హోం

26, ఫిబ్రవరి 2012, ఆదివారం

పాలమూరు వెనుకబాటు పాలకుల కుట్రే!



ఎ)కృష్ణా నదిలోని 10 శాతం నీటిని ఇచ్చినా పాలమూరు సస్యశ్యామలం అవుతుంది. జూరాల నీటి నిలువ సామర్థ్యం పెంచే అవకాశం ఉందా?
బి)జలవనరులను కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంచుకుని సీడబ్ల్యూసి ద్వారా ప్రాజెక్టులు, డ్యాంలు, రిజర్వాయర్లు, నదుల అనుసంధానం చేపడితే రాష్ట్రాల మధ్య నీటి సమస్యలు ఏర్పడవు కదా?
-టీ. నారాయణడ్డి, వనపర్తి, పాలమూరు జిల్లా
అంతర్జాతీయ న్యాయసూవూతాలు, బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం పాలమూరు జిల్లాకు దక్కాల్సిన నీరు ఎన్ని టీఎంసీలు? ఆ నీరు ఎక్కడికి పోతున్నది? 
-ఇ. మొగిలన్న, కొన్గూరు, కొత్తకోట, మహబూబ్‌నగర్


ఎ) తుంగభద్ర, భీమా, కృష్ణానదులు ప్రవహిస్తున్నా పాలమూరు జిల్లాకు నీరందక అలమటిస్తూ ఉన్నది. ఈనాటి పాలమూరు జిల్లా దౌర్భాగ్యానికి అసలు సిసలు కారణం నాటి హైదరాబాద్ రాష్ట్రం ఆంధ్రవూపదేశ్‌లో విలీనమడం. దాతో శని పట్టింది తెలంగాణకు. మరీ ముఖ్యంగా ఈ జిల్లాకు. బచావత్ ట్రిబ్యునల్ తమ నివేదికలో ఈ విషయం ఎంత స్పష్టంగా తెలియజేసిందో గమనించండి.

...Had there been no division of that state (Hyderabad State) there were better chances for the residents of this area to get irrigation facilities in Mahbubnagar District
(హైదరాబాద్ రాష్ట్రం ముక్కచెక్కలవ్వకుండాపోతే మహబూబ్‌నగర్ జిల్లాకు నీటిపారుదల సౌకర్యం మెరుగ్గా ఉండుండేది)

నాటి హైదరాబాద్ ప్రభుత్వం మహబూబ్‌నగర్ జిల్లాకుపయుక్తంగా ఉండే మూడు పథకాలను రూపొందించింది. 1) తుంగభద్ర కాలువ పొడిగింపు 2) అప్పర్ కృష్ణా ప్రాజెక్టు కుడి కాలువ పొడిగింపు 3) భీమా ప్రాజెక్టు. 19.2 శతకోటి ఘనపు అడుగుల (టీఎంసీ) తుంగభద్ర జలాల వినియోగం తో 1,20,000 ఎకరాలు (గద్వాల- ఆలంపూర్ తాలూకాలో) సాగుచేసేందుకు హైదరాబాద్ ప్రభుత్వం తలపెట్టింది. ఇదే మాదిరిగా 54.4 టీఎంసీల కృష్ణా జలాల వినియోగంతో 1,50,000 ఎకరాలకు సాగునీరందించే ప్రాజెక్టును కూడా తలపెట్టింది. తుంగభద్ర అప్పర్ కృష్ణా (ఆల్మటి), ఈ రెండు ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నవే. భీమా ప్రాజెక్టు కొత్తది. దీన్ని నిర్మించి 100.70 టీఎంసీల వినియోగంతో 3,0,000 ఎకరాలకు సాగునీటి వసతి కల్పించాలని ప్రభుత్వం సంకల్పించింది. ఆంధ్రవూపదేశ్ ఏర్పడడంతో కర్ణాటక ప్రభుత్వం తుంగభద్ర ఎడమకాలువను, అప్పర్ కృష్ణ కుడి కాలువను తమ ప్రాంతం వరకే కట్టడిచేసి ఆంధ్రవూపదేశ్‌లోకి ప్రవేశించకుండా జాగ్రత్త పడింది.

భీమా ప్రాజెక్టును రద్దు చేసింది. దీంతో మహబూబ్‌నగర్ జిల్లాకు ఈ మూడు ప్రాజెక్టుల ద్వారా వాలు మార్గంగా నగావిటీ పద్ధతిలో) అందవలసిన 174.30 టీఎంసీల కృష్ణాజలాలు కృష్ణార్పణమయ్యాయి. ఆ నీళ్లే మహబూబ్‌నగర్ జిల్లాకు అందుంటే, నేడు కృష్ణా, గోదావరి జిల్లా మాదిరిగా కళకళలాడుతూ ఉండేది. ఈ దైన్య పరిస్థితిని గమనించిన ట్రిబ్యునల్ ‘తాము నిబంధనలకు లోబడి ఆ మూడు ప్రాజెక్టుల ద్వారా సంక్రమించే నీటిని జిల్లాకు హక్కుభుక్తంగా ఇవ్వలేని తమ ఆశక్తిని పేర్కొం టూ, ప్రత్యామ్నాయంగా, కొంత మేరకు జిల్లాకు జరిగిన అన్యాయానికి పరిహారంగా 17.4 టిఎంసిల వినియోగాన్ని అనుమతిస్తూ ‘జూరాల ప్రాజెక్టును’ మంజూరు చేసింది. ఈ ప్రాజెక్టుకు నీటిని కేటాయించిన ట్రిబ్యునల్ ‘తాము కేటాయించిన నీటిని ఆ ప్రాజెక్టులోనే వాడుకోవాలని, కాకపోతే జిల్లాలో అదీ సాధ్యపడకపోతే తెలంగాణలో మరోచోట వాడుకోవలన్న షరతు పెట్టిం ది’.


అంటే ట్రిబ్యునల్ మాటల అంతరార్థం ఏమిటి? బలవంతులైన సీమాంధ్ర పాలకులు తాము Compassionate grounds తో కేటాయించిన నీటిని నిర్దయగా మళ్లించగలరన్న అనుమానం గాక మరేమిటి? వాళ్ల అనుమానం నిజమే అయింది. జూరాల నీటిని 30 వేల ఎకరాలకు సరిపడా రాజోలిబండ కాలువకు మళ్లిస్తున్నది. రాజోలిబండ నీటిని కేసీ కాలువకు మళ్లిస్తున్నది. కర్నూలుకు తాగునీటి కోసం పైపుల ద్వారా జూరాల నీటిని తుంగభద్ర నదిని దాటించిన విషయం గతంలో జరిగిందే. జూరాల ద్వారా 17.4 టీఎంసీల వినియోగం జరగాలని ట్రిబ్యున ల్ ఆదేశించింది. మరో 20 టీఎంసీల వినియోగం భీమా ప్రాజెక్టు కోసం జూరాల నుంచే ప్రభుత్వం అనుమతించింది. 37.4 టీఎంసీల నికరజలాల వినియోగానికి అదనంగా మరో ఇరవై ండు టీఎంసీల మిగులు జలాలను జూరాల నుంచే నెట్టంపాడు కోసం అనుమతించింది.

ప్రస్తుతం అనుమతి పొందిన పథకం, పాలమూరు-పాకాల గ్రావిటీ పథకం మున్ముందు అవతరిస్తే అవి కూడా జూరాల నుంచే జలాలను స్వీకరించడం జరుగుతుంది. వీటన్నిటిని సరఫరా చేసే సామర్థ్యం ప్రస్తుతం అమల్లో ఉన్న జూరాల జలశాయానికి ఉన్నదా అన్న విషయం సిమ్యులేషన్ స్టడీస్ చేస్తే తప్ప తెలియదు. జూరాల జలాశయం సామర్థ్యం పెంచడం అంత ఆషామాషీ కాదు. ‘నీటి కేటాయింపులు’ ఉండాలి. కేంద్రజలసంఘం అనుమతి ఉండాలి. సామర్థ్యం పెంపు మూలంగా గురయ్యే ముంపు ప్రాంతం కర్ణాటకలో ఉంటుంది. కాబట్టి ఆ ప్రభుత్వం అనుమతి కావాలి. ముంపు ప్రాంతం లో అడవి ఉంటే కేంద్ర అటవీ శాఖా అనుమతి తప్పనిసరి అవుతుంది. ముందు జూరాల సామర్థ్యం పెంచే విషయంలో మన ప్రభుత్వం చిత్తశుద్ధితో అంగీకరిస్తుందా అన్నది కూడా అనుమానమే. జూరాల ఎత్తుపెంచడం కంటే ‘ఆల్మట్టి ద్వారా అదనపు జలాలు పొందడం మేలు. ఆలమట్టి పూర్తి జలాశయ స్థాయి 524.256 మీటర్లు కాగా జూరాల పూర్తి జలాశయ స్థాయి 31.516 మీటర్లు. అయితే ఆల్మట్టి పేరెత్తితేనే కంపరమెత్తే మన ప్రభుత్వం అలాంటి ప్రయత్నం చేయదుగాక చేయదు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వస్తే ఇది సాధ్యపడే అవకాశముంది. జూరాలకు అదనంగా ఆర్డీఎస్ తప్ప మహబూబ్‌నగర్ జిల్లాకు లబ్ధి చేకూర్చే పెద్ద పథకమేదీ లేదు. భీమా, కోయిల్‌సాగర్, నెట్టంపాడు, కల్వకుర్తి పూర్తయి ఆశించిన స్థాయిలో నీటి సరఫరా జరిగిననాడు ఈ జిల్లా కష్టాలు కొంతమేరకు తీరుతాయి.


బి) నిజమే మీరన్నట్టు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో నదుల అనుసంధానం, రిజర్వాయర్ల నిర్మాణం గనుక జరిగితే రాష్ట్రాల, ప్రాంతాల మధ్య సమస్యలుండవు. కాని ప్రస్తుత రాజ్యాంగం ప్రకారం ‘నీటి పంపకం’ పైన కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి విశేషాధికారాలు లేవు. రాజ్యాంగంలోని 246 అధికరణంలో ఏడవ షెడ్యూల్‌లో మూడు జాబితాలున్నాయి. 


కేంద్ర జాబితా: ఇందులో జతపరిచిన విషయాలకు సంబంధించిన చట్టాలను చేసే అధికారం పార్లమెంటుకే ఉంటుంది.
రాష్ట్ర జాబితా: ఇందులో పొందుపరిచిన విషయాలపై చట్టాలను రూపొందించే అధికారం రాష్ట్ర శాసనసభలకే ఉంటుంది. 
ఉమ్మడి జాబితా: ఇందులో ఉటంకించిన విషయాలపై చట్టాలు చేసే అధికారం పార్లమెంటుకు, శాసన సభలకు ఉభయులకూ ఉంటుంది.


రాష్ట్ర జాబితాలోని Entry17లో ‘నీరు-నీటి సరఫరా
’ సాగునీరు, కాలువలు, మురుగునీరు, అడ్డుకట్టలు. నీటి నిలువ విద్యుచ్ఛక్తి ఉన్నాయి. ఇక కేంద్ర జాబితాలోని Entry 56 ప్రకారం ‘అంతరాష్ట్ర నదులు, నదీలోయల అభివృద్ధి, క్రమబద్ధీకరణ’ ఉన్నాయి. అయితే ఏ మేరకు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోకి ఈహక్కుని సంక్రమింపచేయాలి అన్న విషయంపై ప్రజావూపయోజనాలను దృష్టి ఉంచుకుని పార్లమెంటు చట్టం రూపొందించవలసి ఉంటుంది.


తేలిగ్గా చెప్పాలంటే తమ సరిహద్దుల్లో పుట్టి ప్రవహించే నదులపైనే ఆయా రాష్ట్రాలకు సంపూర్ణ అధికారం ఉంటుంది. ఉదాహరణకు గుండ్లకమ్మపై ఆంధ్రవూపదేశ్‌కు పూర్తి హక్కులున్నాయి. అంతర్ రాష్ట్ర నదుల విషయంలో తమకు కేటాయించిన నీటి వినియోగంపైన మాత్రమే ఆయా రాష్ట్రాలకు సంపూర్ణ అధికారం ఉంటుంది. అదే ఇతర బేసిన్ రాష్ట్రాలకు ఇబ్బంది కలిగించనంత మేరకే. ఉదాహరణకు పోలవరం కట్టేందుకు నీటి కేటాయింపులున్నా ముంపు విషయంలో కేంద్రం, ఒడిషా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల అనుమతులు తప్పనిసరి. నీటిని పూర్తిగా కేంద్రం జాబితాలోకి తీసుకురావాలనే వాదన చాలాకాలంగా ఉంది. అయితే రాష్ట్ర ప్రభుత్వాలు ఇందుకు అంగీకరించడం లేదు. నదుల వినియోగంపైన ప్రస్తుతం రాజ్యాంగం ద్వారా సంక్రమించిన హక్కులను కేంద్రానికి కట్టబెట్టడానికి ఏ రాష్ట్రమూ సిద్ధంగా లేదు.

కేంద్ర రాష్ట్రాల మధ్య సంబంధాల గురించి అధ్యయనం చేసిన ‘సర్కారియా కమిషన్’ నీటిని అటు కేంద్ర జాబితాలోగాని ఇటు ఉమ్మడి జాబితా లో గాని మార్చడానికి ఒప్పుకోలేదు. ఇదే విషయాన్ని సమక్షిగంగా అధ్యయ నం చేసిన‘National Commission for Integrated Develo pment Planకూడా సర్కారియా కమిషన్ సిఫార్సులతో ఏకీభవిస్తూ కేంద్ర రాష్ట్రాల మధ్య సలహా సంప్రదింపులు కొనసాగించే యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడం ద్వారా నీటికి సంబంధించిన అనేక సమస్యలకు పరిష్కారం లభించగలదన్న అభివూపాయం వ్యక్తం చేసింది.

ఇప్పట్లో నీరు కేంద్రం పరిధిలోకి వచ్చే అవకాశం సుదూరంలో కనిపించడం లేదు. అంటే ఇప్పటికన్నా ఉధృతంగా, మునుముందు నీటికోసం కొట్టుకు చచ్చే పరిస్థితి దాపురిస్తుంది. ‘అంతర్జాతీయ న్యాయసూవూతాలు’ పరీవాహక ప్రాంతాల్లో నివసించే ప్రజలకు ఆయా నదుల నీటి వినియోగంపై సంపూర్ణ హక్కులుంటాయని, వారి అవసరాలు తీరాకే, పరీవాహక ప్రాంతం ఆవలి క్షేత్రాలకు తరలించవచ్చని’ చెప్తున్నాయి. ఆ లెక్కన కృష్ణా పరీవాహక క్షేత్రంలోని పాలమూరు జిల్లాకు కృష్ణానదీ జలాలు లభించాలి. ఇది అంతర్జాతీయ న్యాయమే కాదు సహజ న్యాయం కూడా. అయితే ఈ న్యాయ సూత్రాలకు చట్టబద్ధతలేదు. కానీ ప్రపంచమంతా ఈ న్యాయసూవూతాలను పాటిస్తున్నది. కానీ మన ప్రభుత్వం మాత్రం ‘దుడ్డున్నవాడిదే బర్రె’ సూత్రం ఆలంబనగా తీసుకుని పాలమూరు జిల్లా అవసరాలు పక్కనపెట్టి కృష్ణా జలాలను ‘పోతిడ్డిపాడు’ ద్వారా సీమాంధ్ర ప్రాంతాలకు తరలిస్తున్నది. పాలమూరు జిల్లాకు బచావత్ ట్రిబ్యునల్ ద్వారా జూరాలకు 17.4 టీఎంసీలు, ఆర్డీఎస్ 15.90 టీఎంసీలు, కోయిర్‌సాగర్‌కు 3.9 టీఎంసీలు దక్కాయి.


చిన్నతరహా ప్రాజెక్టులు అదనం. బచావత్ ట్రిబ్యునల్ రాష్ట్రం మధ్య నీటి పంపకాలను చేసింది. అయితే ఆ పంపకాలను ఆయా ప్రాజెక్టు అవసరాలను నిర్ధారణ చేశాకే చేసింది. అయితే కొన్ని ప్రాజెక్టులను మినహాయించి, మిగిలిన ప్రాజెక్టుల కేటాయింపులను అటూ ఇటూ సవరించే అధికారాన్ని ట్రిబ్యునల్ ఆయా రాష్ట్రాలకు కట్టబెట్టింది. కనుక రాష్ట్రానికి ఇచ్చిన నీటి కేటాయింపులో ప్రభుత్వం కొన్ని ప్రాజెక్టుల కేటాయింపులను కత్తిరించి మరికొన్నింటికి పెంచవచ్చు. నిజానికి మన ప్రభుత్వం అలా చేసింది కూడా. కనుక రాష్ట్ర ప్రభుత్వం తలుచుకుంటే పాలమూరు జిల్లాకు ఇతర ప్రాజెక్టులకు కోతపెట్టి ఎక్కువ నీరు ఇవ్వవచ్చు. ఎక్కువ నీరు ఈ జిల్లాకు ఇవ్వడం దేవుడెరుగు. ఆర్డీఎస్‌లో కోతపెట్టకుండా ట్రిబ్యునల్ మంజూరు చేసిన 15.9 టీఎంసీలు ఇస్తే అదే పదివేలు. కానీ అలా జరగడం లేదు.

జాతీయ జల విధానం 
197లో మొదటిసారి జాతీయ జల విధానం వెలువడింది. నీరు అరుదైన విలువైన జాతీయ వనరు కనుక సమీకృత ప్రాతిపదికన, పర్యావరణ పరిరక్షణ, సంబంధిత రాష్ట్రాల అవసరాల దృష్ట్యా ఈవనరుని అభివృద్ధి పరుచుకోవాలి, కాపాడుకోవాలి. జలవనరుల అభివృద్ధి పథకాలను వీలైనంత మటుకు బహుళార్థ సాధక ప్రాజెక్టులుగా రూపొందించాలి. ఈ ప్రాజెక్టులో తాగునీటి వసతి తప్పక కల్పించాలి. సాగునీటి వ్యవస్థ నిర్వహణలో రైతులను భాగస్వాములను చేయాలి. ప్రాధాన్యతా పరంగా తాగునీరు, సాగునీరు, విద్యుచ్ఛక్తి, జలరవాణా, పారిక్షిశామిక, ఇతర ప్రయోజనాలు ఉండాలి. ఉపరితలజలం, భూగర్భ జలాల నాణ్యతను పరిరక్షించే కార్యక్షికమాలను చేపట్టాలి. ఇలాంటి 19 అంశాలతో కూడిన ప్రప్రథమ జాతీయ జల విధానం నీటి చంద్రిక వలె హితోక్తులను ఉపదేశం చేసింది. అయితే ఏ రాష్ట్రమూ దీన్ని పాటించిన పాపాన పోలేదు. 15 ఏళ్ల తర్వాత 2002లో రెండో జలవిధానం విడుదలయింది.


ఇందులో కొత్తగా జోడైన అంశాలు నదీ బేసిన్ సర్వతోముఖ వికాసం కోసం నదీ బేసిన్ సంస్థల ఏర్పాటు చేయాలి. రాష్ట్రాల మధ్య నీటి పంపిణీ విషయంలో కొన్ని మార్గదర్శక సూత్రాలను జాతీయ ప్రయోజనాలకు అనుగుణంగా ప్రతిపాదించినా వాటిని చాలా రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకించడం జరిగింది. దీంతో ఈ జాతీయ జల విధానం కూడా నిర్వీర్యమైన డాక్యుమెంటు గానే మారిపోయింది. తాజాగా నూతన జాతీయ జల విధానపు ముసాయిదాను కేంద్రం వివిధ రాష్ట్రాలకు అభివూపాయాల కోసం ఇటీవలే పంపింది. ఇందులో ‘వాడే నీటికి వెలకట్టడం లాంటి కొన్ని వివాదాస్పదమైన అంశాలను ప్రతిపాదించడం జరిగింది. ఈ అంశం అంత తేలిగ్గా ఆమోదం పొందదని అందరికీ తెలుసు. ఏదేమైనా చట్టబద్ధత లేని ఏ డాక్యుమెంటుకు విలువ ఉండదు. పాత జాతీయ జల విధానాలలాగే ఇది కూడా అలంకారవూపాయంగా మిగుల్తుందా లేక రాష్ట్రాలు దాన్ని ఆమోదించి, ఆదరించి, ఆచరిస్తారా అన్నది వేచి చూడాలి.


-ఆర్. విద్యాసాగర్‌రావు
కేంద్ర జలసంఘం మాజీ చీఫ్ ఇంజనీర్

22, ఫిబ్రవరి 2012, బుధవారం

దర్శనీయం....అలంపూర్ క్షేత్రం






‘‘బ్రహ్మేశోయం సవిశ్వేశః సకాశి హేమలాపురి, 
సాగంగా తుంగభద్రేయం సత్యమేవం నవంశయః’’


రాష్ట్రంలో చారిత్రకంగా ప్రసిద్ది చెందిన శైవ క్షేత్రాల్లో తెలంగాణలోని అలంపూర్‌కు ప్రత్యేక స్థానం ఉంది. దక్షిణ కాశీగా, శ్రీశైలానికి పశ్చిమ ధ్వారంగా వెలుగొందుతున్న ఈ పుణ్యక్షేత్రంలో ప్రధాన దేవి దేవతలు శ్రీ బాలబ్రహ్మేశ్వరుడు, జోగుళాంబ అమ్మవారు. దేశంలోని అష్టాదశ శక్తిపీఠాలలో అయిదవ శక్తిపీఠంగా విరాజిల్లుతున్న ఈ క్షేత్రంలో బ్రహ్మకు తొమ్మిది ఆలయాలు ఉండడం విశేషం. ఇంతటి ప్రసిద్ది చెందిన ఈ క్షేత్రాన్ని దర్శించుకునేందుకు దేశం నలుమూలల నుంచే కాక విదేశాల నుంచి కూడా యాత్రికులు వస్తుంటారు. చారిత్రకంగా ఈ ఆలయాన్ని 6వ శతాబ్దానికి చెందిన బాదామిచాళుక్య వంశంలోని రెండవ పులకేశి నిర్మించినట్లు ఇక్కడి శాసనాల ద్వారా తెలుస్తోంది. అలంపూర్‌కు పూర్వనామం హేమలాపురం. కాలక్రమేణ ఈ నామం రూపాంతరం చెందుతూ హతంపురం, యోగులాపురం, జోగుళాపురం, అలంపురంగా రూపాంతరం చెందింది. 
బాలబ్రహ్మేశ్వరుడు:-
బ్రహ్మదేవుడు ఈశ్వరుని గురించి ఈ క్షేత్రంలో తపస్సు చేశాడు. బ్రహ్మదేవుని తపస్సుకు మెచ్చిన ఈశ్వరుడు ఇక్కడ వెలిశాడని పురాణాల ద్వారా తెలుస్తోంది. బ్రహ్మదేవుని తపస్సు ద్వారా పరమేశ్వరుడు ఉద్భవించాడు. బ్రహ్మ కారణంచేత ఈశ్వరుడు ఇక్కడ వెలిసినందున ఈ స్వామిని బ్రహ్మేశ్వరుడుగా, బాలబ్రహ్మేశ్వరునిగా కొలుస్తున్నారు. బాలబ్రహ్మేశ్వరుని విగ్రహాన్ని పరిశీలించినట్లయితే ఆశ్చర్యం కలుగుతుంది. శైవ క్షేత్రాల్లో శివలింగాలు స్థూపారకంగా ఉంటాయి. అలంపూర్‌లో మాత్రం గోస్పాద ముద్రిక, రసాత్మ లింగంగా వెలిసి ఉంది. ఆవు పాదం మోపితే ఎలాంటి ఆకృతి ఉంటుందో అదే ఆకృతిలో ఇక్కడ విగ్రహం వెలిసి ఉండడం విశేషం. పూర్వం ఈ విగ్రహం నుంచి అనేకమైన రసాలు వెలువడుతుండగా, రససిద్దులు అనే మహానుభావులు పరుశవేది అనే మూలికతో ఆ రసాలను మిళితం చేస్తూ కొన్ని రకాలైన పరిశోధనలు జరిపి విగ్రహంలో నుంచి బంగారాన్ని తయారు చేశారు. ఆ బంగారంతో ప్రధాన ఆలయం చుట్టు అదే రీతిగా ఎనిమిది ఆలయాలను నిర్మించారు. ఆ విధంగా వెలసిన ఈ తొమ్మిది ఆలయాలే నవబ్రహ్మ ఆలయాలుగా విరాజిల్లుతున్నాయని చరిత్ర చెపుతోంది. ఇందులో కుమార, ఆర్క, వీర, విశ్వ, తారక, గరుఢ, స్వర్గ, పద్మబ్రహ్మేశ్వర ఆలయాలను ఇక్కడ భక్తులు దర్శించుకుంటున్నారు. ఆలయాలపై చూపరులను ఆకట్టుకునే విధంగా గరుఢ, గంధర్వ, కిన్నెర, కింపురుష మూర్తులు ఇక్కడ రమణీయంగా నిలిచారు. ఇక్కడ ఆలయాలపై ఉన్న శిల్పసంపదపై పంచతంత్ర కావ్య కథా శిల్పాలు, ఆదిత్య హృదయం, రామాయణ, మహాభారత శిల్పాలు దర్శనమిస్తాయి. ఈ దేవాలయాల మీద శ్రీమార, నయన్‌ప్రియన్, శ్రీకంఠాచార్యన్ తదితర శిల్పాచారుల పేర్లు నేటికి కనపడతాయి. రెండవ పులికేశి నిర్మించిన పట్టదకళ్లు దేవాలయం కంటే ఇక్కడ శిల్ప సంపద, అపూర్వ, వాస్తు వికాసం అధ్యాయన పరులను ఆకట్టుకుటుంది. 




అయిదవ శక్తిపీఠం:-


‘‘లంబస్తమి వికృతాక్షిం ఘోర రూపం మహాబలం 
ప్రేతాసన సమారుడం జోగుళాంబం నమామ్యహం’’ 


అని ఇక్కడ వెలసిన శక్తి స్వరూపిణి జోగుళాంబ అమ్మవారిని గురించి శంకరాచార్యులు పై స్తోత్రంతో కీర్తించారు. శంకరాచార్యులు దేశంలోని శక్తిపీఠాలను సందర్శించిన సమయంలో అలంపూర్‌లోని జోగుళాంబ అమ్మవారిని అయిదవ శక్తిపీఠంగా కీర్తించారు. ఇక్కడ వెలసిన అమ్మవారి గురించి ఓ కథ ప్రచారంలో ఉంది. పూర్వం దక్ష ప్రజాప్రతినిధి నిర్వహించిన నిరీశ్వరయాగంలో అందరి ముందు శివనింద చేయడంతో ఆ అవమానాన్ని భరించలేక సతీదేవి యోగాగ్నిని కల్పించుకుని దేహ త్యాగం చేసుకుంది. విషయాన్ని తెలుసుకున్న పరమశివుడు ప్రళయ కాలరుద్రుడై యాగాన్ని సమూలంగా నాశనం చేసి మరణించిన సతీదేవిని తన భుజస్కందంపై వేసుకుని రుద్రతాండవం చేశాడు. దీంతో పరమేశ్వరుని కోపాగ్నిని శాంతింపచేసేందుకు విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని పద్దెనిమిది శకలాలుగా విభజించారు. ఆ పద్దెనిమిది భాగాలు వేరు వేరు ప్రాంతాల్లో పడ్డాయి. వాటిని శంకరాచార్యులు పద్దెనిమిది పీఠాలుగా గుర్తించి ప్రాణ ప్రతిష్ట చేశారు. ఇందులో దంత పంక్తి భాగం అలంపూర్‌లో పడ్డట్లు, దాంతో ఇక్కడ జోగుళాంబ అమ్మవారు వెలిసినట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది. 




అలంపూర్ టూ కాశీ:-
ఉత్తర భారతంలోని కాశీ విశ్వేశ్వరుని దర్శిస్తే ఎంతటి పుణ్యఫలం దక్కుతుందో అలంపూర్‌లోని బాలబ్రహ్మేశ్వరుని దర్శిస్తే అంతే మహాపుణ్యం లభిస్తుందని పురాణాల ద్వారా తెలుస్తోంది. కాశీలో ఉత్తర వాహిణి గంగానది అయితే అలంపూర్‌లో ఉత్తర వాహిణి తుంగభద్ర నది ప్రవహిస్తుండడం విశేషం. కాశీలో 64 స్నాన ఘట్టాలు(మణికర్ణిక) ఉండగా, అలంపూర్‌లో 64 స్నాన ఘట్టాలున్నాయి. అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకరైన కాశీ విశాలాక్షి అమ్మవారు అక్కడ వెలిస్తే అయిదవ శక్తిపీఠంగా జోగుళాంబ అమ్మవారు ఈ క్షేత్రంలో కొలువై ఉండడంతో భక్తులు ఈ క్షేత్రాన్ని దర్శించుకునేందుకు ఆసక్తి కనబరుస్తారు. 


విశేష దినాలు:-
అలంపూర్ క్షేత్రంలో కార్తీకమాసం పూజలు, శివరాత్రి పర్వదినాన్ని కన్నుల పండుగగా నిర్వహిస్తారు. కార్తీకమాసంలో జోగుళాంబ అమ్మవారిని విశేష పూజలో పాల్గొనేందుకు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొంటారు. ఇక్కడ జరిగే నవ వర్ణార్చన, కన్య పూజల కోసం మహిళలు అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుంటారు. కార్తీక మాసంలో జరిగే ప్రత్యేక ఉత్సవాల కోసం దేవాలయాన్ని కన్నుల పండుగగా విద్యుత్ దీపాలతో అలంకరిస్తారు. ఈ మాసంలో విఐపిల తాకిడి ఎక్కువగా ఉంటుంది. అలాగే శివరాత్రి పర్వదినాన బాలబ్రహ్మేశ్వరుని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారు. శివరాత్రి పర్వదినం రోజు ఇక్కడ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసేందుకు తెలంగాణ, రాయలసీమకు చెందిన ప్రజలు ఎంతో ఆసక్తి కనబరుస్తారు.
                                (నమస్తే తెలంగాణా నుండి)

15, ఫిబ్రవరి 2012, బుధవారం

చదవులతల్లి మన బాసర సరస్వతి




ఆదిలాబాద్ జిల్లా ముథోల్ మండలంలోని బాసరలో కాలు మోపడంతోనే ప్రతి ఒక్కరికీ చెప్పలేని అద్వితీయ అనుభూతి కలుగుతుంది. ఇక అమ్మవారిని దర్శించుకోవడంతో పరిపూర్ణత సిద్ధిస్తుంది.


చిన్నారుల చిట్టి చేతులు పలకా బలపం పట్టి మొట్టమొదటిసారిగా అక్షరాలు దిద్దే ఆ అపురూప క్షణాలకు పరవశించని తల్లిదండ్రులు ఎవరూ ఉండరు. పసిపిల్లలకు విద్యాభిక్ష పెట్టే మన జ్ఞాన స్వరూపిణికి వందనం


అమ్మవారి సన్నిధిలో అక్షర శ్రీకారం దిద్దుకోవడంతోనే పిల్లలు ఆగిపోరు. బాల్య వయసుకు చేరుకున్నాక విద్యార్జనలో తమకు మరింత జ్ఞానాన్ని ప్రసాదించమంటూ 11 రోజుల పాటు అక్కడ కఠోర దీక్షకు దిగుతారు. మధ్యాహ్నపు ఎండలో, కాళ్లకు చెప్పులైనా లేకుండా, లేత పాదాలతో కాలినడకన బాసరలోని ఇల్లిల్లూ తిరుగుతారు. భుజానికి జోలె వేసుకుని ఇండ్లలోని తల్లులు పెట్టే భిక్షను స్వీకరిస్తారు. అలా తెచ్చుకున్న అన్నంతోనే ఒంటి పూట కడుపు తింటూ, అక్కడే అమ్మవారి నీడన నిద్రిస్తారు. పెద్దలను సైతం బిత్తరపరిచే ఈ అసాధారణ సన్నివేశం ఇప్పటికీ అక్కడ కొనసాగుతోంది.
ఆ బాసర సరస్వతి దేవి ముఖాన నక్షత్రంలా మెరిసే ముక్కుపుల్లకు ఆకర్షితులు కాని చిన్నారులు ఉండరు. ప్రతి బిడ్డకు ఒక అపురూప విద్యాశక్తిని అక్కడి బాసర తల్లి ప్రసాదిస్తుందన్న నమ్మకం ప్రతి ఒక్కరి కళ్లలో ద్యోతకమవుతుంది. 
ఇక్కడ కొలువై ఉన్న మహా సరస్వతీ అమ్మవారే పూజారుల చేత తమ పిల్లలకు ఓనమాలు దిద్దుస్తుందన్న పరిపూర్ణ విశ్వాసం వారిది. అలాగే, బాసర క్షేత్రంలో నిద్ర చేస్తూ, నిత్య భిక్షలతో కడుపు నింపుకునే పిల్లలకూ అమ్మవారు జ్ఞానభిక్ష పెడుతోంది.


గౌతమీ తీరాన వెలసిన సరస్వతి కథ
పూర్వం వైకుం శ్రీమన్నారాయణుని సన్నిధానంలోనే సరస్వతీ దేవి గంగాదేవితో గొడవ పడుతుంది. ఫలితంగా ఆదిలాబాద్ జిల్లా ముథోల్ మండలంలోని వాసర గ్రామం వద్ద గౌతమీ నది తీరాన నదిగా మారుతుంది. ఇదే కాలక్షికమేణా ‘సరస్వతీ నది’గా పేరు గాంచింది. ఇక్కడి దేవిని దర్శించుకునేందుకు మునులు, మహర్షులు, బ్రహ్మాది దేవతలు నిత్యం వచ్చి వెళ్తుండేవారంటారు.


ఇలా కొన్ని రోజులు గడిచాక తన మహిమలు తెలిపేందుకు సరస్వతీ దేవి ఒకరోజు ఉన్నట్టుండి ఇక్కడ్నించి మాయమైంది. దాంతో సమస్తం స్తంభించి పోతుంది. మహర్షులు, దేవతలు బ్రహ్మదేవుడి వద్దకు వెళ్లి మరల స స్వతీ అనుగ్రహం పొందేందుకు మార్గం చూపమని వేడుకుంటారు. వారి ప్రార్థనను ఆలకించిన బ్రహ్మ ‘సరస్వతీ దేవి పునరావిర్భావం వేదవ్యాసుడి వల్ల పొందవచ్చని’ వారికి చెప్తాడు. అప్పుడు వారంతా వేద వ్యాసుడి వద్దకు వెళ్లి జరిగిన విషయం చెప్పారు. వారి మనోభావాలు గ్రహించిన వ్యాసుడు యోగాసీనుడై నిశ్చల చిత్తంతో, తన హృదయ కమలం మధ్యలోని వాణిని ధ్యానిస్తాడు. దాంతో దేవి అనుగ్రహిస్తుంది. దేవతలంతా చూస్తుండగానే దేవి వ్యాసుడితో -
‘‘ఓ వ్యాసమునీ! నీ స్తోత్రంతో ప్రసన్నురాలి నైతిని. నా అనుగ్రహం తో నీ కోరికలన్నీ నెర వేరుతాయి’’ అని పలికింది. ‘‘అంతేకాకుండా వ్యాసరా నగరమున సుమనోహరమైన సరోవర తీరాన నన్ను ప్రతిష్ఠించి, పూజించు’’ మంటుంది. 
ఆ మహాతల్లి అనుజ్ఞ మేరకు అక్కడ అమ్మవారి ప్రతిష్టకు స్వయాన వేద వ్యాసుడే ఉపక్రమిస్తడు. ‘‘ముందు గౌతమీ తీరాన ఉన్న ప్రమాణ పరిమితమైన సైకతాన్ని (ఇసుకను) తెచ్చి నా విగ్రహాన్ని ప్రతిష్ఠించమని’’ అమ్మవారు ఆజ్ఞాపించింది. అలా, ఆ మహర్షి ప్రతిష్ఠించిన కారణాంగానే ఆ వ్యాసపురి క్రమేపీ ‘వ్యాసర’గా మారింది. అదే ఇవాళ్టి బాసర పుణ్యక్షేత్రం.


అమ్మవారి సన్నిధిలోనే అక్షరాభ్యాసం
బాసర అంటేనే అందరికీ గుర్తుకొచ్చేది చదువుల తల్లి సరస్వతీ. అక్కడ అమ్మవారి వద్ద, ఆలయ ప్రాంగణంలో పిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్తారు. ఇందుకు వసంత పంచమి, అక్షయ తృతియ వంటి పండగ రోజులు మరింత శుభవూపదమని భక్తులు నమ్ముతారు. అటువంటి ప్రత్యేక దినాలలో అయితే ఆ ఒక్కరోజే దాదాపు 3000 అక్షరాభ్యాసాలు జరుగుతాయని నిర్వాహకులు చెబుతున్నారు. 


కఠోర దీక్ష పిల్లల ‘అనుష్ఠానం’
బాసర జ్ఞాన సరస్వతీ దేవి మొక్కును తీర్చుకునేందుకు భక్తులు చేపట్టే దీక్షల్లో అనుష్ఠానం అతి ముఖ్యమైంది. ఈ దీక్ష కఠోర నియమ నిష్టలతో సాగుతుంది. చదువుకునే తమ పిల్లలు ఉన్నత చదువుల్లో బాగా రాణించాలని, పరీక్షల్లో ఉత్తమ శ్రేణుల్లో పాస్ అవ్వాలన్న కోరికతో బాలలచేత వారి తల్లి దండ్రులు అనుష్ఠానాన్ని ఆచరింపజేస్తారు. 


‘తమ కోరికలు తీరినట్లయితే అనుష్ఠానం చేస్తామని’ బాల భక్తులు మొక్కుకుంటారు. పదకొండు రోజుల పాటు ఆ పిల్లలు బాసరలోనే ఉండి, దీక్షను కొనసాగిస్తారు. ఆలయ సమీపంలో అనుష్ఠాన ధ్యానమందిరం ఉంది. అక్కడ భక్తులు విడిది చేస్తారు. ఈ దీక్షలో భాగంగా పిల్లలు నిత్యం సూర్యోదయానికి ముందే నిద్రలేస్తారు. కాలకృత్యాల అనంతరం బాసర గోదావరిలో పుణ్యస్నానం చేస్తారు. అనంతరం ధ్యాన మండపం చేరుకొని అమ్మవారిని తలచుకుంటూ ధ్యానం చేస్తారు. 


తర్వాత జోలె భుజానేసుకుని పాదరక్షలు లేకుండా బాసర గ్రామంలోకి కాలినడకన అందరూ కలసి గుంపుగా సాగుతారు. అక్కడి బ్రాహ్మణుల ఇళ్లకు వెళ్లి బిక్షాటన చేస్తారు. గృహస్థులు వారి జోలెలో వండిన అన్నం, పప్పు, కూర వంటివి వేస్తారు. కొందరు విడిగా బియ్యం, పప్పులను సాహిత్యంగా ఇస్తారు. అలా పలు ఇళ్లన్నీ తిరిగి, వచ్చి తమ విడిది చేరుకుంటారు. అక్కడ తెచ్చుకున్న ఆహారాన్ని లేదా వంట చేసుకొని భోజనం చేస్తారు.
ఈ అనుష్ఠానంలో కొనసాగినన్ని రోజులూ బాలభక్తులు ఒక పూట మాత్రమే భోజనం చేస్తారు. మాజీ ప్రధాన దివంగత పి.వి.నరసింహారావు, ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య ప్రభృతులంతా ఇలా ఈ బాసర సరస్వతీ దేవి చెంత అనుష్ఠానం చేసిన వారే. ఈ దీక్ష ఎంత కఠినమో అంత పవిత్రము, అంత ప్రయోజకరమన్న నమ్మకం భక్తులది. 




దేశంలోనే సరస్వతీ ఆలయాల్లో రెండో అతి ప్రతిష్టాత్మక స్థానం బాసరది. వేద వ్యాసుడే ఆ సరస్వతీదేవి కరుణ కోసం బాసర సమీపంలోనే దీక్ష చేసినట్లు ప్రతీతి. వసంతపంచమి రోజునే ఆ మహర్షికి అమ్మవారు ప్రత్యక్షమైనట్లు చెబుతారు. అందుకే, ఈ వేడుకలను బాసరలో భక్తజనం అంత గొప్ప పండగగా నిర్వహించుకుంటారు.


నిత్యపూజలు
బాసర ఆలయ పరిపాలన బాధ్యతలన్నీ దేవాదాయ, ధర్మాదాయ శాఖతో ఏర్పాటుచేసిన ధర్మకర్తల సంఘం, కార్య నిర్వహణాధికారులు నిర్వర్తిస్తారు. 
- ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం 6 గంటలకు పూజలు ప్రారంభం. నిత్యం ఉదయం 5 గంటలకు అమ్మవారికి మంత్రోపేతంగా పంచామృతం, ధూపదీపాలతో అర్చనలు చేస్తారు. ఉదయం హారతి, మంత్రపుష్పం అయ్యాక తీర్థ ప్రసాదాలు విక్రయిస్తారు.  అక్షరాభ్యాసం, కేశఖండనం, ఉపనయనం, వివాహాలు భజనలు వంటివి నిరంతరం కొనసాగుతుంటాయి. 


ఉత్సవాలు
అమ్మవారి ఆలయంలో ఏడాదికి మూడు ఉత్సవాలను ఆలయ కమిటీ ఆధ్వర్యంలో కన్నుల పండువగా నిర్వహిస్తారు.
- ఆశ్వీయుజ శుద్ధ పౌడ్యమి: ఈ రోజు ఉదయం, సాయంత్రం 64 ఉపచారాలతో (చతుష్టి పూజ) వైదిక పద్ధతిలో అర్చనలు చేస్తారు. 
- మహర్నవమి: ఈ రోజు చండీ వాహనం, శ్రీదేవి భాగవతం, దుర్గా సప్తశతి పారాయణం చేస్తారు. 
- విజయదశమి: మహాభిషేకం, పల్లకీ సేవ, శమీపూజ నిర్వహిస్తారు. దసరా నవరావూతులను పురస్కరించుకుని ఆలయాన్ని శోభాయమానంగా అలంకరిస్తారు.


జాతరలు
క్షేత్రంలో రోజూ పెద్ద జాతరే. ప్రత్యేకించి దసరా వంటి పర్వదినాలలో అయితే మూడు రోజులపాటు జాతరలు సాగుతాయి. చుట్టు పక్కల జిల్లాలు, ఇరుగు పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, ఒరిస్సా, మధ్యవూపదేశ్‌ల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తారు. ఈ మూడు రోజులు సంగీత సభలు, భరత నాట్యాలు, హరికథలు, భజనలు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతాయి. ఈ దినం సరస్వతీ నదిలో స్నానమాచరిస్తే సకల పాపాలు తొలగి, పునీతులవుతారని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు.


దర్శనీయ ప్రదేశాలు
- బాసర ప్రధాన దేవాలయానికి తూర్పు భాగాన ఔదుంబర వృక్షచ్ఛాయలో దత్త మందిరం ఉంది. పశ్చిమ భాగాన మహాకాళీ దేవాలయం. 
-దక్షిణ భాగాన శ్రీ వ్యాస మందిరం. ఇక్కడ వేద వ్యాసుని విగ్రహంతోపాటు ఎంతో మహిమాన్వితమైనట్లుగా భావించే వ్యాసలింగం ఉన్నాయి. 
-బాసర గ్రామానికి వెళ్లే దారిలో ఒక పెద్ద శిల ఉంటుంది. దానికి ‘వేదవతి’ (ధన పుంగవుడు) అని ప్రసిద్ధి. పక్కనే ఉన్న మరో చిన్న శిలతో దీనిని కొడితే విచివూతమైన శబ్దం వినిపిస్తుంది.


వసతులు
- భక్తుల సౌకర్యార్థం తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఒక ధర్మశాల, మరో అతిథి గృహం బాసరలో ఉన్నాయి. 
- వేములవాడ దేవస్థానం వారి ఆర్థిక సాయంతో నిర్మితమైన అతిథిగృహాలు కూడా భక్తుల విడిదికి అందుబాటులో ఉన్నాయి.


రవాణా సౌకర్యాలు
- హైదరాబాద్ నుంచి మన్మాడ్- షిర్డీ వెళ్లే రైలు మార్గంలో నిజామాబాద్ తర్వాత వచ్చే నాలుగో స్టేషన్ బాసర. 
- నిజామాబాద్ జిల్లా కేంద్రం నుంచి బాసరకు 35 కి.మీ. దూరం ఉంటుంది. ఇక్కడ్నించి బాసరకు నిరంతరం ఆర్టీసీ, ప్రైవేటు వాహనాలు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి.
                            (నమస్తే తెలంగాణా నుండి..)

12, ఫిబ్రవరి 2012, ఆదివారం

ఈ చీకటి తర్వాత తెలంగాణకు ఉషోదయమే-మాజీ డిజీపీ రాములు అంతరంగం!!


ఉద్యమం ఊపు మీద ఉంది. తెలంగాణ ప్రజలు నిరాశ, నిస్పృహలకు లోనుకావద్దు. రాత్రి అత్యంత చీకటి ఉండేది ఉషోదయానికి ముందే. ప్రస్తుత చీకటి తర్వాత తెలంగాణ సూర్యోదయమే’’అంటున్నారు మాజీ డిజీపీ పేర్వారం రాములు.
                   భిన్న సంస్కృతులు, భిన్న ఆచార వ్యహారాలు, ముఖ్యంగా భిన్న నైతిక విలువలు కలిగిన రెండు ప్రాంతాలను భాష ప్రాతిపదికన ఒక్కటిగా ఉండాలని చెప్పలేం. భాష ఒక్కటే కలిపి ఉంచేది కాదు. మా ఇంట్లో పనోళ్లలో ఒకరిది మహబూబ్‌నగర్, మరొకరిది విజయనగరం జిల్లా. శనివారంనాడు విజయనగరం ఆమె పది నిమిషాలు మహబూబ్‌నగర్ ఆమెతో మాట్లాడి వెళ్లింది. ఏం మాట్లాడుకున్నారని అడిగితే ‘ఒక్క ముక్క అర్థం కాలే సారూ’ అని చెప్పింది. ఒకరి అభివూపాయాలు ఒకరు చెప్పుకోలేనప్పుడు ఒకే భాష అంటే ఎలా? అన్నింటిలోనూ ఉత్తర ధృవం, దక్షిణ ధృవంగా ఉన్నప్పుడు అవి ఏకం కావు.
        తెలంగాణ నినాదం ఇప్పటిది కాదు. 1919లో షోలాపూర్ నవాబు తనకు కప్పం కట్టనప్పుడు అప్పటి నిజాం ప్రభువు బ్రిటీష్ సహాయాన్నిఅర్ధించాడు. అందుకోసం బెర్రార్‌ను (నాగ్‌పూర్, షోలాపూర్, బల్లార్షా ప్రాంతం) రాసిచ్చాడు. బ్రిటీష్ వాళ్ల నుంచి సహాయం అందకపోవడంతో బెర్రార్‌ను తిరిగి ఇచ్చేయమంటే.. ‘నీ ప్రజలకు నీపై తీవ్ర వ్యతిరేకత ఉంది. ఇతర ప్రాంతాల నుంచి ప్రజలను తీసుకొచ్చి ఉద్యోగాలిస్తున్నావు. ముందు నీ ఇల్లు చక్కదిద్దుకో’ అని లార్డ్ రీడింగ్ వైశ్రాయ్ హెచ్చరించాడు. అప్పటి నుంచే తెలంగాణ దోపిడీకి గురవుతోంది. 1945 పోలీస్ చర్యతర్వాత ఇక్కడి వాళ్లకు ఇంగ్లీషు రాదనే కారణంతో మద్రాస్‌నుంచి ఆంధ్రావాళ్లనుతెచ్చి ఉద్యోగాలిచ్చారు.ఎస్‌ఐగా చేరిన వ్యక్తి కొద్ది వ్యవధిలో ఎస్పీ అయ్యాడు. అప్పటి నుంచే నిజాం సంపదను, తెలంగాణ వనరులను దోచుకున్నారు. ఇప్పుడు అన్ని వాదాల కంటే పల్లెల్లో తెలంగాణవాదమే గట్టిగా ఉంది.
                                రైతులను ఓదార్చడానికి అంటే చిన్న విషయం. దానికి వందల వాహనాలు అనవసరం. బాబుపై జిల్లా ప్రజలకు అభిమానం ఉంటే, పెంబర్తి, జనగామ నాయకులు, వరంగల్ జిల్లా నేతల వాహనాలుంటే సరే. కానీ హైదరాబాద్ నుంచే భారీగా వాహనాలు తెచ్చి, ఒక గుంపు విశృఖలంగా ప్రవర్తిస్తుంటే పట్టించుకోకపోవడం ప్రభుత్వ వైఫల్యమే. జగన్మోహన్‌డ్డిని రానివ్వలేదన్న పట్టుదలతోనే బాబు వెళ్లినట్లు కనిపిస్తున్నది కానీ రైతులకోసంకాదు. రైతుల కోసం వచ్చామంటే నమ్మడానికి తెలంగాణ రైతులు ఫూల్స్ కాదు.ఈ ఘటనతో టీడీపీకి నష్టమే తప్పలాభం లేదు. విచ్చలవిడిగా అర్థ, అంగబలాలు నిరూపించుకోవాలని చూసేవారిని నియంవూతించకపోతే భవిష్యత్తులో అరాచకత్వమే. ఒకరిద్దరు ప్రాణాలు కోల్పోయినా అది దావానలంలా వ్యాపించి నిద్రాణమైన తెలంగాణ జనం ఉద్యమిస్తే ఏంజరిగేది? ప్రభుత్వం ఇకనైనా కఠినంగా ఉండాలి. 
                      ‘జై తెలంగాణ’ అనకపోతే ఊళ్లలోకి వెళ్లే పరిస్థితి లేదు. పెద్ద కాన్వాయ్‌తో బాబు వెళితే వెళ్లుండొచ్చు. కానీ దయాకర్‌రావు, కడియం ఇన్ని వాహనాలతో వెళ్లగలరా?చంద్రబాబుని టీ ఫోరం సభ్యులే బలవంతంగా తీసుకొచ్చారని నా అభిప్రాయం. బుల్లెట్ దిగినాఫర్వాలేదని గాంధీ ముందుకు వెళ్లారు. 1000 మంది పోలీసులను పెట్టుకుని వెళ్లుంటే ఆయన చనిపోయేవారు కాదు. ఈ సంఘటనతో బాబు మొండివాడు, గట్టివాడన్న అభివూపాయం ప్రజలకు వస్తుందని వాళ్లు భావించి ఉండొచ్చు. కానీ పోలీసులకు సన్నిహితంగా ఉంటూ ప్రజలకు దూరం అవుతున్న విషయాన్ని గుర్తించాలి. టీడీపీ మొదటి నుంచి ప్రజలతో మమేకమైంది.ఎన్టీఆర్ కోసం జనం ఎగబడేవాళ్లు. ఇప్పుడు జనం రాకపోగా హైదరాబాద్ నుంచే తీసుకెళ్లే పరిస్థితికి దిగజారింది. 
            .తెలుగువారి ఆత్మగౌరవం, తెలుగు తల్లి, తెలుగు సంస్కృతి నినాదాలతో ఆవిర్భవించిన టీడీపీ ప్రత్యేక తెలంగాణను ఎన్నటికీ ఒప్పుకోదు. బాబే కాదు ఇప్పుడు ఎన్టీఆర్ ఉన్నా టీడీపీ సిద్ధాంతం అదే. తెలంగాణలో టీడీపీకి ప్రజాబలం లేకపోవడంతో అక్కడ ఏర్పడిన శూన్యాన్ని పూడ్చడం కోసమే హైదరాబాద్ నుంచి మందీమార్బలంతో చంద్రబాబు వరంగల్ జిల్లాకు బయలుదేరి వచ్చారని మాజీ డీజీపీ పేర్వారం రాములు అన్నారు. ఎన్టీఆర్‌తన వాగ్ధాటి, ప్రతిభ, ఆహార్యం, నిజాయితీతో ప్రజల మనుసుల్లో చెరగని ముద్ర వేసుకున్నారని చెప్పారు. ఎన్టీఆర్‌లాగా ప్రజల మనసు దోచుకోవాలని, కానీ వాళ్ల శరీరాలను కాదని వ్యాఖ్యానించారు. 
                      ఎవరైనా పరీక్ష రాసే ముందు ట్యూషన్‌కి వెళతారు లేదా కోచింగ్ తీసుకుంటారు. కానీ కేంద్రం మాత్రం పరీక్ష ఫెయిల్ అయిన తర్వాత కోచింగ్ తీసుకున్నట్లు డిసెంబరు 9న ప్రకటన చేసిన తర్వాత శ్రీకృష్ణ కమిటీని వేసింది. కేంద్ర హోం మంత్రి అంటే సాధారణమైన పదవి కాదు. సర్దార్ వల్లభాయ్‌ప పని చేసిన అత్యున్నత పదవిలో ఉన్న వ్యక్తి చెబితే తెలంగాణ ఇస్తరనే అనుకున్నాం. కానీ కొంత మంది నాయకులు ఆంధ్రలో చేయించిన గొడవలతో కేంద్రం మాటమర్చి ప్రకటన చేయడం అవగాహన రాహిత్యానికి, అసమర్ధతకు నిదర్శనం. కేంద్రం వైఖరితో నాలుగున్నర కోట్ల మంది తెలంగాణ ప్రజలు నిరాశ, నిస్పృహలకు లోనుకాగా, 700 మంది ఆత్మబలిదానాలు చేశారు. డిసెంబర్ 9 ప్రకటనకు ముందు అంతోఇంతో కలిసున్నాం. ఇప్పుడు కేంద్రం చలవ వల్ల విభజన విచ్చంది. దీన్ని చక్కదిద్దడం అసాధ్యం. మరింత నష్టం జరుగకముందే ప్రత్యేక తెలంగాణ ప్రకటించడం శ్రేయస్కరం..
                                  ( టి న్యూస్ నుండి..)
                                     

11, ఫిబ్రవరి 2012, శనివారం

ఉద్యమాల ఖిల్లా నల్లగొండ జిల్లా..!!



నల్గొండ లేదా నల్లగొండ, దక్షిణ భారత దేశములోని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రము నందలి ఒక ముఖ్య నగరము మరియు అదే పేరుగల జిల్లాకు రాజధాని. పూర్వము నల్గొండకు నీలగిరి అని పేరు ఉండేది. నల్గొండ జిల్లాకు ఉత్తరాన మెదక్మరియు వరంగల్ జిల్లాలు, దక్షిణాన గుంటూరు మరియు పాక్షికముగా మహబూబ్ నగర్ జిల్లాలు, తూర్పున ఖమ్మం మరియుకృష్ణా జిల్లాలు, పశ్చిమాన రంగారెడ్డి మరియు మహబూబ్ నగర్ జిల్లాలు సరిహద్దులు.
రెవిన్యూ డివిజన్లు (4): నల్గొండసూర్యాపేటమిర్యాలగూడభువనగిరి.
లోక్‌సభ స్థానాలు (2):భువనగిరి, నల్గొండ.
శాసనసభ స్థానాలు (12): సూర్యాపేటఆలేరుదేవరకొండతుంగతుర్తికోదాడ, మిర్యాలగూడ, హుజూర్ నగర్నకిరేకల్నల్గొండనాగార్జునసాగర్, భువనగిరి, మునుగోడు.
దర్శనీయప్రదేశాలు:- కొలనుపాక, భువనగిరి, పానగల్లువాడపల్లినాగార్జునసాగర్యాదగిరిగుట్ట, పిల్లలమర్రి.
జిల్లా విశిష్టతలు:శాతవాహనుల కాలంలో నీలగిరిగా ప్రసిద్ధి చెందిన ఈ ప్రాంతమే కాలక్రమంలో నందికొండగా, నల్లగొండగా మారింది. బహుళార్థసాధక ప్రాజెక్టుకు సరైన నిర్వచనం చెప్పగల నాగార్జున సాగర్ ఈ జిల్లాకు ప్రధాన ఆకర్షణ. మానవ నిర్మిత ఆనకట్టలలో ఆసియాలోనే ఇది అతిపెద్దది. క్రీ.శ. 2వ శతాబ్దంలో ఈ ప్రాంతంలో నివసించిన బౌద్ధమతాచార్యుడైన ఆచార్య నాగార్జునుని పేరుతో నిర్మించిన ఈ ప్రాజెక్టును 1955 లో అప్పటి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ ప్రారంభించాడు. జలాశయం మధ్యలోని నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలం వరకూ కృష్ణా నది పొడవునా 3568 చ.కి.మీ. విస్తీర్ణంలో వ్యాపించిన రిజర్వు అడవి దేశంలో వన్యమృగ సంరక్షణ కేంద్రాలన్నింటికంటే పెద్దది. జిల్లాలోనియాదగిరి గుట్టతెలంగాణాలోని పర్వత ప్రాంత దేవాలయాల్లో ఎంతో పేరుపొందింది. ఇక్కడి లక్ష్మీనరసింహస్వామి గుడి అన్ని ప్రాంతాలవారికి దర్శనీయ పుణ్యక్షేత్రం. దేవాలయ నిర్మాణ రీతి ప్రాచీన ఆధునిక సంప్రదాయాల కలగలుపుగా ఉంటుంది. ఏటా రథోత్సవం జరుగుతుంది. ఫాల్గుణ మాసంలో బ్రహ్మోత్సవం, పెళ్ళిళ్ళు విరివిగా జరిగే ప్రదేశం. జిల్లాలోని ఆలేరుకు సుమారు ఆరుకిలోమీటర్ల దూరంలోని కొలనుపాక జైన మతానుయాయులకు ఒక పవిత్ర యాత్రాస్థలం. ప్రస్తుతం ఇక్కడ శ్వేతాంబర శాఖకు చెందిన ఒక జైన దేవాలయం నిత్య పూజారాధనతో విలసిల్లుతోంది. కాకతీయుల నాటి ప్రసిద్ది చెందిన శివాలయాలు సూర్యాపీట మండలం లోని పిల్లలమర్రి గ్రామంలో కలవు. రాష్త్రంలోనే ముఖ్యమైన మార్కెటింగ్ యార్డ్ సూర్యాపీటలో కలదు. సున్నపురాయి నిల్వలు అత్యధికంగా ఉన్న జిల్లా కావడంతో సిమెంట్ ఉత్పాదనలో ఈ జిల్లా అసియాలోనే ప్రదమ స్థానంలో ఉంది. నల్లగొండ జిల్లా పోరాటాలకు ప్రసిద్ది, ఉద్యమాల ఖిల్లాగా ఈ జిల్లాకు పేరు. ప్రపంచ చరిత్రలో స్థానం సంపాదించిన వీర తెలంగాణ సాయిధ రైతాంగ పోరాటానికి జిల్లా ఆయివుపట్టు. వాడపల్లి తీర్తమ్ ఈ జిల్లా లొ అతి పెద్ద శైవ క్షేత్రము.శివ రాత్రి నాడు స్నానా లు అచరంచడానికి ప్రజలందరు వస్తారు. ఇదీ కృష్ణా ,మూసీ మరియు అంతర్వేది సంగమం నందు అందరు స్నానాలు చేయడానికి వస్తారు.
దర్శనీయ ప్రదేశాలు:-
బుద్ధుడి శిల్పం  :-హైదరాబాదుకు 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న నాగార్జునసాగర్ ప్రధాన పర్యాటకకేంద్రం. ఈ చారిత్రాత్మ ప్రదేశానికి ఈ పేరు బౌద్ధసన్యాసి నార్జునుడి కారణంగా వచ్చింది. ఈ ప్రదేశంలో పండితుడైన ఆచార్య నాగార్జునుడు విద్యాకేంద్రాన్ని స్థాపించాడు. ప్రస్థుతం ఇక్కడ నాగార్జునసాగర్ ఆనకట్ట నిర్మించబడి ఉంది. నాగార్జున సాగర్ ఆనకట్ట ప్రపంచంలో పొడవైన మానవ నిర్మిత ఆనకట్టగా ప్రసిద్ధిగాంచింది. నాగార్జునసాగర్ ఆనకట్ట కింద 10 లక్షల కంటే అధికమైన ఎకరాల సాగుబడి జరుగుతుంది.
ఈ ఆనకట్ట నిర్మించే సమయంలో త్రవ్వకాలలో బౌద్ధసంస్కృతికి చెందిన శిధిలాల పురాతన అవశేషాలు బయటపడ్డాయి. వెలికితీసిన పురాతన అవశేషాలను సుందరమైన నాగార్జున కొండ మీద బధ్రపరిచారు. ఈ కొండ మానవ నిర్మిత సరస్సుకు కేంద్రంలో ఉన్నది. పవిత్రమైన బౌద్ధస్థూప అవశేష మిగులు భాగాలను స్థూప, విహారాలు, ఒక విశ్వవిద్యాలయం మరియు పవిత్రమైన బలిపీఠం జాగ్రత్తగా రిజర్వాయర్‌కు తూర్పు భాగంలో ఉన్నాయి.
నాగార్జున కొండ  :-మానవ నిర్మిత సరస్సు మద్య మనోహరమైన ద్వీపం ఉంది. నాగార్జున కొండ త్రవ్వాకాలలో 2వ 3వ శతాబ్ధానికి చెందిన బౌద్ధసంస్కృతిక స్థూపం బయటపడ్డాయి. ఈ కోడను చేరటానికి విజయపురి వద్ద ఉన్న జెట్టి అనేప్రదేశంలో బోటు సేవలు లభ్యం ఔతాయి.
129 కిలోమీటర్ల దూరంలో ఉన్న హైదరాబాదు విమానాశ్రయం నుండి ఇక్కడకు వాయుమార్గంలో ప్రదేశానికి చేరవచ్చు. రైలు మార్గంలో ఇక్కడకు 29 కిలోమీటర్ల దూరంలో ఉన్న మాచర్ల నుండి చేరవచ్చు.
చంద్రవంక జలపాతము :-
ఎత్తిపోతల జలపాతముకు దిగువగా 11 కిలోమీటర్ల దూరంలో ఉన్న సుందరమైన కొండచరియలలో చంద్రవంక జలపాతము ఉంది. ఈ జలపాతము పచ్చని కొండల నుండి 21.3 మీటర్ల నుండి కింద ఒక మడుగులోకి పడుతూ ఉంటుంది. ఈ జలపాతాన్ని తరచూ పర్యాటకులు దర్శిస్తుంటారు.
ఈ సుందర జలపాతము 60 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తున్న చంద్రవంకానది నుండి ప్రవహించే జలాల వలన ఏర్పడింది. ఈ జలపాతం నాగార్జున కొండకు 21 కిలోమీటర్ల దూరంలో తూర్పున ఉంది. అక్కడ ధ్యానంచేసిన ఒక యతీశ్వరుడి వలన ఈ జలపాతానికి ఈ పేరు వచ్చింది. ఈ ప్రాంతంలో కొన్ని కొండ గుహాలయాలు ఉన్నాయి. ఈ ప్రాంతం వారు ఇక్కడి దైవాలను పూజిస్తూ ఉంటారు.
ఈ ప్రాంతం రహదారి మార్గంలో హైదరాబాదు నుండి 150 కిలో మీటర్ల దూరంలో ఉంది విజయపురి సమీపంలో ఉంది.
నందికొండ :-
నందికొండ అంటే క్రిష్ణా నదీ తీరంలో ఉన్న చిన్న పల్లెటూరు. ఇది మిరియాలగూడకు 64.37 కిలో మీటర్ల దూరంలో ఉంది. చాలా ప్రముఖమైన ఈ నిర్మాణం ఇక్ష్వాకు వంశానికి చెందిన వారి చేత నిర్మించబడిన కోట. దృఢమైన గోడలు, కందకము, ద్వారాలు మరియు బురుజులు కలిగిన ఈ కోటలో ఒక దీర్ఘచతురస్రాకార రంగస్థలం (స్టేడియం)ఉంది.
పోచంపల్లి :-
1950 లో ఆచార్యా వినోభాభావే ఇక్కడి నుండి తన ఉద్యమాన్ని ఆరంభించాడు. ఇది బోంగిర్ నుండి 14.48 కిలోమీటర్ల దూరంలో ఉంది. అలాగే బీబీనగర్ నుండి 9.66 కిలోమీటర్ల దూరంలో ఉంది.
పిల్లలమర్రి :-
ఇక్కడ అద్భుతమైన చిత్రాలు, సున్నితంగా చెక్కబడిన స్థంభాలు కలిగిన పురాతన కాకతీయ ఆలయాలు ఉన్నాయి. ఈ చారిత్రాత్మక ప్రదేశం ప్రసిద్ధ కవి అయిన పిల్లల మర్రి పిన వీరభద్రుని పుట్టిన ప్రదేశం.
కొలనుపాక :-
ఇది హైదరాబాదు నుండి 80 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది చాలా చారిత్రక ప్రసిద్ధమైనది. ఇది 93.24 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగి ఒకప్పుడు సమృద్ధి కలిగి ఉన్న ప్రదేశం. పాత కోట యొక్క శిధిలాలు ఇప్పటికీ మిగిలి ఉన్నాయి. ఒకప్పుడు ఎ.డి. 11వ శతాబ్ధం ఇది కల్యాణి చాళుక్యులకు రెండవ కోటగా ఉన్నప్పుడు అత్యంత ప్రాముఖ్యత కలిగి ఉంది.

ఇంకా కొన్ని దర్శనీయ స్థలాలు:-
  • రాచకొండ
  • గాజుల కొండ
  • ఏలేశ్వరం
  • ఫణిగిరి
  • భోంగిర్ ఫోర్ట్ 
  • బంజారా ఆభరణాలు
  • మటంపల్లి 
  • వడపల్లి 
  • కొలనుపాక

పుణ్య క్షేత్రాలు:-

యాదగిరి గుట్ట:- హైదరాబాదు నుండి వరంగల్లురహదారిలో 50 కి.మీ. దూరంలో ఉన్న లక్ష్మీనరసింహ స్వామి క్షేత్రం యాదగిరిగుట్ట.

స్థల పురాణం:-

మహర్షి ఋష్యశృంగుని కుమారుడైన యాదగిరి అనే సన్యాసి వలన ఈ కొండకు ఈ పేరు వచ్చింది. యాదగిర్షి ఇక్కడ ఉన్న ఒక గుహలో ఆంజనేయుడి అనుగ్రహంతో నరసింహుని గురించి తపమాచరించాడు. ఈ కొండ నల్గొండలోని బోంగిరి మరియు రైగిరి మద్యలో ఉన్నది. యాదగిర్షి ఘాఢతపస్సుకు మెచ్చి నరసింహుడు ఐదు రూపాలలో సాక్షత్కరించాడు. జ్వాలానరసింహ, యోగానంద నరసింహ, గంఢభేరుండ నరసింహ, ఉగ్ర నరసింహ మరియు లక్ష్మీ నరసింహ అనేవి ఆ ఐదు రూపాలు. ఇలా ప్రత్యక్షమైన నరసింహ రూపాలు ఈ కొండలలో స్వయంభువులుగా వెలసి భక్తుల పూజలు అందుకుకుంటున్నాడు. అందుకనే ఇది పంచ నరసింహ క్షేత్రం అయింది. పురాణ కధనం ప్రకారం యాదర్షికి మొదట జ్వాలా నరసింహుడిగా ప్రత్యక్షమైన జ్వాలా నరసింహరూపాన్ని దర్శించే శక్తి లేని యాదగిర్షి కోరిక మీద నరసింహుడు తరువాత యోగనరసింహుడిగా దర్శనమిచ్చాడు. యాదగిర్షి అంతటితో సంతోషపడక లక్ష్మీ సహితంగా దర్శనమివ్వమని కోరడంతో ఓడిలో లక్ష్మీసహితంగా లక్ష్మీనరసింహుడై దర్శనమిచ్చాడు. లక్ష్మీనరసింహుడు ఆళ్వారుల పూజలు అందుకుంటున్నాడు. ఊగ్రనరసింహుడి ఉగ్రతను తగ్గించడానికి గరుత్మంతుడు గండభేరుండ పక్షి రూపంలో స్వామికి ముందు నిలిచి స్వామి ఊగ్రతను తగ్గిస్తుంటాడు. ఈ శిలను దాటి వంగుతూ వెళ్ళి స్వామిని దర్శించాలి. ఈ క్షేత్రానికి పాలకుడు ఆంజనేయుడు. యాదగిర్షి స్వామిని ఈ ప్రదేశాన్ని తనపేరుతో పిలవాలని కోరాడు. అందుకే ఇది యాదగిరి గుట్ట అయింది. చాలాకాలం నుండి ఇక్కడ లక్ష్మీనరసింహుడు భక్తిల పూజలు అందుకుంటున్నాడు.
మండలాలు:-
భౌగోళికంగా నల్గొండ జిల్లాను 59 రెవిన్యూ మండలాలుగా విభజించినారు. ఈ క్రింద మండలము ముందు ఉన్న సంఖ్య అంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేటాయించిన మండల సంఖ్య.

34. నల్గొండ



ప్రత్యేకతలు:


పోచం పల్లి: పోచం పల్లి లో ఆచార్య వినోబబావే భూదాన ఉద్యమాన్ని ప్రారంభించారు.ఆయన ఇక్కడ కొంతకాలం ఉన్నారు, భూమి లేని 700 కుటుంబాలకు ఆయన భు పంపిణి చేసారు.అందుకే ఈ గ్రామాన్ని భూదాన్ పోచం పల్లి అంటారు.


* పోచంపల్లి కి ఉన్న మరో ప్రత్యేకత ఇక్కడి చీరెలు, పోచం పల్లి అనగానే అందరికి గుర్తుకు వచ్చే పోచం పల్లి చీరలు ఇక్కడే నేస్తారు.అందుకే పోచంపల్లి ని సిల్క్ సిటి అంటారు.



భువనగిరి:- భువనగిరి కోట 12 వ శతాబ్దంలో చాళిక్యులు నిర్ముంచారు, ఆ తర్వాత ఈ కోట కాకతీయుల ప్రముఖ రాజధానులలో ఒకటిగా విలసిల్లింది, భువనగిరి ని పాలించిన వారిలో గౌడ కులానికి చెందినా సర్దార్ సర్వాయి పాపన్న ముఖ్యుడు ఆయన భువన గిరిని రాజధానిగా చేసుకొని సుమారు 30 సంవత్సరాలు పరిపాలించాడు, ఆయన రాజ్యం హుస్నాబాద్ నుండి షా పూర్ వరకు సువిశాలంగా ఉండేది, ఈ సువిశాల సామ్రాజ్యానికి రాజధాని నగరంగా భువన గిరి విలసిల్లింది, ఆయన మరణానంతరం ఈ రాజ్యం గోల్కొండ నవాబుల పాలనలోకి వెళ్ళింది. సర్దార్ సర్వాయి పాపన్న జీవిత చరిత్రకి కింది లింక్ చూడండి.
http://naatelangaana.blogspot.in/2011/10/blog-post_27.html 



నదులు :-
నీటి పారుదల:-
నాగార్జున సాగర్: ఆంద్ర ప్రదేశ్ ఏర్పడక ముందే నంది కొండ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని అప్పటి హైదరాబాద్ ప్రభుత్వం 161 టి ఎం సి ల సామర్థ్యం తో ఉండే విధంగా నిర్మాణం చేపట్టింది.ఉమ్మడి రాష్ట్రము ఏర్పడ్డాక ఇరు ప్రాంతాలకు నీరందించాలని దాని స్థలాన్ని, పేరును మార్చారు, నాగార్జున సాగర్ పేరుతో ప్రాజెక్ట్ను నిర్మించారు. ఈ ప్రాజెక్ట్ దేశంలోనే అతి పెద్ద రాతి డాం, దీనిని అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రు ప్రారంభించారు, ప్రాజెక్ట్ లే ఆధునిక కాలపు దేవాలయాలు అని నెహ్రు చెప్పింది ఇక్కడే.దీనికి రెండు కాలువలు ఉంటాయి, ఒకటి జవహర్ కాలువ, రెండవది లాల్ బహాదుర్ కాలువలు, కుడి కాలువ ఆంద్ర ప్రాంతానికి నీరందిస్తే, ఎడమ కాలువ తెలంగాణా కు నీరందిస్తుంది.


* ప్రాజెక్ట్ ప్రారంభించినపుడు హైదరాబాద్ రాష్ట్రానికి 132 టి ఎం సి లు, ఆంద్ర రాష్ట్రానికి 132 టి ఎం సి ల నీరు అందించాలని అనుకున్నారు, కాని ఉమ్మడి రాష్ట్రము ఏర్పడగానే, తెలంగాణా కు వచ్చే ఎడమ కాలువ లెవెల్స్, ఎలైన్ మెంట్ లలో మార్పు చేసి 106 .2 టి ఎం సి లకు తగ్గించడమే కాక ఆంద్ర ప్రాంతానికి వెళ్ళే కుడి కాలువను పొడగించారు.
* ఈ పరిణామంతో తెలంగాణకు అందుతున్నది కేవలం 85 నుండి 90 టి ఎం సి ల నీరు మాత్రమే. ఆంధ్రలో కుడి కాలువ కింద 15 లక్షల ఎకరాలకు నీరందుతుంటే, తెలంగాణకు కేవలం 5 లక్షల ఎకరాలకు కూడా నీరు అందడంలేదు.
* అంటే కోస్తాకు మొత్తం 811 టి ఎం సి లలో 580 టి ఎం సి లు అంటే 71 % నికి పైచిలుకు వెళ్తుంటే, తెలంగాణా, రాయలసీమలకు 230 టి ఎం సి ల నీరు అందుతున్నది.

శ్రీశైలం:-శ్రీ శైలం మొదట విద్యుత్ ఉత్పత్తికి నిర్దేశించారు కాని ఆ తరువాత సాగు నీటి కొరకు వాడుకోవాలని నిర్ణయించుకున్నారు.
* 1981 లో జరిగిన ఒప్పందం ప్రకారం 48 టి ఎం సి ల నీరు రాయలసీమకు, 50 టి ఎం సి ల నీరు తెలంగాణకు ఇవ్వాలి.
* అయితే 1983 లో రాయలసీమ కు వెళ్ళే కుడి కాలువతో గాలేరు-నగరి, హంద్రినీవ, తెలుగు గంగలను జోడించి 48 టి ఎం సి ల కంటే ఎక్కువగా తీసుకోవడం ప్రారంభించారు.
* దీనికి మూడు తూములు పెట్టారు ఒకటి కుడి కాలువ కొరకు, రెండోది తెలుగు గంగ కొరకు, మూడోది ఎస్కప్ ఛానల్ అని. మొత్తం గా గ్రావిటి పద్ధతిలో ఈ మూడు తుముల ద్వారా 200 టి ఎం సి ల నీటిని పొందవచ్చు, అంతే కాకూడ కుడి గట్టు కాలువ కోసం 20 టి ఎం సి ల నికర జలాన్ని కేటాయించారు.
* ఇక తెలంగాణా లోని ఎడమగట్టు కాలవకు గ్రావిటి ద్వారన, లేక ఎత్తిపోతల ద్వార నీరివ్వాల అన్నది నిర్ణయించలేదు.
* కేటాయించిన నీటిని 26 టి ఎం సి లకు కుదించి, అవి కూడా మిగులు జలాలకు పరిమితం చేసారు.
* అయితే నాగార్జున సాగర్కు మిగిలిన జలం తరలించి అక్కడనుండి ఎలిమినేటి మాధవ రెడ్డి అనే కాలువ నిర్మించి దాని ద్వార ఎడమకాలువ కు నీరిస్తారట..!అయితే అది కూడా నాగార్జున సాగర్ లో 510 అడుగులకు పైగా నీరుంటేనే, అంటే శ్రీ శైలం నుండి తెలంగాణకు నీరు రాదన్న మాట..

పంటలు:-
కడుపు నిండా నీరు ఉన్న గొంతు మాత్రం దప్పికతో ఎండిపోయిన చందంగా ఉంది నల్గొండలో పరిస్థితి, ప్రధానంగా ఇక్కడ బోరుబావులపై ఆధారపడి పంటలు పండిస్తున్నారు.
* ఇక్కడ ప్రధానంగా వరి, సజ్జ, రాగులు,వేరుశనగ,ఆముదాలు,పొద్దుతిరుగుడు, ప్రత్తి మొదలైన పంటలు పండుతాయి.
పరిశ్రమలు:-జిల్లాలో సున్నపురాయి నిల్వలు అధికంగా ఉండడంవల్ల సిమెంట్ పరిశ్రమల్ని నెలకొల్పారు. నల్గొండలో అను పదార్థ మూలకం థోరియం నిల్వలు కూడా ఉన్నాయి, రాశి సిమెంట్స్ హుజూర్ నగర్ లో, దక్కన్ సిమెంట్ ను కేట్లపల్లి లోను ఏర్పాటు చేసారు, ఇంకా కాకతీయ, ప్రియ దర్శిని, రాక్ ల్యాండ్, విష్ణు, సాగర్ వంటి అనేక సిమెంట్ కర్మాగారాలు ఇక్కడ ఉన్నాయి.

రవాణా మార్గాలు:- రెండు జాతీయ రహదారులు జిల్లా గుండా వెళ్తున్నాయి, 9 వ నంబర్ జాతీయ రహదారి జిల్లాలోని సూర్యాపేట, నకిరేకల్, కోదాడ గుండా వెళ్తుంది, 202 వ నంబర్ జాతీయ రహదారి భువనగిరి గుండా వెళ్తుంది.


* బల్లార్ష నుండి సికింద్రాబాద్ ప్రధాన రైల్ మార్గం మధ్యలో జిల్లాలోని ఆలేరు,భువనగిరి రైల్వే స్టేషన్ లు  ఉంటాయి, హైదరాబాద్ నుండి గుంటూరు వెళ్ళే రైల్ మార్గం నల్గొండ పట్టణం గుండా వెళ్తుంది. 
విద్య:-జిల్లాలో 2007 వ సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం మహాత్మా గాంధి విశ్వ విద్యాలయం ను ఏర్పాటు చేసింది, జిల్లాలో 2001 జనాభా లెక్కల ప్రకారం 58 శాతం విద్యావంతులు ఉన్నారు.
* జిల్లాలో స్వామి రామానంద్ తీర్థ ఇన్స్టిట్యూట్ అఫ్ సైన్సు అండ్ టెక్నాలజీ చాల ప్రముఖమైనది.
ఫ్లోరైడ్:-జిల్లా ఎదుర్కుంటున్న ప్రధాన సమస్య ఫ్లోరైడ్, వందల గ్రామాల ప్రజలు ఫ్లోరైడ్ బారిన పడి జవసత్వాలు కోల్పోయారు, నీటిలో ఫ్లోరైడ్ శాతం అధికంగా ఉండటం వల్ల తాగే నీరే విషం అవుతుంది, ఆ నీటితో పండిన కూరగాయలు, పండ్లు అన్ని విషమే అవుతున్నాయి, సమైక్య రాష్ట్రం చేసిన తెలంగాణకు చేసిన గాయం ఇది,  బొక్కల్లో సత్తువ లేక వంగి పోవడం, విరిగి పోవడం, ఎత్తు పెరగక పోవడం, ఎంత వయసు వారైన శారీరికంగా అభివృద్ది చెందక పోవడం వంటి అనేఖ సమస్యలకు ఈ ఫ్లోరైడ్ భూతం కారణం,స్వాతంత్ర్యం వచ్చి 60 సంవత్సరాలు గడుతున్న పాలకులు ఈ సమస్యను  పట్టించుకోవడం లేదు, నల్గొండ లో దేశం లోనే అతి పెద్ద ప్రాజెక్ట్ లలో ఒక్కటైనా నాగార్జున సాగర్ ఉంది, కాని వారికి కనీసం తాగడానికి కూడా స్వచ్చమైన నీరు దొరకని పరిస్థితి, వీరి తల రాతలు మారాలంటే తెలంగాణా రాష్ట్రం మినహా మరో దారే లేదు.

జిల్లాలోని ప్రముఖులు:-
* రావి నారాయణ్ రెడ్డి: ఆంద్ర మహా సభ నాయకుడు, తెలంగాణా సాయుధ పోరాట నాయకుడు.
* కోదాటి నారాయణ రావు:
* పులిజాల వెంకట రంగ రావు :
* ఆరుట్ల రామ్ చంద్ర రెడ్డి:ఆంద్ర మహా సభ సభ్యుడు, సాయుధ పోరాట యోధుడు.
* ఆరుట్ల కమల దేవి:ఆంద్ర మహా సభ మహిళా నాయకురాలు. 
* లక్ష్మి నరసింహ రెడ్డి:
* కొండల రావు: ఈయన ను దేవరకొండ గాంధీ అంటారు.
* సి వి చారి:భూదాన ఉద్యమ నేత.
* శబ్నవీసు వెంకట నరసింహా రావు: నీలగిరి పత్రిక ఎడిటర్.
* పెద వెంకట రామారావు:
* కంచర్ల రామ కృష్ణ రెడ్డి:
* ఎ హరికృష్ణ రావు:ఆంద్ర సారస్వత పరిషత్ స్థాపకులు.
* రామచంద్ర రెడ్డి: భూదాన్ ఉద్యమ నేత.
* డి వెంకటేశ్వర రావు:
* నిమ్మల రాములు:ఆర్య సమాజ్ తరపున ఉద్యమ నేత.
* నర్ర రాఘవ రెడ్డి:
* చకిలం రంగ రావు:గ్రందాలయ ఉద్యమ నేత.
* ఉమ్మేత్తల కేశవరావు:రచయిత, గ్రంధాలయ, భూదాన ఉద్యమ నేత.
మరికొంతమంది ప్రముఖులు:
* విమలక్క: అరుణోదయ సాంస్కృతిక కళా వేదిక అధ్యక్షురాలు, ప్రజా గాయకురాలు.
* ఎన్. శంకర్: సుప్రసిద్ధ తెలుగు దర్శకుడు.
సుద్దాల అశోక్ తేజ,ఉత్తేజ్, వేణుమాధవ్...

పోరాటాల ఖిల్లా:- తెలంగాణా సాయుధ రైతాంగ పోరాటం ప్రారంభించిన జిల్లా, జమిందార్, జాగిర్దార్, దేశ్ ముఖ్లను తరిమి కొట్టిన జిల్లా, మట్టి మనుషులతో మహత్తర పోరాటం చేయించిన జిల్లా నల్లగొండ జిల్లా నాటి తెలంగాణా సాయుధ పోరాటం నుండి నేటి మలిదశ పోరు వరకు నల్గొండ తన పోరాట పటిమను తెలియజేస్తూనే ఉంది. ఉద్యమ సారథి ఐన రావి నాయరణ రెడ్డి, ఆరుట్ల రామ్ చంద్ర రెడ్డి, ఆరుట్ల కమల, లాంటి ప్రముఖులు ఈ జిల్లా వారే , తెలంగాణా మొత్తం సాయుధ పోరాటం లో నాలుగు వేల మంది మరణిస్తే అందులో రెండు వేల మంది నల్గొండ వారె కావడం ఇక్కడి ఉద్యమ తీవ్రతను తెలియజేస్తుంది, సుద్దాల హన్మంతు పాడిన వేయ్, వేయ్ పాటతో ఉత్తేజితులైన జనం దేశ్ ముఖ్ మనుషులను తరిమి కొట్టారు, యాదగిరి ఆశువుగా పాడిన బండెనుక బండి కట్టి పాట తెలంగాణకు వందేమాతరం అయ్యింది.
  బేతవోలులో, కొలనుపాక, మనుగోడుల్లో రైతులు సాయుధ దళాలుగా ఏర్పడి పోరాటం కొనసాగించారు, ఆ ప్రాంతాల్లోని దేశ్ ముఖ్ లు వేసే పన్నులు, పెట్టె చిత్రహింసలు బరించలేక జనం తిరగబడ్డారు.ఇలా రైతాంగ తిరుగుబాటు ఆ తర్వాత అనేక గ్రామాలకు విస్తరించి దొరలను ఊర్ల నుండి తరిమి కొట్టారు.
      ప్రస్తుత ఉద్యమంలో కూడా నల్లగొండ చురుకైన పాత్ర పోషిస్తుంది, జిల్లాలోని ప్రజలు వివిధ రూపాల్లో తమ నిరసన తెలియ జేసారు, ఆంద్ర కు తెలంగాణా కు సరిహద్దు గ్రామాల్లో రోడ్ పై గోడలు కట్టి తమ నిరసనలు తెలిపారు, విజయవాడ వెళ్ళే పవేట్ వాహనాలను అడ్డగించారు,ఇలా జిల్లా తెలంగాణా ఉద్యమాలకు పట్టు కొమ్మగా ఉంది.