హోం

31, డిసెంబర్ 2012, సోమవారం

నూతన సంవత్సర శుభాకాంక్షలు....తెలంగాణా పై చంద్ర బాబు నిజాయితి ఎంత..?


అకిల పక్ష భేటి లో తన వికారి స్పష్టం చేస్తానని చెప్పిన చంద్రబాబు సీల్డ్ కవర్ లో తాము 2008 లోనే ప్రణబ్ కు లేఖ ఇచ్చామని అది ఇంకా తమ దగ్గరే ఉందని, దానిని ఉపసంహరించు కాలేదని చెప్పారు.ఆ లేఖకు కాలం చెల్లింది అని ఆ పార్టీ నాయకుడు, అకిలపక్షం లో పాల్గొన్న యనమల రామకృష్ణుడే గతంలో చెప్పారు, మరి ఆ లేఖకు ఎ పాటి విలువ ఉంది, పోనీ ఆ లేఖ వాపసు తీసుకోలేదు అంటున్నారు కాబట్టి, మరో సారి మీరు రాసిన లేఖలో మేం తెలంగాణా కు అనుకూలం గా ఉన్నాం, తెలంగాణా ఏర్పాటుకు సహకరిస్తాం అని చెప్పవచ్చు కదా..? ఇదే అందరిలో ఉన్న సందేహం గతం లోనే టి డి పీ ని నమ్మి మోసపోయిన తెలంగాణా ప్రజలు చంద్ర బాబు ను నమ్మడానికి సిద్దం గా లేరు, డిసెంబర్ 7 న అనుకూలం అని డిసెంబార్ 10 న ఎవరిని అడిగి నిర్ణయం తీసుకున్నారని అన్న ఈయన , వచ్చిన తెలంగాణా ప్రకటనను అడ్డుకున్నదని తెలంగాణా ప్రజలందరికీ తెలుసు.ఇతగాడి తెలంగాణా వ్యతిరేఖత నిన్న వరంగల్ జిల్లా లో మల్లి బయటపడింది.

                         

30, డిసెంబర్ 2012, ఆదివారం

దేవుడి పాలనలో భూ బకాసురుడు ఎవ్వరు..?


తెలంగాణా కు మేం వ్యతిరేఖం కాదు, తెలంగాణా సెంటిమెంట్ ను మేం గౌరవిస్తున్నాం అని మా ప్లినరిలోనే స్పష్టంగా మా వైఖరి చెప్పం, ఇది వై ఎస్ అర్ పార్టీ వారి మాట. తెలంగాణా అవసరమే లేదని, తనకు సమైక్యంద్ర ఉంటేనే బాగుంటుందని ఆ పార్టీ తెలంగాణా కు చెందినా నాయకురాలు కొండా సురేఖ వ్యాక్యనించడం, జగన్ పార్లమెంట్ లో సమైక్యంద్ర ప్ల కార్డ్ పట్టుకోవడం ఆ పార్టీ విదాన్నాన్ని చెప్పకనే చెబుతున్నాయి, జగన్ పార్టీ తెలంగాణా లో పట్టు నిలుపు కోవడానికి తహః తహ లాడుతుంది, ఆంధ్రలో కాంగ్రెస్ ను నమ్ముకుంటే ఓట్లు పడవు, టి డి పీ కథ ముగుసింది కావున నాయకులందరికీ కొత్త పార్టీ అవసరం ఏర్పడింది, రాజశేకర్ రెడ్డి పేరు చెప్పుకొని సెంటిమెంట్ అనే పేరుతో కొత్త సీస లో పాత సార పోస్తున్నారు. కొత్త పార్టీ ని ఎన్నుకున్న వచ్చే వారు మాత్రం పాత నాయకులే.
                          ఇక తెలంగాణా లో పరిస్థితులు భిన్నం, తెలంగాణా సెంటిమెంట్ బలంగా ఉండటం తో నాయకులూ సీమంద్ర పార్టీల వైపు వెళ్ళడానికి భయపడుతున్నారు, తమ రాజకీయ భవిష్యత్తు ఏమవుతుందో అని సంశయం వ్యక్తం చేస్తున్నారు, దీనికి బలం చేకూరుస్తు పర్కాల్ బై ఎలెక్షన్ లో ఆ పార్టీ లో బలమైన నాయకురాలు కొండా సురేఖ ఓడిపోవడం, ఇప్పుడు ఆ దంపతులు రాజకీయ నిరుద్యోగులుగా మారడం కూడా నాయకులను ఆలోచనలో పడేస్తుంది. ఇప్పటి వరకు వరంగల్, కరీం నగర్, వంటి జిల్లాల్లో వై సి పీ కి అతి గతి లేదు, ఆదిలాబాద్, నల్గొండల్లో మాజీలు ఆ పార్టీలో చేరారు, కోమటి రెడ్డి బ్రతర్స్ తాజాగా వై సి పీ లోకి వెళ్ళేది లేదని చెప్పారు, రెడ్డి కార్డ్ తో రెడ్డి మాజీ ఎం ఎల్ ఎ లను, నాయకులను ఆకర్షిస్తున్నాడు జగన్. 
                                  ఇక గ్రేటర్ హైదరాబాద్ లో ఎం ఐ ఎం పార్టీ ఎ పార్టీ కి మద్దతు ఇస్తే ఆ పార్టీ లోకి వెళ్ళే0దుకు సిద్ధంగా ఉన్నారు అధికార పార్టీ సభ్యులు, చేరికలు గెలుపులు అన్ని కేంద్రం నెలరోజుల్లో తీసుకునే నిర్ణయం పై ఆధారపడి ఉంటాయి, కేకే తాజాగా చేసిన వ్యాక్యాల ప్రకారం తెలంగాణా ను కాంగ్రెస్ ఇస్తే కె సి అర్ తమ వెనక ఉంటాడని, తెలంగాణా ను కాంగ్రెస్ ఇవ్వకపోతే తామే కె సి అర్ వెనక నడుస్తామని చెప్పారు, కాబట్టి రాజకీయాలు ఎ రకం గా నైన మారవచ్చు , కాని ప్రధానమైన పోటి మాత్ర0 టి అర్ ఎస్, వై సి పీ ల మధ్య ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
                           తెలంగాణా లో పాదయాత్ర చేసిన షర్మిల తాను రాజన్న బిడ్డనని, జగనన్న చేల్లెనని, జగన్ వదిలిన బానాన్నని, చెప్పుకుంటూ ఊర్లని తిరిగారు, అయితే తెలంగాణా వాదులు అడిగిన ప్రతిసారి తాము తెలంగాణా కు వ్యతిరేఖం కాదని, తమ పార్టీ తెలంగాణా సెంటిమెంట్ ను గౌరవిస్తుందని చెప్పుకొచ్చారు, ఇదే అభిప్రాయాన్ని అఖిలపక్ష సమావేశం లో చెప్పారు, తెలంగాణా గురించి తమ అధినేత పార్టీ ప్లీనరీ సమావేశం లోనే స్పష్టత ఇచ్చారని, కేంద్రం ఆర్టికల్ 3 ప్రకారం నిర్ణయం తీసుకోవచ్చని, కాంగ్రెస్ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెప్పారు, రాష్ట్రం లో ఒక ప్రతిపక్ష పార్టీ గా ఉన్న వై సి పీ రాష్ట్ర విభజన విషయం లో సరైన నిర్ణయం చెప్పకుండా కాంగ్రెస్ కె నిర్ణయాధికారం వదిలి వెయ్యడం ఏమిటి..? ఇంతదానికి వాళ్ళకు ఒక పార్టీ ఎందుకు..?
                                       కాంగ్రెస్ తెలంగాణా ఇవ్వకపోతే మీరు ఎం చేస్తారు..? 2014 లో తెలంగాణా గురించి మీ వైకరి ఏమిటి..? 2014 లో ఒకవేళ మీ పార్టీ గేలిస్తే తెలంగాణా కు ఎం చేస్తారు..? కేంద్రం లో చక్రం తిప్పగలిగే సంఖ్యలో ఎం పీ లు ఉంటె అప్పుడు మీ పార్టీ ఎం చేస్తుంది..? తెలంగాణా పల్లెల్లో తిరుగుతూ రాజన్న రాజ్యం తెస్తానని ప్రజలకు కళ్ళే బుల్లి మాటలు చెప్పటం కాదు, మేము అధికారం లో లేము, రాష్ట్రం ఇచ్చే శక్తి మాకు లేదు అని తప్పించుకోవడం కాదు, 2014 లో అధికారం ఇవ్వండి తెలంగాణా తీర్మానం అసెంబ్లీ లో చేస్తాం, కేంద్రం పై ఒత్తిడి తెచ్చి తెలంగాణా సాధిస్తాం అని ఎందుకు చెప్పడం లేదు..? ఇవే ప్రశ్నలు సీల్డ్ కవర్ డ్రామాల బాబు కు చెందు తాయి..పాద యాత్రను అడ్డుకుంటే నానా రాదంతం చేసే వారి అనుచరులు ఈ విషయం లో ఎందుకు స్పష్టత ఇవ్వరు, తెలంగాణా పై స్పష్టత లేకుండా ఎవరిని మోసం చెయ్యడానికి ఆ పార్టీ లో చేరారు ఈ ప్రాంతపు దొంగలు, టి డి పీ లో చేరిన వై సి పీ లో చేరినా ఒక్కటే, టి డి పీ వాళ్ళు తెలంగాణా ను అడ్డుకున్న ద్రోహులే, వై సి పీ నాయకులు కూడా, ఎందుకంటే 2009 ఎన్నికల ప్రచారంలో హైదరాబాద్ కు వెళ్ళాలంటే వీసా పాస్పోర్ట్ అడుగుతారని వెకిలి నవ్వుల రాజశేకర్ తన కడుపులో ఉన్న విశాన్నంత తెలంగాణా పై కక్కాడు,  ఆయన కుమారుడు పార్లమెంట్ లో  సమైక్యంద్ర ప్ల కార్డ్ పట్టుకున్నడు, ఆమరణ నిరాహరదిక్ష చేసిన అతని బాబాయి మామయ్యలు, ఇవన్ని మరచి పోయి కులపిచ్చితో, డబ్బుకు అమ్ముడుపోయి ఈ ప్రాంత ప్రజల ఆశయాలను తాకట్టు పెట్టి సీమంద్రులకు వారి నల్ల దానానికి దాసోహం అనడం ఈ ప్రాంత నాయకులకు సిగ్గుచేటు, తెలంగాణా ప్రజల ఆకాంక్షలు అక్కర లేదు, కాని జగన్ బాబు కావాలి, జనం పై తుపాకి తో కాల్చాలి, బూతులు తిట్టాలి, కాని జగన ను ఘనం గా పొగడాలి ఇదే విధానం తో ముందుకు వెళ్లి మంత్రి పదవికి రాజీనామా చేసి, ఎం ఎల్ ఎ గా అనర్హత వేటు వెయ బడిన కొండ సురేఖ కు పట్టిన రాజకీయ నిరుద్యోగమే ఇతర నాయకులకు పడుతుంది, తమ వ్యక్తిగత అవసరాల కొరకు ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షలను తాకట్టు పెడితే, కాలోజి చెప్పినట్లుగా ప్రాంతేతరులను ప్రాంతం దాటే వరకు తరిమి కొడతా, ప్రా0తీయులను ప్రాంతం లోనే బొంద పెడుత0...
      రాజన్న రాజ్యం లో తెలంగాణా భూములు స్వాహ చేయ బడ్డాయి, రంగా రెడ్డి జిల్లా తన అస్తిత్వాన్ని కోల్పోయింది, దేవుడి పాలనలో దయ్యాలు ఎవరు..? ఆ దేవుడు దేవుడేనా దయ్యమ..? తన కొడుకు కడుపు నింపడానికి ఆ భు బకాసురుడు చేసిన భు దందాలు చుడండి....
                                      

29, డిసెంబర్ 2012, శనివారం

10,000 viewsఅమాస చంద్రుడు...


టిడిపీ - తెలుగు వారి ఆత్మగౌరవాన్ని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఢిల్లీ లో తాకట్టు పెడుతున్నారని, తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని కాపాడడమే ప్రధాన ఎజెండాగా ఏర్పడ్డ పార్టీ, తెలుగు జాతి మనది నిండుగా వెలుగు జాతి మనది, అని అన్ని ప్రాంతాలవారు కలిసి మెలిసి ఉండాలని ఆకాంక్షను వెళ్ళగక్కాడు ఆ పార్టీ వ్యవస్థాపకుడు, అప్పటికే రెండు ఉద్యమాలు రాష్ట్రంలో జరిగాయి, తెలంగాణా, జై ఆంద్ర ఉద్యమలతర్వత తెలంగాణా నినాదమే కనబడకుండా తెలుగు  తెర వేలుపు గా కొనియాడబడిన ఎన్ టి అర్ తెలుగు దేశం పార్టీ ని స్థాపించాడు, తెలుగు వారి ఆత్మగౌరవాన్ని విశ్వవ్యాప్తం చేస్తానని ప్రతినబూనాడు, జనం తెలంగాణా అనే పదాన్నే మరచి పోయారు, ఎన్ టి ఆర్ కు బ్రహ్మరథం పట్టారు, ఎన్టిఆర్ తర్వాత అధికారం లోకి వచ్చిన చంద్రబాబు హయాంలో అయితే తెలంగాణా అనే పదమే నిషేధం, 2001 లో తెలంగాణా రాష్ట్ర సమితి ఆవిర్భవించింది.
1) కె సి అర్ మీ పార్టీని వీడి టి అర్ ఎస్ అనే పార్టీ పెట్టారు కదా అని విలేకరులు అడిగిన ప్రశ్నకు, "టి అర్ ఎస్ ఆ అలంటి పార్టీ కూడా ఉందా రాష్ట్రంలో" అని అన్నారు బాబు.
* కాని 2009 లో మాత్రం ఆయనకు టి అర్ ఎస్ గుర్తుకు వచ్చింది, మహా కూటమి ఏర్పాటు చేసుకున్నారు, దీని కోసం తెలుగువారి ఆత్మ గౌరవం అనే తమ పార్టీ సిద్ధంతాన్ని పక్కన పెట్టి తెలంగాణకు జై కొట్టారు, ప్రణబ్ ముఖర్జీ కి లెటర్ కూడా రాసారు.
2) 2009 ఎన్నికలలో ఓడిపోగానే టి అర్ ఎస్ తో పొత్తు వల్లే ఓడిపోయామని, టి అర్ ఎస్ తో కలవక పోతే విజయం తమదే అని వ్యాక్యనించారు, కాని చంద్రబాబు గుర్తించాల్సింది ఇక్కడ ఒక్కటి ఉంది, టి డి పీ కి అప్పుడు ఉన్న ఎం ఎల్ ఎ లలో ఎక్కువమంది గెలిచింది తెలంగాణాలోనే, ఆంద్ర లో స్థానాలు ఎక్కువగా ఉన్న గెలిచింది తక్కువ.
3) 2009 డిసెంబర్ 7 న అఖిలపక్ష సమావేశంలో   తెలంగాణకు తీర్మానం అసెంబ్లీ లో పెడితే మొదట మద్దతు ఇచ్చేది తామేనని పేర్కొన్నారు.
* డిసెంబర్ 9 న కేంద్రం నుండి ప్రకటన వచ్చింది, డిసెంబర్ 10 న రాష్ట్రాన్ని విభజించే నిర్ణయాన్ని అర్థరాత్రి ప్రకటి0చడం ఏమిటి..? అని వీరప్ప మొయిలి, చిదంబరం పై నిప్పులు చెరిగారు. తెలంగాణా ను అడ్డుకోవడానికి ఆయన తన శక్తులన్నింటిని వాడుకున్నారు.
4) తమకు రెండు ప్రాంతాలు రెండు కళ్ళు అని రెండుకాళ్ళ సిద్ధంతాన్ని ఎత్తుకున్న బాబు ఆ సిద్ధాంతం అట్టర్ ఫ్లొప్ కావడంతో కొత్త పథకం కోసం వెదికాడు.
* జనవరి 5 న అఖిలపక్షంలో రెండు ప్రాంతాలనుండి ఇద్దరు ప్రతినిధులను పంపి తెలంగాణా, సమైక్యంద్ర రెండు కాళ్ళ సిద్ధాంతాన్ని వల్లే వేసాడు.
5) ఎన్నికల్లో లబ్ధి కోసం బాబ్లి జాబిల్లి ఆటలు ఆడిన జనం నమ్మలేదు, ఇలాగైతే లాభం లేదు అనుకున్న బాబు అనుచరులు పార్టీ నుండి బయటికి క్యు కట్టారు.
6) సీమంద్ర ప్రాంతంలో టిడిపీ వాళ్ళు సమైక్యంద్ర అంటూ కాంగ్రెస్ వాళ్ళ గుడారాల్లో దూరి దొంగ దీక్షలు చేసిన, కాంగ్రస్ ఎంపీ ని వాళ్ళ ఎమేల్సి ముద్దాడిన ఎ విధమైన చర్యలు తీసుకోలేదు.
7) ఇక 2014 లో అధికారమే పరమావధిగా వస్తున్న మీ కోసం అంటూ పాద యాత్ర చేస్తున్న బాబు, తాము తెలంగాణా కు వ్యతిరేఖం కాదు అని, తెలంగాణా కు వ్యతిరేకం గ తాను ఇంతకు ముందు మాట్లాడలేదని, ఇకపై మాట్లాడభోనని చెప్పుకొస్తున్నారు.
* అయితే తెలంగాణా ఏర్పాటుకు తమ పార్టీ అనుకూలం అని ఒక్క మాట చెప్పలేఖ పోతున్నారు.
8) అఖిల పక్ష భేటి నిర్వహించాలని అందులో తమ అభిప్రాయం చెఉథామని చంద్రబాబు కేంద్రానికి లేఖ రాసారు, తన అభిప్రాయాన్ని చెప్పాలనుకునే వారు అఖిలపక్షం లోనే చెప్పాల్సిన అవసరం లేదు, జనానికి చెప్పొచ్చుకద..?

9) కేంద్రం అఖిల పక్ష భేటి నిర్వహించింది,  అందులో చంద్ర బాబు రాష్ట్రం లో పాలన అవినీతి, అస్థిరత, నిరుద్యోగం గురించి ఏకరవు పెట్టారు కాని ఎక్కడ తెలంగాణా రాష్ట్రం ఏర్పరచాలని కాని, తెలంగాణా ఏర్పాటుకు తాము అనుకూలం అని మాత్రం లేదు, సీల్డ్ కవర్లో చంద్రబాబు లేఖను షిండే కు అంధచేసాడు యనమల రామకృష్ణుడు, తమ పార్టీ స్పష్టంగా తెలంగాణా పై వికారి చెప్పిందని ఇక్కడి ప్రజా ప్రతినిధులు చంకలు గుద్దుకుంటున్నారు.
* ఇంతకి ఆ లేఖలో ఏమంది..? తాము 008 లోనే ఒక లేఖ ఇచ్చామని దానిని వెనక్కి తీస్కోలేదని దానికే కట్టుబడి ఉన్నామని స్పష్టం చేసామని ఆ పార్టీ వాళ్ళు చెబుతున్న అది నిజం కాదని, అంధులు 2008 లేఖను బాల పరుస్తున్నామని ఎక్కడ లేదని ఇతర పార్టీల వాళ్లు అంటున్నారు.
* ఐన నిజంగా తెలంగాణా పై స్పష్టమైన వికారి టి డి పీ కి నటే ఈ డొంకతిరుగుడు అంతా ఎందుకు..? తెలంగాణా కు అనుకూలం అని ఒక్క మాట చెబితే సరిపోదా..? చంద్ర బాబు వంద సార్లు మేం తెలంగాణా కు వ్యతిరేఖం కాదు అని చెప్పే బదులు తెలంగాణా కు అనుకూలం అని ఒక్కసారి చెప్పవచ్చు కదా..?

28, డిసెంబర్ 2012, శుక్రవారం

తెలంగాణా గోడు వినిపించదు, కనిపించదు...

ఆల్ ఇండియా మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ All India Majlis-e-Ittehadul Muslimeen, (MIM)               తెలంగాణా ప్రాంతంలో పాత నగరానికి పరిమితం ఐన ఈ పార్టీ తెలంగాణా కు పూర్తి వ్యతిరేఖం గా పనిచేస్తుంది, తెలంగణా రాష్ట్ర ఏర్పాటుపై స్పష్టమైన నిర్ణయం తెలియజేయకుండ రాయలతెలంగాణా అంటూ పసలేని డిమాండ్లను ముందుకు తెస్తుంది, తెలంగాణా వస్తే బి జె పీ బలపడుతుంది కావున తాము తెలంగాణా కు వ్యతిరేఖం అని చెప్పకున్న ఆ పార్టీ అధ్యక్షుడు, చాపకింద నీరులా ఎక్కడ ముస్లిం జనాభా ఎక్కువగా ఉంటె అక్కడకు తమ పార్టీని విస్తరించాలని చేస్తున్నాడు, హిందులకు గాని బి జె పీ కి మద్దతు ఇచ్చిన వారిని మతతత్వ వాదులని ఎదుటి వారిపై భురధజల్లె ఈ పార్టీ నాయకులు, తమ పార్టీ మతం లోనే పుట్టి మతం లోనే పెరిగిందనే విషయం గుర్తించకపోవడం విడ్డూరం.
                         ఇంతకి ఈ పార్టీ ప్రస్థానాన్ని చూసినట్లయితే,  సలాహుద్దీన్ ఒవైసీ పునః ప్రారంభించిన ఈ పార్టీ చరిత్ర మూలాలను తెలుసుకోవాలంటే నిజామ్ కాలం లోకి వెళ్ళాలి.దీనిని 1927 అబుల్ బయాన్ ఖ్వాజా బహావుద్దీన్స్థాపించాడు. ఈ పార్టీ నిజాం కాలం నాటి పార్లమెంటరీ పార్టీ. భారత్ స్వాతంత్ర్యం సాధించిన తరువాత, హైదరాబాదు ప్రత్యేక ప్రాంతంగా వుండాలని కాంక్షించింది.రజాకార్లు (వాలంటీర్లు), ఒక ముస్లిం పారా-మిలిటరీ సంస్థ. ఇది మజ్లిస్ పార్టీతో సంబంధాలు కలిగివుండేది. దాదాపు లక్షా యాభైవేలమంది రజాకార్లు, కాసిం రిజ్వీ నాయకత్వాన భారత రక్షక దళాలతోనూ కమ్యూనిస్టులతోనూ స్వతంత్ర హైదరాబాద్ కొరకు పోరాడాయి. పోలీస్-యాక్షన్ ద్వారా హైదరాబాదు సంస్థానాన్ని భారత-యూనియన్ లో కలుపబడినది. కాసిం రిజ్వీని కారాగారంలో బంధించి, శాంతిభద్రతల దృష్ట్యా పాకిస్తానుకు పంపించివేశారు. మజ్లిస్ పార్టీ బ్యాన్ చేయబడినది.
1957లో మజ్లిస్ పార్టీ నూతన హంగులతో పునస్థాపించబడినది. 1970లో రాజకీయ ప్రవేశం గావించింది.ఆల్ ఇండియా అనే ప్రజాస్వామ్య పేరును తగిలించడం జరిగినది.పునః స్థాపించబడిన ఈ పార్టీ ని సలావుద్దీన్ ఒవైసీ పెంచి పోషించాడు, 1960 లో మల్లేపల్లి కార్పోరేటర్ గా ఎన్నికయ్యారు. 1962,67,78,83లలో ఎమ్మెల్యే గా 1984 నుంచి 2004 వరకు, వరుసగా హైదరాబాదు లోక్‌సభ నియోజకవర్గం నుండి 6 సార్లు ఎన్నికైన పార్లమెంటు సభ్యుడు. హైదరాబాద్ నగర మేయర్లుగా ఇద్దరు హిందువులను దళితులను మజ్లిస్ పార్టీ తరపున గెలిపించారు. ఈయన కుమారులు అసదుద్దీన్ అక్బరుద్దీన్ ఒవైసీలు ఎంపీ, ఎమ్మెల్యేలుగా పనిచేస్తున్నారు.

                 2008 లో ఈయన మరణం తర్వాత పార్టీ అధ్యక్షా బాధ్యతలు ప్రస్తుత హైదరాబాద్ ఎం.పీ అసదుద్దీన్ ఒవైసీ నిర్వహిస్తున్నాడు.ఈ పార్టీకి ఒక ఎం.పీ, 7 గురు ఎం.ఎల్.ఎ లు ఉన్నారు, హైదరాబాద్ కార్పోరేషన్ ఎన్నికలలో 45 స్థానాలను గెలిచి మేయర్ పదవిని పొందిన ఈ పార్టీలో ముస్లింలే కాదు హిందువులు కూడా ఉన్నారు, ఇదే ఉత్సాహంతో అత్యదిక ఎం ఎల్ ఎ స్థానాలు గెలుచుకోవాలని, పార్టీని విస్తరింపజేయాలని ఆరాటపడుతున్నారు, అయితే ముస్లింలు అధికంగా ఉండే తెలంగాణా లో, రాయలసీమలోనూ తమ ఉనుకుని నిలుపుకోవాలని రాయల తెలంగాణా వాదనను తెరపైకి తెస్తున్నారు, ముస్లిం జనాభా అధికంగా ఉండే స్థానాల్లో ముస్లిం అభ్యర్థుల్ని, హిందు ముస్లిం లు దాదాపు సమానంగా ఉన్న స్థానాల్లో హిందువులను నిలబెట్టి సునాయాసం గా గెలవవచ్చనే ఫార్ములాతో ముందుకు వెళ్తున్నారు, గతంలో గ్రేటర్ ఎన్నికల్లో ఇదే స్ట్రాటజీ తో ముందుకు వెళ్లి మంచి ఫలితాల్ని సాధించారు, ఇంకా మస్జిద్ లలో ప్రార్థనలలో పార్టీ ప్రచారం చెయ్యడం కూడా వీరికి అలవాటే, ఎలాగో అధికారం కోసం ఎంతకైనా తెగించే నాయకులు ఉండనే ఉన్నారుగా వారు ముస్లిం పార్టీ ఐన మరే పార్టీ ఐన అధికారం వస్తుందంటే హాయిగా వెళ్లి వాలిపోతారు.ఆగస్టు 92007తస్లీమా నస్రీన్ తన పుస్తకం "శోధ్" తెలుగు భాషలో ఆవిష్కరిస్తున్న వేదికపై మజ్లిస్ పార్టీ ముగ్గురు శాసనసభ్యులు మరియు కార్యకర్తలు పూలకుండీలు, కుర్చీలతో దాడి చేశారు. తస్లీమా నస్రీన్ ను ఇస్లాం-ద్రోహిగా వర్ణిస్తూ నానా హంగామా సృష్షించారు.  వీరికి వ్యతిరేకంగా క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. పక్క వారిని అనునిత్యం మతతతవ పార్టీలు అని దుమ్మెత్తి పోసే ఈ పార్టీ నాయకులు ఎర్రగురివింద తన నలుపెరుగనట్లు ప్రవర్తిస్తుంటారు, వీరిని పల్లెత్తు మాట అనే ధైర్యం ఈ పార్టీ వారికి లేదు, ఎందుకంటే వీళ్ళను ఏమైనా అంటే ముస్లిం ఓట్లు పడవు అనే భయం..
1990 లో మజ్లిస్ పార్టీ చీలిపోయి, అమానుల్లా ఖాన్ (శాసనసభ్యుడు) నాయకత్వంలో మజ్లిస్ బచావో తెహ్రీక్(MBT ) అనే గ్రూపు బయలు దేరినది. ఇది పూర్తిగా తెలంగాణాకు మద్దతు ఇస్తుంది..
           ఒకప్పుడు హైదరాబాద్ రాష్ట్రంలో ప్రజలపై దాడులు చేసి, దోపిడిలు, లూటీలు, మానభంగాలు చేసిన కాసిం రజ్వి సేన పార్టీ పేరును పెట్టుకున్న  ఈ MIM పార్టీకి లక్ష్యాలు ఏముంటాయి, సిద్ధాంతాలు ఏముంటాయి..? తెలంగాణా ప్రజలను తమ బానిసలుగా చేసుకొని, వారి ధన,మాన,ప్రాణాలు దోచుకున్న కాశీం రజ్వి ఆశయాల కొనసాగింపుగా పుట్టిన వారు తెలంగాణా ను ఎందుకు కోరుకుంటారు..? 

ఇదిగో.. షిండేకు టీడీపీ ఇచ్చిన లేఖ!

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కేంద్రం ఏర్పాటు చేసిన అఖిలపక్ష భేటీలో కేంద్ర హోంమంత్రి షిండేకు టీడీపీ ఇచ్చిన లేఖలో ఏముందో తెలంగాణ ప్రజలకు తెలియాల్సిన అవసరముంది. ఆలేఖలో తెలంగాణపై ఆ పార్టీ చిత్తశుద్ది ఏంటో ప్రజలకు తెలియాల్సిన అవసరముంది. అందుకే లేఖ ప్రతిని నమస్తే తెలంగాణ ఇంటర్నెట్‌ ఎడిషన్లో పోస్ట్ చేశారు. 

వినేటోడు వెర్రిబాగులోడు అయితే చెప్పేటోడు చంద్రబాబు అని ఇప్పుడు తెలంగాణ ప్రజలు అనుకుంటున్నరు. కొండంత రాగం తీసిన తెలుగు దేశం పార్టీ అఖిలపక్షంలో కొత్తగా చెప్పిందేమీ లేకపోగా ఏదో పొడిచేశామని తెలంగాణ తెదేపా నాయకులు ఇక్కడ శిగాలు ఊగుతున్నారు.

చంద్రబాబు పంపిన సీల్డ్ కవర్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఉపకరించే మాట ఒక్కటంటే ఒక్కటి లేకపోగా ఒక పచ్చి అబద్ధం ఉన్నది. అదే ప్రణబ్ ముఖర్జీ కమిటీకి తెలుగుదేశం పార్టీ ఇచ్చిన లేఖలోని అంశాలకు కట్టుబడి ఉన్నామనడం.

ఇవ్వాళ ఈ లేఖను డిల్లీకి మోసుకుపోయిన యనమల రామకృష్ణుడు స్వయంగా గత యేడాది మీడియాతో మాట్లాడుతూ 2008 నాటి లెటర్ ఇప్పుడు పనికిరాదని, 2011 మహానాడులో తెలంగాణపై తీసుకున్న వైఖరే ఫైనల్ అని తేల్చాడు. 
పార్లమెంటులో తెలంగాణ బిల్లుకు టీడీపీ అనుకూలంగా ఓటిసననాడు చంద్రబాబును తెలంగాణ ప్రజలు నమ్ముతరు తప్ప అప్పటివరకు తెలంగాణలో టీడీపీని చిన్న పిల్లగాడు కూడా నమ్మరనే విషయం తెలిసిందే.

(from namaste telangana)

27, డిసెంబర్ 2012, గురువారం

చంద్రబాబుకు మల్లయ్య భయం..!


టీడీపీ అధినేత చంద్రబాబు వస్తున్నా-మీకోసం అం టూ చేపట్టిన పాదయాద్ర నేడు జిల్లా పొలిమేరల్లోకి కాలుమోపనుంది. టీడీపీ అగ్రనాయకులు సైతం తమ అధినేతకు తమ మనసులోని మాటను వెల్లగక్కలేని పరిస్థితు ల్లో ఒక సామాన్య రైతుకూలీ చంద్రబాబును తెలంగాణపై నిలదీసిండు. చంద్రబాబుకు అప్పటి నుంచి మొదలైన తెలంగాణ సెగ ఇప్పటీకీ వెంటాడుతున్నది. మూడేళ్ల తరువాత కేంద్రం మళ్లీ తెలంగాణపై కీలమైన అఖిలపక్ష సమావేశం నేడు ఢిల్లీలో నిర్వహించబోతున్నది. తెలంగాణపై టీడీపీ వైఖరి ఏమిటో అనేది ఆసక్తికరంగా మారింది. టీడీపీ నాయకులకే కాదు ఆ పార్టీ శ్రేణులకు ఉత్కం రేపుతున్నది. తెలంగాణపై తమ పార్టీ అనుకూల వైఖరి వెల్లడిస్తే చంద్రబాబు పాదయావూతకు పూలస్వాగతం..లేదంటే ముళ్లబాటగా మారే పరిస్థితి ఉందని ఆ పార్టీ నేతలు అంటున్నారు. తెలంగాణకు అనుకూలంగా స్పందించకుంటే ప్రతికూల పరిస్థితులు తప్పవని ఇప్పటికే తెలంగాణ వాదులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఏం జరుగుతుందోనని పోలీసు లూ టెన్షన్‌కు గురవుతున్నారు. ఇటీవల రాష్ట్రముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి కాకతీయ ఉత్సవాల ప్రారంభానికి వస్తేనే ఆయనపై కోడిగుడ్లు, రాళ్లు, చెప్పులతో తెలంగా ణ వాదులు నానా హంగామా చేశారు. వేలాది మంది పోలీసులున్నా వారి కళ్లుగప్పి తెలంగాణవాదాన్ని చాటారు.

అటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు పాదయాత్ర ఎట్లా ముగుస్తుందా.. అనే అనుమానంతో పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. చేసేది ఏమీలేక టీఆర్‌ఎస్ నా యకులను, తెలంగాణ వాదుల్ని, విద్యార్థులను ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. ఒక రకంగా ఉత్కంఠ వాతావరణం నెలకొన్న ఈ సంకట పరిస్థితుల నేపథ్యంలో చంద్రబాబు పాదయావూతతో జిల్లాలో కాలుపెడుతున్నారు. తెలంగాణ వాదుల్లో ఎవరు గుర్తున్నా గుర్తుండకపోయినా సాధారణ రైతుకూలీ గుర్తుంటాడు. కరడుగట్టిన తన సమైక్యావాదాన్ని మార్చగలిన మొనగాడు ఆ రైతుకూలీ. అతను ఏ రాజకీయ పార్టీకి సబంధించిన వ్యక్తికాదు. రాజకీయ శిక్షణ తరగతుల్లో నిపుణత కలిగిన, విపక్షాన్ని ముప్పుతిప్పలు పెట్టే రాజకీయ చతురత కలిగిన వ్యక్తి అంతకంటే కాదు.. ఆయన కేవలం సగటు తెలంగాణ వాది. తెలంగాణ రావడం కోసం కలలు కంటున్న అతిసాధారణ తెలంగాణ బిడ్డ. ఆయనకు తెలిసిందల్లా తెలంగాణ రాష్ట్రం సిద్ధించాలనే కోరికే. ఆ బలమైన ఆకాంక్ష వల్లే రాష్ట్రంలో తొమ్మిదేళ్ల ఏకచ్ఛవూతాధిపత్యంగా ఏలిన చంద్రబాబునే నిలదీశాడు. ఇప్పుడు చంద్రబాబుకు ఆయన భయం పట్టుకుంది. ఆనాడైతే ఒక్కడే వ్యక్తి కానీ, ఇవ్వాళ ప్రతి ఊరిలో ప్రతిమనిషి అటువంటి డిమాండ్‌నే చంద్రబాబు ముందు పెడుతున్నారు. ఆయనెవరో ఈ పాటికి అర్థమైపోయుంటుంది. అతనే ఫణికర మల్లయ్య. 

రాయపర్తి మండల కేంద్రంలో కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న ఇంట్లో ఆయన కాలం వెళ్లదీస్తున్నారు. తన బతుకులాగే ఛిన్నాభిన్నమైన తెలంగాణ బతుకును బాగుచేయాలని కలలు కన్నవాడు. తన గ్రామం లో చదువుకున్న ఎంతోమంది పిల్లలు ఉద్యోగాలు రాక, ఉ పాధి కరువై బతుకు భారమై ఉన్నారు. ఈ పరిస్థితుల్ని అనుభవించిన వ్యక్తిగా ఫణికర మల్లయ్య 200లో చంద్రబాబు నాయుడును నిలదీసేలా చేసింది. ‘మీరు జేయబట్టే తెలంగాణ వత్తలేదట. మీరు అన్ని ఇస్తానంటున్నారు. మంచిదే గాని, మా ఊళ్లే పోరగాండ్లు, పెద్దోళ్లు అందరూ అడుగుతున్నట్టుగా తెలంగాణ ముచ్చెట చెప్పరాదుండ్లి. మీరొక్కపాలి తెలంగాణ తెచ్చేముచ్చట చెప్పితే మంచిగుంటది గదా’ అని చంద్రబాబు మొహం మ్మీదే త న ఆత్మగౌరవ ఆకాంక్షను వెల్లడించారు. అటువంటి ఫణికర మల్లయ్యలు ఇంటికొకరున్నారు. చంద్రబాబు గతం లో పాలకుర్తి పర్యటన సందర్భంగా ఫణికర మల్లయ్యను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. జిల్లాలో ఎవరు గుర్తున్నా ఉండకపోయినా చంద్రబాబుకు ఫణికర మల్లయ్య బాగా గుర్తుంటారు. అటువంటి ఫణికర మల్ల య్య వల్లే చంద్రబాబుకు చిక్కులుంటాయా? అని తెలుగు తమ్ముళ్లు మథనపడుతుండటం కొసమెరుపు.

from namaste telangana

22, డిసెంబర్ 2012, శనివారం

ధూంధాం పదేళ్ల నడక...తిరుపతి ఏడు కొండలపై ప్రపంచ తెలుగుమహాసభలు. దక్కన్ పీఠభూమి హైద్రాబాద్ నడిబొడ్డున ధూంధాం పదేళ్ల సభ. కాలం కత్తి అంచున రాలుతున్న రక్తపు బొట్లను తాగి బలిసిన కోస్తాంధ్ర పెత్తనానికి నిలు సాక్ష్యం తెలుగు మహాసభలు. శ్రీకాకుళ పోరాటంలో సుబ్బారావు పాణి గ్రాహి, చిన బాబును చంపిన వెంగళరావు 1975లో తెలుగు మహాసభలను జరిపాడు. తెలంగాణ అస్తిత్వ పోరాటాన్ని కనుమరుగు చేయడానికి తెలుగు భాషా ఉత్స వాలు సాధనమయ్యాయి. తెలంగాణ విద్యార్థులను, కవులను, కళాకారులను హత్య చేసినవాడు భాషపేరుతో ఊరేగాడు.

మళ్లీ ఇవ్వాళ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌డ్డి ప్రపంచ తెలుగు మహాసభల కు పూనుకున్నాడు. తెలంగాణలో వెయ్యిమంది విద్యార్థులు నేలరాలారు. రచయితలను, కళాకారులను (అరుణోదయ విమల)బంధిస్తున్నారు. తెలంగా ణ అస్తిత్వం కోసం పెనుగులాడుతున్నది. మరోవైపు పాలకులు భాష పేరుమీద పండగ చేస్తున్నారు. నేటి పాలకులు కాసు బ్రహ్మానందడ్డి, జలగం వారసులే. తెలంగాణ ప్రజాస్వామిక ఆకాంక్షను కనుమరుగు చేయటానికి తెలుగు భాషను ఆయుధంగా ఉపయోగిస్తున్నారు.

అందుకే తెలంగాణ బుద్ధిజీవులు ఆంధ్ర భాషా సాహిత్యాలకు ప్రత్యామ్నాయంగా తెలంగాణ సాహిత్యం, కళారూపాల ను ఎజెండా మీదికి తీసుకురావాలి. ఈ సందర్భంలో హైదరాబాద్ లలిత కళాతోరణంలో ఈనెల 22న జరుగుతున్న పదే ళ్ల ధూంధాం దశాబ్ది ఉత్సవాలు కాకుండా తెలుగు మహాసభలకు ధీటుగా తెలంగాణ కళలు, సాహిత్యాన్ని నిలబె వేదికగా మారాలి. తెలంగాణ ప్రజలపై కోస్తాంధ్ర పాలకులు ప్రయోగిస్తున్న నిర్బంధానికి వ్యతిరేకంగా కలాలు, గళాలు విన్పించే శబ్దం కావాలి.

మలిదశ తెలంగాణ ఉద్యమంలో తెలంగా ణ గానకోకిల బెల్లి లలితను కోస్తాంధ్ర పాలకు లు పదిహేడు ముక్కలుగా నరికేసి, ఐలన్నను బూటకపు ఎన్‌కౌంటర్ చేసి విద్యార్థులను, మేధావులను జైళ్లలో బంధించి గద్దర్‌పై తుపా కి పేల్చి ఆట, పాట, మాటపై ఆంక్షలు విధించి న రోజుల్లో కళాకారుల సంఘటితశక్తిగా 2002 సెప్టెంబర్ 30న ధూం ధాం ఆవిర్భ వించింది. ఏ తెలుగు నిఘంటువును వెదికి నా ఈ పదం కనిపించదు. నిఘంటువుకు కావాల్సిన జనం పదాన్ని ఎజెండామీదికి తెచ్చిన ఘనత తెలంగాణ కళాకారులది. తెలంగాణ పల్లెలన్ని ధూంధాం ఆడాయి. రాజకీయ వేదికలన్నీ ధూంధాం సభలుగా మారాయి. కాలం విధించిన సామాజిక బాధ్యతను ధూం ధాం కళాకారులు నెరవేర్చా రు. బాలకిషన్ అనే అరుంధతి సుతుండు ధూంధాంకు సర్వనామమయిండు. సాధార ణ బడిపంతులు అసాధారణ మనిషిగా ఎద గటానికి ఈ కాలం సహకరించింది. ఈ నేల మీద చిందిన నెత్తురు, కారిన కన్నీళ్లు, రాలిన చెమట ధూంధాం పుట్టుకకు నేపథ్యమైంది.

పుట్టుక నీది, చావు నీది, బతుకంతా దేశానిది అని కాళోజీ చెప్పినట్లు తెలం గాణ కోసం యాదగిరి అమరుడయ్యాడు. నైజాం ఘోరీ కట్టి చుక్కల్లో చంద్రుడ య్యాడు. పశుల పిలగాని చేతికి పాటను అందించి ముళ్లుగపూరను ఆయుధంగా మలచిన సుద్దాల హన్మంతు ఈ భూమి పుత్రుడే. తేనెపూసిన కత్తివి నీవు నెహ్రయ్యా అనగలిగిన సాహసం పోరాడే ప్రజలు తెలంగాణ కవులకు ఇచ్చారు. నాగలి మోసిన రైతు తుపాకిని ఎత్తి నైజాం సర్కారు మెడలు వంచితే రివిజని జం పార్లమెంటులో కూర్చుంది. రైతు భంగపడ్డాడు. ఊరుపోయింది. మళ్లీ తెలుగు నేలలో వసంత కాలమేఘం శ్రీకాకుళం మీదుగా తెలంగాణలో కురిసింది. ఈ వానకు తడిసి ఊరు మనదిరా/ ఈ వాడ మనదిరా/ దొర ఏందిరో/ వాని దోపిడేందిరో అంటూ గూడ అంజయ్య పాటల కొలిమి రాజేశాడు. చెర బండరాజు కొండలు పగలేసే బండలు పిండిన మనిషి కోసం కలాన్ని ఎక్కుపె ట్టాడు. సిరిమల్లె చెట్టు కింద ఒంటరి శోకం పెడుతున్న లచ్చుమమ్మ కొడుకుగా పుట్టిన గుమ్మడి విఠల్‌రావు తూప్రాన్ తుపాన్ బిడ్డగా గద్దరయ్యాడు.

ఒరిగిపో యిన బిడ్డల కోసం కరిగిపోయిన గుండెలను ఎర్రజెండాలుగా మలచి నెత్తుటి జెండాను ఎత్తుకొని మురిసిపోయాడు.‘అన్నెము పున్నెము ఎరుగని చిన్నితమ్ము ల తీసుకెళ్లి/అడగరాని ప్రశ్నలడిగి అన్నలను చూపెట్టుమని’ రాజ్యం రౌడీగా మారినప్పుడు రాజ్యహింసను గానం చేస్తూ తిరిగిన బైరాగి గోరటి వెంకన్న పాటల చెలిమెలో ఊరిన నీటి చెమ్మ. ఈ ప్రజా వాగ్గేయకారుల పాటలకు చైతన్యం పొందిన రెండో తరం కళాకారులు కలిసి సృష్టించిన జలపాతమే తెలంగాణ ధూంధాం. జన నాట్య మండలి పాటలు పాడుకుంటూ అన్నలు ఇంటికొస్తే బువ్వపెట్టిన పిలగాడు ధూం ధాం రసమయిగా మారటానికి ఇంతటి చరిత్ర ఉంది. కోట్లాదిమందిని లాలించి, ఊగించిన పాట గురించి పాటను రాసిన భిక్షపతి ఎన్ని త్యాగాలను నెమరువేసుకొని ఉంటాడు.

దయానర్సింగ్, నాగరాజు, నేర్నాల కిషోర్, అమరుడు కృష్ణవర్మ, గర్జన విద్యార్థి వీరులను మల్లెపులుగా మట్టి వాసనలుగా కవిత్వీకరించిన దరువు ఎల్లయ్య ఉస్మానియా క్యాంపస్‌లో ఉదయించిన సూర్యుళ్లను మరిగించిన అభినయ శ్రీనివాస్, దేశప తి, ఏపూరి సోమన్న ఇట్లా వందలాది గళాలు విచ్చుకోవటానికి జననాట్య మండ లి, అరుణోదయ సంస్థలు చిందించిన నెత్తురే కారణం. ఎక్కడో ఒకచోట వీళ్ల నాడుల్లో ఎరుపు ప్రవహిస్తుంది. వీళ్లందరి సామూహిక బృందగానమే ‘ధూంధాం’. వీళ్లందరిని కూడేసిన మనిషి మాత్రం కచ్చితంగా రసమయి బాలకిషన్. వ్యక్తులుగా గద్దర్, గూడ అంజయ్య, గోరటి వెంకన్న, డప్పు రమేష్, అంద్శై, జయరాజ్ సంస్థలుగా అరుణోదయ, ప్రజాకళామండలి ఈధూంధాం విస్తరించడానికి మూలం.

ఊరు, వాడ ఏకమై కళాకారుల కోసం 70వ దశకం ఎదురు చూసినట్లు, మళ్లీ ధూంధాం కళాకారుల కోసం ఎదురుచూసింది. నాయకులు వేదిక కింద కూర్చుంటే, కళాకారులు వేదికపై నుంచి పాటలు పాడే ప్రజాస్వామిక వాతా వరణానికి ధూంధాం పునాది వేసింది. కళాకారులే సభను నిర్వహించే స్థితి సృష్టించబడింది. దళితులే ఆటగాళ్లుగా, పాటగాళ్లుగా మారారు. నాయకులయ్యా రు, గాయకులయ్యారు. కొత్త సాహిత్య వస్తువు, కొత్త రూపం కష్టజీవి కనుకొ లుకుల నుంచి వచ్చింది. ఊరు, పేరు తెలి య ని కవులకు, కళాకారులకు ధూం ధాం వేదికయింది. ఏ ఉద్యమంలో లేని అద్భుత మైన రసాయన చర్య ధూంధాంలో జరిగింది. చరి త్రలో ఒక లోటును ధూంధాం పూడ్చింది. అల్లిక వారసత్వం నుంచి ఎదిగివచ్చిన అందె శ్రీ తెలంగాణ గొంతుల్లో జయజయహే తెలంగాణగా మారాడు. జనగర్జనల జడివాన ను కురిపించాడు. ఇదొక గుణాత్మక మార్పు.

కానీ సమాజంలో పెరిగిన విలువల రాహి త్యం కళాకారులపై పడింది. చెడు అలవాట్ల కు, రాజకీయ నాయకులకు బానిసల య్యా రు. ఉద్యమం కోసం కాకుండా ఓట్ల కోసం, నోట్ల కోసం పాడటానికి పూనుకున్నారు. విప్లవ సాంస్కృతిక సంస్థలు బలంగా లేకపోవ డం వలన ఇలా జరిగిందని సంతృప్తి చెందితే ఉద్యమానికి నష్టం. సైద్ధాంతిక పునా ది లేని ధూం ధాంలే కళాకారులు ధ్వంసం కావటాని కి కారణమయ్యాయంటే తప్పు అన్నవాళ్లది కాదు. రాజకీయ నాయకులను ఓట్లలో గెలి పించడమే ప్రధాన లక్ష్యంగా ధూం ధాం ప్రయాణించటం కూడా కారణం. కవులు, కళాకారులు ప్రతిపక్షంగా ఉండాలనే ఎరుకను కళాకారులు మర్చిపోయారు. అగ్రకుల నాయకులు కళాకారులకుండే ప్రజాదరణ కు భయపడ్డారు. దీంతో వీళ్ల ప్రాధాన్యాన్ని తగ్గించటానికి కుట్రపూరితంగా ఈ విలువల రాహిత్యాన్ని పెంచారు. కళాకారులకు ఎప్పుడైనా బండి యాదగిరి, బెల్లిలలిత, గద్దర్ నమూ నా కావాలే తప్ప, రాజకీయ నాయకులు కాదు.

కళాకారులు తెలంగాణ కోసం ఎన్నికలను ఎత్తిపట్టే వారుగా, ఉద్యమం ద్వారానే తెలంగాణ అని చెప్పే వారుగా చీలిపోయారు. ధూంధాం ఎన్నికల వైపు మొగ్గు చూపిందని చరిత్ర రుజువు చేసింది. గద్దర్ గౌరవాధ్యక్షులుగా, గూడ అంజయ్య అధ్యక్షులుగా తెలంగాణ సాంస్కృతిక సమాఖ్య ఉద్యమాల ద్వారానే తెలంగాణ అనే నినాదాన్ని ముందుకు తెచ్చింది. అంటరానివిగా చూసి న కళారూపాలను గౌరవంగా ప్రదర్శించిన తెలంగాణ ధూంధాం, సాంస్కృతిక ఉద్యమం ఇవాల్టి సందర్భంలో బలం పుంజుకోవాలి. ధూంధాం ఉత్సవాలుగా కాకుండా పదేళ్ల నడకలో జరిగిన లోటుపాట్లను చర్చించుకునే సభగా మార్చి తే తెలంగాణ సమాజానికి మేలు జరుగుతుంది. రసమయికి చరివూతలో చోటు దొరుకుతుంది.   (from namaste telangana)                              
                             -డాక్టర్ కాశీం                                                   21, డిసెంబర్ 2012, శుక్రవారం

కాకతీయ సంబురం..!

మూడు రోజుల ముచ్చటైన పండుగ

ఎన్నాళ్ల నుంచో ఎదురుచూసిన వేడుక ఇవ్వాటి నుంచి ఎదురుపడుతుంది. కాక‘తీయ’ని సంబురం కన్నుల పండుగ చేయబోతున్నది. దక్షిణ భారతంలో మూడువందల ఏళ్ల ఏకచ్ఛతాధ్రిపత్య పాలన ఆనవాళ్లను చరిత్రలోకి తొంగిచూసే అపురూప సన్నివేశాలు ఓరుగల్లు వాకిట ఆవిష్కృతం కానున్నాయి. కాకతీయ శిల్పకళా సాహిత్య సాంస్కృతిక అంగాల రంగాలు పల్లవించిన సువర్ణాధ్యాయపు చరిత్రను దోసిటపట్టుకునేందుకు ఓరుగల్లు తనను తాను తవ్వుకొని చూపించబోతున్నది. నిర్లక్ష్యపు మస్తిష్కపు ఆనవాళ్ల బూజు దులుపి బురుజుగోడలపై వేలాడదీసేందుకు చరిత్రకారులు, చరిత ఉన్న నగరంలో చారిత్రక పాత్రను పోషించేందుకు సిద్ధమవుతున్నారు.

ఖండాంతర కలాఖండపు అమ్ములపొది ఢమరుక విన్యాసంతో ఊగిపోయేందుకు రామప్పగుడి సాలబంజికల భంగిమలు నాగకన్యికలు నాట్యమాడి పులకించేపోయే చారిత్రక సందర్భం. వేయి స్తంభాల్లో కొలువైన శివరుద్రుడి వెలుగుల జిలుగులు విశ్వవీధిన కురిపించేందుకు మురిసిపోతున్నాడు. ఏలికా నగరి ఏకశిలాపురి శిల్పసంపద శోభాయమానం అయ్యే శుభదినం కోసం ఎదురుచూస్తున్నది. ఇవ్వాటి నుంచి మూడు రోజులపాటు ఓరుగల్లంతా పండుగ వాతావరణం. ప్రతిమనిషీ రాజదర్పాన్ని ప్రదర్శించే అపురూప సన్నివేశాలు ఎన్నో ఆవిష్కరణ కాబొతున్నాయి. యేడాదిపొడవునా సాగిపోయే (సర్కారు సంవత్సరం పాటు నిర్వహిస్తామని చెబుతున్న నేపథ్యంలో) ఉత్సవ వేడుకల ఆరంభ సంరంభానికి అంతా సిద్ధమైంది (అధికారులు చెబుతున్నట్టుగా కాకపోయినా..). సర్కారు చెబుతున్నది అంతా ఆచరించని డొల్లతనమే అయినా, కాకతీయుల పాలనా విధానపు గొప్పతనాన్ని తవ్వితీసుకుని తన్మయత్వం పొందేందుకు చరిత్ర వర్తమానమైంది. కాకతీయులు అందించిన గొలుసుకట్టు మణిహారపు మాధుర్యాన్ని అనుభవించిన నేలతల్లి మళ్లీ ఆరోజులు రావాలని కలలు కంటున్నది. మొత్తంగా ఒక చరిత్ర వర్తమానంలో పరిభ్రమిస్తున్నది. 

from namaste telangana

ఓరుగల్లు ఇక గ్రేటర్ వరంగల్


ఓరుగల్లు నగరం కొత్త సొగసులు సంతరించుకోనుంది. వరంగల్ కార్పొరేషన్‌ను ఇకపై గ్రేటర్ వరంగల్‌గా పిలవాల్సి ఉంటుంది. ఇవాళ ఇక్కడ జరిగిన కాకతీయ ఉత్సవాల్లో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ విషయం ప్రకటించారు. వరంగల్ కార్పొరేషన్‌ను గ్రేటర్ వరంగల్‌గా అప్‌గ్రేడ్ చేస్తున్నామని ఆయన వెల్లడించారు.

20, డిసెంబర్ 2012, గురువారం

మిశ్రమ ఫలితం..గుజరాత్ ఎన్నికల లో బి జె పీ ఘన విజయం సాధించింది, మోడీ వరుసగా మూడోసారి అధికారం ని కైవశం చేసుకున్నారు. గుజరాత్ లోని మొత్తం 182 స్థానాలకు గాను 115 స్థానాలను కైవసం చేసుకొని బి జె పీ ఘన విజయం సాదించడం తో పాటు నరేంద్ర మోడీ తన ఆదిపత్యాన్ని మరో సారి నిరుపించుకున్నారు,  86వేల మెజారిటి సాధించి గుజరాత్లో తనకు ఎదురు లేదని మరోసారి నిరుపించుకున్నారు... 
    హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలలో కాంగ్రెస్  విజయం  సాధించింది. 

19, డిసెంబర్ 2012, బుధవారం

కాకతీయ వైభవం...


కాకతీయ ఉత్సవాల ప్రత్యేకం..

ఆంధ్రదేశ చరిత్రలో కాకతీయుల పాలనా కాలం విశిష్టమైంది. అందుకు కారణం వారు అనుసరించిన ఉదార విధానాలు, చేసిన కళాసేవ. 
- ఆచార్య పోలవరపు హైమవతి,92471 08431


అసలు కాకతీయులు అనగానే గభాలున గుర్తొచ్చేది వారి నీటి పారుదల విధానం. ఆలయాల నిర్మాణం కంటే చెరువుల నిర్మాణంపైనే వారు ఎక్కువ ఖర్చు చేశారు. దీక్షతో నిర్వహించారు. జలసాధన సంతోషాన్ని శిల్పం ద్వారా ప్రకటించి, ఆ ఆనందాన్ని ప్రజలతో పంచుకున్నారు. వారు నిర్మించిన తటాకాలు నేటికీ వేలాది ఎకరాల సాగుకు ఉపయోగ పడుతున్నాయి. వారి నిర్మాణాలు ముఖ్యంగా ఆలయాలు, అందులోని శిల్పకళా ఖండాలు వారి ఉన్నతాభిరుచిని, నాటి కళాకారుల నైపుణ్యాన్ని, భావ ఔన్నత్యాన్ని ఘనంగా చాటి చెప్తున్నాయి. వారి స్మృతి చిహ్నాలుగా మిగిలిన వీటన్నింటినీ పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది.

కాకతీయులు ఓరుగల్లు రాజధానిగా సుమారు క్రీ.శ.1000 నుండి 1157 వరకు పశ్చిమ చాళుక్యులకు సామంతులుగాను 1158 నుండి 1323 వరకు స్వతంవూతులుగాను పాలించారు. శాసనాధారాలను బట్టి కాకర్త్య గుండ్యన ఈ వంశ మూల పురుషుడు. ‘కాకతీయ’ అనే పదానికి సంస్కృతీకరణమే ‘కాకర్త్య’.
కాకతీయుల కులదేవత ‘కాకతి’ అనీ, మొదట వారు కాకతి ఆరాధకులు కాబట్టి కాకతీయులయ్యారనీ, ఆ తర్వాత స్వయంభూదేవుని ఆరాధకులయ్యారనీ చారివూతక సమాచారం ఉంది. కాజీపేట శాసనాన్ని బట్టి వీరు గుమ్మడమ్మ సాంప్రదాయానికి (తీగకు) చెందిన వారని తెలుస్తోంది. 

జైన దేవత గుమ్మడమ్మ (కుషాండిని) కి మరోపేరు కాకతి. ఈమె జీవుల్ని అనారోగ్యం నుండి కాపాడే జైన ఆరోగ్య దేవత. కాకతీయులు తమను తాము ‘దుర్జయుల’మని చెప్పుకున్నారు. అంటే ‘జయింప శక్యం కాని వారు’ అని అర్థం. కాకలు తీరిన వీరులుగా వీరు కాకతిని యుద్ధదేవతగా కొలిచారు. ‘కాకతికి సైదోడు ఏకవీర’ అనే నానుడి ఆ రోజుల్లో ప్రచారంలో ఉంది. ఏకవీరాదేవి ఆలయం ఓరుగల్లు సమీపంలోని మొగిలిచర్లలో ఉంది. కొన్ని శాసనాల్లో ‘కాకతి’ వీరి కులపురమని చెప్పబడింది. అయితే, ఆ గ్రామం లేదా పట్టణం ఎక్కడ ఉందో గుర్తించటం ఇప్పుడు కష్టంగా ఉంది.

కాకతీయ వంశానికి సంబంధించి లభ్యమైన శాసనాల్లో మొట్టమొదటిది క్రీ.శ. 956 నాటి మాంగల్లు శాసనం. ఈ శాసనాన్ని బట్టి గుండియ రాష్ట్రకూటుడు కాకతీయుల మూల పురుషుడు. గణపతిదేవుని సోదరి మైలమ (ధర్మకీర్తి) తన తల్లి బయ్యలదేవి పుణ్యం కోసం చెరువు తవ్వించి బయ్యవరం గ్రామాన్ని సకల సదుపాయాలతో నిర్మించి శాసనం చేయించింది. దాని ప్రకారం తొలి కాకతీయుల వంశవృక్షం ఇలా ఉంది. దుర్జయ వంశంలో- వెన్ననృపుడు - గుండయ(1)-గుండయ(2)-గుండయ(3)- ఎరియ లేదా ఎర్రనృపుడు- (పిండి) గుండయ(4)-బేత(1)పోల(1)-బేత(2)పోల(2)-రుద్రదేవుడు-గణపతిదేవుడు అనేవారు జన్మించారు.

నాల్గో గుండయ క్రీ.శ.973లో రాష్ట్రకూటుల అధికారం పతనమయ్యేవరకు వారికి విధేయుడిగానే ఉన్నాడు. ఆ తర్వాత నేటి తెలంగాణగా ఉన్న ప్రాంతం చాలా వరకు పశ్చిమ చాళుక్యుల వశమైంది. ఈ పరిస్థితుల్లో గుండయ పశ్చిమ చాళుక్యుల వైపుగాని తూర్పు చాళుక్యుల వైపుకాని చేరకుండా తటస్థంగా ఉన్నాడు. ఇంతలో ముదిగొండ చాళుక్యులు విజృంభించి కొరవిసీమను ఆక్రమించుకున్నారు. ఆ ఘర్షణలలో గుండయ ముదిగొండ చాళుక్యుల చేతిలో హతమయ్యాడు. అతని సోదరి కామసానమ్మ మేనల్లుడైన బేతనను దగ్గరకు తీసి పశ్చిమ చాళుక్యులతో దౌత్యం నెరపి కొరవిసీమ నుండి హన్మకొండ వరకు కాకతీయాధికారాన్ని నిలిపింది. ఈ విధంగా కాకతీయ యుగంలో స్త్రీల సాధికారతకు బీజం వేసింది కామసానమ్మ. ఆమె భర్త విరియాల ఎర్రభూపతి గొప్ప సేనానాయకుడు.

కాకతీయ బేతరాజు మొదట వేల్పుకొండ (జఫర్‌గడ్) కేంద్రంగాను, హన్మకొండ వరకు అధికారం విస్తరించిన తర్వాత హన్మకొండ రాజధానిగాను క్రీ.శ.1052 వరకు పాలించాడు. తర్వాత అతని కుమారుడు ప్రోలరాజు క్రీ.శ. 1052 నుండి 1076 వరకు పాలించాడు. తర్వాత రెండో బేతరాజు క్రీ.శ. 1076 నుండి 1108వ సంవత్సరం వరకు పాలించాడు.

ఇతని కొడుకు దుర్గరాజు క్రీ.శ.1108 నుండి 1117 వరకు పాలించాడు. ఆ తర్వాత ఏ కారణం వల్లో దుర్గరాజును త్రోసిరాజని రెండో ప్రోలరాజు అధికారంలోకి వచ్చాడు. ఈతడే స్వయంభూ ఆలయాన్ని ఏకశిలా నగరంలో మొదటగా నిర్మించాడు. ఏకశిలానగర (కోట నగరం) నిర్మాణానికి దీంతో బీజం పడినట్లైయింది.
రెండో ప్రోలరాజు క్రీ.శ.1117 నుండి 1157 వరకు పాలించాడు. ఈయన గొప్ప వీరుడు. తన ప్రభువైన చాళుక్య రెండో జగదేకమల్లుని అధికారం నేటి తెలంగాణగా ఉన్న ప్రాంతమంతటా విస్తరింపజేసి అది సుస్థిరమయ్యేందుకు తీవ్ర కృషి చేశాడు. అనేక బావులను, చెరువులను, పంటకాలువలను తవ్వించి ‘దారివూద్య వివూదావణ’ అనే బిరుదును పొందాడు. ‘దరివూదాన్ని నీరుగార్చి పారదోలిన వాడని’ దీని అర్థం.

స్వతంత్ర పాలకులుగా కాకతీయులు నకీ.శ.1158-1323):రెండో ప్రోలరాజు కుమారుడు రుద్రదేవుడు క్రీ.శ. 1158-1195 సంవత్సరాల మధ్యకాలంలో కాకతీయ రాజ్యాన్ని పాలించాడు. క్రీ.శ. 1163 నాటి వేయిస్తంభాల గుడి శాసనం ఇతని విజయాల గురించి వివరిస్తున్నది. కర్ణాటకంలో బిజ్జులుని విజృంభణతో ఆంధ్రదేశంలో తానూ స్వతంవూతించి రాజ్యపు ఎల్లల్ని విస్తరింపజేశాడు. ఇంతవరకు కాకతీయులు తెలంగాణంలో వ్యవసాయ, నీటి పారుదల రంగాల్లో చేసిన కృషివల్ల వ్యవసాయం మీద ఆధారపడి నడిచిన పరిక్షిశమలు కూడా ఇబ్బడి ముబ్బడిగా ఉత్పత్తుల్ని సాధించాయి. వాటికి అంతర్జాతీయంగా గిరాకీ సాధించాలంటే ఓడరేవు పట్టణాలు కావాలి. అందుకోసం సాగరసీమను జయించాలనుకున్నాడు. పల్నాటి యుద్ధ వాతావరణం నెలకొని ఉన్నపుడు నాయకురాలు నాగమ్మకు సైనిక సాయం అందించి బాగా లాభం పొందాడు. అపర కురుక్షేత్ర సంగ్రామంగా పేరు పొందిన పల్నాటి యుద్ధంతో కర్నూలు, గుంటూరు, కృష్ణా దిగువ నల్గొండ జిల్లా ప్రాంతాల్లో దిగజారిన పరిస్థితుల్ని అవకాశంగా తీసుకుని ఆయా ప్రాంతాలపై కాకతీయాధికారాన్ని స్థాపించాడు. గోదావరీ తీరంపై దాడికి వెళ్లక ముందే సబ్బిసాయిర మండలం (కరీంనగర్) పైకి దేవగిరి పాలకుడు జైతుగి దండెత్తి వచ్చాడని తెలిసి హుటాహుటిన కొంత సైన్యంతో తిరిగి వచ్చాడు. కాని, దురదృష్టవశాత్తు ఆ యుద్ధంలో (1195) లో మరణించాడు.

ఈయన అరివీర భయంకరుడై తాను రాజ్యానికి రాగానే తిరుగుబాటు చేసిన వారిని కఠినంగా శిక్షించి తెలంగాణం నుండి సాగరసీమలో పశ్చిమ ప్రాంతమంతా తన అధికారాన్ని నెలకొల్పగల్గాడు. సుప్రసిద్ధ వేయి స్తంభాల ఆలయ నిర్మాత ఈయనే. అంతేకాదు. తండ్రి తలపెట్టిన కొత్త రాజధాని ప్రణాళిక ప్రకారం అనేక నిర్మాణాలను చేశాడు.

రుద్రదేవునికి సంతానం లేకపోవడం వల్ల తమ్ముడు మహాదేవుని కుమారుడు గణపతిదేవుని దత్తత తీసుకున్నాడు. ఈయన మరణం అనుకోకుండా యుద్ధరంగంలో జరగటం వల్ల మహాదేవుడు క్రీ.శ 1195లో అధికార బాధ్యతలు చేపట్టాడు. రుద్రుని మరణానికి కారణమైన జైత్రపాలునిపై ప్రతీకారం తీర్చుకోవాలనే లక్ష్యంతో మహాదేవుడు యాదవ రాజ్యంపై దండెత్తి యుద్ధరంగంలో మరణించాడు. గణపతిదేవుడు యాదవులకు బందీగా చిక్కాడు.

ఏ కారణం చేతనో యాదవులు 11 నెలల అనంతరం గణపతిదేవుని చెరనుండి వదిలివేశారు. కాకతీయ రాజ్యంలో రాజు లేకపోయినా సామంతులు, సేనా నాయకులు, మంత్రులు ఒక్క అంగుళం భూభాగం కూడా పోగొట్టకుండా రాజ్యాన్ని కాపాడారు. బహుశా గణపతిదేవునికి యాదవ రాకుమ్తాతో వివాహ ప్రతిపాదనకు అంగీకరించి విడుదల చేయించి ఉంటారు. ఈ వివాహం గురించిన ప్రస్తావన ప్రతాప చరివూతలోను, చింతలూరు శాసనం లోనూ ఉంది.

ఆంధ్రదేశాన్ని పాలించిన కాకతీయ ప్రభువులందరిలో గొప్పవాడుగా ఎన్నదగినవాడు గణపతిదేవుడు. గొప్ప ఉదార పాలకుడు. అన్ని వర్గాల వారిని కలుపుకుపోవాలని, ప్రజల అభీష్టానికి అనుగుణంగా పాలనా పద్ధతులను తీర్చిదిద్దాలనీ, మహిళలను అన్ని రంగాలలో అభివృద్ధి పరచాలని, జానపద, గిరిజన కళలను, సంస్కృతులను ప్రోత్సహించి పండిత పామరవర్గాల మధ్య దూరాన్ని తగ్గించాలని ఇలా ఎన్నో రకాలుగా కృషి చేసి గొప్ప పాలకుడిగా చరివూతలో నిలిచిపోయాడు. ఈయన క్రీ.శ. 1199 నుండి 1259 వరకు అంటే తన పాలనాకాలానికి షష్టిపూర్తి అయ్యేంత వరకు పాలించాడు. తర్వాత రుద్రమదేవికి సలహాదారుగా 1269 వరకూ రాజ్య వ్యవహారాలు చూశాడు.

తన పెదతండ్రి ఆశయమైన అఖిలాంవూధావని స్థాపనను సాధించాలని తన సైన్యాలను బెజవాడవైపు నడిపించి వెలనాటి పృధ్వీశ్వరుణ్ణి ఓడించాడు. దివిసీమ వైపు నడచి అక్కడ అయ్యపు పినచోడుని ఓడించి అతని కుమ్తాలైన నారాంబ, పేరాంబలను వివాహమాడి, వారి సోదరుడైన జాయపసేనానిని తన సైన్యంలో చేర్చుకున్నాడు. ఈ రాణులకు కల్గిన సంతానమే ఈ తర్వాత ధరణికోటను పాలించిన గణపాంబ, అఖిలాంధ్ర దేశాన్ని పాలించిన రుద్రమ. ఆ తర్వాత ఆయన తన సైనిక విజయాలతో ఉత్తరాన బస్తర్ జిల్లా నుండి దక్షిణాన కంచి వరకు, తూర్పున సముద్రం నుండి పశ్చిమాన దాదాపు ఔరంగబాద్ వరకు, ఈశాన్యాన గంజాం జిల్లా వరకు గల తెలుగు వారి అధికారాన్ని నెల కొల్పాడు. రాజధానిని హన్మకొండ నుండి ఓరుగల్లుకు మార్చింది ఈయనే.

తిక్కసిద్ధి గణపతిదేవుని సాయం కోరటానికి వచ్చి ముందుగా వెలనాటి యుద్ధంలో గణపతిదేవునికి సాయం చేశాడు. అంతేకాదు, తుదివరకు ఎన్ని సమస్యలు వచ్చినా నెల్లూరు వారికి బాసటగా నిలవటమేకాక అఖిలాంవూధావనిని ఏకచ్ఛవూతాధిపత్యం కిందికి తెచ్చినా శరణు వేడిన నెల్లూరు రాజ్యాన్ని మాత్రం ఆక్రమించలేదు.

ఆ తరువాత గోదావరీ పరీవాహక ప్రాంతాన్ని కాకతీయ రాజ్యంలో కలపటానికి సైన్యాన్ని పంపాడు. ఆ సైన్యం ఉదయగిరి, గంజాం, బస్తరు, చక్ర కూటం, మంథెన, కాడి, గోగులనాడు, కొలను, మాడియం, ద్రాక్షారామం మొదలైన ప్రాంతాలను కాకతీయ రాజ్యంలో కలపటంలో విజయాన్ని సాధించింది. గోదావరీ తీర ప్రాంతంలో శాంతి నెలకొల్పాలనే ఉద్దేశ్యంతో గణపతి దేవుడు తన కుమార్తె రుద్రమను చాళుక్య యువరాజు వీరభవూదునికిచ్చి వివాహం చేశాడు.

క్రీ.శ.1248లో తిక్కభూపతి మరణించాడు. మళ్లీ జాతుల మధ్య అంతర్యుద్ధం ప్రారంభమైంది. గణపతిదేవుడు ఈసారి కూడా నెల్లూరును ఆదుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈసారి తిక్కన సోమయాజి రెండో మనుమసిద్ధి తరుఫున ఓరుగల్లుకు మారువేషంలో వచ్చి గణపతి దేవుని దర్శనభాగ్యం పొంది సమస్యను వివరించాడు. గణపతిదేవుడు రెండో మనుమసిద్ధికి సాయం చేయటానికి సబ్బి మండలాన్ని (కరీంనగర్ ప్రాంతం) పాలించే సామంత భోజుని నాయకత్వంలో సైన్యాన్ని పంపాడు.
గణపతి దేవుడు దేవగిరి సేనలతో కూడా సత్సంబంధాలను కొనసాగించాడు. ఆయన పాలనా కాలంలో దేవగిరి నుండి ఒక్క దండయాత్ర కూడా రాలేదు. పైగా ఆయన చేసిన యుద్ధాలలో వారి సైన్యం, సైనికాధికారులు పాల్గొని గణపతిదేవుని విజయానికి కృషి చేశారు. 

గణపతి దేవుడు తన సుదీర్ఘ పాలనా కాలంలో అనేక ఘన విజయాలను సాధించాడు. ఇంతవరకు ఓటమిని చవిచూడలేదు. అందుకు కారణం వినవూమతతో కూడిన ఆయన వ్యక్తిత్వం, ధర్మచింతనతో కూడిన ఆయన కార్యాచరణ ప్రణాళిక. వాటివల్లనే ఆయన తన అనుచరుల సహాయ సహకారాలను పూర్తిగా పొందాడు. కాని చివరి దశలో తాను నమ్మిన దేవగిరి పాలకుల ద్రోహచింత వల్లను, దుర్నీతిని పాటించిన పాండ్యుల కుటిలతంత్రం వల్లను 1262లో ముత్తుకూరు యుద్ధంలో కాకతీయ సైన్యం ఓడిపోయింది.
అప్పటికే అంటే క్రీ.శ.1259లో రుద్రమను పట్టోధృతిగా ప్రకటించడం ఇష్టం లేని యాదవ సైన్యం హృదయ పూర్వకంగా కాకతీయుల సైన్యంతో కలసి నెల్లూరును రక్షించడంలో పాల్గొనలేదు. బహుశా పాండ్యులు, నెల్లూరు, ములికి నాటి ప్రాంతాలలో ఉన్న అసంతృప్తికారుడు అంబదేవుడు కూడా కాకతీయులకు వ్యతిరేకంగా జరిగే కుట్రలో యాదవులను భాగస్వాములు చేశాడు. ఒక విభాగానికి నాయకత్వం వహించి ద్రాక్షారామంలో పాండ్యులపై విజయం సాధించిన గణపతిదేవుడు తన సైన్యంతో నెల్లూరు వైపు నడుస్తున్న సమయంలో అర్థాంతరంగా కాకతీయ సైన్యం కకావికలమైంది. బహుశా యాదవుల, ఇతర కాకతీయ తిరుగుబాటు నాయకుల సైన్యం కాకతీయ సేనలతోనే తలపడడంతో గందరగోళంలో పడి వెనుదిరగక తప్పలేదు. ఎదురు చూడని ఈ పరిణామంతో ఏర్పడిన ఉపవూదవ పరిస్థితుల్లో యుద్ధం కొనసాగించడం అవివేక మౌతుందని గణపతిదేవుడు భావించాడు.

క్రీ.శ.1262లో ముత్తుకూరు వద్ద జరిగిన ఈ యుద్ధ సన్నివేశంతో గణపతిదేవుడు తానిక క్రియాశీలక రాజకీయాల నుండి తప్పుకోవాలనే ఒక ముఖ్య నిర్ణయం తీసుకుని, పాలనాధికారాలతో పాటు సైనికాధికారాలు కూడా రుద్రమకు ఇచ్చి ‘రువూదమదేవమహారాజు’ అనే పేరుతో ఆమెకు పట్టాభిషేకం చేశాడు. ఇప్పటివరకు ‘మహామండలేశ్వరులు’గా చెప్పుకున్న కాకతీయ సంప్రదాయాన్ని మార్చి ‘మహారాజుంగారు’ గా రుద్రమను పరిచయం చేయటంలో విశేషం ఉంది. స్త్రీ రాజ్యపాలన చేయడం కొత్త విషయం. అందువల్ల కొందరు (అంబదేవుని వంటివారు) చులకన చేయవచ్చు. శత్రువులు తక్కువ అంచనా వేయవచ్చు. అందువల్ల ఎన్నో రకాలుగా ఆమె సాధికారతను సుస్థిరం చేయాల్సి ఉంది. అందుకే, గణపతిదేవుడు దానికి అవసరమైన దర్పాన్ని కల్పించి, అందుకు తగిన వస్త్రధారణను కూడా సూచించాడు. ఆమె ఎప్పుడూ పురుషవేషంలోనే ఉండి రాజ్యకార్యాలను నిర్వహించేది. అంతేకాదు, ఆమె మనుమడైన ప్రతాపరుదురుని రుద్రమకు దత్తత నిప్పించాడు. ఈ విధంగా ఆమె రాజకీయ జీవన బాటను సాధ్యమైనంత వరకు నిష్కంటకం చేసి క్రీ.శ. 1269-70 ప్రాంతంలో కన్నుమూశాడు.

రుద్రమ అఖిలాంధరవనికే పాలకురాలైతే, ఆమె సోదరి కోట రాజ్యాన్ని 40 సంవత్సరాల పాటు సమర్థవంతంగా పాలించి మార్కోపోలో వంటి విదేశీ యావూతికుల మన్ననలు పొందింది. మోటుపల్లి ఓడరేవు పట్టణం ఆమె రాజ్యంలో ఒక బహుళజాతి పట్టణంగా వెలుగొందింది. వివిధ దేశాలకు, భాషలకు చెందిన వారు ఈ పట్టణంలో నివసించేవారు. ఆమె తన శక్తి సామర్ధ్యాలతో పరిక్షిశమలను, వర్తక వాణిజ్యాలను అభివృద్ధి పరచిందనీ, దాతృత్వంతో ప్రజల హృదయాలను చూరగొన్నదని, మర్యాద పూర్వక ప్రవర్తనతో విదేశీయుల మన్ననలను పొందుతున్నదని అభిప్రాయపడ్డారు. మార్కోపోలో వ్రాశాడు.
స్త్రీ పురుష సమానత్వ సాధనకే గాక వివిధ వర్గాలు సామాజికంగా సమానత్వాన్ని సాధించాలనే తపన గణపతి దేవునిలో కనపడుతుంది. తన సైన్యంలో అన్ని వర్గాల వారికి, కులాల వారికి సమాన అవకాశాలిచ్చాడు.

రుద్రమదేవి క్రీ.శ.1259-1289
తండ్రికి తగిన తనయగా రుద్రమదేవి అధికార పగ్గాలు చేపట్టిన వెంటనే ఒక ప్రసూతి ఆలయం, జ్వరాలయం, విద్యాకేంవూదాలతో గోళకి మఠాన్ని నెలకొల్పేందుకు వీలుగా విశ్వేశ్వర శివాచార్యులకు వెలగపూడితో సహా మందర(డం) గ్రామాన్ని దానం చేసింది.
రుద్రమ రాజ్యానికి రావటం ఇష్టం లేని దేవగిరి రాజు మహాదేవుడు తన మేనల్లుడైన హరిహర మురారి దేవుల తరుఫున కాకతీయ రాజ్యంపైకి దండెత్తి వచ్చాడు. వీరు గణపతిదేవునికి మహాదేవుని సోదరి అయిన సోమలదేవి వల్ల కలిగిన సంతానం.

గణపతి దేవునికి నారాంబ, పేరాంబల వల్ల కల్గిన సంతానం గణపాంబ, రుద్రమలు. వీరి సవతి తమ్ముళ్ళు హరిహర, మురారి దేవులు. వీరిని కాదని క్రీ.శ.1259 లో గణపతి దేవుడు రుద్రమను ‘పట్టోధృతి’ గా ప్రకటించడం మహాదేవునికి మింగుడు పడని విషయమైంది. అప్పటివరకు కాకతీయ సైన్యంలో 60 సంవత్సరాల పాటు ప్రతి యుద్ధంలో కీలకపాత్ర నిర్వహించిన యాదవులు క్రమంగా శత్రుభావాన్ని పెంచుకున్నారు. బహుశా ముత్తుకూరు యుద్ధంలో కాకతీయ సైన్యం ఖంగు తినడానికి కారణం యాదవులు అంబదేవునితో కలసి శత్రువులైన పాండ్యులతో కలసి కుట్ర పన్నడమే. అందువల్లే ఇక ఆగకుండా గణపతిదేవుడు వెంటనే 1262లోనే రుద్రమకు సైనికాధికారాలను కూడా అప్పగించాడు. ఆ తర్వాత కొద్ది కాలానికే భర్త చనిపోయాడు. 

విధవను అపశకునంగా భావించే ఉత్తరాది సంస్కృతికి భిన్నంగా దక్షిణాదిన వితంతువులైన స్త్రీలు ప్రశాంతంగా సజ్జీవనం గడుపుతూ సమాజసేవలో సమర్థులుగా తమను తాము నిరూపించుకున్న సంఘటనలు అనేకం ఉన్నాయి. మధ్య తరగతి నుండి వచ్చిన నాయకురాలు నాగమ్మ పధానిగా), పాలకవర్గం నుండి వచ్చిన కోట గణపాంబ, రుద్రమ, చాగి ముప్పలదేవి, విరియాల సాగసాని, కోట బయ్యలదేవి మొదలైన వారిని ఇందుకు ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. కూలిపని చేసుకునే ఒంటరి స్త్రీలు కూడా సమాజసేవలో, తటాక నిర్మాణాల్లో ఏ విధంగా పాలు పంచుకున్నదీ బసవపురాణం చెప్తూంది.

ఏమైతేనేం, రుద్రమ రాజ్యానికి రాగానే యాదవ మహాదేవుడు కాకతీయ రాజ్యంపైన దండెత్తి రావటంతో రుద్రమ రణరంగంలో వీర విహారం చేసి మహాదేవుని బెడద కోట (బీదర్) వరకు తరిమి కొట్టింది. తాను ఓరుగల్లు కోటలో బంధించిన యాదవ సైనికులను పెద్ద మొత్తంలో (కోటి బంగారు నాణాలు) యుద్ధ నష్టపరిహారం తీసుకుని వదిలి పెట్టింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని రుద్రమ ‘రాయగజకేసరి’ బిరుదును ధరించింది.

పాలకురాలిగా రుద్రమ ఎన్నో సవాళ్ళను ఎదుర్కొంది. ఆమె అత్తింటి వారు నిడదవోలు ప్రాంతంలో స్వతంవూతంగా పాలించడం మొదలు పెట్టారు. వారిని చూసి ఇరుగుపొరుగు గవర్నర్లు కూడా స్వతంవూతంగా శాసనాలు జారీ చేయడం మొదలైంది. ఇదే అదనుగా తూర్పు నుండి కళింగ గంగరాజు భానుదేవుడు గోదావరి తీరంలోకి చొచ్చుకు రావాలనే ప్రయత్నాలు మొదలు పెట్టాడు. ఈ విషమ పరిస్థితుల్లో రుద్రమ విజ్ఞతతో ప్రవర్తించి పరిస్థితులను చక్కదిద్దింది. గాంగులపై విజయాన్ని సాధించటమే గాక తూర్పున గోదావరి తీరాన్ని కాకతీయ రాజ్య సరిహద్దుగా పటిష్టం చేసింది.

కడప పాలకుడైన అంబదేవునికి రుద్రమ రాజ్యానికి రావడం ఇష్టం లేదు. అతని పూర్వీకులు మహారాష్ట్రకు చెందిన వారు కావటం వల్ల ఆ అభిమానంతో బహుశా రుద్రమ తమ్ముళ్లు హరిహర మురారి దేవుల పక్షపాతిగా ఆమెపట్ల శతృత్వభావం వహించాడు. పాండ్యులను, దేవగిరి పాలకులను కూడా ఆమెకు వ్యతిరేకంగా కూడ గట్టి తిరుగుబాటు చేశాడు. వల్లూరు రాజధానిగా స్వతంవూతతను ప్రకటించాడు.
అంబదేవుని ఆగడాలను ఎదుర్కోవడానికి రుద్రమ తన సైన్యాన్ని సిద్ధం చేసింది. ప్రతాపరువూదుడు వ్యుహరచన చేశాడు. సైన్యం మొత్తం మూడు భాగాలుగా విడిపోయి ముక్కోణంలో శత్రువులను ఎదుర్కొన్నారు. ఒక విభాగానికి ప్రతాపరువూదుడు, రెండో విభాగానికి అడిదం మల్లుసేనాని, మూడో విభాగానికి స్వయంగా రుద్రమ నాయకత్వం వహించారు. దురదృష్టవశాత్తూ త్రిపురాంతకం వద్ద అంబదేవునితో జరిగిన యద్దంలో రుద్రమ ప్రాణాలు కోల్పోయింది. ఆమె వయస్సు అప్పటికీ 80 సంవత్సరాలకు పైబడే ఉంది. క్రీ.శ 1289 నవంబర్‌లో ఆమె సైన్యాధికారి మల్లికార్జున నాయకునితో సహా యుద్ధ రంగంలో ప్రాణాలు విడించిందని నల్గొండ జిల్లా చందుపట్ల శాసనం వల్ల తెలుస్తోంది. ఈ విధంగా మొక్కవోని పట్టుదలతో ఆంధ్రరాజ్య పరిరక్షణ కోసం 80 సంవత్సరాల పైబడిన వృద్ధాప్యంలో కూడా స్వయంగా యుద్ధరంగంలో పోరాడుతూ వీరమరణం పొందిన రుద్రమ చరివూతపుటల్లో మహిళా శక్తికి ప్రతీకగా నిలచింది.
నిరంతరం యుద్ధాల్లో నిమగ్నమైనా ప్రజాపాలనను గాని, అభివృద్ధి కార్యక్షికమాలను గాని రుద్రమ నిర్లక్ష్యం చేయలేదు. ఓరుగల్లు కోటకు మరమ్మత్తులు చేయించి రాతి కోటకు లోవైపున మెట్లు కట్టించింది. మట్టికోటకు బురుజులను, అగడ్తను నిర్మించి కోటను దుర్భేద్యంగా మార్చింది. రుద్రమ తర్వాత ఆమె దత్తపుత్రుడు (మనుమడు) అయిన ప్రతాపరువూదుడు రాజ్యానికి వచ్చాడు. క్రీ.శ. 1289లోనే రుద్రమ మరణించినా 1295 వరకు ఇతడు శాసనాల్లో కుమార ప్రతాపరువూదుడిగానే కన్పిస్తాడు. బహుశా రుద్రమ వీరమరణం, దాని తర్వాత ఏర్పడిన రాజకీయ గందరగోళ పరిస్థితిని చక్కదిద్ది, అంబదేవునిపై ప్రతిచర్య తీసుకునే వరకు పట్టాభిషేకాన్ని జరుపుకోరాదని భావించి ఉండవచ్చు.

ముందుగా ప్రతాపరుదురుడు సైనికశక్తిని పటిష్టం చేయటానికి పూనుకున్నాడు. నాయంకర విధానాన్ని రూపొందించి సైనిక వ్యవస్థను క్రమబద్ధీకరించాడు. క్రీ.శ. 1291లో అంబదేవుని త్రిపురాంతకం నుండి పారదోలారు.
అంబదేవునితో చేతులు కలిపి రుద్రమ వీరమరణానికి కారకులైన పాండ్యులను, దేవగిరి పాలకుల్ని పలుచోట్ల ఓడించి క్రీ.శ. 1294 నాటికి తుంగభద్ర అంతర్వేది ప్రాంతంలోని పటిష్టమైన కోటలను స్వాధీనం చేసుకున్నాడు. ఈ విజయాల తర్వాత క్రీ.శ. 1295 లో కుమార ప్రతాపరువూదుడు ‘వీర ప్రతాపరుద్ర మహారాజుగా’ పట్టాభిషిక్తుడయ్యాడు. ఆ తర్వాత పాండ్యులను కంచి నుండి పారదోలాడు.

ఢిల్లీ సుల్తానుల దాడులు:అల్లా ఉద్దీన్ ఖిల్జీ నుండి మహ్మద్ బిన్ తుగ్లక్ వరకు ఢిల్లీ సుల్తానులు క్రీ.శ.1303-1323 సంవత్సరాల మధ్య ఏడు సార్లు దండెత్తి రాగా కొన్నిసార్లు కాకతీయులు విజయం సాధించారు. కొన్నిసార్లు పరిస్థితులు అనుకూలించక దక్షిణ దండయాత్రల్లో ఉండడం వల్ల సంధి చేసుకోవలసి వచ్చింది.

పతనం: చివరగా 1323లో ఉల్లూఖాన్ (యువరాజైన మహ్మద్‌బిన్‌తుగ్లక్) నాయకత్వంలో రెండుసార్లు దండెత్తాడు. మొదటిసారి వచ్చిన దండయావూతలో కాకతీయ సైన్యం ఘనవిజయం సాధించింది. విజయ కేతనాలను ఎగురవేసి ఉత్సవాలు జరుపుకుంటున్నారు. కోటలో ఉన్న ధాన్యాన్ని కూడా ప్రతాపరువూదుడు ప్రజలకు పంచిపెట్టాడు. ఇంతలో అనుకోకుండా ముస్లిం సేనలు హఠాత్తుగా వచ్చిపడ్డాయి. చుట్టు పక్కల గ్రామాలను తగులబెట్టారు. మండువేసవి. నీరు కోటలోకి పోకుండా గండ్లు కొట్టారు. కోటను చుట్టుముట్టారు. బొబ్బాడ్డి అనే నాయకుణ్ణి తమవైపుకు తిప్పుకున్నారు. బహుశా లంజపాతరదిబ్బ వద్ద మట్టి కోటకు గండికొట్టారు. కోటలో ప్రవేశించిన పద్మనాయక వీరులు ధైర్యం వీడక పోరాడుతూ ఒక్కొక్కరూ బలైపోతున్నారు. వృద్ధులు, పిల్లలు, స్త్రీలు హాహాకారాలు వినలేక ప్రతాపరువూదుడు కోట బయటకు వచ్చి లొంగిపోయాడు. ఈసారి ఉల్లూఖాన్ సంధికి అంగికరించలేదు. ప్రతాపరువూదుని ఢిల్లీకి బందీగా పంపుతుండగా అవమానంతో దారిలో నర్మదానదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడని చారివూతకాధారాల వల్ల తెలుస్తూంది.

ప్రతాపరువూదుడు ఓడిపోయిన తర్వాత సంధి చేసుకుంటాడని, ఆ తర్వాత తమ శక్తి సామర్థ్యాలను, పద్మనాయకుల అసమర్థతను అంగీకరించి తమకు తగిన స్థానాన్ని కల్పిస్తాడని బొబ్బాడ్డి, అతని అనుచరులు ఆశించారు. అనుకోకుండా జరిగిన పరిణామానికి చింతించారు. ఓరుగల్లుకు ‘సుల్తాన్‌పూర్’ అని ఉల్లూఖాన్ నామకరణం చేశాడు. ఇస్లాం మతాన్ని స్వీకరించిన నాయకులకు ఉన్నత పదవులిచ్చాడు. ప్రతాపరువూదుని కటక (కోట) పాలకుడైన కన్ను (నాగయగన్నయ) ఉల్లూఖాన్ మన్ననకు పాత్రుడై మతాంతరీకరణ చెందిన మాలిక్ మక్బూల్‌గా ఇక్కడ గవర్నర్‌గా నియమింపబడ్డాడని షామ్సీసిరాజ్ అఫీస్ రచనను బట్టి తెలుస్తూంది. ఈ అంశం కూడా మంత్రుల, సామంతుల ద్రోహచింతన పట్ల అనేక అనుమానాలకు తావిస్తున్నది. సామంతుల సైన్యం ఎక్కువై ప్రభువు సైన్యం తక్కువైనపుడు ప్రభువు పని చిక్కుల్లో పడుతుంది. అదే కాకతీయ రాజ్య పతన సమయంలో జరిగింది.
కాకతీయ రాజ్య పతనానికి ఇంకా ఎన్నో అంశాలు దోహదపడ్డాయి. ఎన్నో సంవత్సరాలుగా శ్రమించి సాధించిన తెలుగువారి ఐక్యత దెబ్బతిన్నది. ఆంధ్రదేశం ముక్క చెక్కలైంది. ఓరుగల్లు బావురుమన్నది. దేవాలయాలు విధ్వంసానికి గురయ్యాయి. పంటలు, పరిక్షిశమలు నాశనమయ్యాయి. శాంతి భద్రతలు కరువై, వర్తక వాణిజ్యాలు అడుగంటాయి.

మళ్ళీ ఓరుగల్లుపై ఆధిపత్యం కోసం వివిధ రాజ్యాల మధ్య పోరు ప్రారంభమైంది. ఇక్కడ కాకతీయులు సాధించిన జలసమృద్ధి, వ్యవసాయ, వర్తక వాణిజ్యాల అభివృద్ధి తత్ఫలితంగా ఓరుగల్లు రవాణాకు కూడలిగా మారటం వంటివి ఈ ఆకర్షణకు మూల కారణాలు.
కాకతీయాధికారం అంతమైనా, వారి పాలనా ప్రభావం దానిలోని ఉన్నత లక్షణాల వల్ల, దేశకాల పరిస్థితులకు అనుగుణంగా ఉండటం వల్లనూ, ఆ తరువాత ఆంధ్రదేశాన్ని పాలించిన ప్రభువులు, ముఖ్యంగా విజయ నగరాధీశులు, కుతుబ్‌షాహీ సుల్తానులు, కాకతీయ పాలనాంశాలను చాలా వరకు అనుసరించి కొనసాగించారు. విజయ నగరాధీశుల అమర నాయంకర విధానానికి పునాది వేసినవారు కాకతీయులే. 16,17 శతాబ్ధాల్లో ఆంధ్రదేశాన్ని పాలించిన కుతుబ్‌షాహీల పాలనలో కాకతీయుల పన్నిద్ధరు ‘ఆయగాండ్ర’ పద్ధతి ‘బారాబలవంతుల’ పద్ధతిగా మారి గ్రామ పాలనలో కొనసాగింది. నీటి తీరువాలో కాకతీయులు ప్రవేశపెట్టిన దశబంధ విధానాన్ని, పూడికతీత కార్యక్షికమాలను సుల్తానులు యధాతథంగా కొనసాగించారు. సైనిక వ్యవస్థలో కాకతీయుల లెంకల విధానాన్నే ‘ఖాసాఖైల్’ పద్ధతిగా కొనసాగించారు. అదే విధంగా వ్యవసాయాభివృద్ధిలోను, ఉద్యానవన కృషిలోను కాకతీయుల విధానాలను కుతుబ్‌షాహీలే కాక ఢిల్లీ సుల్తాన్ ఫిరోజ్ షా తుగ్లక్ కూడా అనుసరించాడు. ఫిరోజ్ షా తుగ్లక్ వద్ద ఉపవూపధానిగా ఉన్న మాలిక్ మక్బూల్ (గన్నయ నాయకుడు) దశబంధ విధానాన్ని ఢిల్లీ రాజ్యంలో ప్రవేశపెట్టడమే గాక ఉద్యానవన కృషి ద్వారా రాజ్యపుటాదాయాన్ని పెంచడానికి కృషి చేశాడు. ఈ విధంగా కాకతీయ పాలన సమకాలీన ప్రభువులకు, తదనంతర పాలకులకు సైతం మార్గదర్శకం అయింది.ఇప్పటికే చాలా వరకు చెరువులు పూడికలు తీయక కప్పులు, సాసర్ల రూపంలోకి మారాయి. నాడు అతి విశాలంగా, లోతుగా ఉండి సమువూదాలుగా పిలువబడిన బాల సముద్రం వంటి జలశయాలు ఇళ్ల స్థలాలుగా మారి చిరునామా కోల్పోయాయి. ఉన్నవాటిని పరిరక్షించుకోవటం, బాగా పాడైన వాటిని పూడికలు తీయించి వాడకంలోకి తేవటం ప్రస్తుత కర్తవ్యం. అదే మనం ఆనాటి నిర్మాతలకు సమర్పించే నివాళి. అప్పుడే అది మన తరానికి, ముందు తరాలకి వారసత్వంగా వచ్చిన తరగని పెన్నిధి అవుతుంది.
కాకతీయులు గరుడాంక చిహ్నం కలిగిన రాష్ట్రకూటులు కాబట్టి, వారు రాష్ట్రకూట వంశస్థులని, మహారాష్ట్ర ప్రాంతం నుండి ఆంధ్రదేశానికి వలన వచ్చిన వారని గుండయ, ఎరియల పేర్ల చివర ఉన్న రాష్ట్రకూట శబ్ధమే ఇందుకు తార్కాణమని కొందరు అభివూపాయపడ్డారు. కానీ, ఇది ఏ మాత్రం సబబు కాదనిపిస్తుంది. ఎందుకంటే, రాష్ట్రకూట శబ్ధం ఇందుకు ముందు చెప్పుకున్నట్లు రట్టడిగా గ్రామాధికారులకు కూడా చాళుక్య శాసనాల్లోనూ ఉంది. రాష్ట్రకూటుల వద్ద సైనిక వృత్తిలో ఉన్నమాట వాస్తవమే, కానీ, రాష్ట్ర కూటుల ఆక్రమిత ప్రాంతాలైన ఆంధ్రదేశంలోనే వారున్నారు తప్ప మహారాష్ట్ర ప్రాంతంలో ఉన్న దాఖలాలు లేవు. పైగా వారి పేర్లన్నీ అచ్చతెలుగు దేశీయపదాలే, వ్యవసాయ సంస్కృతికి చెందిన పేర్లు. ‘గుండము’ అంటే ‘లోతైన చెరువు’ అని అర్థం. ‘గుండయ’ పేరు దానికి సంబంధించిందే. చలమయ్య అనే పేరు కూడా నాటికీ నేటికీ ఆంధ్రదేశంలో సాధారణమైన పేరు. అది కూడా నీటి చలమకు సంబంధించిందే. బేతరాజు పేరు భూతక్షిగాహస్వామి (పోతురాజు) నుండి వచ్చిందే. ఈ పేరు పంటలకు చీడపీడలు రాకుండా పూజింపబడే దేవుడిదే. ప్రోలయ నూర్పిడి సమయంలో పూజింపబడే దేవత ప్రోచేరాజుగా పోలరాజు) శివుడు కూడా పూజితుడయ్యాడు. బ(వ)య్యలమ్మ (చదువుల తల్లి), మైలమ (భూదేవి) కుందమ్మ (వ్వ), మేడలమ్మ, రుయ్యమ్మ, ముమ్మడమ్మ (ముగ్గురమ్మల మూలపుటమ్మ) ముప్పమ మొదలైన కాకతీయ కుటుంబీకుల పేర్లు అచ్చ తెలుగు పదాలతో కూడినవి. రుద్రదేవునితోనే సంస్కృత పేర్లతో కాకతీయ ప్రభువులు కనిపిస్తారు.

తెలంగాణాన్ని హృదయసీమగా చేసుకుని అఖిలాంధ్ర దేశాన్ని పాలించిన కాకతీయుల సాంస్కృతిక వారసత్వం మహోన్నతమైందిగా ప్రశంసలందుకుంది. దానికి మూల కారణం కాకతీయులు బహుముఖంగా అనుసరించిన ఉదాత్త విధానమే. అన్ని వర్గాలను- స్త్రీలను, పురుషులను, శిష్ఠులను, జానపదులను, పాలకులను, పాలితులను - అందరినీ కలుపుకుపోయే ధోరణే వారి విధానాలకు వెన్నెముక అయింది. పండితులు రూపొందించిన కళారూపాలకు, జానపదులు పొందు పరచుకొన్న కళారూపాలకు సమన్వయాన్ని సాధించే ప్రయత్నం చేసి దానిలో వారు విజయాన్ని సాధించారు. అదే వారికి చరివూతలో ఒక ప్రత్యేక స్థానాన్ని కల్పించింది. 

‘రాయ గజకేసరి’ రుద్రమదేవి
- పి.వి.పరబ్రహ్మ శాస్త్రి

కాకతి రుద్రమదేవి ఒక వీరవనిత. గణపతి దేవుడి కూతురు. క్రీ.శ. 1262లో కాకతీయ రాజ్యానికి ఆమె పాలకురాలైంది. గణపతి దేవుడికి పుత్రులు లేని కారణంగా ఆమెనే పుత్రుడుగా భావించి రాజనీతితోబాటు కత్తి డాలు పట్టి ఆనాటి కదన విద్యలో మేటి యోధురాలుగా తీర్చిదిద్ది, తన రాజ్యానికి వారసురాలుగా ‘రువూదదేవుడ’నే పురుషనామంతో ఆమెను సింహాసనాధిష్ఠితురాలిని చేశాడు. ఇది సహించని కొందరు రాజ్యానికి ఉత్తరం వైపున సేవుణ రాజ్యాధిపతిఅయిన యాదవ మహాదేవరాజును ఓరుగల్లు కోటపై దండెత్తడానికి ప్రోత్సహించారు. అయితే, దేవగిరి యాదవ రాజసైన్యం ఓరుగల్లు కోటను సాధించలేక పోయింది. శత్రుసైన్యాన్ని యాదవుల రాజ్యంలో చేరిన బీదరు కోటను విడిచిపోయేట్లు రుద్రమదేవి తరిమికొట్టి ఆ కోటను తాను ఆక్రమించుకొంది. ఆ కోటకు కాకతి సైన్యాధిపతిని అధ్యక్షుడిగా నియమిస్తూ ఒక శిలాశాసనాన్ని కన్నడభాషలో గద్య పద్యాలతో రాయించి ప్రతిష్టించింది. ఇది రుద్రమదేవి మొదటి మహా విజయం. ఈ నేపథ్యంలోనే తండ్రి బిరుదైన ‘రాయ గజకేసరి’ అనే బిరుదాన్ని తాను కూడా వహించినట్లు స్పష్టమవుతోంది.

ఈ విజయ సూచకంగా ఓరుగల్లు కోటలో స్వయంభు దేవాలయానికి ముందు అనేక శిల్పాలతో అలంకరించిన రంగ మండపాన్ని ఆమె నిర్మించారు. దాని చూరుకి నలుమూలల తాను కొత్తగా వహించిన రాయగజకేసరి (శవూతురాజులైన ఏనుగులకు సింహం వంటిది) బిరుదాన్ని శిల్పరూపంలో అంటే ఏనుగు తలమీద విక్రమించిన సింహం, దాని మీద కత్తి, డాలు రెండు చేతులతో పట్టుకొని స్త్రీ యుద్ధం చేస్తూ కూర్చున్నట్లు ఆ శిల్పం మలచబడింది. ప్రస్తుతం ఈ శిల్పాలు ఓరుగల్లు కోటలో రంగ మండప శిథిలాల్లో భాగంగా కనిపిస్తున్నాయి. ఇది రుద్రమదేవి రూపమని చరివూతకారులు భావిస్తున్నారు. 
దేవతా రూపమే అయితే, నాలుగు చేతులుండాలి. ముందు రాక్షసుడు కూడా కనిపించాలి. శిల్పంలో ఆ గుర్తులు లేవు. కనుక, ఈ శిల్పాలు ‘రాయగజ కేసరి’ బిరుదానికి తగినవిగా చరిత్రకారులు భావిస్తున్నారు. ఆనాటి శంభునిగుడి నాలుగు తోరణ ద్వారాల నడుమ ఇది ఉన్నట్లు అర్థమవుతోంది. దాని శిథిలాలే ఇప్పుడు మిగిలాయి.(వ్యాసకర్త కాకతీయుల శాసనాల పరిశీలన ద్వారా ఎన్నో సత్యాలను వెలికి తీశారు. అందులో మీరు చూస్తున్న కాకతి రుద్రమదేవి శిలా చిత్రాన్ని గుర్తించింది కూడా వీరే. అట్లే, బయ్యారం చెరువు శాసనం ఆధారంగా కాకతీయుల మూలాలను వెలికి తీయగలిగారు. అంబదేవునితో జరిగిన యుద్ధంలో చందుపట్ల శాసనం ద్వారా కాకతి రుద్రమదేవి మరణించిన సంవత్సరం క్రీ.శ.1290గా నిర్ధారించటం, రాయగజకేసరి బిరుదు ముద్ర ఆధారంగా కాకతీయులు వేయించిన నాణాలను గుర్తించడం, రుద్రదేవుని హనుమకొండ శాసనాన్ని పునర్వ్యాఖ్యానించడం -ఇలా కాకతీయుల చరిత్ర నిర్మాణంలో పి.వి.పి. గా పేరొందిన వీరి కృషి ప్రసిద్ధం. ‘కాకతీయలు’ పేరిట వారు రచించిన పరిశోధనా గ్రంథం ఓ ప్రామాణిక రచనగా సర్వామోదం పొందింది.)
(from namaste telangana)

16, డిసెంబర్ 2012, ఆదివారం

కాకతీయ ఉత్సవాలు లోగో 2012......


తెలంగాణ కోసం.. ఇజ్జతుంటే ఒకే జెండా !


జగమెరిగిన కళాకారుడిని ఇక్కడ పరిచయం చేయడం చంద్రుడిని అద్దంలో చూపించడం లాంటిదే!
యూట్యూబ్, ఫేస్‌బుక్‌లే ఉచ్వాసనిశ్వాసలుగా ఉన్న ఈ తరానికి ఒగ్గుకథకే ఓనమాలు నేర్పిన గొప్ప కళాకారుడు చుక్క సత్తయ్యను చూపించాలంటే ఈ శీర్షికను అద్దంగా మార్చుకోక తప్ప ఆయన శ్వాస యూట్యూబ్‌కి చిక్కలేదు... ఆయన ఉనికిని ఫేస్‌బుక్ పేజ్ ట్రేస్ చేయలేదు..
అందుకే చుక్క సత్తయ్య అద్దంలాంటి మనసుకు ఈ వారం లోపలి మనిషి ప్రతిబింబంగా మారింది!
చౌదరపల్లి సత్తయ్య మెరుపు అభినయానికి ముచ్చటపడ్డ ఓ పెద్దమనిషి ఆయనను ‘చుక్క సత్తయ్య’గా మార్చేశాడు! ప్రతిభను ఇంటిపేరుగా నిలుపుకున్న అతికొద్దిమందిలో ఈ అద్భుత కళాకారుడు ముందుంటాడు! 


నాకు ఊహ తెలిసేనాటికే మా నాన్న(ఆగయ్య) చనిపోయిండు. అయినా మా అమ్మ(సాయమ్మ) మమ్మల్ని దొరలను సాదినట్టు సాదింది. నాకు ఓ అన్న ఉండె. మాది వ్యవసాయ కుటుంబం. మూడువందల గొర్రెలు, వంద మేకలుండె. నాకు ఐదేండ్లప్పటి నుంచే పశువులను కాయడానికి వెళ్లేవాడిని. పైసలున్నా జీతగాళ్లు దొరకక మమ్మల్ని పశువుల కాడికి పంపిడ్రు. ఆ తర్వాత ఓ యేడాది కళ్లెం (మాణిక్యపురానికి కిలోమీటరు దూరంలో ఉన్న గ్రామం) నిజాం సర్కారు బడికి పంపిండ్రు. ఒంట్లు, ఓనమాలు నేర్చుకున్న. అప్పుడే ఇక్కడ స్వతంత్య్ర పోరాటం ఉధృతమైంది. పెద్ద పెద్ద వాళ్ళంతా జెండాలు పట్టుకుని సత్యాక్షిగహంలో తిరుగుతున్నారు. మాకు పేలాల ముద్ద కొనిస్తే అది తీసుకుని ఓ చేత్తో జెండా పట్టుకుని వాళ్ల తిరిగినం. పిల్లలం కదా... క్విట్ ఇండియా అనరాకపోయేది. గాంధీ మహాత్ముడికి జై అంటూ తిరిగే వాళ్లం. 1947లో భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చింది.. నాకు పెళ్లయింది. ఆ తర్వాత ఎనిమిది నెలలకు ఇక్కడ కమ్యూనిస్ట్ పోరాటం మొదలైంది. అప్పుడు నాకు పదహారేండ్లుండొచ్చు. కమ్యూనిస్టులకు పాలు, పొగాకుచుట్టలు, చార్మినార్ సిగట్లు తీస్కపోయి ఇచ్చేటోడిని. వాటికి పైసలిచ్చేటోళ్లు. పోలీస్ యాక్షన్ అప్పుడు జనగాంలో దోపిడైంది. నేను కూడా వెళ్లిన. రెండు మంకీ టోపీలు, రెండు చిన్న చిన్న స్వెట్టర్లు, జంగంబజార్ చెప్పుల జోళ్లు దొరికినయ్. ఇవన్నీ అయినాంక ఒకదిక్కు వ్యవసాయం పనిచేసుకుంట ఇంకోదిక్కు బొంబై నారాయణ అనే వ్యక్తి దగ్గర ఎంతోకొంత చదువు నేర్చుకున్న. 
jaipalసారంగధర..
తీగరాజు పల్లె (వరంగల్ జిల్లా)నుంచి యాదగిరి అనే సార్ వచ్చిండు మా ఊరికి (వరంగల్ జిల్లా, లింగాల ఘణపురం మండలం, మాణిక్యపురం). ఆయన దగ్గర నరసింహ శతకం నేర్చుకున్న. దాని మహత్యం చాలా గొప్పది. అందులోని యాభై పద్యాలు ఇప్పటికీ నోటికొస్తయ్. జ్ఞానబోధ, జొన్న ఎల్లయ్య రాసిన గురుబోధను కూడా ఆ పంతులుతో చెప్పించుకున్న. ఆ టైమ్‌లోనే మా ఊళ్లో చిరుతల రామాయణం నాటకం రిహార్సల్స్ అయితున్నయ్. హనుమంతుడి పాత్రకు ఎవరూ సూట్ అయితలేరు. ‘ఈ పిలగాడైతే మంచిగుంటడ’ని నన్ను పిలిచి వేయమన్నరు. ఆ పాత్రకోసం నాకు నేనే ట్రైన్ చేసుకున్న. మంచి పేరొచ్చింది. ఇగదాని తర్వాత నేనే పంతులునైన. శ్రీకృష్ణరాయబారం నాటకం వేద్దామని అందరికీ నేర్పి ప్రాక్టీస్ చేస్తున్నప్పుడే మాలోమాకే కొట్లాటలైనయ్. అంతకుముందు పంతులుకేమో సేరు బియ్యం, నెలకు రూపాయి ఇచ్చేటోళ్లు. నాకేమీ ఇయ్యమన్నరు. ఏమీ ఇయ్యనిదానికి ఎందుకింత కష్టపడుడు అని ఆపేసిన. ఎన్టీరామారావు పౌరాణిక సినిమాలన్నీ చూసేవాడిని.

సారంగధర సినిమా అంటే చాలా ఇష్టం. మోటకొ నిద్ర ఆపుకోవడానికి సారంగధర సినిమాలోని ప్రతి డైలాగుని గుర్తు తెచ్చుకుని ప్రాక్టీస్ చేస్తుంటి. అప్పుడే మా ఊళ్లో ఓ కుర్మాయన, చాకలాయిన కలిసి సారంగధర కథ చెప్తున్నరు. వాళ్లకు చెప్పస్తలేదు. ఓ గొల్లాయిన ‘బిడ్డా నీకు బాగా ప్రాక్టీస్ ఉంది కదా... నువ్ చెప్పు’ అన్నడు. చెప్పేసిన నవరసాలు పలికిస్తూ! మూడు రూపాయలు ఇచ్చిండ్రు. 25 మంది కలిసి నెలరోజు ఆడితే బారాణ వచ్చేది. నేనొక్కడినే ఒక్కరోజు కథ చెప్తే మూడు రూపాయలు ఇచ్చిండ్రు.. ఇదేదో మంచిగుంది అనుకున్న. చిన్న భిక్షపతి, కడగంజి భిక్షపతి, చాకలి చంద్రయ్య.. వీళ్లను పట్టుకున్న. డోలు చేయించిన. ఇగ ఒగ్గు కథలు చెప్పుడు మొదలుపెట్టిన. ఎర్రగొల్ల లక్కమ్మ కథ, లక్కగుర్రం చంద్రావతి, కీలుగుర్రం దేశపతిరాజు కథలు, బీరప్ప కథ, మల్లన్న కథ, ఎల్లమ్మ కథ అన్నీ చెప్తుంటిని. బజార్లలో చెప్పుడు కూడా మొదలుపెట్టిన. 
abdulరాత్రి కథ...పొద్దున పొలం
మా అన్న మా ఊర్లో పెద్ద మనిషి. పంచాయితీలు చెప్పేటోడు. ఆయనలేంది ఏ పంచాయితీ జరిగేది కాదు. అసుంటాయనకు నేను బజార్ల కథ చెప్పుడు నచ్చకపోయేది. నా ఇజ్జత్‌దీస్తున్నవని కోపం చేస్తుండే. కథ చెప్పద్దనేది. పగటి పూటైతే ఆయనకు తెలుస్తదని రాత్రికి పోయి చెప్పేటోడిని. రాత్రి కథ చెప్పి వచ్చి పొద్దున పొలం పనులు చూసుకునేటోడిని. పెంబర్తి లాంటి చోట కథకు పదిరూపాయలు ఇచ్చేటోళ్లు. చుట్టుపక్కల ఊళ్లల్లో నా పేరు అందరికీ తెలిసిపోయింది. ఇగ జనగాంలో చెప్పుడు స్టార్ట్ చేసిన. అప్పటికే అది పెద్ద పట్టణం. కథకు పన్నెండు రూపాయలు ధర పెట్టిన. జనగాం నుంచి మాఊరు ఏడుకిలోమీటర్లు. రాత్రంతా కథ చెప్పి తెల్లవారు జాము నాలుగు గంటలకు బయలుదేరి మాఊరికి వస్తుంటి. నిద్ర ఉండకపోయేది. అట్లా గడిచిపోతున్నప్పుడే మా పశువులు పక్కవాళ్ల చేన్లలో పడి చేన్లు పాడుచేస్తున్నయని వాళ్లు పెద్ద గొడవ చేసిండ్రు. విసుగొచ్చింది. 

బండి కట్టుకుని గుట్టకు పోయి రాయంత పెకిలించి తెచ్చిన. ఓ మనిషిని పట్టుకుని ఒక్కడినే పొద్దుందాక, తెల్లందాక... బాయి చుట్టూ రాళ్లదొడ్డి పెట్టిన. అందుకే ఇప్పుడు వెన్ను బొక్కలన్నీ అరిగి ఇరవై నాలుగ్గంటలూ నొప్పి పెడ్తయి. ఇట్లా పొలం పని, అటు కథ... ఇవన్నీ తెలిసిన మా అన్న యాష్టకొచ్చి ఇగ చెప్తే వినడని ఊరుకున్నడు. నేను జనగాంలో కథ చెప్తున్నప్పుడే మా అమ్మ కాలు ఫ్రాక్చర్ అయింది. ఇటు వ్యవసాయం కుంటు పడింది. అటు నా కథా అంతగా నడవ జీతగాళ్ల జీతానికి కూడా పైసపూల్లని కాలమొచ్చింది. అమ్మను జనగాం హాస్పిటల్లో చూపిస్తే హన్మకొండ తీస్కపొమ్మన్నరు. అంతదూరం.. ఎవరు తీస్కపోవాల.. అక్కడ ఓ మున్నూరు కాపువాళ్లది ఓ హొటల్ ఉండే. నేను వాళ్ల హోటల్ ముందు కథ చెప్తే వాళ్లకు గిరాకీ బాగా వచ్చేది. ఆ అమ్మ..‘నువ్ పోతే హోటల్ గిరాకి దెబ్బతింటది. మీ అమ్మను మా ఇంట్లో ఉంచుకుని వైద్యం చేయిస్తా. నువ్ ఎప్పటిలాగే మా హోటల్ ముందు కథ చెప్పు’ అన్నది. అన్నట్లుగానే నెల రోజులు వాళ్లింట్లో పెట్టుకుని చూసుకుంది. అమ్మ మంచిగై ఇంటికొచ్చింది. కానీ.. తిండికెట్లా? అటు కాలం లేకపాయే ఇటు కథలు నడవకపాయే! ఆలోచించిన. నాలుగు తులాల బంగారం అమ్మి ఇంట్లకి కావల్సిన గ్రాసం అంతా కొన్న. కొని పైసలు కూడా ఇచ్చి ఇద్దరు మనుషులను తీసుకుని హైదరాబాద్ బయలుదేరిన.

వేషం మార్చడమే....
చిక్కడపల్లిలో నక్కీర్త నరసింహ అని మా చుట్టం ఉంటుండే. ఆయన వాళ్లింటికి తీస్కపోయి భోజనం పెట్టి రాత్రి కథ చెప్పిచ్చిండు. ఎవ్వరూ రాలే. పట్నపోల్లు ఆడేషాలుగీడేషాలు కట్టి జోర్‌దార్ ఆడిరాయే.. నేను వట్టిగా జెప్పే కథకెవరొస్తరు? ‘ఇట్లయితే ఎట్లరా.. పట్నంల నువ్ బతుకుడు కష్టమే ఉన్నట్టున్నది. పొద్దున పెట్టు చూద్దాం’ అని తెల్లారి ఓ గోడ నీడకు పెట్టిచ్చిండు నక్కీర్త నరసింహా. మొదలుపెట్టి నాలుగ్గంటలైనా ఎవ్వరు రాలే. అయినా చెప్తునే ఉన్న. మెల్లంగ మెల్లంగ ఒక్కలొక్కలే వచ్చుడు షురువై యాభై మందిదాకా జమైండ్రు. రోడ్డు మీద రిక్షలన్నీ ఆగిపోయినై. పోచమ్మ అని అక్కడ పాలమ్మెటామె కూడా చూసింది. ‘తమ్మీ నేను నలభై కథలు పట్టిస్తా నీకు, ఇక్కడ్నే చెప్పాలె’ అన్నది. ఓ కథ చెప్పిచ్చింది కూడా 25 రూపాయలకు. 

అప్పటి నుంచి నా కథలకు సబ్జి మండినుంచి జనాలు వచ్చుడుపెట్టిండ్రు. ‘పప్లూటూరు నుంచి ఒకాయనొచ్చిండు.. యాక్షన్ చేసుకుంట కథ బాగా చెప్తుండు’అని నా పేరు అన్నిచోట్లకు పాకిపోయింది. కథ మీదనే అక్కడిదక్కడ్నే వేషం మారుస్తుంటి. అదే నా ప్రత్యేకత. అట్లా చిక్కడపల్లి, కోరంటి, నల్లకుంట, సీతాఫల్ మండి, చిలకలగూడ ఇట్లా అన్నిచోట్లకు పోయి బాగానే చెప్పిన. కానీ కథలన్నీ పలుచగైనయ్. ఏం చేయాలి? అప్పుడే... మా ఊరినుంచి డబిల్‌పురకొచ్చి ఉంటున్న గొల్లాయన కలిసిండు. ‘మా దగ్గరకొచ్చి చెబ్దువురా’ అని పిలిచిండు. డబిల్‌పురలో చెప్పాలంటే కష్టం. ముస్లిమ్స్ ఎక్కువుంటరు. కొట్లాటలు బాగా అయితయ్. అయినా పోయినం. ఓ కథ చెప్పినం. అక్కడ చాకలి జంగయ్య, బాలమ్మ అనేటోళ్లది రోడ్డు మీదనే ఇస్త్రీ షాప్. వాళ్లే అందరినీ పిలుచుకొచ్చేది. ఆ రోడ్డుమీదనే కథ చెప్పుడు మొదలుపెట్టిన. కథకు నలభై రూపాయలు పెట్టిన.

డబిల్‌పుర దర్వాజ దగ్గర అట్లా ఆ రోడ్డు మీదనే నాలుగేండ్లు కథ చెప్పిన. ఆడ్నే ఎస్పీ (పోలీస్ ఆఫీసర్) ఉంటుండే. ఒకరోజు ఆయన వాకిట్ల కథ. ఇదివరకు కథ చెప్పేటోళ్లనిద్దరుముగ్గురిని కొట్టిండట ఆయన. రోజూ మా గొల్లోల్లే కథ చెప్పిస్తున్నరు. మధ్యాహ్నం ఎందుకనో వచ్చిండు డగ్ డగ్ మని బుల్లె ఆయనను చూడంగానే జనం అంత ఉరుకుతున్నరు కొడ్తడని. ఎట్ల కొడ్తడో చూస్త అని నేను కథ చెప్తనే ఉన్న. గుడ్లు తీసుకుంటా మంచి వాదం మీదున్న. ఎస్పీ చూసిండు కానీ ఏమన్లే. ఇంట్లకు పోయి బంగ్లా ఎక్కి రెండుగంటలు ఎండల నిలవడి చూసిండు. కథ అయిపోయినంక మా గొల్లోల్లవాకిట్లో అందరం కలిసి చిల్లర పైసలను పంచుకుంటున్నం.. నాలుగు పాన్‌లు, నాలుగు చాయ్‌లు తీసుకుని వచ్చిండు ఎస్పీసాబ్. ‘పంతులూ.. ఇవి తీస్కుంటవా?’ అన్నడు. తీస్కోమ్మన్నది గొల్లామె. తీస్కోని తాగినం. ‘ఏ ఊరు మీది’ అని అడిగిండు. చెప్పిన. ‘ఏమేం కథలు చెప్తవ్’ అన్నడు. ‘ఎల్లమ్మ, మల్లన్న లాంటి కథలన్నీ చెప్తా’ అన్న. ‘అట్లనా! ఏదీ రేపటి కథేందోఒకసారి చెప్పు’ అన్నడు. చెప్పిన. ‘ఛలో ఖర్చు నాదే. చెప్పు’ అన్నడు. చెప్పిన. అప్పటినుంచి నన్ను ఆయన అందరికీ తన బావమరిదని పరిచయం చేస్తుండె!

నాలుగేళ్ల తర్వాత..
వరంగల్‌లో అఖిలభారత తెలుగు సాంస్కృతిక ఉత్సవాలు జరుగుతున్నయి. అప్పటి కలెక్టర్ బాల్‌రాజ్ యాదవ్. చొక్కారావు మంత్రి. ఆ ఉత్సవాల్లో ఒగ్గుకథ కావాలే, ఎవరు బాగా చెప్తరని ఆరా తీసిండ్రు. అంతా తిరిగిండ్రు. ఎవరూ నచ్చలేదు. నా గురించి తెలిసి పిలిచిండ్రు. వరంగల్‌లో పది నిమిషాలు ఒగ్గుకథ చెప్పాలె. ‘రానుపోనూ చార్జీలు అన్నీకలిపి నలభై రూపాయలిస్తం’ అన్నరు. ఒప్పుకున్న కానీ లోపల వణుకుడు స్టార్ట్ అయింది. లక్షమందిలో చెప్పాలె. వేషంగీషం కట్టనీయలే. సాయంత్రం నాలుగున్నరప్పుడు నావంతు వచ్చింది. కథ మొదలుపెట్టిన. పది నిమిషాలన్నది గంటన్నరైంది. నలభై రూపాయలన్నోళ్లు నాలుగువందలిచ్చిండ్రు. ఎవరికోసమో తెచ్చిన దండను నాకు వేసి సన్మానం చేసిండ్రు. బీరప్పకథ చెప్పిన. దాన్నుంచే ఢిల్లీలో అవకాశం వచ్చింది. అక్కడా నా కథ అందరికీ నచ్చింది. ఇచ్చింది తీసుకున్నం. తర్వాత యేడు కూడా ఢిల్లీకి పంపిండ్రు నన్ను. 

నా కలలోనే ఉన్నావ్..
ఎమ్జన్సీ టైమ్‌లో ‘ఇందిరాగాంధీ ప్రభుత్వ పథకాలను ఒగ్గు కథ ద్వారా ప్రజలకు తెలియజేయాల్నట చెప్తవా’ అని ఓ మనిషి వచ్చిండు. ఒప్పుకోనైతే ఒప్పుకున్న కానీ ఎట్ల చెప్పాలె? పథకాల గురించి రాసియ్యమని ఎవరిని అడిగినా మాకు రాయొస్తలేదనే చెప్పవట్టిరి. లాభంలేదని.. 20 సూత్రాల పథకం వివరాలను చూసుకుంట ఒగ్గుకథ స్టయిల్లో నేను రాసుకున్న. ఊరూరు తిరిగి పాడిన. బాగా పాపులర్ అయింది. పౌరసంబంధాల శాఖ డైరెక్టర్ రాజన్ సిన్హాకు నా కథ బాగా నచ్చింది. తెల్లవారి నన్ను హైదరాబాద్ పిలిపించింది. ‘నీ కథ బాగా నచ్చింది. ఉత్సాహమనిపించింది. రాత్రంతా నువ్ నా కలలోనే ఉన్నావ్’ అన్నది. వంద రూపాయలు నా చేతిలో పెడ్తూ ‘నీకు వెయ్యి ప్రోగ్రామ్‌లిస్తున్నా’ అని చెప్పింది. అట్లా ప్రభుత్వ పథకాలన్నీ ఒగ్గు కథకింద మార్చేసిన. 

ఇవన్నీ చూసినాక గప్పుడు మా అన్న నన్ను మెచ్చుకున్నడు. అంతకుముందు మాట్లాడని మా బావమరుదులు కూడా బావా అని దగ్గరకొచ్చి కాళ్లు మొక్కిండ్రు. అది పక్కనపెడితే... కుటుంబ నియంవూతణ గురించి చెప్తున్నప్పుడు ఒకసారి లంబడోళ్లు రాత్రంతా చెట్టుకు కట్టేసిండ్రు. ఇటు ఇట్లుంటే... అటు ఒగ్గు వాళ్లు నామీద అటాక్‌చేసిండ్రు. ‘నువ్వు ఉట్టి కుర్మాయనవు.. ఒగ్గు పూజారివి కాదు. ఒగ్గుకథ ఎట్ల చెప్తవ్? చెప్పద్ద’ంటు! నా చేతిలో లింగం పెట్టి ‘ఒగ్గు కథ చెప్పడం మానేస్తాన’ని ప్రమాణం చేయించాలని చూసిండ్రు. మా అమ్మ అడ్డుపడ్డది. చివరకు కుర్మిళ్లల్లో నేను భోజనం చేయకూడదని తీర్మానించిండ్రు. అట్లా ఒకరకంగా నన్ను కుల బహిష్కరణ చేసిండ్రు. నాటి నుంచి నేటి దాకా నేను ఏ ఊరు వెళ్లినా... ఎక్కడ కథ చెప్పినా.. కుర్మిళ్లల్లో భోజనం చేయలేదు, చేయను. ఆఖరికి ఫంక్షన్లయినా తినను. 

అద్దతులం మింగిండ్రు
ఊర్లో అట్లుంటే.. పట్నంలో కూడా ఓ యాభైమంది ఒగ్గు కథ పూజారులు నాకు అడ్డంపడ్డరు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో పోటీలు అవుతుంటే వీళ్లూ పోటీకొచ్చిండ్రు. జమున, జగ్గయ్య ముఖ్య అథితులు. ఆ యాభైమందిలో ఇరవై మంది ఇరవై వేషాలు కట్టిండ్రు. నేను ఒక్కడినే ఒక్క వేషం. అయినా.. వెరవలేదు. బీరప్ప కథ చెప్పిన. అంతా మైమరిచిండ్రు. వాళ్ల ప్రదర్శన తేలిపోయింది. అందులో డోలు కొట్టేటాయన వచ్చి ‘అన్నా తప్పయింది క్షమించు’ అని కాళ్లు పట్టుకున్నడు. ఇదైనాంక ఊళ్లో నా దగ్గర విద్య నేర్చుకున్న నా శిష్యులూ నా మీద అటాక్ చేసిండ్రు. ఎవరేం చేసినా వెనకనుంచే. ముందుకొచ్చి మాట్లాడే ధైర్యం ఒక్కళ్లకు లేదు. దేవుడు నాకు తోడున్నాడు. నా నిజాయితీ, చిత్తశుద్దే నన్ను నిలబెట్టింది. ఇందిరాగాంధీనే చేతిలో చేయి వేసి మెచ్చుకుంది. ఐదుతులాల బంగారం శాంక్షన్ చేసింది. సంగీత అకాడమీవాళ్లు అద్దతులం మింగి నాలుగున్నర తులాలతో బంగారు కంకణం చేయించి తొడిగిండ్రు. ‘జానపద కళామూరి’్త అనే బిరుదు ఇచ్చిండ్రు. 

కేంద్ర సాహిత్య, సంగీత అకాడమీ, కళారత్న హంస అవార్డ్, కళాసాగర్ అవార్డు, డాక్టరేట్‌లాంటివి వెయ్యిదాకా సన్మానాలు అందుకున్న. నన్ను సన్మానించని ముఖ్యమంత్రి లేడు. చాలా దేశాలు, రాష్ట్రాలు తిరిగిన. ఇప్పటిదాకా 15వేల ప్రోగ్రామ్‌లు చేసినట్టు లెక్కదీసిండ్రు. ఎన్ని చేసినా అత్యాశకు పోలేదు. ఇచ్చినంత తీసుకున్న. ఏనాడూ ఎవరినీ పీడించలేదు. అదే నన్ను ఇంతవాడిని చేసింది. తెలుగు యూనివర్శిటీలో ఒగ్గుకథ బోధకుడిగా 19ఏళ్లు పనిచేసిన. కళాకారులకు నాతోనే ఫించన్లు పుట్టినయ్. గద్దర్‌కీ నేనంటే గౌరవమే. నేను కథ చెప్తున్నప్పుడు గద్దర్ చిన్నపిల్లగాడు. అట్ల నిలబడి చూసేటోడు.

పక్కలో పాములాంటోడు...
చంద్రబాబునాయుడు, రాజశేఖర్‌డ్డి సిపారసు చేసినా వరంగల్ ఎంపీలు బలపర్చందే పద్మశ్రీ రాదట. ఎవరు బలపరుస్తారు? వాళ్లకంత టైమేడిది? తెలంగాణకోసమే జెండాలు పక్కనపెట్టి ఒక్కటయితలేరు. ఇగ నా సంగతేం పట్టిచ్చుకుంటరు? 69 తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నం. అప్పుడు చెన్నాడ్డి మోసం చేసిండు. ఇప్పుడు మన ఎమ్మేల్యేలు, ఎంపీలు అందరూ దొంగలే. పార్టీ పరంగా ఎవరి సిద్ధాంతాలు వాళ్లకుండనీ..కానీ తెలంగాణ వచ్చేదాకా వాటిని పక్కనపెట్టి కొట్లాడ్తలేందుకు? కేసీఆర్‌ని తిడ్తున్నోళ్లు సపరేట్‌పార్టీ పెట్టి తెలంగాణ కోసం ఎందుకో కొట్లాడరు? దమ్ముంటే కేసీఆర్‌లాగా ఒక్క సభ పెట్టుండ్రి చూద్దాం. ఒక్క కేసీఆర్ మీద పదకొండుతీర్ల విమర్శలు. పక్కల పొంటి నక్కప్లూక్క అదేమి ఒర్రుడు? తెలంగాణ అంటే ఇజ్జత్ ఉన్నోళ్లయితే అందరూ ఒకటే జెండా పట్టుండ్రి. నాలుగు కట్టెలు ఒక్కదగ్గరకడితే మోపైతది. దాన్ని ఎవరూ విరువలేరు.

మనమంతా ఒక్కటైతే వాళ్లే మూటాముళ్లె సర్దుకుంటరు. ‘తెలంగాణకు నేను వ్యతిరేకిని కాను’ అని చంద్రబాబు అంటున్నడు మరి...‘తెలంగాణ కోసం నిరహారదీక్ష చేస్తాన’ని ఎందుకో అనడు. చంద్రబాబు నాకు మంచోడే కావచ్చు, కళాకారుడిగా నాకు గౌరవం ఇచ్చుండొచ్చు కానీ ఆయన తెలంగాణకు పక్కలో పాములాంటోడు. చేదు బుడమకాయ. అసుంటోడికి మోత్కుపల్లి, కడియం శ్రీహరి, దయాకర్‌రావులు వంత పాడుతున్నరు. దమ్ముంటే పార్టీని మెయిన్‌టైన్ చేసుకుంటు పార్టీ అధ్యక్షపదవి చేపట్టండి. శరమున్నోళ్లయితే తెలంగాణ తెలుగుదేశం పార్టీ అని పెట్టుకుని తెలంగాణ కోసం కొట్లాడుండి. ఇట్లాంటోళ్లకు చంద్రశేఖర్‌రావును విమర్శించే హక్కుందా? అటు ఆ మాట ఇటు ఈ మాట మాట్లాడేటోడా మీకు నాయకుడు? ఇసుంటోళ్లు ఓట్ల కోసం వస్తే చెట్టుకు కట్టేయాల. పదవికోసం, పైసల కోసం లత్కోర్ వేషాలేస్తున్నరు. మన తల్లిని సిగవట్టి ఆడిస్తుంటే నువ్ వాడి కాళ్లు ఒత్తుతావ్? ఇదేనా మీ చదువు? ముట్టక భూమి లేదు... పెట్టక కీర్తి రాదు.. తిట్టక వాదు లేదు... వెరిపింపకెన్నక బుద్ధిరాదు.. పట్టపు రాజుకైన తగు పుత్రుడు లేక ముక్తి లేదు అని చెప్పిండ్రు! 

సంతోషం..బాధ
నాతో ఒగ్గు కథ ప్రాచుర్యం పొందడం ఎంత సంతోషాన్నిచ్చిందో.. మా ఒగ్గు పూజారులే నామీద అటాక్ చేయడం అంత బాధించింది. ఆశ పెట్టుకున్నవాళ్లంతా నాశనమవడమే! నేనెప్పుడూ దేనికీ ఆశపడలేదు. ఎవరిమీదా రూపాయికి ఆధారపడలేదు. ఎవరినీ చూసి ఈర్ష్య పడలేదు. పగవాడినైనా కావలించుకున్న. ఒగ్గుకథకు మా గురువులు కులంలో ప్రాచుర్యం కలిపిస్తే నేను దేశమంతా కల్పించిన. ఈ విషయాన్ని గర్వంగా చెప్తా. నేను నేర్చుకున్నది నాతోనే అంతం కావద్దని ఇప్పటి పిల్లలకు నేర్పించాలనుకుంటా. కానీ ఎవళ్లకు అంత ఓపికలేదు, ఇంట్రస్ట్ లేదు. రమ్మన్నా రారు. విద్య వచ్చిన కొంతమంది తాగుడుకి బానిసలవుతున్నారు. వృత్తి మీద భక్తి లేకుంటే అది రాణించదు.

గోచీ ఊడేటట్టు
గండిపేటలో ఒకసారి ఎన్టీరామారావు బర్త్‌డే అయితుంది.. ఆ మీటింగ్‌కి కల్చర్ డిపార్ట్‌మెంట్ నుంచి సైదులు నాకు ఆహ్వానం పంపిండు. కానీ సెక్యూరిటీ లోపలకు పోనియ్యలేదు. ఆదిలాబాద్ ఎమ్మెల్యే ఒకాయన చూసి సెక్యూరిటీ వాళ్లకు చెప్తే లోపలికైతే పంపిండ్రు కానీ ఎన్టీరామారావు పీఏ నాకు అక్కడ ప్రోగ్రామ్ లేదన్నడు. ఇంత దూరం వచ్చి ఏంచేయాలని బాధపడ్డ. ఉండడానికి రూమ్ ఇచ్చిండ్రు. భోజనం పెట్టిండ్రు కానీ నాకు తినబుద్ధికాలేదు. సాయంత్రం ఫంక్షన్ మొదలైంది. ఏమైతే అదయిందని కాళ్ల గజ్టెలుకట్టుకుని తయారైన. ఎవరో పిల్లలు బుర్రకథ చెప్తున్నప్పుడు ఒక్కసారి ఎన్టీరామారావు నన్ను చూసిండు. ఒక్క ఐదు నిమిషాలు టైమ్ ఇయ్యుండ్రి సర్ అని సైగ చేసిన. రమ్మన్నడు. పోయిన. గంగను ప్రార్థించేటప్పుడు ఆయనేమంత చూడలేదు కానీ ‘తెలుగు దేశం మనదే సోదరుడా... మాయన్నల్లారా.. శ్యామలమైన రాజ్యం మనదమ్మా’ అని ఒక్కపారిగా ఎత్తుకోంగానే నన్ను చూసిండు. ఇగ ఎన్టీరామారావు సహా అందరూ లేచి ఎగురుడే ఎగురుడు. వసంత నాగేశ్వరరావుదైతే గోచే ఊడిపోయింది. ఎగిరి ఎగిరి ఎన్టీరామారావు వచ్చి నన్ను పట్టుకున్నడు. ‘సాయంత్రం మా ఫ్యామిలీ వస్తది మళ్లీ పాడాలి’ అన్నాడు. ఐదువేల రూపాయలు బహుమానం ఇచ్చిండు.

(from namaste telangana)