* 12 ఏళ్ళుగా గుర్తురాని ప్రజల ఆకాంక్ష కాంగ్రెస్ కు సరిగా ఎలక్షన్లకు ఏడాది ముందే ఎందుకు గుర్తుకు వచ్చింది..?
* అది మోడీ సభకు 10 రోజుల ముందే తీర్మానం ఆగ మేఘాల మీద ఎందుకు చెయ్యవలసి వచ్చింది..?
జూలై 30 తెలంగాణా తీర్మానం చెయ్యడం ద్వార కాంగ్రెస్ పొందిన లాభాలు:-
* వై కాపా తెలంగాణా లో కాలి అయ్యింది.
* నరేన్ద్ర మోడికి నవభారత యువభేరి లో చెప్పడానికి ఏమి లేకుండా పోయింది. బి జీ పీ ని ఎదగకుండా దెబ్బకొట్ట గలిగారు.
* అంతవరకు కె సి అర్ దగ్గరకు కాంగ్రెస్ వచ్చే పరిస్థితి కాని ఒక్కసారి ప్రకటన రాగానే కాంగ్రెస్ దగ్గరికే కె సి అర్ వెళ్ళాల్సిన అనివార్య పరిస్థితి వచ్చింది.
* సమైక్యంద్ర ఉద్యమాన్నిలెవదీయడం తో చంద్ర బాబు ఇరుకునపడ్డాడు, రెండు రాష్ట్రాలుంటే తప్పేంటి అన్న చంద్ర బాబు తర్వాత గొంతు సవరించుకొని కాంగ్రెస్ను దుమ్మత్తి పొయ్యడం ప్రారంభించారు. ఎన్ డి ఎ హయాంలో రాష్ట్ర విభజనను అడ్డుకున్నది తానే అంటూ తన అసలు స్వారూపం బయటపెట్టి, సీమంధ్రుల మనసు గెలుచుకోవాలని తెగ తాపత్రయ పడుతున్నాడు. కాంగ్రెస్ ఆటలో బాబు పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా తయారయ్యింది.
* హైదరాబాద్ ను UT చేస్తామనే ప్రకటనలతో MIM బయపెట్టి తనదారిలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తుంది.
* సీమంద్రలో బిజేపీని శాశ్వతంగా రాకుండా చెయ్యాలనే వ్యూహంలో భాగంగా సమైక్యంద్ర ఉద్యమాన్ని పోలీస్లు, మీడియా సహాయంతో నడిపిస్తోంది.
* బి జె పీ సీమంద్రులకు అన్యాయం జరగా కుండా రాష్ట్ర విభజన జరగాలి అంటే అలంటి ప్రకటనలను చూపించి తెలంగాణా ప్రాంతం లో ఆ పార్టీ పై అనుమానాలు కలిగేలా చేస్తోంది.
* వై కా పా నమ్ముకున్న రాజశేకర్ రెడ్డి సానుభూతి కాస్త సమైక్యంద్ర ఉద్యమం తో కరిగిపోయింది . ఇప్పుడు వై కా పా పరిస్థితి కాంగ్రెస్ తో కలిసి సాగడం మినహా మరో ప్రత్యామ్నాయం లేదు.
ఇలా కాంగ్రెస్ ఆడుతున్న ఆటా నాదే.. వేట నాదే అంటూ ఆడుతున్న ఈ ఆటలో చివరికి వేట(ఓట్లు) ఎవరికీ దక్కుతుందో..?
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి