పరకాల లో టి ఆర్ ఎస్ విజయాన్ని జీర్ణించుకోలేని సీమంద్ర చానెళ్ళు, సీమంద్ర రాజకీయనాయకులు ఒక దుష్ప్రచారాన్ని ప్రారంభించారు, తెలంగాణా వాదం తగ్గింది దీనికి నిదర్శనమే 1500 మెజారిటీ అని,
ఒక చిలక జ్యోతిష్యుడైతే 67% ప్రజలు సమైక్యన్ద్రకు ఓటు వేసారని సెలవిచ్చారు. తెల్కపల్లి రవి లాంటి ఎస్ మేధావులు కూడా టి ఆర్ ఎస్ మెజారిటి పూర్తిగా తగ్గిందని సెలవిచ్చారు, గతం లో 40,000 మెజారిటీ లు సాధించిన పార్టీ క్రమంగా పతనముతుందని ఒక్క స్థానం కూడా గెలవని పచ్చ దళం మోత్కుపల్లి వాగాడు, ఇంత నోరువేసుకొని అరిచే అంబటి సైతం మేమే నైతికంగా గెలిచాం అని సిగ్గులేకుండా గర్వపడ్డాడు..
గతంలో పరిస్థితి ఇప్పటి పరిస్థితి వేరు, గతం లో టి ఆర్ ఎస్ ఎం ఎల్ ఎ లు రాజీనామా చేసినపుడు ఆ మెజారిటి లు వచ్చాయి, సాధారణంగా ఎ ఉప ఎన్నికలో ఐన రాజీనామా చేసిన అభ్యర్థులు గెలవడం సర్వ సాధారణం ఆ రోజు 90000 మెజారిటి తో హరీష్ రావు గెలిచారు, మిగతావారు కూడా 50000 పైగా మెజారిటీ తో గెలిచారు, అప్పుడు ఈ సీమంద్ర నాయకులు రాజీనామా చేసిన స్థానాల్లో వచ్చే ఉపఎన్నికల్లో సిట్టింగ్ ఎం ఎల్ ఎ గెలవడం సాధారణమే అన్నారు.
మరి ఈ రోజు జరిగింది ఏమిటి..? సిట్టింగ్ ఎం ఎల్ ఎ ఒడి పోయింది, 40000-500000 మెజారిటీ రావలసిన కొండ సురేఖ ప్రత్యర్ధి చేతిలో 1500 ఓట్ల తేడాతో ఓడిపోయింది, అయితే ఇదో గెలుప.. దీనీతో టి ఆర్ ఎస్ చావుదెబ్బ తిన్నది అన్న జగన్ పార్టీ ముర్కులకు, కాంగ్రెస్ పార్టీ వెధవలకు ఒకటే సమాధానం మూడు సార్లు ఎం ఎల్ ఎ గా గెలిచి, మంత్రి పదవి వెలగబెట్టిన కొండా చావుదెబ్బ తిన్నాదా.. లేఖ అక్కడ కనీసం ఒక్క సారి కూడా గెలవని టి ఆర్ ఎస్ గెలిచిందంటే ఎవరు చచ్చారు ఎవరు బతికారు..? గతం లో 1వచ్చిన 12000 మెజారిటీ ఎక్కడ పోయింది..? ఒక వేల కొండా సురేఖ చివరి రౌండ్ లో గెలిస్తే ఎంత మెజారిటీ వచ్చేది..? అదే 1000 ఓట్ల మెజారిటీ ఏ కదా అంటే ఎంతకు దిగాజారింధన్నట్టు..? అదే సురేఖ 1500 ఓట్లు తక్కువగా వచ్చి ఓడిపోయిన్దంటే ఇది నైతిక విజయమా... లేఖ చావుదెబ్భా..?
గత సార్వత్రిక ఎన్నికల్లో 12000 మెజారిటీ తో ఓడిన అభ్యర్థి ఇప్పుడు 1500 ఓట్ల మెజారిటీ తో గెలిచాడంటే కాంగ్రెస్ లో ఉన్న కొండా సురేఖను జనం నమ్మరా..? జగన్ పార్టీ లో కొండా సురేఖను నమ్మరా..?
తెలంగాణా వాదం తగ్గింది అనే సుంటలకు ఒకటే మాట, అసలు పరకాలలో రాజీనామా చేసింది ఎవరు..? బిక్షపతి అవునా కాదా..? గత ఎన్నికల్లో 12000 మెజారిటీతో గెలిచిన భిక్షపతి తెలంగాణా కోసం రాజీనామా చేసి ఉపఎన్నికలకు వెళ్తే జగన్ పార్టీ నాయకురాలు కొండా సురేఖ గట్టిపోటీ ఇచ్చి మెజారిటీ ని అమాంతం తగ్గించే సరికి అతికష్టం మీద బిక్షపతి 1500 ఓట్లతో గట్టేక్కాడు.కాబట్టి గతంలో 12000 మెజారిటీతో గెలిచినా బిక్షపతి ఈ సారి 1500 మెజారిటీ తో గెలిచాడు అంటే చావుతప్పి కన్ను లొట్ట పోయింది అన్నట్టు, తెలంగాణా వాదం గోరంగా తగ్గినట్టు ..అంతే గా కాని ఇక్కడ జరిగింది ఏమిటి..? గతంలో బిక్షపతి గెలవలేదు, ఓడిపోయినా బిక్షపతి ఇప్పుడు గెలిచాడు, అది రాజీనామా చేసి ఉపఎన్నికకు పోయిన అభ్యర్థి మీద..అంటే జగన్ వాదం మీద తెలంగాణా వాదం గెలిచింది కదా..
ఐన సీమంద్ర ఛానల్ లు అన్ని పని కట్టుకొని గెలిచిన పార్టీ మీద లేని పోనీ కధనాలు ప్రచారం చేస్తున్నారు, తెలంగాణా లో జగన్ పార్టీ పోటికి దిగిన ఒకే ఒక స్థానం లో ఓడిపోయింది అనే విషయం వీరికి తెలియద ..? ఆంద్ర లో 30000 మెజారిటి లతో రాజీనామా చేసిన అభ్యర్థులు గెలిస్తే ఇక్కడ కొండ సురేఖ 30 000 మెజారిటీ సంగతి దేవుడెరుగు కనీసం ఒక్క ఓటు ఎక్కువతేచ్చు కొని గెలవలేఖ పోయింది, మొన్నటి దాక మంత్రి, నిన్నటి దాక ఎం ఎల్ ఎ, మరి నేడు మాజీ .... ఇక నైతికంగా ఎక్కడ గెలిచింది..? కాంగ్రెస్ లో ఉంటె మంత్రిగా ఉండే సురేఖ జగన్ ను నమ్ముకొని మాజీ ఎం ఎల్ ఎ అయ్యింది అంటే ఇది జగన్ పార్టీ కి ఆ పార్టీ కి చెందిన అంబటి కి భలే గర్వకారణం, ఇది నిజంగా గోరమైన నైతిక విజయం కదా జగన్ పార్టీకి...
పర్కాల లో 67% జనం సమైక్యన్ద్రకే ఓటు వేసారు అనేవారు, సీమంద్ర ఉప ఎన్నికల ప్రచారం లో పదె పదే జగన్ కు ఓటేస్తే రాష్ట్ర విబజన జరుగుతుంది అని ప్రచారం చేసారు, అయితే అక్కడి జనం జగన్ కు అఖండ మెజారిటీ తో గెలిపించారు, సమైక్యంద్ర అన్న పార్టీలను ఓడించారు, అంటే సీమంద్రలో 100% ప్రజలు రాష్ట్ర విభజనకు అనుకూలం అనే కదా అర్ధం..... సీమంద్ర ప్రజల తీర్పు ఇదే కదా, మరి ఇప్పుడు ఏమంటారు..?
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి