హోం

4, ఆగస్టు 2012, శనివారం

తుర్రేబాజ్ ఖాన్



భారత స్వాతంత్య్ర పోరాటవీరుడు, ధైర్యశాలి తుర్రేబాజ్ ఖాన్. ఆయన హైదరాబాద్ నగరానికి చెందిన యువకుడు. క్రీ.శ 1800 సంవత్సరంలో నిజాం నవాబు బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీతో ఆర్థిక, వ్యాపార సంబంధ ఒప్పందాలను కుదుర్చుకున్నారు. దీంతో సంస్థానంలో ఆయనకు తీవ్ర వ్యతిరేకత తలెత్తింది. 1857లో దేశంలో తొలి స్వాతంత్య్ర పొలికేక ‘సిపాయిల తిరుగుబాటు’ ప్రారంభమైంది. దీన్ని స్ఫూర్తిగా తీసుకుని తుర్రేబాజ్ ఖాన్ స్వాతంత్య్ర పోరాటంలోకి దూకారు. సాహసవంతులైన 500 మంది యువకులతో, ఆ ఏడు జులై 17న కోఠీలోని బ్రిటిష్ రెసిడెన్సీ (ఇప్పటి కోఠీ ఉమెన్స్ కాలేజీ)పై దాడి చేశారు. బ్రిటిష్ సైన్యం తిరిగి కాల్పులు ప్రారంభించడంతో తృటిలో తప్పించుకున్నారు. తర్వాత జులై 22న బ్రిటిష్, నిజాం సైన్యాలకు దొరికిపోయారు. ఏడాదిన్నర జైలు జీవితం గడిపాక 1859 జనవరి 1న జైలు నుంచి తప్పించుకున్నారాయన. నిజాం ప్రభుత్వం ఖాన్‌ను పట్టిస్తే రూ.5000 నగదు బహుమతి ఇస్తామని ప్రకటించింది. ఓ ద్రోహి ఇచ్చిన సమాచారంతో 159 జనవరి 24న మెదక్ జిల్లా తూప్రాన్ దగ్గర ఖాన్‌ను బ్రిటీష్ సైనికులు దారుణంగా కాల్చి చంపారు. 

అంతేకాదు, ఖాన్ భౌతిక కాయాన్ని హైదరాబాద్ నగరానికి తీసుకొచ్చారు. ఇనుప సంకెళ్ళతో బంధించి కోఠిలోని సుల్తాన్ బజార్‌లో రెండు రోజులు నగ్నంగా వేలాడదీశారు. ఆయన స్మారకార్థం కోఠీలో స్థూపాన్ని నిర్మించారు. కోఠి నుంచి ఆబిడ్స్ వరకూ వెళ్లే రోడ్డుకు ‘ఖాన్ రోడ్’గా నామకరణం చేశారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి