హోం

3, ఫిబ్రవరి 2013, ఆదివారం

రహదారుల దిగ్బంధం...


హైదరాబాద్ : తెలంగాణ ఉద్యమంలో భాగంగా తెలంగాణలోని హైవేలను దిగ్బంధించాలని టీ రాజకీయ జేఏసీ నిర్ణయించింది. ఇవాళ తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్‌లో జరిగిన తెలంగాణ జేఏసీ విస్తృత స్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. సమావేశం ముగిసిన అనంతరం ప్రొఫెసర్ కోదండరాం మీడియాతో మాట్లాడారు. ఈ నెల 24న బెంగళూరు హైవేను, మార్చి 2న విజయవాడ హైవేను దిగ్బంధించాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. ఫిబ్రవరి 11, 12 తేదీల్లో శంషాబాద్ నుంచి అలంపూర్ వరకు, 27, 28 తేదీల్లో హయత్‌నగర్ నుంచి కోదాడ వరకు బస్సు యాత్రలు చేపడుతామని పేర్కొన్నారు. కాంగ్రెస్ ఖతం కరో.. తెలంగాణ హాసిల్ కరో.. అనే నినాదంతో ఉద్యమిస్తామని ఆయన తెలిపారు. 

ఈ నెల 16 నుంచి 21 వరకు కాంగ్రెస్ ఎమ్మెల్యేల నియోజక వర్గాల్లో ప్రచారం నిర్వహిస్తామని చెప్పారు. సమైక్యవాదానికి మద్దతు లేదని తెలిసినా తెలంగాణపై కాంగ్రెస్ మోసపూరితంగా వ్యవహరిస్తోందని ఆయన మండిపడ్డారు. టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీని వదిలి ప్రజా ఉద్యమంలోకి రావాలని ఆయన పిలుపునిచ్చారు. 

మార్చి 3వ వారంలో శాసనసభ సమావేశాలు జరిగే అవకాశం ఉందని కోదండరాం పేర్కొన్నారు. సమావేశాలు జరిగే సమయంలో పెద్ద ఎత్తున ‘చలో అసెంబ్లీ’ కార్యక్రమం నిర్వహిస్తామని స్పష్టం చేశారు. రాజకీయ కక్షతోనే టీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై, కోదండరాంపై కేసులు బనాయించడాన్ని టీ జేఏసీ ఖండించింది.     -namaste telangana

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి