పూర్వరంగం:
భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చేనాటికి తెలంగాణ ప్రాంతం పూర్తిగా నిజాం నవాబుల పాలనలో ఉండేది. అయితే, నిజాం హైదరాబాద్ రాష్ట్రాన్ని భారత యూనియన్‌లో విలీనం కావడానికి ఒప్పుకోలేదు. దాంతో వల్లభాయ్ పటేల్ నేతృత్వంలోని భారత సైన్యం ‘ఆపరేషన్ పోలో’ పేరుతో సైనిక చర్య జరిపి, హైదరాబాద్ రాష్ట్రాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకుంది. తర్వాత రాష్ట్రాల పునర్విభజన పేరుతోనూ, భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటులో భాగంగానూ అప్పటి వరకూ ప్రత్యేక రాష్ట్రంగా ఉన్న హైదరాబాద్ రాష్ట్రాన్ని ఆంధ్రపాంతంతో కలుపుతూ 1 నవంబర్ 1956న ‘ఆంధ్రప్రదేశ్’ ఏర్పాటుచేశారు. అయితే 1948-56 దాకా హైదరాబాద్ రాజధానిగా తెలంగాణ స్వతంత్ర రాష్ట్రంగానే ఉండింది. సమైక్య రాష్ట్రం అన్న భావన మన ప్రజానీకానికి ఇష్టం లేకుండేది. తీవ్రంగా ప్రతిఘటించినప్పటికీ నాటి ప్రభుత్వం అణచివేత ధోరణినే ప్రదర్శించింది. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. దాంతో అధికారిక చిహ్నాలూ ప్రత్యేకంగా ఏర్పాటయ్యాయి. ఇప్పుడు ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటే మన ఏకైక లక్ష్యం అయినందున, ఇప్పట్నుంచే మన సొంత ముద్రలకోసం అనేక ప్రతిపాదనలు, ఆలోచనలు సాగుతూనే ఉన్నయ్.
తెలంగాణ రాష్ట్రం
మనవి:
మనవి:
ఆంధ్రప్రదేశ్ ముద్రను పోలినట్లే వృత్తం ఉండి ఇంగ్లిష్‌లో ‘గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ’ అని ఉర్దూ, హిందీతో పాటు మధ్యలో తెలుగులో ‘తెలంగాణ’ అని ఉండేలా రూపొందించారు. ఇక పూర్ణకుంభం స్థానంలో ‘కాకతీయ కళాతోరణం’, కిందివైపు ‘మూడుసింహాల అశోక చక్రం’ కనిపిస్తుంది. మరికొంతమంది ఔత్సాహికులు కాకతీయ తోరణం స్థానంలో చార్మినార్‌ను కూడా ఉంచారు.తెలంగాణ అధికార ముద్రగా కాకతీయ తోరణం లేదా చార్మినార్‌తో కూడిన ఎంబ్లం, మన మాతృ గీతంగా 1944-45 మధ్యకాలంలో రావెళ్ల వెంకటరామరావు రాసిన ‘కదనాన శత్రువుల కుత్తుకుల నవలీల’ అన్న గేయం అలాగే అందె శ్రీ రాసిన ‘జయజయహే తెలంగాణ’ గీతాన్ని రాష్ట్ర గీతంగా యువత సోషల్ నెట్‌వర్క్‌ల ద్వారా బహుళ ప్రచారంలోకి తెస్తున్నారు. ఇంకా కొన్ని ప్రతిపాదనలు ఇలా ఉన్నయి...
రాష్ట్ర నృత్యం : పేరిణి
జంతువు : పెద్దపులి
పక్షి : పాలపిట్ట
పువ్వు : గుమ్మడి / తంగేడు/బంతి పువ్వు
చెట్టు : వేప
ఆట : చిర్రగోనె
ప్రత్యేక తెలంగాణ ఉద్యమ ప్రభావంతో అప్పటిదాకా మనమీద బలవంతంగా రుద్దిన ‘తెలుగుతల్లి’ భావనను ప్రశ్నించడమూ మొదలైంది. ఆ క్రమంలో ఆవిర్భవించిందే ‘తెలంగాణ తల్లి’. తెలంగాణ తల్లి విగ్రహం కుడిచేతిలో ‘మొక్కజొన్న’, ‘జొన్న’ కంకులు, ఎడమ చేతిలో ఈ ప్రాంత సంస్కృతికి చిహ్నమైన ‘బతుకమ్మ’ ఉండేలా రూపొందించారు. -బతుకమ్మ నుండి...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి