హైదరాబాద్: కేంద్ర మంత్రులు సుశీల్‌కుమార్ షిండే, పి.చిదంబరంలపై రంగారెడ్డి జిల్లా కోర్టులో చీటింగ్ కేసు నమోదైంది. తెలంగాణను ఏర్పాటు చేస్తున్నట్టు ఒకరు, తెలంగాణ అంశంపై జనవరి 28లోగా నిర్ణయం ప్రకటిస్తామంటూ మరొకరు ఈ ప్రాంత ప్రజలను మోసం చేశారని, ఇద్దరు మంత్రులు చెప్పి మాట మార్చారని పేర్కొంటూ నరేశ్ అనే న్యాయవాది భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 420 కింద కేసు నమోదు చేశారు. పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన కోర్టు మంత్రులిద్దరిపై చీటింగ్ కేసు నమోదు చేయాలని ఎల్బీనగర్ పోలీసులను ఆదేశించింది. దీనిపై ఫిబ్రవరి 18లోగా నివేదిక సమర్పించాలని న్యాయమూర్తి పోలీసులను ఆదేశించారు.
-from namastetelangana
-from namastetelangana
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి