హోం

18, మే 2013, శనివారం

పడిలేచిన కెరటం నాగం..


దేశం లో వ్యూహాత్మక రాజకీయ నాయకులూ చాల కొద్ది మందే ఉన్నారు, అందులో ప్రణబ్ ముఖర్జీ, మమత బెనర్జీ, మాయావతి, శరద్ పవర్, జయ, కరుణ, కె సి అర్ లు ముఖ్యులు, ఈ లిస్టు లో ఒక కొత్త నాయకుడు చేరాడు అనిపిస్తుంది, ఆయనే నాగం జనార్ధన్ రెడ్డి. 
                           వ్యూహాత్మక నాయకులంటే ఇక వీరి పని అయిపోయింది, మల్లి జీవితంలో కోలుకోలేరు అనే స్థాయినుండి తమ వ్యూహాలతో తిరిగి పట్టును నిలుపుకునే సామర్ధ్యం ఉన్నవారు. తెలంగాణా ఉద్యమం ఉవ్వెత్తున సాగుతున్న రోజులలో ఉస్మానియా విద్యార్థులు ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో చేపట్టిన దీక్షకు మద్దతు ఇవ్వడానికి వచ్చిన నాగం జనార్ధన్ రెడ్డి పై ఉద్యమకారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు, ఆయనపై భౌతిక దాడి చేసారు, కారణం అప్పుడు తెలంగాణకు అడ్డుగా ఉన్న టి డి పీ పార్టీలో తెలంగాణా ఫోరానికి నాయకుడాయన. 
                ఈ సంఘటన జరిగిన తర్వాత ఇక నాగం పని ఐపోయింది అనుకున్నారు అంత కాని ఆయన ఇక్కడే చాల వ్యూహాత్మకం గా అడుగులు వేసారు, తనపై దాడి చేసిన వారిపై ఎటువంటి కేసులు పెట్టబోనని ప్రకటించారు, పోగొట్టుకున్న చోటే రాబట్టు కోవాలి అన్నట్లుగా ఆయన కోల్పోయిన ప్రజల విశ్వాసాన్ని తిరిగి పొందడానికి ప్రయత్నించారు, టి డి పీ పార్టీకి ఆ పార్టీ ఇచ్చిన పదవులకు రాజీనామా చేసారు, ఎం ఎల్ ఎ పదవికి కూడా రాజీనామా చేసి రాజీనామా ఆమోదానికి పట్టుబట్టి తనది మిగతావారిలా ఉత్తుత్తి రాజీనామా కాదని నిరుపించుకోవడానికి ప్రయత్నించారు , నిజానికి ఆయన టి డి పీ ని వీడే నాటికి ఆయనకున్న బెస్ట్ ఆప్షన్ టి అర్ ఎస్ కాని ఆయన అందులో చేరలేదు, స్వాతంత్ర్య అభ్యర్థిగా బరిలోకి దిగారు, జె ఎ సి తో పాటు టి అర్ ఎస్, బి జె పీ ఆయనకు మద్దతు ఇచ్చాయి అన్నివర్గాల ప్రజల ఆదరనతో భారి మెజారిటీ తో ఆయన విజయం సాధించారు, ఏ  ప్రజల చేతుల్లో తన్నులు తిన్నాడో అదే ప్రజల చేత జె జె లు కొట్టించుకున్నాడు, ఆ తర్వాత నగర సమితిని ఏర్పాటు చేసి తెలంగాణా వ్యాప్తం గా పర్యటించారు, ఒకవేళ ఆయన టి అర్ ఎస్ లోకి వెళ్లి ఉంటె కేవలం తన నియోజక వర్గానికే పరిమితం అయ్యే వారు, అంతే కాకుండా ఒక సాదారణ ఎం ఎల్ ఎ గానే ఉండిపోయే వారు, నగారా సమితి ద్వార ఆయనకు తెలంగాణా వ్యాప్తంగా గుర్తింపు వచ్చింది, 
                     ప్రస్తుతం ఆయన బి జె పీ లోకి వెళ్లేందుకు సిద్దమయ్యారు, బి జె పీ తెలంగాణా వాణి వినిపిస్తుండటము, జాతీయ పార్టీ కావడంతో భవిష్యత్తులో ఎదుగుదల కూడా బాగుంటుందని ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు, భవిష్యత్తులో భా జా పా లో క్రియాశీలక నేతగా ఎదిగే అవకాశాలు ఆయనకు పుష్కలంగా ఉన్నాయి, అందుకు తగ్గ సామర్ధ్యమూ ఉంది.   

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి