-కె వి పీ ప్రయత్నాలు?
-అందుకే తెలంగాణా ప్రకటనకు బ్రేక్ ?
సీమంద్ర నాయకులంతా డిల్లి వెళ్లి రానున్న తెలంగాణా ప్రకటనను అడ్డుకున్నారు, మొదట్లో వారిని చూస్తేనే ఆగ్రహించిన డిల్లి పెద్దలు ఆ తర్వాత ఎందుకు మేత్తపడ్డారు..? ఉంటె ఉండండి లేదా వెళ్లి పొంది మేము కొత్త టీం ను వెతుకుంటం అనే వరకు వచ్చిన వారు మల్లి వెనకడుగు ఎందుకు వేసినట్టు..? సీమంద్రలో ఎన్ని స్థానాల్లో పార్టీని గెలిపిస్తారు అంటే నీళ్ళు నములుకుంటూ వచ్చిన సీమండ్రులు ఎం మంత్రం వేసారు..? మొన్న నే ఆజాద్ క్లాసు పీకాడు, నిన్న మాట మార్చాడు ఒక్క రోజులో ఎం జరిగింది..? సీమంద్రుల డబ్బు సంచులు అందాయ..? లేక ఇంకేమైనా జరిగిందా..?
సీమంద్ర నాయకులందరిని డిల్లి తరలించి, డిల్లి పెద్దలతో అపాయింట్ మెంట్ ఇప్పించింది కె వి పీ, దీనంతటి వెనక కె వి పీ ఉన్నాడు, వై ఎస్ అర్ కు అత్యంత సన్నిహితుడైన కె వి పీ, జగన్ పార్టీ పెట్టిన తర్వాత కూడా కాంగ్రెస్ లోనే కొనసాగుతున్నారు, వై ఎస్ హయాంలో డిల్లి కి రిపోర్ట్ లు, డబ్బు మూటలు అందించిన కె వి పీ కి అధిష్టాన పెద్దలందరు బాగా పరిచయమే, సీమండ్రులు రాజీనామాలు చేసి అటు కేంద్రం లోను ఇటు రాష్ట్రం లోను ప్రభుత్వాన్ని పడగోడుతం అని బెదిరిస్తే కేంద్రం వెనకడుగు వేసిన్ధనుకోవడం సరి కాదు.
విశ్వసనీయ సమాచారం ప్రకారం " సీమంద్రలో ఎన్ని స్థానాలను ఇస్తారు అనే కేంద్రం ప్రశ్నకు సీమండ్రులు సమాధానం చెప్పలేక పోయారు, ఒకానొక దశలో కేంద్రం మీరు వెళ్లి పోతే వెళ్లి పొండి మేం కొత్త టీం వెతుక్కుంటం అన్నది, అయితే కె వి పీ వారికి చెప్పింది ఏమంటే, సీమంధ్ర లో జగన్ హవా చాల ఉంది, తెలంగాణా ఇచ్చిన మరుక్షణం చాల మంది నాయకులు ఈ కారణంతో జగన్ పార్టీ లోకి వెళ్తారు, కొత్త టీం ఏర్పాటు చేసుకోవడానికి కనీసం నాయకులు లేకుండా పోతారు, కాంగ్రెస్ పార్టీ మొత్తంగా తుడిచి పెట్టుకు పోతుంది, కాని రాష్ట్రాన్ని సమైక్యం గా ఉంచితే తెలంగాణా లోని అందరు నాయకులు టి అర్ ఎస్ లోకి వెళ్లరు, తెలంగాణా సెంటిమెంట్ బలంగా ఉండడం వళ్ళ చాల మంది నాయకులు జగన్ పార్టీ లోకి వెళ్ళడం లేదు, అలాగే హైదరాబాద్ నాయకులు టి అర్ ఎస్ లోకి వెళ్లరు, కాబట్టి వాళ్ళు అవకాశం దొరికితే జగన్ పార్టీలోకి వెళ్ళడానికి సిద్ధం గా ఉన్నారు, మీరు తెలంగాణా ఇవ్వక పోయినా పెద్ద గా పార్టీ కి నష్టం లేదు, ఒక ఆరు నెలలు పోలీస్ బలగాలతో ఉద్యమాన్ని అనచివేయండి, నాకు జగన్ కొడుకు లాంటి వాడు, నేను ఏది చెప్పిన కాదనదు, నేను జగన్ ను ఆరు నెలల్లో కాంగ్రెస్ లోకి తీసుకొని వస్తా, కాంగ్రెస్ నుండి బయటకు వెళ్తున్న సీమంద్ర నాయకులు, తెలంగాణా లో బయటకు వెళ్లాలనుకునే నాయకులు జగన్ కాంగ్రెస్ లోకి వస్తే కాంగ్రెస్ లోనే ఉంటారు, దూరమైనా ఎం ఐ ఎం కూడా మల్లి దగ్గరవుతుంది, కాబట్టి 2014 లోను కాంగ్రెస్ విజయం సాదిస్తుంది, కాబట్టి జగన్ ను పార్టీ లోకి తీసుకు వచ్చే భాద్యత నాది." ఇది కె వి పీ మంత్రాంగం, అందుకే మీ దగ్గర ఉన్న ఈ విషయాలను ముందే మాకు ఎందుకు చెప్పలేదు అని వాయిలార్ రవి అన్నారు, అవే విషయాలను నిన్న సోనియా తో చర్చించి బయటకు వచ్చిన ఆజాద్ మాట మార్చాడు...
ఈ కధనం జనవరి 24 న రాసి పోస్ట్ చేశాను, 25 వతేదిన ఇదే కంటెంట్ తో "జగన్ పై రామ బాణం" అనే పేరుతో సూర్య పత్రికలో కథనం వచ్చింది...
lucha rajakeeyalu, lucha lan.....kodukulu... cheee....thoooo.... veyi mandi pillala vusuru tagili sarvanaashanamu ayipotharu.
రిప్లయితొలగించండిOne assumption is incorrect in the statement highlighted, i.e. how would any congress leader dare to join jagan now? Even Komatireddy is reluctant to join him, considering the sentiment...
రిప్లయితొలగించండిAbsolutely right, now there is no hope that congress will give telangana... The only option is all the TELANGANA congress MLA & MPs should resign and join TRS immediately....
రిప్లయితొలగించండి