ప్రభుత్వం ప్రజలకు వాతలమీద వాతలు పెడుతూ గుండెల్లో రైళ్ళు పరిగేట్టేలా చేస్తుంది, మొన్నటికి మన్న రైల్ చార్జీలు విపరీతంగా పెంచింది కేంద్ర సర్కార్, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ0 వంతు వచ్చింది, భూముల రిజిస్త్రేషణ్ చార్జీలు పెంచి ప్రజల నుండి డబ్బులు పిండుకుంటున్న ప్రభుత్వం, విధ్యుత్ చార్జీలను పెంచుతూ సంచలన నిర్ణయం తీసుకుంది, విద్యుత్ శ్లాబులను 8 నుండి 10 కి పెంచుతూ చార్జీల మోతమోగించింది, ఎన్నికలకు మరో సంవత్సర కాలం ఉండగా ఇలా చార్జీలు పెంచడంపై స్వపక్షంలోనే విమర్శలు వచ్చాయి, మరో వైపు సర్ చార్జి పేరుతో సామాన్యుడి నడ్డివిరుస్తుంది, ఇంకో అడుగు ముందుకు వేసిన ప్రభుత్వం రైతులకు ఇచ్చే ఉచిత విద్యుత్ కు కోతలు పెట్టింది, సంవత్సరంలో ఒకే పంటకు ఉచిత విద్యుత్ ఇస్తానంటూ ఉన్న పథకాన్ని అటకేక్కించే ప్రయత్నం చేస్తుంది, ఒక వైపు కొండెక్కిన నిత్యావసరాలు, మరో వైపు పన్నుల మోతలు బడుగుల బతుకుల్లో గుదిబండలుగా మారయి.
నేడు రాష్ట్రం విద్యుత్ సంక్షోభంలో చిక్కుకొని ఉంది డిమాండ్ కు సరిపడా సప్లయ్ లేకపోవడం వలన రాష్ట్రంలో విద్యుత్ కోతలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి, 2012-13 సంవత్సరంలో ఎండా కాలం లోనే కాకుండా వానాకాలం, చలి కాలంలో కూడా విద్యుత్ కోతలు విధించింది, అంతర్జాతీయ సదస్సు జరుగుతున్న సమయంలో కుడా రాజధాని నగరంలో విద్యుత్ కోతలు అమలు జరిగాయంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు, ఇంత తీవ్రమైన విద్యుత్ సంక్షోభానికి కారణం ఎమిటి..? ఎవరు..?
గత ప్రభుత్వాలకు ముందు చూపు లేకపోవడమే ప్రస్తుత పరిస్థితులకు కారణం, చంద్రబాబు హయాంలో అభివృద్ధి గణనీయంగా జరిగిందని, హైదరాబాద్ కు అంతర్జాతీయ కీర్తి కలిగిందని చెప్పుకుంటారు తెలుగు దేశం పార్టీ వాళ్ళు, కాని అభివృద్ధి చెందిన సమాజం యొక్క అవసరాలను తీర్చాల్సిన భాద్యత కూడా ప్రభుత్వానికి ఉంటుందని ఆయనకు గుర్తుకు రాలెదా..? 2020 వరకు ముఖ్యమంత్రి గా ఉండాలని కలలు కన్నా చంద్ర బాబు మొత్తం రాష్ట్ర విద్యుత్ వ్యవస్థనే ప్రవేట్ పరం చెయ్యాలనే కుట్ర పన్నాడు, జెన్-కో ను నిర్వీర్యం చేసి ప్రవేట్ ప్రాజెక్ట్లకు ఇబ్బడి ముబ్బడిగా అనుమతులు కట్టబెట్టారు, విద్యుత్ కేటాయింపుల్లో అక్రమాలను తవ్వి తీస్తానని వాగ్ధానం చేసిన నాటి ప్రతిపక్ష నేత అధికారంలోకి రాగానే అవన్నీ మరచి పోయారు, ప్రవేట్ కంపని ల కేటాయింపులు మొత్తంగా కాంగ్రెస్ పార్టికి చెందిన నాయకులకే చెందడం గమనార్హం, ఉచిత విద్యుత్ బకాయిలు విద్యుత్ కంపెనీలకు చెల్లించడంలో ప్రభుత్వం చూపిన అలసత్వం కారణంగా విద్యుత్ కంపెనీలు నష్టాలపాలయ్యాయి, మొత్తంగా గత పాలకుల నిర్లక్ష్యం, ముందుచూపు కొరవడడం కారణంగా నేడు రాష్ట్రం తీవ్ర విద్యుత్ సంక్షోభాన్ని ఎదుర్కుంటుంది. భవిష్యత్ ప్రణాళికలు రుపొందించక పోవడం, ప్రభుత్వ ప్రాజెక్ట్ లకు అనుమతులు ఇవ్వకపోవడం వళ్ళ భవిష్యత్తు లో కూడా ఈ అంధకారం కొనసాగే అవకాశం కనబడుతుంది.
సమైక్యంద్ర అంటూ భుజాన జాతీయ జెండా వేసుకొని తనను మించిన దేశ బక్తుడు లేడని బిల్డప్ ఇచ్చిన లగడపాటి కి చెందినా విద్యుత్ కంపని 12 రూపాయలకు యూనిట్ విద్యుత్ అమ్ముతుంది, మన ప్రభుత్వం ధర తగ్గించమంటే అతను తమిళ్ నాడు లేదా కర్ణాటక కు అమ్ముకుంటాడు, ఇందుకే నా సమైక్య రాష్ట్రం..? తెలంగాణా లోని అపార బొగ్గు నిక్షేపాలను సీమంద్ర ప్రాంతంలో ఉన్న విద్యుత్ కంపెనీలకు తరలించి అక్కడి రైతులకు అధిక విద్యుత్ ను కేటాయించి తెలంగాణా లో పంటలను ఎండబెడుతుంది.
రాష్ట్రం లో బొగ్గు నీరు పుష్కలం గా దొరికే తెలంగాణా ప్రాంతంలో కాకుండా విజయవాడలో నార్ల తాతా రావు విద్యుత్ కేంద్రం పేరుతో జెన్-కో ప్రధాన కార్యాలయాన్ని తరలించుకు వెళ్లిన సీమంద్ర సర్కార్ తెలంగాణాలో బొగ్గు అదికం గా దొరికే సింగరేణి కాలరీస్ ప్రాంతాల్లో కాకుండా రాయలసీమ నెల్లూరు, విశాక పట్టణం లాంటి ప్రాంతాల్లో థర్మల్ విద్యుత్ కేంద్రాలను ఏర్పాటు చెయ్యడం ద్వారా నీటిని, బొగ్గు ను తరలించాల్సిన పర్తిస్థితి, దీనితో ఉత్పత్తి వ్యయం పెరగడం మూలంగా అధిక భారం ప్రజలపై, సబ్సిడీ రూపం లో ప్రభుత్వం పైనా పడుతుంది, తెలంగాణా ప్రాంతంలోని థర్మల్ విద్యుత్ కేంద్రాలు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందం గా ఉంటె సీమంద్రలో ఉన్న విద్యుత్ కేంద్రాల సామర్ధ్యాన్ని పెంచి ఉత్పత్తి కారకాల కొరత కారణంగా షట్ డౌన్ చేస్తున్నారు, నేడు జలవిధ్యుత్ ఉత్పత్తిని పెంచే అవకాశం లేదు, గ్యాస్ సరిపడా లేదు, అణు విద్యుత్ అంటే కమూనిస్ట్ లు ఒంటి కాలుపై లేస్తారు, ఇక మిగిలిన థర్మల్ విద్యుత్ ఒక్కటే మార్గం సక్రమం గా బొగ్గును ఉపయోగించుకొని లాభ సాటిగా ఉండే ప్రాంతాల్లో పెట్టుబడులు, అది ప్రభుత్వ రంగంలో పెడితే తప్ప భవిష్యత్తులో విద్యుత్ సంక్షోభం నుండి రాష్ట్రం బయట పడదు.
నేడు రాజకీయ పార్టిలన్ని విద్యుత్ కొరకు ధిక్షలకు దిగుతున్నాయి, వాస్తవానికి తిలా పాపం తలా కొంత అన్నట్టు ఈ రోజు ఆందోళన చేస్తున్న వారంతా ఏదో ఒక రకంగా ఈ నాటి ఈ సంక్షోభానికి కారకులే, కమూనిస్ట్ పార్టీ లు కూడా ఈ మధ్య రాజకీయాల్లో ఆరితేరాయి, ప్రజా సమస్యలను గాలికి వదిలి తమ ఓట్లు సీట్లు పెంచుకోవడానికి డ్రామాలు చేస్తున్నాయి, కమూనిస్ట్ ల నిరాహార దిక్షకు బి జె పీ నాయకులూ వచ్చి మద్దతు తెలపడం, విజయమ్మ రాగానే నారాయణ, రాఘవులు లేచి అభివాదాలు తెలపడం, మూడు రోజుల దిక్ష అనంతరం హాస్పిటల్ లో నిమ్మరసం తాగడం, సీన్ కట్ చేస్తే బి జె పీ నాయకులూ, విజయమ్మ, చంద్ర బాబు లు క0తులవారిగా దిక్షలు చేసి ప్రభుత్వాన్ని ఉతికి ఆరేసిన వీరి డ్రామాలు తెలిసిన ప్రజలు మాత్రం ఈ నాటకాన్ని ఆసక్తిగా విక్షిస్తున్నారే కాని ప్రతిస్పందించడం లేదు, ఈ నాయకుల్లో ఎవరూ నన్ను గెలిపిస్తే వచ్చే ఏడునుండి విద్యుత్ కోతలు ఉండవు అన్న హామీ మాత్రం ఇవ్వడం లేదు, అంటే భవిష్యత్తులో కూడా సీజన్ తో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రజలు ఈ కోతలు భరించాల్సిందే...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి