హోం

16, ఫిబ్రవరి 2013, శనివారం

గతం-ఘనం, వర్తమానం-చైతన్య రహితం, భవిష్యత్-ప్రశ్నార్ధకం..?



                                నిరంతర పోరాటాలు చైతన్య వంతమైన సమాజానికి చిహ్నాలు, నేడు ప్రపంచంలో అలాంటి పోరాటాలు చాల అరుదు, నేడు జరుగుతున్న అతి పురాతన ప్రభావశీల ఉద్యమం తెలంగాణా ఉద్యమం, వాల్ స్ట్రీట్ ఉద్యమాన్ని, తెహ్రి స్క్వేర్ జన సందోహాన్ని మైమరపించే ఎన్నో సంఘటనలు ఈ ఉద్యమంలో ఉన్నాయి. 
                            తెలంగాణా సాయుధ పోరాటం నుండి, ముల్కి ఉద్యమం, 1969 జై తెలంగాణా ఉద్యమం, 610 జిఓ అమలు ఉద్యమం, ప్రస్తుత తెలంగాణా రాష్ట్ర ఉద్యమం, నిరంతర ఉద్యమాల్లో 69 తర్వాత వచ్చిన సుదీర్గ విరామాన్ని నక్సల్ బరి ఉద్యమం పూర్తిచేసింది, గతం ఎంతో ఘనం నాడు సాయుధ పోరాటంలో నియంతృత్వ మత చాందస ప్రభుత్వాన్ని కూల్చిన తెగువ ఇక్కడి ప్రజలది, సామ్రాజ్య వాద విస్తరణ కుట్రలను తిప్పి కొట్టడానికి, తమ అస్తిత్వాన్ని నిలుపుకోవడానికి జరిగిన విశాలాంద్ర వ్యతిరేక ఉద్యమంలో ఇక్కడి ప్రజలు తెగువను చూపారు, ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి, పెత్తనం చేసే వారి ఆటలు సాగనివ్వ బోము అంటూ 1969 లో  జై తెలంగాణా ఉద్యమం చేసి ఆంధ్రోడి తుపాకికి గుండెను చూపి మరణించిన వీరులు ఎందరో, జరుగుతున్న ఉద్యమం లో ఆశయ సాధనకు తమ ప్రాణాలను త్రుణ ప్రాయంగా వదులుతున్నవారు అనేకం, తెలంగాణాలో పోరాటాలు కొత్త కాదు, ప్రభుత్వ హత్యలు కొత్తకాదు, అణచివేత నుండి పుట్టిన ఆగ్రహం  నేడు ప్రతి తెలంగాణా వాది మనసును జ్వలిమ్పజేస్తుంది, మరి ఇక్కడి నాయకత్వం ఏమ్చేస్తుంది..?
వర్తమానం చైతన్య రహితం గానే ఉంది, జనవరి 28 తర్వాత ఎం జరుగుతుంది..? అందరిలోనూ సర్వత్ర ఉత్కంట, తెలుగు మీడియా సంక్రాంతి నుండే వార్తల్లో గరం పెంచింది, సీమంద్రులకు చీత్కారం, తెలంగాణకు సానుకూల నిర్ణయమ?, కేంద్రం నిర్ణయం తీసుకుంది, ఆంద్ర కు కొత్త రాజధాని ఎక్కడ అయితే బాగుంటుంది.. చర్చలు, కె వి పీ ప్రవేశంతో తెలంగాణను పక్కన పెట్టారు, తర్వాత ఎం జరుగుతుందో అని అంత ఉత్కంట.. బందులు సమ్మెలు, ప్రజా ప్రతినిధుల రాజీనామాలు ఉంటాయి అని అంత బావించారు, షిండే పత్రికా ప్రకటన రాగానే, ఫాం హౌస్ వీడి కె సి అర్ మీడియా ముందుకు వచ్చి ఇది నేను నెల రోజుల ముందే ఊహించాను అని అన్నారు. 29 తర్వాత ఉద్యమం ఉవ్వెత్తున సాగుతుంది అని చెప్పారు, కాని ఏమి జరగలేదు, కాంగ్రెస్ ఎం పీ లు, మంత్రులు స్తబ్దుగా ఉండిపోయారు, ఇక ఎం ఎల్ ఎ లు అయితే ఉన్నారో లేరో కూడా తెలియదు, ఇక టి డి పీ వారైతే తమ నాయకుడి పాదయాత్ర తెలంగాణా లో ముగిసింది కాబట్టి హాయిగా ఊపిరి తీసుకొని విశ్రాంతి లో ఉన్నారు, మరి ఉద్యమ పార్టీ ఎం చేస్తున్నట్టు..? తెలంగాణా జె ఎ సి ఎం చేస్తున్నట్టు..?
                              డిసెంబర్ లో టి అర్ ఎస్ పార్టీ తలపెట్టిన పల్లె బాట, బస్తి బాట కార్యక్రమాల్లో భాగంగా భారి సంక్యలో తెలంగాణా నాయకులు టి అర్ ఎస్ లో చేరుతారని తద్వారా పార్టీ ని పటిష్టం చేసుకోవాలని భావించారు కె సి అర్, అప్పటికే రెండు మూడు సార్లు కె సి అర్, కె కె తో చర్చలు జరిపి కాంగ్రెస్ లో ఊగిసలాడుతున్న ముగ్గురు నలుగురు ఎం పీ లను తన పార్టీలో చేర్చుకోవడం ద్వారా ఎం ఎల్ ఎ లు, మాజీలు, చోట మోట నాయకులు పార్టీ కి క్యు కడతారని, తద్వారా టి డి పీ నాయకులు కూడా పార్టీలో చేరుతారని భావించారు, కాని, అనుకోకుండా కేంద్రం అకిలపక్షం డ్రామా ఆడడంతో అటు కాంగ్రెస్ ఎం పీ లు, ఇటు టి డి పీ నాయకులు ఆలోచనలో పడ్డారు, పల్లెబాటలో ఎ ఒక్క నాయకుడు టి అర్ ఎస్ లో చేరలేదు. 28 జనవరి తర్వాత కాంగ్రెస్ ఎం పీ లు పార్టీకి పదవికి రాజీనామా చేసి టి అర్ ఎస్ లోకి వస్తారని భావించినప్పటికీ వారు ఎ విధమైన స్పందన లేకుండా ఉండిపోవడంతో కె సి అర్ తిరిగి ఫాం హౌస్ కి వెళ్ళిపోయారు, ఇక జె ఎ సి ఏదో చెయ్యాలి అని తప్ప ఈ మధ్య చేసింది ఏమి లేదు, ఉద్యమం అంటే రోజు జరుగుతూ పోదు, విరామం ఇస్తూ తన రూపాన్ని మార్చుకుంటూ పోతుంది కాని సంవత్సరంలో 6 నెలలు విరామం తీసుకొని, ఒక్కరోజు ఏదో చేసి మల్లి 6 నెలల విరామం తీసుకుంటే అది ఉద్యమం ఎలా అవుతుంది..? పొద్దున్న టిఫిన్ చేసి 10 గంటలకు పులిహోర పోట్లలతో వచ్చి వారు చెప్పిన చోట కూర్చొని  మధ్యానం ఒంటి గంటకు ఆ పొట్లం తినేసి సాయంత్రం 5 గంటలకు ఎవరి దారిలో వారు వెళ్లి పోతే అది ఉద్యమం ఎలా అవుతుంది..? దానికి ఎవరు స్పందిస్తారు..? అసలు ఉద్యమానికి  ప్రభుత్వ అనుమతి ఎందుకు.. ప్రభుత్వానికి వ్యతిరేఖం గా చేస్తున్న ఒక ఉద్యమానికి అదే ప్రభుత్వంయొక్క అనుమతి అడగడం ఎందుకు..? అనుమతి తీసుకొని చెయ్యడానికి ఇదేమైన పల్స్ పోలియో కార్యక్రమమా..?  ఒక్క పిలుపుతో లక్షలాది మంది రావడానికి సిద్ధం గా ఉన్నారు, లక్షమంది ఒక్క చోట చేరడానికి ప్రభుత్వ అనుమతి ఎందుకు..? వీరిచ్చే రెండు గంటల అనుమతి తో మీ నాయకుల దంచుడు ఉపన్యాసాలు విని ఆపసోపాలు పడుతూ ఇంటికి వల్లడం.. ఇదే నా ఉద్యమం..? గాంధిజీ  దండి మార్చ్ కు బ్రిటిష్ వారి అనుమతి తీసుకున్నాడ..?, క్విట్ ఇండియా నినాదం ఇవ్వడానికి బ్రిటిష్ ప్రభుత్వం అనుమతి ఇచ్చిందా..? 

                                    రహదారుల దిగ్బండం చేస్తామని అట్టహాసం గా ప్రకటించిన వారు చేసేది ఒక్క రోజుకే పరిమితం చెయ్యకుండా ఓ పది రోజులు చెయ్యవచ్చు కదా..? 108 రోజులు మణిపూర్ లో జాతీయ రహదారి దిగ్భందం చేస్తేనే స్పందించని ఈ ప్రభుత్వం ఒక్క రోజు రహదారి దిగ్బండం తో కదలి వస్తుందా..? సాగర హారానికి 5 లక్షల మంది వచ్చారు, కాని లాభం ఏమైనా ఉందా..? వారిని నడిపించడం లో నాయకత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుంది, అంత మంది జనాన్ని ఒక్క చోట చేర్చి కనీసం వారికి దిశా నిర్దేశనం చెయ్యకుండా పంపించడం ఎంతవరకు సమంజసం..? మల్లి ఆరునెలల తర్వాత రహదారుల దిగ్బండం పెట్టుకున్నారు, ఇది ఐపోయాక మరో ఆరునెలలకు మల్లి ఇంకేదో కార్యక్రమం, నేడు తెలంగాణా ఉద్యమం లో జయ శంకర్ సర్ లేని లోటు స్పష్టంగా కనిపిస్తుంది, ఉద్యమం లో ఉన్న ఈ లోపాలే అందుకు నిదర్శనం.
                       నేడు తెలంగాణా విషయంలో ఒక స్తబ్దత నెలకొంది, ఈ స్తబ్దతను బద్దలు కొట్టి ఇక్కడి ప్రజలకు దైర్యం చెప్పాల్సిన భాద్యత ఉద్యమాన్ని భుజాన వేసుకున్న నాయకులది, కాని వారు ఆపని చెయ్యలేదు అందుకే ఆత్మహత్యలు జరుగుతున్నాయి,  కేంద్రం నుండి ఏమి ప్రకటన రాదు అని నెల రోజుల ముందే నాకు తెలుసు అని చెప్పడం కాదు, కేంద్రం సమయం అడిగినప్పుడు  నెల రోజుల పాటు వారికి సమయం ఇవ్వడంలో తప్పులేదు, మౌనం దాల్చడంలో కూడా తప్పు లేదు, కాని ఈ నెల రోజుల్లో భవిష్యత్ కార్యచేరణను ఎందుకు రూపొందించలేదు..? ఎంతో ఆశపడిన ఈ సందర్భంలో ప్రకటన రాకపోతే నిరుత్సాహంతో యువత ఆత్మహత్యల బాట పడతారని తెలిసి కూడా వారికి భరోసా ఇచ్చే కార్యాచరణను ఎందుకు రుపొందిన్చుకోలేదు..? ప్రకటన చెయ్యకపోతే ప్రజల ముందు కాంగ్రెస్ నాయకులను దోషులుగా నిలబెట్టే పథకం ఎందుకు  రూపొందించలేదు..?

                               నాగం ఈ మధ్య చాల రెచ్చిపోయి మాట్లాడుతున్నాడు, ఉప ఎన్నికలలో టి అర్ ఎస్, బి జె పీ ల మద్దతు తో, ముఖ్యంగా జె ఎ సి మద్దతుతో గెలిచిన ఈయన ఈ రోజు సొంత కుంపటి పెట్టుకోవడానికి ఇప్పటికే ఉన్న సంస్థలను దునుమాడుతున్నాడు, సొంతకుమ్పట్లు ఎన్ని పుట్టిన ఒకరిని ఒకరు తిట్టుకోవడం దేనికి, అవతలి వాడిని(సీమంద్రున్ని) రానియ్య కుండ చెయ్యాలి కాని..? ఉద్యమం లో ఒకటికంటే ఎక్కువ సంస్థలు, పార్టీలు ఉండడం మంచిదే, కాని వాటి మధ్య స్నేహ భావం ఉండాలి, ఒకటి ఉద్యమాన్ని కొనసాగించడం లో విఫలమైనప్పుడు మరొకటి కొనసాగిస్తుంది, కాని ఆ పరిస్థితి తెలంగాణా లో లేదు, ఉద్యమం చేస్తే టి అర్ ఎస్ లేదా జె ఎ సి చెయ్యాలి, ఉద్యమం విఫలమైనప్పుడు కొంతమంది వచ్చి జె ఎ సి ని తిట్టడం తప్ప వారు చేసేది ఏమి లేదు, మీకు జె ఎ సి లు ఉన్నాయి కదా మరి మీరెందుకు ఉద్యమాన్ని కొనసాగించడం లేదు..? ఉస్మానియా యునివర్సిటి లో ఒక రెండు నెలల కింద జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న నాగం జనార్ధన్ రెడ్డి, "తాను 1969 లో తన సహచరులను కోల్పోయానని, 1969 లోనే తన పెళ్లి జరిగిందని ఆ సమయంలో తన పెళ్లి శుభలేఖ పై జై తెలంగాణా అని అచ్చు వేయించానని చెప్పారు", 'నా పక్కనే కూర్చున్న జనం ఆయన మాటలకు నవ్వి పోయి, ఈ విషయం ఇదే యునివర్సిటి లో జనం  తన్నక ముందు ఎక్కడ చెప్పలేదు..?, ఈ రోజు ఎన్ని డ్రామాలు ఆడుతున్నాడు, నిజంగా ఇది నిజమైతే ఆ కార్డ్ ను చూపించ వచ్చు కదా' అని మాట్లాడుకుంటున్నారు, ఏదో ఈ రోజు పదవికి రాజినమా చేసాను కదా అని తనేదో ముందుండి ఉద్యమాన్ని నడుపుతున్నట్టు రెచ్చిపోతున్న నాగం నీ గతాన్ని జనం మరచి పోలేదని గుర్తుపెట్టుకుంటే మంచిది.

 ఇక జాతీయ పార్టీ ఐన బి జె పీ కూడా ఈ సమయం లో ఏమి చెయ్యకుండా స్తబ్దుగా ఉండిపోయింది, ఇక కమూనిస్ట్ పార్టీ నాయకులు నిన్న సమర్ధించిన వారినే నేడు తిడుతూ వారు సమ్థింగ్ స్పెషల్ అని నిరుపించుకున్తున్నారు.
                                     భవిష్యత్తులో కూడా పరిస్థితులు ఇలాగె కొనసాగితే తెలంగాణా భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతుంది, ఇప్పటికైనా తెలంగాణా పార్టీ నాయకులు, జె ఎ సి నాయకులు మేల్కొనాలి, కె సి అర్ ప్రజల్లో కి రావాలి, తెలంగాణా కు ద్రోహం చేసిన చంద్ర బాబు కు జనం లో రోజు రోజు కు ఆదరణ పెరుగుతుంది, అందుకు కారణం ఆయన రెండు నెలలుగా ప్రజల్లో తిరుగుతున్నాడు, ఇది తెలంగాణాకు ప్రమాదకరం, సమయం వస్తే జగన్ పార్టీ లోకి దూకడానికి కాంగ్రెస్ పార్టీ కి చెందినా రెడ్డి ఎం ఎల్ ఎ లు సిద్ధం గా ఉన్నారు, ఇలాంటి పరిస్థితుల్లో ఇంకా ఎవరో వచ్చి పార్టీ లో చేరడం ద్వార పార్టీ భలపడుతుంది అని ఆశించడం కన్నా ద్రోహం ఉండదు, నిన్నటి దాక తెలంగాణా కోరుకునే వారిని తిట్టి ఇక్కడి యువత ఆత్మహత్యలకు కారణమైన ఎర్రబెల్లి, జానారెడ్డి లాంటి తెలంగాణా ద్రోహులు టి అర్ ఎస్ లో చేరితే గతం అంత మాఫీ అవుతుందా..? వారిని ప్రజలు గెలిపించాల..? నేడు రాజకీయ అవసరాలకోసం టి అర్ ఎస్ పార్టీ లోకి వచ్చే స్వార్ధ నాయకులను గెలిపిస్తే వారు రేపు మోసం చెయ్యరని నమ్మకం ఏమిటి..? 
                              పరకాల ఉపఎన్నికల తర్వాత టి అర్ ఎస్ తోపాటు బి జె పీ పార్టీ ల వైకరిలో మార్పు వస్తుందని తెలంగాణా వాదులు భావించారు, కాని అలాంటిది ఏది కనిపించడం లేదు, పరకాల ఎన్నికల్లో ఒక బలమైన నాయకురాలైన కొండ సురేఖను టి అర్ ఎస్ పార్టీ ఓడించగలిగిందంటే దానికి కారణం కేవలం తెలంగాణా ఉద్యమ ఫలితమే, నేడు ఎవరో, ఎ పార్టీ వారో వచ్చి చేరి పార్టీని బల పరుస్తారని ఆశించడం దేనికి.. ఉద్యమం ఎంత బలంగా నిర్మిస్తే పార్టీ అంత బల పడుతుంది, ఉద్యమం బలంగా ఉన్నపుడు కాంగ్రెస్ పార్టీ కి చెందిన నాయకులో టి డి పీ కి చెందిన నాయకులో వలసలు రావాల్సిన అవసరం ఏముంది..? వారు నిన్నటి వరకు ఎన్నడు ఉద్యమం లో పాల్గొన లేదు, వారు నేడు ప్రజా క్షేత్రంలో శిక్షించబడతారు.. ఇంకా ఎన్నికలకు ఒక్క సంవత్సరం సమయం మాత్రమె ఉంది, ఇప్పటికైనా తెలంగాణాను కోరుకునే పార్టీ లు, జె ఎ సి కళ్ళు తెరవాలి, ఉద్యమాన్ని బలం గా నిర్మించాలి, తెలంగాణా కాంగ్రెస్, టి డి పీ నాయకులంకు ప్రతిగా అమరుల కుటుంబాల వ్యక్తులు, లాయర్లు, డాక్టర్లు, టీచర్లు, ఉద్యోగులు ఇలా జె ఎ సి లో ఎంతో మంది ఉన్నారు వారిని నిలబెట్టవచ్చు, టి అర్ ఎస్ వి, తెలంగాణా బొగ్గు గని కార్మిక సంఘం, టి ఎం యు, లాంటి తెలంగాణా సంస్థల నుండి కొత్త నాయకత్వాన్ని తయారు చేసుకోవచ్చు, ఇంతే కాని ఈ రోజు వరకు ఉద్యమానికి ద్రోహం చేసే వాళ్ళను పార్టీలో చేర్చుకొని తెలంగాణా ప్రజలపై రుద్దడం సరైనది కాదు, ఉద్యమం బలంగా ఉంటె ప్రజలు తెలంగాణా తరపున నిలబడ్డ ఎవరినైనా గెలిపిస్తారు,  కాబట్టి ఉద్యమాన్ని బలపరచడం మిద దృష్టిపెడితే బాగుంటుంది, అంతే కాదు నేడు బి జె పీ తో మైత్రి కూడా ఎంతో అవసరం, బి జేపీ జాతీయ పార్టీ అంతే కాదు రాష్ట్రంలోను పట్టన ప్రాంతాల్లో, ముఖ్యంగా హైదరాబాద్లో ఆ పార్టీ ప్రభావం చూపిస్తుంది, కావున ఆ పార్టీ తోను, సి పీ ఐ లాంటి కలిసి వచ్చే పార్టీ లను కలుపుకొని పోవడం ఉద్యమానికి ఎంతైనా అవసరం.
                                 పరిస్థితి ఇలాగె వేచి చూచే దోరణిలో కనుక కొనసాగితే, 2014 లో తెలంగాణా పార్టీ లు గనక మల్లి 2009 ల విఫలమైతే తెలంగాణా నినాదమే అధః పాతాళానికి పడిపోతుంది, టి అర్ ఎస్ పార్టీ చట్టసభల్లో లేఖపోతే తెలంగాణా కు సంభందించిన కాంగ్రెస్, టి డి పీ కి చెందినా ఎ ఒక్కరు కూడా తెలంగాణా అనే పదాన్ని కూడా ఉచ్చరించరు, కావున ఉద్యమాన్ని బలోపేతం చేద్దాం, తెలంగాణా నాయకత్వాన్ని గెలిపిచుకుందాం...
                                                
                                 

3 కామెంట్‌లు:

  1. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  2. telangana ravataniki naku telisina margalu chepthanu..

    1. KCR gr8 leader, but janallo undi seeamndra valla ethulaku pai ethu vesthu undali udyamanni sajeevam ga unchali

    2. Jac main ga jaipal reddy lanti nayakulanu target cheyali .. alanti vallu bayatiki vachi telangana meedha matladela chesthe upayogam untundhi

    3. mana vallu intinti ki caste caste ki oka JAC pettukunnaru, jac antene joint ga work chesedhi.. indirect ga maname chepthunnam memu unite ga lemu ani.. edo chirmen, presedent vasthundhani sambaraniki jac pettukunte mana telangana meedha nammakam poye rojulu vasthay

    meeremantaru..

    Jai telangaana..
    Krishna

    రిప్లయితొలగించండి