దేశ స్వాతంత్రోద్యమం తరవాత మల్లి అంత పెద్ద ఉద్యమమంట, లక్షలాది మంది రోడ్ ల మీదికి వస్తున్నారట, నిర్ణయం వెనక్కి తీసుకోకపోతే ఈ ఉద్యమం మరింత తీవ్రమై దేశ విభజన జరిగినా ఆశ్చర్య పోవాల్సిన పని లేదట..? విభజన వళ్ళ తెలంగాణా అందకారమవుతుందట. నీటి యుద్ధాలు జరుగుతాయట. హైదరాబాద్ ను అభివృద్ధి చేసింది సీమంద్రులే అని తెలంగాణా ప్రజలకు అర్థం అవుతున్నదంట, విడిపోవడం ఆంద్ర వాళ్ళకు ఇష్టం లేదు కాబట్టి, తెలంగాణాలో ఎవడైనా జై తెలంగాణ అంటే తన్నే పరిస్థితికి ఇక్కడి జనం వచ్చారంట.. తెలంగాణా ఇస్తున్నామని కాంగ్రెస్ ప్రకటించనా తెలంగాణావాదులు హర్షించలేదట, పండుగ చేసుకో లేదట.. అంటే తెలంగాణా వాదులంతా సమైక్యందులు గా మరిపోయరట..ఇవన్ని సీమంద్రుల మాటలు.
హైదరాబాద్లో లక్షల మంది వచ్చి నగరాన్ని దిగ్బందిన్చినా సి ఎం కు జనం కనిపించలేంట, కాని ఈ రోజు సీమంద్రలో లక్షల మంది రోడ్ ల మీదికి వస్తున్నారట.. వాళ్ళను అదుపు చెయ్యలేక పోతున్నాడట. నిర్ణయం వెనక్కి తీసుకుంటే తెలంగాణా వారిని అదిలించి , బెదిరించి అవసరమనుకుంటే పిట్టల్ల కాల్చిపారేసి తెలంగాణా ఉద్యమకారుల సమాధులపై తెలుగువారి ఆత్మగౌరవాన్ని నిలబెడతాడట..! నిన్నటి దాక తెలంగాణా విషయం ప్లీనరీలో స్పష్టంగా చెప్పినం అని జగన్ పార్టీ వాళ్ళన్నారు, వాళ్ళు ఎం చెప్పిర్రో తెలవలేదు కాని ఈ రోజు స్పష్టంగా తెలుస్తోంది, వాళ్ళు చెప్పింది సమక్యంద్ర కె కట్టుబడి ఉన్నామని, తెలంగాణా ఇస్తే కొంగ జపాలు చేస్తారని. కొండమ్మకు నేడు జగన్ రాక్షసుడిలా కనిపిస్తున్నాడట.. ఎన్ని డ్రామాలు.. మొత్తం మీద మరో ప్రా రా పా లా వై కా పా మిగిలిపోయింది.
తెలంగాణ కు కట్టుబడి ఉన్ననని చెప్పి పార్లమెంట్లో మాత్రం లొల్లి చేయిస్తూన్న చంద్రబాబు, తనతో కొంతకాలంగా సక్యంగా లేని హరి కృష్ణను సమైక్యంద్ర కోసం బాలి పశువును చేసాడు. తెలంగాణాలో పుంజుకోవడానికి ఉద్యమం లో కీలక పాత్ర పోషించిన ఒక గ్రూప్ ను పార్టిలో చేర్చుకోవడం ద్వార యువతకు సీట్లు ఇచ్చామని చెప్పుకోవచ్చు, పార్టీ ని బలోపేతం చేసుకోవచ్చనే ఆలోచనలో బాబు ఉన్నారని సమాచారం. ఇక హైదరాబాద్ అంటే ఏంటో తెలియని సీమంద్రులకు హైదరాబాద్ ను నిర్మించింది నేనే, దాన్ని అభివృద్ధి చేసింది నేనే అని చెప్పి నమ్మించడం పెద్ద కష్టమేమి కాదు, ఇలాంటి రాజధానిని నేను మాత్రమె నిర్మించగలను అని సీమంద్రులకు చెప్పి అక్కడ అధికారంలోకి రావాలని అనుకుంటున్నాడు.
ఎవరి గేమ్ వాళ్ళు ఆడుతుంటే అందరి గేమ్ కాంగ్రెస్ ఆడుతోంది. ఇప్పుడు సోనియా ముందు మోకరిల్లాల్సిన పరిస్థితి టి అర్ ఎస్ కు వచ్చింది, నాయనో బయన్నో కె సి అర్ ను పార్టీలో విలీనం చేసుకోవాలని కాంగ్రెస్ చూస్తోంది, అందుకే కె సి అర్ ని బలహీన పరచడానికి ఆ పార్టీని చీల్చే వ్యూహం చేస్తోంది. అటు సీమంద్ర లోఅశాంతిని రేపి జనాన్ని రెచ్చగొట్టి సీమంద్రలో చెంద్రబాబు ను అడ్డుకోవాలని కాంగ్రెస్ వ్యూహం.
సీమంద్రలో ఉద్యమం చెయ్యడానికి ప్రోత్సాహం పూర్తిగా కాంగ్రెస్ నాయకుల నుండే వస్తోందన్నది తెలుస్తూనే ఉది. ఎందుకంటే రాజీవ్ , ఇందిరా విగ్రహాల కూల్చివెత సమయంలో సి ఎం, సీమంద్ర మంత్రులతో సమావేశం నిర్వహించిన అనంతరం విగ్రహాలు కూల్చడం మంచి సాంప్రదాయం కాదు అని ఆయన చెప్పగానే విగ్రహాల విద్వంసం ఆగిపోయింది. అంటే ఏ పార్టీ వాళ్ళు చేస్తున్నారో తెలుసుకోవడానికి ఈ సంఘటనే ఒక ఉదాహరణ. అసలు సీమంధ్రులు చేస్తున్న ఉద్యమ లక్ష్యం ఏమిటి..? తెలంగాణ వాళ్ళతో కలిసుండాలనా.. లేక హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతం చేయ్యలనా..?
లక్ష్మి పార్వతి కి సమైక్యంద్ర ఉద్యమం స్వాతంత్రోద్యమం లా కనిపిస్తుందట.. దేశ స్వాతంత్రోద్యమం ఇక్కడి ప్రజల హక్కులను కాపాడటానికి, స్వేచ్చ కోసం జరిగింది, కాని సమైక్యంద్ర ఉద్యమం పక్కవాని హక్కులను హరించడానికి, పక్కవాడు ఎక్కడ బాగుపడతాడో అన్న ఓర్వలేనితనం నుండి, మాకు దక్కంది ఎవరికీ దక్కకూడదు, మేము బాగు పడితే చాలు పక్కవాడు నాశనం ఐన పరవాలేదు అనే కుస్వార్ధం నుండి పుట్టింది. అక్రమ ఆస్తులు కూడబెట్టుకొని తెలంగాణాలో ముఖ్యంగా హైదరాబాద్ లో ఉంటున్న వాళ్ళు, అక్రమంగా ఉద్యోగాల్లో చొరబడ్డ వాళ్ళు, అక్రమ ప్రమోషన్ లు పొందిన వాళ్ళు ఈ ఉద్యమానికి నాయకులు. ఊరిలో ఉన్న నాలుగఐదు పాటశాలల విద్యార్థులను రోడ్ల్ పైకి తీసుకొచ్చి, మీడియా వాళ్ళు ఫోటోలు, విడియోలు తీసుకున్న తర్వాత ఇంటికి వెల్లిపొతే అది ఉద్యమం, పోట్లాల్లో అన్నం కూరలు తెచ్చుకొని వంట వార్పూ అని నాటకాలు చెయ్యడం మరో వింత. అర్ టి సి బస్సులు నడపరు, కాని ప్రవేట్ బస్సులు ఎదేచ్చాగా తిరుగుతాయి, ప్రభుత్వ పాటశాలలు బంద్, కాని కార్పోరేట్ పాటశాలలు నడుస్తాయి, జెన్కో విద్యుత్ కేంద్రాలు బంద్, లాంకో విద్యుత్ కేంద్రాలు చాలున్టాయ్, మనకు ఇప్పుడు నీళ్ళు రాకపోయినా పర్వాలేదంట, నల్గొండలో తాగునీరు కలుషితమై బొక్కలు వంకరపోయినా వాళ్ళకు మాత్రం మూడు పంటలకు నీళ్ళు కావాలట. వాళ్ళ బాగుకోసం మనం పాటుపడాలంట.
ఇద్దరు వ్యక్తులు కలిసుండాలంటే ఇద్దరి మద్య అవగాహన ప్రేమ ఉండాలి, అవి లేనప్పుడు ఒకరు విడిపోతానంటే మరొకరు చెయ్యల్సిన్దేమిటి..? తను చేసిన తప్పును దిద్దుకుంటానని హామీ ఇచ్చి, తన లో వచ్చిన మార్పును చూపించాలి, నమ్మకం కలిగించాలి. కాని నువ్వు నానుండి విడిపోవడానికి వీలు లేదు అని బలవంతం చేస్తే అది ఉన్మాదం అవుతుంది, మరి ఈ రోజు సీమాంద్రులు చేస్తున్నది ఏమిటి...?
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి