హోం

4, ఆగస్టు 2012, శనివారం

ఘనత వహించిన చంద్రఘడ్ కోట



రాజులు, రాజ్యాలు కాలగమనంలో కలిసపోయినా ఆనాటి రాచరికపు వైభవానికి చంద్రఘడ్ కోట ప్రతీకగా నిలుస్తోంది. 

సంస్థానాల జిల్లాగా పేరు గాంచిన పాలమూరు జిల్లాలో శత్రు దుర్భేద్యంగా నిర్మితమై, గత చరిత్రను చాటుతోన్న ఘనమైన కోట ‘చంవూదఘడ్’. నర్వ మండలం ధర్మాపురం గ్రామ సమీపంలో కృష్ణానదికి 4 కి.మీ. దూరంలో ఎత్తయిన కొండపై ఈ కోట నెలకొని ఉంది.
అమరచింత, వడ్డేమాన్ గ్రామాల పరిగణాల నుంచి పన్నులు వసూలు చేసేందుకు రాజా తిమ్మాడ్డి చంద్రసేన యాదవుడనే సైనికాధికారిని నియమించినట్లు, అతడే తన పేర ఈ చంద్రఘడ్ కోటను, తన భార్య పేరున ధర్మాపురం గ్రామాన్ని నిర్మించినట్లు చరివూతకారులు చెబుతున్నారు. చంద్రసేనుడి అభ్యర్థనను మన్నించి రాజా తిమ్మాడ్డి ఐదు వందల అడుగుల ఎత్తున్న కొండపై ఈ కోట నిర్మాణం చేపట్టినట్లు తెలుస్తోంది. 

500 ఏళ్ళకుపైగా చరిత్ర కలిగి ఉన్న చంద్రఘడ్ కోట నిర్మాణంపై భిన్న కథనాలున్నాయి. పూర్వం ఈ పరిసరాలకు వేటకోసం వెళ్లిన చంద్రసేనుడికి వింత అనుభవం ఎదురైనట్టు చెప్తారు. ఈ ప్రాంతంలో వేటకుక్కలను కుందేళ్ళు తరిమివేసిన సంఘటన చోటు చేసుకుందట. దీంతో ఇక్కడ కోట నిర్మించాలని నాటి రాజు భావించినట్లు చెబుతారు. మరో వాదన కూడా ఉంది. ఇది ఎత్తయిన ప్రాంతమేకాక శత్రువులను కనిపె అనువైన స్థలం కావడం, నీటి ప్రాముఖ్యం ఉండటంతో ఇక్కడ కోట నిర్మాణానికి పూనుకున్నట్లు తెలుస్తోంది.

chandragat01చంద్రఘడ్ కోటకు వెళ్ళేందుకు గతంలో ఒకవైపు మాత్రమే కాలిబాట ఉండేది. ప్రస్తుతం కోట వెనక వైపు నుండి చిన్న రోడ్డు వేశారు. కోట తూర్పువైపున గల కోనేరు నుంచి కృష్ణానది వరకు సొరంగ మార్గం ఉండేదని, అందుకే అన్ని కాలాలలోనూ ఇక్కడ నీరు సమృద్ధిగా లభించేదని స్థానికుల కథనం. కోటలో శివాలయాన్నీ నిర్మించారు. ఈ ఆలయాన్ని ఇప్పటికీ భక్తులు దర్శించి పూజలు చేస్తుంటారు. ఆ కోటకు చెందిన ఎత్తయిన బురుజులు నేటికీ చెక్కుచెదరకుండా సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

చరివూతకు ప్రతిబింబంగా నిలిచిన అపురూప సంపదను పరిరక్షించుకోవడంలో ప్రభుత్వాలు ఘోర వైఫల్యం చెందుతున్నాయి. ఎంతో ఘన చరిత్ర ఉన్న ఈ చంద్రఘడ్ కోట పరిరక్షణ కోసం పర్యాటక శాఖ కానీ, పురావాస్తు శాఖ కానీ దృష్టి సారించకపోవడం దురదృష్టకరం. చంద్రఘడ్ కోటకు చేరుకొనేందుకు సరైన రవాణా సౌకర్యమైనా లేదు. ఎలాగోలా కష్టపడి ఇక్కడికి చేరుకున్న సందర్శకులకు ఈ ప్రాంతంలో నిలువ నీడలేకపోవడం తీవ్ర నిరాశకు గురి చేస్తుంది. సరైన పర్యవేక్షణ కొరవడటంతో గుప్తనిధుల కోసం కోటను ద్వంసం చేస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి