గత నెలరోజులుగా జరుగుతున్న విద్యుత్ డ్రామాలో రేపు మరో ఘట్టం చోటుచేసుకోనుంది, ఏప్రిల్ 9 న కమూనిస్ట్ పార్టీలు బంద్ కు పిలుపునిచ్చాయి, దీనికి అన్ని ప్రతిపక్ష పార్టీలు మద్దతు ఇచ్చాయి, రేపు జరగబోయే బంద్ ను విజయవంతం చేయడానికి అన్ని పార్టీలు కృషిచేస్తున్నాయి, మరి ఈ బంద్ ఎవరి కోసం..? పేదల కోసమా, మధ్య తరగతి కోసమా..?
పెంచిన విధ్యుత్ చార్జీలను తగ్గించాలని వామపక్షాలు ఉద్యమ బాట పట్టాయి, పేద, మధ్య తరగతి ప్రజలపై నుండి విద్యుత్ భారాన్ని తొలగించాలని డిమాండ్ చేసారు. వామపక్షాల తర్వాత టి డి పీ, ఆ తర్వాత బిజెపి, చివరగా విజయమ్మలు దీక్షలకు దిగారు, అయితే ప్రతిపక్షాల ఎత్తులను చిత్తు చేస్తూ ప్రభుత్వం 200 యునిట్ల వినియోగం వరకు విద్యుత్ చార్జీల పెంపు కు మినహాయింపు ఇచ్చింది, ఐనా వామపక్షాలు సంతృప్తి చెందలేదు, పెంచిన మొత్తం చార్జీలు తగ్గించే వరకు ఉద్యమం ఆపమని తొమ్మిదవ తేది బంద్ కొనసాగుతుందని స్పష్టం చేసారు. నిజంగా ప్రతిపక్షాలు పేద మధ్యతరగతి ప్రజలకోసం పోరాడినట్లైతే బంద్ ను ఉపసంహరించుకొని ఉండాలి, ఎందుకంటే పేదలు, మధ్యతరగతి ప్రజల విద్యుత్ వినియోగం 200 ల యూనిట్లు దాటదు కాబట్టి, అయితే రేపటి బంద్ ఎవరికోసం చేస్తున్నారు అనేది ప్రశ్న..?
పేదలు, మధ్యతరగతి పై భారాన్ని తగ్గించిన తర్వాత కూడా ప్రతిపక్షాలు పోరాటంచేస్తున్నాయంటే అది కేవలం సంపన్నులు, పెట్టుబడిదారులకు మేలు చెయ్యడానికే అని స్పష్టం అవుతుంది, ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే చంద్ర బాబు, విజయమ్మ, కిషన్ రెడ్డి లు పెట్టుబడి దారులకు, సంపన్నులకు మద్దతు ఇస్తున్నారంటే అందులో అర్థం ఉంది, ఎందుకంటే వారు స్వయంగా పెట్టుబడిదారులు లేదా పెట్టుబడి దారుల సానుభూతిపరులు, కాని వామపక్ష పార్టీలు ఎందుకు ఉద్యమిస్తున్నట్టు.? పేదల పక్షాన నిలబడి వారి సమస్యలపై పోరాడే పార్టీలు వామపక్ష పార్టీలు, కాని నేడు అవికూడా ఓట్లు, సీట్ల కోసం జిమ్మిక్కులు చేస్తున్నాయి, ఇలాంటి సమయంలో పార్టీ బలపడాలంటే ఆర్ధిక సహకారం అవసరం అనిపించిందేమో, అందుకే సంపన్నులను, పెట్టుబడి దారులను ఆకర్షించడంకోసం ఈ బంద్ ను కొనసాగిస్తున్నరేమో..?
అసలు విద్యుత్ సంక్షోబానికి కారణం ప్రభుత్వ రంగ కంపెని లకు ప్రోత్సాహం ఇవ్వకుండా, కేవలం ప్రవేట్ పెట్టుబడిదారులను ప్రోత్సహించడం వళ్ళ అతి ఎక్కువ డబ్బు చెల్లించి వారిదగ్గర విద్యుత్ కొనుక్కోవలసిన పరిస్థితి వచ్చింది, దీనికి కారణం గతంలో రాష్ట్రాన్ని పాలించిన చంద్రబాబు, రాజశేకర్ రెడ్డి. అయితే ప్రవేట్ ప్రాజెక్ట్ ల అనుమతులకు వ్యతిరేఖం గా పోరాడి ప్రభుత్వ రంగ సంస్థలను ప్రోత్సహించే విధంగా ప్రణాళిక ఇప్పటికి రూపొందించక పోవడం దురదృష్టకరం, రేపు ఎవరు అధికారంలోకి వచ్చిన విద్యుత్ కోతలు అనేవి సర్వసాధారణం అని అనుకొవచ్చు.
చిన్న తరహ, కుటీర పరిశ్రమలు విద్యుత్ సమస్యతో ఉత్పత్తిలో తీవ్ర ఆటంకాలను ఎదుర్కొంటున్నాయి, వీరికోసం ఎ ఒక్క సంపన్నుడు, పెట్టుబడిదారుడు పోరాడలేదు, ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకురాలేదు, కాని నేడు వామపక్ష పార్టీల బంద్ ద్వార పేద మధ్యతరగతి ప్రజలు సంపన్నులు, పెట్టుబడి దారులకు విద్యుత్ చార్జీలు తగ్గించమని బంద్ పాటించాలి, ధనికులకోసం పోరాడాలి, ఇది మన ప్రతిపక్షాల తెలివి, మరి మీరు బంద్ కు మద్దతు ఇస్థారా..? ఇవ్వరా..?
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి