హోం

20, మే 2013, సోమవారం

విజన్ ఉన్న నేత కేసీఆర్..!



ఆంధ్రాపార్టీలు తెలంగాణకు అసలు శత్రువులే అయినా...ఢిల్లీ పార్టీలు కూడా ఆంధ్రా పెత్తందారులకు కీలుబొమ్మలే! గతంలో బీజేపీ కావచ్చు. ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ కావచ్చు. తెలంగాణతో ఆటలాడుకున్నవే! ఆ రెండు పార్టీలే కాకుండా ఉభయ కమ్యూనిస్టు పార్టీలూ ఆంధ్రా అజమాయిషీలో నడిచే ఢిల్లీ పార్టీలే! బయటిపార్టీల అవసరం ఇవాళ తెలంగాణకు లేదు. దానికో ఇంటిపార్టీ వుంది. ఆంధ్రా, ఢిల్లీ పార్టీలను కాదని తెలంగాణ తన సొంత కాళ్లపై నిలబడి తన కల నిజం చేసుకుంటానంటున్నది. ఇవాళ తెలంగాణ ఎప్పుడొస్తుందనేది సమస్య కాదు. తెలంగాణ ఇంటిపార్టీని ఎలా గెలిపించుకుంటాం? వచ్చే తెలంగాణ పునర్నిర్మాణం ఎలా జరుపుకుంటాం అనేవే కీలక ప్రశ్నలు. అందుకే ఇవాళ తెలంగాణ నాయకత్వానికి దూర దృష్టితో కూడిన దార్శనికత అవసరం. అలాంటి దార్శనికత కేసీఆర్‌లో మొదటి నుంచి వుంది.

నేను వ్యక్తిగతంగా కేసీఆర్‌ను కలిసిన సందర్భాలున్నాయి. ఆయనను కలవడానికి ఎవరు వచ్చినా వారు ఏ రంగం వారైతే ఆ రంగం గురించి చర్చించడం గమనించాను. అలాంటి దార్శనికత (vision) నేను కేసీఆర్‌లోనే చూడగలిగాను. చంద్రబాబుకు కూడా విజన్ 2020 ఉండేది కదా అని ఎవరైనా అనవచ్చు. అది ప్రపంచ బ్యాంకు చంద్రబాబుకు అప్పగించిన విజన్. ప్రజల బతుకులను తాకట్టు పెట్టే విజన్. పరాయి శక్తుల కోసం పనిచేసే నాయకుడి విజన్ వేరు. సొంత రాష్ట్రం కోసం పోరాడే నాయకుడి విజన్ వేరు. కేసీఆర్ విజన్‌పజల విజన్, స్వావలంబన విజన్. తెలంగాణ నగదు ఖజానాతో ఈదేశంలో విలీనమైంది.అలాగే ఆంధ్రా ప్రాంతంతో విలీనం జరిగిన (1956) నాడు తెలంగాణ మిగులు బడ్జెట్‌ను కలిగివుంది. దాని మీద ఖాళీ ఖజానాతో నకనకలాడుతున్న ఆంధ్రరాష్ట్ర పాలకుల కన్నుపడింది. అక్రమంగా విలీ నం జరిగిపోయింది. నిధుల మళ్లింపు మొదలైంది. ప్రభుత్వ ఆదాయం తెలంగాణ నుంచి అధికం. వ్యయం మాత్రం సీమాంవూధపాంతంలో అధికం. ఈ దోపిడీ 1956 లో మొదలై... ఇంకా సాగుతున్నది. ఈ 57 ఏళ్లలో ఈ విషయాన్ని వెలికితీసిన తెలంగాణ నాయకుడిని ఎవరినైనా చూశామా? ఇవాళ ఆర్థికవేత్తలు, ఇంజనీర్లు, ఐఏఎస్‌లను తెలంగాణ కలిగివుంది. వారి పరిజ్ఞానాన్ని, సేవల ను తెలంగాణ ప్రాంతానికి ఉపయుక్తంగా మలిచిన ఏ నాయకుడినైనా చూశామా? ఆ నాయకుణ్ణి ఇవాళ మనం కేసీఆర్‌లో చూస్తున్నాం.

2012-13 రాష్ట్ర బడ్జెట్ ప్రకారం రాష్ట్ర ఆదాయం సుమారు రూ. 62వేల కోట్లు. అందులో ఒక్క తెలంగాణ నుంచి వస్తున్న ఆదాయమే సుమారు రూ.47 వేల కోట్లు. మిగిలిన 15 వేలకోట్లు మాత్రమే సీమాంధ్ర ప్రాంతం నుంచి వస్తున్నది. కొందరు అనుకోవచ్చు హైదరాబాద్ నగరం ఆదాయం కూడా తెలంగాణ ఖాతాలోనే చూపించుకుంటున్నారని! 1956లో కూడా హైదరాబాద్ ఆదాయం తెలంగాణదే అయినప్పుడు, ఇప్పుడు మాత్రం హైదరాబాద్ ఆదాయం తెలంగాణది కాక ఎవరిదవుతుం ది? తెలంగాణ ఏర్పడ్డాక హైదరాబాద్ ఆదాయం తగ్గుతుందనడం తప్పు. తెలంగాణ అభివృద్ధిచెందే కొద్దీ పెరుగుతుందే తప్ప తగ్గదు. కొందరి వాదన ప్రకారం తగ్గినా అది ఓ నాలుగు వేలకోట్లకు మించదు. అప్పుడు కూడా తెలంగాణ ఆదాయం రూ. 40 వేల కోట్లకు పై మాటే. ఆంధ్రా ఆదాయం రూ. 20 వేల కోట్లకు మించదు. మనం ఏ కోణంలో చూసినా తెలంగాణ మిగులు బడ్జెట్ కలిగి వుంటది! మరి ఇంతకాలం ఏం జరిగింది? కేసీఆర్ మాటల్లోనే చెప్పాలంటే... ‘సొమ్మొకడిది, సోకొకడిదయంది’ రేపటి తెలంగాణకు వనరులే కాదు అపారమైన నిధులు కూడా వున్నాయి. తెలంగాణ ఆదాయానికి కేంద్ర గ్రాంట్లు, వాటాలు , లోన్లు తోడైతే .. రేపటి తెలంగాణ బడ్జెట్ రూ. 1,10, 000 కోట్లది అవుతది. ఇన్ని నిధులతో అద్భుతమైన తెలంగాణ నిర్మాణం చేసుకోవచ్చు.

అనేక నదులు కలిగివుండి కూడా తెలంగాణ భూములు అల్లాడుతున్నాయి. పచ్చని గ్రామాల పునర్నిర్మాణమే రేపటి తెలంగాణకు మొదటి ఎజెండా కావాలె. ప్రతి పల్లెకు సాగు, తాగునీరు అందాలె. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరందించడమే లక్ష్యమని కేసీఆర్ అంటున్నారు. తెలంగాణలో 119 నియోజక వర్గాలు ఉండగా, అందులో 18 నియోజక వర్గాలకు సాగునీరు ఇప్పటికే లభిస్తున్నది. అవి పోనూ అర్బన్ నియోజకవర్గాలు మరో 32 వరకు వున్నాయి. అవిపోతే మిగిలేవి 70 నియోజక వర్గా లు. ఈ 70 నియోజక వర్గాల్లోని 70 లక్షల ఎకరాలకు సాగునీరు అందివ్వాల్సివుంటుంది. నదులు, ఉపనదుల ద్వారా తెలంగాణ సుమారు వెయ్యి టీఎమ్‌సీల నీటిని వినియోగంలోకి తెచ్చుకోవచ్చు. ఈ నీటితో 70 లక్షల ఎకరాలకు సాగునీరందివ్వడమే కాదు, ప్రతిపల్లె మనిషి దూప తీర్చవచ్చు. సీమాంధ్ర ప్రభుత్వాలు తెలంగాణలో తలపెట్టిన వంకర టింకర ప్రాజెక్టులను పునఃసమీక్షించాలె. గ్రావిటీ ప్రాజెక్టులకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలె. అనివార్యమైన చోట ఎత్తిపోతల ప్రాజెక్టులనూ చేపట్టాలె. జూరాల నుంచి వరంగల్ జిల్లాలోని పాకాల దాకా గ్రావిటీ ద్వారా కృష్ణా నీటిని పైసా ఖర్చు లేకుండా అందివచ్చు. ఈ ప్రాజెక్టు కాలువ మహబూబ్‌నగర్ జిల్లా జూరాల వద్ద మొదలై నాలుగు జిల్లాల గుండా వరంగల్ జిల్లా పాకాల చెరువుకు చేరుకుంటుంది. దాని ప్రయాణం సుమారు 425 కిమీలు. ఎన్ని గ్రామాలు ఎన్ని రైతు కుటుంబాలు ఎన్ని జిల్లాలు పచ్చని పొలాలతో కళకళ లాడుతాయో వర్ణించి చెప్పడం సాధ్యమా!

తెలంగాణ ఒక అద్భుతమైన ప్రదేశం.కేసీఆర్ చెప్పినట్టు ఇక్కడ నాలుగు రకాల భూములను మనం చూడొచ్చు. ఎర్రనేలలు, నల్లరేగళ్లు, ఇసుకనేలలు, తేలికపాటి నేలలు. ప్రతి గ్రామంలో కనీసం రెండు రకాల భూములుంటాయి. ఈ మిశ్రమ నేలలే తెలంగాణకు వరమని శాస్త్రవేత్తలు చెపుతున్నారు. అలాగే ఇక్కడ సమశీతోష్ణ వాతావరణం గ్రీన్‌హౌజ్ వంటి ఆధునిక వ్యవసాయానికి అనుకూలం. ఆంధ్రా ప్రాంత వాతావరణంలో హ్యూమిడిటీ ఎక్కువ. రేపటి తెలంగాణలో గ్రీన్‌హౌజ్ కల్టివేషన్‌కు పెద్దపీట వేస్తామంటున్నారు కేసీఆర్! దీనివల్ల పది రెట్లు ఎక్కువ దిగుబడి వచ్చి తెలంగాణ రైతాంగం సుసంపన్నం కాగలుతుందంటున్నారు. ఇక్రిసాట్ లాంటి అంతర్జా తీయ సంస్థలు తెలంగాణలోనే ఏర్పాటు చేశారంటే ఇక్కడి వాతావరణం, ఇక్కడి భూములు అందుకు ఎంత ఉపయోగకరమైనవో మనకు అర్థమవుతుంది. కాబట్టి ఈ దేశానికి అవసరమైన విత్తనాలను పండించగలిగే ఒక గొప్ప ప్రదేశంగా రేపటి తెలంగాణ ఏర్పడుతుంది. తెలంగాణ ‘సీడ్ బౌల్ ఆఫ్ ఇండియా’ గా మారుతుంది. తెలంగాణకు ఉపయోగపడే గ్రీన్‌హౌజ్ కల్టివేషన్‌కు ఇతర రాష్ట్రాల్లో 80 శాతం వరకు ప్రభుత్వాలు సబ్సిడీ ఇస్తున్నాయి. మరి మనరాష్ట్రంలో అలా ఎందుకు ఇవ్వడలేదు? ఏదైనా ఆంధ్రా రైతుకు ఉపయోగపడితేనే సబ్సిడీలు ఇస్తారు! తెలంగాణ రైతుకు ఉపయోగపడే గ్రీన్‌హౌజ్ కల్టివేషన్‌కు సబ్సిడీ ఇవ్వడానికి ఆంధ్రాపాలకులకు చేతులు రావు కదా! తెలంగాణ రైతు రుణాల ను లక్ష రూపాయల వరకు మాఫీ చేస్తామని కేసీఆర్ చెప్పుతున్నారు. ఆంధ్రవూపదేశ్‌లో అప్పులపాలైన రైతు రేపటి తెలంగాణలో తన కాళ్లమీ ద తాను నిలబడలాంటే స్వయంశక్తిని కలిగించాల్సిన అవసరం ఉన్నది.

తెలంగాణలో 250 ఏళ్లకు సరిపడా బొగ్గు నిల్వలున్నాయని నిపుణులు చెప్పుతున్నారు. జల విద్యుత్తుతోపాటు, థర్మల్ పవర్ ప్రాజెక్టులను నిర్మించుకోవచ్చు. వీటి ద్వారా 10వేల మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి చేసుకోవచ్చు. ఛత్తీస్‌గఢ్, గుజరాత్ మాదిరిగా 24 గంటలు విద్యుత్తు వాడుకోవడంతోపాటు, రైతుకు నాణ్యమైన కరెంటును ఇచ్చుకోగలుగుతాం.మనరాష్ట్రంలో ఒక జిల్లాలో రెండు లోక్‌సభ స్థానాలున్నాయి. ఇతర రాష్ట్రాలలో సుమారు మూడు జిల్లాలలో రెండు లోక్‌సభ స్థానాలున్నాయి. కాబట్టి రేపటి తెలంగాణలో పాలనా సౌలభ్యం కోసం ఇప్పుడున్న పది జిల్లాలను 24 జిల్లాలు చేయడం సమంజసం. కేసీఆర్ విజన్‌లోని మరిన్ని అంశాలను టూకీగా చూద్దాం. దళితులకు మూడు ఎకరాల భూమి, ఏడాదిపాటు వ్యవసాయానికి పూర్తి సబ్సిడీ, ఆత్మగౌరవంతో బతికేందుకు రెండు పడకగదుల ఇళ్ళు, కాంట్రాక్టు ఉద్యోగులందరి క్రమబద్దీకరణ, కేంద్ర ఉద్యోగులతో సమాన జీతాలు, రాజకీయ పెత్తనం రద్దుచేసి ఆగమశాస్త్ర పండితులతో ధార్మిక పరిషత్తులను ఏర్పాటు చేసి దేవాలయాలను అప్పగించడం. వీటన్నిటికి మించి తెలంగాణలో వున్న 81లక్షల కుటుంబాల స్థితిగతులపై సమగ్ర సర్వే జరిపించి రేపటి తెలంగాణ పునర్నిర్మాణాన్ని ఆ సర్వే ఆధారంగా నూటికి నూరుపాళ్లు అమలు చేస్తామనేదే కేసీఆర్ విజన్. తెలంగాణలో బాలలకు కేజీ నుంచి పీజీ దాకా ఉచిత నిర్బంధ విద్యను అందిస్తామంటున్నారు కేసీఆర్.ఆది కుల మతాలకతీతమైన ఒక కొత్త తెలంగాణ సమాజాన్ని ఆవిష్కరిస్తుంది. తెలంగాణవాడిని ఒక గొప్ప ప్రపంచ మానవుడిగా నిలబెట్టాలనేదే నాకల అని కేసీఆర్ అంటున్నారు. ఈ విషయం చెప్పు తున్నప్పుడు ఉద్వేగభరితమైన ఆయన ముఖంలో ఒక పట్టుదలను చూశాను. అలాగే ఆయన కళ్లల్లో తేలికపాటి ఆనందబాష్పాలు కూడా చూశాను. 
-కల్లూరి శ్రీనివాస్‌
              (namaste telangana)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి