ముందుగా అనుకున్నట్టే గడువు సమయానికి ఒక రోజు ముందే షిండే ప్రకటన వచ్చింది, తెలంగాణా కు సంభందించి సంప్రదింపులు జరుగుతున్నాయి, ఇవి పూర్తవ్వడానికి మరికొంత సమయం పడుతుంది, అవి ఎప్పటికి పూర్తవుతాయో తెలియదు, డెడ్ లైన్ ఏమి లేదు అని షిండే ఉవాచ.
ఈ మాత్రం తొక్కలో ప్రకటన చెయ్యడానికే ఇన్ని సార్లు కోర్ కమిటి బేటిలు, సోనియా తో బెటిలు దొంగ నాటకాలు పెద్ద కొండను తవ్వి వీళ్ళు పట్టుకున్నది ఏముంది అంటే అక్కడ ఏమి లేదు, సాఆఆగ దీయడం మినహా కాంగ్రెస్ కు మరోటి చేత కాదు అని అర్థం అయ్యింది మరోసారి, డబ్బులకు అమ్ముడు పోయిన ఆంద్ర వాళ్ళ గులాం మొత్తానికి ప్రకటనను వాయిదా వేయించాగాలిగాడు.
ఈ సమస్యను ఇప్పట్లో తేల్చారు దీనిని ఇలాగె 2014 వరకు సాగదీస్తారు, 2014 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి వోటు వెయ్యండి మేము తిరిగి అధికారంలోకి వస్తే తెలంగాణా ఇస్తాము అని ప్రచారం చేస్తారు, ఇదే వీరి వ్యూహం, ఇక ఎలాగో అధిష్టానానికి సు సు పోసుకునే మన కాంగ్రెస్ మంత్రులు, ఎం పీ లు ఇంకా సోనియా గాంధీ తెలంగాణా ఇస్తుందన్న నమ్మకంతో ఉన్నారట.. రాజీనామాలు చేస్తే తెలంగాణా వస్తుందని చెపితే ఇప్పుడే రాజీనామాలు చేస్తారట, తెలంగాణా సమస్య పరిష్కారం కోసం కేంద్రం కొంత సమయం తీసుకుందే కాని తెలంగాణా ఇవ్వమని చెప్పలేదట, ఒక వేల ఇవ్వనని చెప్పిన మరుక్షేనం పార్టీ వదులుతారట ఈ వెధవలు.
చచ్చిన పాముకైన తోక కదులుతుంది కాని మన తెలంగాణా మంత్రులకు మాత్రం చీము, నెత్తురు, సిగ్గు, మానం లాంటివి ఏమి లేవు, వీళ్ళు కనీసం ఈ మధ్య కనిపించడమే మానేసారు, జీవించే ఉన్నారా..? అనేది నా అనుమానం. కాంగ్రెస్ తెలంగాణా ఇవ్వకపోతే మర్రి చెన్న రెడ్డి లాగ కాంగ్రెస్ నాయకులంతా బయటికి వచ్చి తెలంగాణా కాంగ్రెస్ ను ఏర్పాటు చేస్తారట..? కేంద్రం ప్రకటన చేస్తే వెంటనే పార్టీని విలీనం చేస్తారట..? ఒక వేల ప్రకటన చెయ్యక పోతే ఎన్నికలకు వెళ్లి ఎన్నికల తర్వత కాంగ్రెస్ తెలంగాణా ఇస్తే అందులోకి వెళ్తారట..? ఇదే మరి పరమ విధేయత అంటే, గెలవాలంటే కాంగ్రెస్ ను వీడాలి,, కాని గెలిచాక మల్లి 5 సంవత్సరాలకు కదా జనానికి కనిపించేది అందుకే మల్లి కొంగ్రెస్ లో కలవాలి, వీళ్ళను నమ్మి ఎవరైనా ఓట్లు వేస్తే ఆత్మద్రోహం చేసుకున్నట్టే తప్ప ఇంకోటి కాదు..
ఇక చంద్రబాబు లేఖను సాకుగా పెట్టుకొని దొంగ నాటకాలు ఆడుతున్న టి డీ పీ తమ పార్టీ తెలంగాణా కు అనుకూలం అని చెప్పడానికి జనాల్లో టి డి పీ పై ఉన్న ముద్రను చెరిపివేయడానికి టిడిపీ వారు కూడా ఉద్యమాలు చేస్తారట..? చంద్ర బాబు తెలంగాణా కు వ్యతిరేఖం కాదు అంటూ జై తెలంగాణా అనమంటే అనడు, జై తెలంగాణా అని ఉన్న బోనాన్ని దించి జై తెలుగుదేశం బోనం ఎత్తుకుంటాడు, ఇతన్ని ఎలా నమ్మేది ఓ వైపు సీమంద్ర లో సమైక్యంద్ర ఉద్యమాలు చేసిన నాయకులకు ఇది మింగుడు పాడడం లేదు, ఐన సమయం కోసం ఎదురు చూస్తున్నారు, చంద్ర బాబు పాపం పండాలి కదా..! ఈ రోజు వరకు ఎ నాడు ఉద్యమం లో కలిసి రాకుండా 1000 మంది విద్యార్థులు మరణించాక వారి మరణాలకు కారణమైన పచ్చపార్టీ నాయకులు ఈ రోజు తెలంగాణా ఉద్యమాలు చేసి తెలంగాణా సాధించడం కాదు, ఎన్నికల్లో గెలవడమే వీరి ఉద్దేశ్యం.
ఇక వై సి పీ తెలంగాణా లో తట్ట బుట్ట సర్దుకుంటుంది, జగనన్న వదిలిన భానం విరిగిపోయి కుర్చీ కి పరిమితం కావడం, ఒవైసీ బాణం గురితప్పి వాళ్ళ మీదే పడడము, తెలంగాణా వాదానికి జడిసి ఆ పార్టీ లో చేరాలని భావించినవారు కూడా దూరం కావడంతో పార్టీ దీపం కొడిగట్టింది, ఇక జగన్ పార్టీకి తెలంగాణలో పూర్తి వ్యతిరేక వాతావరణం ఓవైసి ను ఉసిగొల్పడం ద్వార వచ్చింది, ఒవైసీ కి ఆర్ధిక సాయం చేసి సభలను పెట్టించింది జగన్ ఎ అని తెలంగాణా వాదులు బలంగా నమ్ముతున్నారు, ఇక సమైక్యంద్ర అని నిన్న కాక మొన్న ప్రారంభమైన మరో రికార్డింగ్ డాన్స్ కు మద్దతుగా రాజీనామాలు చేసిన ఇద్దరు ఎం ఎల్ ఎ లు వై ఎస్ అర్ పార్టీ వాళ్ళే, వీరి రాజీనామాలు ఉత్తవే ఐన( కాంగ్రెస్ నుండి జగన్ పార్టీ లోకి జంప్ అయ్యారు, పార్టీ మారినప్పుడు పదవికి రాజీనామా చెయ్యకపోతే పార్టీ ఫిరాయింపుల చట్టం కింద అనర్హత వేటు పడే అవకాశం ఉంటుంది కాబట్టి, వారు అప్పుడు రాజీనామా చెయ్యకుండా సమైక్యంద్ర కోసం అని ఇప్పుడు నాటకాలు ఆడుతున్నారు), వై సి పీ తెలంగాణా కు పూర్తి వ్యతిరేఖం అనే భావన వచ్చింది, వీరు మరో మారు శర్మిలతో కృతజ్ఞత యాత్ర చేస్తారట..?
తెలంగాణా జె ఎ సి తలపెట్టిన తెలంగాణా సమర భేరి దీక్షలు కొనసాగుతున్నాయి, 36 గంటల ధీక్షలొ ఈ రోజు కె సి అర్ పాల్గొననున్నారు, 28 న విద్యార్ధి జాక్ తెలంగాణా విద్యార్థి మహా ప్రదర్శన నిర్వహించ నుంది, తెలంగాణా ఉద్యోగులు 100 రోజుల సమ్మెకు సిద్ధమయ్యారు, తెలంగాణలో మరో ప్రళయం సృష్టించాలి, అన్ద్రోల్ల ఆర్ధిక మూలాలను దేబ్బతీయాలి,. అన్ద్రోల్లకు సహాయనిరాయకరణ చెయ్యాలి, ఉద్యమం పందా మార్చుకొని కొంత తీవ్రంగా జరిగితేనే కాని తోలు మందం కాంగ్రెస్ లో చేలనం ఉండదు, 2014 లో కాంగ్రెస్ లేదా బిజేపీ లు గెలిచి తెలంగాణా ఇస్తాయని ఆశ పడే కంటే తెలంగాణా పార్టీకి అత్యదిక ఎం పీ స్థానాలను కట్టబెడితే ఆ కాంగ్రెస్, బిజేపీ లే మన దగ్గరికి వచ్చి తెలంగాణా ఇస్తాయి, యాచించి కాకుండా శాసించి తెలంగాణా తెచ్చుకుందాం..
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి