హోం

9, సెప్టెంబర్ 2013, సోమవారం

నిజం నిప్పులాంటిది


హైద్రాబాద్ రెవిన్యూ – నిజా నిజాలు: 

‘ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజన ఖాయం, వెనక్కి వెళ్ళేది లేదు’ అని కాంగ్రెస్ అధినాయకులు స్పష్టం చేస్తున్నారు. ఈ సందర్భంగా సీమాంధ్ర నాయకులు హైద్రాబాద్ సెంటిమెంటును తమ ప్రాంత ప్రజల్లో విస్తృతంగా ప్రవేశపెట్టారు. దశాబ్దాల తరబడి సీమాంధ్రులు రాజధానిని అభివృద్ధి చేశారని, ఇప్పుడు వెళ్లమంటే ఎలా వెళ్తాం అని పెట్టుబడిదారులు, భూస్వాములు వాదిస్తున్నారు. వారి వాదనలను ప్రజలు కూడా మోస్తున్న పరిస్ధితి కనిపిస్తోంది.
‘హైద్రాబాద్ రెవిన్యూ ఆదాయం ఎలా పోగొట్టుకుంటాం?’ అన్న సూపర్ ధనికుల ప్రశ్నకు పై రూపమే ‘హైద్రాబాద్ సెంటిమెంటు.’ రాష్ట్ర ఆదాయంలో హైద్రాబాద్ నుండి వచ్చే ఆదాయమే 50 శాతం అని కొందరు చెబుతుంటే మరి కొందరు 70 శాతం అని చెబుతున్నారు. ఇంత ఆదాయాన్ని కోల్పోతే సీమాంధ్ర ఉద్యోగులకు వేతనాలు చెల్లించడం కూడా కష్టం అవుతుందని అనేకమంది బలంగా వాదిస్తున్నారు. దానితో ఉద్యోగులు భయాందోళనలతో సమైక్యాంధ్ర ఉద్యమానికి మద్దతు ఇస్తూ అందులో పాల్గొంటున్నారు.
రాష్ట్ర విభజన ద్వారా సీమాంధ్ర ఉద్యోగులకు జీతాలు లేకుండా చేయడానికి కేంద్ర ప్రభుత్వం పూనుకుంటుందా? ఇంత పిచ్చి పనికి కేంద్ర ప్రభుత్వం పూనుకుంటుందా? ఇందులో వాస్తవాలు విచారించడం అవసరం. రాష్ట్ర విభజన సందర్భంగా అయినా రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయ వ్యయాల పైన చర్చ జరగడం ఒక ఆహ్వానించదగిన పరిణామం కాగా, ఆ చర్చ ఆరోగ్యకరమైన రీతిలో కాకుండా అపోహలతో, విద్వేషపూర్వక వాతావరణంలో జరగడం దురదృష్టకరం!
కొన్ని అంశాలు చూద్దాం.
1..రాష్ట్రాల ఆదాయం ప్రధానంగా పన్నుల ఆదాయం, పన్నేతర ఆదాయం, కేంద్రం పన్నుల ఆదాయంలో వాటా, గ్రాంట్ ఇన్-ఎయిడ్ ల మొత్తం.
2. విభజన ప్రభావం కేంద్ర పన్నుల వాటా, పన్నేతర ఆదాయం (ప్రభుత్వ భూముల అమ్మకంపై వచ్చే ఆదాయం), గ్రాంట్-ఇన్-ఎయిడ్ లపైన ఉండదు. పైగా సీమాంధ్రలో కొత్త రాజధాని వల్ల రియల్ ఎస్టేట్ ఆదాయం పెరుగుతుంది కనుక పన్నేతర ఆదాయం పెరుగుతుంది. హైద్రాబాద్ రియల్ ఎస్టేట్ పడిపోతుంది గనక ఆ ఎరకు తెలంగాణ పన్నేతర ఆదాయం తగ్గుతుంది.
3. విభజన ప్రభావం ఉండేది రాష్ట్ర పన్నుల ఆదాయం పైనే.
4. అమ్మకపు పన్ను, ఎక్సైజ్ పన్ను, స్టాంపులు & రిజిస్ట్రేషన్, వాహన పన్ను... ఇవే రాష్ట్ర పన్నుల ఆదాయంలో ప్రధానం (98 శాతం). ఇవి జిల్లాల్లోనే వసూలవుతాయి గనక విభజన తర్వాత ఎవరివి వారికే చెందుతాయి.
5. 2003-06 మధ్య కాలంలో గ్రేటర్ హైద్రాబాద్ సగటు సాంవత్సరిక పన్నుల ఆదాయం 7,704 కోట్లు అని, రాష్ట్ర పన్నుల ఆదాయంలో ఇది 37 శాతం అని అప్పటి ఆర్ధిక మంత్రి రోశయ్య గారు శాసనసభలో ఒక సభ్యుడి ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. (ఇండియన్ ఎక్స్ ప్రెస్, ఆగస్టు 28, 2013).
6. 2012-13 లో రాష్ట్ర పన్నుల ఆదాయం 66,021 కోట్లు.
7. రోశయ్య గారు చెప్పినట్లు ఇందులో 37 శాతం అంటే 24,428 కోట్లు.
8. గ్రేటర్ హైద్రాబాద్ అంటే హైద్రాబాద్ నగరం మాత్రమే కాదు. ఇందులో 54 లక్షల జనాభా నివసించే హైద్రాబాద్ తో పాటు సంగారెడ్డి, భువనగిరి మునిసిపాలిటీలు, 849 అర్బన్ గ్రామాలు కూడా ఉన్నాయి. వీటి జనాభా 19 లక్షలు. ఇవి రంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాల పరిధిలోనివి.
9. ఈ పన్నుల ఆదాయం కూడా మొత్తం హైద్రాబాద్ కి చెందినవి కాదు. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో అమ్మకాలు జరిపే కంపెనీలు హైద్రాబాద్ లో రిజిస్టర్ అయి ఉన్నాయి. అంటే రాష్ట్ర వ్యాపితంగా అమ్మకాలు జరిపినా, పన్ను (APGST) మాత్రం హైద్రాబాద్ డివిజన్ లో కడతారు.
10. రాష్ట్రం విడిపోయాక ఆయా కంపెనీలు హైద్రాబాద్ లోనే కొనసాగితే అవి సీమాంధ్రలో జరిపే అమ్మకాలు అంతర్రాష్ట్ర అమ్మకాలు అవుతాయి. కాబట్టి వాటిపైన కేంద్ర పన్నులు ఉంటాయి తప్ప తెలంగాణ రాష్ట్ర పన్నులు కాదు.
11. కంపెనీలు తమ రిజిష్ట్రేషన్ ను సీమాంధ్ర రాజధానికి మారిస్తే అవి తెలంగాణలో జరిపే అమ్మకాలపై కూడా కేంద్ర పన్నులు వర్తిస్తాయి తప్ప సీమాంధ్ర రాష్ట్ర పన్నులు కాదు.
12. కంపెనీలు తమకు ఏ పన్నులు తక్కువో బేరీజు వేసుకుంటాయి. కేంద్ర పన్నులా, తెలంగాణ పన్నులా లేక సీమాంధ్ర పన్నులా... ఇందులో ఏది తక్కువో తేల్చుకుని ఆ మేరకు రిజిస్ట్రేషన్ మార్చుకుంటాయి. కొత్తగా వచ్చే సీమాంధ్ర రాష్ట్రం తగిన సౌలభ్యం కల్పిస్తే ప్రాంతంతో సంబంధం లేకుండా కంపెనీలు తమ రిజిస్టర్డ్ కార్యాలయాల్ని మార్చుకుంటాయి.
13. కాబట్టి కొత్తగా వచ్చే ఇరు రాష్ట్రాలు కేంద్రంతో చర్చలు జరిపి తగిన రాయితీలు తెచ్చుకోడానికి పోరాడాలి తప్ప తమలో తాము తగువు పడడం సరికాదు. రాష్ట్ర విభజన వలన అదనపు రెవిన్యూ ఆదాయం ద్వారా లబ్ది పొందేదీ కేంద్రమే తప్ప తెలంగాణ కాదని ఇక్కడ అర్ధం అవుతోంది.
14. పైగా సీమాంధ్ర కొత్త రాజధాని ఏర్పడే క్రమంలో అక్కడ ఉత్పాదక కార్యకలాపాలు వేగం అవుతాయి. అంటే జి.డి.పి వృద్ధి రేటు ఎక్కువగా ఉంటుంది. ఆ విధంగా కొత్త రాష్ట్రానికి పన్నుల ఆదాయం కూడా వేగంగా పెరుగుతుంది. ప్రారంభంలో కొన్నేళ్లపాటు సీమాంధ్ర రాజధానిలో రియల్ ఎస్టేట్ మార్కెట్ అభివృద్ధి అయితే, హైద్రాబాద్ లో పడిపోతుంది. అనంతరం స్ధిరీకరణ చెందుతుంది.
15. సీమాంధ్రకు 973 కి.మీ పొడవైన సముద్ర తీరం ఉంది. దేశంలో గుజరాత్ తర్వాత సీమాంధ్ర కోస్తా తీరమే పొడవైనది. దీన్ని అభివృద్ధి చేసుకుంటే బోలెడంత రెవిన్యూ. రామాయపట్నం రేవుకి ఇప్పటికే కేంద్రం అనుమతి ఇచ్చింది. దీనికి అనుబంధంగా అనేక వ్యాపారాలు జరుగుతాయి. తద్వారా రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది.
16. హైద్రాబాద్ ఐ.టి ఉద్యోగాలు మిస్ అవుతాయనీ, ఆ ఉద్యోగాల ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కూడా కోల్పోతామని కొందరు చెబుతున్నారు. ఆ లెక్కన బెంగుళూరులోనూ తెలుగువారు అత్యున్నత ఐ.టి ఉద్యోగాలు చేస్తున్నారు. ఆ ఆదాయం మనకే రావాలని అడగొద్దా? మద్రాసు, ఢిల్లీ నగరాల్లోనూ తెలుగువారు ఉద్యోగాలు చేస్తున్నారు. అమెరికా, ఐరోపాల్లోనూ చేస్తున్నారు. అక్కడి ఆదాయాల్లో వాటా వద్దా? ఎద్దు ఈనిందంటే దూడని కట్టెయ్యమన్నట్లు ఈ వాదన ఉంటుంది. సీమాంధ్ర రాష్ట్రంలో ఆదాయాలు పెంచుకునే మార్గం చూడడం మాని వాళ్ళ ఆదాయం మనకి కావాలనడం అన్యాయం కాదా?
17. విభజన వల్ల ఒక తరం నష్టపోతుందని ఎ.పి.ఎన్.జి.ఓ నేత చెబుతున్నారు. అంటే ఆ తర్వాత తరాలకు నష్టం ఉండదు అన్న అంగీకారం ఇందులో ఉంది. కానీ 60 యేళ్లుగా (అంటే మూడు తరాలా?) నీళ్ళు, ఉద్యోగాలు లేక తెలంగాణ జనం ఎదుర్కొన్న నష్టం మాటేమిటి?

                                            
                                                     -విజయశేఖర్ గారు
                                                                                    ' జాతీయ అంతర్జాతీయ పరిస్థితులు ' బ్లాగ్ నుంచి 

8, సెప్టెంబర్ 2013, ఆదివారం

ఆట కాంగ్రెస్ ది - మరి వేట(ఓట్లు) ?


తెలంగాణా రాష్ట్రము ఏర్పదనుందా ..? కాంగ్రెస్ ఇస్తుందా..? బిజేపీ ఇస్తుందా ..? నిజంగా కాంగ్రెస్ కు  తెలంగాణా ఇచ్చే ఉద్దేశ్యమే ఉంటె సీమంద్రలో ఈ లోల్లంత ఎందుకు..? సోనియా చెప్పందే ఏ పని చెయ్యని నల్లారి  వారికి సి డబ్ల్యు సి నిర్ణయాన్ని వ్యతిరేకించే ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది ..? సీమంద్రలో కిరణ్ ను స్ట్రాంగ్ చెయ్యడానికి కాంగ్రెస్ ఆడుతున్న నాటకమే సీమంద్రలో జరుగుతున్న ఆందోళనలు... ?
* 12 ఏళ్ళుగా గుర్తురాని ప్రజల ఆకాంక్ష కాంగ్రెస్ కు సరిగా ఎలక్షన్లకు ఏడాది ముందే ఎందుకు గుర్తుకు వచ్చింది..?
* అది మోడీ సభకు 10 రోజుల ముందే తీర్మానం ఆగ మేఘాల మీద ఎందుకు చెయ్యవలసి వచ్చింది..? 

జూలై 30 తెలంగాణా తీర్మానం చెయ్యడం ద్వార కాంగ్రెస్ పొందిన లాభాలు:- 

* వై కాపా తెలంగాణా లో కాలి అయ్యింది. 
* నరేన్ద్ర మోడికి నవభారత యువభేరి లో చెప్పడానికి ఏమి లేకుండా పోయింది. బి జీ పీ ని ఎదగకుండా దెబ్బకొట్ట గలిగారు. 
*  అంతవరకు కె సి అర్ దగ్గరకు కాంగ్రెస్ వచ్చే పరిస్థితి కాని ఒక్కసారి ప్రకటన రాగానే కాంగ్రెస్ దగ్గరికే కె సి అర్ వెళ్ళాల్సిన అనివార్య పరిస్థితి వచ్చింది. 
* సమైక్యంద్ర ఉద్యమాన్నిలెవదీయడం తో చంద్ర బాబు ఇరుకునపడ్డాడు, రెండు రాష్ట్రాలుంటే తప్పేంటి అన్న చంద్ర బాబు తర్వాత గొంతు సవరించుకొని కాంగ్రెస్ను దుమ్మత్తి పొయ్యడం ప్రారంభించారు. ఎన్ డి ఎ హయాంలో రాష్ట్ర విభజనను అడ్డుకున్నది తానే అంటూ తన అసలు స్వారూపం బయటపెట్టి, సీమంధ్రుల మనసు గెలుచుకోవాలని తెగ తాపత్రయ పడుతున్నాడు. కాంగ్రెస్ ఆటలో బాబు పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా తయారయ్యింది. 
*  హైదరాబాద్ ను UT చేస్తామనే ప్రకటనలతో MIM బయపెట్టి తనదారిలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తుంది. 
* సీమంద్రలో బిజేపీని శాశ్వతంగా రాకుండా చెయ్యాలనే వ్యూహంలో భాగంగా సమైక్యంద్ర ఉద్యమాన్ని పోలీస్లు, మీడియా సహాయంతో నడిపిస్తోంది. 
* బి జె పీ సీమంద్రులకు అన్యాయం జరగా కుండా రాష్ట్ర విభజన జరగాలి అంటే అలంటి ప్రకటనలను చూపించి తెలంగాణా ప్రాంతం లో ఆ పార్టీ పై అనుమానాలు కలిగేలా చేస్తోంది. 
* వై కా పా నమ్ముకున్న రాజశేకర్ రెడ్డి సానుభూతి కాస్త సమైక్యంద్ర ఉద్యమం తో కరిగిపోయింది . ఇప్పుడు వై కా పా పరిస్థితి కాంగ్రెస్ తో కలిసి సాగడం మినహా మరో ప్రత్యామ్నాయం లేదు. 
ఇలా కాంగ్రెస్ ఆడుతున్న ఆటా నాదే.. వేట నాదే అంటూ ఆడుతున్న ఈ ఆటలో చివరికి వేట(ఓట్లు) ఎవరికీ దక్కుతుందో..? 

2, సెప్టెంబర్ 2013, సోమవారం

హైదరాబాద్ నగరాన్ని ఎవరు అభివృద్ధి చేశారు?


హైదరాబాద్ నగరాన్ని తెలంగాణలో ముచ్చటగా ‘పట్నం’ అంటారు. సుమారు 400 యేళ్ల నుండి తెలంగాణ ప్రాంతంలో ఉన్న ఏకైక పెద్ద ‘పట్టణం’ హైదరాబాద్. కుతుబ్‌షాహీల రాజ్యానికి తొలి రాజధాని గోలకొండ నగరం. ఈ గోలకొండ కోట ఒక గుట్టపై కాకతీయుల కాలంలో క్రీ.శ.1143లో నిర్మితమైంది. ఓరుగల్లును పాలించిన ప్రభువు కృష్ణదేవ్ దీనిని క్రీ.శ. 1363లో బహమనీ సుల్తాన్ మొదటి మహ్మద్ షాకు అప్పగించాడు. కాలక్షికమంలో అప్పటి బహమనీ సుల్తాన్ మహమూద్ క్రీ.శ.1496లో సుల్తాన్ కులీ కుతుబుల్ ముల్క్‌ను గోలకొండ తరఫ్‌దారుగా నియమించారు.
బహమనీ రాజ్యం పతనమవుతున్న కాలంలో సుల్తాన్ కులీకుతుబ్ షా (1518-1543) క్రీ.శ.1518లో స్వతంత్ర రాజై, గోలకొండను రాజధానిగా చేసుకొని, ఆ మేరకు పట్టాభిషిక్తుడైనాడు. తర్వాత ఇబ్రహీం కుతుబ్ షా నకీ.శ. 1550-1580) కాలం నాటికి గోలకొండ నగర జనాభా పెరిగిపోయింది. నీటి వసతులు సరిగా లేకుండా అంటువ్యాధులు ప్రబలినాయి. పట్టణాన్ని విస్తక్షుత పరచడం కోసం అతడు మూసీనదిపై పురానాపూల్ నిర్మించాడు.

అలా కొత్త పట్టణ నిర్మాణానికి పునాదులు వేశాడు. తర్వాత ఇబ్రహీం కుతుబ్ షా మరణానంతరం అతని కుమారుడు కులీ కుతుబ్ షా నూతన పట్టణ నిర్మాణం కోసం ఒక బృహత్ ప్రణాళికను సిద్ధం చేయించి, ఆ మేరకు మూసీనది ఒడ్డున కొత్త పట్టణాన్ని నిర్మించాడు. ఆ నూతన నగరమే ‘భాగ్యనగర్’గా, ‘హైదరాబాద్’గా పేర్గాంచింది.
మూసీనది ఒడ్డున వెలిసిన ఈ సుందర నగరాన్ని కులీ కుతుబ్ షా తన ప్రియురాలు భాగ్‌మతి (భాగ్యమతి) పేర ‘భాగ్‌నగర’మని, ‘భాగ్యనగరమని’ పిలిచాడు. హైదర్‌మహల్ అనే గౌరవనామంతో భాగ్‌మతి కులీ కుతుబ్ షా జనానాలో చేరిన తర్వాత భాగ్యనగరం హైదరాబాద్ అయ్యింది.

చార్మినార్ నిర్మాణం 
ప్రపంచ ప్రసిద్ధ సుందర నిర్మాణాలలో హైదరాబాద్ చార్మినార్ ఒకటి. నాలుగు గోపురాలతో కూడిన అందమైన చార్మినార్ క్రీ.శ.1592లో నిర్మితమైంది. చార్మినార్‌కు నాలుగు వైపులా రోడ్లు నిర్మించారు. ఈ రహదారులకు ఇరువైపుల 14,000 దుకాణాలు, మదరసాలు, మసీదులు, కారవాన్ సరాయిలు నిర్మితమైనాయి. నూతన నగరానికి మరింత తలమానికంగా ఉండేలా నడిబొడ్డున చార్మినార్ నిర్మించారు. అప్పట్లో హైదరాబాద్‌లో ప్లేగు (గత్తర) వ్యాధి వచ్చిందని, దాన్ని అరికట్టమని ప్రభువు అల్లాకు మొక్కుకోగా అది తగ్గగానే ఆ జ్ఞాపకార్థకంగా అద్భుత కట్టడం చార్మినార్ నిర్మించారని ప్రతీతి.

చార్‌కమాన్ నిర్మాణం 
చార్మినార్‌కు ఉత్తరాన 250 అడుగుల దూరంలో నాలుగు అద్భుతమైన ఎత్తయిన కమాన్‌లు క్రీ.శ.1594లో నిర్మితమైనాయి. దీనినే ‘చార్‌కమాన్’ ప్రాంతమంటారు. మహ్మద్ కులీ కుతుబ్ షా చార్మినార్, చార్‌కమాన్ కట్టడాలనే కాకుండా దారుష్‌షిఫా అనే రెండంతస్తుల జనరల్ ఆసుపవూతిని కట్టించారు. ఇందులో యునాని వైద్య కళాశాలను నిర్వహించేవారు. అనుభవం గల హకీమ్‌లను (డాక్టర్‌లను) గ్రీసు, ఇటలీ, పర్షియన్, గల్ఫ్ దేశాల నుండి పిలిపించి రోగులకు వైద్యం చేయించాడు.
1596లో బాదుషాహి అషూర్ ఖానా, 1597లో చార్మినార్ సమీపంలో జమామసీదు నిర్మితమైనాయి.

తర్వాత పాలనకు వచ్చిన మహ్మద్ కుతుబ్ షా నకీ.శ.1612-1626) మక్కామసీదు నమునాను సిద్ధపరిచి క్రీ.శ.1617లో చార్మినార్‌కు సమీపంలోనే దక్షిణ దిశలో తన స్వహస్తాలతో పునాది రాయి వేసి నిర్మాణం ప్రారంభించాడు. ఇతడు ఇస్లాం పంట్ల అమిత విశ్వాసం గలవాడు. రోజుకు ఐదుసార్లు తన 12వ ఏట నుండి తప్పకుండా నమాజు చేసిన సుల్తాన్ తర్వాత వచ్చిన అబ్దుల్లా కుతుబ్ షా, అబుల్ హాసన్ తానీషా సుల్తాన్‌ల కాలంలో కూడా మక్కా మసీదు నిర్మాణం కొనసాగింది. చివరకు 77 సంవత్సరాల తరువాత ఔరంగాజేబు హయాంలో మక్కా మసీదు నిర్మాణం పూర్తయింది.

భారతదేశంలోని పెద్ద మసీదులలో ఇదొకటి. ఇందులో పదివేల మంది ఒకేసారి ప్రార్థన చేయవచ్చు. మేస్త్రీ రంగయ్య తాపీపని సారధ్యంలో పైజుల్లా బేగ్ ఇంజనీర్ ఆధ్వర్యంలో దీని నిర్మాణం మొదలైంది. మహ్మద్ కుతుబ్ షా మక్కా నుండి తెచ్చిన మట్టితో చేసిన కొన్ని ఇటుకలను మధ్యలోని కమాన్ పై కట్టడంలో నిలిపి నిర్మించారు. ఈ కారణంగానే దీనికి ‘మక్కామసీదు’ అన్న పేరు స్థిరపడింది.

మాసబ్‌ట్యాంక్ నిర్మాణం
మహ్మద్ కుతుబ్ షా పట్టపు రాణి హయత్ బక్షీ బేగమ్. ఆమె ఐదవ మహ్మద్ కులీ కుతుబ్‌షా తనయగా, ఆరవ సుల్తాన్ మహ్మద్ కుతుబ్ షా భార్యగా, ఏడవ సుల్తాన్ అబ్దుల్లా కుతుబ్ షా తల్లిగా ముగ్గురు సుల్తాన్‌ల కాలంలోని రాజకీయాలలో ప్రధాన పాత్ర వహించింది. ఆమె పేరున హైదరాబాద్‌కు తూర్పున 16 కి.మీ. దూరంలో హయత్‌నగర్ నిర్మించారు.

ఆమె తన 76వ ఏట మరణించింది. ఆమెను గౌరవంగా ‘ముసాహెబ్’ అని పిలిచేవారు. ఆమె పేరిట నిర్మించిన ‘మా సాహెబ్’ చెరువే ‘మాసాబ్‌ట్యాంక్’గా పిలువబడుతోంది.
తర్వాత గోలకొండ రాజ్యానికి అబ్దుల్లా కుతుబ్ షా నకీ.శ.1626-1672) సుల్తానయ్యాడు. మహమ్మద్ కుతుబ్ షా పుత్రిక, అబ్దుల్లా కుతుబ్ షా సోదరి ఖైరాతున్నిస్సా బేగం ఆమె గురువు గౌరవార్ధమై కమాన్‌ల మసీదు కట్టించింది. ఆ మసీదు చుట్టు పెరిగిన ప్రాంతమే నేడు ఖైరతాబాద్‌గా పిలువబడుతోంది.
కుతుబ్ షాహీ సుల్తాన్‌ల, అసఫ్ జాహీ నవాబుల కాలంలో నౌబత్ పహాడ్‌పై నగారాలు మోగించి రాచఫర్మానాలు ప్రజలకు చదివి వినిపించే వారు. ‘నౌబత్’ అంటే ‘డ్రమ్’, ‘డోలు’ లేదా ‘నగారా’. పహాడ్ అంటే గుట్ట. నగారాలు మోగించి ఫర్మానాలు చదివి వినిపించే గుట్ట కనుక దీనికి ‘నౌబత్ పహాడ్’ అని పేరు వచ్చింది. ఈ నౌబత్ పహాడ్‌కు దక్షిణంగా ఫతేమైదాన్ ఉంది. ఇప్పుడీ మైదానంలోనే లాల్‌బహదూర్ స్టేడియం నిర్మితమైంది.

అబ్దుల్లా కుతుబ్ షా అనంతరం అతని అల్లుడు అబుల్ హాసన్ కుతుబ్ షా (తానీషా క్రీ.శ.1672-1687) సుల్తాన్ అయ్యాడు. ఇతడు పరిపాలనాదక్షుడు. ఇతని పాలనలోనే హిందువైన మాదన్న గోలకొండ రాజ్యానికి దివాన్‌గా పధానమంత్రి) పనిచేశాడు. మాదన్న సోదరుడు అక్కన్న సేనా నాయకుడిగా నియమింపబడ్డాడు. తానీషా కాలంలోనే అక్కన్న, మాదన్నల మేనల్లుడు కంచర్ల గోపన్న భద్రాచల ప్రాంతపు తహసీల్‌దారుగా ఉండి, అక్కడ వసూలైన రెవెన్యూ ద్వారా భద్రాచలంలో రామాలయం నిర్మించి, గోలకొండలో జైలు పాలై, కీర్తనలు రాశాడు.

క్రీ.శ.1687 జనవరి 28న మొగల్ చక్రవర్తి ఔరంగాజేబ్ స్వయంగా తన సైన్యంతో గోలకొండను ముట్టడించాడు. అబుల్ హాసన్ తానీషా బందీగా చిక్కాడు. కాలక్షికమంలో క్రీ.శ.1700లో తానీషా మరణించాడు. అలా కుతుబ్‌షాహీల వంశపాలన అంతమైంది. గోలకొండలో 170 సంవత్సరాలకు పైగా క్రీ.శ.1518 నుంచి1687 వరకు వైభవంగా పాలించిన గోలకొండ రాజ్యపు కుతుబ్ షాహీల పాలన ముగిసిన తర్వాత ఈ ప్రాంతం మొగలుల స్వాధీనంలోకి వచ్చింది. మొగలుల పాలన కింద గోలకొండ ప్రాంతం క్రీ.శ.1687-1724 వరకు ఉంది.

అసఫ్ జాహీల పాలన 
ఔరంగాజేబ్ మరణం తర్వాతి మొగల్ రాజు మహమ్మద్ షా ఆస్థానంలోని ‘నిజాముల్ ముల్క్’ (మీర్‌ఖవూమోద్దీన్) ఫక్రీర్ ఖేడ్ యుద్దంలో మొగలుల పాలనలో ఉన్న గోలకొండ ప్రాంతమైన దక్కన్‌కు సుబేదారుగా ఉన్న ముబారిజ్ ఖాన్‌ను ఓడించాడు. స్వతంత్ర రాజుగా గోలకొండలో అసఫ్‌జాహీల పాలనను క్రీ.శ. 1724లో ప్రారంభించాడు. ‘నిజాముల్ ముల్క్’గాని ‘ఆసఫ్‌జాహీ’గాని మొగలు ప్రభువులు మీర్‌ఖవూమోద్దీన్‌కు ఇచ్చిన బిరుదులు. అలా దక్కన్ ప్రాంతానికి నిజాముల్ ముల్క్ మొదటి అసఫ్‌జాహీ ప్రభువు. అతడు 1748 వరకు ఈ ప్రాంతాన్ని పరిపాలించాడు.

అసఫ్ జాహీ ప్రభువులు హైదరాబాద్ రాష్ట్రం దక్కన్ ప్రాంతాన్ని సుమారు 225 సంవత్సరాలు పరిపాలించారు. మొదటి అసఫ్‌జా నిజాముల్ ముల్క్ మరణానంతరం అతని వారసులు నాసర్‌జంగ్, సలాబత్‌జంగ్ క్రీ.శ.1748-1762 వరకు పాలించారు. తర్వాత రెండవ అసఫ్‌జా నిజాం అలీఖాన్ క్రీ.శ. 1762-1803 వరకు పాలించాడు. మూడవ అసఫ్‌జాహీ ప్రభువు సికిందర్‌జా నకీ.శ. 1803-1829) పేరు మీదే హైదరాబాద్‌తో పాటు అభివృద్ధి చెందిన ప్రాంతానికి ‘సికింవూదాబాద్’ అనే పేరు వచ్చింది.
నాల్గవ నిజాం ప్రభువు నసీరుద్దీలా అసఫ్‌జా నకీ.శ.1829-1857) కాలంలో క్రీ.శ.1853-1854 మధ్య ‘దారుల్ ఉల్మ్’ పాఠశాలను స్థాపించారు. క్రీ.శ.1853లోని అప్పటి దివాన్ సాలార్‌జంగ్ 1853లో కేంద్ర ట్రెజరరీ, 1856లో స్టాంపు కాగితాల కార్యాలయాలను ఏర్పాటు చేశారు. అయిదవ నిజాం ప్రభువు అఫ్జల్‌ద్దౌల కాలంలో అఫ్జల్‌గంజ్ మసీదు, అఫ్జల్‌గంజ్ బజారు, అఫ్జల్‌గంజ్ బ్రిడ్జిల నిర్మాణాలు జరిగాయి.

ఆరవ నిజాం ప్రభువు మీర్ మహబూబ్ అలీఖాన్ నవాబుకు గుర్రాలపై మక్కువ ఎక్కువ. అతడు గుర్రపు స్వారీలో దిట్ట. 1879లో మలక్‌పేట్‌లోని అశ్వశాల, గుర్రాల రేస్ కోర్స్‌ను ఏర్పాటు చేశాడు. 1869లో నిజాం స్టేట్ రైల్వేశాఖ స్థాపితమైంది. ఇదే సమయంలో విద్యావ్యాప్తికి కూడా కృషి జరిగింది. 1870లో ఒక ఇంజనీరింగ్ కళాశాల స్థాపితమైంది. 1870లో సిటీ హైస్కూల్, 1872లో ఛాదర్‌ఘాట్ హైస్కూల్, 1878లో మదరసె ఆలియా, 1884లో నిజాం కళాశాల, 1910లో మహబూబియా బాలికల పాఠశాల స్థాపించబడ్డాయి. 1880లో తపాల శాఖ ఏర్పాటు చేయబడింది.

1892లో అసఫియా లైబ్రరీ ఏర్పాటైంది. 1893లో దివాన్‌వ వికారుల్ ఉమ్రా నిర్మించిన అందమైన ఫలక్‌నుమా ప్యాలెస్‌ను ఆరవ నిజాం 1897లో అతని నుండి కొన్నాడు. సాలార్‌జంగ్ సలహాపై ఐదవ నిజాం 1864లోనే పబ్లిక్ గార్డెన్ స్థలాన్ని సేకరించి, అభివృద్ధి పరిచారు. దానిలో మీర్ మహబూబ్ అలీఖాన్ ప్రభువు 1905లో తన 40వ జన్మదిన సందర్భంగా టౌన్‌హాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అలా ఆ అందమైన భవనం 1913లో పూర్తయింది. అదే నేటి అసెంబ్లీ భవనం.

1910లోనే హైద్రాబాద్ విద్యుత్ శక్తి శాఖ ఏర్పాటు చేయబడింది. జనరేటర్ల ద్వారా విద్యుత్ దీపాలు జంట నగరాలలో వెలిగింప బడినాయి. ఆరవ నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్ మరణించగానే అతని కుమారుడు మీర్ ఉస్మాన్‌ఖాన్ క్రీ.శ.1911 ఆగస్ట్ 29న ఏడవ నిజాంగా ప్రకటించబడ్డాడు. అతని కాలంలోనే ప్రధానమంవూతిగా పనిచేసిన మూడవ సాలార్‌జంగ్ 1914లో రాజీనామా చేసి నాలుగు దశాబ్దాలు ప్రపంచంలోని విలువైన, అందమైన, అద్భుతమైన వస్తువులను సేకరించి, విశ్వవిఖ్యాతమైన ‘సాలార్‌జంగ్ మ్యూజియం’ను తన నివాసమైన దివాన్ దేవిడీలో ఏర్పాటు చేశాడు.

ఏడవ నిజాం కాలంలోనే హైదరాబాద్ రాజ్యం సర్వతోముఖాభివృద్ధి సాధించింది. ఈ నిజాం కాలంలోనే అనేక సంస్కరణలు ప్రవేశ పెట్టబడినాయి. 1914లో పురావాస్తు శాఖ ఏర్పాటయ్యింది. 1919లో నూతన రాజ్యంగంతో ఒక కార్యనిర్వాహక మండలి ఏర్పడింది. 1922లో న్యాయశాఖ ఇతర శాఖల నుండి వేరు చేయబడింది. 1927లో ఉస్మానియా మెడికల్ కాలేజ్, 1924లో ఉస్మానియా ఇంజనీరింగ్ కళాశాలలు ఏర్పాటైనాయి. 1930లో రాష్ట్ర పురావస్తు ప్రదర్శన శాల ఏర్పాటైంది. 1932లో విమాన సర్వీసుల బోర్డు స్థాపితమైన తర్వాత 1935లోనే విమానాక్షిశయం హైదారాబాద్‌లో ఏర్పడింది.

1933లో కోఠీలోని బ్రిటిష్ రెసిడెన్సీని ఆంగ్లేయులు తిరిగి నిజాం ప్రభుత్వానికి అప్పగించారు. అప్పటి నుండే కోఠీ రెసిడెన్సీ బజారును ‘సుల్తాన్‌బజారు’గా పిలుస్తున్నారు. 1935లో హైదరాబాద్‌లో ఆకాశవాణి కేంద్రం ఏర్పడింది. 1919 ఆగస్టు 7న ఉస్మానియా విశ్వవిద్యాలయం కోసం అడిక్‌మెట్ వద్ద 1400 ఎకరాల స్థలం సేకరించారు. 1934లో ఉస్మానియా విశ్వవిద్యాలయం నిర్మాణం ఆరంభమయ్యింది. వేలమంది కార్మికులతో, 36 లక్షల వ్యయంతో భవన నిర్మాణం పూర్తయి, 1939లో ఏడవ నిజాం ప్రభువు తన స్వహస్తాలతో ప్రారంభోత్సవం చేశాడు. ఈ విశ్వవిద్యాలయ భవనం భారతదేశంలోనే అందమైన, అద్భుతమైన కట్టడాలలో ఒకటి.

మూసీనది ఒడ్డున ఉన్నత న్యాయస్థాన భవన (High Court Building) నిర్మాణం 1915లో ఆరంభమైంది. నిజాం ప్రభువు 1920 ఏప్రిల్ 20న హైకోర్టు భవనాన్ని ప్రారంభించాడు. మూసీనది వరదలు అరికట్టడానికి విఖ్యాత ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సలహాపై 1914లో గండిపేట చెరువు, ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్‌ల నిర్మాణాలు ప్రారంభమైనాయి. ఉస్మాన్‌సాగర్ నిర్మాణం 1920లో 54 లక్షల వ్యయంతో, హిమాయత్‌సాగర్ నిర్మాణం 1927లో 92 లక్షల వ్యయంతో పూర్తయినాయి. 1937లో భారత రాజధాని ఢిల్లీలో అందమైన హైదరాబాద్ హౌజ్ కూడా నిర్మించారు.

1936లో మూసీనది ఒడ్డున స్టేట్ సెంట్రల్ లైబ్రరీ భవనం, 1937లో జూబిలీహాల్ నిర్మించబడ్డాయి. ఉస్మానియా జనరల్ ఆసుపత్రి, యునాని దవాఖాన, పబ్లిక్ గార్డెన్స్‌లోని రాష్ట్ర పురావస్తు మ్యూజియం, హెల్త్ మ్యూజియం, భాలభవన్ మున్నగు భవనాలన్నీ ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ అసఫ్‌జా కాలంలోనే పూర్తయ్యాయి.
ఇలా కుతుబ్‌షాహీల, అసఫ్‌జాహీల 400 ఏళ్ళ పాలనలో హైదరాబాద్ రాష్ట్రంలో హైదరాబాద్ నగరం సర్వాంగ సుందరంగా అన్ని రంగాలలో అభివృద్ధి చెందింది. 1 నవంబర్ 1956న ఆంధ్రవూపదేశ్ రాష్ట్రం ఏర్పడే నాటికే దేశంలోని ఢిల్లీ, కలకత్తా, ముంబయి, మద్రాస్ వంటి నగరాల తర్వాత ఒక ముఖ్య నగరంగా మన హైదరాబాద్ అభివృద్ధి చెంది ఉంది. అప్పటికీ, ఇప్పటికీ భారతదేశంలోని ఐదు గొప్ప నగరాల్లో హైదరాబాద్ ఒకటిగానే ఉంది.

హైద్రాబాద్‌లో చారివూతక కట్టడాలు, నిర్మాణాలు
1507 గోల్కొండ స్వతంత్ర రాజ్యంగా అవతరణ
1562 హుస్సేన్ సాగర్ నిర్మాణం
1578 పురానాపూల్ నిర్మాణం
1578 హైదరాబాద్ నగరం గోల్కొండ కోట నుండి మూసీకి దక్షిణం విస్తరణ
1589-94 చార్మినార్, గుల్జార్‌హౌజ్, చార్‌కమాన్ల నిర్మాణం
1793 సరూర్‌నగర్‌లో జనావాసాలు ఏర్పడటం
1803 సుల్తాన్ షాహీలో టంకశాల ఏర్పాటు
1805 మీరాలం మండీ ఏర్పాటు
1806 మీరాలం చెరువు నిర్మాణం...........................
1808 బ్రిటీష్ రెసిడెన్సీ భవన నిర్మాణం....................
1828 చందూలాల్ బారాదరీ నిర్మాణం
1831 చాదర్‌ఘాట్ వంతెన నిర్మాణం
1859-66 అఫ్జల్‌గంజ్ వంతెన నిర్మాణం
1862 పోస్టాఫీసుల నిర్మాణం
1873 బాగేఅం - పబ్లిక్ గార్డెన్ నిర్మాణం
1873 బొంబాయి - సికింవూదాబాద్ రైల్వేలైన్ల నిర్మాణం
1874 నిజాం రైల్వే సంస్థ ఏర్పాటు
1884 ఫలక్‌నామా ప్యాలెస్ నిర్మాణం
1882 చంచల్‌గూడా జైలు నిర్మాణం
1883 నాంపల్లి రైల్వేస్టేషన్ నిర్మాణం
1884 ముస్లింజన్ వంతెన నిర్మాణం
1885 టెలిఫోన్ సౌకర్యం ఏర్పాటు
1890 నిజామియా అబ్జర్వేటరీ టెలిస్కోపు ఏర్పాటు.......
1893 హనుమాన్ వ్యాయామశాల
1920 హైకోర్టు నిర్మాణం
1920 ఉస్మాన్‌సాగర్ నిర్మాణం
1927 హిమాయత్‌సాగర్ ఆనకట్ట నిర్మాణం
1930 హైదరాబాద్ నగరంలో సిమెంటు రోడ్ల నిర్మాణం

నైజాం కాలంలో పరిశ్రమల స్థాపన
1871 సింగరేణి బొగ్గు గనులు
1873 మొదటి స్పిన్నింగ్ మిల్లు
1876 ఫిరంగుల ఫ్యాక్టరీ
1876 ప్రభుత్వ ప్రింటింగ్ ప్రెస్
1910 సోడా ఫ్యాక్టరీ
1910 ఐరన్ ఫ్యాకరీ
1916 దక్కన్ బటన్ ఫ్యాక్టరీ
1919 వి.ఎస్.టి ఫ్యాక్టరీ
1921 కెమికల్ లాబోరేటరీ
1927 దక్కన్ గ్లాస్ ఫ్యాక్టరీ
1929 డి.బి.ఆర్.మిల్స్
1931 అజంజాహి మిల్స్, వరంగల్
1932 ఆర్.టి.సి. స్థాపన
1937 నిజాం షుగర్ ఫ్యాక్టరీ
1939 సిర్పూర్ పేపర్ మిల్లు
1941 గోల్కొండ సిగరెట్ ఫ్యాక్టరీ
1942 హైదరాబాద్ స్టేట్ బ్యాంక్
1942 హైదరాబాద్ ఆల్విన్ మెటల్స్
1943 ప్రాగా టూల్స్
1946 హైదరాబాద్ అస్బెస్టాస్
1947 హైదరాబాద్ లామినేషన్ ప్రొడక్ట్

హైదరాబాద్‌లో స్కూళ్లు, కాలేజీల స్థాపన
1856 దారుల్ ఉలూం పాఠశాల
1872 చాదర్‌ఘాట్ పాఠశాల
1879 ముఫీదుల్ అనాం హైస్కూల్
1879 అలియా స్కూల్
1884 సికింద్రాబాద్ మహబూబ్ కాలేజీ
1874 నిజాం కాలేజీ
1887 నాంపల్లి బాలికల పాఠశాల
1894 అసఫియా స్కూల్
1894 మెడికల్ కాలేజీ
1904 వివేక వర్ధిని పాఠశాల
1910 మహబూబియా బాలికల పాఠశాల, గన్‌ఫౌండ్రి..
1918 ఉస్మానియా యూనివర్సిటీ
1920 సిటీ కాలేజీ భవనం
1923 హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ (జాగిర్దార్ కాలేజీ)
1924 మార్వాడీ హిందీ విద్యాలయ
1926 హిందీ విద్యాలయ, సికింద్రాబాద్

హైద్రాబాద్ స్టేట్‌లో గ్రంథాలయాల స్థాపన
1872 ముదిగొండ శంకరారాధ్యుల లైబ్రరీ, సికింద్రాబాద్
1892 ఆసఫియా స్టేట్ సెంట్రల్ లైబ్రరీ
1895 భారత్ గుణ వర్ధక్ సంస్థ లైబ్రరీ, శాలిబండ
1896 బొల్లారం లైబ్రరీ
1901 శ్రీ కృష్ణదేవరాయ ఆంధ్రబాషా నిలయం, సుల్తాన్‌బజార్...
1904 రాజ రాజనరేంద్ర ఆంధ్రభాషా నిలయం, హన్మకొండ
1905 విజ్ఞాన చంద్రికా గ్రంథమండలి, హైద్రాబాద్
1913 ప్రతాపరుద్ర ఆంధ్రభాషా నిలయం, మదికొండ, వరంగల్ జిల్లా
1913 సంస్కక్షుత కళావర్ధినీ గ్రంథాలయం, సికింద్రాబాద్
1923 బాల సరస్వతీ గ్రంథాలయం, హైద్రాబాద్
1930 జోగిపేట గ్రంథాలయం, మెదక్ జిల్లా

దవాఖానాల నిర్మాణం
1890 ఆయుర్వేదం, యునానీ వైద్యశాలల ఏర్పాటు....
1894 మెడికల్ కాలేజీ
1897 మెంటల్ హాస్పిటల్, ఎర్రగడ్డ
1905 జిజ్గిఖానా (విక్టోరియా మెమోరియల్ ప్రసూతి దవాఖాన)
1916 హోమియోపతి కాలేజీ
1927 చార్మినార్ యునానీ, ఆయుర్వేదిక్ ఆసుపత్రుల నిర్మాణం
1945 నీలోఫర్ చిన్నపిల్లల దవాఖాన
1925 ఉస్మానియా జనరల్ హాస్పిటల్, గాంధీ దవాఖాన, సికింద్రాబాద్, టి.బి. దవాఖాన, ఎర్రగడ్డ కాన్సర్ దవాఖాన, ఇ.ఎన్.టి. దవాఖాన, నిజాం ఆర్థోపెడిక్ హాస్పిటల్, కోరంటి దవాఖాన.

హైదరాబాద్ స్టేట్‌లో ప్రభుత్వ శాఖల స్థాపన
1875 సర్వే, సెటిల్‌మెంట్ శాఖ
1876 లాండ్ సెటిల్‌మెంట్ శాఖ
1881 జనాభా లెక్కల సేకరణ
1882 ఎకై్సజ్ లెక్కల సేకరణ
1883 పోలీస్ శాఖ
1892 గనుల శాఖ
1892 పరిశ్రమలు, వాణిజ్యం శాఖలు
1893 లోకల్ ఫండ్ శాఖ
1896 నీటి పారుదల శాఖ
1911 స్టేట్ లైఫ్ ఇన్యూరెన్స్ ఫండ్
1912 సిటీ ఇంప్రూవ్‌మెంట్ బోర్డు
1913 వ్యవసాయ శాఖ
1913 హైదరాబాద్ సివిల్ సర్వీసు
1914 ఆర్కియాలజీ శాఖ
1932 ఆకాశవాణి, హైద్రాబాద్
1945 కార్మిక శాఖ
1864 రెవెన్యూ శాఖ
1866 కస్టమ్స్ శాఖ (కరోడ్‌గిరి)....................................
1866 జిల్లాల నిర్మాణం
1866 వైద్యశాఖ
1866 మొదటి రైల్వేలైను ముంబై - రాయచూర్
1867 ప్రింటింగ్, స్టేషనరీ
1867 ఎండోమెంట్ శాఖ
1867 అటవీ శాఖ (జంగ్లాత్)
1869 మున్సిపల్ శాఖ
1869 పబ్లిక్ వర్స్ డిపార్ట్‌మెంట్
1870 విద్యాశాఖ
1870 హైకోర్టు ఏర్పాటు
- సబ్బని లక్ష్మీనారాయణ
(from namaste telangaana)

25, ఆగస్టు 2013, ఆదివారం

ఎవరికోసం సమైక్యత..?


దేశ స్వాతంత్రోద్యమం తరవాత మల్లి అంత పెద్ద ఉద్యమమంట, లక్షలాది మంది రోడ్ ల మీదికి వస్తున్నారట, నిర్ణయం వెనక్కి తీసుకోకపోతే ఈ ఉద్యమం మరింత తీవ్రమై దేశ విభజన జరిగినా ఆశ్చర్య పోవాల్సిన పని లేదట..?  విభజన వళ్ళ తెలంగాణా అందకారమవుతుందట. నీటి యుద్ధాలు జరుగుతాయట. హైదరాబాద్ ను అభివృద్ధి చేసింది సీమంద్రులే అని తెలంగాణా ప్రజలకు అర్థం అవుతున్నదంట, విడిపోవడం ఆంద్ర వాళ్ళకు ఇష్టం లేదు కాబట్టి, తెలంగాణాలో ఎవడైనా జై తెలంగాణ అంటే తన్నే పరిస్థితికి ఇక్కడి జనం వచ్చారంట.. తెలంగాణా ఇస్తున్నామని కాంగ్రెస్ ప్రకటించనా తెలంగాణావాదులు హర్షించలేదట, పండుగ చేసుకో లేదట.. అంటే తెలంగాణా వాదులంతా సమైక్యందులు గా మరిపోయరట..ఇవన్ని సీమంద్రుల మాటలు.
                                  హైదరాబాద్లో లక్షల మంది వచ్చి నగరాన్ని దిగ్బందిన్చినా సి ఎం కు జనం కనిపించలేంట, కాని ఈ రోజు సీమంద్రలో లక్షల మంది రోడ్ ల మీదికి వస్తున్నారట.. వాళ్ళను అదుపు చెయ్యలేక పోతున్నాడట. నిర్ణయం వెనక్కి తీసుకుంటే తెలంగాణా వారిని అదిలించి , బెదిరించి అవసరమనుకుంటే పిట్టల్ల కాల్చిపారేసి తెలంగాణా ఉద్యమకారుల సమాధులపై  తెలుగువారి ఆత్మగౌరవాన్ని నిలబెడతాడట..! నిన్నటి దాక తెలంగాణా విషయం ప్లీనరీలో స్పష్టంగా చెప్పినం అని జగన్ పార్టీ వాళ్ళన్నారు, వాళ్ళు ఎం చెప్పిర్రో తెలవలేదు కాని ఈ రోజు స్పష్టంగా తెలుస్తోంది, వాళ్ళు చెప్పింది సమక్యంద్ర కె కట్టుబడి ఉన్నామని, తెలంగాణా ఇస్తే కొంగ జపాలు చేస్తారని. కొండమ్మకు నేడు జగన్ రాక్షసుడిలా కనిపిస్తున్నాడట.. ఎన్ని డ్రామాలు.. మొత్తం మీద మరో ప్రా రా పా లా వై కా పా  మిగిలిపోయింది.
                        తెలంగాణ కు కట్టుబడి ఉన్ననని  చెప్పి పార్లమెంట్లో మాత్రం లొల్లి చేయిస్తూన్న చంద్రబాబు, తనతో కొంతకాలంగా సక్యంగా లేని హరి కృష్ణను సమైక్యంద్ర కోసం బాలి పశువును చేసాడు. తెలంగాణాలో పుంజుకోవడానికి ఉద్యమం లో కీలక పాత్ర పోషించిన ఒక గ్రూప్ ను పార్టిలో చేర్చుకోవడం ద్వార యువతకు సీట్లు ఇచ్చామని చెప్పుకోవచ్చు, పార్టీ ని బలోపేతం చేసుకోవచ్చనే ఆలోచనలో బాబు ఉన్నారని సమాచారం. ఇక హైదరాబాద్ అంటే ఏంటో తెలియని సీమంద్రులకు హైదరాబాద్ ను నిర్మించింది నేనే, దాన్ని అభివృద్ధి చేసింది నేనే అని చెప్పి నమ్మించడం పెద్ద కష్టమేమి కాదు, ఇలాంటి రాజధానిని నేను మాత్రమె నిర్మించగలను అని సీమంద్రులకు చెప్పి అక్కడ అధికారంలోకి రావాలని అనుకుంటున్నాడు.
                             ఎవరి గేమ్ వాళ్ళు ఆడుతుంటే అందరి గేమ్ కాంగ్రెస్ ఆడుతోంది.   ఇప్పుడు సోనియా ముందు మోకరిల్లాల్సిన పరిస్థితి టి అర్ ఎస్ కు వచ్చింది, నాయనో బయన్నో కె సి అర్ ను పార్టీలో విలీనం చేసుకోవాలని కాంగ్రెస్ చూస్తోంది, అందుకే కె సి అర్ ని బలహీన పరచడానికి ఆ పార్టీని చీల్చే వ్యూహం చేస్తోంది. అటు సీమంద్ర లోఅశాంతిని రేపి జనాన్ని రెచ్చగొట్టి సీమంద్రలో చెంద్రబాబు ను అడ్డుకోవాలని కాంగ్రెస్ వ్యూహం.
                   సీమంద్రలో ఉద్యమం చెయ్యడానికి ప్రోత్సాహం పూర్తిగా కాంగ్రెస్ నాయకుల నుండే వస్తోందన్నది తెలుస్తూనే ఉది. ఎందుకంటే రాజీవ్ , ఇందిరా విగ్రహాల కూల్చివెత సమయంలో సి ఎం, సీమంద్ర మంత్రులతో సమావేశం నిర్వహించిన అనంతరం విగ్రహాలు కూల్చడం మంచి సాంప్రదాయం కాదు అని ఆయన చెప్పగానే విగ్రహాల విద్వంసం ఆగిపోయింది. అంటే ఏ పార్టీ వాళ్ళు చేస్తున్నారో తెలుసుకోవడానికి ఈ సంఘటనే ఒక ఉదాహరణ. అసలు సీమంధ్రులు చేస్తున్న ఉద్యమ లక్ష్యం ఏమిటి..? తెలంగాణ వాళ్ళతో కలిసుండాలనా.. లేక హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతం చేయ్యలనా..?
                        లక్ష్మి పార్వతి కి సమైక్యంద్ర ఉద్యమం స్వాతంత్రోద్యమం లా కనిపిస్తుందట.. దేశ స్వాతంత్రోద్యమం ఇక్కడి ప్రజల హక్కులను కాపాడటానికి, స్వేచ్చ కోసం జరిగింది, కాని సమైక్యంద్ర ఉద్యమం పక్కవాని హక్కులను హరించడానికి, పక్కవాడు ఎక్కడ బాగుపడతాడో అన్న ఓర్వలేనితనం నుండి, మాకు దక్కంది ఎవరికీ దక్కకూడదు, మేము బాగు పడితే చాలు పక్కవాడు నాశనం ఐన పరవాలేదు అనే కుస్వార్ధం నుండి పుట్టింది. అక్రమ ఆస్తులు కూడబెట్టుకొని తెలంగాణాలో ముఖ్యంగా హైదరాబాద్ లో ఉంటున్న వాళ్ళు,  అక్రమంగా ఉద్యోగాల్లో చొరబడ్డ వాళ్ళు, అక్రమ ప్రమోషన్ లు పొందిన వాళ్ళు ఈ ఉద్యమానికి నాయకులు. ఊరిలో ఉన్న నాలుగఐదు పాటశాలల విద్యార్థులను రోడ్ల్ పైకి తీసుకొచ్చి, మీడియా వాళ్ళు ఫోటోలు, విడియోలు తీసుకున్న తర్వాత ఇంటికి వెల్లిపొతే అది ఉద్యమం, పోట్లాల్లో అన్నం కూరలు తెచ్చుకొని వంట వార్పూ అని నాటకాలు చెయ్యడం మరో వింత. అర్ టి సి బస్సులు నడపరు, కాని ప్రవేట్ బస్సులు ఎదేచ్చాగా తిరుగుతాయి, ప్రభుత్వ పాటశాలలు బంద్, కాని కార్పోరేట్ పాటశాలలు నడుస్తాయి, జెన్కో విద్యుత్ కేంద్రాలు బంద్, లాంకో విద్యుత్ కేంద్రాలు చాలున్టాయ్, మనకు ఇప్పుడు నీళ్ళు రాకపోయినా పర్వాలేదంట, నల్గొండలో తాగునీరు  కలుషితమై బొక్కలు వంకరపోయినా వాళ్ళకు మాత్రం మూడు పంటలకు నీళ్ళు కావాలట. వాళ్ళ బాగుకోసం మనం పాటుపడాలంట.
                            ఇద్దరు వ్యక్తులు కలిసుండాలంటే ఇద్దరి మద్య అవగాహన ప్రేమ ఉండాలి, అవి లేనప్పుడు ఒకరు విడిపోతానంటే మరొకరు చెయ్యల్సిన్దేమిటి..? తను చేసిన తప్పును దిద్దుకుంటానని హామీ ఇచ్చి, తన లో వచ్చిన మార్పును చూపించాలి, నమ్మకం కలిగించాలి.  కాని నువ్వు నానుండి విడిపోవడానికి వీలు లేదు అని బలవంతం చేస్తే అది ఉన్మాదం అవుతుంది, మరి ఈ రోజు సీమాంద్రులు చేస్తున్నది ఏమిటి...? 

23, ఆగస్టు 2013, శుక్రవారం

స్వార్థం కోసం సమైక్యం


నాయకుడు నలుగురికి దారిచూపే వాడై ఉండాలి, అందులోనూ బాధ్యతాయుతమైన ప్రభుత్వ ఉద్యోగులకు నాయకత్వం వహించేవాడే ఆక్రమణదారుడైతే ఉద్యమం దారితప్పుతుందని చరిత్ర ఎన్నోసార్లు రుజువు చేసింది. ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌కుమార్ వ్యవహా రం కూడా అచ్చం ఇలాగే ఉంది. అశోక్‌బాబు ఉద్యోగ వ్యవహారం అనైతికమని, ఆయన సృష్టించిన దొంగ విద్యార్హత పత్రాలతో పొందిన బదిలీ అక్రమమనీ... హైదరాబాద్‌కు ఆయన బదిలీ నిబంధనలకు విరుద్దమనేందుకు కొన్ని పత్రాలు ‘టీ మీడియా’ చేతికి అందాయి. అశోక్‌బాబుతోపాటు ఏపీఎన్జీవో హైదరాబాద్ అధ్యక్షుడు పీవీవీ సత్యనారాయణ కూడా ఇలాగా ఉద్యోగం సంపాదించాడనే ఆరోపణలున్నాయి. ప్రస్తుత ఎపీఎన్జీవో అధ్యక్షుడి హోదాలో ఉన్నట్లుగా చెలామణి అవుతున్న పరుచూరి అశోక్‌కుమార్ కృష్ణా జిల్లా విజయవాడలోని వాణిజ్య పన్నుల శాఖ డిప్యుటీ కమిషనర్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహించేవారు. తదుపరి పోస్టింగ్ అయిన అసిస్టెంట్ కమిర్షియల్ టాక్స్ అధికారి(ఏసీటీఓ) హోదా కోసం తప్పుడు విధానాన్ని అనుసరించి హైదరాబాద్‌కు వచ్చినట్లు సహచర ఉద్యోగులు చెబుతున్నారు. వాస్తవానికి ఏసీటీవో హోదా కోసం ఏదేని డిగ్రీ ఉత్తీర్ణత లేదా శాఖాపరంగా బుక్ కీపింగ్ అర్హత కలిగి ఉండాలి. కానీ ఈ రెండింటిలో అశోక్‌బాబుకు ఏ ఒక్క అర్హత లేకపోవడం గమనార్హం. ఇక ఆయన బదిలీకి ఎంచుకున్న వక్రమార్గంపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే విచారణకు ఆదేశించింది. ఈ విచారణలో పర్చూరి అశోక్‌బాబు దొంగ సర్టిఫికెట్లు సమర్పించినట్లుగా...సర్వీస్ రికార్డులో మార్పులు చేర్పులు చేసినట్లుగా స్పష్టంగా రుజువైంది. విజిపూన్స్ విచారణలో ఆయనపై వచ్చిన ఆరోపణలన్నీ వాస్తవాలేనని...ఆయన అక్రమాలు ఒకటి రెండూ కావని విజిపూన్స్ విచారణ నివేదికను ప్రభుత్వానికి అందించింది. 

వీటిపై విచారణ చేసిన రెవెన్యూ విజిపూన్స్ శాఖ తేదీ 30, జనవరి 2013న ప్రభుత్వానికి నివేదిక(మెమో నెం.1716/విజిపూన్స్-1(2)2013-1లో అందజేసింది. అశోక్‌బాబుపై వచ్చిన ఆరోపనలన్నీ వాస్తవాలేనని...ఆయన అక్రమాలకు పాల్పడి ప్రభుత్వాన్ని మోసం చేశారని ఈ నివేదికలో స్పష్టంగా పేర్కొంది. ఈ మేరకు వాణిజ్య పన్నుల శాఖ ప్రధాన కార్యాలయం ఆయనపై వచ్చిన ఆరోపణలు వాస్తవం అని తేలుస్తూ మొమోను జారీ చేసింది. ఇందులో సర్వీసు రిజిస్టర్‌లో పేజి నెంబర్ 6లో ఇంటర్మడియట్ చిదివినట్లు ఉందని వాణిజ్య పన్నుల శాఖ తేల్చింది. అయితే ఆయన ఇందుకు భిన్నంగా డిగ్రీ చదివినట్లగా ఎలా డిక్లరేషన్ ఇచ్చారని ప్రశ్నించింది. ఇందుకు 15 రోజుల్లో సమాధానం చెప్పాలని మెమోలోపేర్కొంది. అయితే ఆయన డిగ్రీ చదివినట్లు తప్పుడు దృవీకరణ ఇచ్చి 2008 ఫిబ్రవరి 11 న ప్రభుత్వం నిర్వహించిన సాంకేతిక పరీక్ష ఎందుకు రాశారని, డిగ్రీ చదివిన వారికి ఈ పరీక్ష అవసరం లేదని కమిషన్ చురుకలు వేసింది. ఈయనపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. అయినా ప్రభుత్వం ఎందుకో మిన్నకుండి పోతోంది. ఇక్కడ ఇంకో గమ్మత్తయిన విషయం ఏమిటంటే ఏపీఎన్జీఓ హౌజింగ్ సొసైటీలో సభ్యత్వానికి వాస్తవానికి అశోక్‌బాబు అనర్హుడు.

2012 ఆగష్టులో టెన్యూర్ విధానంద్వారా హైదరాబాద్‌కు బదిలీపై వచ్చిన ఆయన 22 జనవరి 2010న ఏపీఎన్జీఓ హౌజింగ్ సొసైటీలో సభ్యత్వం పొందినట్లుగా రికార్డులు సృష్టించడం విమర్శలకు తావిస్తోంది. ఇది ఎలా సాధ్యమని సొంత ఉద్యోగ సంఘాల నేతలే ఆరోపణలు చేసున్నా ఆయన నోరుమెదపడం లేదు. దీనిపై కోర్టులో కేసు విచారణలో ఉంది. వాస్తవానికి నిబంధనల ప్రకారమయితే ఇందులో సభ్యత్వానికి సొసైటీ ఏర్పాటయ్యేనాటికి హైదరాబాద్‌లో 5ఏళ్ల సర్వీసు పూర్తయి ఉండాలి. కానీ ఇవేవీ ఆయనకు వర్తించలేదు. తెలంగాణ విభజనను వ్యతిరేకిస్తూ సమైక్యంగా కలిసుందామని ఉద్యమిస్తున్న అశోక్‌బాబు తెలంగాణ పోస్టును కొల్లగొట్టి...అక్రమంగా ఉద్యోగాన్ని అనుభవిస్తున్నాడు. విజిపూన్స్ అండ్ ఎన్ఫోర్స్‌మెంట్ విభాగంలో 22 పోస్టులు ఉండగా విజయవాడ డివిజన్లో ఈయన విధులు నిర్వహించాల్సి ఉండగా ఈ కోటాలో కాకుండా తెలంగాణ కోటాలో ఆయన నియామకం కావడం విశేషం. ప్రస్థుతం ఈయన సికింవూదాబాద్ డివిజన్లో పనిచేస్తున్నారు.

డిగ్రీ చదవకున్నా చదివినట్లు దొంగ సర్టిఫికేట్...
ఏపీఎన్జీఓ అప్రకటిత అధ్యక్షునిగా కొనసాగుతూ... అసలు ఎన్నికలే జరగని సంఘానికి అధ్యక్షునిగా చెప్పుకుంటున్న అశోక్‌బాబు ప్రభుత్వాన్ని మోసం చేసిన ఆరోపణలును ఎదుర్కొంటున్నారు. అనుభవం ప్రాతిపధికగా జిల్లాల్లో పనిచేసే ఉద్యోగులకు శాఖాధిపతుల కార్యాలయాలకు డెప్యు పంపేందుకు 12.5 శాతం కోటాను ప్రభుత్వం అమలుచేస్తోంది. ఇందుకు ఆయా ఉద్యోగులకు గ్రాడ్యుయేషన్(డిగ్రీ) తప్పనిసరి. ఇదే అంశంలో అర్హతలతో కూడిన విద్యార్హతల జాబితాలతో కూడిన అభ్యర్ధుల వివరాలను తమకు పంపాలని అన్ని శాఖల కమిషనర్లకు 1995 నవంబర్ 10న ప్రభుత్వం ఆదేశించింది.

సరిగ్గా ఇదే అంశాన్ని వాడుకొని హైదరాబాద్ కమిషనరేట్‌కు బదిలీ కావాలని పథకం పన్నిన అశోక్‌బాబు తనకు లేని అర్హతలను సృష్టించుకున్నారు. డిగ్రీతోపాటు కంప్యూటర్ పరిజ్ఞానంలో 1991లోవిజయవాడలోని ఎన్‌ఐఐటీ నుంచి డిప్లొమా ఇన్ సిస్టం మేనేజ్‌మెంట్ కోర్సును పూర్తి చేసినట్లుగా ప్రభుత్వానికి తప్పుడు డిక్లరేషన్‌ను సమర్పించాడు..అయితే సర్వీస్ రికార్డుల్లో మాత్రం ఆయన ఇంటర్‌మీడియెట్ మాత్రమే చదివినట్లుగా ఉండటంతో అనుమానం వచ్చిన అధికారులు దీనికి సంబంధించిన ఒరిజినల్ సర్టిఫికేట్లు, సర్వీస్ రిజిస్టర్‌ను పంపాలని వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ టెలిక్షిగాంద్వారా ఆదేశించారు. దీంతో బెంబేపూత్తిన అశోక్‌బాబు తన గుట్టు బయటపడుతోందని...ఇక దొరికిపోవడం ఖాయమని భావించి యూ-టర్న్ తీసుకుని..‘నాకున్న కుటుంభపరమైన కారణాలవల్ల నేను హైదరాబాద్(హెచ్‌ఓడీ)లో పనిచేసేందుకు సుముఖంగా లేను...నా ధరఖాస్తును ఉపసంహరించుకుంటున్నాను’ అని ప్రభుత్వానికి పంపిన అభ్యర్ధనలో పేర్కొన్నారు. ఇక అక్కడే ఆయన మరో మోసానికి తెగబడ్డారు.

ఆయన చేసిన మోసాన్ని ఆయనే బట్టబయలు చేసుకుని సాంకేతికంగా మరోసారి దొరికిపోయారు. వాస్తవానికి ఇన్‌సర్వీస్ కేడర్‌లో వాణిజ్య పన్నుల సహాయ కార్యదర్శిగా నియామకానికి ప్రభుత్వం నియమించే ఇన్ సర్వీస్ పరీక్షలో ఉత్తీర్ణులు కావాలి...అయితే ఇందుకు డిగ్రీ చదవని వారు మాత్రమే పరీక్ష రాయాలి...డిగ్రీ చదివినవారు దీనిని రాయాల్సిన అవసరం లేదు. అయితే గమ్మత్తుగా డిగ్రీ ఉత్తీర్ణత అయ్యానని చెప్పుకున్న అశోక్‌బాబు ఈ పరీక్ష రాసి ఉత్తీర్ణుడు కావడంతో ఆయన మోసాన్ని ఆయనే దృవీకరించుకున్నారు. గతంలో ఒక ఉద్యోగి ప్రభుత్వానికి తప్పుడు సమాచారం ఇచ్చిన కేసులో సుప్రీంకోర్టులో కీలక వ్యాఖ్యలు చేసింది.‘ప్రత్యక్షంగా లబ్ది పొందకపోయినా సరే తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సమర్పించి ప్రభుత్వాలను మోసం చేయాలని చూస్తే సదరు ఉద్యోగి ఆ ఉద్యోగంలో కొనసాగేందుకు అనర్హుడ’ని పేర్కొంది. 1996లో తప్పుడు డిక్లరేషన్ ఇచ్చిన అశోక్‌బాబును ప్రభుత్వం ఉపేక్షించడం వెనుక అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఎన్నికలే జరగలేదు...అధ్యక్షుడెలా అయ్యాడో....
రాష్ట్రంలో 100కుపైగా గుర్తింపు ఉద్యోగ సంఘాల్లో ఒకటిగా ఉన్న ఏపీఎన్జీకు 31మే 2013 వరకు గోపాల్‌డ్డి అధ్యక్షుడిగా కొనసాగారు. అయితే అదే తేదీన ఆయన పదవీవిరమణ చెందడంతో ఈ పదవికి ఖాళీ ఏర్పడింది. దీంతో ఏలూరు ఏపీఎన్జీఓ అధ్యక్షుడు భోగరాజు ఎన్నికల అధికారిగా మే 26న ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ ఎన్నికలను సవాలు చేస్తూ కొందరు ఉద్యోగులు 2013 జూన్ 20న సిటీ సివిల్ కోర్టు హైదరాబాద్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో ఎన్నికలను తాత్కాలికంగా నిలిపివేయాలని ఇంటెరియం ఇంజక్షన్ ఉత్తర్వులను జారీ చేస్తూ అదేతేదీన అదనపు చీఫ్ జడ్జి ఉత్తర్వులను జారీ చేశారు. దీంతో ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయింది. అసలు ఎన్నికలే జరగని సంఘానికి అశోక్‌బాబు ఎలా అధ్యక్షుడయ్యాడో ఆయనే చెప్పాలి.

హౌజింగ్ సొసైటీలో క్రిమినల్ చర్యలకు సిఫార్సు....
ఏపీఎన్జీఓలకు రాష్ట్ర ప్రభుత్వం గచ్చిబౌలిలో కేటాయించిన 190 ఎకరాల్లో అక్రమాలు జరిగాయని, రూ. 13కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారని కొందరు ఉద్యోగులు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేసిన సాధారణ పరిపాలనా శాఖ(విజిపూన్స-ఎన్‌ఫోర్స్‌మెంట్)శాఖ అక్రమాలు నిజమే అని నిర్దారించింది. వీరు ఉద్దేశపూర్వకంగానే అక్రమాలకు పాల్పడ్డారని పేర్కొంటూ వారిపై వాఖా పరమైన చర్యలతోపాటు క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ప్రభుత్వానికి నివేదించింది. ఇందుకు హైదరాబాద్ నగర అధ్యక్షుడు పివివి సత్యనారాయణను ఎఫ్‌ఐఆర్‌లో పొందుపర్చుతూ సీసీఎస్ కేసు నమోదు చేసింది. ఇందుకు 2013 జూన్ 6న కేసు నెంబర్ 81ను నమోదు చేసింది. ఇందులో సెక్షన్ 406, 409, 420, 182 రెడ్‌విత్ 120 సెక్షన్‌లను నమోదు చేసింది.

610, రాష్ట్రపతి ఉత్తర్వులను ఉల్లంఘించి నియామకమైన పీవీవీ సత్యనారాయణ...
ఇరిగేషన్ శాఖలో టెక్నికల్ ఆపీసర్గా పనిచేస్తున్న ఏపీఎన్జీఓ హైదరాబాద్ అధ్యక్షుడి ఉద్యోగ నియామకంపై కూడా అనేక అనుమానాలున్నాయి. ఈయన స్వస్థలం తూర్పు గోదావరి కాగా విద్యాభ్యాసం అంతా అక్కడే జరిగింది. అయితే నిబంధనలు ఉల్లంఘించి ఈయన ఖమ్మం జిల్లాలో (జోన్-5) క్లాస్-4 క్యాడర్లో జూనియర్ టెక్నికల్ అధికారిగా ఉద్యోగం పొందారని ఆరోపణలున్నాయి. అయితే ఈయన ధవలేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో విధులు నిర్వహించారు. 20శాతం ఉండే ఓపెన్ ఫర్ ఆల్ కేటగిరీలో నాన్ లోకల్‌లో ఉద్యోగం పొందినా ఆయన జోన్ -6లో పనిచేసేందుకు అర్హుడు కాదని నిబంధనలున్నాయి.

అయితే ఇవేవీ వర్తించని రీతిలో ఆయన హైదరాబాద్ చీఫ ఇంజనీర్ కార్యాలయంలో మే 15, 1990న బదిలీపై వచ్చి చేరారు. అనంతరం ఈయన టెక్నికల్ ఆఫీసర్‌గా పదోన్నతి పొందడం తెలంగాణ ఉద్యోగుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. నాన్ లోకల్ క్యాడర్లో జోన్-6కు బదిలీపై రావడం అంటే రాష్ట్రపతి ఉత్తర్వుల్లోని పేరా5(1)కి వ్యతిరేకమని నిబంధనలు సూచిస్తున్నాయి. దీంతో యన నియామకంపై పలువురు ఫిర్యాదు చేయడంతో ఐ అండ్ సీఏడి శాఖ విచారణకు స్వీకరించింది. ఇందులో ఆయన సర్వీస్ రికార్డు గల్లంతయిందని...ఆయనపై వచ్చిన ఆరోపణలన్నీ వాస్తవమేనని తేల్చింది. ఈ అవకతవకలపై రాయకోటి కమిషన్‌ను ఆశ్రయించిన కొందరు ఉద్యోగులకు కమిషన్ హామీ ఇచ్చింది కానీ ఈ నివేదిక ప్రభుత్వానికి చేరకపోవడంతో ఆయన తెలంగాణ ప్రాంతంలోనే కొనసాగుతున్నారు. దీనిపై ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉంది.

అక్రమార్కులే నాయకత్వంలో ఉంటే న్యాయం జరగడం అసాధ్యం
అవినీతి పరులు, అర్హత లేని వ్యక్తులు ఉద్యోగ సంఘాల్లో నాయకత్వం వహించి అక్రమాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి నేతల నాయకత్వంలో ఉద్యోగులకు న్యాయం జరగకపోగా మరింత అన్యాయం జరుగుతందని గుర్తించాలి. ఇప్పటికైనా ఏపీఎన్జీఓలో పనిచేస్తున్న ఉద్యోగులు వాస్తవాలను గుర్తించి వీరిపై తిరగబడాలి. ఉద్యమం ముసుగులో తమపై వచ్చిన ఆరోపణలను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్న వీరి దమననీతిని గుర్తించి పక్కకు తప్పిస్తే మంచిది. లేకపోతే సోదరుల్లా కలిసిమెలిసి పనిచేస్తున్న తెలంగాణ, సీమాంధ్ర ఉద్యోగుల మధ్య విద్వేషాలు రేగడం ఖాయం. ఇప్పటికే తెలంగాణ విభజనకు ఉద్యోగుల్లో మానసిక విభజన జరిగిపోయింది...ఇక భౌగోళిక విభజనే జరగాల్సి ఉందనే వాస్తవాన్ని నేతలు గ్రహించి సహకరించాలి. అక్రమాలకు అడ్డాగా మారిన ఏపీఎన్జీఓ సంఘం గుర్తింపును రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అశోక్‌బాబును సర్వీసులనుంచి భర్తరఫ్ చేసి ఆయన అక్రమాలపై ప్రభుత్వం జ్యుడీషియల్ విచారణ జరిపించాలి
- గంజి వెంక టీఎన్జీఓ కేంద్ర సంఘం అధ్యక్షులు
                              -నమస్తే తెలంగాణ నుండి  

19, ఆగస్టు 2013, సోమవారం

తెలంగాణ ఏర్పాటుకు ఓకే


తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును స్వాగతిస్తున్నామని ఆంధ్ర,రాయలసీమ, తెలంగాణ బడుగు,బలహీనవర్గాల ప్రజాసంఘాలు ముక్తకంఠంతో ప్రకటించాయి. ఆదివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ‘రాజ్యాంగబద్ధంగా రాష్ట్ర విభజనను ఆహ్వానిద్దాం- ఉభయ రాష్ట్రాల ప్రజల మధ్య శాంతి, సహృద్భావాన్ని కాపాడుకుందాం, విభజనతో అన్ని ప్రాంతాల అభివృద్ధికి కృషి చేద్దాం’ తదితరాంశాలపై రౌండ్‌టేబుల్ సమావేశం జరిగింది. దీనికి సీనియర్ పాత్రికేయులు పొత్తూరి వెంకటేశ్వరరావు విచ్చేసి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం విభజన నిర్ణయం జరిగిపోయిందని, ఇక ప్రక్రియ ఎలా జరగాలి అనే అంశంపైనే చర్చలు జరగాలన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కొన్ని సమస్యలు వచ్చినా..అవి పరిష్కరించలేనంత పెద్ద సమస్యలు కావని అభిప్రాయపడ్డారు.

ప్రొ.హరగోపాల్ మాట్లాడుతూ తెలంగాణలో నివసిస్తున్న సీమాంధ్ర వారిని ఇక్కడివారు ఎంతో గౌరవంగా చూసుకుంటున్నారని..ఏనాడూ కూడా ఉద్యమంలో సీమాంధ్ర ప్రజలను తెలంగాణ ప్రజలు విమర్శించిది లేదని గుర్తుచేశారు. హైదరాబాద్ సెటిలర్స్ ఫోరం ప్రతినిధి కాట్రగడ్డ ప్రసూన మాట్లాడుతూ తాము తెలుగువారిగా గర్విస్తున్నామని తెలంగాణలో నివసిస్తున్నందుకు ఎంతో ఆనందపడుతున్నామన్నారు.

హైదరాబాద్ తెలంగాణలో అంతర్భాగమేనని స్పష్టంచేశారు. రాయలసీమ అధ్యయన కమిటీ ప్రతినిధి భూమన మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటును స్వాగతిస్తున్నామని కానీ రాష్ట్రం ఏర్పడితే తాము ఆంధ్రావారితో కలిసి ఉండలేమని రాయలసీమకు ప్రత్యేక రాష్ట్రమివ్వాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ ఫోరం ఫర్ సిటిజన్స్ ప్రతినిధి సజయ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జైఆంధ్రా ఉద్యమనేత సాంబశివరావు, బహుజన కెరటాలు సంపాదకులు పల్నాటి శ్రీరాములు, విజయవాడ మైనార్టీ రిప్రెజెంటేషన్ ప్రతినిధి సయ్యద్ రషీద్, వేపపల్లె సర్పంచ్ జ్యోతి, జైఆంధ్ర జేఏసీ ప్రతినిధి జైబాబు, రాష్ట్ర కాపునాడు ప్రతినిధి పి.వెంకటేశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు.  
 

                                                                                                                  -from sakshi media

11, ఆగస్టు 2013, ఆదివారం

తెలంగాణ గుండెచప్పుడు



తెలంగాణా గుండె హైదరాబాద్ మహా నగరం, దక్షిణ భారత దేశంలోని వివిధ ప్రాంతాలకు రాజధానిగా నిలిచి, అనేక సంస్కృతులను ఆకళింపు చేసుకున్న నగరం, చారిత్రక వారసత్వ నగరంగా కీర్తినందుకున్న నగరంపై నేడు వివాదం ఎందుకు ..? హైదరాబాద్ రాజధానిగా పరిపాలన సాగిన గత 500 ఏళ్ళ కాలంలో మహారాష్ట్ర, కర్నాటక, ఛత్తీస్ ఘడ్, ఆంద్ర ఇలా దక్షిణ భారతాన ఉన్న అనేక ప్రాంతాలు ఈ రాజ్యంలోకి వచ్చాయి వెళ్ళాయి, కాని ఏ రోజైతే ఈ నగరం పురుడు పోసుకుందో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు హైదరాబాద్కు చుట్టుపక్కల ఉన్న ఈ 9 తెలంగాణా జిల్లాలకు మాత్రం హైదరాబాదే రాజధాని . ఎందుకంటే హైదరాబాద్ నిర్మాణం జరిగిందే ఈ ప్రాంత రాజధాని అవసరాలు తీర్చడానికి, కావున దీనిపై పూర్తి హక్కు ఈ ప్రాంతంవారికే దక్కుతుంది.
                  సీమాన్ధ్రులు వచ్చాకే హైదరాబాద్కు పెట్టుబడులు వచ్చాయని, వాల్లే ఇక్కడ సంపదను పెంచి పోషించారని అవేశపడుతూ మాట్లదేవాళ్ళను అడగవలసింది ఒక్కటే, నువ్వు ఎన్ని కోట్ల పెట్టుబడులు ఇక్కడ పెట్టావు అని, 5 కోట్లమంది ఆంద్ర వాళ్ళలో ఎంతమంది హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టారు అనేది అడిగితే మేం పెట్టుబడులు పెట్టి పోషించాం అనే వాదన వెనక ఉన్న డొల్లతనం తెలిసిపోతుంది, సముద్రంలో వలలు వేసుకుంటూ జీవనం సాగించుకునే జాలరికి, ఎక్కడో నెల్లూరులో ఆటో నడుపుకునే ఆటో డ్రైవర్ కి, శ్రీ కాకుళం లో వ్యవసాయం చేసుకునే ఒక రైతు కులికి హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టిన వాళ్ళతో ఎం సంబంధం..? వాళ్ళ లాభాల్లో వీళ్ళకు వాటాలేం రావు కదా ..? 
              ఒక ఊరిలో వెయ్యి జనాభా ఉంది 9 కిరాణా షాపులు ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఇంకో కిరాణ షాప్ పెట్టాలనుకోవడం అర్థం లేని ఆలోచన, ఆ ఊర్లో లేని ఏ వస్తువు కోసం జనం ఇతర ప్రాంతాలకు వెళ్తున్నారో గమనించి, ఆ షాప్ పెట్టడం అనేది తెలివైన ఆలోచన.. వ్యాపారం చేసుకునేవాడు లాభం కోసమే వ్యాపారం చేస్తాడు. కిరాణా షాప్ సరిగా నడవనన్ని రోజులు ఆ యజమాని, అతని భార్య, వారి కుటుంబమే నడిపించుకుంటుంది, కాని ఒక్కసారిగా షాప్ అభివృద్ధి చెంది బాగా గిరాకి అయినప్పుడు, వస్తున్న జనాన్ని బట్టి ఒకరో ఇద్దరో పనివాళ్ళను పెట్టుకుంటారు, ఇక్కడ పనివాళ్ళను ఎందుకు పెట్టుకున్నారు, వాళ్ళకు ఎ ఉద్యోగం లేదు కాబట్టి దయతలచి కాదు కదా తనకు అవసరం ఉంది కాబట్టే, ఇందులో ఎ సమాజ సేవా లేదు. ఆ షాప్ బాగా అభివృద్ధి చెందితే ఆ షాప్ లో  వస్తువులు కొన్నవాడికి, గతం లో వాడికి భూమిని అమ్మినవాడికి, ఆ ఊరికి వచ్చే లాభం ఏమిటి ..? అక్కడ ఆ వ్యాపారానికి మార్కెట్ లేకపోతే అంటే ఆ వ్యాపారి అక్కడ పెట్టుబడి పెట్టే వాడు కాదు. తనకు కావాల్సింది కేవలం లాభాలు అంతే కాని ఆ ఊరి అభివృద్ధి కాదు కదా..? అతను తన వ్యక్తిగత ఆస్తులు పెంచుకున్నాడు అంతే తప్ప అతను సమాజానికి చేసిన గొప్ప మేలు ఏమిలేదు.. మరి హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టినవాడు నగరాన్ని అభివృద్ధి చేద్దామనో, సామాన్యులకు ఉపాది కల్పిద్దామనొ పెట్టారా..? ఇక్కడ అన్ని అనుకూలతలు ఉన్నయి, వ్యాపారం చేస్తే లాభాలు వస్తాయి అని మాత్రమె కదా పెట్టుబడులు పెట్టింది , ఇక్కడ పెట్టుబడులు పెడితే లాస్ వస్తుంది అని తెలిస్తే పెట్టుబడులు పెట్టడు కదా.  హైదరాబాద్ లో వచ్చిన ప్రవేట్ పరిశ్రమల ద్వార వారి వ్యక్తిగత ఆస్తులు పెరిగాయి అంతే దాని వాళ్ళ హైదరాబాద్ లో ఉన్న సామాన్య జనానికి ఒరిగింది ఏమి లేదు, పాతనగరం లో తోపుడు బల్లపై పండ్లమ్ముకునే వాడి జీవితం, బస్తిల్లో బతికే సామన్యుని జీవితం హై టెక్ సిటీ రావడం వాల్ల మారాయా..? 
               అభివృద్ధి అంటే ఏమిటి..? ఒక ప్రాంతం లో అభివృద్ధి జరిగింది అంటే అక్కడి ప్రజల కొనుగోలు సామర్ధ్యం పెరగాలి. ఉదాహరణకు రోజుకు 20 సంపాదించే వారు 200 రూపాయలు సంపాదించే పరిస్థితి వచ్చిందంటే అతని జీవన ప్రమాణం మారుతుంది, అతను విలువైన వస్తువులు కొనగాలుగు తారు, అక్కడికి కొత్త వ్యాపార సంస్థలు వస్తాయి, ఫలితం గా మార్కెట్ సదుపాయాలు పెరుగుతాయి, రావాణా సదుపాయాలు మెరుగవుతాయి, ఇలా ఆ ప్రాంతం నుండి ప్రభుత్వానికి రాబడి పెరుగుతుంది. మరి హైదరాబాద్ లో ఇది జరిగిందా ..? పాతనగరంలో,బస్తిల్లో దశాబ్దాలుగా జీవిస్తున్న వారి పరిస్థితులలో ఐటి, ఫార్మ పరిశ్రమల రాకతో మార్పు జరిగిన్దా..? వాళ్ళ జీవన ప్రమాణం మారిన్దా..? మరి హైదరాబాద్ అభివృద్దికి సీమంధ్రులు కారణం ఎలా అవుతారు..?
            ఒక ప్రాంతం లో పుష్కలం గా తాగునీరు లభిస్తే, నీటి సమస్య లేకపోతే ఆ ప్రాంతం నిజంగా అభివృద్ధి చెందిన ప్రాంతం, 1950 ల నాటికి స్వచ్చమైన తాగు, సాగు నీరు అందించిన మూసి నది, హుస్సేన్ సాగర్ జలాశయమ్ నేడు మురికి కుపాలుగా మారాయి, ఈ రోజు ఇక్కడి ప్రజలు తీగునీటి కోసం మరో నదిపై ఆధారపడవలసిన పరిస్థితి వచ్చింది.. సహజ వనరులను ధ్వంసం చెయ్యడమెనా... అభివృద్ధి అంటే..? 
                            హైదరాబాద్ లో ఉన్న సీమంద్రులకు తెలంగాణా ఏర్పడటం తో భద్రత కరువవుతుంది అనే ప్రచారం చేస్తున్నారు, కేవలం నగరం లోనే కాకుండా నిజామాబాదు, కరీంనగర్, ఆదిలాబాద్, మహబూబ్ నగర్, ఇలా తెలంగాణా లోని అన్ని జిల్లాల్లో ఆంద్ర వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ లేని భద్రత సమస్య హైదరాబాద్ లో ఉండేవాళ్లకే ఎందుకు వచ్చింది..? 
                    హైదరాబాద్ ప్రజల అభిప్రాయాన్ని అడిగితే ఎక్కువ మంది తెలంగాణ తో ఉండటానికి ఇష్టపడరని మరో విష ప్రచారం చేస్తున్నారు, నిజానికి హైదరాబాద్ నగరం ఊపిరిపోసుకున్నదే తెలంగాణ ప్రాంతానికి రాజధాని సమస్య తీర్చడాని, పుష్కలమైన నీరు, ఎత్తైన ప్రాంతంలో ఉండటం వళ్ళ విపత్తుల సమస్య లేదు, వాతావరణం ఆహ్లాదకరం గా ఉండటం, అమీబా లా ఎంత వరకైనా విస్తరించగల విశాలమైన కాళీ భూములు నగరం చుట్టుపక్కల ఉండటం ఇవన్ని ఈ ప్రాంతం రాజధానిగా 4 శతాబ్దాలుగా కొనసాగడానికి అనుకూల అంశాలు, ఈ కాలంలో మహారాష్ట్ర ప్రాంతాలు, కర్ణాటక, ఛత్తీస్ ఘడ్, మధ్యప్రదేశ్, సీమంద్ర ఇలా అనేక ప్రాంతాలు కలిసి విడిపోయాయి, కాని 4 శతాబ్దాలుగా తెలంగాణా లోని 10 జిల్లాలకు రాజధాని హైదరాబాదే..! ఇక ముందు కుడా తెలంగాణా రాష్ట్రానికి రాజధాని హైదరాబాదే అని హైదేరాబాదిలు కోరుకుంటున్నారు, ఆ సర్వే రిపోర్ట్ మీ కోసం.... 
                                                           - సర్వే రిపోర్ట్ ఆంద్రజ్యోతి నుండి... 
                                               
                           

4, ఆగస్టు 2013, ఆదివారం

కాంగ్రెస్ కొత్త నాటకాలు...


కాంగ్రెస్ పార్టీ డ్రామాలు కొత్తపుంతలు తొక్కుతున్నాయి. నిన్నటిదాకా అవునని కాని, కాదు అని చెప్పకుండా మూతి ముడుచుకొని ఉన్న కాంగ్రెస్ ఒకే రోజు సి డబ్ల్యు సి, యుపిఎ సమన్వయ భేటి నిర్వహించి తెలంగాణకు అనుకూల తీర్మానాలు చేశారు. 
            ఇక్కడే అసలు నాటకం మొదలయ్యింది. అంతవరకు తెలంగాణకు అంగీకరిస్తున్నామని చెప్పిన సీమంధ్రులు ఉద్యమ(?) బాట పట్టారు. ఉద్యమం అంటే ఏమిటో కాదు వారి దృష్టిలో విద్వంసమే..! వారి ఆరాటం పరమార్ధం ఏమిటంటే ఎలాగో రాష్ట్రం విడిపోతుంది, వాళ్లకు దక్కని హైదరాబాద్ అవతలి వాళ్ళకు కుడా దక్కకుండా చెయ్యాలనే కుట్ర, సీమంద్ర నాయకులు హైదరాబాద్ ను తెలంగాణా ప్రజలు వదులుకొని కరీంనగర్, వరంగల్ లో ఎక్కడైనా రాజధాని పెట్టుకొమ్మని అంటున్నారు... 
                   అయితే ఈ కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం అంతా సి ఎం, ఫై సి సి చీఫ్ బుర్రల్లోనించి పుట్టిందే.. వై సి పీ కి ఉన్న అతికొద్దిమంది నాయకులూ కుడా తెలంగాణా లో కాలి అవడంతో వాళ్ళు సీమంద్ర జండా పట్టుకున్నారు, సమైక్యంద్ర కోసం రాజీనామాలు చేసి విధ్వంసాలు మొదలుపెట్టారు, ఇప్పుడు కేంద్రం గతంలో మాదిరిగా వెనక్కి వెల్లదని వాళ్ళకు కుడా తెలుసు మరి అలాంటప్పుడు ఉద్యమం ఎందుకు అంటే...2014 ఎన్నికలలో లాభం పొందాలి కదా... అలాగే వై ఎస్ అర్ చనిపోయినప్పుడు టి వి లో ఆ వార్త చూస్తూ గుండె పోటు వచ్చి మరణించారని లిస్టు తయరుచేసినట్టే, ఇప్పుడు కుడా సమైక్యంద్ర కోసం టి వి చూస్తూ మరణించారంటూ లిస్టు తయారు చేస్తున్నారు మీడియా వారు... ఇదంతా ఎన్దుకొసమంటే 2014 లో కాంగ్రెస్ మల్లి అధికారంలోకి రావాలి. వై సి పీ తో ఇప్పటికే అవగాహన కుదుర్చుకున్నారు కాబట్టే తెలంగాణా పై ప్రకటన చేసారు. 2014 లో కాంగ్రెస్ కు ఓటు వేసిన, వై సి పీ కి వేసినా అది కాంగ్రెస్ కు వేసినట్టే. ఇప్పుడు నడిపిస్తున్న ఉద్యమం ద్వారా వై సి పీ ని సీమంద్రలో బలపరచడం ద్వారా 2014 లో లాభం పొందవచ్చానేది కాంగ్రెస్ వ్యూహం ... 
                మరి టి డి పీ ఎం చేస్తున్నట్లు? తెలంగాణా రాకుండా చివరివరకు కాంగ్రెస్ పెద్దలకు ఫోన్లు చేస్తూ ప్రదేయ పడ్డాడట బాబు, ఒక ఆంగ్ల పత్రిక వెల్లడించిన విషయం ఇది, కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నాక ప్రెస్ మీట్ పెట్టి రెండు రాష్ట్రాలు సక్యతతో ఉండాలని సీమంద్రకు 5 లక్షల కోట్ల ప్యాకేజ్ ఇవ్వాలని చెప్పి మొఖం చాటేశాడు. ఇక మిగతా పని ఆ పార్టీ సీమంద్ర నాయకులూ చూసుకుంటున్నారు, బాబు మార్గదర్శనంలో రాజీనామాలు చేసారు, ఇలాగు రాష్ట్ర ఏర్పాటు ఆగదు కాబట్టి హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేయించేందుకు కృషి చేస్తున్నాడు. 

మొత్తంగా అన్ని పార్టీల అసలు రంగులు బయట పడుతున్న ప్రస్తుత తరుణంలో...  తెలంగాణా కాంగ్రెస్ నాయకుల మాటలు కోటలు దాటుతున్నాయి. తెలంగాణ మేమే తెచ్చామ్, సోనియమ్మతో మాట్లాడి తెచ్చాం, కె సి అర్ నోటిని అదుపులో పెట్టుకోవాలని అంటూ, సీమందృ లపై తెగ సానుభూతి కురిపిస్తున్నరు, గడచిన 12 ఏళ్ళ ఉద్యమంలో ఒకే ఒక సభపెట్టి మేమే తెలంగాణా తెచ్చాం అని చంకలు గుద్దుకునే వారు 1000 మంది చనిపోక ముందు సోనియా తో ఎందుకు మాట్లాడి తెలంగాణా తేలేదు..? ఇవ్వాళ్ళ ఉద్యమ ఫలితమే తెలంగాణ రాష్ట్రం అంటే చిర్రు బుర్రు లాడుతున్న ఈ నాయకులు ఎప్పుడు ఉద్యమం చేసారు..?  వీళ్ళు తెలంగాణా ఏర్పడే వరకూ తెలంగాణ కు వ్యతిరేఖమే, సి ఎం కు అనుకూలం, ఇంకా కొంతమైంది నాయకులైతే దిగజారి మాట్లాడి తెలంగాణా నాయకులంటే బానిస మనస్తత్వమ్ కల్గినవారని నిరూపించారు, వీళ్ళ చేతుల్లో రేపు కొత్తగా ఏర్పడబోయే రాష్ట్రాన్ని పెడితే కుక్కలు చింపిన విస్తరిగా చేస్తారు, వీళ్ళు ఇప్పుడే కె సి అర్ ను పక్కకు నెట్టే ప్రయత్నం చేస్తున్నారు, రేపు ఉద్యమకారులను ఇలాగె పక్కకు నేట్టేస్తారేమో, తెలంగాణ ఉద్యమం ఇక్కడితో ముగుసిపోలేదు, ఈ బానిస నాయకత్వం పోయేవరకు, మనం కోరుకున్న అన్ని కోరికలు తీరేవరకు పోరాడాలి.. ఇది అంతం కాదు ఇదే నిజమైన ఆరంభం... 

                

20, జులై 2013, శనివారం

తెలంగాణ తొవ్వ


రాష్ట్రాన్ని ఒకవేళ విభజిస్తే పరిష్కరించలేని సమస్యలుంటాయా? విభజనతో విపరీతమైన ఇబ్బందులు వస్తాయా? అసలు ప్రపంచంలో విభజన డిమాండ్ కొత్తగా ఇక్కడే పుట్టిందా? విభజన అంటూ జరిగితే.. పారే నీళ్లు, బొగ్గులు మండితే వచ్చే విద్యుత్, వివిధ పనుల్లో జనానికి ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు, భూములు.. అవి సృష్టించిన బూమ్‌లు.. అవి పుట్టించిన ప్రైవేటు సంపదలు.. వాటి నుంచి మొలిచిన రాజకీయ అధికారాలు.. ఆ అధికారాలను కిందిస్థాయిలో పాలనగా మార్చే అధికార యంత్రాంగాలు.. అవి కేంద్రంగా ఉండే రాజధాని!! సకల రంగాల్లో సమస్యలు ఏపాటివి? విభజన జరుగకపోతే ఫలితమేంటో అనుభవాలు ఉండనే ఉన్నాయి. అవి అప్రస్తుతం! రాష్ట్రాన్ని విభజిస్తే ఏం జరుగుతుంది? తలెత్తే సమస్యలేంటి? వాటికి పరిష్కారాలేంటి? పరిష్కారాలను చేరుకునే తొవ్వలేంటి? విభజన అనేది బీభత్స రస ప్రధాన దృశ్యం కానేకాదు. ఎవరైనా అలా అంటే కచ్చితంగా అది వారి స్వప్రయోజ నాల కోసమేనని భావించాల్సి ఉంటుంది. నిజానికి ఈ వాదనలు కొత్తవేమీ కావు. 

విభజన అనంతర పరిస్థితులపై మేధావులు కాచివడపోసినవే. నీళ్లు.. విద్యుత్.. ఉద్యోగాలు.. రాజధాని! ఎటు చూసినా సమస్యలు తలెత్తుతాయని భావిస్తున్న కీలక రంగాలు ఇవే! విభజన జరిగితే.. ఎగువన ఉన్న తెలంగాణ నుంచి పారే నదుల నీటిలో ఆంధ్రకు హక్కు ఎగిరిపోదు. ఎందుకంటే ఈ అంశం కొత్తగా ఏర్పడే తెలంగాణ దయాదాక్షిణ్యాలపై ఉండదు! దీనికి ట్రిబ్యునళ్లు ఉంటాయి. అంతర్జాతీయ జల పంపకాల సూత్రాల ప్రకారం అవి ప్రకటించే అవార్డులుంటాయి. వాటిని పర్యవేక్షించే కోర్టులుంటాయి! ఉద్యోగాలు పోతాయన్న బెంగే లేదు. ఎందుకంటారా.. తెలంగాణ విభజనతో మిగిలే సీమాంధ్ర ప్రాంతాల రాష్ట్రానికి అంతే స్థాయిలో అధికార యంత్రాంగం అవసరం! నీటి వనరుల పంపిణీకి ప్రత్యేక విధానాలున్నట్లే.. విద్యుత్ విషయంలోనూ మార్గదర్శకాలున్నాయి. ఇక మరో కీలక అంశం రాజధాని! వాస్తవానికి కొత్త రాజధానిని ఏర్పాటు చేసుకోవడం ద్వారా సీమాంధ్ర ప్రాంతం మరింత వృద్ధి చెందేందుకు పుష్కలమైన అవకాశాలు ఉన్నాయి. 

కొత్త రాజధాని నిర్మాణంతో ఆ ప్రాంతానికి అందే వేల కోట్లు.. కూలి పని చేసినా.. కాంట్రాక్టులు చేసినా.. అంతిమంగా వెళ్లేది స్థానిక ప్రజల్లోకే! వీటన్నింటికి మించి రాజకీయ ప్రయోజనాలు కూడా కోరుకునేవారికి కోరుకున్నన్ని! ప్రస్తుత రాజకీయ చిత్రంలో చూస్తే.. తెలంగాణ ఏర్పాటుతో.. ఈ ప్రాంతంలో కాంగ్రెస్ బలీయమైన శక్తిగా పుంజుకుంటుంది. తెలంగాణ సాధన కోసం ఆవిర్భవించిన టీఆర్‌ఎస్ అనివార్యంగా కాంగ్రెస్‌లో విలీనం కాక తప్పని పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆ రీత్యా కాంగ్రెస్‌కు ఇక్కడ ఇది అత్యంత ప్రయోజనకారి. మరి సీమాంవూధలో? అక్కడా కాంగ్రెస్‌కు లబ్ధి కలిగేందుకే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం కాంగ్రెస్‌లో కీలక స్థానాల్లో ఉన్న ముఖ్యమంత్రి కిరణ్, పీసీసీ చీఫ్ బొత్స, కేంద్ర మంత్రి చిరంజీవి సహా అనేక మంది సీమాంవూధులే. తెలంగాణలో కొత్తగా వచ్చే బలంతో కాంగ్రెస్‌కు పెరిగే పునాది సహజంగానే సీమాంవూధలోనూ కలిసివస్తుంది. 

ఊపుతగ్గిందని భావిస్తున్న జగన్ పార్టీ రేపోమాపో కాంగ్రెస్‌లో కలిసే అవకాశాలూ లేకపోలేదు! ఈ రీత్యా అక్కడా కాంగ్రెస్‌కు జయమే! దేశంలో ఇప్పటికే ప్రత్యేక రాష్ట్రాలుగా ఏర్పడిన అనేక చోట్ల విభజన అనుభవాలున్నాయి. సామరస్యపూర్వకంగా ఎలా విడిపోవచ్చో అవి నిరూపించాయి. విడిపోయి అభివృద్ధి దిశగా ఎలా దూసుకుపోవాలో పాఠాలు చెబుతున్నాయి. ఇప్పుడు వీటికి అదనంగా తోడు చేసుకోవాల్సింది ఒక సుహృద్భావపూర్వక వాతావరణమే! ఒక తెలుగు రాష్ట్రం రెండు తెలుగు రాష్ట్రాలుగా శక్తిని రెట్టింపు చేసుకునేందుకు దీర్ఘకాలం తర్వాత లభిస్తున్న సువర్ణావకాశం! విభజనపై కాంగ్రెస్‌పార్టీ దాని నేతృత్వంలోని ప్రభుత్వం అటో ఇటో తేల్చేస్తామని చెప్పి, ఏం జరిగితే ఏమవుతుందో రోడ్‌మ్యాప్‌ల తయారీ నిమిత్తం తన పార్టీలోని ముగ్గురు ముఖ్య నేతలను ఆదేశించిన క్రమంలో.. తెలంగాణ ప్రజల తరఫున ‘నమస్తే తెలంగాణ’ ఒక చొరవ చేస్తున్నది. తెలంగాణ ప్రజల ఆకాంక్షల నుంచి, ఆత్మబలిదానాల నుంచి, దశాబ్దాల అన్యాయాల నుంచి అక్షరీకరించిన ‘తొవ్వ’ను కేంద్ర పాలకులకు అందజేస్తున్నది.

7, జులై 2013, ఆదివారం

భూదాన్ పోచంపల్లి..

                                                 (వినోబాబావే)
చేనేత, భూదానోద్యమానికి పురుడు పోసిన మన పల్లె ఇవాళ అంతర్జాతీయ పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఒక విస్తృత అధ్యయన కేంద్రంగా విలసిల్లుతోంది.
నల్లగొండ జిల్లాలోని భూదాన్ పోచంపల్లి పేరు తెలియని వారు ఉండరు. ఎందుకంటే, అక్కడి చేనేత కార్మికులు నేసిన చీరలు అందరినీ మురిపిస్తాయి మరి. ఇక ఆడవారినైతే అమితంగా ఆకర్షిస్తాయి. రక్తపాత రహితంగా జరిగిన భూదానోద్యమం పుట్టింది ఇక్కడే. అందుకే ఈ గ్రామం చరిత్రలో నిలిచిపోయింది. అనాడు అగ్గిపెట్టెలో పట్టే పట్టుచీరను నేసిన నేతగాళ్ళు రాన్రాను అనేక డిజైన్‌లలో చేనేత బట్టలను నేసి, అందరినీ ఆకర్శించేలా చేస్తున్నారు. హైద్రాబాద్ నగరానికి కేవలం 35 కి.మీ. దూరంలోని ఈ ఊరును చూసేందుకు దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల వారే కాకుండా రోజూ అనేకమంది విదేశీయులు కూడా ఇక్కడికి వస్తూ, వారికి కావల్సిన సమాచారాన్ని మోసుకు పోతున్నారు. 
             అంతేకాదు, ఈ గ్రామం అనేక రకాల శిక్షణలు, వృత్తివిద్యలు, సాంప్రదాయ విద్యలను అభ్యసించే విద్యార్థులకు అధ్యయన వేదికగానూ నిలిచింది. ఒక ‘గ్రామీణ పాఠశాల’గా ఔత్సాహిక పరిశోధకులకు ఉపయోగపడుతోంది. నిజాం నవాబులు వాడిన కండువా రుమాళ్ళను నేసినా, అరబ్బు దేశాలకు ఎగుమతి చేసిన గాజుల పూసలను తయారు చేసినా, పేద ప్రజల ఆశలకు ప్రతిరూపమైన భూదానోద్యమానికి శ్రీకారం చుట్టినా- అది ఈ గ్రామానికే చెల్లిందనుకోవాలి. సాధారణ పడుచుల నుండి దేశ విదేశీ వనితల వరకూ అందరినీ ఆకట్టుకునే చేనేత ఉత్పత్తులు, చీరలతో ఖండాంతర ఖ్యాతిని ఆర్జిస్తూ ఎందరికో ఈ గ్రామం చక్కని ‘అధ్యయన కేంద్రం’గా మారడం గొప్ప విషయమే మరి. 
చేనేత రంగంలో అధ్యయనాలు:-

చేనేత వస్త్రోత్పత్తికి పేరెన్నిక గన్న ఈ గ్రామానికి నిత్యం అనేక మంది చేనేత అధ్యయనకారులు వస్తుంటారు. హైద్రాబాద్‌లోని (ఎన్‌ఐఆర్‌డీ) జాతీయ గ్రామీణాభివృద్ది సంస్థలో వివిధ అంశాలలో అంతర్జాతీయ స్థాయిలో శిక్షణ పొందే అనేక దేశాలకు చెందిన అధికారులు, శాస్త్రవేత్తలు, విద్యార్థులు, ఆర్థిక రంగ నిపుణులు, అధ్యాపకులు, రాజకీయ వేత్తలు క్షేత్రస్థాయి పరిశీలనలో భాగంగా ఇక్కడికి తరచూ వస్తుంటారు. ‘పోచంపల్లి చేనేత వస్త్రాలను మార్కెట్ అవసరాలకు దగ్గట్టుగా ఏ విధమైన కొత్త డిజైన్‌లను రూపొందించవచ్చు’ అనే అంశంలోఎన్‌ఐఎఫ్‌టీ (ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ) బృందాలు, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ బృందాల వారూ గ్రామాన్ని సందర్శిస్తారు. వీరితోపాటు నిమ్స్‌మీ (జాతీయ, సూక్ష్మ, లఘు, మధ్య పరిక్షిశమ సంస్థ), చేనేత జౌళి శాఖలకు చెందిన అధికారులు, వివిధ రాష్ట్రాల చేనేత క్లస్టర్ల బృందాలు, పలు రాష్ట్రాలకు చెందిన వీవర్స్ సర్వీసింగ్ సెంటర్స్ సభ్యులు, టెక్స్‌టైల్స్ కమిటీలు, పార్లమెంట్ కమిటీలు, సెరీఫైడ్, ఎన్‌హెచ్‌డీసీ, ప్రపంచ దేశాలకు చెందిన పలు ఫొటోక్షిగఫీ అసోసియేషన్ సభ్యులు కూడా ఇక్కడికి వస్తుంటారు. మండల పరిధిలోని పోచంపల్లి హ్యాండ్లూమ్ ఫార్కును, పోచంపల్లి చేనేత సహకార సంఘాన్ని, చేనేత కార్మికుల గృహాలను చేనేత ఉత్పత్తిలోని వివిధ ప్రక్రియలను వారు తిలకించడంతోపాటు ఫొటోలు తీసుకుంటారు. 
వ్యవసాయ పరిశోధనలు:-
మరోవైపు వ్యవసాయ పరిశోధకులూ ఇక్కడికి వస్తుంటారు. భూదాన్ పోచంపల్లిలో మూసీ నది ప్రవహిస్తోంది. ఇక్కడి రైతులు ఎక్కువగా వరి పంట పండిస్తారు. హైద్రాబాదుకు అతి తక్కువ దూరంలో ఉంటుంది కాబట్టి, వ్యవసాయ పరమైన కొన్ని అధ్యయనాలు జరపడానికి ఇక్కడికి ఆంధ్రవూపదేశ్ అగ్రికల్చరల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నాన్ ఫెస్టిసైడ్ మేనేజ్‌మెంట్ బృందాలు, నాబార్డ్, ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించడానికి వివిధ రాష్ట్రాల అధికారులు, గ్రామీణ మహిళామండలి సభ్యులు, వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు, డీఆర్‌డీఏ, ఎన్‌సీఆర్‌డీ (నేషనల్ కౌన్సిల్ ఫర్ రూరల్ డెవలప్‌మెంట్) బృందాల వారూ ఈ గ్రామాన్ని సందర్శిస్తారు. 
విద్యార్థులకు కొత్తపాఠాలు:-
ఇక్కడి పురాతన కట్టడాలు పరిశీలించడానికి వివిద రాష్ట్రాలకు చెందిన ఆర్కిటెక్ట్ కళాశాలలకు చెందిన విద్యార్థులూ ఈ గ్రామాన్ని సందర్శిస్తున్నారు. ఇక్కడి 101 దర్వాజల భవనాన్ని, పాత పెంకుటిళ్లను పరిశీలించేందుకే కాకుండా కాలక్షికమేణా నిర్మాణ రంగంలో చోటు చేసుకుంటున్న మార్పులను అధ్యయనం చేయడం ప్రధానంగా వారి పర్యటన లక్ష్యంగా కనిపిస్తోంది.
పథకాల పరిశీలన:-
ప్రభుత్వం ప్రవేశపెడుతున్న వివిధ పథకాలను పరిశీలించేందుకు పలువురు అధికారులు ఈ గ్రామాన్ని సందర్శిస్తుంటారు. మరోవైపు మహిళా సాధికారతకు సర్కారు తీసుకునే చర్యలను పరిశీలించేందుకుగాను విదేశాల ప్రతినిధులు, అధికారుల బృందాలు, వివిధ రాష్ట్రాల నిపుణులు, బ్లాక్ లెవల్ అధికారులు, గ్రామీణాభివృద్ది శాఖ అధికారులు వంటి వారందరూ తరచుగా ఇక్కడికి రావడం జరుగుతోంది. 
పుణ్యస్థలి:-
మహాత్ముని ప్రియశిష్యుడు ఆచార్య వినోబాబావే నిర్వహించిన భూదాన్యోమం ఇక్కడే పుట్టింది. ఈ దృష్ట్యా అనేక పర్యాయాలు ఇక్కడికి ఎందరో సర్వోదయ నాయకులు, గాంధేయవాదులు వినోబాబావే తన రెండవ జన్మస్థలంగా చెప్పుకున్న ఈ గ్రామాన్ని అత్యంత ఆసక్తితో సందర్శిస్తారు. ఇలా వారికి ఈ గ్రామం ఒక పుణ్యస్థలంగానూ పేరొందింది. 
వృత్తివిద్యలు, శిక్షణల పరిశీలన:-
దివంగత మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు గురువు, తెలంగాణ విమోచన గాంధీ స్వామి రామానందతీర్థ పేరున ఇక్కడ గ్రామీణ యువతీ యువకులకు వివిధ వృత్తివిద్యలతోపాటు సాంకేతిక అంశాలలో శిక్షణ ఇచ్చే లక్ష్యంతో ఏర్పాటైన ఎస్‌ర్‌టీఆర్‌ఐ సంస్థను కూడా పలువురు ఆసక్తిగా సందర్శిస్తుంటారు. 
         హైద్రాబాద్‌కు అతి సమీపంలో ఉండటంతో రాజధానికి వచ్చే దేశ విదేశీ పర్యాటకులలో చాలామంది పోచంపల్లిని కూడా సందర్శించడం పరిపాటిగా మారింది. అంతేకాదు, వచ్చే ప్రతీ ఒక్కరు వచ్చిన పని ముగిశాక, ఇక్కడి చేనేత కార్మికులు నేసే వస్త్రాలను కూడా కొనుగోలు చేస్తుంటారు. అలా ఈ కార్మికులకు మరింత పని దొరికేందుకు పరోక్షంగా వారు దోహద పడుతున్నారు. అధిక సంఖ్యలో సందర్శకులు వస్తున్న కారణంగా ఇక్కడ ప్రభుత్వం గ్రామీణ పర్యాటక కేంద్రం ఒకదానిని ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. పర్యాటకులకు తగు వసతులు కల్పించడం ద్వారా మరింత మంది సందర్శుకులను ఆకట్టుకునే అవకాశం కూడా ఉంటుంది.

                                                                                   -from namaste telangaana

తెలంగాణ కాటన్-నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్


హైదరాబాద్ రాజ్యంలో పటిష్టమైన ప్రణాళికలు రచించి, అనేక భారీ మధ్యతరహా సాగునీటి ప్రాజెక్టులను నిర్మించిన నవాబ్ అలీ నవాజ్ జంగ్ తెలంగాణ సాగునీటి రంగానికి పితామహుడు. జూలై 11న ఆయన జయంతి. ఈ సందర్భంగా ‘బతుకమ్మ’ ప్రత్యేక వ్యాసం...

ఏ జాతికైనా తమ జాతి వైతాళికులు ఉంటారు. తమ జాతి ఔన్నత్యం కోసం, తమ జాతి వికాసం కోసం అహర్నిశలు కృషి చేసిన ఉద్ధారకులు, మేధావులు ఉంటారు. అయితే, తెలంగాణ వంటి వలసవాదానికి బలయిన ప్రాంతాలలో ఈ చరిత్ర అంతా మరుగున పడిపోతుంది. చరిత్ర వక్రీకరణకు గురి అవుతుంది. విజేతల చరిత్రే చరిత్ర అన్నట్లు చరిత్ర పుస్తకాలు, పాఠ్య పుస్తకాలు రూపొందుతాయి. అట్లా 1956లో ఆంధ్రవూపదేశ్ రాష్ట్ర ఏర్పాటు అనంతరం తెలంగాణ చరిత్ర ఆంధ్రవూపదేశ్ చరివూతలోంచి లేదా తెలుగువారి చరివూతలోంచి తొలగిపోయి మరుగున పడిపోయింది.

తెలంగాణ నేల అనేక రాజకీయ, సామాజిక ఉద్యమాలకు ఊతమిచ్చింది. 1857 భారత ప్రథమ స్వాతంవూత్య సమరం ఉత్తర భారతదేశాన్ని కుదిపేస్తున్న వేళలో, ఆ సమరంలో భాగం కాకుండా బ్రిటిష్ వాళ్లకు మద్దతిచ్చిన నిజాం రాజ్యంలో తుర్రేబాజ్‌ఖాన్, మౌల్వీ అల్లావుద్దీన్ నాయకత్వంలో బ్రిటీష్ రెసిడెన్సీపై దాడి జరిగింది. ఆ పోరాటంలో తుర్రేబాజ్ ఖాన్, మౌల్వీ అల్లావుద్దీన్ లిద్దరూ బ్రిటిష్ వాళ్ళకు పట్టుబడి అమరులైనారు. అటువంటి మహత్తర ప్రతిఘటన పోరాటం చరివూతకు అందకుండా పోయింది. బ్రిటీష్ సామ్రాజ్యవాదాన్ని ఎదిరించిన రాంజీగోండు, అడవిపై గ్రామాలకు హక్కుని కోరుతూ జరిగిన కొమురం భీం బాబేఝరీ పోరాటం ఇటీవలి దాకా ఎవరికీ తెలియని చరివూతగా మిగిలిపోయింది. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని ఇప్పటికీ మొయిన్ స్ట్రీం చరివూతకారులు గుర్తించనే లేదు. తెలంగాణలో భాషా సాంస్కృతిక వికాసం కోసం కృషి చేసిన వైతాళికుల గురించి తెలంగాణ చరివూతకారులు వెలికితీసే దాకా ఎవరికీ తెలియనే తెలియదు. అట్లా మరుగున పడిపోయిన వైతాళికులలో హైదరాబాద్ సంస్థానంలో పుట్టి, భారతదేశంలోనే అత్యంత ప్రతిభావంతుడైన ఇంజనీరుగా పేరు పొందిన నవాబ్ అలీ నవాజ్ జంగ్ ఒకరు.

మోక్షగుండం విశ్వేశ్వరయ్య గురించి దేశవ్యాప్తంగా తెలియని వారుండరు. ఆయన భారతదేశం గర్వించదగ్గ ఇంజనీరు. భారతరత్న బిరుదాంకితుడు. భారతదేశంలో నీటి పారుదల రంగానికి పునాదులు వేసిన తొలి తరం మేధావి. అటువంటి మేధావికి సమకాలికుడు, అంతటి స్థాయి కలిగిన ప్రతిభావంతుడైన ఇంజనీరు నవాబ్ అలీ నవాజ్‌జంగ్. అయితే, ఆంధ్రవూపదేశ్ నీటిపారుదల రంగ చరివూతలో సర్ అర్థర్ కాటన్‌కు ఆ తర్వాత కె.ఎల్.రావులకు దక్కిన ఖ్యాతి నవాబ్ అలీ నవాజ్ జంగ్‌కు దక్కకపోవడం యాధృచ్చికం కానే కాదు.

కృష్ణా, గోదావరి, పెన్నా, కావేరీ డెల్టాలకు సాగునీటి సౌకర్యాలను ఏర్పరిచి, డెల్టా ఆర్థిక స్థితిగతులను గుణాత్మకంగా మార్చివేసిన వ్యక్తి సర్ ఆర్థర్ కాటన్. కాటన్‌కు చరివూతలో ఆ ఖ్యాతి, ఆ స్థానం దక్కవలసిందే. అయితే, హైదరాబాద్ రాజ్యంలో సాగునీటి ప్రణాళికలు రచించి అనేక భారీ మధ్యతరహా సాగునీటి ప్రాజెక్టులను నిర్మించిన తెలంగాణ సాగునీటి రంగానికి పితామహుడు నవాబ్ అలీ నవాజ్ జంగ్. ఆయన కృషిని స్మరించుకొన్న సందర్భాలు ఇటీవలి దాకా లేనే లేవు. తెలంగాణ ఇంజనీర్లు సెప్టెంబరు 15న ‘ఇంజనీర్స్ డే’ రోజున మోక్షగుండం విశ్వేశ్వరయ్య సరసన నవాబ్ అలీ నవాజ్ జంగ్ ఫొటోను పెట్టి ఆయన కృషిని స్మరించుకుంటున్నారు. ఆయన జయంతి, వర్థంతి సభలను జరుపుతున్నారు. నవాబ్ అలీ నవాజ్ జంగ్ కృషిని సంక్షిప్తంగా ప్రపంచానికి అందించే ప్రయత్నమే ఈ జీవిత చిత్రణ.

నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్‌గా ప్రపంచానికి ముఖ్యంగా హైదరాబాద్ ప్రజలకు పరిచితుడైన ఈయన అసలు పేరు మీర్ అహ్మద్ అలీ. 11-7-1877న హైదరాబాద్‌లో జన్మించాడు. తండ్రి మీర్ వాయిజ్ అలీ హైదరాబాద్ రాజ్యంలో ‘ధప్తర్-ఎ-ముల్కీ’లో అసిస్టెంట్ సెక్రటరీగా పనిచేస్తుండేవారు. భారత ప్రభుత్వంతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరపడం ‘ధప్తర్-ఎ-ముల్కీ’ చేసేపని. హైదరాబాద్ రాజ్యంలో మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన మీర్ అహ్మద్ అలీ హైదరాబాద్ అబిడ్స్‌లోని సెయింట్ జార్జి గ్రామర్ స్కూల్‌లో ఉన్నత పాఠశాల విద్యను పూర్తి చేసుకొన్నాడు. ఇంగ్లీషుతో పాటు లాటిన్ భాషను కూడా నేర్చుకొన్నాడు. ఆ తర్వాత నిజాం కాలేజీలో చేరాడు. అక్కడ నాలుగేండ్లు ఉన్నత విద్యను అభ్యసించి 1896లో ప్రభుత్వం ఇచ్చే స్కాలర్‌షిప్‌తో ఇంగ్లండ్‌లో ప్రఖ్యాతి గాంచిన కూపర్‌హిల్ ఇంజనీరింగ్ కాలేజీలో చేరి, సివిల్ ఇంజనీరింగ్ విద్యను అభ్యసించాడు. కూపర్ హిల్ ఇంజనీరింగ్ కాలేజీలో ప్రతిభావంతుడైన విద్యార్థిగా తన బ్యాచ్‌లో ప్రథముడిగా నిలిచి అనేక స్కాలర్‌షిప్‌లను అందుకున్నాడు. 1899లో ఇంగ్లండ్ నుండి తిరిగి వచ్చి అదే సంవత్సరం హైదరాబాద్ ప్రభుత్వ ప్రజాపనుల విభాగంలో (పీడబ్ల్యూడీ)లో అసిస్టెంట్ ఇంజనీరుగా చేరి, అంచెలంచెలుగా ఎదిగి చీఫ్ ఇంజనీరయ్యాడు. ఆ తర్వాత చీఫ్ ఇంజనీరు సెక్రటరీగా పదోన్నతి పొంది పదవీ విరమణ చేశాడు. తర్వాత కూడా హైదరాబాద్ ప్రభుత్వానికి, భారత ప్రభుత్వానికి సాంకేతిక సేవలు అందించాడు. హైదరాబాద్‌లో ప్రభుత్వంలో అసిస్టెంట్ ఇంజనీరుగా చేరినపుడు ఆయన వేతనం రూ.400, పదవీ విరమణ సమయంలో ఆయన వేతనం రూ.3350.

నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్ నిర్వహించిన పదవులు
- అసిస్టెంట్ ఇంజనీర్ - గుల్బర్గా జిల్లా
- అసిస్టెంట్ ఇంజనీర్ - మహబూబ్‌నగర్ జిల్లా
- అసిస్టెంట్ ఇంజనీర్ - మెదక్ జిల్లా
- అసిస్టెంట్ ఇంజనీర్ - వరంగల్ జిల్లా
- అసిస్టెంట్ ఇంజనీర్ - హైదరాబాద్ మున్సిపాలిటీ
- అసిస్టెంట్ సూపరింటెండింగ్ ఇంజనీర్, సాగునీరు
- ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు, సాగునీరు- హైదరాబాద్
- సూపరింటెండింగ్ ఇంజనీరు, సాగునీరు- హైదరాబాద్
- చీఫ్ ఇంజనీరు, సెక్రెటరీ, పి.డబ్ల్యూ.డి., సాగునీరు (1918 నుండి 1937 దాకా)
- నిజాం వ్యక్తిగత కన్సల్టింగ్ ఇంజనీర్ (1937-1938)

నవబ్ అలీ నవాజ్ జంగ్ రూపకల్పన చేసిన/నిర్మించిన ప్రాజెక్టులు
- ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ (హైదరాబాద్)
- పోచారం ప్రాజెక్టు, నిజాంసాగర్ ప్రాజెక్టు (నిజామాబాద్ జిల్లా)
- వైరా ప్రాజెక్టు, పాలేరు ప్రాజెక్టు (ఖమ్మం జిల్లా)
- ఢిండీ ప్రాజెక్టు, రాయనిపల్లి, సింగభూపాలం, తుంగభధ్ర కొయిల్ సాగర్ (మహబూబ్‌నగర్ జిల్లా)
- కడెం ప్రాజెక్టు (ఆదిలాబాద్ జిల్లా)


- మూసీ ప్రాజెక్టు (నల్లగొండ జిల్లా)
- చంద్రసాగర్ ప్రాజెక్టు (నల్లగొండ జిల్లా)
- రాజోలిబండ ప్రాజెక్టు (మహబూబ్‌నగర్ జిల్లా)
-పోచంపాడు ప్రాజెక్టు (నిజామాబాద్ జిల్లా)
- నందికొండ ప్రాజెక్టు (నల్లగొండ జిలా)
- పెండ్లిపాకు ప్రాజెక్టు (నల్లగొండ జిల్లా)
- సరళాసాగర్ ప్రాజెక్టు (మహబూబ్‌నగర్ జిల్లా)
- పూర్ణా ప్రాజెక్టు (మహారాష్ట్ర)
- భీమా ప్రాజెక్టు (మహబూబ్‌నగర్ జిల్లా)
-దేవనూరు ప్రాజెక్టు (మెదక్ జిల్లా)
- పెన్‌గంగ ప్రాజెక్టు (మహారాష్ట్ర)
- ఇచ్చంపల్లి ప్రాజెక్టు (కరీంనగర్ జిల్లా)
-లోయర్ మానేరు ప్రాజెక్టు (కరీంనగర్ జిల్లా)

-ముప్పయి ఏండ్ల తన సుధీర్ఘ ఉద్యోగ ప్రస్థానంలో 18 ఏండ్లు చీఫ్ ఇంజనీరు, సెక్రెటరీగా పనిచేసిన రికార్డు అలీ నవాజ్ జంగ్‌దే. ఈ పదవీ కాలంలో ప్రజాపనుల విభాగాన్ని పటిష్టమైన పునాదులపై నిలిపాడు. ఆయన నేతృత్వంలో హైదరాబాద్ రాజ్యంలో అనేక సాగునీటి ప్రాజెక్టులు, రోడ్లు, వంతెనలు, భవనాలు నిర్మితమైనాయి. ప్రజాపనుల విభాగంపై తనదైన ముద్రను వేశాడు. ఆయన సాధించిన విజయాలకు హైదరాబాద్ రాజ్యంలోనే కాదు భారతదేశంలోనూ గుర్తింపు వచ్చింది. ఆయన ప్రదర్శించిన సాంకేతిక నైపుణ్యాన్ని భారత ప్రభుత్వంతో పాటు ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా గుర్తించి తమ రాష్ట్రాలలోని ప్రాజెక్టుల రూపకల్పనలలో, నిర్మాణ సమస్యలపై సంప్రదింపులు, సలహాల కోసం ఆహ్వానించేవి. అట్లా అలీ నవాజ్ జంగ్ సలహాలు సూచనలతో బొంబాయి, బీహార్, ఒరిస్సా, మద్రాసు, సింద్ రాష్ట్రాలు తమ రాష్ట్రాలలో సాంకేతిక సమస్యలను అధిగమించాయి.
1938లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ప్లానింగ్ కమిటీ జవహర్‌లాల్ నెహ్రూ చైర్మన్‌గా ఏర్పాటైంది. ఈ ప్లానింగ్ కమిటి ‘సాగునీరు, నదుల మళ్లింపు’ తదితర అంశాలను అధ్యయనం చేసేందుకు ఒక సబ్ కమిటీని నియమించింది. ఆ కమిటికి నవాబ్ అలీ నవాజ్ జంగ్ చైర్మన్‌గా నియమితులు కావడం ఆయన ప్రతిభకు నిదర్శనం. అలీ నవాజ్‌జంగ్ నేతృత్వంలోని సబ్ కమిటీ నదీ జలాల వినిమోగంపై, తాగునీటి పథకాలపై, జల విద్యుత్ పథకాలపై, వరద నియంవూతణ పథకాలపై, జలరవాణా పథకాలపై, కాలువలు, చిన్న నీటి చెరువుల నిర్మాణాలపై సమక్షిగమైన నివేదికను సమర్పించింది. ఈ నివేదికలో మూడు విభాగాలున్నాయి. మొదటిది భారతదేశంలో సాగునీటి పథకాల నిర్మాణం, రెండవది నదుల మళ్లింపు-వరద నియంవూతణ పథకాలు, మూడవది జల విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణం.

అలీ నవాజ్ జంగ్ ఇతర నిర్మాణాలు
నవాబ్ అలీ నవాజ్ జంగ్ సాగునీటి రంగంలోనే కాదు రోడ్లు, భవనాలు రైల్వేలు, టెలిఫోన్లు, వంతెనలు తదితర ఇతర రంగాలలో తన ప్రతిభను చాటుకున్నాడు. గోదావరి, కృష్ణా వంటి పెద్ద నదులపై ఆయన హయాంలో నిర్మితమైన రాతి వంతెనలు వందల సంవత్సరాలు సేవలందించాయి. గోదావరి నదిపై ఆదిలాబాల్ జిల్లా సోన్ గ్రామం వద్ద నిర్మితమైన వంతెన రెండేండ్ల కింద కొత్త వంతెన నిర్మించేదాకా సేవలందించింది. దాన్ని ఇప్పటికీ ‘అలీ నవాజ్ జంగ్ బ్రిడ్జి’గా పిలుస్తారు.

భవన నిర్మాణ రంగంలో ఆయన ప్రతిభకు తార్కాణాలు 
- ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ భవనం, హాస్టల్ భవనాలు.
-ఉస్మానియా జనరల్ ఆసుపత్రి భవనం (1933-34).
- ఢిల్లీలోని హైదరాబాద్ హౌజ్.
- ఫతేమైదాన్‌లో మహబూబియా గ్రాండ్ స్టాండ్.
- పబ్లిక్ గార్డెన్స్‌లోని ఉస్మానియా జూబ్లీహాలు.
- అఫ్జల్‌గంజ్‌లోని స్టేట్ సెంట్రల్ లైబ్రరీ భవనం.
- మక్కా మసీదు దగ్గర సదర్ నిజామియా షఫాఖానా.
- మహబూబియా బాలికల పాఠశాల.
- నాందేడ్ సివిల్ హాస్పిటల్.
- సైన్యం కోసం రెండవ లాన్సర్స్ బిల్డింగ్స్, కేవలరీ ట్రెయినింగ్ స్కావవూడన్, చాంద్రాయణ గుట్ట, మల్లేపల్లి లైన్స్.
- నిజాంసాగర్, నిజాం చక్కెర కర్మాగారం.

సాగునీటి రంగంలో, నిర్మాణ రంగంలో ఆయన ప్రతిభావంతుడన్న దానికి తిరుగులేని నిదర్శనాలు పైన చూశాం. ఆయన ముందు చూపు కలిగిన ఓ ఆర్థికవేత్త, గొప్ప పరిపాలనాదక్షుడు కూడా. నిజామాబాద్ జిల్లా ముఖచిత్రాన్ని మార్చివేసిన రెండు ప్రధాన నిర్మాణాలకు అలీ నవాజ్‌జంగ్ దార్శనికతే కారణం. అవి మంజీరా నదిపై నిర్మించిన నిజాంసాగర్ ప్రాజెక్టు, బోధన్‌లో నిర్మించిన నిజాం చక్కెర కర్మాగారం. 2,75,000 ఎకరాలకు సాగునీటి సౌకర్యం కలిగించడానికి మంజీరాపై నిర్మించిన నిజాంసాగర్ ప్రాజెక్టు 1933 నాటికే పూర్తయ్యింది. మొత్తం హైదరాబాద్ రాజ్యంలోనే నిజామాబాద్ జిల్లా ఈ ప్రాజెక్టు కారణంగా సంపద్వంతమైన జిల్లాగా మారింది. మొత్తం దేశానికి, తెలంగాణకు గర్వకారణంగా రూపొందించిన నిజాం చక్కెర కర్మాగారం ఆనాటికే ఆసియా ఖండంలోనే అతిపెద్ద ప్యాక్టరీ. దీనికి అవసరమయ్యే చెరుకును పండించడానికి నిజాం కాలువల కింద వందల ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది. చంద్రబాబు నాయుడు అమలు పరిచిన ప్రైవేటీకరణ విధానాలతో నిజాం చక్కెర కర్మాగారం మూతపడింది. నిజాంసాగర్ ప్రాజెక్టులో భాగంగా అలీసాగర్ బ్యాలెన్సింగ్ జలాశయం కూడా నిర్మితమైంది. అది అలీ నవాజ్ జంగ్ పేరుమీద ‘అలీసాగర్’గా ప్రసిద్ధి చెందింది.

నిజామాబాద్ జిల్లాకు ఇంత అద్భుతమైన కానుకనిచ్చిన అలీ నవాజ్ జంగ్ విగ్రహం నిజాంసాగర్ ప్రాజెక్టు వద్దనో, ఆయన పేరు మీదనే పిలువబడుతున్న అలీసాగర్ జలాశయం వద్దనో లేకపోవడం కృతజ్ఞతా రాహిత్యమే అవుతుంది. ప్రభుత్వ పెద్దలు ఆ పని ఎట్లాగూ చెయ్యరు. ఇది నిజాంసాగర్ ఆయకట్టు రైతులు, నిజామాబాద్ జిల్లా ప్రజలు పూనుకొని చెయ్యవలసిన కార్యం. ధవళేశ్వరం వద్ద, గోదావరి ఆనకట్ట వద్ద సర్ ఆర్థర్ కాటన్ విగ్రహం ఉన్నప్పుడు నిజాంసాగర్ వద్దనో, అలీసాగర్ వద్దనో అలీ నవాజ్ జంగ్ విగ్రహం ఉండొద్దా? అక్కడే కాదు, ఆయన విగ్రహం టాంక్‌బండ్‌పైనా సర్ ఆర్థర్ కాటన్ సరసన, ఎర్రమంజిల్‌లోని జలసాధనలో కూడా తప్పనిసరిగా నెలకొల్పాలి.

ఇప్పటిదాకా అలీ నవాజ్ జంగ్‌కి దక్కిన గౌరవం ఒక్కటే. మే నెల 1966లో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్, ఆంధ్రవూపదేశ్ స్టేట్ సెంటర్, ఖైరతాబాద్‌లో ఆయన చిత్రపటాన్ని వేలాడదీయడం. ఆ కార్యక్షికమానికి ఆనాటి కేంద్ర మంత్రి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ (మాజీ రాష్ట్రపతి) వచ్చి చిత్రపటాన్ని ఆవిష్కరించాడు. ప్రముఖ ఇంజనీరు కె.ఎల్.రావు అధ్యక్షత వహించిన ఆ సభలో ప్రముఖ తెలంగాణ నాయకులు కె.వి. రంగాడ్డి డా॥ అక్బర్ అలీఖాన్‌లు అలీ నవాజ్ జంగ్ సేవలను కొనియాడుతూ ప్రశంసించారు.
6 డిసెంబర్ 1949న అలీ నవాజ్ జంగ్ చివరి శ్వాస విడిచినప్పుడు ఆయన అంతిమయావూతలో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్‌తో పాటు అనేకమంది ప్రముఖులు పాల్గొని నివాళులర్పించారు.
తెలంగాణ సాంస్కృతిక పునరుజ్జీవనం సందర్భంగా పురాతన తవ్వకాలలో దొరికిన, తెలంగాణ గర్వించదగిన కోహినూర్ వజ్రం నవాబ్ అలీ నవాజ్ జంగ్. ఆయన జీవితం, ఆయన సాధించిన విజయాలు తెలంగాణ ఇంజనీర్లకు ఎల్లప్పుడూ స్ఫూర్తినిస్తాయి. దానితోనే తెలంగాణ సర్వీసు ఇంజనీర్లు , ఇంజనీర్లు (అ)విక్షిశాంత ఇంజనీర్లు తెలంగాణ పునర్నిర్మాణంలో భాగమవుతున్నారు. ఆయన సమున్నత వారసత్వాన్ని కొనసాగించడానికి వారంతా సమాయత్తమవుతున్నారు.

వరద జలాల అంచనాకు ఫార్ములా
భారతదేశంలోని నదులపై గరిష్ట వరద ప్రవాహం అంచనాకు అత్యంత సాధారణంగా ఉపయోగించేవి డికెన్స్ ఫార్ములా, రైవ్స్ ఫార్ములా. ఈ ఫార్ములాలను ఉపయోగించి లెక్కించిన గరిష్ట వరద ప్రవాహం అంచనా వాస్తవ వరద ప్రవాహం పరిమాణానికి చాలా పెద్ద అంతరం ఉండటం అలీ నవాజ్ జంగ్ గమనించాడు. ఈ సూత్రాలకున్న పరిమితుల కారణంగానే ఈ అంతరాలున్నట్లు గమనించి వాస్తవ పరిస్థితులకు సరిపోయే విధంగా ఒక ఫార్ములాను అలీ నవాజ్‌జంగ్ రూపొందించారు. ఇదే ‘అలీ నవాజ్‌జంగ్ ఫార్ములా’గా ప్రసిద్ధి చెందింది. హైడ్రాలజీ పాఠ్యపుస్తకాలలో ఈ ఫార్ములాను డికెన్స్, రైన్స్ ఇతర ఫార్ములాల సరసన చేర్చి విద్యార్థులకు బోధిస్తారు.

తను రూపొందించిన ఫార్ములా సమర్థతను డింఢీ ప్రాజెక్టు గరిష్ట వరద ప్రవాహాన్ని అంచనా కట్టి, మిగతా ఫార్ములాల కన్న తన ఫార్ములా వాస్తవిక వరద జలాల పరిమాణానికి ఎంత దగ్గరగా ఉందో నిరూపించాడు. డింఢీ డ్యాం స్థలం వద్ద 1513 చదరపు మైళ్ల పరీవాహక విస్తీర్ణం కలిగి ఉన్న ఢిండీ నదిలో గరిష్ట వరద ప్రవాహం 2,76,000 క్యూసెక్కులని తేలింది. అలీ నవాజ్‌జంగ్ ఫార్ములాతో లెక్కిస్తే అది 2,71,500 క్యూసెక్కులు.

హైదరాబాద్ రాజ్యంలోని దాదాపు అన్నీ చిన్న, పెద్ద నదులపై అలీ నవాజ్ జంగ్ సర్వేలు చేశాడు. నివేదికలు సిద్ధం చేసి ఉంచాడు. ఏ నదిపైన ఎప్పుడైనా నివేదిక అందించడానికి సిద్ధంగా ఉండేవాడు. ఉదాహరణకు 1951లో ప్లానింగ్ కమీషన్ కృష్ణానదిపై నందికొండ ప్రాజెక్టు ప్రాథమిక నివేదికను ఇమ్మని అడిగినప్పుడు అప్పటికే అలీ నవాజ్ జంగ్ కృష్ణానదిపై సంపూర్ణమైన సర్వేలు చేసి ఉన్నాడు. ఆయన ఆనాటికి బతికి లేకున్నా నెలరోజుల్లోనే ప్లానింగ్ కమీషన్‌కు ప్రాజెక్టు ప్రాథమిక నివేదికను హైదరాబాద్ ఇంజనీర్లు అందించగలిగారు. పోచంపాడ్ ప్రాజెక్టుపై అప్పర్ కృష్ణా ప్రాజెక్టుపైన కూడా అలీ నవాజ్ జంగ్ జరిపి ఉంచిన సర్వేలు తర్వాత కాలంలో ఆ ప్రాజెక్టుల రూపకల్పనలో ఎంతగానో ఉపయోగపడ్డాయి.

ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ చెరువుల నిర్మాణం
1908లో మూసీనదికి వచ్చిన వరదలు, హైదరాబాద్ నగరంలో అవి సృష్టించిన బీభత్సం, సంభవించిన ప్రాణ నష్టం, ఆస్తి నష్టం అందరికీ తెలిసిందే. 28 సెప్టెంబర్ 1908న మూసీకి వచ్చిన వరద ఇప్పటికీ రికార్డే. ఆ వరద బీభత్సానికి మూసీ దక్షిణపు ఒడ్డున అర చదరపు మైలు విస్తీర్ణంలో సుమారు 19 వేల ఇండ్లు కూలిపోయాయి. 8000 వేల మంది నిరాక్షిశయులయ్యారు. మూడు కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా. పది నుండి పదిహేను వేల మంది వరదల్లో కొట్టుకుపోయి, చనిపోయినట్లు అంచనా. మూసీకి తరచుగా వస్తున్న వరదల నియంవూతణకు నివారణా చర్యలు సూచించమని మోక్షగుండం విశ్వేశ్వరయ్యని ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ హైదరాబాద్‌కు ఆహ్వానించాడు. హైదరాబాద్ విచ్చేసిన విశ్వేశ్వరయ్య తనకు సహాయకారిగా ఉండేందుకు ఎంపిక చేసుకున్న ఇంజనీర్లలో ప్రథముడు కూపర్ హిల్ విద్యార్థి అయిన అలీ నవాజ్ జంగ్. అప్పటికే ఆయన ప్రజాపనుల శాఖకు చీఫ్ ఇంజనీరుగా (సాగునీరు) వ్యవహరిస్తున్నాడు. వారిద్దరి మేథో మధనంలోంచి ఉద్భవించినవే హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ చెరువులు. ఈ రెండు చెరువులు మూసీ నదిలో వరదలని నియంవూతించడమే కాక నగరానికి శాశ్వత తాగునీటి వనరులుగా ఇప్పటికీ సేవలందిస్తున్నాయి.
ఉస్మాన్‌సాగర్ చెరువు మూసీనదిపై, హిమాయత్‌సాగర్ చెరువు మూసీకి ఉపనది అయిన ఈసీపై ప్రతిపాదించారు. ఉస్మాన్‌సాగర్ పేరు నిజాంమీర్ ఉస్మాన్ అలీఖాన్ బహదూర్ పేరుతో, హిమాయత్‌సాగర్‌ను బేరార్ రాకుమారుడు హిమాయత్ అలీఖాన్ బహదూర్ పేరుతో నిర్మించారు.
                                                                 -బతుకమ్మ నుండి.       
వ్యాసకర్త తెలంగాణ ఇంజనీర్స్ జెఏసి కో-చైర్మెన్. మొబైల్: 94910 60585
- శ్రీధరరావు దేశ్‌పాండే

26, జూన్ 2013, బుధవారం

బర్మా నిర్మాతలు మన వారే..!


అవును, బర్మా దేశపు(నేటి మయన్మార్) నిర్మాతలు మన తెలంగాణా వారే, క్రి.శ. 5 శతాబ్దంలో తెలంగాణా ను పాలించే రాజులు యుద్దంలో ఓడిపోవడంతో వారు తెలంగాణా ను వదిలి తూర్పు దిశలో ప్రయాణించి బర్మాను చేరుకున్నారట..! భారత దేశంలోని గోదావరి, కృష్ణా నదుల మధ్య ప్రాంతం నుండి వారు అక్కడికి వలస వెళ్ళినట్లు ఇప్పటికి వారి సాంప్రదాయ గ్రందాలలోను, జానపద గీతాల్లోనూ ఉండడం విశేషం, ఇలా బర్మా దేశపు రాజధాని నగరంతో పాటు అక్కడి ముఖ్య పట్టణాలను నిర్మించింది మన వారే, బర్మాలోని తెలంగాణా వాసులను మన్ లని పిలుస్తారు, వీరికి ప్రత్యేకంగా మన్ అనే రాష్ట్రంతో పాటు, డెమోక్రటిక్ పార్టి కుడా ఉంది, తెహిలం నాగరికత నుండి మేసపటోనియా నాగరికత వరకు, షోడశ జనపదాల్లో దక్షిణ భారతాన్ని ఏలిన అస్మక(రాజధాని పోతన) వరకు, మరుగున పడిన తెలంగాణా చరిత్ర వెలుగులు నింపుకుంటున్న తరుణంలో ఇలాంటి ఆసక్తికర విషయాలు బయటపడడం ఆనందదాయకం... క్రింది విడియోని  చూడండి. 
                                                                    -FROM TV9

25, జూన్ 2013, మంగళవారం

సౌత్ సూడాన్ విముక్తి పోరాటం..

               
(పై ఫోటో 1993లో కెవిన్ కార్టర్ అనే ఫోటోగ్రాఫర్ తీసారు, ఈ ఫొటోగ్రాఫ్ ద్వారా సౌత్ సూడాన్ పరీస్థితులు ప్రపంచానికి తెలిసాయి, తిండి లేక బొక్కలు తేలి కడు దీన స్థితుల్లో ఉన్న "ఆ పిల్లవాడు చనిపోతే తిందామని ఎదురుచూస్తున్న రాబంధు"ను ఫోటోలో చూడవచ్చు, ఈ ఫోటో కు పులేజ్టర్ అవార్డు వచ్చింది, కాని సూడాన్ లోని అంతర్యుద్దం కారణం గా అక్కడ నెలకొన్న కడు  దైన్య పరిస్థితులకు చలించిపోయిన ఈ ఫోటో తీసిన ఫోటోగ్రాఫర్ తీవ్ర మానసిక వేధనతో 1994లో మరణించాడు.)
                  మృత్యువుకు ఆకలి వేసింది అది సౌత్ సూడాన్ పై విరుచుకుపడింది, రక్తం తాగే నరరూప రాక్షసుల రూపంలో, అంతర్యుద్దం మిగిల్చిన నెత్తుటి ధారల రూపంలో, తాగడానికి గుక్కెడు నీరు లేక, తినడానికి పట్టెడు తిండి లేక,  ఆకలితో డొక్క లెండుక పోయిన, దాహంతో గొంతెండుకపోయిన అభాగ్యులు జీవణ సంద్యకు చేరుకుంటూ పెట్టె ఆక్రందనల రూపంలో, పాలు లేక, పాలు రాక ఆకలితో గుక్కపట్టి ఏడ్చి ఏడ్చి ఉదయించిన గంటల్లోనే అస్తమిస్తున్న పసిపిల్లల రూపంలో, ఎటు చూసినా దైన్యం, ఎటు చూసినా నైరాశ్యం, చీకట్లు తప్ప వెలుగులు చూడని బతుకులు, కటిక చీకటిలో భయంతో బిక్కు బిక్కు మంటూ కాలం వెళ్లబుచ్చుతున్న జనం. కారు, జీబు ఏ వాహనం వచ్చినా గుండెల్లో గుబులు, ఇళ్ళల్లోకి పరుగులు, రాక్షసులు వచ్చారేమోనని, తమ మాన, ప్రాణాలను కబలిస్తారని. జన్జావిడ్ల అకృత్యాలకు శవాల దిబ్బగా మారిన ఆ ప్రాంతం నీరు, సారవంతమైన భూమి లేని ఎడారి ప్రా0తం కాదు, ఖనిజాలు లేని గొడ్డు నేల కూడా కాదు, అన్ని ఉన్నా అక్కడివారికి అందని వైనం, పాలకుల వివక్ష ఆ ప్రాంతానికి శాపంగా మారింది.  ప్రపంచ విముక్తి పోరాటాల్లో 7 దశాబ్దాల కాలం జరిగి అత్యంత రక్త సిక్తం గా ముగిసిన ఆఫ్రికా ఖండపు సరికొత్త దేశం సౌత్ సూడాన్ విముక్తి పోరాట చరిత్రను ఇప్పుడు తెలుసుకుందాం.

                       సూడాన్ ఆఫ్రికా ఖండంలోని అతిపెద్ద దేశం, ఈ దేశం లో 597 ఆదిమ తెగలు, 400 బాషలు ఉన్నాయి, ఇక్కడి తెగలలో అత్యదికులు ఇస్లాం మతాన్ని స్వీకరించారు, బ్రిటిష్ పాలనలో ఉన్న రోజుల్లో ఈ దేశాన్ని విభజించు పాలించు అనే దోరణిలో వాళ్ళు పాలన సాగించారు, దక్షిణ సూడాన్ ప్రాంతం లో క్రైస్తవ మతం ప్రవేశపెట్టి ఆ ప్రాంతాన్ని ప్రత్యేకంగా చూడడం ప్రారంభించారు, నిజానికి సూడాన్ 1956 లో స్వాతంత్ర్యం పొందింది, అయినా దక్షిణ సూడాన్ వాళ్ళు తమకు స్వాతంత్ర్యం వచ్చిందని భావించలేదు, ఎందుకంటే సూడాన్ మొత్తం ఒక జాతి అనే భావన వారికి లేదు,  సూడాన్లో అత్యదికులు అరబ్బులు ఉంటారు, స్వాతంత్ర్యానంతరం వచ్చిన పాలకులు కుడా వారిమధ్య ఏర్పడ్డ ఆ అగాదాన్ని పూడ్చడానికి ప్రయత్నించలేదు సరికదా దానిని మరింత పెంచారు, దక్షిణ ప్రాంతం వారిని పట్టించుకోవడమే మానేశారు, ఫలితంగా ఆకలి చావులు, తీవ్రమైన కరువు,చివరికి అంతర్యుద్దం,  తమకు స్వేచ్చ కావాలంటూ 17 ఏళ్ళు జరిపిన ఈ పోరాటంలో 5 లక్షల మంది మరణించారు, ఈ పరిణామం ప్రపంచ దేశాల దృష్టి సుడాన్ పై పడేలా చేసింది, 1973లో సుడాన్ ప్రభుత్వం దక్షిణ సూడాన్ కు స్వయం ప్రతిపత్తి కల్పిస్తామనే హామీ ఇవ్వడం ద్వారా అంతర్యుద్ధం ముగిసింది, కాని పరిస్థితులలో మాత్రం మార్పు రాలేదు, ఒప్పందాలన్నింటిని తుంగలో తొక్కిన ప్రభుత్వం, కొంతమంది అరబ్బులను చేరదీసి జన్జావిడ్ ల పేరుతో దక్షిణ సూడాన్ వాసులపై దాడులు చేయించింది.  అసలే తిండి, నీరు లేక ఆకలితో అల్లాడుతున్న బక్క జీవులపై జన్జావిడ్ సబ్యులు చేసిన అకృత్యాలు అన్ని ఇన్ని కావు, గ్రామాల్లోకి వస్తూనే కనిపించిన వారిని కనిపించినట్టు కాల్చిపారెయ్యడం, ఆడవారిపై అత్యాచారాలు చెయ్యడం, చిన్నపిల్లలను నిర్దాక్షిణ్యం గా చంపివేయ్యడం, ప్రజలను ఇళ్ళల్లో పెట్టి సజీవ దహనాలు చెయ్యడం, జన్జావిట్ సభ్యులు గ్రామం లోకి వచ్చారంటే నిముషాలలో ఆ గ్రామం శవాల దిబ్బగా మారిపోవాల్సిందే,ఈ పరిణామాలతో 1983లో మరోసారి అంతర్యుద్దం మొదలయ్యింది. 

                    1989 లో సైనిక చర్య ద్వారా అదికారాన్ని చేజిక్కించుకున్న అల్ బషీర్ మరింత అరాచక పాలనను కొనసాగించాడు, సూడాన్ను ఏక పార్టీ ఇస్లామిక్ దేశంగా మార్చివేశాడు, మానవత్వ విలువలను మంట గలిపాడు, నిజానికి దక్షిణ సూడాన్ లోనే నైలు నది ఉన్నది కాని వాళ్లకు తాగడానికి నీళ్ళు లేవు, పంటలు లేవు, ఎటు చూసినా ఎడారిని తలపిస్తుంది, నీళ్ళను మొత్తంగా ఉత్తర సుడాన్ తన అవసరాలకు మల్లిన్చుకోవడంతో దక్షిన ప్రాంతానికి తాగడానికి గుక్కెడు నీళ్ళు లేని పరిస్థితులు దాపురించాయి, తినడానికి తిండి లేక బొక్కలు బయటకు తేలి బతికున్న కళేబరాల్లా అత్యంత దీన స్థితిలో బతుకులు వెల్లదీసారు, తాగడానికి నీరు దొరకని ఆ ప్రాంతంలో రక్తం ఏరులై పారింది, జన్జావిడ్ సబ్యుల అరాచకాలు బషీర్ పాలనలో మరింత పెరిగాయి, నిజానికి సూడాన్ దక్షిణ ప్రాంతంలో నీరు, సారవంతమైన భూములు, ఆయిల్, రబ్బర్, సహజ వాయు నిక్షేపాలకు అంతులేదు, అయినా చుక్క నీరు రాదూ, పంటలు పండవు, ఎటు చూసినా ఎడారే. ఖనిజాలు లభించేది ఇక్కడ, కాని వాటిని తరలించుకుని పోయి పరిశ్రమలు పెట్టేది అక్కడ, ఈ వివక్షను ఎదుర్కోవడానికి దక్షిణ సుడాన్ ప్రజలు "సూడాన్ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ" అనే దళాన్ని ఏర్పాటుచేసుకున్నారు. వీరు సూడాన్ సైన్యం తోను, జన్జావాట్ సబ్యులతోను పోరాటాలు చేసారు ఈ పోరాటంలో అనేక మంది సాదారణ ప్రజలు అసువులుబాసారు. అదే సమయంలో అమెరికాలోని ట్విన్ టవర్స్ ను  తీవ్రవాదులు కుల్చివేసారు, ఒసామా బిన్ లాడెన్ సుడాన్లో దాక్కున్నాడని సమాచారం తెలియడంతో అమెరిక ఆగ్రహించింది, సౌత్ సూడాన్ లోని పోరాటాలను గమనించి అక్కడి సుడాన్ పీపుల్ లిబరషణ్ ఆర్మీకి అత్యాధునిక ఆయుధాలు, డబ్బును అందించింది. ఈ పరిణామంతో సుడాన్ చిక్కుల్లో పడ్డది, బషీర్ ప్రజల్లో వ్యతిరేకత రాకుండా ఆర్థిక సంస్కరణలు ప్రవేశ పెట్టినా అవి సత్ ఫలితాలను ఇవ్వలేదు. సౌత్ సూడాన్ ప్రజలు గెరిల్ల పోరాటాల ద్వారా జన్జావిడ్ సబ్యులను మట్టుపెట్టడం ప్రారంబించారు. 2005 వరకు కొనసాగిన ఈ అంతర్ యుద్ధంలో 20 లక్షల మంది మరణించగా, మరో 40 లక్షల మంది నిర్వాసితులయ్యారు. 2005 సమగ్ర శాంతి ఒప్పందం ద్వారా 6 ఏళ్ళ పాటు సౌత్ సుడాన్ కు ప్రత్యేక ప్రభుత్వం ఏర్పాటుతో పాటు, ఆరేళ్ళ తర్వాత ప్రజాభిప్రాయ సేకరణకు అద్యక్షుడు బషీర్ ఒప్పుకున్నాడు. 6 ఏళ్ళ తర్వాత ప్రజాభిప్రాయ సేకరణలో 98.9% మంది ప్రజలు తమకు స్వేచ్చ కావాలని, సౌత్ సుడాన్ ప్రత్యేక దేశం కావాలని కోరుకున్నారు. వారి ఆకాంక్షలకు అనుగుణంగా జూలై 9, 2011 న సౌత్ సుడాన్ స్వాతంత్ర్య దేశంగా అవతరించింది. సల్వా కీర్ మయర్దిట్ స్వతంత్ర దక్షిణ సూడాన్ కు మొదటి అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. 

                       సౌత్ సూడాన్ ముందు ఎన్నో సవాళ్లు ఉన్నాయి, ముందుగా ప్రజలకు తిండి, విద్యనూ అందించాలి. దేశంలో ఉన్న ఆయిల్, గ్యాస్, రబ్బర్ యొక్క పరిశ్రమలన్నీ నార్త్ సుడాన్ లోనే ఉండడంతో కొంత కాలం ఆ దేశంపై ఆధారపడవలసి ఉంటుంది. అయితే ఇప్పుడు నార్త్ సుడాన్ వాసుల జీవితాల్లో చీకట్లు కమ్ముకున్నాయి, నీరు, సహజ వాయువులు, ఆయిల్ అన్ని సౌత్ సుడాన్ లోనే  ఉండడంతో తమ భవితవ్యంపై వారు బెంగ పడుతున్నారు. మొత్తానికి 70 ఏళ్ళ పాటు సాగిన సుదీర్గ పోరాటం లక్షలాది మంది నెత్తుటి తర్పణంతో ముగిసింది, నేడు సౌత్ సూడాన్ ప్రపంచం పటంలో స్వాతంత్ర దేశంగా కొనసాగుతుంది. 

                               అన్నార్థులు అనాధలుండని
                               ఆ నవయుగమదెంత దూరం
                               కరువంటూ కాటకమంటూ 
                               కనిపించని కాలాలేపుడో 
                               పసిపాపల నిదుర కనులలో 
                               మురిసిన భవితవ్యం ఏదో 
                               గాయ పడిన కవి గుండెలలో
                               రాయబడని కావ్యాలెన్నో...  


(ప్రపంచంలో  ఎన్నో ప్రాంతాలు పాలకుల వివక్షకు గురయ్యి, సహజ వనరుల దోపిడీకి గురయ్యి తమ ఉనికి కోసం పోరాడుతూ విజయాన్ని సాధించాయి అలంటి పోరాటాలలో సౌత్ సుడాన్ పోరాటం ఒకటి. వివక్షకు, దోపిడీకి వ్యతిరేఖంగా జరిగిన ఇలాంటి పోరాట చరిత్రలు తెలుసుకోవడం ఎంతైనా అవసరమని  భావించి ఈ పోస్ట్ చేసాను..)

జన్జావిడ్ - ఒంటెలు గుర్రాలను మేపుతూ ఎడారులలో జీవించే అరబ్బుల సమూహం