హైదరాబాద్ మహానగర సమీపంలోని(రంగారెడ్డి జిల్లా లోని) కీసరగుట్ట రామలింగేశ్వర స్వామి ఆలయం ఎత్తైన కొండపై ప్రకృతి రమణీయత మధ్య కొలువై ఉంది, సికింద్రాబాద్ నుండి కేవలం 40 కిలో మీటర్ ల దూరంలో, ECIL నుండి 25 కిలో మీటర్ల దూరంలో ఉంది, శివరాత్రి రోజు ఇక్కడజరిగే ప్రత్యేక పూజలలో వేలాది మంది భక్త జనం పాల్గొంటారు.
స్థలపురాణం:
శ్రీ రాముడు రావణ వధ తర్వాత ఈ ప్రాంతాన్ని సందర్శించాడు, రావణ వధ తర్వాత బ్రహ్మ హత్యా పాతకం తొలగి పోవడానికి ఇక్కడ శివ లింగాన్ని ప్రతిష్టించి పూజించాలనుకున్నారు, హనుమంతున్నీ వారణాసి కి వెళ్లి శివ లింగాన్ని తీసుకురమ్మని పంపించాడు, అయితే హనుమంతుడు ఆలస్యం చెయ్యడంతో రాముడు శివున్ని ప్రార్ధిస్తాడు, అప్పుడు ప్రత్యక్షం ఐన శివుడు లింగరూపం లో ఇక్కడ వెలిసాడు, ఇక్కడ వెలిసిన లింగం స్వయంభు: లింగం, ఆ లింగాన్ని రాముడు పూజించాడు, ఆలస్యంగా చేరుకున్న ఆంజనేయుడు రాముడు వేరే లింగాన్ని ప్రతిష్టించడంతో తాను వెంట తెచ్చిన 101 లింగాలని ఆ ప్రాంతంలో విసిరి పారేసాడు, అందుకే ఈ గుట్టపై అనేక శివలింగాలు దర్శనమిస్తాయి. కేసరి సుతుడైన ఆంజనేయుడి పేరు మీదిగా కేసరి గుట్ట అనే పేరు వచ్చింది, కేసరి గుట్టె నేడు కీసర గుట్టగా పిలవబడుతుంది.
ఇక్కడ ఆలయం లో కొలువైన స్వామిని రాముడు ప్రతిష్టించాడు కావున రామలింగేశ్వర స్వామిగా పిలుస్తారు, భవాన్ని అమ్మవారు, శివ దుర్గా అమ్మవార్లు ఇక్కడ కొలువై భక్తుల కోర్కెలను తీరుస్తున్నారు, ఈ దేవాలయంలో లక్ష్మి నరసింహ స్వామి, శ్రీ సీతారాముల ఆలయాలు కూడా కొలువై ఉన్నాయి. శివ రాత్రి రోజు ఇక్కడ నిర్వహించే ప్రత్యేక పూజలలో వేలాదిగా భక్తజనం పాల్గొంటారు.
ఈ గుట్ట కింది భాగంలో ఆశ్రమాలు, యోగ కేంద్రాలను ఏర్పాటు చేసారు, ప్రశాంత మైన వాతావరణం తో పాటు కొండ సువిశాలంగా ఉండటం, కాలుష్యానికి దూరంగా ఉండడం మూలంగా గుట్టపైకి చేరుకోగానే భక్తులు అలౌకిక ఆనందానికి లోనవుతారు, ఇది ఆధ్యాత్మిక కేంద్రం గానే కాకుండా మంచి ప్రకృతి రమణీయ ప్రాంతం కూడా, ఇక్కడ ఉన్న సహజ అందాలకు తోడు దేవాలయ శాఖ వారు మరిన్ని సోగబులను తీర్చిదిద్దారు. గుట్టపైన పర్యాటకులను ఆకర్షించడానికి భారి ఆంజనేయ విగ్రహాన్ని ఏర్పాటుచేసారు, వానాకాలం లో లేదా చలికాలం లో ఈ కొండపై నుండి చూస్తే పచ్చని ప్రకృతి ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. కొండపైన విశాలమైన కాలి స్థలం ఉండడం వళ్ళ దీనిని విస్తరించడానికి పుష్కలం గా అవకాశాలు ఉన్నాయి.
అతి రాత్రం:
ప్రస్తుతం ఈ గుట్టపై కేరళ నుండి వచ్చిన వేద పండితుల ఆధ్వర్యంలో మహా యాగం అతిరాత్రం కన్నుల పండగగా నిర్వహించ బడుతుంది, గరుడ పక్షి ఆకారంలో నిర్మించిన భారి యజ్ఞ వాటికలో యజ్ఞాన్ని నిర్వహిస్తున్నారు, ఏప్రిల్ 24 వరకు జరిగే ఈ యాగంలో భక్తులు వేల సంఖ్యలో పాల్గొంటున్నారు.
(కీసరగుట్ట లోని ప్రకృతి సొగసులు)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి