హోం

6, జనవరి 2013, ఆదివారం

కాలుష్య దీవి బడుగు జీవి..!



షాద్‌నగర్, టీ మీడియా : ఒకగొట్టంలోని పొగ ఆకాశమార్గాన ప్రయాణించి పచ్చని పంట పొలాలను లక్ష్యంగా చేసుకొని అన్నదాత జీవితంతో ఆడుకుంటోంది. మరో గొట్టంలోని రసాయనం నేలతల్లిని తడిపి భూమిలో ఇంకి పచ్చదనాలను కూకటివేళ్లతో పెకిలిస్తోంది. దాహం తీర్చే నీటిని సైతం ప్రజల కు దక్కకుండా మారుస్తోంది. స్థానికులకు ఉపాధిలేదు.. అనర్థాలు తప్పడంలేదు.. ఆందోళనలు చేసినా ఈ దారుణాలను ఆపేవారులేరు.. ఇది షాద్‌నగర్ నియోజకవర్గంలో కాలుష్యం జీవితాలను కాలరాస్తున్న తీరు.
కాలుష్యం ఇలా.. 
షాద్‌నగర్ నియోజకవర్గ పరిధిలో సుమారుగా 100కుపైగా భారీ తరహా పరిక్షిశమలు ఉన్నాయి. వీటిలో ఫార్మ, ఐరన్, బట్టలు, బ్యాటరీస్, వంటసామగ్రి వంటి వస్తువులు ఉత్పత్తి చేసే పరిక్షిశమలు ఉన్నాయి. ఈ పరిక్షిశమల్లో దాదాపు 10వేల మందికిపైగా కార్మికులు వివిధ రంగాల్లో పని చేస్తున్నారు. వందలాది ఎకరాల్లో పరిక్షిశమలు స్థాపించడంవల్ల వీటి నుంచి వెలువడే కాలుష్యతాకిడి వేలాది ఎకరాల పంట కాలుష్యం బారిన పడటమేకాకుండా వందల సంఖ్యలో మూగజీవాలు మృతి చెందుతున్నాయి. నియోజకవర్గ పరిధిలోని కొత్తూరు మండలంలో కొత్తూరు మండలం నందిగామలోని రాయలసీ మ రీరోలింగ్ మిల్, నందిగామలోని వక్షా స్టీల్స్, వీర్లపల్లిలోని శివశక్తి స్పాంజ్ ఐరన్, కొడిచర్లలోని ఆనంద్ స్పాంజ్ ఐరన్, పెంజర్ల రోడ్డులోని వివేక్ టెక్స్‌టైల్స్, కొత్తూరులోని వినాయక స్టీల్స్, తీగాపూర్ బింజు సార్య ఐరన్ ఇండస్ట్రీ, తిమ్మాపూర్‌లోని వంశీధార ఆయిల్ మిల్, దివ్యశక్తి పేపర్ పరిక్షిశమతోపాటు స్కాన్ ఐరన్ పరిక్షిశమలు విడుదల చేసే కాలుష్యబారిన పడి పల్లె ప్రజలు విలవిలలాడుతున్నారు. పరిక్షిశమలనుంచి వెలువడే కర్భన సమ్మెళనాలతో కూడిన వాయు, జల, ఘన పదార్థాల కాలుష్యానికి పల్లెజనం రోగాలబారీన పడుతున్నారు.

పాపం.. ఎంత నష్టం..
రసాయనాల దాటికి పంటలు ఎండిపోతుండగా పొగదాటికి నీరు నలుపురంగులోకి మారుతోంది. ఇళ్లల్లోని గిన్నెలతో సహా ఆహార పదార్థాలు విషంగా మారుతున్న పరిస్థితి నెలకొన్నది. మరోవైపు తాగునీరు ఎరుపురంగులోకి చేరి తాగేందుకు వీలులేకుండా మారాయి. ఇక్కడి కాలుష్యం దాటికి చెరువులు కూడా సాగునీటికి పనికిరాకుండాపోయాయి. ఫలితంగా నియోజకవర్గం ఓ కాలుష్య దీవిగా మారి రెక్కాడితేగానీ డొక్కాడని బడుగుజీవిని వేధిస్తోంది.

నష్టాలు.. ఇవి.. 
పరిక్షిశమల కాలుష్యం ద్వారా ఇక్కడ తాగునీరు పూర్తిగా క లుషితమైపోయింది. ఈ నీరు తాగితే రకరకాల రోగాలతోపా టు విష జ్వరాలు ప్రభలుతున్నాయి. ఒంటి నొప్పులు, ఎముకలు పనిచేయకపోవడం. వ్యక్తులు పూర్తిగా మంచాన పడే పరిస్థితి నెలకొన్నది. ఈ పరిస్థితులు అనుభవిస్తూనే మృత్యువాత పడిన సందర్భాలు ఉన్నాయి. మరోవైపు పశువులు కూడా లెక్కకు మించి మరణిస్తున్నాయి.

అసలుకే ఎసరు..
ఈ పరిక్షిశమలు ప్రారంభమైనప్పుడు స్థానికంగా అందరికీ ఉద్యోగాలు, ఉపాధి దొరుకుతాయని ఆశించారు. కానీ ఇక్కడ స్థానికులకు ఎలాంటి ఉద్యోగ అవకాశాలు కల్పించకపోగా పం ట పొలాలను నాశనం చేస్తూ అటు రైతులకు దిగుబడులులేకుండా కూలీలకు ఉపాధిలేకుండా చేస్తున్నారు పరిక్షిశమ యజమానులు ఇక్కడి పరిక్షిశమల్లో తెలంగాణ వాదులు ఒక్కరు కూడా కనిపించరు. సీమాంవూధవూపాంతంతోపాటు ఇతర ప్రాం తాల నుంచి వచ్చినవారే ఉన్నతస్థాయి ఉద్యోగాలు చేస్తున్నారు. కానీ తెలంగాణ ప్రజలు రోజువారి కూలీలుగానే వ్యవహరించే పరిస్థితి నెలకొంది. 

ఆందోళనపూన్నో.. 
కాలుష్యపు బారినుంచి తమకు విముక్తి కల్పించాలని ప్రతి యేట రైతులు ఆందోళన చేస్తూనే ఉన్నారు. అధికారులు మాత్రం పట్టించుకోవడంలేదు. కందివనం, ఎలికట్ట, ఇప్పలపల్లి, పెంజర్ల, తీగాపూర్ గ్రామాల పరిధిలో రైతులు ఎన్నోమార్లు ఆందోళన చేసిన సంఘటనలు ఉన్నాయి. న్యాయస్థానానికి కూడా ఆశ్రయించారు. పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలని ఉన్నత న్యాయ స్థానం ఆదేశించినా ఏనాడూ పట్టించుకున్న పాపానపోలేదు.

మాటలు.. మూటలు.. 
ఆందోళనలు జరిగినప్పుడల్లా కాలుష్య నివారణ అధికారులు, ఆర్డీఓలు, జేసీలు, కలెక్టర్లు వస్తున్నారు. పరిశీలిస్తున్నా రు. అలాగే స్థానిక ప్రజావూపతినిధులను మొదలుకొని ఎమ్మెల్యే లు, మంత్రులు వచ్చి హడావుడి చేస్తున్నారు. పరిశీలనలు, ప రామర్శలు సరేసరి కాని సమస్యలు మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా ఉన్నది. రైతుల ముందు ఏవో మాటలు చెప్పి పరిక్షిశమల యజమానుల వద్ద డబ్బుల మూటలు అందుకుంటున్నారనే ఆరోపణలు తీవ్ర స్థాయిలో ఉన్నాయి.                                  from namaste telangana

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి