హోం

23, జనవరి 2013, బుధవారం

మరో మోసం..!


తెలంగాణపై కేంద్రం నిర్ణయం తీసుకుంటుందని ఎదురు చుసిన తెలంగాణా ప్రజలకు మరో సారి నిరాశే ఎదురయ్యింది, కేంద్రం, కాంగ్రెస్ పార్టీ తెలంగాణా ప్రజలను మరోసారి ధోకా చేసింది, 28 లోపే తెలంగాణా పై ఏదో ఒక నిర్ణయం వెలువడుతుందని ఎదురుచుసారు తెలంగాణా వాదులు, తెలుగు మీడియా కేంద్రం తెలంగాణా ఇవ్వాలనే నిర్ణయం తీసుకుందని ప్రకటనే తరువాయి అని ఊదరగోట్టడం తో కాంగ్రెస్ తెలంగాణా ఇవ్వదు అనుకునే వారు సైతం తెలంగాణా ప్రకటన వస్తుందని ఆశగా ఎదురు చూసారు, ఈ డబ్బు స్వామ్యంలో ప్రజల ఆశలకు ఆకాంక్షలకు విలువ లేదు, కేవలం డబ్బు సంచులతోనే పని, డబ్బు చేతులు మారడం ఆలస్యం నెలకు 30 రోజులు కాకుండా పోతాయి, వారానికి 7 రోజులు కాకుండా పోతాయి. 
                         గత నెల FDI లపై ఓటింగ్ సందర్భంలో తెలంగాణా రాష్ట్ర సమితి కాంగ్రెస్ కు వ్యతిరేఖం గా ఓటు వేయ్యడం, టి కాంగ్రెస్ ఎం పీ ల ఒత్తిడి తో హోం మంత్రి షిండే 28 న అఖిల పక్షం నిర్వహిస్తామని హామీ ఇచ్చారు, హామీ ప్రకారం 28 ఆ భేటి జరిగింది, అఖిలపక్షం వట్టి డ్రామా అని టి అర్ ఎస్, బి జె పీ, సి పీ ఐ లు  మొదటినుండే చెబుతున్నాయి, అఖిలపక్షం అనంతరం అసంతృప్తి తో కె సి అర్ తెలంగాణా బంద్ కు పిలుపు ఇచ్చాడు, అఖిల పక్షం వాళ్ళ ఒరిగేదేమీ లేదని, ఇది మరో డ్రామా అని చెప్పారు, అఖిలపక్షంలో నిజానికి సీమంద్రకు చెందిన టి డి పీ, వై సిపీ లు సరైన అభిప్రాయాన్ని చెప్పలేదు, 2008 లో ఇచ్చిన లేఖ ఇంకా కేంద్రం వద్ద నే ఉందని దాని ఆధారంగా నిర్ణయం తీసుకోవాలని చంద్రబాబు లెటర్ ఇచ్చారు, కాని తెలంగాణా రాష్ట్రాన్ని ఇవ్వండి మేము మద్దతు ఇస్తామని రాయలేదు, అ అస్పష్ట లేఖ సాయం తో తెలంగాణా జిల్లాల్లో జరిగిన పాదయాత్రను పూర్తి చేసుకొని వెళ్ళిపోయాడు, ఇక జగన్ పార్టీ కి ఒక అభిప్రాయం అంటూ లేదు, నెల రోజుల్లో నిర్ణయం వెల్లడిస్తామని చెప్పిండు షిండే, టైం దగ్గర పడుతున్న కొద్ది సీమంద్ర కుట్రలు మొదలయ్యాయి, సమైక్యంద్ర అని ఒకడు, విశాలాంద్ర అని ఒక్కడు, హైదరాబాద్ రాష్ట్రం అంటూ ఇంకొకడు, హైదరాబాద్ ప్రజల రెఫరెండం అంటూ ఇంకొకడు, ఇలా కుట్రలకు తెరలేచింది, సీమంద్రమీడియా  అతి ప్రచారం జోరందుకుంది, హైదరాబాద్ లో పూర్తి పోలీస్ రక్షణల మధ్య వారి సభల నిర్వహణ ముఖ్య మంత్రి దగ్గరుండి పర్యవేక్షించుకున్నాడు, తెలంగాణా జె ఎ సి మాదురిగా సమైక్యంద్ర జె ఎ సి, మహిళా నాయకురాలితో జాగృతి, విద్యార్థి జె ఎ సి, సమైక్యంద్ర ఎన్ జి వో సంఘాలు ఏర్పాటు చేసుకొని ఉద్యమాన్ని ఉదృతం చేస్తారట, లక్ష మంది తో హైదరాబాద్ లో సభ నిర్వహిస్తారట..? మంత్రి గంటా ఉవాచ..
                        డిల్లి లో కాంగ్రెస్ పెద్దలను కలిసిన సీమంద్రులకు నిరాశ ఎదురవుతుందని, వారికి క్లాసు పీకి పంపుతున్నారని మీడియా కోడై కూసింది, ఇప్పటికైనా కేంద్రం తెలంగాణా పై నిర్ణయం తీసుకుందని, ఆనందించిన తెలంగాణా ప్రజలకు మరో సారి నిరాశే ఎదురయ్యింది, సీమండ్రుల డబ్బుకు భారత కాలమనమే మారిపోయింది, డబ్బు ఉంటె నెలకు 30 రోజులు కావు, ఎన్ని రోజులైనా కావచ్చు, డబ్బు చేతిలో పడితే వారానికి 7 రోజులు కావు భారత ప్రభుత్వం దాన్ని మార్చేస్తుంది.
                                    మరోసారి ప్రజాస్వామ్యం సీమంద్రుల డబ్బుకు అమ్ముడు పోయింది, తెలంగాణా ఆశలను ఆకాంక్షలను కాలరాసింది, మీరెప్పుడు సీమంద్రులకు బానిసలే అని చాటి చెప్పింది, మాకు ప్రజల ఆకాంక్షల కంటే డబ్బే ముఖ్యం అని నిరూపించుకుంది, భారత ప్రభుత్వం డబ్బు ఇస్తే ఏమైనా చేస్తుంది అని నిరూపించుకుంది , ప్రపంచం లో వేరే దేశాలలో డబ్బుతో జరగని ఎన్నో పనులు ఇక్కడ జరుగుతాయి, నమ్మి ఓటేసిన తమ ప్రజలనే మోసం చేసేంత గొప్పగా అమ్ముడు పోతుంది ఈ ప్రభుత్వం, ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్యం భారత దేశం, అలాగే ప్రపంచం లో డబ్బుకు అమ్ముడు పోయే అతి పెద్ద ప్రజా స్వామ్యము భారత దేశమే, ఇది నేడు ఎంతగా అమ్ముడు పోయిందంటే, ఈ ప్రభుత్వంలోని ఆరోగ్య శాఖ మంత్రి గారు ఏకంగా నెల రోజుల అర్థాన్నే మార్చేసారు, ప్రపంచం అంత నెల రోజులు అంటే 30 రోజులు అనుకోవడం సహజం కాని నెల అంటే 30 రోజులు కాదంట నెల అంటే వారికి నచ్చినన్ని రోజులు, ఇంకేం ప్రకటన వస్తుంది మన చచ్చిపోయిన పాములు(తెలంగాణా కాంగ్రెస్ లీడర్స్) తెలంగాణా ఎం తెస్తాయి..?అవి చావవు, తెలంగాణా తేవు.
                    ఇక ఇన్ని రోజులు ఏదో జరుగుతుందని ఎదురు చుసిన ఉద్యమ కారులు తమ డప్పులకు దుమ్ము దులుపి ధరువేస్తే ప్రజలంతా ఉద్యమం చెయ్యడానికి సిద్ధంగా ఉన్నారు, ఇక తెలంగాణా ప్రజల ముందు ఉన్న ఏకైక కర్తవ్యం కాంగ్రెస్ ను అంతం చెయ్యడం.. "కాంగ్రెస్ కో కథం కరో, తెలంగాణా హాసిల్ కరో".

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి