హోం

26, జనవరి 2013, శనివారం

తొండ ముదిరి ఉండవెల్లి అయ్యింది.. ఒక పిట్ట కథ!!

                              
మొన్న రాజమండ్రిలో ఒక పెద్దాయన సభ నిర్వహించిండు, పధకం ప్రకారం జై ఆంద్ర అని ముందు ప్రకటించి తర్వాత జై ఆంద్ర ప్రదేశ్ అని మార్చిండు, దీనికి రాష్ట్ర మంత్రులు( ఆంద్ర ) , ఎం.పీలు , ఎం ఎల్ ఎ లు, కార్యకర్తల తో పాటు తెలుగు దేశం, వై ఎస్ అర్ పార్టీ ల కార్య కర్తలు కూడా హాజరయ్యారు. ఉండవెల్లి ఎం చెప్తారా అని అందరు ఆసక్తిగా ఎదురు చూసారు, ఇన్నిరోజులు సమైక్యంద్ర అంటే జనమే కనిపించలేదు, కాని ఈ రోజు ఓ మోస్తరు జనం కనిపించేసరికి సీమంద్ర ఛానల్ లు పండుగ చేసుకున్నాయి( ఈ టివి2 తప్ప, ఎందుకంటే మార్గదర్శి వ్యవహారం బయటకు తెచ్చారు కదా). దీనికి పీ సి సి చీఫ్ బొత్స కూడా హాజారయ్యారు, దీనితో ఇదో కాంగ్రెస్ పార్టీ సమావేశం ఐపోయింది.
                          సభలో సుదీర్గంగా ఉపన్యసించిన ఉండవెల్లి, నిజాం కాలం నాటినుండి మొదలు పెట్టి ముల్కి ఉద్యమం, రాష్ట్ర విలీనం, పెద్ద మనుషుల ఒప్పందం, జై తెలంగాణా, జై ఆంద్ర ఉద్యమాలు, సిక్స్ పాయింట్ ఫార్ముల, టి అర్ ఎస్ పెట్టక ముందు కె సి అర్, పెట్టిన తర్వాత కె సి అర్ ఇలా నేటి వరకు అన్ని విషయాలను తనదైన శైలి లో పిట్టకతలను చొప్పించి వీడియొ క్లిప్పులు చూపిస్తూ అక్కడున్న నాయకులను ఆకట్టుకోవాలని చూసారు,అయితే ఈ మీటింగ్ కు జై ఆంధ్రప్రదేశ్ అని పేరైతే పెట్టారు కాని అందులో ఒక్క తెలంగాణా నేత కూడా పాల్గొనలేదు, మరి అది జై ఆంద్ర ప్రదేశ్ ఎలా అయ్యిందో....

                        అబద్ధాలకు పిట్టకతలను జోడించి అందంగా సమైక్యంద్ర విషాన్ని జనానికి ఎక్కించాలని చూసాడు, నిన్న మొన్నటి వరకు తెలంగాణా ను అక్కడి ప్రజలు కోరుకోవడం న్యాయమె, వారెన్నడు మనతో కలవాలని అనుకోలేదు, మనమే కలిసాము అని సీమంద్ర విద్యార్థులతో చెప్పిన ఉండవెల్లి అకస్మాత్తుగా మాట మార్చారు, మీకు హైదరాబాద్ అవసరం లేదా అని అడిగి మరి మనల్ని వాళ్ళు కలుపుకున్నారు అని అసత్యపు మాటలు పలికారు, జవహర్ లాల్ నెహ్రు నిజామాబాద్ లో చేసిన స్పీచ్ తెలంగాణా వాదుల సృష్టి అని, విద్య ఉద్యోగాల్లో తెలంగాణా వాలు ఈ రోజు అభివృద్ధి చెందారని, విద్యుత్ వినియోగం పెరిగిందని ఇలా నోటికొచ్చినవన్ని చెప్పుకొచ్చారు, 2004 లో తెలంగాణా ఇస్తామని చెప్పలేదని తనను గతంలో చేసిన అనువాదాన్నే(సోనియా కరీం నగర్ స్పీచ్ ను తెలుగులోకి అనువదించాడు) విస్మరించాడు, సకల అభాద్ధాలు చెప్పి సీమంద్ర నాయకులను, ఆ సభ కు విత్తం సమకూర్చిన వారికి సంతృప్తిని కలిగించి తెలంగాణా వాదుల గుండెలు రగిల్చిండు, ఇన్ని ఏళ్ళ రాజకీయ అనుభవం కలిగిన ఈ వ్యక్తికి లాగడపాటి ఇచ్చిన సమాచారంతో కళ్ళు తెరుచుకున్నయట,తాను వాస్తవాలని నమ్మినవి, చూసినవి అన్ని అబద్దాలని తెలిసిందట, అందుకే సమైక్యంద్ర వాధీగా మారాడట..? నవ్వి పోదురు గాక నాకేమి సిగ్గు అంటూ విద్వేషాలను రగిల్చి మరుసటిరోజు తాను తెలంగాణా కు వ్యతిరేఖం కాదు అని, తన ఉపన్యాసం ద్వారా తెలంగాణా మేధావులలో చైతన్యం రగిలితే సంతోషం అని చెప్పుకున్నారు, ఇంత జరిగిన ఒక్క తెలంగాణా మంత్రి కూడా ఖండించలేదు, కనీసం స్పందించలేదు, తెలంగాణా నాయకత్వం పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తూ చిన్న చిన్న విషయాలను పెద్దవిగా చూపిస్తూ విషం కక్కాడు, ఈ మాత్రం కథలు మనం చెప్పలేమా..?

                                   పూర్వం ఒక ఊరిలో ఒక రైతు ఉండేవాడు అతనికి ఇద్దరు కొడుకులు, అతను చనిపోవడానికి ముందు తాను సంపాదించిన ఆవు, మామిడి చెట్టు, ఒక గొంగలి ఈ మూడింటిని ఇద్దరు సమానం గా పంచుకోండి అని చెప్పి చనిపోతాడు, అయితే పెద్దవాడు తమ్ముడిని పిలిచి తమ్ముడు నాన్న చెప్పినట్టు ఇద్దరం సమంగా పంచుకుందాం అని ఆవు ముందు బాగం నీకు వెనక భాగం నాకు, మామిడి చెట్టు మొదలు నీకు పైభాగం నాకు, దుప్పటి పగలు నీకు రాత్రి నాకు అని ఇలా పంచుతాడు, చిన్న వాడు ఆవుకు మేతవేస్తే పెద్దవాడు పాలు పిండుకునేవాడు, పేడతో పిడకలు చేసుకునేవాడు, చిన్న వాడు మామిడి చెట్టుకు నీళ్ళు పోస్తే పెద్ద వాడు పండ్లను తేమ్పుకునే వాడు, ఇక గొంగలి పగలు చిన్నవాడు ఉతికి ఆరేస్తే పెద్దవాడు రాత్రి ఎంచక్కా కప్పుకునే వాడు, ఇలా కొంతకాలం జరిగింది, ఇద్దరికి పెళ్ళిళ్ళు అయ్యాయి, చిన్నవాడి భార్య జరుగుతున్నదంతా గమనించి తన భర్త ను పిలిచి ఒక ఉపాయం చెప్పి ఆచరించమంటుంది, అలాగే అని చిన్నవాడు ఒక కర్రను తీసుకొని వెళ్లి మేత వేయకుండా ఆవును ముందు భాగంలో కొట్టడం ప్రారంభిస్తాడు, అప్పుడే పాలు పితుకుతున్న పెద్దవాడిని ఆ ఆవు తంతుంది, పాలు ఇవ్వదు, అప్పుడు ఎందుకు రా ఆవును కొడుతున్నావ్ అంటడు పెద్ద వాడు, ముందు భాగం నాది నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంట నీ కెందుకు అంటడు చిన్నవాడు , దీనితో విషయాన్ని అర్థం చేసుకున్న పెద్దవాడు సగం పాలు, పేడ ఇస్తానని ఒప్పుకుంటాడు, ఆతర్వాత చెట్టుకు నీళ్ళు పోయకుండా గొడ్డలితో నరుకుతుంటాడు చిన్నవాడు, అరె ఎందుకు రా చెట్టును నరికేస్తున్నావ్ అంటాడు పెద్ద వాడు నా మొదలు భాగం లో నేను నరుక్కుంటాను ఏమైనా చేసుకుంటాను అంటడు చిన్న వాడు, సగం పండ్లు ఇస్తా నని అంటడు పెద్దవాడు, ఆ రోజు ఉదయం కాకుండా సాయంత్రం గొంగాలిని ఉతికి ఆరేస్తాడు చిన్నవాడు, గొంగలి పచ్చిగా ఉండడంతో రాత్రి చలిలో పడుకుంటాడు పెద్దవాడు, అప్పుడు దారిలోకి వచ్చిన పెద్దవాడు, చిన్నవాడిని పిలిచి అతని వాట అతనికి ఇస్తాడు, ఈ కథలో పెద్దవాడు సీమంద్ర, చిన్నవాడు తెలంగాణా, మనం మన వాట అడుగనంత వరకు వాళ్ళు అలాగే దోచుకుంటారు,పోరాడే వరకు మనకు ఏది దక్కదు, ఆవును కొట్టినట్టుగా వీరి కుట్రలను తిప్పి కొట్టాలి, చెట్టును నరికినట్టుగా వీరి ఆర్థిక మూలాలను దెబ్బకొట్టాలి, సమైక్యంగా ఉండడం ద్వారా వారు పొందే ప్రయోజనాలను దెబ్బకొట్టాలి ఇలా చేయ గలిగితే సీమంద్ర పెట్టుబడి దారులు కూడా తోక ముడువక తప్పదు...

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి