హోం

30, మే 2013, గురువారం

కారేక్కనున్న కాంగ్రెస్ నాయకులు..


జూన్ 2న టీఆర్‌ఎస్‌లో చేరుతాం: టీ కాంగ్రెస్ ఎంపీలు
హైదరాబాద్: టీకాంగ్రెస్‌కు చెందిన ముగ్గురు సీనియర్ నేతలు ఎట్టకేలకు పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. పెద్దపల్లి ఎంపీ వివేక్, నాగర్ కర్నూల్ ఎంపీ మందా జగన్నాథంతోపాటు మాజీ పీసీసీ అధ్యక్షుడు, పార్టీ సీనియర్ నేత కె. కేశవరావులు టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు స్ఫష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణపై ఇచ్చిన మాట నిలబెట్టుకోనందుకే ఆ పార్టీని వీడుతున్నట్లు వారు వెల్లడించారు. ఎంపీ వివేక్ ఇంట్లో భేటీ అయిన నేతలు టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌తో చర్చలు జరిపిన అనంతరం మీడియాతో మాట్లాడారు. జూన్ 2న నిజాం కాలేజీ మైదానంలో భారీ బహిరంగ సభ నిర్వహంచి వేలాది మంది ఉద్యమకారుల సమక్షంలో తెలంగాణ ఉద్యమ పార్టీ టీఆర్‌ఎస్‌తో కలుస్తామని కేకే చెప్పారు. ఈ సమావేశానికి టీఆర్‌ఎస్ నేతలు కేటీఆర్, వివేక్‌లతో పాటు మందా కుమారుడు, కేకే కుమారుడు తదితరులు హాజరయ్యారు. తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు, నేతలను పార్టీలోకి సాధరంగా ఆహ్వానిస్తున్నామని, వారు తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమైనదని ఉద్యమనేత కేసీఆర్ అన్నారు. వీరి చేరికతో ఉద్యమానికి వెయ్యి ఏనుగుల బలమొచ్చిందన్నారు.

నేటితో డెడ్‌లైన్ ముగిసింది: కేకే 
తెలంగాణపై తేల్చాలని తాము కాంగ్రెస్ అధిష్ఠానానికి పెట్టిన డెడ్‌లైన్ నేటితో ముగిసిందని, అందుకే ఉద్యమపార్టీలో చేరాలని నిర్ణయించుకున్నామని కాంగ్రెస్ సీనియర్ నేత కే కేశవరావు తెలిపారు. తెలంగాణ కోసం పదేళ్లు వేచి చాశామని, చేయాల్సిన ఉద్యమాలన్ని చేశామని ఆయన అన్నారు. టీఆర్‌ఎస్ పార్టీ ప్రజలతో మమేకమై ఉద్యమాన్ని కొనసాగిస్తుందని అందుకే ఉద్యమపార్టీతో కలిసి తెలంగాణ కోసం పని చేయాలని నిర్ణయించుకున్నామని కేకే వ్యాఖ్యానించారు. ‘మా నిర్ణయం స్వార్థంతో తీసుకున్నది కాదు. మేం తీసుకున్న నిర్ణయాన్ని ఎన్నికలతో ముడి పెట్టొద్దు. ఆంధ్రా మీడియా నాపై ఇష్టమొచ్చినట్టు రాయొద్దు’ అని కేకే విజ్ఞప్తి చేశారు.

కాంగ్రెస్ అధిష్టానానికి తాము ఇచ్చిన గడువు ఇవాళ సాయంత్రం వరకు ఉందని అంత వరకు వేచి చూస్తామని కేకే స్పష్టం చేశారు. సాయంత్రం వరకు కేంద్రం నిర్ణయం కోసం ఎదురు చూస్తామని తెలిపారు. సాయంత్రంలోగా అధిష్టానం నుంచి నిర్ణయం వస్తుందని అనుకుంటున్నారా? అని విలేకరులు అడిగిన ప్రశ్నపై కేకే స్పందించారు. ఇన్నేళ్లుగా రాని నిర్ణయం సాయంత్రంలోగా వస్తుందని తాము అనుకోవడంలేదని ఆయన అన్నారు.

తెలంగాణ వాగ్దానాన్ని అధిష్ఠానం మరిచింది: మందా 
డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తున్నామని 120 కోట్ల భారతీయుల సాక్షిగా పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసిందని కాంగ్రెస్ ఎంపీ మందా జగన్నాథం గుర్తు చేశారు. ఆనాడు తెలంగాణ ఇస్తున్నామని కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన వాగ్ధానాన్ని అధిష్ఠానం మరిచిందని మందా ఆవేదన వ్యక్తం చేశారు. ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ ఇవ్వాలని అధిష్ఠానం అనేకసార్లు కోరామని తెలిపారు. అయినా కాంగ్రెస్‌పార్టీ పట్టించుకోలేదని ఆవేదనతో అన్నారు. తమ పార్టీ ఇచ్చిన వాగ్దానం నిలబెట్టుకోలేక పోయిందని తెలిపారు. ఇచ్చిన మాట తప్పడమే కాంగ్రెస్ సిద్థాంతమా చెప్పాలని బొత్సను ప్రశ్నించారు. ఇచ్చిన మాటకు కట్టుబడి తెలంగాణ ఇవ్వని కాంగ్రెస్‌లో ఉండదలచుకోలేదని తెలిపారు. ‘మా పార్టీ తెలంగాణను ప్రకటిస్తుందనే ఆశలేదు. అందుకే మేం కాంగ్రెస్‌ను వదిలి ఉద్యమపార్టీలో చేరాలని నిర్ణయించుకున్నాం’ అని వెల్లడించారు. జూన్ 2న నిజాం కాలేజీ గ్రౌండ్‌లో జరిగే బహిరంగ సభలో తాము ఉద్యమపార్టీలో చేరుతున్నామని మందా ప్రకటించారు. స్వపక్షంలో ఉండి తెలంగాణ ఆకాంక్షను పార్లమెంట్ మెట్లపై కూర్చుండి పార్లమెంట్‌లో వెల్లడించామని తెలిపారు.

దళితులమైనందుకేనా మమ్మల్ని పట్టించుకోలేదు: మందా 
సొంత పార్టీ ఎంపీలమైన తాము తెలంగాణపై తేల్చాలని కోరుతూ పార్లమెంట్ మెట్లపై కూర్చుని నిరసన తెలిపినా అధిష్ఠానం పట్టించుకోలేదని మందా జగన్నాథం కాంగ్రెస్‌ను విమర్శించారు. తెల్లవార్లు తాము పార్లమెంట్ భవనం మెట్లపై కూర్చుని తెలంగాణ కోసం నిరసన తెలుపుతున్నా పట్టించుకోలేదని దుయ్యబట్టారు. అదే సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీ, అగ్రవర్ణ నేత కావూరి సాంబశివరావు తనకు కేంద్ర మంత్రి పదవి ఇవ్వలేదని కాంగ్రెస్ అధినేత్రి సోనియాను, రాహుల్‌ను బహిరంగంగా విమర్శించినపుడు, కాంగ్రెస్‌పార్టీన తిట్టినపుడు పీసీసీ చీఫ్ బొత్స, సీఎం కిరణ్ ఇతర నేతలు ఆయనను బుజ్జగించే ప్రయత్నం చేశారని, అదే తాము దళితులమైనందుకేనా తమను పట్టించుకోలేదని మందా తీవ్రంగా దుయ్యబట్టారు. ముగ్గురు దళిత ఎంపీలు తెలంగాణ కోసం నిరసన తెలియజేస్తే పట్టించుకోరా? దళిత ఎంపీలను అవమానిస్తారా? అని నిలదీశారు. కాంగ్రెస్ పార్టీ అగ్రవర్ణాలకు కొమ్ము కాస్తుందని విమర్శించారు. స్వపక్షంలో ఉండి ప్రజల ఆకాంక్షను పార్లమెంట్‌లో తెలియజేయడం చరిత్రలో ఎక్కడా లేదని విమర్శించారు.

తెలంగాణ సాధించే సమయం ఆసన్నమైంది: వివేక్ 
త్వరలోనే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధిస్తామని కాంగ్రెస్ ఎంపీ వివేక్ అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించే సమయం ఆసన్నమైందని ఆయన తెలిపారు. డిసెంబర్ 9న తెలంగాణ ప్రకటన వెలువడగానే సీమాంధ్ర నేతలు ఒక్కటై రాజీనామాల డ్రామాలాడి తెలంగాణను అడ్డుకున్నారని వివేక్ విమర్శించారు. ఇవాళ మనమంతా ఒకటై తెలంగాణ కోసం పోరాడి తెలంగాణ సాధించే అవకాశం చిక్కిందని తెలిపారు. ఉద్యమపార్టీలో చేరి తెలంగాణ కోసం పోరాడండి అని తమ కార్యకర్తలు చేసిన సూచన మేరకే తాము ఉద్యమపార్టీలో చేరుతున్నామని వివేక్ పేర్కొన్నారు. జూన్ 2న నిజామ కళాశాల మైదానంలో జరిగే బహిరంగ సభలోటీఆర్‌ఎస్‌లో చేరనున్నట్టు ఆయన తెలిపారు.
ఉద్యమపార్టీలో చేరుతా: మర్రి జనార్దన్‌రెడ్డి
మహబూబ్‌నగర్: తెలంగాణలో టీడీపీ దుకాణకం ఖళీ అవుతోంది. ‘నేను తెలంగాణ బిడ్డను. అందుకే సీమాంధ్ర పార్టీని వీడాను’ అని టీడీపీకి రాజీనామా చేసిన మర్రి జనార్ధన్‌రెడ్డి అన్నారు. తాను ఉద్యమపార్టీ టీఆర్‌ఎస్‌లో చేరనున్నట్టు ఇవాళ ప్రకటించారు. జూన్ 2న నిజాం కాలేజీ మైదానంలో జరుగబోయే బహిరంగ సభలో తాను టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ చేతుల మీదుగా టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకోనున్నట్టు వెల్లడించారు. ఉద్యమపార్టీ ఆహ్వానం మేరకే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని, తెలంగాణ కోసం ఉద్యమిస్తున్నది టీఆర్‌ఎస్ ఒక్కటే, టీఆర్‌ఎస్‌తోనే సాధ్యమని ఆయన తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో తాను కీలక పాత్ర పోషించనున్నట్టు పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో 1969 నుంచి ఇప్పటి వరకు వేలాది మంది ఆత్మహత్యలు చేసుకున్నారని జనార్దన్ ఆవేదన వ్యక్తం చేశారు.
                                                                  -from namaste telangana

29, మే 2013, బుధవారం

జూన్ 14న ఛలో అసెంబ్లీ..!


ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం తెలంగాణ రాజకీయ జేఏసీ ఉద్యమాన్ని ఉధృతం చేసింది. ఇప్పటికే పలు కార్యక్రమాలతో దూసుకెళ్తున్న జేఏసీ ‘ఛలో అసెంబ్లీ’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జూన్ 14న ‘ఛలో అసెంబ్లీ’ కార్యక్రమం చేపడుతున్నట్లు టీ జేఏసీ చైర్మన్ కోదండరాం స్పష్టం చేశారు. టీఎన్జీవో భవన్‌లో టీ జేఏసీ సమావేశం ముగిసిన అనంతరం కోదండరాం మీడియాతో మాట్లాడారు. లక్షలాదిగా హైదరాబాద్‌కు తరలిరావాలని తెలంగాణ ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. జూన్ 1 నుంచి ‘ఛలో అసెంబ్లీ’ కోసం తెలంగాణవ్యాప్తంగా విస్తృత ప్రచారం చేపడుతామని చెప్పారు. కాంగ్రెస్, టీడీపీపై ఒత్తిడి తెచ్చేలా ప్రచారం ఉంటుందన్నారు. ప్రతి తెలంగాణవాది ‘ఛలో అసెంబ్లీ’ కార్యక్రమాన్ని సీరియస్‌గా తీసుకోవాలని పేర్కొన్నారు. 

సీమాంధ్ర పార్టీలకు దిమ్మ తిరిగేలా ఛలో అసెంబ్లీ నిర్వహించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవాలని పిలుపునిచ్చారు. తెలంగాణపై ప్రతిసారి వలస పాలకులు మోసం చేస్తున్నారని తెలిపారు. పాలకులు, ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికే ఛలో అసెంబ్లీ కార్యక్రమం అని చెప్పారు. ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలిపే హక్కు తెలంగాణ ప్రజలకు ఉందని పేర్కొన్నారు. ‘ఛలో అసెంబ్లీ’ కార్యక్రమానికి ప్రభుత్వం అనుమతివ్వాలని కోరారు. తాము శాంతియుతంగానే ఛలో అసెంబ్లీ కార్యక్రమం చేపడుతామని తెలిపారు. టీఎన్జీవో భవన్‌లో జరిగిన ఈ సమావేశానికి టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డితో పాటు ఉద్యోగ సంఘాల నేతలు, జేఏసీలో భాగస్వామ్యులైనటువంటి ఇతర సంఘాల నేతలు హాజరయ్యారు. సుమారు గంట పాటు జరిగిన సమావేశంలో ఛలో అసెంబ్లీ కార్యక్రమాన్ని ఎలా నిర్వహించాలి అనే అంశంపై చర్చించారు.

20, మే 2013, సోమవారం

విజన్ ఉన్న నేత కేసీఆర్..!



ఆంధ్రాపార్టీలు తెలంగాణకు అసలు శత్రువులే అయినా...ఢిల్లీ పార్టీలు కూడా ఆంధ్రా పెత్తందారులకు కీలుబొమ్మలే! గతంలో బీజేపీ కావచ్చు. ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ కావచ్చు. తెలంగాణతో ఆటలాడుకున్నవే! ఆ రెండు పార్టీలే కాకుండా ఉభయ కమ్యూనిస్టు పార్టీలూ ఆంధ్రా అజమాయిషీలో నడిచే ఢిల్లీ పార్టీలే! బయటిపార్టీల అవసరం ఇవాళ తెలంగాణకు లేదు. దానికో ఇంటిపార్టీ వుంది. ఆంధ్రా, ఢిల్లీ పార్టీలను కాదని తెలంగాణ తన సొంత కాళ్లపై నిలబడి తన కల నిజం చేసుకుంటానంటున్నది. ఇవాళ తెలంగాణ ఎప్పుడొస్తుందనేది సమస్య కాదు. తెలంగాణ ఇంటిపార్టీని ఎలా గెలిపించుకుంటాం? వచ్చే తెలంగాణ పునర్నిర్మాణం ఎలా జరుపుకుంటాం అనేవే కీలక ప్రశ్నలు. అందుకే ఇవాళ తెలంగాణ నాయకత్వానికి దూర దృష్టితో కూడిన దార్శనికత అవసరం. అలాంటి దార్శనికత కేసీఆర్‌లో మొదటి నుంచి వుంది.

నేను వ్యక్తిగతంగా కేసీఆర్‌ను కలిసిన సందర్భాలున్నాయి. ఆయనను కలవడానికి ఎవరు వచ్చినా వారు ఏ రంగం వారైతే ఆ రంగం గురించి చర్చించడం గమనించాను. అలాంటి దార్శనికత (vision) నేను కేసీఆర్‌లోనే చూడగలిగాను. చంద్రబాబుకు కూడా విజన్ 2020 ఉండేది కదా అని ఎవరైనా అనవచ్చు. అది ప్రపంచ బ్యాంకు చంద్రబాబుకు అప్పగించిన విజన్. ప్రజల బతుకులను తాకట్టు పెట్టే విజన్. పరాయి శక్తుల కోసం పనిచేసే నాయకుడి విజన్ వేరు. సొంత రాష్ట్రం కోసం పోరాడే నాయకుడి విజన్ వేరు. కేసీఆర్ విజన్‌పజల విజన్, స్వావలంబన విజన్. తెలంగాణ నగదు ఖజానాతో ఈదేశంలో విలీనమైంది.అలాగే ఆంధ్రా ప్రాంతంతో విలీనం జరిగిన (1956) నాడు తెలంగాణ మిగులు బడ్జెట్‌ను కలిగివుంది. దాని మీద ఖాళీ ఖజానాతో నకనకలాడుతున్న ఆంధ్రరాష్ట్ర పాలకుల కన్నుపడింది. అక్రమంగా విలీ నం జరిగిపోయింది. నిధుల మళ్లింపు మొదలైంది. ప్రభుత్వ ఆదాయం తెలంగాణ నుంచి అధికం. వ్యయం మాత్రం సీమాంవూధపాంతంలో అధికం. ఈ దోపిడీ 1956 లో మొదలై... ఇంకా సాగుతున్నది. ఈ 57 ఏళ్లలో ఈ విషయాన్ని వెలికితీసిన తెలంగాణ నాయకుడిని ఎవరినైనా చూశామా? ఇవాళ ఆర్థికవేత్తలు, ఇంజనీర్లు, ఐఏఎస్‌లను తెలంగాణ కలిగివుంది. వారి పరిజ్ఞానాన్ని, సేవల ను తెలంగాణ ప్రాంతానికి ఉపయుక్తంగా మలిచిన ఏ నాయకుడినైనా చూశామా? ఆ నాయకుణ్ణి ఇవాళ మనం కేసీఆర్‌లో చూస్తున్నాం.

2012-13 రాష్ట్ర బడ్జెట్ ప్రకారం రాష్ట్ర ఆదాయం సుమారు రూ. 62వేల కోట్లు. అందులో ఒక్క తెలంగాణ నుంచి వస్తున్న ఆదాయమే సుమారు రూ.47 వేల కోట్లు. మిగిలిన 15 వేలకోట్లు మాత్రమే సీమాంధ్ర ప్రాంతం నుంచి వస్తున్నది. కొందరు అనుకోవచ్చు హైదరాబాద్ నగరం ఆదాయం కూడా తెలంగాణ ఖాతాలోనే చూపించుకుంటున్నారని! 1956లో కూడా హైదరాబాద్ ఆదాయం తెలంగాణదే అయినప్పుడు, ఇప్పుడు మాత్రం హైదరాబాద్ ఆదాయం తెలంగాణది కాక ఎవరిదవుతుం ది? తెలంగాణ ఏర్పడ్డాక హైదరాబాద్ ఆదాయం తగ్గుతుందనడం తప్పు. తెలంగాణ అభివృద్ధిచెందే కొద్దీ పెరుగుతుందే తప్ప తగ్గదు. కొందరి వాదన ప్రకారం తగ్గినా అది ఓ నాలుగు వేలకోట్లకు మించదు. అప్పుడు కూడా తెలంగాణ ఆదాయం రూ. 40 వేల కోట్లకు పై మాటే. ఆంధ్రా ఆదాయం రూ. 20 వేల కోట్లకు మించదు. మనం ఏ కోణంలో చూసినా తెలంగాణ మిగులు బడ్జెట్ కలిగి వుంటది! మరి ఇంతకాలం ఏం జరిగింది? కేసీఆర్ మాటల్లోనే చెప్పాలంటే... ‘సొమ్మొకడిది, సోకొకడిదయంది’ రేపటి తెలంగాణకు వనరులే కాదు అపారమైన నిధులు కూడా వున్నాయి. తెలంగాణ ఆదాయానికి కేంద్ర గ్రాంట్లు, వాటాలు , లోన్లు తోడైతే .. రేపటి తెలంగాణ బడ్జెట్ రూ. 1,10, 000 కోట్లది అవుతది. ఇన్ని నిధులతో అద్భుతమైన తెలంగాణ నిర్మాణం చేసుకోవచ్చు.

అనేక నదులు కలిగివుండి కూడా తెలంగాణ భూములు అల్లాడుతున్నాయి. పచ్చని గ్రామాల పునర్నిర్మాణమే రేపటి తెలంగాణకు మొదటి ఎజెండా కావాలె. ప్రతి పల్లెకు సాగు, తాగునీరు అందాలె. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరందించడమే లక్ష్యమని కేసీఆర్ అంటున్నారు. తెలంగాణలో 119 నియోజక వర్గాలు ఉండగా, అందులో 18 నియోజక వర్గాలకు సాగునీరు ఇప్పటికే లభిస్తున్నది. అవి పోనూ అర్బన్ నియోజకవర్గాలు మరో 32 వరకు వున్నాయి. అవిపోతే మిగిలేవి 70 నియోజక వర్గా లు. ఈ 70 నియోజక వర్గాల్లోని 70 లక్షల ఎకరాలకు సాగునీరు అందివ్వాల్సివుంటుంది. నదులు, ఉపనదుల ద్వారా తెలంగాణ సుమారు వెయ్యి టీఎమ్‌సీల నీటిని వినియోగంలోకి తెచ్చుకోవచ్చు. ఈ నీటితో 70 లక్షల ఎకరాలకు సాగునీరందివ్వడమే కాదు, ప్రతిపల్లె మనిషి దూప తీర్చవచ్చు. సీమాంధ్ర ప్రభుత్వాలు తెలంగాణలో తలపెట్టిన వంకర టింకర ప్రాజెక్టులను పునఃసమీక్షించాలె. గ్రావిటీ ప్రాజెక్టులకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలె. అనివార్యమైన చోట ఎత్తిపోతల ప్రాజెక్టులనూ చేపట్టాలె. జూరాల నుంచి వరంగల్ జిల్లాలోని పాకాల దాకా గ్రావిటీ ద్వారా కృష్ణా నీటిని పైసా ఖర్చు లేకుండా అందివచ్చు. ఈ ప్రాజెక్టు కాలువ మహబూబ్‌నగర్ జిల్లా జూరాల వద్ద మొదలై నాలుగు జిల్లాల గుండా వరంగల్ జిల్లా పాకాల చెరువుకు చేరుకుంటుంది. దాని ప్రయాణం సుమారు 425 కిమీలు. ఎన్ని గ్రామాలు ఎన్ని రైతు కుటుంబాలు ఎన్ని జిల్లాలు పచ్చని పొలాలతో కళకళ లాడుతాయో వర్ణించి చెప్పడం సాధ్యమా!

తెలంగాణ ఒక అద్భుతమైన ప్రదేశం.కేసీఆర్ చెప్పినట్టు ఇక్కడ నాలుగు రకాల భూములను మనం చూడొచ్చు. ఎర్రనేలలు, నల్లరేగళ్లు, ఇసుకనేలలు, తేలికపాటి నేలలు. ప్రతి గ్రామంలో కనీసం రెండు రకాల భూములుంటాయి. ఈ మిశ్రమ నేలలే తెలంగాణకు వరమని శాస్త్రవేత్తలు చెపుతున్నారు. అలాగే ఇక్కడ సమశీతోష్ణ వాతావరణం గ్రీన్‌హౌజ్ వంటి ఆధునిక వ్యవసాయానికి అనుకూలం. ఆంధ్రా ప్రాంత వాతావరణంలో హ్యూమిడిటీ ఎక్కువ. రేపటి తెలంగాణలో గ్రీన్‌హౌజ్ కల్టివేషన్‌కు పెద్దపీట వేస్తామంటున్నారు కేసీఆర్! దీనివల్ల పది రెట్లు ఎక్కువ దిగుబడి వచ్చి తెలంగాణ రైతాంగం సుసంపన్నం కాగలుతుందంటున్నారు. ఇక్రిసాట్ లాంటి అంతర్జా తీయ సంస్థలు తెలంగాణలోనే ఏర్పాటు చేశారంటే ఇక్కడి వాతావరణం, ఇక్కడి భూములు అందుకు ఎంత ఉపయోగకరమైనవో మనకు అర్థమవుతుంది. కాబట్టి ఈ దేశానికి అవసరమైన విత్తనాలను పండించగలిగే ఒక గొప్ప ప్రదేశంగా రేపటి తెలంగాణ ఏర్పడుతుంది. తెలంగాణ ‘సీడ్ బౌల్ ఆఫ్ ఇండియా’ గా మారుతుంది. తెలంగాణకు ఉపయోగపడే గ్రీన్‌హౌజ్ కల్టివేషన్‌కు ఇతర రాష్ట్రాల్లో 80 శాతం వరకు ప్రభుత్వాలు సబ్సిడీ ఇస్తున్నాయి. మరి మనరాష్ట్రంలో అలా ఎందుకు ఇవ్వడలేదు? ఏదైనా ఆంధ్రా రైతుకు ఉపయోగపడితేనే సబ్సిడీలు ఇస్తారు! తెలంగాణ రైతుకు ఉపయోగపడే గ్రీన్‌హౌజ్ కల్టివేషన్‌కు సబ్సిడీ ఇవ్వడానికి ఆంధ్రాపాలకులకు చేతులు రావు కదా! తెలంగాణ రైతు రుణాల ను లక్ష రూపాయల వరకు మాఫీ చేస్తామని కేసీఆర్ చెప్పుతున్నారు. ఆంధ్రవూపదేశ్‌లో అప్పులపాలైన రైతు రేపటి తెలంగాణలో తన కాళ్లమీ ద తాను నిలబడలాంటే స్వయంశక్తిని కలిగించాల్సిన అవసరం ఉన్నది.

తెలంగాణలో 250 ఏళ్లకు సరిపడా బొగ్గు నిల్వలున్నాయని నిపుణులు చెప్పుతున్నారు. జల విద్యుత్తుతోపాటు, థర్మల్ పవర్ ప్రాజెక్టులను నిర్మించుకోవచ్చు. వీటి ద్వారా 10వేల మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి చేసుకోవచ్చు. ఛత్తీస్‌గఢ్, గుజరాత్ మాదిరిగా 24 గంటలు విద్యుత్తు వాడుకోవడంతోపాటు, రైతుకు నాణ్యమైన కరెంటును ఇచ్చుకోగలుగుతాం.మనరాష్ట్రంలో ఒక జిల్లాలో రెండు లోక్‌సభ స్థానాలున్నాయి. ఇతర రాష్ట్రాలలో సుమారు మూడు జిల్లాలలో రెండు లోక్‌సభ స్థానాలున్నాయి. కాబట్టి రేపటి తెలంగాణలో పాలనా సౌలభ్యం కోసం ఇప్పుడున్న పది జిల్లాలను 24 జిల్లాలు చేయడం సమంజసం. కేసీఆర్ విజన్‌లోని మరిన్ని అంశాలను టూకీగా చూద్దాం. దళితులకు మూడు ఎకరాల భూమి, ఏడాదిపాటు వ్యవసాయానికి పూర్తి సబ్సిడీ, ఆత్మగౌరవంతో బతికేందుకు రెండు పడకగదుల ఇళ్ళు, కాంట్రాక్టు ఉద్యోగులందరి క్రమబద్దీకరణ, కేంద్ర ఉద్యోగులతో సమాన జీతాలు, రాజకీయ పెత్తనం రద్దుచేసి ఆగమశాస్త్ర పండితులతో ధార్మిక పరిషత్తులను ఏర్పాటు చేసి దేవాలయాలను అప్పగించడం. వీటన్నిటికి మించి తెలంగాణలో వున్న 81లక్షల కుటుంబాల స్థితిగతులపై సమగ్ర సర్వే జరిపించి రేపటి తెలంగాణ పునర్నిర్మాణాన్ని ఆ సర్వే ఆధారంగా నూటికి నూరుపాళ్లు అమలు చేస్తామనేదే కేసీఆర్ విజన్. తెలంగాణలో బాలలకు కేజీ నుంచి పీజీ దాకా ఉచిత నిర్బంధ విద్యను అందిస్తామంటున్నారు కేసీఆర్.ఆది కుల మతాలకతీతమైన ఒక కొత్త తెలంగాణ సమాజాన్ని ఆవిష్కరిస్తుంది. తెలంగాణవాడిని ఒక గొప్ప ప్రపంచ మానవుడిగా నిలబెట్టాలనేదే నాకల అని కేసీఆర్ అంటున్నారు. ఈ విషయం చెప్పు తున్నప్పుడు ఉద్వేగభరితమైన ఆయన ముఖంలో ఒక పట్టుదలను చూశాను. అలాగే ఆయన కళ్లల్లో తేలికపాటి ఆనందబాష్పాలు కూడా చూశాను. 
-కల్లూరి శ్రీనివాస్‌
              (namaste telangana)

18, మే 2013, శనివారం

పడిలేచిన కెరటం నాగం..


దేశం లో వ్యూహాత్మక రాజకీయ నాయకులూ చాల కొద్ది మందే ఉన్నారు, అందులో ప్రణబ్ ముఖర్జీ, మమత బెనర్జీ, మాయావతి, శరద్ పవర్, జయ, కరుణ, కె సి అర్ లు ముఖ్యులు, ఈ లిస్టు లో ఒక కొత్త నాయకుడు చేరాడు అనిపిస్తుంది, ఆయనే నాగం జనార్ధన్ రెడ్డి. 
                           వ్యూహాత్మక నాయకులంటే ఇక వీరి పని అయిపోయింది, మల్లి జీవితంలో కోలుకోలేరు అనే స్థాయినుండి తమ వ్యూహాలతో తిరిగి పట్టును నిలుపుకునే సామర్ధ్యం ఉన్నవారు. తెలంగాణా ఉద్యమం ఉవ్వెత్తున సాగుతున్న రోజులలో ఉస్మానియా విద్యార్థులు ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో చేపట్టిన దీక్షకు మద్దతు ఇవ్వడానికి వచ్చిన నాగం జనార్ధన్ రెడ్డి పై ఉద్యమకారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు, ఆయనపై భౌతిక దాడి చేసారు, కారణం అప్పుడు తెలంగాణకు అడ్డుగా ఉన్న టి డి పీ పార్టీలో తెలంగాణా ఫోరానికి నాయకుడాయన. 
                ఈ సంఘటన జరిగిన తర్వాత ఇక నాగం పని ఐపోయింది అనుకున్నారు అంత కాని ఆయన ఇక్కడే చాల వ్యూహాత్మకం గా అడుగులు వేసారు, తనపై దాడి చేసిన వారిపై ఎటువంటి కేసులు పెట్టబోనని ప్రకటించారు, పోగొట్టుకున్న చోటే రాబట్టు కోవాలి అన్నట్లుగా ఆయన కోల్పోయిన ప్రజల విశ్వాసాన్ని తిరిగి పొందడానికి ప్రయత్నించారు, టి డి పీ పార్టీకి ఆ పార్టీ ఇచ్చిన పదవులకు రాజీనామా చేసారు, ఎం ఎల్ ఎ పదవికి కూడా రాజీనామా చేసి రాజీనామా ఆమోదానికి పట్టుబట్టి తనది మిగతావారిలా ఉత్తుత్తి రాజీనామా కాదని నిరుపించుకోవడానికి ప్రయత్నించారు , నిజానికి ఆయన టి డి పీ ని వీడే నాటికి ఆయనకున్న బెస్ట్ ఆప్షన్ టి అర్ ఎస్ కాని ఆయన అందులో చేరలేదు, స్వాతంత్ర్య అభ్యర్థిగా బరిలోకి దిగారు, జె ఎ సి తో పాటు టి అర్ ఎస్, బి జె పీ ఆయనకు మద్దతు ఇచ్చాయి అన్నివర్గాల ప్రజల ఆదరనతో భారి మెజారిటీ తో ఆయన విజయం సాధించారు, ఏ  ప్రజల చేతుల్లో తన్నులు తిన్నాడో అదే ప్రజల చేత జె జె లు కొట్టించుకున్నాడు, ఆ తర్వాత నగర సమితిని ఏర్పాటు చేసి తెలంగాణా వ్యాప్తం గా పర్యటించారు, ఒకవేళ ఆయన టి అర్ ఎస్ లోకి వెళ్లి ఉంటె కేవలం తన నియోజక వర్గానికే పరిమితం అయ్యే వారు, అంతే కాకుండా ఒక సాదారణ ఎం ఎల్ ఎ గానే ఉండిపోయే వారు, నగారా సమితి ద్వార ఆయనకు తెలంగాణా వ్యాప్తంగా గుర్తింపు వచ్చింది, 
                     ప్రస్తుతం ఆయన బి జె పీ లోకి వెళ్లేందుకు సిద్దమయ్యారు, బి జె పీ తెలంగాణా వాణి వినిపిస్తుండటము, జాతీయ పార్టీ కావడంతో భవిష్యత్తులో ఎదుగుదల కూడా బాగుంటుందని ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు, భవిష్యత్తులో భా జా పా లో క్రియాశీలక నేతగా ఎదిగే అవకాశాలు ఆయనకు పుష్కలంగా ఉన్నాయి, అందుకు తగ్గ సామర్ధ్యమూ ఉంది.   

16, మే 2013, గురువారం

తెరాసలో చేరిన కడియం


కడియం శ్రీహరి టీఆర్‌ఎస్‌లోకి రావడం రాజకీయ చేరిక కాదని, తెలంగాణ మాతృభూమి విముక్తి కోసమే ఆయన ఉద్యమంలోకి వచ్చారని టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కే చంద్రశేఖర్‌రావు అన్నారు. కడియం శ్రీహరి అనేక ఉన్నత శిఖరాలు చూశారని చెప్పారు. ఎంపీ, ఎమ్మెల్యే కావడానికి ఆయన రాలేదని అన్నారు. ‘2001లో పిడికెడు మందిమి. ఇప్పుడు ఉద్యమం ఉప్పెనై పొంగుతోంది. 1959, 1969లో తెలంగాణ ఉద్యమం ఆగిపోయింది. ఇప్పుడు ఆగకూడదు. ఇప్పుడు ఓడిపోతే కట్టుబానిసలకంటే అధ్వాన్నంగా తెలంగాణ ప్రజలను చూస్తారు’ అని కేసీఆర్ అన్నారు.                 
                     ఆంధ్రపార్టీలు తెలంగాణ ప్రజలకు అవసరమా? అన్న చర్చను గ్రామాల్లో లేవనెత్తాలని సూచించారు. టీడీపీ, వైఎస్సార్సీపీలో తెలంగాణ నాయకుడెవరైనా పార్టీ అధ్యక్షుడు కాగలడా? సీఎం సీట్లో కూర్చొనగలడా? అని కేసీఆర్ ప్రశ్నించారు. ‘అసెంబ్లీలో టీడీపీ లీడర్ చంద్రబాబు, మండలిలో యనమల రామకృష్ణుడు. మరి మా తెలంగాణ నేతపూక్కడ?’ అని నిలదీశారు. ‘కాంక్షిగెస్ పేరుకే జాతీయ పార్టీ. ఆంధ్ర పెత్తందారుల చేతుల్లో ఉన్న ఈ పార్టీని పాతాళంలోకి ఐదు కిలోమీటర్ల లోతుకు తొక్కాలి’ అని అన్నారు. ఇటీవల టీడీపీకి రాజీనామా చేసిన కడియం శ్రీహరి.. బుధవారం వేల మంది కార్యకర్తలతో కలిసి తెలంగాణ భవన్‌కు వచ్చి కేసీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. ఆయన మెడలో గులాబీ కండువా వేసిన కేసీఆర్.. పార్టీలోకి స్వాగతించారు.
                                 ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ చావు నోట్లో తలపెట్టి 57 సంవత్సరాల ఆకాంక్షను సాధిస్తే, తెల్లారేసరికి ఆంధ్రోళ్లంతా అడ్డం నిలబడి రాజీనామాలు చేశారని మండిపడ్డారు. తెలంగాణ ప్రకటించిన రాత్రి చంద్రబాబు, చిరంజీవి, చిన్నజీవి ఇలా అందరూ నిద్రపోకుండా కుట్ర చేశారని అన్నారు. జగన్ పార్లమెంట్‌లో ప్లకార్డు పట్టుకుంటే, చంద్రబాబు సీమాంధ్ర ఎమ్మెల్యేలతో బస్సుయాత్ర చేయించారని ఆరోపించారు. ఈ ఎన్నికల తరువాత తెలంగాణ తథ్యమని కేసీఆర్ స్పష్టం చేశారు. ‘1956కు ముందు హైదరాబాద్ స్టేట్ పేరుతో మనం విడిగానే ఉన్నాం. మనది 63కోట్ల మిగులు బడ్జెట్. మద్రాసు నుండి ఆంధ్ర విడిపోయి రూ.20కోట్ల లోటు బడ్జెట్‌తో ఉంది. 
kadiyam
      ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి. నెహ్రూను కలుపుకొని కుట్రలు చేసి, తెలంగాణను ఇక్కడి ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా ఆంధ్రతో కలిపారు. ‘సొచ్చేదాక సోమలింగం.. సొచ్చినంక రామలింగం’ అన్నట్లుగా ఇప్పుడు మాట్లాడితే హైదారాబాద్ అభివృద్ధి అంతా మాదే అంటారు’ అని కేసీఆర్ ఎద్దేవా చేశారు. తాను తెలంగాణ ఉద్యమం మొదలు పెట్టాక చంద్రబాబు మేస్త్రిని కూడా హెలికాప్టర్లో తీసుకుపోయి దేవాదుల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు. 18నెలల్లో ప్రాజెక్టు పూర్తి చేస్తానన్నారని, 180 నెలలైనా ఇప్పటి వరకు నీళ్లు రాలేదని అన్నారు. తెలంగాణకు 1300 టీఎంసీల నీళ్లు రావాల్సి ఉండగా కనీసం 300టీఎంసీలు కూడా రావడం లేదని అన్నారు. ఇప్పడు కడుతున్న ప్రాజెక్టులు మరో 40-50సంవత్సరాలైనా పూర్తయ్యేలా లేవని అన్నారు.                   
 శ్రీహరి టీడీపీలో ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేశారని, తెలంగాణకు ఎన్ని నీళ్లు రావాలన్న దానిపై ఆయన ఒక డాక్యుమెంట్ ఇచ్చారని, ఇప్పటికీ అది తన దగ్గర ఉందని కేసీఆర్ చెప్పారు. నాడు శ్రీహరి తెలంగాణకు దక్కే నీళ్లవాటాను రాతపూర్వకంగా ఇచ్చారని, దీంతో తెలంగాణకు ఎన్ని టీఎంసీల నీళ్లు రావాలో భవిష్యత్తులోనూ అడిగే హక్కు లభించినట్లైందని అన్నారు. తెలంగాణ కోసం మన తరంవాళ్లం కలిసి కొట్లాడాలి అని కడియంతో అన్నప్పుడు సమయం వచ్చినప్పుడు తప్పకుండా వస్తానన్నారని చెప్పారు. రానున్న ఎన్నికల్లో 100 అసెంబ్లీ, 16 ఎంపీ స్థానాలు గెలుస్తామని, తద్వారా ఢిల్లీని శాసించి తెలంగాణ సాధించుకుంటామని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు.
పునర్నిర్మాణంలో శ్రీహరిది కీలక పాత్ర:                 
           తెలంగాణ పునర్నిర్మాణంలో శ్రీహరి కీలక పాత్ర పోషిస్తారని కేసీఆర్ చెప్పారు. తెలంగాణ పునర్నిర్మాణంలో ఉండే 10మందిలో కడియం ఒకరని ప్రకటించారు. తొమ్మిదేళ్లు మంత్రిగా పనిచేసినా ఒక్కపైసా కూడా అవినీతికి పాల్పడని, మచ్చలేని మంత్రిగా ఉన్నారని ప్రశంసించారు. శ్రీహరి విలువలతో కూడిన రాజకీయ నాయకుడని అభివర్ణించారు. ఆయన సేవలను ఉపయోగించుకుంటామని, పార్టీలో ఉత్తమ స్థానంలో ఉంటారని అన్నారు. తెలంగాణ ఏర్పడ్డాక రైతులకు నిర్విరామంగా 8 గంటల కరెంటు, అదికూడా పగటిపూటే ఇస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు. 10వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని థర్మల్ విద్యుత్ కేంద్రాలు ఏర్పాటు చేసి సాధిస్తామని అన్నారు. మొదటి మూడు సంవత్సరాలు ఇబ్బంది ఉన్నా, ఛత్తీస్‌గఢ్‌లాంటి రాష్ట్రాల నుండి కరెంటు తెచ్చి ఇస్తామని అన్నారు.                            
 కేజీ నుంచి పీజీ వరకూ ఉచిత, నిర్బంధ విద్యను అందిస్తామని చెప్పారు. పిల్లలను స్కూల్లో చేర్పించే బాధ్యతను పోలీసులకు అప్పగిస్తామని, పిల్లలు స్కూల్లో కాకుండా ఉళ్లో ఉంటే పోలీసులను సస్పెండ్ చేస్తామని అన్నారు. లక్షలోపు రుణం తీసుకున్న రైతులకు రుణమాఫీ చేస్తామని అన్నారు. హాస్టళ్లు సామాజిక వర్గాల ఆధారంగా ఉండవని కేసీఆర్ చెప్పారు. వాటి స్థానంలో రెసిడెన్షియల్ స్కూళ్లు ఏర్పాటు చేస్తామని అన్నారు. ఇందులో సీబీఎస్‌ఈ సిలబస్‌తో పాటు ఇంగ్లిష్ మీడియంలో చదువు చెప్పిస్తామని అన్నారు. తెలంగాణలో ఇంకా 72 నియోజకవర్గాలకు సాగునీటి వసతి లేదని, తెలంగాణ వచ్చాక నియోజకవర్గానికి లక్ష ఎకరాలకు సాగునీరు అందిస్తామని చెప్పారు. తెలంగాణ రాష్ట్రానికి దళితుడే సీఎం అవుతాడని కేసీఆర్ పునరుద్ఘాటించారు. ముస్లింలకు 3%, గిరిజనులకు 12%రిజర్వేషన్లు కల్పిస్తామని అన్నారు. చిన్నచిన్న భూ కమతాలను మార్చి, ఒకే దగ్గర మూడు ఎకరాలు ఉండేలా చేస్తామని, ఇందుకు ఉచితంగా రిజిస్ట్రేషన్ సదుపాయం కల్పిస్తామని చెప్పారు. 
సైనికుడిలా పనిచేస్తా: శ్రీహరి
రాజకీయ జన్మనిచ్చిన టీడీపీకంటే తనకు జన్మనిచ్చిన తెలంగాణ తల్లి విముక్తే ప్రధానమని భావించి టీడీపీని వీడినట్లు కడియం శ్రీహరి మరోమారు స్పష్టం చేశారు. తెలంగాణ పోరాట యోధుడు కేసీఆర్ అని అభివర్ణించారు. తెలంగాణ సాధించాలనే సంకల్పంతోనే టీఆర్‌ఎస్‌లో చేరినట్లు తెలిపారు. తెలంగాణ ఉద్యమం కోసం ఎవరితోనైనా సర్దుకుపోతానని అన్నారు. ఉద్యమానికి ఉపయోగపడతాను కానీ నష్టం చేయనని హామీ ఇచ్చారు. టీడీపీ తనకు పదవులు, గుర్తింపు ఇచ్చిందని అన్నారు. ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు సామాజిక న్యాయం ఎజెండాతో వచ్చారని, నేడు ప్రజలు తెలంగాణ ఎజెండాగా పోరాటం చేస్తున్నారని అన్నారు.
                                  
 ప్రజల ఎజెండా మారిందని, దాని ప్రకారం టీడీపీని వదిలి కేవలం తెలంగాణే ఎజెండాగా ఉన్న టీఆర్‌ఎస్‌లో చేరానని వివరించారు. తాను టీఆర్‌ఎస్‌లోకి పదవుల కోసం రాలేదని, తెలంగాణ ఉద్యమంలో సైనికుడిలా పనిచేస్తానని స్పష్టం చేశారు. తమను ఎలా ఉపయోగించుకుంటారో ఆలోచించాలని కోరారు. తనతో వచ్చిన 2000మంది కార్యకర్తలు ఒకొక్కరు కనీసం 10 ఓట్లు వేయించగలవారని తెలిపారు. టీఆర్‌ఎస్‌లో చేరడం ఇప్పటికే ఆలస్యమైందని అన్నారు. టీడీపీలో ఉండి తెలంగాణ కోసం పోరాటం చేయలేక, టీడీపీని వదులుకోలేక ఇన్నాళ్లు అక్కడున్నానని, ఇప్పుడు ప్రజల తీర్పు మేరకు టీఆర్‌ఎస్‌లో చేరానని చెప్పారు. సీమాంధ్ర పార్టీలో ఉండి ఉద్యమంలో పాల్గొనలేక మానసిక సంఘర్షణకు గురవుతున్న వారంతా ఆత్మవంచన చేసుకుంటున్నారని కడియం అన్నారు. ‘రండి ప్రజా ఉద్యమంలోకి. రండి టీఆర్‌ఎస్‌లోకి. తెలంగాణ ప్రజా ఉద్యమాన్ని నడిపిస్తోంది కేసీఆర్. ఆయన నాయకత్వంలోని టీఆర్‌ఎస్‌తోనే తెలంగాణ రాష్ట్ర సాధన సాధ్యం. కొన్ని పార్టీలకు 4-5 ఎజెండాల్లో తెలంగాణ ఒకటి. టీఆర్‌ఎస్‌కు కేవలం తెలంగాణే ఎజెండా. నా వైపు నుండి తెలంగాణ ఉద్యమానికి కించిత్తు నష్టం ఉండదు. తెలంగాణ తల్లి రుణం తీర్చుకుంటా’ అని ప్రకటించారు.
                                                                                            -from namaste telangana

15, మే 2013, బుధవారం

కురుమల కులదైవం బీరప్ప పండుగ-తెలంగాణా ప్రత్యేకం.




కురుమల కులదైవం బీరప్ప. ఆ దేవున్ని అత్యంత భక్తిశ్రద్ధలతో కొలుస్తూ గొర్రెల కాపర్ల వృత్తిగల కురుమ కులస్తులు జరిపించే అతిపెద్ద పండుగ బీరప్ప పండుగ. ఈ పండుగను ‘పెద్ద పండుగ’ అని కూడ అంటారు. రోజుల వారీగా ఎనిమిది రోజుల పాటు జరుపుకునే ఈ పండుగ వివరాలు ‘బతుకమ్మ’కు ప్రత్యేకం.ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నుండి జూన్ వరకు నాలుగు నెలల్లో ఈ పండుగను కురుమలు వారి వారి గ్రామాల్లో ఘనంగా నిర్వహిస్తారు. ఈ పండుగను శుక్రవారం నుండి శుక్రవారం వరకు అంటే ఎనిమిది రోజులు జరుపుకుంటారు. ఒకసారి పండుగ చేసుకుంటే మళ్లీ ఐదేళ్ల తర్వాత వారి వీలును బట్టి జరుపుకుంటారు.ఈ పండుగలో ఊరి జనం అందరు ప్రత్యక్షంగాను, పరోక్షంగానూ పాల్గొంటారు. గొర్రెల కాపర్లు తమ గొర్రెల మందలు క్షేమంగా ఉండాలనే కాంక్షతో ఈ పండుగని నిర్వహిస్తారు. పండుగని నిర్వహించడానికి కురుమలలోనే ప్రత్యేకంగా పూజారులుంటారు. వారిని ‘బీర్‌నోల్లు’ అంటారు. వీళ్ళని ‘ఒగ్గు పూజారులు’ అని కూడా అంటారు. ఏ ఊరి వారైతే పండుగని నిర్వహించదలుస్తారో ముందుగా బీర్‌నోల్లని సంప్రదించి శుభ ముహూర్తాన్ని ఎంపిక చేసుకొని పండుగకు శ్రీకారం చుడతారు. రోజుల వారీగా ఈ పండుగ ఎలా జరుపుకుంటారో చూడండి.

శుక్రవారం తొలిరోజు:
కురుమలు ఈ రోజు గ్రామదేవత పోచమ్మను పూజిస్తూ ఇంటి నుండి బోనాలు చేస్తారు. పండుగ ప్రారంభమయ్యేది ఇలాగే. 

శనివారం
కురుమలు ఆ రోజు బీరప్ప గుడిలోని లింగాలను శుభ్రపరచి ఒక గొంగడిలో మూటగా కట్టి, రాత్రివేళ బీర్‌నోల్లకు తెలియకుండా గ్రామ సమీపంలోని బావులలోకాని, చెరువులలో కాని దాచి పెట్టి వస్తారు.

ఆదివారం
ఉదయం బీర్‌నోల్లు ప్రత్యేక వేషాలు ధరించుకొని గత రాత్రి కురుమలు దాచిపెట్టిన లింగాలను వెతకడానికి బయలుదేరుతారు. డోల్లు, తాళాల వాయిద్యాలతో ఊరేగింపుగా వెళ్తారు. మధ్య మధ్యలో కత్తిసాము, కర్రసాము లాంటి విద్యలు ప్రదర్శిస్తూ ప్రజలని ఆనందింపజేస్తారు. లింగాలను వెతకడానికి తీవ్ర ప్రయత్నం చేసి ఎలాగైనా కనుగొంటారు. ఆ లింగాలను తెచ్చేముందు గంగపూజ చేసి, గుడి వద్దకు తెస్తారు. ఇక రాత్రయ్యాక ప్రతి ఇంటి నుండి దేవుని ‘పెళ్ళి బోనాలు’ చేస్తారు. రాత్రి బోనాల ఊరేగింపు డోలు వాయిద్యాలతో బీర్‌నోల్ల కత్తి, కర్ర సాముల సాహస కృత్యాలతో గుడి వరకు సాగుతుంది. ఆ రాత్రి బీరప్ప కథ చెబుతారు. రాత్రంతా కథ చెబుతూనే ఉంటారు.

సోమవారం
పండుగలో ఇది అతి ముఖ్యమైన రోజు. బీరప్ప - కామరాతిల’ కళ్యాణం జరుగుతుంది. ఉదయం నుండి కథ చెబుతూనే ఉంటారు. ఆదివారం రాత్రి ప్రారంభమైన కథ సోమవారం దేవుని పెళ్ళి జరిగే వరకూ చెబుతూనే ఉంటారు. దేవుని పెళ్ళి రోజు కురుమలు వారి బంధువులు సమీప గ్రామాల ప్రజలు, ఆ గ్రామ ప్రజలు, నాయకులు కులాల కతీతంగా పాల్గొని కళ్యాణ కార్యక్షికమాన్ని వీక్షిస్తారు. అనంతరం గావు పడుతారు. పెళ్ళి అనంతరం కురుమలు ఒడి బియ్యం పోసుకుంటారు. ఆ రోజు రాత్రి విందు, వినోదాలతో కురుమ వాడలు కళకళలాడుతాయి.

మంగళవారం
ఉదయం గ్రామ రచ్చబండ వద్ద లేదా గుడి ముందు అదీ కాకపోతే ప్రజలకు అనుకూలంగా ఉన్న చోట ‘బీరనోల్లు’ కాశీ రామక్క కథ చెబుతారు. అదే కథలో మధ్య మధ్య జనాల వినోదం కొరకు ‘జోగు వేషాలు’ వస్తాయి. సాయంత్రం ‘రేణుకా ఎల్లమ్మ’ వేషం రాగానే ప్రజలందరు భక్తిశ్రద్ధలతో వీక్షిస్తారు. బీర్‌నోల్లలోని పురుషులే మహిళా దేవతల పాత్రలు ధరిస్తారు. సాయంత్రం ఎల్లమ్మ పాత్రధారుడు ప్రతి కురుమ ఇంటిని సందర్శిస్తాడు.

బుధవారం
బీరప్ప దేవుడు తన ప్రియురాలు కామరాతిని తన వద్దకు తీసుకురావడానికి రకరకాల గారడీ వేషాలు వేసి విజయం సాధిస్తాడు. ఆ సంఘటనను పురస్కరించుకొని బుధవారం రోజున గ్రామ రచ్చబండ దగ్గర గారడీ వేషం కథ చెబుతారు. గారడీ వేష పాత్రధారుడు చేసే విన్యాసాల ముందు మెజీషియన్‌ల ఇంద్రజాల విద్య తక్కువగానే కనిపిస్తుంది. మామిడిటెంకను నాటి నిమిషాల వ్యవధిలోనే మొక్కగా మారుస్తాడు. గంట సమయంలోపే దానిని చెట్టుగా మార్చి, దానికి మామిడికాయలు సృష్టిస్తాడు. ఆ మామిడి కాయలను కోసి వాటి ముక్కలను కురుమలచే తినిపింపచేస్తాడు. అబ్బురపరిచే ఇలాంటి విన్యాసాలు ఎన్నో పలువురిని ఆకట్టుకుంటాయి.
రాత్రి నాగ భోనాలు చేస్తారు. బోనాల ఊరేగింపు ఘనంగా సాగుతుంది. ఈసారి బీరప్ప, కామరాతి, మహంకాళి, బోగన్న వేషాలుంటాయి. బోగన్నను చూస్తే చిన్నపిల్లలు భయపడి తల్లిచాటు దాక్కుంటారు. రాత్రి బోనాల ఊరేగింపు గ్రామ రచ్చబండ దగ్గరకు రాగానే మల్లన్న కథ, సమితుల వాదం కథ చెబుతారు. ఆ కథ చెబుతున్నంత వరకు మహిళలు బోనాలు ఎత్తుకునే ఉంటారు. తెల్లవారు సమయానికి బోనాలు గుడికి చేరుకుంటాయి.

గురువారం
దేవుని నాగ కార్యక్షికమం జరుగుతుంది. మధ్యాహ్నం వరకు కథ చెబుతూనే ఉంటారు. కంప్యూటర్ యుగంలో కూడ కథలు వినడానికి వచ్చే జనం ఆసక్తిని గమనిస్తే జానపద గాథలకున్న గొప్పతనం తెలుస్తుంది. సాయంత్రం అక్క మహంకాళి దేవత అలకవహిస్తే ఆ దేవతను తిరిగి తీసుకురావడానికి బీరప్ప వేషధారి ఆలాపన జనాలకు భావోద్వేగాన్ని కలుగజేస్తుంది. జనాలు కన్నీటి పర్యంతమవుతారు. అక్క మహంకాళి దేవత పాదాలు నేలకి తాకకుండా ఆమె నడిచినంత స్థలంలోను బట్టలు పరుచుకుంటూ స్వాగతం పలుకుతారు. ఈ రోజుతో దాదాపుగా పండుగ కార్యక్రమాలు ముగింపుకు వస్తాయి. 

శుక్రవారం
ఇది పండుగలో చివరిరోజు. కురుమలు గుడి ప్రాంగణంలో కాని, కొద్ది దూరంలో గాని వన భోజనాలు ఏర్పాటు చేసుకుంటారు. వారం రోజుల పాటు జరిగిన పండుగ మధురానుభూతులు మననం చేసుకుంటారు. కార్యక్షికమాన్ని నిర్వహించిన పూజారుల (బీరనోల్లు)కు వీడ్కోలు చెబుతూ గ్రామ పొలిమేర దాటేవరకు వారిని సాగనంపడంతో పెద్దపండుగ పూర్తవుతుంది. అమాయకత్వానికి, నిజాయితీకి మారు పేరయిన కురుమలు జరిపే ఈ పెద్ద పండుగకు ప్రజలందరు సహాయ సహకారాలు అందిస్తారు.రాత్రి బోనాల ఊరేగింపు గ్రామ రచ్చబండ దగ్గరకు రాగానే మల్లన్న కథ, సమితుల వాదం కథ చెబుతారు. ఆ కథ చెబుతున్నంత వరకు మహిళలు బోనాలు ఎత్తుకునే ఉంటారు.
           - భైతి దుర్గయ్య, రామునిపట్ల, చిన్నకోడూర్, మెదక్. 99590 07914.
                                                                               -from bathukamma.

12, మే 2013, ఆదివారం

పార్లమెంట్ లో పీవీ విగ్రహం ఏది..?

ఎన్ టి అర్ విగ్రహాన్ని పార్లమెంట్ లో ఏర్పాటు చేయ్యడం తో మరి పివి విగ్రహం ఎప్పుడు పెడతారు 
అని తెలంగాణా వాదులు ప్రశ్నిస్తున్నారు, దేశానికి ప్రధానిగా చేసిన పివిమరణిoచిన సమయం లోనే ఆయనకు డిల్లి లో అంత్యక్రియలు జరిపించకుండా నిర్లక్ష్యం చేసిన ప్రభుత్వం ఇప్పుడు దేశాన్ని పాలించిన తెలుగు వాడిని వదిలేసి కనీసం పార్లమెంట్ మొహం కూడా చూడని ఎన్ టి అర్ విగ్రహాన్ని పార్లమెంట్లో పెట్టడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు, ఇప్పటికైనా పివి నరసింహా రావు  విగ్రహాన్ని పార్లమెంట్లో పట్టాలని తెలంగాణా వాదులు  డిమాండ్ చేస్తున్నారు. 






-from namaste telangana

10, మే 2013, శుక్రవారం

ఈ యేటి ఉత్త(మ) నటుడు..బాబు!!


విశ్వ విఖ్యాత నట సార్వభౌమ ఎన్ టి రామ రావు దాన వీర శూర కర్ణ అనే సినిమాలో 3 వేషాలు వేసారు, శ్రీ మద్ విరాటపర్వంలో 5 వేషాలు వేసారు, అక్కినేని నాగేశ్వర్ రావు నవరాత్రి సినిమాలో 9 పాత్రలు వేసారు, కమల్ హసన్ దశావతారం సినిమాలో 10 వేషాలు వేసారు, అయితే వీళ్ళు ఇన్నివేశాలు వెయ్యడానికి చాల సమయం పట్టింది, కాని తెలుగు సీమలో ఇప్పుడు ఒక కొత్త నటుడు పుట్టుకోచ్చాడు, ఆయన కేవలం 200 రోజుల్లో అనేక వైవిద్యభరిత పాత్రలు వేసి కమల్ హసన్ రికార్డ్ ను బద్దలు కొట్టారు,  ఆ నటుడు మరెవరో కాదు మన చంద్ర బాబు నాయుడు, ఈయన తలపెట్టిన వస్తున్నా.. మీ కోసం పాదయాత్రలో భాగంగా ఆయన ఊరికో గెటప్పు, వాడకో కొత్త పతకంతో ఇలా ఈ యేటి ఉత్త(మ) నటుడి అవార్డు గెలుచుకున్నారు.. 
                                                                ( రైతు బాబు)
                                                        ( రిక్షా పుల్లర్ బాబు )
                                                   ( సమాజం నుండి కలుపును పీకే బాబు)
                                                       ( పల్లిల బిజినెస్ బాబు )
                                      ( మంగలి బాబు)
                                                                ( ఇస్త్రీ బాబు)
                                                                 (దరువు బాబు )
                                                              (కూరగాయల బాబు )
                                                              ( కుటుంబ కథా చిత్రం)
                                                          ( సమ న్యాయం, తూచు బాబు)
                                                                   ( డాక్టర్ బాబు)
                                                                  ( బతుకమ్మ బాబు)
                                                                  (తాత మనవడు)
(వెల్డింగ్ బాబు)
                                                                        (వంట బాబు)
                                                                    ( శిల్పి బాబు)
                                                                    (రాజా బాబు)
                                                              ( శివ బాబు)            -PHOTOS from V6 NEWS

6, మే 2013, సోమవారం

ఆంద్రోల్ల కథ..


తెలంగాణా సాధన కొరకు ఏర్పాటుచేసిన ఒక సభలో కె సి అర్ చెప్పిన కథ: రామ రావణ యుద్దంలో అతిపెద్ద ఆకారాలు కల్గిన రాక్షసులు వనర సైన్యం పై పడి వారిని కకావికలం చేస్తున్నారు, ఒకరోజు యుద్ద విరామ సమయంలో వానర రాజు రాముడితో ఈ విషయం చెప్పి మీరే ఏదో ఒకటి చెయ్యాలని రామున్ని కోరాడు, అప్పుడు రాముడు తన వద్ద ఒక ఆయుధం ఉందని దాన్ని ప్రయోగిస్తే దానికి ఎదురొచ్చిన వాళ్ళంతా నశిస్తారని కాని దాన్ని ఎప్పుడుపడితే అప్పుడు వాడకూడదని, దానివల్ల ప్రాణ నష్టం అధికంగా ఉంటుందని, ఆ బాణం పేరు 'రామ బాణం' అని రాముడు చెబుతాడు, అప్పుడు వానరులంత అధర్మాన్ని అంత చెయ్యడానికి మీరు ఆ బాణాన్ని ప్రయోగించాలని కోరారు, రాముడు ఒప్పుకున్నాడు, మరుసటిరోజు ఆ బాణాన్ని వాడాడు, ఆ బాణానికి ఎదురువచ్చిన రాక్షసులంత మరణించారు, రాముడు యుద్దంలో విజయం సాదించి లంకను వదిలి వెళ్తున్నప్పుడు ఆ రాక్షసులంత ఎదురువచ్చి రామా మేము మీ బాణాన్ని గౌరవించి మరణించాము, మాకు చాల ఆయుషు ఉంది కాని అర్ధాంతరంగా మరణించాము మమ్మల్ని ఏదో ఒకటి చెయ్యండి అన్నారు, అప్పుడు శ్రీ రాముడు వారిపై దయ తలచి వారిని కలియుగంలో ఆంద్ర ప్రదేశ్ అనే రాష్ట్రంలో ఆంద్ర ప్రాంతం లో జన్మించండి అని చెప్పాడట.. అప్పటి లంకలోని ఆ రాక్షసులే ఇప్పుడు కోస్తా ఆంధ్రలో జన్మించారని కె సి అర్ తనదైన శైలి లో చెప్పుకొచ్చారు...