద్రంగా నిజాం నవాబు పై గెరిల్లా పోరాటాన్ని కొనసాగించాడు. కుర్దు పటేల్ అనే నమ్మకద్రోహి ఇచ్చిన సమాచారంతో నిజాం సైన్యం 1940 సెప్టెంబర్ 1 న జోడేఘాట్ అడవుల్లోని కొమురం భీమ్ స్థావరాన్ని ముట్టడించి భీమ్ ని హతమార్చాయి. అది గిరిజనులు పవిత్రంగా భావించే ఆశ్వీయుజ శుద్ద పౌర్ణమి కావడంతో అప్పటి నుండి ఆ తిధి రోజునే ఆదివాసీలు కొమురం భీమ్ వర్ధంతిని జరుపుకొంటూ వస్తున్నారు.
కొమరంభీమ్ (సినిమా) - కొమురం భీమ్ జీవితగాధ ఆధారంగా రూపొంది రెండు నంది పురస్కరాలను గెలుచుకున్న చిత్రం.

14, నవంబర్ 2011, సోమవారం

జల దోపిడి, గోదావరి బేసిన్:

ఆంద్ర ప్రదేశ్ లో గోదావరి నదికి ఉన్న పరివాహక ప్రాంతంలో 79 % తెలంగాణాలో ఉంటె, కేవలం 31 % మాత్రమే ఆంద్ర ప్రాంతంలో ఉంది.
* ఈ బేసిన్ లో సాగుకు యోగ్యమైన భూమిలో 70 % తెలంగాణా లోనే ఉంది.
* హైదరాబాద్ గవర్నమెంట్ కొన్ని ప్రాజెక్ట్లకు రూపకల్పన చేసింది. వాటికోసం అప్పటి ప్రభుత్వం 845 టి ఎం సి ల నీటిని కేటాయించింది.
* అందులో కొన్ని పూర్తి కాగ కొన్ని నిర్మాణదశలో, మరి కొన్ని ప్రణాళిక దశలో ఉన్నాయ్, వీటిలో 330 టి ఎం సి ల సామర్థ్యం కల గోదావరి భాహులార్థ సాధక ప్రాజెక్ట్, ఇచ్చంపల్లి, 350 టి ఎం సి లు, 58 టి ఎం సి లతో నిజాంసాగర్, 38 టి ఎం సి ల దేవనూర్ ప్రాజెక్ట్లు ప్రధానమైనవి.
* రాష్ట్రాల పునర్విభజన తర్వాత అంతకు ముందు ప్రోజేక్ట్లన్ని పూర్తి చెయ్యాలని పార్లమెంట్ నిర్ణయించింది.
* నీటి పంపిణి కోసం బచావత్ ట్రిబునల్ ను కేంద్రం ఏర్పాటు చేసింది, ట్రిబునల్ 1480 టి ఎం సి ల నీటిని ఆంద్ర ప్రదేశ్ వాటాగా ఇచ్చింది.
* అయితే గోదావరి కింద ఆంద్ర లో ఉన్న ఒక్క ధవళేశ్వరం కిందే ఖరిఫ్ లో 12 లక్షల ఎకరాలు, రబీ లో 7 నుండి 8 లక్షల ఎకరాలు సాగవుతుంది, అదే తెలంగాణాలో ఐదు జిల్లాల గుండా గోదావరి ప్రవహిస్తున్న ఇక్కడ అతి కష్టం మీద నాల్గు నుండి ఐదు లక్షల ఎకరాలు మాత్రమే సాగవుతుంది, అది సంవత్సరానికి ఒక్క పంట మాత్రమె.
* గోదావరి నది పరివాహక ప్రాంతాన్ని ప్రతిపాధికగా తీసుకుంటే రాష్ట్రానికి కేటాయించిన 1480 టి ఎం సి ల నీటిలో 79 % తెలంగాణా కు రావాలి, పరివాహక ప్రాంతంలో సాగుకు యోగ్యమైన భూమిని ఆధారంగా తీసుకున్న 70 % రావాలి. 
* ప్రధానంగా తెలంగాణా కు ఉపయోగపడే గోదావరి నీటి విషయంలో ప్రభుత్వం ట్రిబునల్ ముందు చాల భాద్యత రాహిత్యంగా ప్రవర్తించి, ఎగువరస్త్రాలకు, గోదావరి, మంజీరా నీటిని వారు అడిగినంత కాదనకుండా ఇచ్చారు.
* ఇక ప్రాజెక్ట్ లను  గురించి చర్చిద్దాం.
శ్రీ రామ్ సాగర్: తెలంగాణా ప్రాంతంలోని నిజామా బాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, నల్గొండ జిల్లాల్లోని 20 లక్షల ఎకరాలకు నీరు అందించే ఉద్దేశ్యంతో అప్పటి నిజాం సర్కార్ ప్రాజెక్ట్ నిర్మించాలని తలచారు.
* పోచంపాడ్ ప్రాజెక్ట్ గా నామకరణం చేసారు.
* అయితే ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ప్రాజెక్ట్ సంగతే మరచిపోయారు.
* 1969 ఉద్యమం తర్వాత హడావిడిగా ఈ ప్రాజెక్ట్ను మొదలు పెట్టారు కాని ఇంతవరకు అది పూర్తికాలేదు.
* ౩౩౦ టి ఎం సి సామర్ధ్యం అనుకున్న ప్రాజెక్ట్ సామర్ధ్యం 145 టి ఎం సి లకు కుదించారు.పోనీ ఆ మేరకైన పని పూర్తయ్యింద అంటే అది లేదు.
* ఈ ప్రాజెక్ట్ ద్వారా కేవలం నాలుగైదు లక్షల ఎకరాలకు మాత్రమే నీరు అందుతుంది, అది అతి కష్టం మీద ఒక్క పంటకు మాత్రమే.
* ఇసుక మేటలు వేయడంతో ఈ ప్రాజెక్ట్ సామర్ధ్యం 20 టి ఎం సి ల మేర తగ్గింది.
* అప్పట్లోనే ఈ విషయాన్నీ ఊహించిన నిజాం సర్కార్ ప్రాజెక్ట్ పై భాగంలో ఒక సీల్డ్ ట్రాప్ ను నిర్మించాలని సంకల్పించింది, కాని ఆ ప్రాజెక్టే గుర్తులేని నేటి ప్రభుత్వాలు సీల్డ్ ట్రాప్ ను ఎలా గుర్తుపెట్టుకుంటాయి........


శ్రీ రామ్ సాగర్ వరద కలువ: శ్రీ రామ్ సాగర్ లో ఇసుక మేటలు వెయ్యడంతో దాని సామర్థ్యం తగ్గి వరదలు వచ్చినపుడు నీరు వృధాగా దిగువకు వెళ్తుంది.
* దిగువన ఉన్న ధవలేశ్వరానికి నీరు చేరుతుండడంతో పాలకులు ఆ విషయాన్నీ సంతోషకరం గా భావించారు, అయితే ఈ విషయంపై తెలంగాణా ప్రజలు దశాబ్దాలుగా పోరాడుతున్నారు, చివరికి ఈ వరద నీటిని శ్రీ రామ్ సాగర్ నుండి కాలువ ద్వార తరలించేందుకు , శ్రీ రామ్ సాగర్ వరద కాలువ నిర్మించడానికి ప్రభుత్వం అంగీకరించింది.
* దీని ద్వార వరంగల్, నల్గొండ జిల్లాల్లోని ఎగువ ప్రాంతాల్లో సుమారు 2 లక్షల 30 వేల ఎకరాలకు నీరు అందించే అవకాశం ఉంది.
* ఈ ప్రాజెక్ట్కు కేంద్రం ఎప్పుడో అనుమతులు ఇచ్చింది, పి.వి ప్రధానిగా ఉన్నప్పుడు దీనికి శంకుస్థాపన జరిగింది.
* కాని ఈనాటికి చెప్పుకోదగిన పని మాత్రం జరగలేదు.
నిజాం సాగర్: 58 టి ఎం సి ల సామర్ధ్యం కల ఈ ప్రాజెక్ట్ను అప్పటి నిజాం సర్కార్ 1931 లో నిర్మించింది.
* 100 సంవత్సరాలైనా ఈ ప్రాజెక్ట్ ఉండాలనే ఉద్యేశంతో అప్పటి ప్రభుత్వం రెండు ప్రతిపాదనలు చేసింది.
1 . ఇసుక మేటలు రాకుండా ఆపుటకు పై భాగంలో 38 టి ఎం సి ల సామర్థ్యం కల దేవనూర్ ప్రాజెక్ట్ నిర్మించాలి.
2 . మంజీరా నది పరివాహక ప్రాంతంలో అడవులను పెంచాలి.
* కాని ఆంధ్రప్రదేశ్ అవతరణ తర్వాత ఈ రెండు జరగలేదు.
* దశాబ్దాలుగా ప్రధాన కాలువ నిరవహనకు, పూడిక తీయడానికి ప్రభుత్వాలు నిధులు కేటాయించక పోవడంతో పూడికలు చేరి, డిస్టిబుటరి లో పిచ్చి మొక్కలు పెరిగి కాలువ గట్టు తెగిపోయి ప్రాజెక్ట్ నిరర్ధకమైంది.
* 2 లక్షల 75 వేల ఎకరాలకు నీరంధించవలసిన ప్రాజెక్ట్ లక్ష ఎకరాలకు కూడా నీరు అందించడం లేదు.
* కోస్తాలో బ్రిటిష్ కాలంలో నిర్మించిన ధవళేశ్వరం ప్రాజెక్ట్, ప్రకాశం బరాజ్ ల వయో పరిమితి ఆంద్ర ప్రదేశ్ ఏర్పడే నాటికీ తీరిపోయింది ఐన 1956 తర్వాత వేల కోట్లు కర్చు చేసి ఆ ప్రోజేట్ లను పునరుద్ధరించిన పాలకులు నిజాం కాలంలో నిర్మించిన ఈ ప్రాజెక్ట్ను పట్టించుకోవడం లేదు.
సింగూర్: నిజాం సాగర్లో తగ్గిన నీటి నిలువ సామర్ధ్యాన్ని పాక్షికంగా ఐన పునరుద్ధరించి, మెదక్ జిల్లాకు సాగు నీరు, జంట నగరాలకు తాగు నీరు అందించాలని ఈ ప్రాజెక్ట్ ను 1980 లో మంజీరా నది పై నిజాం సాగర్ పై భాగంలో నిర్మించారు.
* అయితే ఇది కేవలం జంట నగరాలకు నీరు అందిస్తుంది కాని మెదక్ రైతులకు ఒక్క నీటి చుక్క కూడా ఇవ్వడంలేదు.
* పైగా నిజాం సాగర్కు వచ్చే నీరుకూడా ఇక్కడే ఆగిపోతుంది.
* ఇవి తెలంగాణాలో గోదావరి నది పై ఇప్పటి వరకు నిర్మించిన ప్రాజెక్ట్లు, ఇక భవిష్యత్తులో నిర్మించిన ప్రాజెక్ట్ల వివరాలు...
ఇచ్చంపల్లి : 350 టి ఎం సి ల సామర్ధ్యం కల ఇచ్చం పల్లి ప్రతిపాదన నిజం కలం నాటిది.
* ఇది జలవిధ్యుత్ ప్రాజెక్ట్, నాలుగు రాష్ట్రాలకు మధ్యలో ఉన్న ప్రాజెక్ట్, దీని ద్వార నాలుగు రాష్ట్రాలు ప్రభావితం అవుతాయి.
* కాని ఇచ్చం పల్లి నిర్మాణమే నేడు ప్రశ్నార్ధకం అయ్యింది.
దేవాదుల: 2001 జునేలో 50 టి ఎం సి లతో ఐదు లక్షల ఎకరాలకు నీరందించే ఉద్యేశ్యంతో ప్రారంభించిన ప్రాజెక్ట్ దేవాదుల.
* అయితే ఈ ప్రాజెక్ట్ను ప్రారంభించడానికి అప్పటి ముఖ్య మంత్రి హెలికప్టార్ లో వెళ్లారు, ఎందుకనే అప్పటికి ఆ ప్రాంతంలో అసలు రోడ్ మార్గం లేదు.
2003 లో ప్రాజెక్ట్ పనులు పూర్తి కావలి, కాని ఇప్పటివరకు అరకొర పనులు జరిగాయి.
* అయితే దేవాదుల అప్పుడు ప్రారంభించిన చోట నిర్మాణం సాధ్యం కాదు అని తేల్చేసి గంగారం అనే ప్రాంతంలో కడుతున్నారు.
* అయితే దీనిని రెండు స్టేజ్ లలో పూర్తి చేస్తారు.
* మొదటి స్టేజ్ లో రెండు ఫేజ్ లు ఉంటాయి.
* మొదటి స్టేజ్ లో మొదటి ఫేజ్ పూర్తయితే 5 టి ఎం సి ల నీరు వాడుకోవచ్చు.
* దీనిని 2005 నాటికి పూర్తి చెయ్యాలి కాని ఇప్పటికి పూర్తి కాలేదు.
* అయితే గమ్మత్తు ఏంటంటే ఈ స్టేజ్ లు, ఫేజ్ లు పూర్తైన కేవలం 32 టి ఎం సి లే వాడుకోవచ్చు.
* ఇది ఎత్తి పోతల పథకం అంటే దీనిలోని నీరు పక్కన ఉన్న చెరువులు కాలువలలో ఎత్తి పోస్తారు, అయితే అదికూడా వరదలు వచ్చిన సమయాల్లో, అయితే వరదలు వచ్చినపుడు చెరువులు, కుంటల్లో నీరు పుష్కలంగా ఉంటుంది, మరు ఈ నీరును ఎం చేస్తారో..?
* ఇది ఎత్తి పోతల పథకం కావడంతో విద్యుత్ కర్చు మొత్తం రైతులే చెల్లించ వలసి ఉంటుంది.
ఎల్లంపల్లి: కరీం నగర్ జిల్లలో గోదావరి నది పై 40 టి ఎం సి ల సామర్థ్యంతో నిర్మించ తలపెట్టిన ప్రాజెక్ట్ ఎల్లంపల్లి. ఇది దక్కి ముక్కిలు తిని ఎం టి పి సి పుణ్యమని ఒక దశ పనులు పూర్తి చేసుకున్న ఆ తర్వాత ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందం గా ఉంది, దీని నుండి 10 టి ఎం సి ల నీరు ఎం టి పి సి కి ఇస్తారట.. 
దుమ్ముగూడెం: సింగిరెడ్డి పల్లె: ఇవి రెండు దేవాదుల కింద తలపెట్టిన విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్ట్లు.
* ఆస్ట్రియ నుండి రుణ సుకర్యాన్ని పొంది ఈ ప్రాజెక్ట్లను నిర్మించడానికి ఒప్పందాలు చేసుకున్నారట.
* అయితే ఈ ప్రోజెట్ల నుండి వచ్చే విద్యుత్ను దేవాదులకు ఉపయోగిస్తారట..


నదుల అనుసంధానం: గోదావరి, కృష్ణ నదులను అనుసంధానం చేసి పులిచింతల పథకం చేపట్టాలని ప్రయత్నాలు చేస్తున్నారు.
* దీని వలన తెలంగాణకు అసలు ఎ విధమైన ఉపయోగం లేదు, పైగా నల్గొండ జిల్లా లోని అనేక గ్రామాలూ ముంపుకు గురవుతాయి.
* తెలంగాణా కు మాత్రమే సొంతమైన గోదావరి నీటిని ఆంద్ర, రాయలసీమలకు తరలించి తెలంగాణాను ఎడారిని చెయ్యాలి అనేది ప్రభుత్వాల ఉద్దేశ్యం.


కాలువల ద్వార నీటి సరఫరా:
* భారి ప్రాజెక్ట్ లనుండి కాలువల ద్వార నీరందించే విషయంలో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగింది.
* రాష్ట్రము లో కాల్వల కింద సాగయ్యే మొత్తం భూమి( 2001 -2002 ) లో 1562413 హెక్టార్లు( 3560800 ఎకరాల్లో ), దీనిలో తెలంగాణా ప్రాంతానికి కేవలం 248091 హెక్టార్లు( 613045 ఎకరాల్లో) భూమి మాత్రమే కాలువల కింద సాగు అవుతున్నది. ఐది కేవలం 15 .88 % మాత్రమే.
* ఒక్క గుంటూరు జిల్లా లోనే 304863 హెక్టార్లు ( 753331 ఎకరాల్లో) కు కాలువ నీరు అందుతున్నది.అంటే ప్రాంతీయ వివక్ష ఎ స్థాయిలో జరుగుతుందో చూడవచ్చు..
* అయితే ఈ లెక్కలు 2001 -2002 నాటివి కాని నేటికి ఇంచు మించు ఇదే పరిస్థితులు ఉన్నాయి.
* 1991 వరకు తెలంగాణా ప్రాంతంలో కాల్వలకిండా సాగు ఐన భూమి 870754 ఎకరాలు కాగ అది 2002 నాటికి 613042 ఎకరాలకు తగ్గింది, అంటే వీళ్ళు జల యజ్ఞం పేరుతో, అధిక నిధులు తెలంగాణా ప్రాజెక్ట్లకు ఇస్తున్నాం అని చెప్తున్నా సాగు భూమి మాత్రం పెరగడం లేదంటే అర్థం ఏమిటి..? 
* నాగార్జున సాగర్ ఎడమ కాలువ, నిజాం సాగర్, రాజోలి బండ, కింద సాగయ్యే విస్తీర్ణం గడచినా పది సంవత్సరాల్లో మూడు లక్షల ఎకరాలకు పడి పోయింది..
ప్రాణ హిత- చేవెల్ల: తెలంగాణ ప్రాజెక్టులపై సర్కారు వివక్ష కొనసాగుతోందనడానికి ప్రాణహిత-చేవెల్ల ప్రాజెక్టు తాజా ఉదాహరణ. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడినప్పుడో, ఎన్నికల ముందో తెలంగాణ ప్రాజెక్టుల గురించి మాట్లాడే పాలకులు ఆ తర్వాత వీటి గురించి పట్టించుకోక పోవడం విషాదం. తెలంగాణ ప్రజల కలల పంటైన ప్రాణహిత-చేవెల్ల ప్రాజెక్టుకు కేంద్ర జల వనరుల సంఘం 2010 ఏప్రిల్‌లో సూత్రవూపాయ అనుమతినిచ్చింది. 18 నెలలు గడిచినా ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తిస్థాయి అనుమతులను సంపాదించలేక పోయింది. ప్రధాన మంత్రి ప్రత్యేక కార్యక్రమం కింద ప్రాణహిత ప్రాజెక్టుకు పూర్తి స్థాయి పెట్టుబడులను కేంద్ర ప్రభుత్వమే పెట్టే విధంగా ప్రయత్నిస్తామని, ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా సంపాదించడానికి కృషి చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినప్పటికీ ఈ దిశగా ఎటువంటి ప్రయత్నాలను చేయక పోవడంతో తెలంగాణవాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కరువు పీడిత తెలంగాణ ప్రాంతానికి తక్షణ అవసరమైన ప్రాణహిత-చేవెల్లను పట్టించుకోని సర్కారు... తెలంగాణ ప్రాంతంలో ప్రాజెక్ట్ కట్టి.. తెలంగాణ అటవీ ప్రాంతాలను జల సమాధి చేసి, గిరిజన జీవన విధ్వంసాన్ని సృష్టించి, సీమంద్రులకు నీళ్లు పారించే పోలవరానికి జాతీయ హోదా కల్పించేందుకు కిందికి మీదికి అవుతోందని తెలంగాణవాదులు ఆరోపిస్తున్నారు. 
జాప్యంతో పెరుగుతున్న అంచనా వ్యయం:
ఎన్నికల తర్వాత ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు ప్రాధాన్యం ఇవ్వలేదు. కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ అనుమతి కోసం సవరించిన ప్రాజెక్టు నిర్మాణ రిపోర్టును గత సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం పంపింది. కేంద్ర జలవనరుల సంఘానికి చెందిన 16 విభాగాలతో పాటు పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖకు చెందిన ఎనిమిది రకాల అనుమతులు, కేంద్ర ప్రణాళిక సంఘానికి చెందిన సవరించిన పెట్టుబడుల అనుమతులు పొందవలసి ఉంది. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి 17,875 కోట్లు ఖర్చవుతాయని మొదట అంచనా వేసి ప్పటికీ మొదటిసారి సవరించిన అంచనాల ప్రకారం 38,500 కోట్లకు పెరగగా 2007లో సవరించిన అంచనాల ప్రకారం 40,300 కోట్లకు పెరిగింది. రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన అనుమతి కూడా ఇచ్చింది. నిర్మాణంలో జరుగుతున్న జాప్యంవల్ల అంచనావ్యయం ఏటా పెరుగుతోంది.
కేంద్ర అనుమతిలో జాప్యం:
ప్రాణహిత-చేవెల్ల ప్రాజెక్టుకు 2012 సంవత్సరం నాటికి అన్ని అనుమతులు సాధిస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నప్పటికీ అనుమతుల మంజూరు కోసం చేస్తున్న ప్రయత్నాలు నామమావూతంగానే సాగుతున్నాయి. ఎటువంటి అనుమతులు లేకుండానే పోలవరం ప్రాజెక్టుపై వేల కోట్లు ఖర్చు పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం ప్రానహిత ప్రాజెక్టు విషయంలో మాత్రం సాచివేత ధోరణి అవలంబించడం పట్ల తెలంగాణవాదులు ఆక్షేపణ తెలుపుతున్నారు. ప్రాజెక్టు నిర్మాణం వల్ల మహారాష్ట్రకు చెందిన 1852 ఎకరాల సాగు భూమి, 3395 ఎకరాల నదీ ప్రాంత భూమి ముంపునకు గురవుతుంది. అయినప్పటికీ మహారాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి సాంకేతిక అభ్యంతరాలు పెట్టకపోవచ్చని భావిస్తున్నారు. ప్రాజెక్టు నిర్మాణం వల్ల ఆంధ్రప్రదేశ్ పరిధిలో 893 ఎకరాల భూమి ముంపునకు గురవుతుంది. ఈ ప్రాజెక్టు కాలువలు, టన్నెల్‌లు, తదితర నిర్మాణాలకు 7 జిల్లాల పరిధిలో 4644 ఎకరాల అటవీ భూమి సేకరించవలసి ఉంది. అటవీ భూమికి ప్రత్యామ్నాయంగా భూమిని కూడా కేటాయించవలసి ఉంది. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని ముందుగా కోరిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ప్రాణహిత చేవెళ్ళకు కూడా జాతీయ హోదా కావాలని కోరుతోంది. ఒకే రాష్ట్రానికి చెందిన రెండు ప్రాజెక్టులకు ఏక కాలంలో జాతీయ హోదా ఇవ్వడం సాధ్యమా కాదా? అనే అంశంపై చర్చ జరుగుతోంది. 


               ఇప్పటికే అన్ని అనుమతులను పొందిన పోలవరం ప్రాజెక్టుతో ప్రాణహితను పోటీ పెట్టడం సమంజసం కాదని తెలంగాణ ప్రాంత ఇంజనీరింగ్ నిపుణులు అంటున్నారు. దీనికి తోడు ప్రాణహిత ప్రాజెక్టుకు జాతీయ హోదా దక్కాలంటే పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్ర నుంచి ఎటువంటి అభ్యంతరాలు లేకుండా చూసుకోవాలి. అయితే ఇప్పటివరకు మహారాష్ట్రతో చర్చల ప్రక్రియ పూర్తి కాలేదు. ప్రాణహిత ప్రాజెక్టు విషయంలో మహారాష్ట్ర వేచి చూసే ధోరణి అవలంబిస్తోంది. బాబ్లీ ప్రాజెక్టు విషయంలో ఆంధ్రప్రదేశ్ నుంచి ఎదురైన అభ్యంతరాల వల్ల ప్రాణహిత విషయంలో అడ్డుపుల్ల వేయడానికి మహారాష్ట్ర ప్రయత్నించొచ్చన్న వాదన ఉన్నప్పటికీ.. రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని మహారాష్ట్రతో చర్చలు జరిపితే ఈ అంశం ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. 
జాతీయ హోదాతోనే సత్వరం పూర్తి:
ప్రాణహితకు జాతీయ ప్రాజెక్టు హోదా లభిస్తే కేంద్రం 90% వాటాను, రాష్ట్రం 10% వాటాను భరించవలసి ఉంది. ప్రాణహిత ప్రాజెక్టు వ్యయం పోలవరం కన్నా రెట్టింపు ఉండడంతో ఈ ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా తీసుకుంటే త్వరగా పూర్తి చేసే అవకాశం ఉంది. పోలవరం ప్రాజెక్టుపై ఇప్పటికే 4 వేల కోట్లు ఖర్చు పెట్టగా ప్రాణహితపై కేవలం వెయ్యి కోట్లు రాష్ట్రపభుత్వం ఖర్చు పెట్టింది. 28 ప్యాకేజీలుగా విభజించిన ప్రాణహిత ప్రాజెక్టును రెండుదశల్లో పూర్తి చేయాలని ప్రభుత్వం ఇటీవల నిర్ణయించింది. ప్రాణహిత ప్రాజెక్టు నిర్మాణ స్థలం నుంచి మధ్యమానేరు వరకు నిర్ణయించిన తొమ్మిది ప్యాకేజీ పనులను, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలకు నీరందించే ఐదు ప్యాకేజీలను రూ.24,000 కోట్ల వ్యయంతో నాలుగు సంవత్సరాల్లో పూర్తి చేయాలని ఇటీవల నిర్ణయించింది. మిగిలిన 14 ప్యాకేజీల పనులను మరో ఏడేళ్ళకాలంలో పూర్తి చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుత బడ్జెట్‌లో ఇప్పటి వరకు కేవలం 54 కోట్ల రూపాయలు కేటాయించడంతో కాంట్రాక్టర్లు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 
                కేంద్ర జలసంఘం సూత్రపాయమైన అనుమతులనిచ్చిన మూడు సంవత్సరాల్లోగా మిగిలిన అనుమతులను పొందకపోతే మొదటఇచ్చిన అనుమతులను కూడా రద్దు చేసే అవకాశం ఉంది. ప్రాణహిత పనులను కేవలం రాష్ట్ర ప్రభుత్వం చేపడితే ప్రభుత్వం చెప్పే లెక్క ప్రకారం ఇది పూర్తి కావడానికి 11ఏళ్ల కాలం పడుతుంది. ఈ వ్యవహారం చూస్తుంటే సర్కారుకు ఈ ప్రాజెక్టుపై చిత్త శుద్ధిలేదని స్పష్టమౌతోందని నిపుణులు విమర్శిస్తున్నారు.ఆదిలాబాద్ జిల్లా కౌటాల మండలం తుమ్మిడినెట్టి వద్ద ప్రాణహిత నదిపై బ్యారేజీ నిర్మించి ఎత్తిపోతల ద్వారా నీటిని తరలిస్తారు. ప్రాజెక్టు ప్రారంభ స్థలం వద్ద 236.5 టీఎంసీల నీరు లభ్యమవుతుందని కేంద్ర జలవనరుల సంఘం అంచనా వేసింది. ఈ ప్రాజెక్టు మొత్తం కాలువల పొడవు 1055 కిలోమీటర్లుగా అంచనా వేశారు. 22 లిఫ్ట్‌ల ద్వారా నీటిని తరలించడానికి 3466 మెగావాట్ల విద్యుత్ అవసరమవుతుంది. ఎల్లంపల్లి ద్వారా మరో 20 టీఎంసీల నీటిని కూడా ఈ ప్రాజెక్టు ద్వారా వినియోగించుకునే అవకాశం ఉంది. ప్రాజెక్టు నిర్మాణం కోసం మొత్తం పనులను 28 ప్యాకేజీలుగా విభజించి కాంట్రాక్టు పనులను అప్పగించారు. 

13, నవంబర్ 2011, ఆదివారం

తెలంగాణా ప్రజలను వంచించిన భారత ప్రభుత్వం....


తెలంగాణా పై యు పీ ఎ విధానమేమిటి అనేది నిన్న ప్రధాని, ఆర్ధిక మంత్రి ల వ్యాక్యాలతో తెలిసి పోయింది, తెలంగాణా రాష్ట్రం ఇవ్వడం పరిష్కారం కాదని, ప్రత్యామ్నాయాల్ని అన్వేషించి ఒక ప్రకటన చేస్తామని దాన్ని అందరు ఆమోదిన్చేల ఒప్పిస్తామని ప్రధాని అన్నారు, కాంగ్రెస్ చిన్న రాష్ట్రాలకు వ్యతిరేకం అని ప్రణబ్ అన్నారు, అధికారానికి 10 సంవత్సరాలు దూరంగా ఉన్న కాంగ్రెస్, 2004 లో దేశవ్యాప్తంగా అనేక చిన్నచితకా పార్టీలతో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ టి ఆర్ ఎస్ తో పొత్తుపెట్టుకొని తెలంగాణా ఏర్పాటుకోసం రెండవ ఎస్ ఆర్ సి వేస్తామని చెప్పారు, ఆ తర్వాత తెలంగాణా ఏర్పాటుకోసం సుధీర్గ చర్చల అనంతరం తెలంగాణా ఏర్పాటుచేస్తామని యు పీ ఎ కామన్ మినిమం ప్రోగ్రాంలో చేర్చారు,  ఆ తర్వాత రాష్ట్రపతి ప్రసంగంలో తెలంగాణా అంశం చేర్చారు, 2009 ఎన్నికల ముందు తెలంగాణా ఏర్పాటుకు కాంగ్రెస్ సుముఖంగా ఉందని, రోశయ్య కమిటిని వేసారు రాజశేకర్ రెడ్డి, చివరగా 2009 లో కేంద్రం తెలంగాణా ఏర్పాటుచేస్తామని, దానికి సంబంధించిన తీర్మానం అసంబ్లీ లో ప్రవేశ పెడతామని చెప్పారు, ఆ మాట నుండి వెనక్కి వెళ్లి నిన్న ప్రధాని, కేంద్ర ఆర్ధిక మంత్రి యు పిఎ తెలంగాణా రాష్ట్రము ఏర్పాటు చెయ్యడానికి, బదులుగా ప్యాకేజి, రీజినల్ కమిటి లు ఏర్పాటు చెయ్యడానికి రంగం సిద్ధమైంది, కాంగ్రెస్ తన సాచివేత ధోరణి, తన చేతకాని తనాన్ని మరో సారి బయటపెట్టింది, ఎ ఎండకు ఆ గొడుగు పట్టేరకం, ఓడ దిగాక బోడి మల్లయ్య అనే రకం అనే విషయం అర్థం అవుతుంది, తనిచ్చే మాటను కూడా తాను నిలబెట్టుకోలేని చేతకాని చేవచచ్చిన ప్రభుత్వాలు ప్రజలనుండి ఓట్లు దండుకోవడానికి అడ్డమైన వాగ్ధానాలు చేసి జనాన్ని వంచించి మోసం చేసి మల్లి ఎన్నికల నాటికి జనాన్ని మబ్యపెట్టి పబ్బం గడుపుకొనే దరిద్రపు , దిక్కుమాలిన ప్రభుత్వాలను నమ్ముకోవడం వలన ఇంతకంటే గొప్పగా జరుగుతుంది అని ఆశించడం మన వెర్రితనం,  ఇక సమ్మెలు, ఉద్యమాలతో తెలంగాణా రాదని తెలిసి పోయింది, ఇక ఆయుధం పూర్తిగా ప్రజల చేతుల్లో ఉంది, మల్లి ఈ పనికి మాలిన, చవటలను(కాంగ్రెస్, టి డి పి) ఎన్నుకుంటే ఇక తెలంగాణా అనేది రానే రాదు, ఇకనైనా జనం ఓట్లు సరైన వారికి వేసి సరైన వారిని ఎన్నుకుంటే తెలంగాణా సాధించవచ్చు... ఈ కింది విడియో కు ప్రధాని చెప్పే సమాధానం ఏమిటి, నిజంగా ప్రజాస్వామ్యంలోనే తెలంగాణా ప్రజలు ఉన్నారా..? లేక స్వతంత్ర భారతంలో ఉన్న భానిసలు ఎవరైనా ఉన్నారా అంటే అది తెలంగాణా ప్రజలు అనడానికి ఈ కింది విడియో ఒక నిదర్శనం.....

10, నవంబర్ 2011, గురువారం

నీళ్ళ దోపిడి-కృష్ణా బేసిన్.

"విశాలాంద్రలో మునుముందు అభివృద్ది పతకాలను చేపట్టినపుడు తెలంగాణా హక్కులకు తగిన గుర్తింపు లభించకపోవచ్చును అనే భయం ఆ ప్రాంతంలో ఉన్నదీ. ఉదాహరణకు : నందికొండ (కృష్ణ), కుష్ట పురం (గోదావరి) వంటి ప్రాజెక్ట్లు తెలంగాణాలోనే కాకమొత్తం దేశంలోనే చేపట్టిన పథకాలలో ముక్యమైనది, ఈ రెండు పెద్ద నదులపై సేద్యపు పథకాలు చేపట్టాలనే ఆలోచన కోస్తా ప్రాంతంలో కూడా ఉంది, ఈ పరిస్థితిలో కృష్ణ గోదావరి జలాలలో ప్రస్తుతం తమకున్న స్వతంత్ర అధికారాన్ని కోల్పోవడానికి తెలంగాణా ప్రాంతం సిద్ధంగా లేదు. (ఎస్.ఆర్.సి రిపోర్ట్ పేరా 377 )
అనుకున్నట్టుగానే జరిగింది, నది జలాల కేటాయింపులో వాటి వినియోగంలో ఈ ప్రాంతానికి జరిగిన అన్యాయం అతి దారుణం.
* ఆంద్ర ప్రదేశ్ అవతరణకు పూర్వమే అప్పుడున్న హైదరాబాద్ ప్రభుత్వం కొన్ని ప్రాజెక్ట్లను కృష్ణ నదిపై చేపట్టింది, వాటి కొరకు 560 టి ఎం సి ల నీటిని కేటాయించింది.
* అప్పటి ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్ట్లలో నల్లగొండ, ఖమ్మం జిల్లాల కొరకు 161 టి ఎం సి ల సామర్ధ్యంతో నంది కొండ, మహబూబ్ నగర్ కొరకు 100 టి ఎం సి ల భీమ, 54 .40 టి ఎం సి ల సామర్థ్యం కల అలమట్టి లు ప్రధాన మైనవి.
* 1956 లో రాష్ట్రాల పునర్ వ్యవస్తికరణ జరిగింది, కొత్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి, ఐన ఈ ప్రాజెక్ట్లు పూర్తి చెయ్యాలని భారత పార్లమెంట్ నిర్ణయించింది.
* కృష్ణ నది జలాలను కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర సమంగా పంచడానికి కేంద్రం బచావత్ ట్రిబునల్ను ఏర్పాటు చేసింది.
* 1973 లో ట్రిబునల్ ఇచ్చిన తీర్పు ప్రకారం ఆంద్ర ప్రదేశ్ కు  811 టి ఎం సి ల నికర జాలం, దానిని మించి మిగులు జలాలు వాడుకునే హక్కు లభించింది.
* ఆంద్ర ప్రదేశ్ లో కృష్ణ పరివాహక ప్రాంతం తెలంగాణా లో 68 .5 %, ఆంద్ర లో  13 .11 % , రాయలసీమలో 18 .39 % ఉంది.
* కృష్ణ పరివాహక ప్రాంతంలో సాగుకు అనుకూలంగా ఉన్న భూమిలో 70 % తెలంగాణాలోనే ఉంది కాబట్టి ట్రిబునల్ ఇచ్చిన 811 టి ఎం సి ల నీటిలో తెలంగాణా కే ఎక్కువ భాగం నీరు లభించాలి.
* కాని  70 % పరివాహక ప్రాంతం ఉన్న తెలంగాణకు 277 .86 టి ఎం సి లు అంటే కేవలం 34 .26 % నీటిని కేటాయించారు, అదే ఆంద్ర లో కేవలం 13 .11 % మాత్రమే పరివాహక ప్రాంతం మాత్రమే ఉన్నది కాని వారికీ 388 .44 టి ఎం సి లు అంటే 47 .90 % నీరు అందుతున్నది, ఇక రాయల సీమ లో 18 .30 % పరివాహక ప్రాంతం ఉన్నదీ వారికి 17 .90 % నీరందు తున్నది, అయితే తెలంగాణా కు ఆ 277 టి ఎం సి ల నీరుకూడా అందడం లేదు, అతి కష్టం మీద తెలంగాణాకు అందుతున్న నీరు ఎంత అంటే 120 టి ఎం సి లు అంటే కేవలం 15 % నీరు మాత్రమే కృష్ణ నది నుండి తెలంగాణకు లభిస్తున్నది.


ప్రకాశం బ్యారేజి: ఇది కేవలం కోస్తా ప్రాంతానికి మాత్రమే పనికి వచ్చే ప్రాజెక్ట్.
* దీనికి కేటాయించింది 181 .20 టి ఎం సి లు. ఈ నీటితో 12 లక్షల ఎకరాల్లో మాగాణి పండించవచ్చు.
* కాని దీని కింద 13 లక్షల ఎకరాలు ఖరీఫ్ , 7 లక్షల ఎకరాలు రబీ లో  వరి పండిస్తున్నట్లు రెవెన్యు లెక్కలు చెప్తున్నాయి.
* అంటే 330 టి ఎం సి ల కంటే ఎక్కువ నీరు అవసరం, అయితే 181 .20 టి ఎం సి ల నీటిని మత్రమ నాగార్జున సాగర్ నుండి వదలాలి, అయితే మిగిలి నీరు ఎక్కడనుండి వస్తుంది..?
* ఆ నీరు కూడా నాగార్జున సాగర్ నుండే వాదులు తున్నారు, అది సాగుకోసం అని కాక విద్యుదుత్పత్తికి అని చెప్తున్నారు, అయితే నాగార్జున సాగర్ లో విద్యుదుత్పత్తికి వదిలిన నీటిని రివర్స్ టర్బన్ ల ద్వారా డాం లోకి తిరిగి పంపాలి, అయితే దీనికి టెయిల్ పాండ్ ను సాగర్ దిగువ భాగంలో నిర్మించాలి , కాని ఇంతవరకు అలాంటి ప్రయత్నం జరగలేదు.
దాని వలన సాగార్నుండి కాలువలకు అందవలసిన నీరు డెల్ట ప్రాంతానికి తరలి వెళ్తుంది.




నాగార్జున సాగర్: ఆంద్ర ప్రదేశ్ ఏర్పడక ముందే నంది కొండ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని అప్పటి హైదరాబాద్ ప్రభుత్వం 161 టి ఎం సి ల సామర్థ్యం తో ఉండే విధంగా నిర్మాణం చేపట్టింది.
* ఉమ్మడి రాష్ట్రము ఏర్పడ్డాక ఇరు ప్రాంతాలకు నీరందించాలని దాని స్థలాన్ని, పేరును మార్చారు, నాగార్జున సాగర్ పేరుతో ప్రాజెక్ట్ను నిర్మించారు.
* ప్రాజెక్ట్ ప్రారంభించినపుడు హైదరాబాద్ రాష్ట్రానికి 132 టి ఎం సి లు, ఆంద్ర రాష్ట్రానికి 132 టి ఎం సి ల నీరు అందించాలని అనుకున్నారు, కాని ఉమ్మడి రాష్ట్రము ఏర్పడగానే, తెలంగాణా కు వచ్చే ఎడమ కాలువ లెవెల్స్, ఎలైన్ మెంట్ లలో మార్పు చేసి 106 .2 టి ఎం సి లకు తగ్గించడమే కాక ఆంద్ర ప్రాంతానికి వెళ్ళే కుడి కాలువను పొడగించారు.
* ఈ పరిణామంతో తెలంగాణకు అందుతున్నది కేవలం 85 నుండి 90 టి ఎం సి ల నీరు మాత్రమే. ఆంధ్రలో కుడి కాలువ కింద 15 లక్షల ఎకరాలకు నీరందుతుంటే, తెలంగాణకు కేవలం 5 లక్షల ఎకరాలకు కూడా నీరు అందడంలేదు.
* అంటే కోస్తాకు మొత్తం 811 టి ఎం సి లలో 580 టి ఎం సి లు అంటే 71 % నికి పైచిలుకు వెళ్తుంటే, తెలంగాణా, రాయలసీమలకు 230 టి ఎం సి ల నీరు అందుతున్నది.


శ్రీ శైలం: శ్రీ శైలం మొదట విద్యుత్ ఉత్పత్తికి నిర్దేశించారు కాని ఆ తరువాత సాగు నీటి కొరకు వాడుకోవాలని నిర్ణయించుకున్నారు.
* 1981 లో జరిగిన ఒప్పందం ప్రకారం 48 టి ఎం సి ల నీరు రాయలసీమకు, 50 టి ఎం సి ల నీరు తెలంగాణకు ఇవ్వాలి.
* అయితే 1983 లో రాయలసీమ కు వెళ్ళే కుడి కాలువతో గాలేరు-నగరి, హంద్రినీవ, తెలుగు గంగలను జోడించి 48 టి ఎం సి ల కంటే ఎక్కువగా తీసుకోవడం ప్రారంభించారు.
* దీనికి మూడు తూములు పెట్టారు ఒకటి కుడి కాలువ కొరకు, రెండోది తెలుగు గంగ కొరకు, మూడోది ఎస్కప్ ఛానల్ అని. మొత్తం గా గ్రావిటి పద్ధతిలో ఈ మూడు తుముల ద్వారా 200 టి ఎం సి ల నీటిని పొందవచ్చు, అంతే కాకూడ కుడి గట్టు కాలువ కోసం 20 టి ఎం సి ల నికర జలాన్ని కేటాయించారు.
* ఇక తెలంగాణా లోని ఎడమగట్టు కాలవకు గ్రావిటి ద్వారన, లేక ఎత్తిపోతల ద్వార నీరివ్వాల అన్నది నిర్ణయించలేదు.
* కేటాయించిన నీటిని 26 టి ఎం సి లకు కుదించి, అవి కూడా మిగులు జలాలకు పరిమితం చేసారు.
* అయితే నాగార్జున సాగర్కు మిగిలిన జలం తరలించి అక్కడనుండి ఎలిమినేటి మాధవ రెడ్డి అనే కాలువ నిర్మించి దాని ద్వార ఎడమకాలువ కు నీరిస్తారట..!అయితే అది కూడా నాగార్జున సాగర్ లో 510 అడుగులకు పైగా నీరుంటేనే, అంటే శ్రీ శైలం నుండి తెలంగాణకు నీరు రాదన్న మాట..


జూరాల: జూరాల అన్నింటికంటే చిన్న ప్రాజెక్ట్.
* మహాబూబ్ నగర్ కు నీరందివ్వడం దీని లక్ష్యం.
* ప్రాజెక్ట్ పని మొదలయ్యి 25 సంవత్సరాలు దాటిన ఇంకా కాలువల పనులు ముగియలేదు.
* దీనికి మొదట 17 .84 టి ఎం సి ల నీటిని కేటాయించిన 11 టి ఎం సి లకే దీని సామర్థ్యాన్ని పరిమితం చేసారు.ఇందలో కూడా ఇప్పటివరకు వాడకంలోకి వచ్చింది కేవలం మూడు లేక నలుగు టి ఎం సి లు మాత్రమే.
రాజోలిబండ మళ్లింపు పథకం: ఇది నిజాం రాజు ప్రారంభించిన పథకం, మహబూబ్ నగర్ కోసం ఉద్దేశించిన పథకం.
* ట్రిబునల్ తీర్పు ప్రకారం దీనికి 15 .9 టి ఎం సి ల నికర జలం కేటాయించారు.
* అయితే కర్నూల్ లోని కొందరు భూస్వాములు గేట్లను నిరంతరం తెరిచిఉంచి, బాంబులతో గేట్లను బద్దలు కొట్టి నీటిని అక్రమంగా తరలించుకొని వెళ్తున్నారు, ఇప్పటికి ఇలాంటి సంగటనలు అనేక సార్లు జరిగిన పట్టించుకునే నాధుడే లేదు.
* ఈ ప్రాజెక్ట్ కింద 87 వేల 5 వందల ఎకరాల భూమి సాగు కావాల్సి ఉండగా, దాదాపు మొత్తం బీడుగానే ఉంటుంది.
* ఇది చాలదన్నట్టు రాజోలి బండ నుండి నీరు రావాల్సిన భూములకు జురలనుంది ఇవ్వాలని ప్రయత్నిస్తున్నది ప్రభుత్వం, అయితే ఇలా చేస్తే జూరాల రైతుల నోట్లో మట్టి కొట్టడమే అవుతుంది.


పులి చింతల: ఇప్పటికి జరిగిన అన్యాయాలు చాలవన్నట్టు డెల్టాప్రాంత ప్రజలకు మరింత లాభం చేకూర్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది, దీని ద్వారా నల్లగొండ జిల్లా తీవ్రంగా నష్ట పోతుంది.
* నల్లగొండ లోని విలువైన ఖనిజలతో పటు, అనేక గ్రామాలూ ముంపుకు గురవుతాయి.
* గోదావరి నీటిని కృష్ణ బేసిన్కు తరలించడమే ఈ ప్రాజెక్ట్ ముక్య ఉదేశ్యం.

నేటి వార్త (10 /11 /2011 )

1 . తెలంగాణ ఉద్యమంలో నక్సల్స్ లేరని డీజీపీ దినేష్‌రెడ్డి స్పష్టం చేశారు. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు గన్‌మెన్‌లకు వదులుకుంటే తాము ఏం చేయలేమని తెలిపారు. 
2 . తెలంగాణ ఉద్యమంలో భాగంగా ఈ నెల 16 నుంచి 21 వరకు పది జిల్లాల్లో టీఆర్‌ఎస్ నేతలు పాదయాత్రలు చేపట్టనున్నట్లు ఆ పార్టీ అధినేత కె.చంద్రశేఖరరావు వెల్లడించారు. టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూర్ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పాదయాత్రలతో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు. తమ రాజీనామాలు ఆమోదించనందుకు గానూ చట్టసభల్లో పాల్గొని సభలను స్తంభింపజేస్తామని చెప్పారు. అసెంబ్లీ, పార్లమెంట్ సమావేశాలను స్తంభింపజేయాలని నిర్ణయించామని పేర్కొన్నారు.
3 . తెలంగాణపై వెంటనే ప్రకటన చేయకపోతే ఉద్యమం తీవ్రతను కేంద్రం ఎదుర్కొవలసి వస్తుందని టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ హెచ్చరించారు. కాంగ్రెస్ అధికార ప్రతినిధులు రోజుకో ప్రకటనతో తెలంగాణ ప్రజలను, మీడియాను గందరగోళానికి గురిచేస్తోందని కేసీఆర్ మండిపడ్డారు. ఎస్సార్సీ, గిస్సార్సీలను కట్టిపెట్టి 1956కు ముందున్న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేంద్రం ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే తుఫాను ఉధృతితో తెలంగాణ ఉద్యమం ఎగసిపడుతోందని, జరిగే పరిణామాలకు కేంద్రమే బాధ్యత వహించాలన్నారు. ఇంకా ఎన్ని విధాలుగా ఉద్యమాలు చేస్తే తెలంగాణ ప్రజల ఆకాంక్ష కేంద్రానికి తెలుస్తుందని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమకారులపైన పీడీ యాక్ట్ లాంటి నల్ల చట్టాలను ప్రయోగిస్తూ ప్రభుత్వం దమనకాండకు పాల్పడుతున్నదని మండిపడ్డారు. చెరుకు సుధాకర్‌పై పెట్టిన పీడీ యాక్ట్‌ను ఉపసంహరించుకొని, ప్రభుత్వం వెంటనే ఆయనను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాజకీయ శక్తితోనే తెలంగాణ సాధించాలని 2001లోనే తాను చెప్పానని గుర్తు చేశారు.
4 . ఈ నెల 22వ తేదీ లోపు తెలంగాణపై కేంద్రం స్పందించకపోతే సేవ్ డెమోక్రసీ పేరుతో సత్యాగ్రహ యాత్ర చేస్తానని కొండా లక్ష్మణ్ బాపూజీ పేర్కొన్నారు. తమ యాత్ర శాంతియుతంగా కొసాగుతోందని తెలిపారు. గన్‌పార్క్ వద్ద ఆయన అమరవీరుల స్థూపానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 22న ఢిల్లీలోని రాంలీలా మైదానం నుంచి పార్లమెంట్ వరకు ర్యాలీ చేపడుతామని తెలిపారు. తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టే వరకు పార్లమెంట్‌ను స్తంభింపజేయాలని ఆయన ఎంపీలను కోరారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడే దాకా తమ నిరసనలు కొనసాగుతాయని చెప్పారు.
5 . రంగారెడ్డి జిల్లా కీసరలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ కు మహిళలు చుక్కలు చూపించిన్రు. రూపాయికి కిలో బియ్యం పథకంపై సీఎంతో సహా రచ్చబండకు హాజరైన నేతలను కడిగిపారేసిన్రు. దిక్కుమండ్ల బియ్యాన్ని ఎట్ల తినాలంటూ.. గల్లపట్టినంత పనిచేసిన్రు. నిత్యావసరాల రేట్లు దించినంకనే మాట్లాడాలంటూ.. నిలదీసిన్రు. దీంతో బిత్తరపోయిన నేతలు మహిళలను సముదాయించేందుకు విఫలయత్నం చేసిన్రు.