హోం

31, జనవరి 2013, గురువారం

ఎందుకు కాలిపోతవ్.. నువ్వు ఎందుకు రాలి పోతవ్ !!


ఈ రోజు పేపర్ తెరచి చూడగానే కనిపించిన విషాదకర వార్త ఒకే రోజు తెలంగాణ కోసం ముగ్గురు యువకులు ఆత్మహత్య చేసుకున్నారు అని, నిన్న గాక మొన్న ఒక పత్రిక విలేకరి మరణించిండు ఈ రోజు మరో ముగ్గురు, 2009 లో తెలంగాణా కోసం శ్రీకాంతచారి చేసిన తొలి బలిదానం తో మొదలైన బలవన్మరణాలు నేటికి కొనసాగుతున్నాయి, తెలంగాణా లో ఈ మూడేళ్ళలో సుమారు వెయ్యి మంది మరనిన్చారంటే ఇది ఎంత తీవ్రమైన సమస్యనో అందరు ఆలోచించాలి..
                             ఎందుకు కాలి పోతావు నువ్వు, ఎందుకు రాలిపోతావు కాలకు రా నువ్వు రాలకు రా, మాడి బూడిద కాకురా, మాడి బూడిద కాకురా.. నీకు అండగా ఉండే డాక్టర్లుండ్రు, ఆపద వస్తే లాయర్లుండ్రు.. నువ్వు యుద్ధం చేసి గెలుస్తానంటే సరిహద్దులు లేని ప్రపంచమున్ధి.... ఎందుకు కాలి పోతావు నువ్వు ఎందుకు రాలిపోతావు కాలకు రా నువ్వు రాలకు రా.. అని విమలక్క చెప్పినట్టుగా ..తెలంగాణా కోసం ఇకపై ఎవరు ఆత్మహత్యలు చేసుకోకుండా ఉండాలని కోరుకుంటున్నాను.
                      ఒక ఊరిలో ఓ  కుటుంబం ఉండేది, బార్య భర్తలు పొద్దంత కష్టపడి వ్యవసాయం చేసి పంట పండించే వారు, తరువాతి కాలంలో చెరువు ఎండిపోయి కరువు కాటకాలు విలయ తాండవం చేసాయి, ఎన్నో నోములు నోచి పూజలు చేస్తే ఒక్క కొడుకు పుట్టాడు, ముద్దు మురిపెము తీరకముందే ఆ వ్యక్తి డబ్బు సంపాదించడానికి దుబాయి పోవాలని అనుకుంటాడు, మధ్య ధలారికి కోరినన్ని పైసలు ఇచ్చి అప్పుచేసి దుబాయి పోతాడు, అక్కడ పని దొరికించుకొని ఇంటికి పైసలు పంపుతుండే వాడు, రెండు మూడేళ్ళ కు ఒకసారి ఇంటికి వచ్చి చూసి పోతున్దేటోడు, కొడుకు పెద్దవాడవుతాడు, పానాలన్ని వాడి మీదే పెట్టుకొని బతుకుతుంటారు అవ్వ,అయ్యా, సదువు సంద్యలు లేక ఇట్లా దుబాయి పొంట పొయ్యి బతుకంతా ఈడనే గడిచిపాయే, పెళ్ళాం పిల్లలతో కలిసి బతికే రోజులన్నీ ఈ ఎడారిదేశం లోనే ఆవిరైపోయే అని బాధపడుతుండే వాడు ఆ వ్యక్తి, తనలా తన కొడుకు  అవ్వ, అయ్యాను, పెళ్ళాన్ని పిల్లల్నిఇడిచి పెట్టి దుబాయి పొంట పోవద్దని అనుకుంటాడు, అందుకే తన కొడుకు మంచి చదువులు సదువుకోవాలని ఎన్ని పైసలైన పెట్టి సదివిస్తుంటాడు, 2009 లో హైదరాబాద్ లో ఇంజనీరింగ్ లో చేరుతాడు, కొడుకు ఇంజనీరింగ్ పూర్తయినంక ఉద్యోగం వస్తది ఇక తాను దుబాయి పోవాల్సిన పని లేదు హాయిగా కుటుంబంతో ఉండవచ్చు అని ఆశపడుతాడు ఆ తండ్రి, తెలంగాణా మహోద్యమం ప్రారంభమవుతుంది ఉద్యమంలో ఉత్సాహంగా పాల్గొంటాడు ఆ యువకుడు, తనతో చదువుకునే ఆంద్ర స్నేహితులతో తెలంగాణా వస్తుంది అని వాదించేవాడు, ఎంతకైనా తెగించి కోట్లాడి తెలంగాణా సాధించుకుంటామని వారితో వాగ్వాదం పెట్టుకునే వాడు, కొంతకాలం శ్రీకృష్ణ కమిటి పేరుతో ఆ తర్వాత అంతర్గత చర్చల పేరుతో కేంద్రం కాలయాపన చేస్తుంది, సీమంద్రకు చెందినా స్నేహితులు తెలంగాణా ఇవ్వరు, ఇచ్చే పరిస్థితులు లేవు అంటూ అతనిని అవహేళన చేసే వారు, ఐన ధైర్యంగా ఎక్కడ సభలు జరిగిన వెళ్ళేవాడు, చివరికి కేంద్రం తెలంగాణా ఇచ్చే పరిస్థితులు కనిపించే సరికి ఆనందిస్తాడు, కాని అంతలోనే మాటమార్చే సరికి తీవ్ర నిరాశకు గురవుతాడు.
                          దుబాయి నుండి కొడుకు ను బార్యను చూడాలని ఈ యువకుని తండ్రి ఇంటికి బయలు దేరుతాడు, వచ్చే ముందు కొడుకు కి ఫోన్ చేస్తాడు, కాని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉంటది, శంషాబాద్ లో దిగిన ఆ తండ్రి నేరుగా తన గ్రామానికి చేరుకుంటాడు, ఇంటిముందు జనం, ఇంట్లోకి వెళ్లి చూస్తాడు, కొడుకు శవమై ఉన్న ఆ దృశ్యాన్ని చూసిన అతని గుండెలు పగిలిపోయాయి, కళ్ళల్లో నుండి రక్తం కట్టలు తెంచుకొని వచ్చింది, గుండెలవిసేలా అతని తల్లి ఏడుస్తూనే ఉంది, స్పృహ కోల్పోతూ లేస్తూ మల్లి మల్లి స్పృహ కోల్పోతూ...దుక్క సాగరంలో మునిగి పోతుంది, గుండెలవిసి పోయే ఆ దృశ్యం తో ఊరంతా ఒక్కటే విషాదం ఆవహించింది, ఊరువాడ ఏకమై వచ్చి అతని అంతిమ యాత్రలో పాల్గొన్నాయి.
                             ఆ తల్లి తండ్రుల జీవితాలు మోడువారిపోయాయి, ఎన్నో ఆశలు పెట్టుకున్న తమ కొడుకు తమ కళ్ళ ముందే మరణించడం వారిని కోలుకోకుండా చేసింది, ఇంతకి అతను ఎందుకు చనిపోయినట్టు, ఆ తల్లి తండ్రులకు ఎందుకు అంతటి తీవ్ర వేదనకు గురి చేసినట్టు..? ఒక్కటే ఆశయం.. ఒక్కటే నినాదం.. ఒక్కటే పోరాటం .. అదే జై తెలంగాణా!!!
                           తెలంగాణా లో ఒక వ్యక్తి చనిపోతే అది బీహార్ లో కాని, కాశ్మీర్ లో గాని వార్త కాకపోవచ్చు, ఎక్కడో ఒక అస్సాంలో ఒక వ్యక్తి మరణిస్తే అది ఇక్కడ వార్త కాకపోవచ్చు, కాని ఆ వ్యక్తిని కోల్పోయిన కుటుంబ సబ్యులు పడే వేదన మాత్రం ఎక్కడైనా ఒక్కటే, ఆ చావులోని తీవ్రత బయటి వారికి అర్థం కాదు, ఆ తల్లి తండ్రులు కుటుంబ సబ్యులు పడే క్షోభను ఎవరు అనుభవించలేరు, తమకు ఆ అనుభవం అయితే తప్ప, శవాలపై ప్రమాణాలు చేసిన వారికి ఆ వ్యక్తులను కోల్పోయిన వారి కుటుంబాలు పడే క్షోభ ఎం తెలుసు..? కోమటిరెడ్డి కొడుకు చనిపోతే కాని అతనికి అందులోని బాధ తెలిసి రాలేదు, అలగే ప్రతివారు తమ వరకు వచ్చే వరకు సమస్య సమస్య గా కనిపించదు..
                            ఈ దేశం లో వెయ్యిమంది చనిపోయిన ఇక్కడి పాలకులకు అది సమస్యల కనిపించదు, అదే నార్వే అనే దేశం లో ఒక వ్యక్తి జరిపిన కాల్పులలో 70 మంది చనిపోతే జాతీయ అత్యవసర పరిస్థితి విధించారు, అక్కడ ప్రాణానికి ఉన్న విలువ అంతటిది, కాని ఇక్కడ ప్రాణానికి లక్షో,రెండు లక్షలో విలువ కట్టి ఇస్తారు, అన్ని రోజులు తమ తో ఉండి తమతో తిరిగిన వ్యక్తి జ్ఞాపకాలను, ఆ వ్యక్తి లేని లోటును ఆ లక్ష రూపాయలు పూడ్చాగల్గుతాయ..? ప్రాణం ఎక్కడైనా ఒక్కటే అంతెందుకు ఎ జీవిధైన ప్రాణం ఒక్కటే, ఈ దేశంలో ధనవంతుని ప్రాణానికి ఉన్న విలువ పేద వాని ప్రాణానికి లేదు, ఈ దేశ మాజీ ప్రధాని చనిపోతే అది వార్త అదే ఒక సామాన్యుడు మరణిస్తే అది వార్త కాదు, అది ప్రాణం, ఇది ప్రాణం కదా...? దేశంలోని అత్యున్నత పదవులను అనుభవించిన ఒక వ్యక్తి మరణిస్తే అయ్యో పాపం అని ఆలోచించే వారు, పక్క ప్రాంతంలో, ఒకే రాష్ట్రం లో అందునా సమైక్యత కోరుకునేవారు, జీవిత మాధుర్యం ఏమి చవి చూడని పిల్లవాడు ఉద్యమం కోసం అసువులు భాసిన అతని గురించి ఆలోచించరేం..? స్పందిన్చారే..? ఇదేనా మానవత్వం..? ఇదేనా సమైక్యత..? , ఇక్కడ పదవులకు ఉన్న విలువ ప్రాణాలకు లేదు, అందుకే మన మంత్రులు పదవులనే పట్టుకొని పాకులడుతున్నారు.
                         తెలంగాణా ఉద్యమం లో కులాలకు మతాలకు అతీతంగా ఎంతో మంది అసువులు బాశారు, అందులో దళితులు, బహుజనులు, అగ్రకులాలవారు అందరు ఉన్నారు. హిందువులే కాదు ముస్లిం లు కుడా ఉన్నారు, పుట్టేబిడ్డ నేను ఈ మతంలో పుట్టాలి, నేను కులంలో పుట్టాలి అని నిర్ణయించుకొని పుట్టరు, కాబట్టి ఉద్యమం లో మా కులం వారే మరణిస్తున్నారు, మీ కులం వారు మరణించడం లేదు అని మాట్లాడడాన్ని మించిన పాశవికత ఇంకోటి ఉండదు, ఎవరు కూడా నేను దళితునిగా పుట్టాలని, అగ్రకులం లో పుట్టాలి అనుకోని పుట్టరు,అందరు తెలంగాణా కోసం పోరాడుతున్నారు, ప్రాణాలు విడుస్తున్నారు, కాబట్టి ఇప్పటికైనా కులాల కుమ్ములాటలు మరచి తెలంగాణా కోసం అందరు కలిసి పోరాడి యువకులలో ఉన్న అభద్రతా బావాన్ని పోగొట్టాలి., దేశంలో ఎ పార్టీ ఐన అన్ని మతాల కులాల వారి ప్రయోజనాన్ని కోరుకోవాలి,సరే కొన్ని పార్టీ లు మతం ప్రాతిపదికగా పని చేస్తున్నాయి, అలంటి వాటిలో MIM ఒకటి, తెలంగాణా జిల్లాలలో మీటింగ్ లు పెట్టి జనాన్ని తప్పుదోవ పట్టిస్తూ ఉపన్యాసాలు దంచి, ఇన్ని రోజులు కలిసి ఉన్న రెండు మతాల మధ్య చిచ్చుపెట్టాలని చుసిన వీరికి ముస్లిం యువకులు తెలంగాణా కోసం ఆత్మ హత్యలు చేసుకుంటే కనిపించలేదా..? ఆనాడు ఎందుకు రాలేదు, ఎందుకు స్పందించలేదు.. ముస్లిం ల ప్రయోజనాల కోసం పోరాడాతం అనే  మీరు ముస్లిం యువకుల కు ఎందుకు దైర్యం చెప్పలేక పోయారు..? 
                ఇన్ని రోజులు ఉస్మానియా ఆసుపత్రి మార్చురీ లోనే శవాలు ఉండేవి కాని నేడు భారత ప్రభుత్వం తెలంగాణా నే ఒక మార్చురీ గా మార్చేసింది. మాది అతి పెద్ద ప్రజా స్వామ్యం అని చెప్పుకునే వీరు సాగిస్తునది, ప్రజా స్వామ్యం అనే ముసుగు కప్పుకున్న సామ్రాజ్యవాదమ్,ఈ సామ్రాజ్యవాద పులి తెలంగాణా బిడ్డలను బలితీసుకుంటుంది, ఈ పులిని మట్టు పెట్టె ఆయుధం మన చేతుల్లోనే ఉంది, పెట్టుబడి దారుల పెంపుడు మొక్క గా ఉన్న ఈ ప్రభుత్వాన్ని తప్పించి మనం కోరుకునే ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పరుచుకోవడానికి మరో సంవత్సరం మాత్రమె సమయం ఉంది, అందుకే యువకులార మీ విలువైన ప్రాణాలను విడువకండి తెలంగాణా ప్రజలను చైతన్య పరచండి, తెలంగాణాను యాచించే స్థాయి నుండి శాసించే స్థాయికి తీసుకెళ్ళేది మీరే... రేపటి తెలంగాణా మీకోసమే.. తెలంగాణా కై బరిగీసి కోట్లడుధాం.. బతికుండి తెలంగాణా ను కళ్లారా చూద్దాం..
            ఒంటిపై కిరసిన్ పోసుకొని ఒక అమ్మాయి కవిత(17) ఆత్మహత్య కు ప్రయత్నించింది, తన మరణమే చివరిది కావాలని, తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు చెయ్యాలని తన మరణ వాంగ్మూలం లో చెప్పిందట, తెలంగాణా ఉద్యమం లో చురుగ్గా పాల్గొంటున్న ఈ అమ్మాయి ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది, శరీరం 90% కాలిపోయిందట, బతకడం కష్టమని ఉస్మానియా డాక్టర్ లు చెప్పారట.
 ఒంటిపై చిన్నగా నూనె చిట్లి పడితేనే విలవిలలాడిపోతం, అలాంటిది శరీరమంత దాహించుకుందంటే ఆ బిడ్డ ఎంత క్షోభకు గురయ్యిందో, ఇంతటి త్యాగానికి సిద్దమయ్యింది..యువకులార మీ విలువైన ప్రాణాలను విడువకండి, తెలంగాణ ప్రజలను చైతన్య పరచండి, తెలంగాణాను యాచించే స్థాయి నుండి శాసించే స్థాయికి తీసుకెళ్ళేది మీరే... రేపటి తెలంగాణా మీకోసమే.. తెలంగాణా కై బరిగీసి కోట్లడుధాం.. బతికుండి తెలంగాణా ను కళ్లారా చూద్దాం..
              ఎందుకు కాలి పోతావు నువ్వు, ఎందుకు రాలిపోతావు కాలకు రా నువ్వు రాలకు రా, మాడి బూడిద కాకురా, మాడి బూడిద కాకురా.. నీకు అండగా ఉండే డాక్టర్లుండ్రు, ఆపద వస్తే లాయర్లుండ్రు.. నువ్వు యుద్ధం చేసి గెలుస్తానంటే సరిహద్దులు లేని ప్రపంచమున్ధి.... ఎందుకు కాలి పోతావు నువ్వు ఎందుకు రాలిపోతావు కాలకు రా నువ్వు రాలకు రా.. 
                                      
                                     

తెలంగాణపై నిర్ణయం జరిగిపోయింది: శరద్ పవార్

మొన్న లాలూ, నిన్న మాయ, నేడు పవార్ ఇలా యు పీ ఎ లో తెలంగాణా పై మద్దతు పెరుగుతూనే ఉంది, కాని కాంగ్రెస్ మాత్రం నిర్ణయాన్ని దాటవేస్తూ ప్రజల ప్రాణాలతో చలగాటం ఆడుతుంది..

ముంబై: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై నిర్ణయం జరిగిపోయిందని, సీమాంధ్రకు కొత్త రాజధాని నిర్మాణం జరిగే వరకు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంటుందని ఎన్సీపీ నేత శరద్‌పవార్ తెలిపారు. ఇవాళ ఆయన ప్రధాని మన్మోహన్‌సింగ్‌తో సమావేశమైన అనంతరం విలేకరులతో మాట్లాడారు. యూపీఏ సమన్వయ కమిటీలో చర్చించి వీలైనంత త్వరగా తెలంగాణ సమస్యను పరిష్కరించాలని తాను ప్రధానికి సూచించినట్టు పవార్ స్పష్టం చేశారు.అయితే, తెలంగాణ ఏర్పాటుపై ప్రభుత్వ నిర్ణయం జరిగిపోయిందని, అనుకూలమైన సమయం కోసమే ఎదురు చూస్తున్నామని ప్రధాని మన్మోహన్‌సింగ్ తనతో అన్నారని పవార్ వెల్లడించారు. 

హైదరాబాద్ తెలంగాణలో అంతర్భాగమే: పవార్
హైదరాబాద్ నగరం తెలంగాణలో అంతర్భాగమేనని ఎన్సీపీ నేత శరద్‌పవార్ స్పష్టం చేశారు. ఇవాళ ఆయన తెలంగాణ అంశంపై ప్రదానితో చర్చించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. అయితే, సీమాంధ్ర రాష్ట్రానికి కొత్త రాజధానికి నిర్మించుకునే వరకు హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా వాడుకోవాలని ఆయన ప్రధానికి సూచించినట్టు తెలిపారు. 

                                                                     -namaste telangana.

28, జనవరి 2013, సోమవారం

షిండే, చిదంబరంపై 420 కేసు నమోదు..

హైదరాబాద్: కేంద్ర మంత్రులు సుశీల్‌కుమార్ షిండే, పి.చిదంబరంలపై రంగారెడ్డి జిల్లా కోర్టులో చీటింగ్ కేసు నమోదైంది. తెలంగాణను ఏర్పాటు చేస్తున్నట్టు ఒకరు, తెలంగాణ అంశంపై జనవరి 28లోగా నిర్ణయం ప్రకటిస్తామంటూ మరొకరు ఈ ప్రాంత ప్రజలను మోసం చేశారని, ఇద్దరు మంత్రులు చెప్పి మాట మార్చారని పేర్కొంటూ నరేశ్ అనే న్యాయవాది భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 420 కింద కేసు నమోదు చేశారు. పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన కోర్టు మంత్రులిద్దరిపై చీటింగ్ కేసు నమోదు చేయాలని ఎల్బీనగర్ పోలీసులను ఆదేశించింది. దీనిపై ఫిబ్రవరి 18లోగా నివేదిక సమర్పించాలని న్యాయమూర్తి పోలీసులను ఆదేశించారు.
                                                                      -from namastetelangana

27, జనవరి 2013, ఆదివారం

భవిష్యత్ కార్యాచరణ..


ముందుగా అనుకున్నట్టే గడువు సమయానికి ఒక రోజు ముందే షిండే ప్రకటన వచ్చింది, తెలంగాణా కు సంభందించి సంప్రదింపులు జరుగుతున్నాయి, ఇవి పూర్తవ్వడానికి మరికొంత సమయం పడుతుంది, అవి ఎప్పటికి పూర్తవుతాయో తెలియదు, డెడ్ లైన్ ఏమి లేదు అని షిండే ఉవాచ.
                             ఈ మాత్రం తొక్కలో ప్రకటన చెయ్యడానికే ఇన్ని సార్లు కోర్ కమిటి బేటిలు, సోనియా తో బెటిలు  దొంగ నాటకాలు పెద్ద కొండను తవ్వి వీళ్ళు పట్టుకున్నది ఏముంది అంటే అక్కడ ఏమి లేదు, సాఆఆగ దీయడం మినహా కాంగ్రెస్ కు మరోటి చేత కాదు అని అర్థం అయ్యింది మరోసారి, డబ్బులకు అమ్ముడు పోయిన ఆంద్ర వాళ్ళ గులాం మొత్తానికి ప్రకటనను వాయిదా వేయించాగాలిగాడు.
                                    ఈ సమస్యను ఇప్పట్లో తేల్చారు దీనిని ఇలాగె 2014 వరకు సాగదీస్తారు, 2014 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి వోటు వెయ్యండి మేము తిరిగి అధికారంలోకి వస్తే తెలంగాణా ఇస్తాము అని ప్రచారం చేస్తారు, ఇదే వీరి వ్యూహం, ఇక ఎలాగో అధిష్టానానికి సు సు పోసుకునే మన కాంగ్రెస్ మంత్రులు, ఎం పీ లు ఇంకా సోనియా గాంధీ తెలంగాణా ఇస్తుందన్న నమ్మకంతో ఉన్నారట.. రాజీనామాలు చేస్తే తెలంగాణా వస్తుందని చెపితే ఇప్పుడే రాజీనామాలు చేస్తారట, తెలంగాణా సమస్య పరిష్కారం కోసం కేంద్రం కొంత సమయం తీసుకుందే కాని తెలంగాణా ఇవ్వమని చెప్పలేదట, ఒక వేల ఇవ్వనని చెప్పిన మరుక్షేనం పార్టీ వదులుతారట ఈ వెధవలు. 
                          చచ్చిన పాముకైన తోక కదులుతుంది కాని మన తెలంగాణా మంత్రులకు మాత్రం చీము, నెత్తురు, సిగ్గు, మానం లాంటివి ఏమి లేవు, వీళ్ళు కనీసం ఈ మధ్య కనిపించడమే మానేసారు, జీవించే ఉన్నారా..? అనేది నా అనుమానం. కాంగ్రెస్ తెలంగాణా ఇవ్వకపోతే మర్రి చెన్న రెడ్డి లాగ కాంగ్రెస్ నాయకులంతా బయటికి వచ్చి తెలంగాణా కాంగ్రెస్ ను ఏర్పాటు చేస్తారట..? కేంద్రం ప్రకటన చేస్తే వెంటనే పార్టీని విలీనం చేస్తారట..? ఒక వేల ప్రకటన చెయ్యక పోతే ఎన్నికలకు వెళ్లి ఎన్నికల తర్వత కాంగ్రెస్ తెలంగాణా ఇస్తే అందులోకి వెళ్తారట..? ఇదే మరి పరమ విధేయత అంటే, గెలవాలంటే కాంగ్రెస్ ను వీడాలి,, కాని గెలిచాక మల్లి 5 సంవత్సరాలకు కదా జనానికి కనిపించేది అందుకే మల్లి కొంగ్రెస్ లో కలవాలి, వీళ్ళను నమ్మి ఎవరైనా ఓట్లు వేస్తే ఆత్మద్రోహం చేసుకున్నట్టే తప్ప ఇంకోటి కాదు..
                 ఇక చంద్రబాబు లేఖను సాకుగా పెట్టుకొని దొంగ నాటకాలు ఆడుతున్న టి డీ పీ తమ పార్టీ తెలంగాణా కు అనుకూలం అని చెప్పడానికి జనాల్లో టి డి పీ పై ఉన్న ముద్రను చెరిపివేయడానికి టిడిపీ వారు కూడా ఉద్యమాలు చేస్తారట..? చంద్ర బాబు తెలంగాణా కు వ్యతిరేఖం కాదు అంటూ జై తెలంగాణా అనమంటే అనడు, జై తెలంగాణా అని ఉన్న బోనాన్ని దించి జై తెలుగుదేశం బోనం ఎత్తుకుంటాడు, ఇతన్ని ఎలా నమ్మేది ఓ వైపు  సీమంద్ర లో సమైక్యంద్ర ఉద్యమాలు చేసిన నాయకులకు ఇది మింగుడు పాడడం లేదు, ఐన సమయం కోసం ఎదురు చూస్తున్నారు, చంద్ర బాబు పాపం పండాలి కదా..! ఈ రోజు వరకు ఎ నాడు ఉద్యమం లో కలిసి రాకుండా 1000 మంది విద్యార్థులు మరణించాక వారి మరణాలకు కారణమైన పచ్చపార్టీ నాయకులు  ఈ రోజు తెలంగాణా ఉద్యమాలు చేసి తెలంగాణా సాధించడం కాదు, ఎన్నికల్లో గెలవడమే వీరి ఉద్దేశ్యం.
                           ఇక వై సి పీ తెలంగాణా లో తట్ట బుట్ట సర్దుకుంటుంది, జగనన్న వదిలిన భానం విరిగిపోయి కుర్చీ కి పరిమితం కావడం, ఒవైసీ బాణం గురితప్పి వాళ్ళ మీదే పడడము, తెలంగాణా వాదానికి జడిసి ఆ పార్టీ లో చేరాలని భావించినవారు కూడా దూరం కావడంతో పార్టీ దీపం కొడిగట్టింది, ఇక జగన్ పార్టీకి తెలంగాణలో పూర్తి వ్యతిరేక వాతావరణం ఓవైసి ను ఉసిగొల్పడం ద్వార వచ్చింది, ఒవైసీ కి ఆర్ధిక సాయం చేసి సభలను పెట్టించింది జగన్ ఎ అని తెలంగాణా వాదులు బలంగా నమ్ముతున్నారు, ఇక సమైక్యంద్ర అని నిన్న కాక మొన్న ప్రారంభమైన మరో రికార్డింగ్ డాన్స్ కు మద్దతుగా రాజీనామాలు చేసిన ఇద్దరు ఎం ఎల్ ఎ లు వై ఎస్ అర్ పార్టీ వాళ్ళే, వీరి రాజీనామాలు ఉత్తవే ఐన( కాంగ్రెస్ నుండి జగన్ పార్టీ లోకి జంప్ అయ్యారు, పార్టీ మారినప్పుడు పదవికి రాజీనామా చెయ్యకపోతే పార్టీ ఫిరాయింపుల చట్టం కింద అనర్హత వేటు పడే అవకాశం ఉంటుంది కాబట్టి, వారు అప్పుడు రాజీనామా చెయ్యకుండా సమైక్యంద్ర కోసం అని ఇప్పుడు నాటకాలు ఆడుతున్నారు), వై సి పీ తెలంగాణా కు పూర్తి వ్యతిరేఖం అనే భావన వచ్చింది, వీరు మరో మారు శర్మిలతో కృతజ్ఞత యాత్ర చేస్తారట..?
                                            
                                   తెలంగాణా జె ఎ సి తలపెట్టిన  తెలంగాణా సమర భేరి దీక్షలు కొనసాగుతున్నాయి, 36 గంటల ధీక్షలొ ఈ రోజు కె సి అర్ పాల్గొననున్నారు, 28 న విద్యార్ధి జాక్ తెలంగాణా విద్యార్థి మహా ప్రదర్శన నిర్వహించ నుంది, తెలంగాణా ఉద్యోగులు 100 రోజుల సమ్మెకు సిద్ధమయ్యారు, తెలంగాణలో మరో ప్రళయం సృష్టించాలి, అన్ద్రోల్ల ఆర్ధిక మూలాలను దేబ్బతీయాలి,. అన్ద్రోల్లకు సహాయనిరాయకరణ చెయ్యాలి, ఉద్యమం పందా మార్చుకొని కొంత తీవ్రంగా జరిగితేనే కాని తోలు మందం కాంగ్రెస్ లో చేలనం ఉండదు, 2014 లో కాంగ్రెస్ లేదా బిజేపీ లు గెలిచి తెలంగాణా ఇస్తాయని ఆశ పడే కంటే తెలంగాణా పార్టీకి అత్యదిక ఎం పీ స్థానాలను కట్టబెడితే ఆ కాంగ్రెస్, బిజేపీ లే మన దగ్గరికి వచ్చి తెలంగాణా ఇస్తాయి, యాచించి కాకుండా శాసించి తెలంగాణా తెచ్చుకుందాం..

26, జనవరి 2013, శనివారం

FLASH..FLASH...

తెలంగాణా సమరదీక్షకు ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు, శాంతి బద్రతల సమస్యలు తలెత్తుతాయని చెప్పి అనుమతి నిరాకరించారు, నిజంగా శాంతి బద్రతలను కాపాడే వారైతే అనుమతి ఇవ్వాలి, ఒక ప్రజాస్వామ్య దేశం లో శాంతియుతం గా జరుగుతున్న దీక్ష ను అడ్డుకోవడం ప్రజాస్వామ్యమా..? ఇది గాంధీకి వారసులం అని చెప్పుకునే పార్టీ వారికి తగునా..? తెలంగాణా సమరభేరి దీక్ష కు పెద్ద ఎత్తున తెలంగాణా అన్ని జిల్లాల నుండి పెద్ద సంక్యలో జనం తరలి వస్తున్నారు, పోలీస్ లు అర్రేస్ట్లు, లాటి చార్జ్లు, టియర్ గ్యాస్ ప్రయోగాలతో భయ బ్రాన్తులకు  గురిచేయ్యలని చూస్తున్నారు.
                 మరో వైపు డిల్లి లో జోరుగా తెలంగాణా చర్చలు జరుగుతున్నాయి, ఇప్పటికే గడచిన రెండు రోజుల్లో మూడు సార్లు చర్చించిన కోర్ కమిటి, ఈ రోజు సాయంత్రం మల్లి భేటి కానుంది, రేపటితో షిండే గడువు ముగుస్తుండడంతో రేపు ఏదో ఒక ప్రకటన వెలువడనుందని తాజా సమాచారం, అయితే ఈ ప్రకటనలో నిర్ణయం తీసుకోవడానికి మరింత సమయం పడుతుందని వేచి ఉండాలని హోం మంత్రితో చెప్పించనున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం.
                         

తొండ ముదిరి ఉండవెల్లి అయ్యింది.. ఒక పిట్ట కథ!!

                              
మొన్న రాజమండ్రిలో ఒక పెద్దాయన సభ నిర్వహించిండు, పధకం ప్రకారం జై ఆంద్ర అని ముందు ప్రకటించి తర్వాత జై ఆంద్ర ప్రదేశ్ అని మార్చిండు, దీనికి రాష్ట్ర మంత్రులు( ఆంద్ర ) , ఎం.పీలు , ఎం ఎల్ ఎ లు, కార్యకర్తల తో పాటు తెలుగు దేశం, వై ఎస్ అర్ పార్టీ ల కార్య కర్తలు కూడా హాజరయ్యారు. ఉండవెల్లి ఎం చెప్తారా అని అందరు ఆసక్తిగా ఎదురు చూసారు, ఇన్నిరోజులు సమైక్యంద్ర అంటే జనమే కనిపించలేదు, కాని ఈ రోజు ఓ మోస్తరు జనం కనిపించేసరికి సీమంద్ర ఛానల్ లు పండుగ చేసుకున్నాయి( ఈ టివి2 తప్ప, ఎందుకంటే మార్గదర్శి వ్యవహారం బయటకు తెచ్చారు కదా). దీనికి పీ సి సి చీఫ్ బొత్స కూడా హాజారయ్యారు, దీనితో ఇదో కాంగ్రెస్ పార్టీ సమావేశం ఐపోయింది.
                          సభలో సుదీర్గంగా ఉపన్యసించిన ఉండవెల్లి, నిజాం కాలం నాటినుండి మొదలు పెట్టి ముల్కి ఉద్యమం, రాష్ట్ర విలీనం, పెద్ద మనుషుల ఒప్పందం, జై తెలంగాణా, జై ఆంద్ర ఉద్యమాలు, సిక్స్ పాయింట్ ఫార్ముల, టి అర్ ఎస్ పెట్టక ముందు కె సి అర్, పెట్టిన తర్వాత కె సి అర్ ఇలా నేటి వరకు అన్ని విషయాలను తనదైన శైలి లో పిట్టకతలను చొప్పించి వీడియొ క్లిప్పులు చూపిస్తూ అక్కడున్న నాయకులను ఆకట్టుకోవాలని చూసారు,అయితే ఈ మీటింగ్ కు జై ఆంధ్రప్రదేశ్ అని పేరైతే పెట్టారు కాని అందులో ఒక్క తెలంగాణా నేత కూడా పాల్గొనలేదు, మరి అది జై ఆంద్ర ప్రదేశ్ ఎలా అయ్యిందో....

                        అబద్ధాలకు పిట్టకతలను జోడించి అందంగా సమైక్యంద్ర విషాన్ని జనానికి ఎక్కించాలని చూసాడు, నిన్న మొన్నటి వరకు తెలంగాణా ను అక్కడి ప్రజలు కోరుకోవడం న్యాయమె, వారెన్నడు మనతో కలవాలని అనుకోలేదు, మనమే కలిసాము అని సీమంద్ర విద్యార్థులతో చెప్పిన ఉండవెల్లి అకస్మాత్తుగా మాట మార్చారు, మీకు హైదరాబాద్ అవసరం లేదా అని అడిగి మరి మనల్ని వాళ్ళు కలుపుకున్నారు అని అసత్యపు మాటలు పలికారు, జవహర్ లాల్ నెహ్రు నిజామాబాద్ లో చేసిన స్పీచ్ తెలంగాణా వాదుల సృష్టి అని, విద్య ఉద్యోగాల్లో తెలంగాణా వాలు ఈ రోజు అభివృద్ధి చెందారని, విద్యుత్ వినియోగం పెరిగిందని ఇలా నోటికొచ్చినవన్ని చెప్పుకొచ్చారు, 2004 లో తెలంగాణా ఇస్తామని చెప్పలేదని తనను గతంలో చేసిన అనువాదాన్నే(సోనియా కరీం నగర్ స్పీచ్ ను తెలుగులోకి అనువదించాడు) విస్మరించాడు, సకల అభాద్ధాలు చెప్పి సీమంద్ర నాయకులను, ఆ సభ కు విత్తం సమకూర్చిన వారికి సంతృప్తిని కలిగించి తెలంగాణా వాదుల గుండెలు రగిల్చిండు, ఇన్ని ఏళ్ళ రాజకీయ అనుభవం కలిగిన ఈ వ్యక్తికి లాగడపాటి ఇచ్చిన సమాచారంతో కళ్ళు తెరుచుకున్నయట,తాను వాస్తవాలని నమ్మినవి, చూసినవి అన్ని అబద్దాలని తెలిసిందట, అందుకే సమైక్యంద్ర వాధీగా మారాడట..? నవ్వి పోదురు గాక నాకేమి సిగ్గు అంటూ విద్వేషాలను రగిల్చి మరుసటిరోజు తాను తెలంగాణా కు వ్యతిరేఖం కాదు అని, తన ఉపన్యాసం ద్వారా తెలంగాణా మేధావులలో చైతన్యం రగిలితే సంతోషం అని చెప్పుకున్నారు, ఇంత జరిగిన ఒక్క తెలంగాణా మంత్రి కూడా ఖండించలేదు, కనీసం స్పందించలేదు, తెలంగాణా నాయకత్వం పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తూ చిన్న చిన్న విషయాలను పెద్దవిగా చూపిస్తూ విషం కక్కాడు, ఈ మాత్రం కథలు మనం చెప్పలేమా..?

                                   పూర్వం ఒక ఊరిలో ఒక రైతు ఉండేవాడు అతనికి ఇద్దరు కొడుకులు, అతను చనిపోవడానికి ముందు తాను సంపాదించిన ఆవు, మామిడి చెట్టు, ఒక గొంగలి ఈ మూడింటిని ఇద్దరు సమానం గా పంచుకోండి అని చెప్పి చనిపోతాడు, అయితే పెద్దవాడు తమ్ముడిని పిలిచి తమ్ముడు నాన్న చెప్పినట్టు ఇద్దరం సమంగా పంచుకుందాం అని ఆవు ముందు బాగం నీకు వెనక భాగం నాకు, మామిడి చెట్టు మొదలు నీకు పైభాగం నాకు, దుప్పటి పగలు నీకు రాత్రి నాకు అని ఇలా పంచుతాడు, చిన్న వాడు ఆవుకు మేతవేస్తే పెద్దవాడు పాలు పిండుకునేవాడు, పేడతో పిడకలు చేసుకునేవాడు, చిన్న వాడు మామిడి చెట్టుకు నీళ్ళు పోస్తే పెద్ద వాడు పండ్లను తేమ్పుకునే వాడు, ఇక గొంగలి పగలు చిన్నవాడు ఉతికి ఆరేస్తే పెద్దవాడు రాత్రి ఎంచక్కా కప్పుకునే వాడు, ఇలా కొంతకాలం జరిగింది, ఇద్దరికి పెళ్ళిళ్ళు అయ్యాయి, చిన్నవాడి భార్య జరుగుతున్నదంతా గమనించి తన భర్త ను పిలిచి ఒక ఉపాయం చెప్పి ఆచరించమంటుంది, అలాగే అని చిన్నవాడు ఒక కర్రను తీసుకొని వెళ్లి మేత వేయకుండా ఆవును ముందు భాగంలో కొట్టడం ప్రారంభిస్తాడు, అప్పుడే పాలు పితుకుతున్న పెద్దవాడిని ఆ ఆవు తంతుంది, పాలు ఇవ్వదు, అప్పుడు ఎందుకు రా ఆవును కొడుతున్నావ్ అంటడు పెద్ద వాడు, ముందు భాగం నాది నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంట నీ కెందుకు అంటడు చిన్నవాడు , దీనితో విషయాన్ని అర్థం చేసుకున్న పెద్దవాడు సగం పాలు, పేడ ఇస్తానని ఒప్పుకుంటాడు, ఆతర్వాత చెట్టుకు నీళ్ళు పోయకుండా గొడ్డలితో నరుకుతుంటాడు చిన్నవాడు, అరె ఎందుకు రా చెట్టును నరికేస్తున్నావ్ అంటాడు పెద్ద వాడు నా మొదలు భాగం లో నేను నరుక్కుంటాను ఏమైనా చేసుకుంటాను అంటడు చిన్న వాడు, సగం పండ్లు ఇస్తా నని అంటడు పెద్దవాడు, ఆ రోజు ఉదయం కాకుండా సాయంత్రం గొంగాలిని ఉతికి ఆరేస్తాడు చిన్నవాడు, గొంగలి పచ్చిగా ఉండడంతో రాత్రి చలిలో పడుకుంటాడు పెద్దవాడు, అప్పుడు దారిలోకి వచ్చిన పెద్దవాడు, చిన్నవాడిని పిలిచి అతని వాట అతనికి ఇస్తాడు, ఈ కథలో పెద్దవాడు సీమంద్ర, చిన్నవాడు తెలంగాణా, మనం మన వాట అడుగనంత వరకు వాళ్ళు అలాగే దోచుకుంటారు,పోరాడే వరకు మనకు ఏది దక్కదు, ఆవును కొట్టినట్టుగా వీరి కుట్రలను తిప్పి కొట్టాలి, చెట్టును నరికినట్టుగా వీరి ఆర్థిక మూలాలను దెబ్బకొట్టాలి, సమైక్యంగా ఉండడం ద్వారా వారు పొందే ప్రయోజనాలను దెబ్బకొట్టాలి ఇలా చేయ గలిగితే సీమంద్ర పెట్టుబడి దారులు కూడా తోక ముడువక తప్పదు...

25, జనవరి 2013, శుక్రవారం

తెలంగాణా ప్రజలకు భారత గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు...

చిత్రం లో బాబా సాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రాజ్యంగ పరిషత్తు చైర్మెన్, మొదటి భారత రాష్ట్ర పతి శ్రీ. బాబు రాజేంద్ర ప్రసాద్ కు అందిస్తున్నారు, చిత్రంలో.. భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రు,పక్కన తొలి ఉప ప్రధాని , తోలి హోం మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్, పక్కన స్వతంత్ర భారత తోలి, చివరి గవర్నర్ జెనరల్, మద్రాస్ రాష్ట్ర ముఖ్య మంత్రి రాజగోపాల చారి (రాజాజీ), అంబేద్కర్ వెనకాల తొలి భారత విద్య శాఖ మంత్రి మౌలాన అబుల్ కలాం ఆజాద్....

24, జనవరి 2013, గురువారం

కాంగ్రెస్ పార్టీ లోకి జగన్?


-కె వి పీ ప్రయత్నాలు?
-అందుకే తెలంగాణా ప్రకటనకు బ్రేక్ ?

సీమంద్ర నాయకులంతా డిల్లి వెళ్లి రానున్న తెలంగాణా ప్రకటనను అడ్డుకున్నారు, మొదట్లో వారిని చూస్తేనే ఆగ్రహించిన డిల్లి పెద్దలు ఆ తర్వాత ఎందుకు మేత్తపడ్డారు..? ఉంటె ఉండండి లేదా వెళ్లి పొంది మేము కొత్త టీం ను వెతుకుంటం  అనే వరకు వచ్చిన వారు మల్లి వెనకడుగు ఎందుకు వేసినట్టు..? సీమంద్రలో ఎన్ని స్థానాల్లో పార్టీని గెలిపిస్తారు అంటే నీళ్ళు నములుకుంటూ వచ్చిన సీమండ్రులు ఎం మంత్రం వేసారు..? మొన్న నే ఆజాద్ క్లాసు పీకాడు, నిన్న మాట మార్చాడు ఒక్క రోజులో ఎం జరిగింది..? సీమంద్రుల డబ్బు సంచులు అందాయ..? లేక ఇంకేమైనా జరిగిందా..?
                        సీమంద్ర నాయకులందరిని డిల్లి తరలించి, డిల్లి పెద్దలతో అపాయింట్ మెంట్ ఇప్పించింది కె వి పీ, దీనంతటి వెనక కె వి పీ ఉన్నాడు, వై ఎస్ అర్ కు అత్యంత సన్నిహితుడైన కె వి పీ, జగన్ పార్టీ పెట్టిన తర్వాత కూడా కాంగ్రెస్ లోనే కొనసాగుతున్నారు, వై ఎస్ హయాంలో డిల్లి కి రిపోర్ట్ లు, డబ్బు మూటలు అందించిన కె వి పీ కి అధిష్టాన పెద్దలందరు బాగా పరిచయమే, సీమండ్రులు రాజీనామాలు చేసి అటు కేంద్రం లోను ఇటు రాష్ట్రం లోను ప్రభుత్వాన్ని పడగోడుతం అని బెదిరిస్తే కేంద్రం వెనకడుగు వేసిన్ధనుకోవడం సరి కాదు.
                  విశ్వసనీయ సమాచారం ప్రకారం " సీమంద్రలో ఎన్ని స్థానాలను ఇస్తారు అనే కేంద్రం ప్రశ్నకు సీమండ్రులు సమాధానం చెప్పలేక పోయారు, ఒకానొక దశలో కేంద్రం మీరు వెళ్లి పోతే వెళ్లి పొండి  మేం కొత్త టీం వెతుక్కుంటం అన్నది, అయితే కె వి పీ వారికి చెప్పింది ఏమంటే, సీమంధ్ర లో జగన్ హవా చాల ఉంది, తెలంగాణా ఇచ్చిన మరుక్షణం చాల మంది నాయకులు ఈ కారణంతో జగన్ పార్టీ లోకి వెళ్తారు, కొత్త టీం ఏర్పాటు చేసుకోవడానికి కనీసం నాయకులు లేకుండా పోతారు, కాంగ్రెస్ పార్టీ మొత్తంగా తుడిచి పెట్టుకు పోతుంది, కాని రాష్ట్రాన్ని సమైక్యం గా ఉంచితే తెలంగాణా లోని అందరు నాయకులు టి అర్ ఎస్ లోకి వెళ్లరు, తెలంగాణా సెంటిమెంట్  బలంగా ఉండడం వళ్ళ చాల మంది నాయకులు జగన్ పార్టీ లోకి వెళ్ళడం లేదు, అలాగే హైదరాబాద్ నాయకులు టి అర్ ఎస్ లోకి వెళ్లరు, కాబట్టి వాళ్ళు అవకాశం దొరికితే జగన్ పార్టీలోకి వెళ్ళడానికి సిద్ధం గా ఉన్నారు, మీరు తెలంగాణా ఇవ్వక పోయినా పెద్ద గా పార్టీ కి నష్టం లేదు, ఒక ఆరు నెలలు పోలీస్ బలగాలతో ఉద్యమాన్ని అనచివేయండి, నాకు జగన్ కొడుకు లాంటి వాడు, నేను ఏది చెప్పిన కాదనదు, నేను జగన్ ను ఆరు నెలల్లో కాంగ్రెస్ లోకి తీసుకొని వస్తా, కాంగ్రెస్ నుండి బయటకు వెళ్తున్న సీమంద్ర నాయకులు, తెలంగాణా లో బయటకు వెళ్లాలనుకునే నాయకులు జగన్ కాంగ్రెస్ లోకి వస్తే కాంగ్రెస్ లోనే ఉంటారు, దూరమైనా ఎం ఐ ఎం కూడా మల్లి దగ్గరవుతుంది, కాబట్టి 2014 లోను కాంగ్రెస్ విజయం సాదిస్తుంది, కాబట్టి జగన్ ను పార్టీ లోకి తీసుకు వచ్చే భాద్యత నాది." ఇది కె వి పీ మంత్రాంగం, అందుకే మీ దగ్గర ఉన్న ఈ విషయాలను ముందే మాకు ఎందుకు చెప్పలేదు అని వాయిలార్ రవి అన్నారు, అవే విషయాలను నిన్న సోనియా తో చర్చించి బయటకు వచ్చిన ఆజాద్ మాట మార్చాడు... 
              ఈ కధనం జనవరి 24 న రాసి పోస్ట్ చేశాను, 25 వతేదిన ఇదే కంటెంట్ తో "జగన్ పై రామ బాణం" అనే పేరుతో సూర్య పత్రికలో కథనం వచ్చింది...

23, జనవరి 2013, బుధవారం

మరో మోసం..!


తెలంగాణపై కేంద్రం నిర్ణయం తీసుకుంటుందని ఎదురు చుసిన తెలంగాణా ప్రజలకు మరో సారి నిరాశే ఎదురయ్యింది, కేంద్రం, కాంగ్రెస్ పార్టీ తెలంగాణా ప్రజలను మరోసారి ధోకా చేసింది, 28 లోపే తెలంగాణా పై ఏదో ఒక నిర్ణయం వెలువడుతుందని ఎదురుచుసారు తెలంగాణా వాదులు, తెలుగు మీడియా కేంద్రం తెలంగాణా ఇవ్వాలనే నిర్ణయం తీసుకుందని ప్రకటనే తరువాయి అని ఊదరగోట్టడం తో కాంగ్రెస్ తెలంగాణా ఇవ్వదు అనుకునే వారు సైతం తెలంగాణా ప్రకటన వస్తుందని ఆశగా ఎదురు చూసారు, ఈ డబ్బు స్వామ్యంలో ప్రజల ఆశలకు ఆకాంక్షలకు విలువ లేదు, కేవలం డబ్బు సంచులతోనే పని, డబ్బు చేతులు మారడం ఆలస్యం నెలకు 30 రోజులు కాకుండా పోతాయి, వారానికి 7 రోజులు కాకుండా పోతాయి. 
                         గత నెల FDI లపై ఓటింగ్ సందర్భంలో తెలంగాణా రాష్ట్ర సమితి కాంగ్రెస్ కు వ్యతిరేఖం గా ఓటు వేయ్యడం, టి కాంగ్రెస్ ఎం పీ ల ఒత్తిడి తో హోం మంత్రి షిండే 28 న అఖిల పక్షం నిర్వహిస్తామని హామీ ఇచ్చారు, హామీ ప్రకారం 28 ఆ భేటి జరిగింది, అఖిలపక్షం వట్టి డ్రామా అని టి అర్ ఎస్, బి జె పీ, సి పీ ఐ లు  మొదటినుండే చెబుతున్నాయి, అఖిలపక్షం అనంతరం అసంతృప్తి తో కె సి అర్ తెలంగాణా బంద్ కు పిలుపు ఇచ్చాడు, అఖిల పక్షం వాళ్ళ ఒరిగేదేమీ లేదని, ఇది మరో డ్రామా అని చెప్పారు, అఖిలపక్షంలో నిజానికి సీమంద్రకు చెందిన టి డి పీ, వై సిపీ లు సరైన అభిప్రాయాన్ని చెప్పలేదు, 2008 లో ఇచ్చిన లేఖ ఇంకా కేంద్రం వద్ద నే ఉందని దాని ఆధారంగా నిర్ణయం తీసుకోవాలని చంద్రబాబు లెటర్ ఇచ్చారు, కాని తెలంగాణా రాష్ట్రాన్ని ఇవ్వండి మేము మద్దతు ఇస్తామని రాయలేదు, అ అస్పష్ట లేఖ సాయం తో తెలంగాణా జిల్లాల్లో జరిగిన పాదయాత్రను పూర్తి చేసుకొని వెళ్ళిపోయాడు, ఇక జగన్ పార్టీ కి ఒక అభిప్రాయం అంటూ లేదు, నెల రోజుల్లో నిర్ణయం వెల్లడిస్తామని చెప్పిండు షిండే, టైం దగ్గర పడుతున్న కొద్ది సీమంద్ర కుట్రలు మొదలయ్యాయి, సమైక్యంద్ర అని ఒకడు, విశాలాంద్ర అని ఒక్కడు, హైదరాబాద్ రాష్ట్రం అంటూ ఇంకొకడు, హైదరాబాద్ ప్రజల రెఫరెండం అంటూ ఇంకొకడు, ఇలా కుట్రలకు తెరలేచింది, సీమంద్రమీడియా  అతి ప్రచారం జోరందుకుంది, హైదరాబాద్ లో పూర్తి పోలీస్ రక్షణల మధ్య వారి సభల నిర్వహణ ముఖ్య మంత్రి దగ్గరుండి పర్యవేక్షించుకున్నాడు, తెలంగాణా జె ఎ సి మాదురిగా సమైక్యంద్ర జె ఎ సి, మహిళా నాయకురాలితో జాగృతి, విద్యార్థి జె ఎ సి, సమైక్యంద్ర ఎన్ జి వో సంఘాలు ఏర్పాటు చేసుకొని ఉద్యమాన్ని ఉదృతం చేస్తారట, లక్ష మంది తో హైదరాబాద్ లో సభ నిర్వహిస్తారట..? మంత్రి గంటా ఉవాచ..
                        డిల్లి లో కాంగ్రెస్ పెద్దలను కలిసిన సీమంద్రులకు నిరాశ ఎదురవుతుందని, వారికి క్లాసు పీకి పంపుతున్నారని మీడియా కోడై కూసింది, ఇప్పటికైనా కేంద్రం తెలంగాణా పై నిర్ణయం తీసుకుందని, ఆనందించిన తెలంగాణా ప్రజలకు మరో సారి నిరాశే ఎదురయ్యింది, సీమండ్రుల డబ్బుకు భారత కాలమనమే మారిపోయింది, డబ్బు ఉంటె నెలకు 30 రోజులు కావు, ఎన్ని రోజులైనా కావచ్చు, డబ్బు చేతిలో పడితే వారానికి 7 రోజులు కావు భారత ప్రభుత్వం దాన్ని మార్చేస్తుంది.
                                    మరోసారి ప్రజాస్వామ్యం సీమంద్రుల డబ్బుకు అమ్ముడు పోయింది, తెలంగాణా ఆశలను ఆకాంక్షలను కాలరాసింది, మీరెప్పుడు సీమంద్రులకు బానిసలే అని చాటి చెప్పింది, మాకు ప్రజల ఆకాంక్షల కంటే డబ్బే ముఖ్యం అని నిరూపించుకుంది, భారత ప్రభుత్వం డబ్బు ఇస్తే ఏమైనా చేస్తుంది అని నిరూపించుకుంది , ప్రపంచం లో వేరే దేశాలలో డబ్బుతో జరగని ఎన్నో పనులు ఇక్కడ జరుగుతాయి, నమ్మి ఓటేసిన తమ ప్రజలనే మోసం చేసేంత గొప్పగా అమ్ముడు పోతుంది ఈ ప్రభుత్వం, ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్యం భారత దేశం, అలాగే ప్రపంచం లో డబ్బుకు అమ్ముడు పోయే అతి పెద్ద ప్రజా స్వామ్యము భారత దేశమే, ఇది నేడు ఎంతగా అమ్ముడు పోయిందంటే, ఈ ప్రభుత్వంలోని ఆరోగ్య శాఖ మంత్రి గారు ఏకంగా నెల రోజుల అర్థాన్నే మార్చేసారు, ప్రపంచం అంత నెల రోజులు అంటే 30 రోజులు అనుకోవడం సహజం కాని నెల అంటే 30 రోజులు కాదంట నెల అంటే వారికి నచ్చినన్ని రోజులు, ఇంకేం ప్రకటన వస్తుంది మన చచ్చిపోయిన పాములు(తెలంగాణా కాంగ్రెస్ లీడర్స్) తెలంగాణా ఎం తెస్తాయి..?అవి చావవు, తెలంగాణా తేవు.
                    ఇక ఇన్ని రోజులు ఏదో జరుగుతుందని ఎదురు చుసిన ఉద్యమ కారులు తమ డప్పులకు దుమ్ము దులుపి ధరువేస్తే ప్రజలంతా ఉద్యమం చెయ్యడానికి సిద్ధంగా ఉన్నారు, ఇక తెలంగాణా ప్రజల ముందు ఉన్న ఏకైక కర్తవ్యం కాంగ్రెస్ ను అంతం చెయ్యడం.. "కాంగ్రెస్ కో కథం కరో, తెలంగాణా హాసిల్ కరో".

21, జనవరి 2013, సోమవారం

ఎం ఐ ఎం పై ఒక విశ్లేషణ...

                                                                                                                      - from HMTV

20, జనవరి 2013, ఆదివారం

తెలంగాణా పోరాట యోధులు..

స్వామి రామానంద తీర్థ:

స్వామి రామానంద తీర్థ స్వాతంత్య్ర సమరయోధుడు. హైదరాబాద్ సంస్థాన విమోచనానికి పాటుబడ్డ మహా నాయకులు. రామనంద తీర్థ 1903 అక్టోబర్ 3న గుల్బర్గా జిల్లా జాగిర్ గ్రామంలో జన్మించారు. ఆయన తండ్రి సన్యాసం స్వీకరించడంతో బంధువుల ఔదార్యంతో విద్యాభ్యాసం కొనసాగించారు. 

రామానంద కమ్యూనిస్టు భావాలున్న హిందూ సన్యాసి. ఆయన అసలు పేరు వెంక భగవాన్‌రావు ఖెడ్గికర్. మొదట లోకమాన్య బాల గంగాధర తిలక్‌ను ఆదర్శంగా తీసుకున్నారు. అలాగే, గాంధీజీ ప్రారంభించిన సహాయ నిరాకరణ ఉద్యమంలోనూ పాల్గొన్నారు. కార్మిక నాయకుడు ఎన్‌ఎం జోషితో కలసి కార్మికోద్యమంలో పాల్గొన్నారు. 

1938లో కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్‌లో తన శాఖను ప్రారంభించిన అనంతరం తీర్థ నిజాంకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమించారు. విద్యాలయాలను నెలకొల్పడంతో పాటు ఆర్యసమాజ్‌తో కలసి ఉద్యమించారు. హైదరాబాద్ రాష్ట్రం భారత యూనియన్‌లోవిలీనం కావడంలో ఆయన ఎనలేని కృషి చేశారు. చివరకు 22 జనవరి 1972న రామానందతీర్థ శాశ్వతంగా కన్నుమూశారు. 

పండిట్ నరేంద్ర జీ:

పండిట్ నరేంద్ర జీ 1907 ఏప్రిల్ 10న హైదరాబాద్‌లో జన్మించారు. చిన్నతనంలోనే ఆర్యసమాజ్ పట్ల ఆకర్శితుడై సంస్థ ఉపాధ్యక్షునిగా సేవలందించారు. నిరంకుశ నిజాం పాలనకు వ్యతిరేకంగా ఎన్నో ఉద్యమాలు చేశారు. హైదరాబాద్ ఉక్కుమనిషిగా ఈయనను పిలుస్తారు. 

1938లో నిజాం ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాడినందుకు 3 సంవత్సరాలు మన్ననూరు జైలుకు వెళ్లవలసి వచ్చింది. జైలునుండి వచ్చాక వైదిక దర్శనం పేరుతో పత్రిక పెట్టి దాని ద్వారా నిజాం నిరంకుశత్వాన్ని తీవ్రంగా నిరసించారు. దీంతో నిజాం, పత్రిక మూత వేయడంతో పాటు ఆస్తులన్నీ జప్తు చేశాడు. అయినా ఆయన ఉద్యమాన్ని వదలలేదు. 

హైదరాబాద్ రాజ్యం విముక్తి కోసం తీవ్రంగా కృషి చేశారు. 1947లో మళ్లీ జైలుకు వెళ్లవలసి వచ్చింది. హైదరాబాద్ భారత యూనియన్‌లో కలిసిన తర్వాత నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడుగా నరేంద్రజీ పనిచేశాడు. 1952లో హైదరాబాద్ రాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యారు. 1975లో రాజకీయాలకు స్వస్తి చెప్పి సన్యాసం స్వీకరించాడు. 1976 సెప్టెంబర్ 24న ఆయన తుదిశ్వాస విడిచారు.

అమృతలాల్ శుక్లా:

కరీంనగర్ జిల్లా సిరిసిల్లాకు చెందిన అమృతలాల్ శుక్లా తెలంగాణ సాయుధ పోరాటంలో మడమతిప్పని సేనాని. తన సాయుధ దళంతో నిజాం సైనికులను ముప్పుతిప్పలు పెట్టిన వీరుడు. తన దళంతో సిరిసిల్ల, ఇల్లంతకుంట పోలీస్‌స్టేషన్ క్యాంపులపై దాడులు చేసి నిర్భంధంలో ఉన్న వారిని విడుదల చేయించారు. హుజురాబాద్ తాలుకా పరిధిలోని సైదాపూర్, నిమ్మపల్లి తదితర ప్రాంతాల్లోని పోలీస్ క్యాంపులపై అక్కడి సమరయోధులు దాడులు చేశారు. నిజాం రాజ్యంలో ఇవి పెను సంచలనాన్ని సృష్టించాయి. అమృతలాల్ శుక్లా గెరిల్లా దళానికి నాయకునిగా వ్యవహరించారు. నిజాం ప్రభుత్వం ఆయనను అరెస్ట్ చేసి 13 ఏళ్ల పాటు జైలు శిక్ష విధించింది. ఆయనను చంచల్‌గూడ జైలు నుంచి తరలిస్తుండగా సికిందరబాద్ రైల్వేస్టేషన్ నుంచి తప్పించుకున్నారు. అలా అమృతలాల్ తిరిగి పోరాటంలో భాగస్వామి అయ్యారు.
ఉప్పల రామయ్య:

జమీందారీ వ్యవస్థకు వ్యతిరేకంగా సాయుధ రైతాంగ పోరాటంలో కీలక పాత్ర వహించిన వారిలో నల్గొండ జిల్లా మునగాలకు చెందిన ఉప్పల రామయ్య ఒకరు. 1905లో జన్మించిన రామయ్య ఆనాటి మునగాల పరగణా జమీందారులకు వ్యతిరేకంగా ఉద్యమించారు. 1929లో పరగణా జమీందారు నాయని రంగారావు గ్రామానికి చెందిన ఇమ్మడి పాపయ్యతో పాటు మరి కొంతమంది రైతుల భూములను బలవంతంగా లాక్కున్నారు. దీనికి నిరసనగా రామయ్య తొలిసారి సత్యక్షిగహం చేశారు. అయితే, నాటి బ్రిటీష్ ప్రభుత్వం రామయ్యతో పాటు రైతులపై కేసులు నమోదు చేసింది. రామయ్య విద్యాభివృద్ధికి కూడా ఎనలేని సేవ చేశారు. గ్రామంలో ఎలిమెంటరీ పాఠశాలను ఏర్పాటు చేశారు. 

సాయుధ పోరులో ఆరుట్ల, దేవులపల్లి వెంక కలసి పనిచేసిన రామయ్య సాయుధ దళాలకు మందుగుండు సరఫరా చేయడంలో ప్రధాన భూమిక పోషించారు. నాటి ప్రభుత్వం ఆయనపై కేసులు బనాయించి జగ్గయ్యపేట జైలులో నిర్భంధించి కనీసం ఆహారం కూడా అందివ్వకపోవడంతో 1948 సెప్టెంబర్ నెలలో కన్నుమూశారు. స్థానిక విద్యార్థులు చందాలు వేసుకుని ఆయన దహన సంస్కారాలు నిర్వహించాల్సి రావడం పెద్ద విషాదం. ఆయన జ్ఞాపకార్థం మునగాలలో విగ్రహన్ని నెలకొల్పారు.

సర్వదేవభట్ల రామనాథం:


పుట్టింది జమీందారీ కుటుంబంలో అయినప్పటికీ నైజాం సర్కార్ రజాకార్లు సాగిస్తున్న దురాగతాలకు వ్యతిరేకంగా పోరాడిన తెలంగాణ కమ్యూనిస్టు నాయకుడు సర్వదేవభట్ల రామనాథం. నిజాం పాలన, జమీందార్, జగీర్ధార్ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడుతున్న కమ్యూనిస్టు ఉద్యమాల పట్ల ఆకర్షితులై పార్టీలో చేరి ఉద్యమించారు. లక్షలాది రూపాయల విలువైన తమ ఆస్తిని, వందలాది ఎకరాల భూమిని పేదలకు పంచిన గొప్ప త్యాగమూర్తి. పార్టీ కార్యక్షికమాలతో పాటు సింగరేణి కార్మికుల సమస్యల పట్ల రాజీలేని పోరాటాలు నిర్వహించిన యోధుడు. 
కార్మిక హక్కులకోసం పలువురు కమ్యూనిస్టు నాయకులతో కలసి ‘సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్’ పేరుతో కార్మిక యూనియన్‌ను స్థాపించి ప్రప్రథమ అధ్యక్షునిగా 1945లో ఎన్నుకోబడ్డారు. 1947లో అరెస్ట్ కాబడి 1948 వరకు జైలు జీవితం గడిపారు. 1948 నుండి 1949 వరకు రహస్య జీవితం గడిపారు. ఆయన ఆదర్శ కమ్యూనిస్టు. కమ్యూనిస్టు ఉద్యమ స్ఫూర్తిదాత. తన యావదాస్తిని పేదలకు పంచి తనకంటూ ఏమీ లేకుండా తన చివరి ఊపిరి వరకు ప్రజల కోసం పనిచేసిన త్యాగశీలి. 
రాంజీగోండు:

అడవి బిడ్డలను దోచుకుంటున్న నిజాం ప్రభుత్వ దమననీతికి వ్యతిరేకంగా ఉద్యమం నెరపిన వీరుడు రాంజీగోండు. ఆయన ఆదిలాబాద్ జిల్లాలో తెలంగాణ సాయుధపోరాటానికి ఊపిరిలూదిన విప్లవసేనాని. నిర్మల్ పట్టణాన్ని కేంద్రంగా చేసుకొని రజాకార్లకు వ్యతిరేకంగా ఉద్యమించారు. 

రాంజీగోండు నాయకత్వంలో గోండులు బ్రిటీష్ వారికి తొత్తులుగా ఉంటూ నైజాం సంస్థానాన్ని నడిపించిన వారిపై తిరగబడ్డారు. ‘జల్-జమీన్-జంగల్’ కోసం గిరిజనుల తరఫున పోరాడిన ఆయన పోరాటాలు, త్యాగాలు చిరస్మరణీయం. 

నిజాం పాలకులకు వ్యతిరేకంగా పోరాడినందుకు గాను 1880 ఏప్రిల్‌లో నాటి నైజాం ముష్కరులు రాంజీగోండుతో పాటు ఆయన వెయ్యిమంది అనుచరులను మర్రిచెట్టుకు సామూహికంగా ఉరి తీశారు. తరువాత ఆ మర్రినే ‘గోండ్ మర్రి’, ‘ఉరుల మర్రి’ అని పిలిచేవారు. ప్రస్తుతం ఆ చెట్టు లేదు. దాని స్థానంలో అమరవీరుల స్థూపాన్ని నిర్మించారు.

టి.బి. విఠల్‌రావు:

ప్రపంచ కార్మికోద్యమంలో మిలిటెంట్ పోరాటాలను మిలితం చేసి అనేక హక్కులు సాధించుకున్న సింగరేణి కార్మికులకు తెలంగాణ సాయుధ పోరాటమే స్ఫూర్తినిచ్చింది. సీపీఐ అనుబంధ సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ నాయకత్వంలో సింగరేణిలో అనేక ఉద్యమాలు జరిగాయి. 

నిజాం నవాబుతో పాటు స్థానిక గ్రామీణ భూస్వాముల పెత్తనం కింద ఉన్న సింగరేణి సంస్థలో 1939 నుంచే ఉద్యమాలు మొదలయ్యాయి. తొలి తరం కార్మిక నాయకులలో టి.బి. విఠల్‌రావు ఒకరు. ఒకవైపు తెలంగాణ సాయుధ పోరాటంతో పాటు సింగరేణి కార్మిక హక్కుల కోసం ఉద్యమించిన నేత విఠల్‌రావు. పనిగంటల తగ్గింపు, పనికి తగిన వేతనం, కార్మికులకు వసతులు వంటి వాటికోసం ఆయన ఉద్యమించారు. రహస్య జీవితాన్ని గడుపుతూనే ఆయన కార్మిక హక్కుల కోసం ఉద్యమించారు. 


సింగరేణి తొలినాళ్లలో వెట్టిచాకిరీకి వ్యతిరేకంగా నిర్బంధాలను ఎదిరించిన నాయకుడిగా విఠల్‌రావును కార్మికులు గుర్తు చేసుకుంటారు. తెలంగాణ సాయుధ పోరాటం జరుగుతున్న సమయంలోనే ఇటు సింగరేణి సంస్థలో కార్మిక హక్కుల కోసం పోరాడిన యోధుడాయన!

బత్తుల సాయన్న వెంకట్ రావు :

బత్తుల సాయన్న వెంకట్ రావు 1900 డిసెంబర్ 11న సికిందరబాద్‌లోని న్యూబోయిగూడలో సాయన్న, ముత్తమ్మలకు జన్మించారు. వెంకవూటావు ఎనిమిదవ తరగతి వరకు చదివినప్పటికీ, ఆయన సొంత ప్రతిభతో నిజాం ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా కూడా పనిచేశారు. జోగిని వ్యవస్థను ప్రభుత్వం నిషేధించేటట్టు వెంకవూటావు చేయగలిగారు. ఆయన ఆది హిందూ సోషల్ సర్వీస్ లీగ్, మన్నసంఘం, స్వస్తదళ్ యువజన సంఘం, హైదరాబాద్ దళిత జాతి సంఘం, అరుంధతీయ యువజన సంఘం వంటి సంఘాలతో కలిసి పనిచేశారు. 

బొంబాయి మహర్ సదస్సుకు అధ్యక్షత వహించే అరుదైన గౌరవం ఆయనకు దక్కింది. ‘ఆది హిందూ సోషల్ సర్వీస్ లీగ్’ బి.ఎన్. వెంకవూటావుకు ‘వీరరత్న’, నిజాం ప్రభుత్వం ‘ఖుస్రూ-ఎ- దక్కన్’ అనే అరుదైన బిరుదులతో సన్మానించింది. 1947లో లాయక్ అలీ మంత్రివర్గంలో చేరి విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలను నిర్వహించారు. హైదరాబాద్‌లో జరిగిన భారత మిలటరీ యాక్షన్‌లో గృహ నిర్బంధానికి గురయ్యారు. ఆ తర్వాత 1951లో ఇండిపెండెంట్‌గా రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఆల్వాల్ సమీపంలో తన స్థలాలను పేదలకు విరాళంగా ఇచ్చారు. 1953 నవంబర్ 4న ఆయన తనువు చాలించారు.

వానమామలై జగన్నాథచార్యులు:
‘రైతు వాల్మీకి’గా పేరుగాంచిన వానమామలై జగన్నాథచార్యులు శ్రీరాముణ్ని రైతుగా అభివర్ణిస్తూ ‘రైతు రామాయణం’అనే గొప్పకావ్యం రాశారు. ఆయన కరీంనగర్ జిల్లాలోని హుజురాబాద్‌లో 1908 డిసెంబర్ 19న సీతారామమ్మ, బక్కయ్యశాస్త్రీలకు మూడవ సంతానంగా జన్మించారు. వానమామలై వరదాచార్యులకు వీరు స్వయనా సోదరుడు. తెలుగు, సంస్కృతం, హిందీ, ఉర్దూ, తమిళం, ఇంగ్లీషులో ఆయనకు ప్రవేశం ఉంది. తెలంగాణ రైతాంగ పోరాటంలో పాల్గొంటూ హరికథలు చెబుతూ, పాటలు పాడుతూ నాటి పోరాట యోధులను ఉత్సాహ పరిచేవారు. నైజాం సర్కార్ నిర్భంధానికి గురి చేయడంతో మహారాష్ట్రలోని చాందకు వెళ్లి అజ్ఞాతవాసం గడిపారు. నాడు రైతులు అనుభవించిన బాధలు, అనుభవాలతో జగన్నాథచార్యులు ‘రైతు రామాయణం’ కావ్యం రచించారు. ఈ కావ్యం మొత్తం తెలంగాణ సంప్రదాయ రీతిలో కొనసాగింది. జిల్లాలోని జూలపల్లి వరాహస్వామిని కీర్తిస్తూ శతకాలు, 1968లో ఇల్లంతకుంట సీతారామస్వామి సుప్రభాతం రాయడంతో పాటు 1971లో గోదాదేవి రచించిన తిరుప్పావణిని తెలుగీకరించారు. ‘రైతు రామాయణ’ కావ్యానికి 1984లో సాహిత్య అకాడమీ అవార్డు లభించింది.
                                                                  -from namaste telangana

19, జనవరి 2013, శనివారం

సమైక్యాంద్ర ఉద్యమం కృత్రిమమే : బైరెడ్డి


కొంత మంది పెట్టుబడిదారులు మాత్రమే తెలంగాణను అడ్డుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారని, సమైక్యాంధ్ర ఉద్యమం కృత్రిమ ఉద్యమేనని రాయలసీమ హక్కుల వేదిక నేత బైరెడ్డి రాజశేఖరరెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. పెద్దరాష్ట్రాలకు సీఎం, మంత్రులు కావాలనుకునేవారే ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని, వందల సంఖ్యలో విద్యార్థులు, యువకులు చనిపోతుంటే పట్టించుకోకుండా స్వార్థకోసం రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. పెద్ద రాష్ట్రాల్లో పదవులను అనుభవించి అక్రమంగా దండుకోవాలనేవారే సమైక్యవాదాన్ని వినిపిస్తున్నారని బైరెడ్డి ఆరోపించారు. కోస్తా నేతల ఎంగిలి మెతుకులకు కక్కుర్తి పడి సీమ నేతలు సమైక్య వాదాన్ని వినిపిస్తున్నారని ఫైర్ అయ్యారు. తెలంగాణ ఇచ్చినా, ఇవ్వకపోయినా ప్రత్యేక రాయలసీమ ఏర్పాటు చేయాలని బైరెడ్డి డిమాండ్ చేశారు. 

15, జనవరి 2013, మంగళవారం

యూపీఏ నుంచి తెలంగాణకు మొదటి మద్దతు ..


- అఖిలపక్షం తర్వాత యూపీఏ నుంచి తెలంగాణకు మొదటి మద్దతు
- కాంగ్రెస్‌పై మరింత ఒత్తిడి
- ప్రభావం చూపనున్న కీలక భాగస్వామి నిర్ణయం
- ఇతర పార్టీలూ మద్దతుగా నిలిచే అవకాశం

 తెలంగాణ ఏర్పాటుకు యూపీఏలో కీలక భాగస్వామి బహుజన్ సమాజ్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. తెలంగాణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెడితే మద్దతునిస్తామని స్పష్టం చేసింది. చిన్న రాష్ట్రాల ఏర్పాటును తాము కోరుకుంటున్నామని బీఎస్పీ అధినేత్రి, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతి మంగళవారం మరోమారు స్పష్టం చేశారు. తన యాభై ఏడో పుట్టినరోజును పురస్కరించుకుని ఢిల్లీలో ఓ హోటల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. 

తెలంగాణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెడితే బీఎస్పీ ఎంపీలంతా మద్దతునిస్తారని తెలిపారు. చిన్న రాష్ట్రాలు, తెలంగాణ గురించి ఆమె వివరంగా మాట్లాడారు. ‘‘మా పార్టీ మొదటినుంచి చిన్న రాష్ట్రాలకు అనుకూలంగానే ఉంది. చిన్న రాష్ట్రాలు, చిన్న జిల్లాలు ఉండటం వల్లనే దేశంలో పరిపాలన క్షేత్ర స్థాయిలోకి వెళుతుంది. మేము అధికారంలో ఉన్నప్పుడు ఉత్తరప్రదేశ్‌ను నాలుగు రాష్ట్రాలుగా విభజించాలని అసెంబ్లీ తీర్మానాన్ని కేంద్రానికి పంపాం. పశ్చిమ యూపీ, బుందేల్‌ఖండ్, పూర్వాంచల్, మధ్యాంచల్ ప్రాంతాలను రాష్ట్రాలుగా చేయాలని కేంద్రాన్ని కోరాం. ఆంధ్రప్రదేశ్ కూడా వైశాల్యంలో పెద్ద రాష్ట్రం. అక్కడ దశాబ్దాల కాలంగా స్వరాష్ట్రం కోసం తెలంగాణ ప్రజలు ఉద్యమాలు చేస్తున్నారు. మేము గతంలోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మద్దతు తెలిపాం. ఇప్పుడు కూడా పార్లమెంటులో తెలంగాణ బిల్లు ప్రవేశపెడితే మా పార్టీ పూర్తి మద్దతు తెలుపుతుంది’’ అని వివరించారు. ఈ సమావేశంలో ఆమె జాతీయ రాజకీయాలతో పాటు, ఉత్తరప్రదేశ్‌కు సంబంధించిన పలు అంశాలపై మాట్లాడారు.

మాయావతి ప్రకటనతో కాంగ్రెస్‌పై మరింత ఒత్తిడి :
తెలంగాణపై అఖిలపక్ష సమావేశం తర్వాత జాతీయస్థాయిలో బీఎస్పీ మద్దతు ప్రకటించడం కొత్త పరిణామాలకు దారితీస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. యూపీఏలో కీలక భాగస్వామి అయిన ఈ పార్టీ సానుకూలంగా స్పందించడంతో కాంగ్రెస్‌పై ఒత్తిడి మరింత పెరుగుతుందనేది స్పష్టం. అలాగే ఇతర పార్టీల నుంచి కూడా మద్దతు లభించే అవకాశాలున్నాయి. తెలంగాణ ప్రకటనకు మరికొద్ది రోజులు మాత్రమే గడువున్న నేపథ్యంలో మాయావతి ప్రకటన తెలంగాణవాదుల్లో ఆనందాన్ని నింపింది. బీఎస్పీ మొదటినుంచి తెలంగాణకు మద్దతునిస్తున్నా.. ఈ సమయంలో ఇలా ప్రకటించడం ఎంతో కీలకమని విశ్లేషకులు భావిస్తున్నారు. మాయావతి ప్రకటనతో కాంగ్రెస్ పార్టీపైన మరింత ఒత్తిడి పెరిగినట్లయిందంటున్నారు. ఎప్పుడూ ఏదో వంక పెట్టి తప్పించుకుందామనుకునే కాంగ్రెస్ మాయావతి ప్రకటనను తేలికగా తీసుకునే అవకాశం లేదని అభిప్రాయపడుతున్నారు.

ఆమె ప్రకటన యూపీఏలోని ఇతర భాగస్వామ్యపక్షాలపై కూడా ప్రభావం చూపుతుందని, పలు పార్టీలు తెలంగాణకు అనుకూలంగా స్పందించే అవకాశముందని విశ్లేషకుల అంచనా. యూపీఏ భాగస్వామ్యపక్షాలైన ఎన్సీపీ, డీఎంకే తదితర పార్టీలకు కూడా తెలంగాణలో దశాబ్దాలుగా జరుగుతున్న పోరాటాల పట్ల పూర్తి అవగాహన ఉందని, శరద్‌పవార్ లాంటి నాయకులు గతంలో తెలంగాణకు బహిరంగ మద్దతు తెలిపిన విషయాన్ని వారు గుర్తుచేస్తున్నారు. మరోవైపు.. పార్లమెంటులో సాధారణ మెజారిటీతో కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేయవచ్చని రాజ్యాంగ నిబంధన (ఆర్టికల్ మూడు) ఉన్నందున ములాయంసింగ్ లాంటివారు వ్యతిరేకించినా కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించి తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సి ఉంటుందంటున్నారు. అదే దిశగా కాంగ్రెస్ పార్టీ ఆలోచనలు కొనసాగుతున్నట్లు సమాచారం.

                         యు పీ ఏ లో మరో కీలక భాగస్వామి లాలూ ప్రసాద్ యాదవ్ గతం లోనే తెలంగాణకు మద్దతు ప్రకటించిన విషయం తెలిసినదే...http://www.naatelangaana.blogspot.in/2011/11/blog-post_3237.html

10, జనవరి 2013, గురువారం

ఆదిలాబాద్ జైలుకు అక్బర్


-ఖైదీ నంబర్ 7546
-22 వరకూ రిమాండ్
-ఆదిలాబాద్ కోర్టు ఆదేశం
- మొత్తం ఏడు సెక్షన్ల కింద అభియోగాలు
- హైదరాబాద్‌లోని ఆస్పత్రికి తరలించండి
- అక్బరుద్దీన్ తరపు న్యాయవాది పిటిషన్
- చెంచల్‌గూడ జైలుకు మార్చాలని వినతి
- రెండు పిటిషన్‌లనూ కొట్టేసిన మేజిస్ట్రేట్
- జిల్లా జైల్లోనే మెరుగైన వైద్యానికి ఆదేశాలు
- రాత్రంతా నిర్మల్ ఠాణాలోనే అక్బర్
- ఉదయం ఐదున్నరకు మేజిస్ట్రేట్ ముందుకు
- ఆయన ఆదేశాలతో ఏడున్నరకు జైలుకు

ఆదిలాబాద్, జనవరి 9 (టీ మీడియా): విద్వేష ఉపన్యాసాలు చేసిన కేసులో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీకి 14 రోజుల రిమాండ్ విధిస్తూ ఆదిలాబాద్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. జైలుకు బదులు అక్బర్ను ఆస్పత్రికి తరలించాలన్న పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది. మంగళవారం సాయంత్రం హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో అరెస్టు చేసిన అక్బరుద్దీన్‌ను అదే రోజు రాత్రి నిర్మల్ పోలీస్ స్టేషన్‌కు తరలించిన సంగతి తెలిసిందే.

రాత్రి స్టేషన్‌లోనే గడిపిన అక్బరుద్దీన్‌ను ఉదయం 5.15 గంటలకు జిల్లా అదనపు ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ అజేష్ కుమార్ ఎదుట ప్రవేశపెట్టారు. మేజిస్ట్రేట్ జనవరి 22 వరకూ జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో అక్బర్‌ను ఆదిలాబాద్ జిల్లా జైలు కు ఉదయం 7.30 గంటలకు తరలించారు. అక్కడ ఆయనకు అండర్ ట్రయల్ ఖైదీ నంబర్ 7546ను కేటాయించారు. అంతకు ముందు ఆయనను ఏడు రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై గురువారం విచారణ జరుగనుంది. అక్బరుద్దీన్‌కు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ ఆస్పత్రికి తరలించాలని వేసిన పిటిషన్‌తోపాటు.. ఆదిలాబాద్ జిల్లా జైలు నుంచి చెంచల్‌గూడ జైలుకు తరలించాలని దాఖలు చేసిన పిటిషన్‌ను కూడా మేజిస్ట్రేట్ తిరస్కరించారు. ఆయనకు మెరుగైన వైద్య సదుపాయాలు అందజేయాలని జిల్లా జైలు సూపరింటెండెంట్‌ను ఆదేశించారు.

తొలుత ఐపీసీలోని 121, 153-ఏ సెక్షన్ల కింద అక్బరుద్దీన్‌ను అరెస్టు చేసిన నిర్మల్ పోలీసులు.. విచారణ అనంతరం 120-బీ, 124-ఏ, 153-ఏ, 188,195-ఏ, 505 సెక్షన్ల కింద కూడా కేసులు పెట్టారు. 120 సెక్షన్ (నేరపూరిత కుట్ర), సెక్షన్ 121 ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించడం) 124-ఏ సెక్షన్ (దేశ ద్రోహం) కింద జీవితఖైదు పడే అవకాశముంది. 153-ఏ సెక్షన్ ప్రకారం.. మతం, జాతి, వర్గాలమధ్య శతృత్వం పెంచిన నేరం కింద ఐదేళ్ల జైలు శిక్షకు, సెక్షన్ 188 ప్రకారం ప్రభుత్వ ఉత్తర్వును ధిక్కరించిన నేరంకింద 6 నెలలు, 195 -ఏ సెక్షన్ ప్రకారం.. వేరే మతాన్ని బహిరంగంగా కించపరిచిన నేరం కింద మూడేళ్లు, సెక్షన్ 505 ప్రకా రం.. ప్రజలను దుశ్చర్యకు పాల్పడేటట్లు రెచ్చగొట్టే ప్రకటన చేసిన నేరం కింద మూడేళ్ల జైలు శిక్షలకు అవకాశాలు ఉన్నాయని పోలీసు వర్గాలు అంటున్నాయి.

అక్బర్‌కు 14రోజుల రిమాండ్ విధించిన వెంటనే నిర్మల్‌లో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. కవరేజీ కోసం వచ్చిన నేషనల్ చానళ్ల ఓబీ వ్యాన్‌లపై అల్లరిమూకలు రాళ్లతో దాడికి దిగాయి. వెంటనే పెద్ద సంఖ్యలో పోలీసులు అక్కడికి చేరుకోవడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. తొలిరోజు ములాఖత్‌లో అక్బరుద్దీన్‌ను కలువడానికి నలుగురు సమీప బంధువులు, ఎంఐఎం ఎమ్మెల్యే అఫ్సర్‌ఖాన్, జిల్లా నాయకులు సిరాజ్ ఖాద్రి, ఫారుఖ్ హైమద్ జిల్లా జైలుకు వచ్చారు. 


ఆరోగ్యంగా ఉన్నారని చెప్పాకే అరెస్టు
అక్బర్‌పై ఎక్కువ కేసులు నమోదైనందున విచారణకు చాలా సమయం పడుతుందని, అందుకే ఏడురోజులు తమకు అప్పజెప్పాలంటూ పిటిషన్ వేశామని కరీంనగర్ రేంజ్ డీఐజీ రాథోడ్ భీమానాయక్ చెప్పారు. అక్బర్‌ను జిల్లా జైలుకు తరలించాక ఆయన విలేకరులతో మాట్లాడారు. సమావేశంలో జిల్లా ఎస్పీ సర్వశ్రేష్ట త్రిపాఠి, ఇతర పోలీసు అధికారులున్నారు.

కనిపించని బంద్ ప్రభావం
అక్బరుద్దీన్ అరెస్టును నిరసిస్తూ బుధవారం భైంసా బంద్‌కు ఎంఐఎం పిలుపునిస్తే, తమను అనవసరంగా అరెస్టు చేశారంటూ హిందూ వాహిని సభ్యులు జిల్లా బంద్‌కు పిలుపునిచ్చారు. అయితే బంద్ ప్రభావం పెద్దగా కనిపించలేదు. భైంసాలో కొందరు మాత్రం స్వచ్ఛందంగా దుకాణాలు మూశారు. 

రిమ్స్‌లో అక్బర్‌కు వైద్య చికిత్సలు
అనారోగ్యంతో ఉన్నానని అక్బర్ పిటిషన్ పెట్టుకున్న నేపథ్యంలో ఆయనకు ఆదిలాబాద్ రిమ్స్‌లో వైద్యచికిత్సలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. గురువారం ఉదయం ఓ ప్రత్యేక గదిలో అక్బర్‌కు చికిత్స అందించనున్నారు. ఇక్కడ బుధవారం నుంచే భద్రత ఏర్పాటు చేశారు.

వరంగల్ జిల్లాలో రెండు కేసులు
వరంగల్ లీగల్, జనగామ: అక్బరుద్దీన్‌పై కేసుల పరంపర ఆగలేదు. బుధవారం వరంగల్ జిల్లాలో రెండు కేసులు నమోదయ్యాయి. యూ ట్యూబ్‌లో ప్రసారమైన అక్బరుద్దీన్ ప్రసంగంతో తన మనోభావాలు దెబ్బతిన్నాయంటూ కాజీపేటకు చెందిన న్యాయవాది కొత్త రవి దాఖలు చేసిన పిటిషన్‌పై స్పందించిన మేజిస్ట్రేట్ గోవిందడ్డి.. విచారణ జరపాలని కాజీపేట పోలీసులను ఆదేశించారు. ఇవే ఆరోపణలతో జనగామలో యంగ్‌ఫోర్స్ ఫర్ బెటర్ యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు కీసర దిలీప్‌డ్డి కోర్టును ఆశ్రయించారు. 

కరీంనగర్‌లో ఎంఐఎం నేతల అరెస్టు
కరీంనగర్ క్రైం/కార్పొరేషన్: జిల్లా కేంద్రంలోని తెలంగాణచౌక్‌లో ఎంఐఎం నాయకులు సీఎం దిష్టిబొమ్మను దహనం చేసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన ఎంఐఎం కార్యకర్తలను చెదరగొట్టి పోలీసులు లాఠీలకు పని చెప్పారు. మరోవైపు నుంచి వచ్చిన ఎంఐఎం కార్యకర్తలు సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. దీంతో పోలీసులు ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు వాహాజోద్దీన్, ప్రధాన కార్యదర్శి గులాం అహ్మద్, మాజీ డిప్యూటీ మేయర్ షమీని అరెస్టు చేశారు. సీఎం దిష్టిబొమ్మ దహనానికి నిరసనగా జిల్లా కాంగ్రెస్ మైనార్టీ సెల్ ఆధ్వర్యంలో అక్బరుద్దీన్ దిష్టిబొమ్మను దహనం చేశారు. దీంతో తెలంగాణ చౌక్ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. పోలీసుల చొరవతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగలేదు. గంగాధర మండలంలో ఎంఐఎం నేతలను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. 

బోధన్‌లో షాపులపై దాడులు
నిజామాబాద్ జిల్లా బోధన్‌లో ఎంఐఎం బంద్ సందర్భంగా బుధవారం ఆందోళనకారులు షాపులపై దాడులు చేశారు. పలు దుకాణాలను ధ్వంసం చేశారు. వాటిని బీజేపీ జిల్లా అధ్యక్షుడు పెద్దోళ్ల గంగాడ్డి పరిశీలించారు.

9, జనవరి 2013, బుధవారం

కుట్రలో భాగంగానే మతవిద్వేషాలు...


- చంచల్‌గూడా జైల్లోనే మతవిద్వేషాల కుట్రకు వ్యూహరచన 
- తెలంగాణ లెక్చరర్ల ఫోరం డైరీ ఆవిష్కరణ సభలో వక్తల హెచ్చరిక
హైదరాబాద్, జనవరి 8 (టీ మీడియా): తెలంగాణను ఆరు దశాబ్దాలుగా అడ్డుకుంటున్న కాంగ్రెస్ మరోసారి ఆఖరి ప్రయత్నంగా మతవిద్వేషాలను రెచ్చగొట్టి తెలంగాణను వాయిదా వేసేందుకు రాజకీయంగా కుట్రపన్నుతున్నదని తెలంగాణ జేఏసీ నేతలు, పలు రాజకీయ పార్టీలు, ఉద్యోగ సంఘాలు, ప్రజా సంఘాల నేతలు ఆరోపించారు. ఈ కుట్రను రాజకీయంగానే తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. జనవరి 27 తర్వాత కూడా తెలంగాణను వాయిదావేసేందుకు ప్రయత్నిస్తే సీమాంధ్ర నాయకులు పాదయాత్రలను ముగించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. హైదరాబాద్ రాజధానిగా పది జిల్లాల తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం తప్ప మరో ధ్యాస తెలంగాణ ప్రజలకు లేనేలేదని మంగళవారం పబ్లిక్‌గార్డెన్స్‌లోని ఇందిరాప్రియదర్శిని ఆడిటోరియంలో జరిగిన తెలంగాణ లెక్చరర్ల ఫోరం (టీఎల్‌ఎఫ్) డైరీ, క్యాలండర్ ఆవిష్కరణ సభలో వక్తలు స్పష్టం చేశారు. 

టీఎల్‌ఎఫ్ అధ్యక్షుడు కత్తి వెంకటస్వామి అధ్యక్షత వహించిన సభలో జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం, బీజేపీ శాసనసభా పక్ష నేత యెండల లక్ష్మీనారాయణ, టీఆర్‌ఎస్ నేత హరీశ్‌రావు, విద్యావంతుల వేదిక అధ్యక్షుడు మల్లెపల్లి లక్ష్మయ్య, తెలంగాణ జర్నలిస్టుల ఫోరం ఉపాధ్యక్షులు పల్లె రవికుమార్, జేఏసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్, న్యూ డెమొక్రసీ నేత సూర్యం, టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు కే స్వామిగౌడ్, టీ ఉద్యోగ సంఘాల జేఏసీ సెక్రటరీ జనరల్ వీ శ్రీనివాస్‌గౌడ్, కో చైర్మన్ విఠల్, ఎంపీజే అధ్యక్షుడు హమీద్ మహ్మద్‌ఖాన్, రసమయి బాలకిషన్, హైదరాబాద్ జేఏసీ కన్వీనర్ ఎంబీ కృష్ణయాదవ్, డాక్టర్ల జేఏసీ అధ్యక్షుడు నర్సయ్య, తెలంగాణ రచయితల వేదిక అధ్యక్షుడు జూలూరు గౌరీశంకర్, ఇంజినీర్ జేఏసీ భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు. 

సీమాంధ్ర వలస పాలకుల తాబేదార్లు మతవిద్వేషాలను రెచ్చగొడుతున్నారని, కచ్చితంగా ఇది రాజకీయ కుట్రనేనని జేఏసీ చైర్మన్ కోదండరాం స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలు ఈ కుట్రపట్ల అప్రమత్తంగా ఉండాలని, కుట్రను రాజకీయంగా ఛేదించాలని కోరారు. తెలంగాణ సంఘటిత ఉద్యమశక్తిని చాటి చెప్పాలని, ఇందుకు తెలంగాణ లెక్చరర్లు బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ఒక పరిష్కార దశకు చేరుకునే ప్రతీ సందర్భంలో రాజకీయ దుర్మార్గాలు పెరుగుతున్నాయని, మతవిద్వేషాలు ఈ దుర్మార్గంలో భాగమేనని హరీశ్‌రావు పేర్కొన్నారు. హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ కాకుండా మరే అస్పష్ట ప్రకటనలు చేసినా, తెలంగాణ సహించే స్థితిలో లేదని ఆయన పేర్కొన్నారు. కాంట్రాక్ట్ లెక్చరర్లందరినీ రెగ్యులర్ చేయాలనే డిమాండ్‌తో ఉద్యమాలను మరింత తీవ్రతరం చేయాలని సూచించారు. 

తెలంగాణ ఉద్యమ పథం నుంచి బీజేపీ పక్కకు జరిగే ప్రసక్తి లేదని, మతవిద్వేషాల కుట్రలోభాగం కాకుండా జాగ్రత్త పడుతున్నామని యెండల లక్ష్మీనారాయణ చెప్పారు. ఎంపీజే అధ్యక్షుడు హమీద్ మహ్మద్‌ఖాన్ మాట్లాడుతూ డిసెంబర్ 28, 2012 నుంచి జనవరి 8 వరకు మతఘర్షణలను పెంచేందుకు కుట్రలు జరిగాయని, ఈ కుట్రలో భాగంగానే అక్చరుద్దీన్ అరెస్టు డ్రామాను కిరణ్ సర్కార్ నడిపించిందని హెచ్చరించారు. టీడీపీ, వైఎస్సార్సీపీ ఈ కుట్రలో పాత్రధారులేనని ఆయన పేర్కొన్నారు. బీజేపీ ఈ కుట్రలో భాగం కావద్దని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌లోని గంగాజమున తెహజీబ్‌లో విషం చిమ్ముతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. చెంచల్‌గూడా జైల్లోనే మతవిద్వేషాల కుట్రలకు వ్యూహరచన జరిగిందని స్వామిగౌడ్ అన్నారు. అదృష్టవశాత్తు పాతబస్తీలో ఎలాంటి అల్లర్లు లేవని, తెలంగాణ ముస్లింలు, హిందువులు కలిసి తెలంగాణ జెండా నీడలో ఈ దుర్మార్గాలను తిప్పికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. 

మల్లెపలి లక్ష్మయ్య మాట్లాడుతూ చర్చించుకున్న విషయాలనే మళ్లీ మళ్లీ చర్చిస్తున్నామని, జేఏసీ సారథ్యంలో భారతదేశాన్ని ప్రభావితం చేసే ఒక బలమైన ఉద్యమానికి రచన జరుగాలని అభిప్రాయపడ్డారు. అద్దంకి దయాకర్ ప్రసంగిస్తూ ముస్లింలు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు తెలంగాణ ఉద్యమంలోకి రాకుండా విద్వేషాలను రెచ్చగొడుతున్నారని, చిమ్ముతున్న విషమేఘాల నుంచి తెలంగాణ ప్రజలను కాపాడుకోవాలని అన్నారు. వీ శ్రీనివాస్‌గౌడ్ ప్రసంగిస్తూ ప్రజలను రెచ్చగొ సీమాంధ్ర వలస పెత్తందార్లు చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొ జేఏసీ సిద్ధంగా ఉన్నదని చెప్పారు. న్యూడెమొక్రసీ నేత సూర్యం ప్రసంగిస్తూ తెలంగాణ ప్రజల ప్రథమ శత్రువు కాంగ్రెస్ పార్టీయేనని స్పష్టం చేశారు.పల్లె రవికుమార్ ప్రసంగిస్తూ కుట్రలను ఛేదించడానికి, తెలంగాణ తెచ్చుకోవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు.                                    - from namaste telangana

6, జనవరి 2013, ఆదివారం

కాలుష్య దీవి బడుగు జీవి..!



షాద్‌నగర్, టీ మీడియా : ఒకగొట్టంలోని పొగ ఆకాశమార్గాన ప్రయాణించి పచ్చని పంట పొలాలను లక్ష్యంగా చేసుకొని అన్నదాత జీవితంతో ఆడుకుంటోంది. మరో గొట్టంలోని రసాయనం నేలతల్లిని తడిపి భూమిలో ఇంకి పచ్చదనాలను కూకటివేళ్లతో పెకిలిస్తోంది. దాహం తీర్చే నీటిని సైతం ప్రజల కు దక్కకుండా మారుస్తోంది. స్థానికులకు ఉపాధిలేదు.. అనర్థాలు తప్పడంలేదు.. ఆందోళనలు చేసినా ఈ దారుణాలను ఆపేవారులేరు.. ఇది షాద్‌నగర్ నియోజకవర్గంలో కాలుష్యం జీవితాలను కాలరాస్తున్న తీరు.
కాలుష్యం ఇలా.. 
షాద్‌నగర్ నియోజకవర్గ పరిధిలో సుమారుగా 100కుపైగా భారీ తరహా పరిక్షిశమలు ఉన్నాయి. వీటిలో ఫార్మ, ఐరన్, బట్టలు, బ్యాటరీస్, వంటసామగ్రి వంటి వస్తువులు ఉత్పత్తి చేసే పరిక్షిశమలు ఉన్నాయి. ఈ పరిక్షిశమల్లో దాదాపు 10వేల మందికిపైగా కార్మికులు వివిధ రంగాల్లో పని చేస్తున్నారు. వందలాది ఎకరాల్లో పరిక్షిశమలు స్థాపించడంవల్ల వీటి నుంచి వెలువడే కాలుష్యతాకిడి వేలాది ఎకరాల పంట కాలుష్యం బారిన పడటమేకాకుండా వందల సంఖ్యలో మూగజీవాలు మృతి చెందుతున్నాయి. నియోజకవర్గ పరిధిలోని కొత్తూరు మండలంలో కొత్తూరు మండలం నందిగామలోని రాయలసీ మ రీరోలింగ్ మిల్, నందిగామలోని వక్షా స్టీల్స్, వీర్లపల్లిలోని శివశక్తి స్పాంజ్ ఐరన్, కొడిచర్లలోని ఆనంద్ స్పాంజ్ ఐరన్, పెంజర్ల రోడ్డులోని వివేక్ టెక్స్‌టైల్స్, కొత్తూరులోని వినాయక స్టీల్స్, తీగాపూర్ బింజు సార్య ఐరన్ ఇండస్ట్రీ, తిమ్మాపూర్‌లోని వంశీధార ఆయిల్ మిల్, దివ్యశక్తి పేపర్ పరిక్షిశమతోపాటు స్కాన్ ఐరన్ పరిక్షిశమలు విడుదల చేసే కాలుష్యబారిన పడి పల్లె ప్రజలు విలవిలలాడుతున్నారు. పరిక్షిశమలనుంచి వెలువడే కర్భన సమ్మెళనాలతో కూడిన వాయు, జల, ఘన పదార్థాల కాలుష్యానికి పల్లెజనం రోగాలబారీన పడుతున్నారు.

పాపం.. ఎంత నష్టం..
రసాయనాల దాటికి పంటలు ఎండిపోతుండగా పొగదాటికి నీరు నలుపురంగులోకి మారుతోంది. ఇళ్లల్లోని గిన్నెలతో సహా ఆహార పదార్థాలు విషంగా మారుతున్న పరిస్థితి నెలకొన్నది. మరోవైపు తాగునీరు ఎరుపురంగులోకి చేరి తాగేందుకు వీలులేకుండా మారాయి. ఇక్కడి కాలుష్యం దాటికి చెరువులు కూడా సాగునీటికి పనికిరాకుండాపోయాయి. ఫలితంగా నియోజకవర్గం ఓ కాలుష్య దీవిగా మారి రెక్కాడితేగానీ డొక్కాడని బడుగుజీవిని వేధిస్తోంది.

నష్టాలు.. ఇవి.. 
పరిక్షిశమల కాలుష్యం ద్వారా ఇక్కడ తాగునీరు పూర్తిగా క లుషితమైపోయింది. ఈ నీరు తాగితే రకరకాల రోగాలతోపా టు విష జ్వరాలు ప్రభలుతున్నాయి. ఒంటి నొప్పులు, ఎముకలు పనిచేయకపోవడం. వ్యక్తులు పూర్తిగా మంచాన పడే పరిస్థితి నెలకొన్నది. ఈ పరిస్థితులు అనుభవిస్తూనే మృత్యువాత పడిన సందర్భాలు ఉన్నాయి. మరోవైపు పశువులు కూడా లెక్కకు మించి మరణిస్తున్నాయి.

అసలుకే ఎసరు..
ఈ పరిక్షిశమలు ప్రారంభమైనప్పుడు స్థానికంగా అందరికీ ఉద్యోగాలు, ఉపాధి దొరుకుతాయని ఆశించారు. కానీ ఇక్కడ స్థానికులకు ఎలాంటి ఉద్యోగ అవకాశాలు కల్పించకపోగా పం ట పొలాలను నాశనం చేస్తూ అటు రైతులకు దిగుబడులులేకుండా కూలీలకు ఉపాధిలేకుండా చేస్తున్నారు పరిక్షిశమ యజమానులు ఇక్కడి పరిక్షిశమల్లో తెలంగాణ వాదులు ఒక్కరు కూడా కనిపించరు. సీమాంవూధవూపాంతంతోపాటు ఇతర ప్రాం తాల నుంచి వచ్చినవారే ఉన్నతస్థాయి ఉద్యోగాలు చేస్తున్నారు. కానీ తెలంగాణ ప్రజలు రోజువారి కూలీలుగానే వ్యవహరించే పరిస్థితి నెలకొంది. 

ఆందోళనపూన్నో.. 
కాలుష్యపు బారినుంచి తమకు విముక్తి కల్పించాలని ప్రతి యేట రైతులు ఆందోళన చేస్తూనే ఉన్నారు. అధికారులు మాత్రం పట్టించుకోవడంలేదు. కందివనం, ఎలికట్ట, ఇప్పలపల్లి, పెంజర్ల, తీగాపూర్ గ్రామాల పరిధిలో రైతులు ఎన్నోమార్లు ఆందోళన చేసిన సంఘటనలు ఉన్నాయి. న్యాయస్థానానికి కూడా ఆశ్రయించారు. పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలని ఉన్నత న్యాయ స్థానం ఆదేశించినా ఏనాడూ పట్టించుకున్న పాపానపోలేదు.

మాటలు.. మూటలు.. 
ఆందోళనలు జరిగినప్పుడల్లా కాలుష్య నివారణ అధికారులు, ఆర్డీఓలు, జేసీలు, కలెక్టర్లు వస్తున్నారు. పరిశీలిస్తున్నా రు. అలాగే స్థానిక ప్రజావూపతినిధులను మొదలుకొని ఎమ్మెల్యే లు, మంత్రులు వచ్చి హడావుడి చేస్తున్నారు. పరిశీలనలు, ప రామర్శలు సరేసరి కాని సమస్యలు మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా ఉన్నది. రైతుల ముందు ఏవో మాటలు చెప్పి పరిక్షిశమల యజమానుల వద్ద డబ్బుల మూటలు అందుకుంటున్నారనే ఆరోపణలు తీవ్ర స్థాయిలో ఉన్నాయి.                                  from namaste telangana

4, జనవరి 2013, శుక్రవారం

సంఘ విద్రోహక శక్తి....ఎం ఐ ఎం


గత కొంత కాలం గా పేస్ బుక్ లో అక్బరుద్దీన్ ఒవైసీ వివిధ జిల్లాల  పర్యటనలో చేసిన వ్యాక్యాలు హల్చల్ చేస్తున్నాయి, సామాజిక మీడియా లో వస్తున్న వ్యతిరేకతకు తోడు, హిందూ సంస్థలనుండి వస్తున్న వ్యతిరేఖతతో కదిలిన ప్రభుత్వం తు తు మంత్రం గా అతగాడి పై కేసు లు బనాయించి చేతులు దులుపుకుంది.అసలు విషయాన్నీ చర్చిద్దాం.
                      కాంగ్రెస్ పార్టీకి కటిఫ్ చెప్పిన ఒవైసీ ఆ వెంటనే జగన్ బాబు తన మిత్రుడని ప్రకటించేసాడు, జగన్ తో పొత్తు పెట్టుకున్తదని అందరికి తెలిసి పోయే సరికి విషయాన్నీ అర్థం కాకుండా చెయ్యడానికి చంద్ర బాబు బెస్ట్ సి ఎం అంటూ బాబు ను పొగిడాడు, ఇక అసెంబ్లీ లో అక్బరుద్దీన్ కాంగ్రెస్ పై ఉన్న అక్కసునంత వెళ్ళగక్కాడు, తెలంగాణా ఉద్యమం తీవ్రం గా జరుగుతున్న సమయం లో మాకెందుకు లే అని మౌనం గా ఉన్న ఈ ఒవైసీ బ్రదర్స్, లగడపాటి తో విందులో పాల్గొని  తమ నిజ స్వరూపాన్ని బట్ట బయలు చేసాడు.

                                   పార్టీ ని జిల్లాల్లో కూడా విస్తరించేందుకు, ముస్లిం లను సంఘటితం చేసేందుకు తాను రాష్ట్ర మంతా పర్యటిస్తానని చెప్పిన ఒవైసీ నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్ లలో పర్యటించి, అక్కడి ముస్లింలను ఆకట్టుకోవడానికి హిందూ మతం పై, హిందూ దేవతలపై, దేవాలయాలపై, గోవు పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసాదు, ఇవన్ని వివాదాస్పదం అవ్వడమే కాకుండా దేశవ్యాప్తం గా సంచలనం రేకెత్తిస్తున్నాయి, అయితే ఒవైసీ చేసిన ఈ వ్యాక్యలకు 2 కారణాలు కనిపిస్తున్నాయి.

         1) జగన్ తో దోస్తీ కట్టిన ఒవైసీ తన పార్టీ ని విస్తరించదానికి అనువైన సమయం ఇదే అని బావించాడు, తెలంగాణా ఉద్యమ దెబ్బతో వై ఎస్ అర్ సి పీ లో ఎ ఒక్క బలమైన నాయకుడు చేరకపోవడం, చేరే చోట మోట నాయకులు అంత రెడ్డి సామాజిక వర్గం వారే కావడం తో పార్టీ విస్తరణ అనేది పెద్ద సవాల్ గా మారింది, ఒవైసీ తో జత కడితే హైదరాబాద్ సిటీ లోని కాంగ్రెస్ నాయకులంతా తప్పని సరిగా జగన్ గూటికి చేరుతారు, అంతే కాకుండా ముస్లిం ప్రభావిత ప్రాంతాలలోని నాయకులు తమ పార్టీలో చేరుతారు, అందుకే ఒవైసీ తో జగన్ జత కట్టాడు, ఇక ఒవైసీ కూడా తన పార్టీ ని పెంచుకోవాలంటే తెలంగాణా లో అంతగా ప్రభావం లేని పార్టీ, అంతో ఇంతో ఆదరణ ఉన్న నాయకుడు అయితే తమ పార్టీ సులువు వివిధ స్థానాల్లో పోటి చేసి, గెలిచే అవకాశాలు ఉంటాయి కావున జగన్ వైపు వెళ్ళారు.
2) తెలంగాణా కు ఎం ఐ ఎం ఏనాడూ మధతు తెలపలేదు, నిజామాబాదు ఎన్నికలలో తెలంగాణా మీద ఉన్న అభిమానం తో అక్కడి ముస్లిం లు బి జె పీ కి ఓటు వేసారు, తెలంగాణా ఉద్యమం లో ముస్లిం లు చురుకుగా పాల్గొంటున్నారు, ఇదే జగన్ పార్టీ కి అడ్డుగా ఉంది, దీనిని దెబ్బ తీసే ఉద్దేశ్యం తోనే, ముస్లిం లను ఉద్యమానికి దూరం చెయ్యాలని సీమంధ్రులు సంకల్పించారు, అందుకు ఎం ఐ ఎం ను ఉపయోగించుకున్నారు, సీమంద్రుల ఎంగిలి మెతుకులకు ఆశపడే ఒవైసీ తెలంగాణా ముస్లిం ల ఆత్మ గౌరవాన్ని సీమంద్ర పెత్తం దారులకు అమ్ముకున్నాడు,  తెలంగాణా ఉద్యమం నుండి మతం పేరుతో ముస్లిం లను వేరు చేసి ఉద్యమాన్ని బలహీనం చెయ్యాలనే కుట్రకు సీమధ్రులు పాల్పడ్డారు, అందుకు ఈ ప్రాంతంలో పుట్టిన ఈ రజాకర్ పార్టీ నాయకుడు వంతపాడాడు, అందుకే ఈ సభలు.

                                  తమ పార్టీ విస్తరణ , తెలంగాణా ఉద్యమం నుండి ముస్లిం లను దూరం చెయ్యడం,  తెలంగాణకు ముస్లిం లు వ్యతిరేఖం అని తెలంగాణా ను అడ్డుకోవడం, తద్వారా జగన్ పార్టీ ని తెలంగాణా లో గెలిపించడం, ఇవే వీరి లక్ష్యాలు.
                          ఆదిలాబాద్ సభలో అక్బరుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాక్యాలు," మనం 25 కోట్ల మందిమి ఉన్నాము , వారు వంద కోట్ల మంది ఉన్నారు, 15 నిమిషాలు పోలీసులు దూరం జరిగితే ఎవరి సత్తా ఏమిటి అనేది తెలుస్తుంది",  మరో సభలో, " హిందువులకు వారానికో కొత్త దేవుడు పుట్టుకొస్తాడు, మనం లక్ష్మి అని విన్నాము, ఈ భాగ్య లక్ష్మి ఎవరో, మనం అందరం ఉమ్మి వేస్తే ఆ ఉమ్మిలో కొట్టుకు పోత్తుంది ఆ గుడి, భాగ్య లక్ష్మి టెంపుల్ ను కూల్చి వేస్తాం, హిందూ దేవతలు నగ్నం గా, అసహ్యంగా ఉంటారు", " హిందువులు నపుంసకులు, మనం ఎవరికీ తీసిపోము, ఈ మైక్  ఆయుధమైతే  అందరిని నారికే వాడిని," " గోవును అమ్మ అంటారు అమ్మనే అమ్ముకుంటారు, వాళ్ళు అమ్ముకుంటే తప్పు కాదు కాని మనం కొనుక్కుంటే తప్ప..?", ఇవన్ని ఎవరి రాజకీయ అవసరాల కోసం చేసినవి, అధికారం కోసం ఎంతటి క్రురత్వనికైన తెగిస్తార..? హిండువులన్ధరిని మట్టు పెడుతానని వ్యాఖ్యానించిన అది తప్పు కాదా..?, వీరు జనానికి ఏది బోదించిన తప్పులేదా..? రాష్ట్రం లో కేంద్రం లో ప్రజలను కాపాడటానికి ప్రభుత్వాలు, పొలిసు వ్యవస్థలు ఉన్నాయా, శవాలు గా మారాయ..? ముస్లిం లను చిన్న మాట అంటేనే పైకి లేచే సుడో సేకులర్ వాదులు నేడు ఏరి..?  వారికి ఇది తప్పుగా కనిపించడం లేదా..? సేకులరిసం అంటే ఏమిటి, కేవలం హిందువులకు మాత్రమె పరిమితమ..?అది ముస్లిం లకు వర్తించదా..? 

                                                 సమాజాన్ని మెరుగు పరుస్తాం, దమ్ముంది మాకు దగ్గు ఉంది  అని చాటుకునే తెలుగు డబ్బాలు ఎ బెజ్జంలో దాక్కున్నాయి, పేరుకు 20 వార్త చానళ్ళు ఉన్నాయి, అన్నింటికీ అన్ని జిల్లాల్లో ప్రతినిధులు ఉన్నారు, అందరికంటే మేమే ముందు వెలుగులోకి తెచ్చాం అంటూ క్రెడిట్ కోసం పాకులాడే చిల్లర వెధవలు ఈ విషయాల జోలికి ఎందుకు పోలేదు..? ఒవైసీ అంటే ప్యాంటు తడుస్తుందా....? లేక జగన్ డబ్బుల మూటలు  అందాయ..? నిజం చెప్పలే అని బొమ్మలు ఇచ్చుడు కాదు దేశ సార్వ భౌమత్వనికే భంగం కలిగించేలా మాట్లాడిన ఇలాంటి వాళ్ళను వీధికీడ్చాకుండా, మాది నిప్పులాంటి నిజాలను చెప్పే చానెల్, అంటూ కథలు చెప్పటం దేనికి, మీరు చేసింది ఏంటి..? దేశ ద్రోహమా.? లేక వంచన..? పేస్ బుక్, లాంటి సామాజిక మీడియా అనేది లేకుంటే నేడు ఒవైసీ చేసిన వ్యాక్యాలు బయటికి వచ్చేవ..? 20 చానెల్ లు ఉండి  ఎందుకు బంగాళాఖాతం లో దూకి చావండి, ఒకడు చంద్రయాన్ అని వాడి ముడ్డి చుట్టూ తిరుగుతాడు, ఇంకొకడు షర్మిల పాదయాత్ర అంటూ, అదే చూపిస్తాడు, మీ వార్తల్లో నిజాయితి ఎక్కడుంది..? మీ సొంత డబ్బా తప్ప...?

                                  రాజశేఖర్ రెడ్డి గతం లో చన్న రెడ్డి ని ముఖ్య మంత్రి పదవి నుండి దించడానికి పాత బస్తీలో మత కల్లోలాలు చేయించాడు, అదే ఫార్ముల లో వెళ్తున్నాడు జగన్. ముందు కనిపించేది ఒవైసీ, వెనకాల ఉండి  నడిపించేది జగన్...

                   కాశీం రజ్వి వీడు రాజకారుల నాయకుడు, వాడి పార్టీ పేరే ఎం ఐ ఎం, అదే పేరుతో తెలంగాణా లోని హిందువులపై పగ తీర్చుకోవడానికి పుట్టిన పార్టీ నే ఈ ఎం ఐ ఎం, తెలంగాణా ప్రజలు అతి క్రూరుడైన నియంత నిజాం రాజు నుండి విముక్తి పొంది విజయం సాధించారు, ఇది అందరి విజయం, ఇందులో కేవలం హిందువులే పాల్గొనలేదు, ముగ్ధుం మొహినోద్దిన్, షోయబుల్ల ఖాన్ లాంటి ఎందరో ముస్లిం లు పాల్గొన్నారు, కాని కొందఱు స్వార్ధపరులైన నాయకులు తమ రాజకీయ స్వార్థం కోసం ముస్లిం రాజైన నిజాం పై హిందువులు విజయం సాధించారని అది కలకాలం నిలువ కూడదని ముస్లిం లకు బోధిస్తున్నారు, అందుకే నేడు ఎం ఐ ఎం పార్టీ తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకు తద్వారా తెలంగాణా విముక్తికి సహకరించడం లేదు..
           2009 ఎన్నికల సమయంలో అసదుద్దీన్ ఒక వీడి రౌడి లాగా ప్రవర్తించాడు, ఓటు వేయడానికి వచ్చిన జనాన్ని చితకబాదాడు. ఆ వీడియో ..


                           అక్బరుద్దీన్ చేసిన వ్యాక్యలకు మీడియా ప్రాధాన్యం ఇవ్వలేదు, కేవలం పేస్ బుక్, ట్విట్టర్ ద్వార మాత్రమె ప్రజల్లో చర్చ జరిగింది, హిందూ సంస్థలు ఈ వ్యాక్యలపై మండి  పడ్డాయి, జావేద్ అక్తర్ లాంటి ముసలీం మేధావులు సైతం ఒవైసీ వ్యాక్యలను ఖండించారు, ఎం ఐ ఎం పార్టీ ని బ్యాన్ చెయ్యాలని బి జె పీ కోరుతుంది, కాని ఇంకా మన సుడో మేధావులు మేల్కొన లేదు, ఒక్క మాట కూడా ఖండించలేదు, సేకులరిసం అంటే కేవలం బి జె పీ కి, భజరంగ్ దళ్  కు మాత్రమె వ్యతిరేఖమా..? ప్రేమికుల రోజు దళ సభులు దాడులు చేస్తే వారి స్వచ్చకు భంగం కలిగిస్తున్నారని మొసలి కన్నీరు కార్చే నాస్తికులు, ఒవైసీ చేసిన వ్యాక్యలను సమర్ధిస్తున్నారా..?
                          గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలలో పాటించిన స్ట్రాటజి నే ఎం ఐ ఎం  2014 ఎన్నికలలో పాటించాలని తద్వారా విజయం పొందాలని చూస్తున్నారు, 50% కన్నా ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్నచోట ముస్లిం అభ్యర్థిని 50% కన్నా తక్కువ ముస్లిం జనాభా ఉన్న చోట హిందూ అభ్యర్థిని నిలబెట్టడం ద్వార ముస్లిం ఓట్లతో పాటు హిందూ ఓట్లు కూడా పొంది విజయం సాదిన్చాలనేది వీరి ఆలోచనా.. తస్మాత్ జాగ్రత్త.... 

       అక్బరుద్దీన్ పై కేసు వేసిన లాయర్ కు చంపేస్తామంటూ బెదిరింపు కాల్ లు వచ్చాయి, ఐన ఆయన దైర్యం గా ముందడుగు వేసారు.
                                    తెలంగాణాలోని  ముస్లింలు అందరు తెలంగాణా  కావాలని కోరుకుంటున్నారు, తెలంగణా జిల్లాలలోని ముస్లిం లే కాదు పాత బస్తి లోని ముస్లిం లు కూడా , తెలంగాణా వస్తే వారి బతుకులు బాగు పడుతాయి అని ఆశిస్తున్నారు, కాని వారి అభివ్రుధిని అడ్డుకుంటున్నది మాత్రం ఎం ఐ ఎం పార్టీ మాత్రమె, వారు అజ్ఞానం లో ఉన్నంత వరకే వీరి ఆటలు సాగుతాయి  అందుకే వారిని ఎధగనివ్వారు. తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాలకోసం యావత్ సమాజాన్నే బలిచేసేందుకు సిద్దమైన ఈ రాక్షసుల  స్వైర విహారాన్ని అడ్డుకోవాలి, ఆ శక్తి కేవలం జై తెలంగాణా అనే నినాదానికి మాత్రమె ఉంది.......