30, ఏప్రిల్ 2013, మంగళవారం
29, ఏప్రిల్ 2013, సోమవారం
బయ్యారం ఉక్కు-తెలంగాణ హక్కు..!
విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు’ అంటూ ఉక్కు కర్మాగారం సాధించుకున్న విషయం ఆంధ్ర పెత్తందారులు అప్పుడే మరిచి పోయినట్టున్నారు. కేజీ బేసిన్ గ్యాస్‌పై మాకు హక్కు లేదా అంటూ అరిచి గీ పెట్టిన నిన్నమొన్నటి విషయం కూడా మరిచి పోయినట్టు చాలా గొప్పగా నటిస్తున్నారు! ఇప్పుడు ఈ పెద్దమనుషులకు బయ్యారంలో ఉక్కు కర్మాగారం పెట్టమని అడుగుతున్న తెలంగాణ వారిలో ప్రాంతీయ సంకుచితత్వం కనబడుతున్నది! బయ్యారం ఖనిజం జాతీయ సంపద కనుక ఆంధ్ర ప్రాంతానికి తరలించవచ్చని కూడబలుక్కుని నీతులు చెబుతున్నారు.విశాఖ ఉక్కు, కేజీ బేసిన్‌గ్యాస్ తమ హక్కని చేస్తున్న ఆంధ్ర పెద్దల వాదన కన్నా బయ్యారం ఉక్కు మా హక్కు అని తెలంగాణ జనం చేస్తున్న నినాదంలో న్యాయం ఉన్నది, నీతి ఉన్నది.
విశాఖ పట్నంలోని ఉక్కు ఫ్యాక్టరీ జాతీయ పరిక్షిశమ అనీ, అది మనందరిదీ అనీ, దానికి బయ్యారం ఖనిజాన్ని తరలించడంలో తప్పులేదని ముఖ్యమంత్రి అంటున్నారు. నిజాని కి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఎవరిదనే ప్రశ్న తెలంగాణ వారు అడగడం లేదు. విశాఖ పట్నంలో ఉక్కు ఫ్యాక్టరీ పెట్టమని కోరే హక్కు ఆంధ్రవారికి ఎంత ఉన్నదో, ఖనిజం పుష్కలంగా లభిస్తున్న బయ్యారంలో తమకు కూడా ఒక ఉక్కు ఫ్యాక్టరీ పెట్టమని కోరే హక్కు తెలంగాణ వారికి అంత ఉన్నది. ఇక్కడ ఉక్కు ఫ్యాక్టరీ పెట్టాలనే ప్రతిపాదన గతంలో ఉన్నదే.
తెలంగాణలో ఉక్కు ఫ్యాక్టరీ పెట్టకుండా మా నోరు కొట్టే హక్కు మీకెవరిచ్చారు అని స్థానికులు అడుగుతున్నారు. ఆంధ్ర పెద్దలు వల్లిస్తున్న నీతి సూత్రాల ప్రకారం-కేజీ బేసిన్ గ్యాస్ కూడా జాతీయ సంపద. కానీ ఈ గ్యాస్‌లో రాష్ట్రానికి వాటా ఉండాలని 2009 ఆగస్టులో అసెంబ్లీలో అధికారపతిపక్షాలు పోటీపడి మాట్లాడలేదా? ఇదే నెలలో రాష్ట్ర ఎంపీలు సహజవాయువులో తమ రాష్ట్రానికి హక్కు ఉందంటూ పార్లమెంటులో గొడవ చేసినప్పు డు ఆంధ్ర పత్రికలు పంచరంగుల్లో ముద్రించలేదా? ఆనాడు ఆంధ్ర ఎంపీలతో పాటు తెలంగాణ సభ్యులు కూడా గొంతు కలపలేదా? అదే తెలంగాణ వారు బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ పెట్టాలని అడిగినప్పుడే ఖనిజం జాతీయ సంపద అనే విషయం గుర్తుకు వస్తున్నదా!
బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ పెడుతున్నారనే వింత (ఖ)‘నిజా’న్ని కొందరు ఆంధ్ర నాయకులు, మీడియా పెద్దలు ప్రచారంలో పెట్టారు. ఆంధ్ర పెత్తందారులు ఇటువంటి అతి తెలివితోనే ఇంత కాలం తమను మోసపుచ్చారనేది తెలంగాణ ప్రజలకు తెలుసు కనుకనే ఈ ‘నిజా’న్ని పట్టించుకోవడం లేదు. ఇప్పుడు మొదటి దశలో బయ్యారంలో బెనిఫికేషన్ ప్లాంట్ పెడతారట! తద్వారా శుద్ధిచేసిన ఖనిజాన్ని ఆంధ్రలోని విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి తరలిస్తారట. ఆ తరువాత కాలంలో అసలు ఉక్కు కర్మాగారం బయ్యారంలో పెడతారట! 1956లో విలీనం సందర్భంగా ఆంధ్ర ప్రభువులు ఇచ్చిన హామీల చిట్టాలు తెరిచి చూస్తే, ఆ తరువాత జరిగింది గమనిస్తే ఈ (ఖ)‘నిజం’ అనేకరూపాల్లో కనిపిస్తుంది! తెలంగాణ వారికి హామీల కాగితాలు ఉంటాయి. ఆంధ్రకు వనరులు, నిధులు తరలిపోతాయి! ఇదేమి అన్యాయమని ప్రశ్నిస్తే కేంద్ర, రాష్ట్ర పాలకుల ‘రహస్య అధ్యాయం’ అమలు జరుగుతూ ఉంటుంది. పెద్ద మనుషుల ఒప్పందం, ఎస్సార్సీ నివేదిక, ప్రాంతీయ మండలి... ఇట్లా చెప్పుకుంటూ పోతే చాంతాడు చిన్నదవుతుంది.
610 జీవో సీమాంధ్ర నుంచి తెలంగాణ వారిని పంపించడానికి పనికి వస్తుంది కానీ, తెలంగాణ నుంచి స్థానికేతరులను పంపడానికి పనికి రాదు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నీళ్ళు పారించుకోవడానికి కాలువలు సన్నగా ఉంటాయి. దశాబ్దాలు గడిచినా కాలువలు పెద్దగ తవ్వరు. పోలవరం ప్రాజెక్టుకు అనుమతి రాకముందే కాలువలు తవ్వుతరు. భూగోళం ఏమూలన కానీ ప్రాజెక్టులు కట్టకముందే కాలువలు తవ్విన వింత ఉన్నదా! ఈ పెద్ద మనుషుల మాట నమ్మి-ఇప్పుడు బయ్యారంలో కాలుష్యాన్ని చిమ్మే శుద్ధి ఫ్యాక్టరీని నెత్తిల పెట్టుకుని అసలు ఖనిజాన్ని ఆంధ్ర ప్రాంతంలోకి తరలించాలట. భవిష్యత్తులో బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ పెడతామనే హామీ కాగితాన్ని పట్టుకుని తెలంగాణ జనం గంతులేయాలట! ఉక్కు ఫ్యాక్టరీ హామీకి నేదునూరు విద్యుత్కేంద్రం గతే పడుతుందని తెలంగాణ ప్రజలకు తెలుసు. అందుకే ఆ హామీలు కాదు, అసలు ఉక్కు ఫ్యాక్టరీ కావాలనే అడుగుతున్నారు.
విశాఖలో ఉక్కు ఫ్యాక్టరీ ఎందుకు అడుక్కున్నారో, దానికి ఖనిజం ఎక్కడి నుంచి తెద్దామనుకున్నారో, ఆ పోరాటానికి ప్రాతిపదిక ఏమిటో తెలంగాణ ప్రజలు ప్రశ్నించడం లేదు. ఈ ఫ్యాక్టరీకి ఒడిషా నుంచి ఖనిజం వస్తున్నదని, వారు కూడా ఇదే విధంగా అభ్యంతరం చెబితే ఎలా అని ఒక ఆంధ్ర పెద్ద మనిషికి ధర్మసందేహం వచ్చింది. అది జాతీయ పరిక్షిశ మ అని వీరే అంటున్నప్పుడు ఆ సరఫరా సంగతి కేంద్రమే చూసుకుంటుంది కదా? మరి వీరికి ఎందుకు కడుపు నొప్పి అని అడిగితే సమాధానం ఏమని ఇస్తారు? ఉక్కు ఫ్యాక్టరీ పెట్టడంవల్ల తమ ప్రాంతం లబ్ధి పొందాలని, తమ ప్రాంతం వారికి ఉద్యోగాలు రావాలని వారు భావించినట్టే ఇప్పుడు తెలంగాణ ప్రజలు భావించడంలో తప్పేమిటి? అయినా జాతీయ సంపద అని చెబుతున్న విశాఖ ఉక్కులో తెలంగాణ ఉద్యోగులు మూడు శాతం మాత్రమే అని లెక్కలు నిర్ధారిస్తున్నాయి. బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మిస్తే తెలంగాణ నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయనేది కదా ఇక్కడి ప్రజల కోరిక.
కేజీ బేసిన్‌గ్యాస్‌ను గుజరాత్ సంస్థ బిడ్డింగ్ ద్వారా సాధించుకున్నది. గుజరాత్‌కు ఆంధ్ర వనరులను దోచుకున్న చరిత్ర ఏమీ లేదు. ఖనిజ వనరులు జాతీయ సంపద అని తెలంగాణ వారికి చెబుతున్న నీతిని ఆంధ్ర పెద్దలు గుర్తుంచుకుంటే, గుజరాత్ సంస్థకు గ్యాస్ తరలింపును వ్యతిరేకించడానికి ప్రాతిపదిక ఏమీ ఉండదు. కానీ తెలంగాణ వనరుల దోపిడీ కండ్ల ముందు కనబడుతున్న వాస్తవం. ఆంధ్ర పాలక వర్గ దోపిడీకి వ్యతిరేకంగా ఉద్యమం నడుస్తున్నది. తమ వనరులు పరాయి ప్రాంతానికి తరలిపోకుండా తెలంగాణ జనం పోరాడుతున్నారు. బయ్యారం పోరాటానికి ఇటువంటి న్యాయమైన నేపథ్యం ఉన్నది. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీపై ఉత్త హామీ ఇచ్చి ఉక్కును తరలించాలని చూస్తున్నారనేది వాస్తవం. అయినా ఇదేమీ సత్యం కానట్టు, బయ్యారం ఉక్కు తెలంగాణ హక్కు డిమాండ్ అసంబద్ధమైనట్టు నీతి పలుకులు పలకడం ఆశ్చర్యంగా ఉన్నది.
తెలంగాణ ఉద్యమం ఇంత బలంగా సాగుతున్నా లెక్క చేయకుండా బయ్యారం గనులను విశాఖ ఉక్కు కర్మాగారానికి కట్టబెట్టడం ఆంధ్ర పాలకుల వలస దురహంకారానికి నిదర్శనం. ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకునే ముందు ఇక్కడి ప్రజలను కూడా సంప్రదించక పోవడం అప్రజాస్వామికం. కనీసం రాజకీయపక్షాలను కూడా సంప్రదించలేదు. ప్రభుత్వ నిర్ణయం- తెలంగాణ వనరులను ఇట్లనే దోచుకుంటాం, ‘ఏం చేసుకుంటారో చేసుకోండి’ అని ఉద్యమకారులను అవహేళన చేసినట్టుగా ఉన్నది.
విశాఖ ఉక్కు కర్మాగారానికి ఐదువేల హెక్టార్లకు పైగా ఇనుప ఖనిజం గనులను కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయించింది. ఈ వేల హెక్టార్ల ఖనిజ నిల్వలు అన్నీ తెలంగాణ ప్రాంతంలోనివే కావడం దిగ్భ్రాంతికరం. ఖమ్మంజిల్లా బయ్యారంలో 2500 హెక్టార్లు, వరంగల్ జిల్లా గూడూరు ప్రాంతంలోనిది మరో 2500 హెక్టార్లు కాగా మిగతా 342 హెక్టార్లు కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి ప్రాంతంలోనిది. తెలంగాణ ప్రాంతం నుంచి ఇంత పెద్ద ఎత్తున ఖనిజం తరలించడం కన్నా ఇక్కడే పరిక్షిశమ ఎందుకు పెట్టకూడదు? ముడి ఖనిజంతో పాటు పరిక్షిశమకు అవసరమైన భూమికి కొదువ లేదు. పక్కనే గోదావరి నది ఉన్నందు వల్ల నీటికి ఇబ్బంది ఉండదు. పరిక్షిశమకు అవసరమైన బొగ్గు కోసం సింగరేణి గనులే ఉన్నాయి! గనుల ప్రాంతంలోని వ్యవసాయ భూములు కోల్పోయి నిర్వాసితులు అయ్యేది తెలంగాణ జనమైతే, ఖనిజం మరో ప్రాంతానికి తరలించడమేమిటి? ఇక్కడే పెడితే స్థానికులకు వేలాది ఉద్యోగాలు లభిస్తాయి.
పరోక్షంగా ఇంకా అనేక మంది లబ్ది పొందుతారు. ఖమ్మం జిల్లా పాల్వంచలో 12 వందల కోట్ల రూపాయలతో ఉక్కు కర్మాగారం నిర్మించనున్నట్టు గతంలో జాతీయ ఖనిజాభివృద్ధి సంస్థ ప్రకటించింది కూడా. స్థానికంగా ఉన్న హంగులతో పాటు మార్కెట్‌ను పరిగణనలోకి తీసుకుంటే ఇక్కడ ఉక్కు కర్మాగార నిర్మాణం గిట్టుబాటవుతుందనేది స్థిరపడిన అభివూపాయం. రాష్ట్ర ప్రభుత్వానికి నిజాయితీ ఉంటే దీనిని పూర్తి చేయించడానికి కృషి సాగించాల్సింది. ఈ గనులను సింగరేణి కాలరీస్‌కు అప్పగించినా ఉక్కు కర్మాగార నిర్మాణం చక్కగా సాగేది. కానీ ఇక్కడి గనులను ఆంధ్ర పెత్తందారుకు కట్టబెట్టడానికో, లేదా ఆంధ్ర ప్రాంతానికి తరలించుకు పోవడానికే ప్రాధాన్యం ఇస్తున్నది.
తెలంగాణ ప్రజల వనరులు ఇక్కడి ప్రజలకు న్యాయంగా దక్కాలని, ఇక్కడి ప్రజల హక్కులు గౌరవించాలని సీమాంధ్ర పాలకులు ఏనాడూ భావించలేదు. బయ్యారం గనులను కొల్లగొట్టడానికి కుట్ర పన్నడం ఇది మొదటిసారి కాదు. వైఎస్ ముఖ్యమంవూతిగా ఉన్నప్పుడే మొదలైంది. 2009 ఎన్నికలకు ముందు వైఎస్ బంధువు అయిన బ్రదర్ అనిల్‌కు బినామీ సంస్థగా చెబుతున్న రక్షణ స్టీల్స్‌కు కేటాయించడానికి రాష్ట్ర ప్రభుత్వం డొంక దారిని ఎంచుకున్నది. గిరిజనుల ప్రాంతంలోని గనులను ఇతరులకు కేటాయించకూడదు. అదే ప్రభుత్వ రంగ సంస్థ అయితే ప్రాధాన్యం లభిస్తుంది. ఈ లొసుగును ఆసరాగా తీసుకుని రక్షణ స్టీల్స్‌కు కేటాయించడానికి కుట్ర జరిగింది. ఇందు లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ గనులను రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థకు రిజర్వు చేయాలంటూ కేంద్రాన్ని కోరింది.
కేంద్ర నిర్ణయం జరగకముందే- ఈ ఖనిజాభివృద్ధి సంస్థ రక్షణ స్టీల్స్‌తో ఒప్పందం కుదుర్చుకున్నది. ఖనిజాన్ని తవ్వితీయడం వరకే ఖనిజాభివృద్ధి సంస్థ బాధ్యత. ఆ తరువాత దానిని రక్షణ స్టీల్స్‌కు అప్పగించాలె. అంటే చట్టంలోని లొసుగులను ఆసరాగా చేసుకుని ఖనిజాన్ని దోచుకోవడమే. బయ్యారం గనులను రక్షణ స్టీల్స్‌కు కట్టబెట్టడానికి వ్యతిరేకంగా ఆనాడు తెలంగాణ జనం పోరాడారు. జనం అడ్డు చెబుతారని తెలసి కూడా ఇప్పుడు మళ్ళీ ఇవే గనులను నిర్లజ్జగా ఆంధ్ర ప్రాంతానికి తరలించడానికి కుట్ర మొదలైంది. స్థానికంగా ఉక్కు కర్మాగారం నిర్మించే ప్రతిపాదన గతంలో వచ్చినప్పుడు, దానిని ముందుకు తీసుకుపోకుండా ఆంధ్ర ప్రాంత పెత్తందారులకు లేదా సంస్థలకు కట్టబెట్టాలనుకోవడం వివక్షే. ఖనిజం నుంచి ఇతర నిరర్థక పదార్థాన్ని విడదీసే బెనిఫికేషన్ ప్లాంట్‌ను స్థానికంగా నెలకొల్పి ఖనిజాన్ని విశాఖ ఉక్కు కర్మాగారానికి తరలించే ఆలోచన కూడా ఉన్నది. దీని వల్ల స్థానికులకు కాలుష్యం దక్కుతుంది తప్ప ప్రయోజనం ఏమీ ఉండదనే విమర్శలు ఉన్నా యి. అందువల్ల తెలంగాణలో ఉక్కు కర్మాగారాన్ని నెలకొల్పడమే సముచితంగా ఉంటుంది.
ప్రపంచ వ్యాప్తంగా భూమి పుత్రులు తమ వనరుల రక్షణ కోసం ఉద్యమిస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో కూడా వనరుల పరిరక్షణ అనేది కీలకమైన అంశం. ఇక్కడి భూమి, అడవులు, నీళ్ళు, గనులు మొదలైన వనరుల పరిరక్షణ కోసం ఎవరికి తోచిన రీతిలో వారు ఉద్యమాలు సాగిస్తూనే ఉన్నారు. సీమాంధ్ర పాలక వర్గం మాత్రం తెలంగాణ వనరులు స్థానికులకు దక్కకుండా చేస్తూ కుట్ర పూరితంగా కొల్లగొడుతున్నారు. ఉదాహరణకు బొగ్గు ఇక్కడ లభించినా విద్యుత్ కేంద్రాలను ఇక్కడ నిర్మించడం లేదు. మన కండ్ల ముందే బొగ్గు తరలిపోతున్నది. జనం ఉద్యమిస్తుండగానే నీళ్ళ తరలింపు సాగుతున్నది. మరోవైపు భూములు ఆక్రమణకు గురవుతున్నాయి.
నిజాం కాలం నాడే సింగరేణి బొగ్గు గనుల ఆధారంగా పరిక్షిశమలు పెట్టి, ఈ ప్రాంతాన్ని ‘మాంచెష్టర్ ఆఫ్ ఇండియా’గా అభివృద్ధి చేయాలనే పథకం ఉండేది. కానీ సీమాంధ్ర పాలనలో ఎన్టీపీసీ, బొగ్గు గనుల్లోనే తెలంగాణ విద్యావంతులకు చోటు లేకుండా పోయింది. తెలంగాణ కార్మికులు ఆంధ్ర అధికారుల చేత వేధింపులకు గురవుతున్నారు. నిజాం కాలం నాటి పరిక్షిశమలన్నీ మూత పెట్టారు. ఇప్పుడు ఇనుప ఖనిజాన్ని తరలించడానికి కుట్ర సాగుతున్నది. ప్రకృతి సంపద సమృద్ధిగా ఉన్న తెలంగాణ పండ్ల గంప వంటిది. ఇక్కడి వనరులను స్థానిక ప్రయోజనాల కోసం వినియోగిస్తే తెలంగాణ బిడ్డలు పొట్ట తిప్పలు పడుతూ బొంబాయి, దుబాయి వలస పోయే దుర్గతి పట్టదు. తెలంగాణ ప్రజలు తమ వనరులపై తమకే హక్కు ఉందని పోరాడడం మినహా మార్గాంతరం లేదు.
తెలంగాణ ఉక్కు ఈప్రాంత ప్రజల హక్కు. ఈ ప్రాంతంలో ఎన్నో వనరులు ఉన్నప్పటికీ కష్టాలను, నష్టాలను భరిస్తూ సైతం ఉపాధి కోసం ఆరాటపడే పరిస్థితి ఏర్పడింది.ఉత్తర తెలంగాణలో ఓపెన్‌కాస్టు బొగ్గుబావులు, ఇప్పుడు వచ్చే ఇనుప ఖని జం గనులు ఉద్యోగాలు మాత్రం రావు. కానీ మిగిలేది జీవన విధ్వంసమే. అందుకే ఈ ప్రాంత ప్రజానీకం తెలంగాణ కావాలని డిమాండ్ చేస్తున్నారు.వలస పాలకుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడుతూనే ఉన్నారు. అపారమైన ఇనుప ఖనిజ సంపద తెలంగాణలో ఉన్న ది. దాన్ని తరలించుకుపోవడానికి సీమాంధ్ర ప్రభు త్వం జీవో జారీ చేసింది. ఆ జీవోను రద్దు చేసి తెలంగాణలోనే స్టీల్‌ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలి. ఇక్కడి వనరులు ఇక్కడనే ఉపయోగపడే విధంగా చర్యలు తీసుకోవాలి.
సీమాంధ్ర ప్రభుత్వం ఓపెన్‌కాస్టు బొగ్గుబావుల మాదిరిగా ఈ ఐరన్‌ఓర్ గనులను తవ్వి పెద్ద ఎత్తున విధ్వంసాన్ని సృష్టించడానికి కుట్రలు మొదలుపెట్టిం ది.ఖమ్మం, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో మొత్తం 5342 హెక్టార్ల నుంచి ఇనుప ఖనిజ సంపదను తీసుకెళ్లి...ఈ ప్రాంతాలలో దాదాపు 18 వేల ఎకరాలలో పంటలు పండకుండా మరో 50కి పైగా గ్రామాలలో, గూడాలలో విధ్వంసం సృష్టించడానికి ప్రభుత్వం సిద్ధమైందిపకృతి కనికరిస్తే పడి లేస్తూ బతుకుతున్న తెలంగాణ జీవనంలో మరింత విషం పోయడానికి పాలకులు కుట్రలు చేస్తున్నారు..పెల్లెట్, బెనిఫికేషన్ ఫ్యాక్టరీలు నాలుగేండ్ల లోపు ఏర్పాటు చేయడం, ఆ తరువాత ఖమ్మం జిల్లాలోనే స్టీల్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయడం లాంటి హామీలను ప్రభుత్వం ఇచ్చింది. విశా ఖ ఉక్కు జాతీయ కర్మాగారమని, దానికో సాకు చెప్పి నాలుగేండ్లలో పెద్ద ఎత్తున దాదాపు 200 సంవత్సరాలకు ఉక్కు ఫ్యాక్టరీ గనుక తెలంగాణలో (ఖమ్మం జిల్లా లో) ఏర్పాటు చేస్తే జీవితకాలం ఉండే పరిస్థితి ఉండ గా దాన్ని ఎంత వీలైతే అంత తొందరగా ఓపెన్‌కాస్టు బొగ్గు బావులనుంచి ఎలాగైతే బొగ్గును సీమాంవూధకు తరలించుకుపోతున్నారో అదే పద్ధతులలో ఇనుప ఖనిజాన్ని తరలించుకుపోవాలని చూస్తున్నది.
ఉక్కు ఫ్యాక్టరీ కనుక ఖమ్మం జిల్లాలో ఏర్పాటు చేస్తే దాదాపు 15 వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయి. భవిష్యత్తులో కాంట్రాక్టు, పర్మినెంట్ కార్మికులు కలిపి దాదాపు 25 వేల మందికి ఉపాధి దొరుకుతుంది. ఆ అవకాశం లేకుండా పెల్లెట్, బెనిఫికేషన్ ఫ్యాక్టరీల పేరి ట నాలుగు వేల మందికి ఉపాధి దొరుకుతుందని నమ్మ బలికి ఇక్కడి సంపదను తరలించుకుపోయే కుట్రకు తెర లేపారు. దీనివల్ల కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాలు ఎడారిలా మారే అవకాశం ఉంటుం ది. ఓపెన్‌కాస్టు గనుల వల్ల భూములు కోల్పోయిన ఆ ప్రాంత ప్రజలు ఇప్పటికీ తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలు చేస్తున్నారు. వారికి ఇప్పటికీ నష్టపరిహారం అందలేదు. ఇప్పుడు ఈ ఇనుప ఖనిజం వల్ల దాదాపు 50 గ్రామాల మీద ప్రభావం ఉంటుంది. వేలాది ఎకరాలలో పంటలు దెబ్బతింటా యి.
వేలాదిమంది తినే కంచాన్ని గుంజుకుని వారి ముందు విధ్వంసాన్ని వదిలి వెళ్ళినట్టు పరిస్థితి కానుం ది. దీనికితోడు గిరిపువూతులకు తోడు నీడగా ఉండే వేలా ది హెక్టార్ల అడవి నాశనం కానున్నది. ఒక బయ్యారం విషయంలో వాస్తవాలను మరుగున పెట్టుకుంటూ కేవలం పెల్లెట్ లాంటి చిన్న ప్లాంట్‌లను తెలంగాణకు పడేస్తే సరిపోతుందనే యావలో ప్రభుత్వం ఉన్నట్లు కన్పిస్తోంది. ఈనేపథ్యంలో కొనసాగుతున్న ఉద్యమం లో ప్రతి ఒక్క తెలంగాణవాది కలిసి రావాల్సిన అవసరం ఉందని, ఉద్యమంలో తెలంగాణ ప్రాం త రాజకీయ పార్టీలన్నీ పార్టీలకతీతంగా కలిసి రావాలి. బయ్యారం, గూడూరు, భీమదేవరపల్లి ఉక్కు తెలంగా ణ హక్కు అనే విషయాన్ని మర్చిపోవద్దు. ప్రభుత్వ ఇచ్చిన జీవో రద్దు చేసే వరకు, వనరులున్న చోటే స్టీల్ ప్లాంట్ ఏర్పాటు ప్రకటన వచ్చేంతవరకు ఉద్యమం కొనసాగించాల్సిందే.
23, ఏప్రిల్ 2013, మంగళవారం
మన ఆలయం -కీసరగుట్ట
హైదరాబాద్ మహానగర సమీపంలోని(రంగారెడ్డి జిల్లా లోని) కీసరగుట్ట రామలింగేశ్వర స్వామి ఆలయం ఎత్తైన కొండపై ప్రకృతి రమణీయత మధ్య కొలువై ఉంది, సికింద్రాబాద్ నుండి కేవలం 40 కిలో మీటర్ ల దూరంలో, ECIL నుండి 25 కిలో మీటర్ల దూరంలో ఉంది, శివరాత్రి రోజు ఇక్కడజరిగే ప్రత్యేక పూజలలో వేలాది మంది భక్త జనం పాల్గొంటారు.
స్థలపురాణం:
శ్రీ రాముడు రావణ వధ తర్వాత ఈ ప్రాంతాన్ని సందర్శించాడు, రావణ వధ తర్వాత బ్రహ్మ హత్యా పాతకం తొలగి పోవడానికి ఇక్కడ శివ లింగాన్ని ప్రతిష్టించి పూజించాలనుకున్నారు, హనుమంతున్నీ వారణాసి కి వెళ్లి శివ లింగాన్ని తీసుకురమ్మని పంపించాడు, అయితే హనుమంతుడు ఆలస్యం చెయ్యడంతో రాముడు శివున్ని ప్రార్ధిస్తాడు, అప్పుడు ప్రత్యక్షం ఐన శివుడు లింగరూపం లో ఇక్కడ వెలిసాడు, ఇక్కడ వెలిసిన లింగం స్వయంభు: లింగం, ఆ లింగాన్ని రాముడు పూజించాడు, ఆలస్యంగా చేరుకున్న ఆంజనేయుడు రాముడు వేరే లింగాన్ని ప్రతిష్టించడంతో తాను వెంట తెచ్చిన 101 లింగాలని ఆ ప్రాంతంలో విసిరి పారేసాడు, అందుకే ఈ గుట్టపై అనేక శివలింగాలు దర్శనమిస్తాయి. కేసరి సుతుడైన ఆంజనేయుడి పేరు మీదిగా కేసరి గుట్ట అనే పేరు వచ్చింది, కేసరి గుట్టె నేడు కీసర గుట్టగా పిలవబడుతుంది.
ఇక్కడ ఆలయం లో కొలువైన స్వామిని రాముడు ప్రతిష్టించాడు కావున రామలింగేశ్వర స్వామిగా పిలుస్తారు, భవాన్ని అమ్మవారు, శివ దుర్గా అమ్మవార్లు ఇక్కడ కొలువై భక్తుల కోర్కెలను తీరుస్తున్నారు, ఈ దేవాలయంలో లక్ష్మి నరసింహ స్వామి, శ్రీ సీతారాముల ఆలయాలు కూడా కొలువై ఉన్నాయి. శివ రాత్రి రోజు ఇక్కడ నిర్వహించే ప్రత్యేక పూజలలో వేలాదిగా భక్తజనం పాల్గొంటారు.
ఈ గుట్ట కింది భాగంలో ఆశ్రమాలు, యోగ కేంద్రాలను ఏర్పాటు చేసారు, ప్రశాంత మైన వాతావరణం తో పాటు కొండ సువిశాలంగా ఉండటం, కాలుష్యానికి దూరంగా ఉండడం మూలంగా గుట్టపైకి చేరుకోగానే భక్తులు అలౌకిక ఆనందానికి లోనవుతారు, ఇది ఆధ్యాత్మిక కేంద్రం గానే కాకుండా మంచి ప్రకృతి రమణీయ ప్రాంతం కూడా, ఇక్కడ ఉన్న సహజ అందాలకు తోడు దేవాలయ శాఖ వారు మరిన్ని సోగబులను తీర్చిదిద్దారు. గుట్టపైన పర్యాటకులను ఆకర్షించడానికి భారి ఆంజనేయ విగ్రహాన్ని ఏర్పాటుచేసారు, వానాకాలం లో లేదా చలికాలం లో ఈ కొండపై నుండి చూస్తే పచ్చని ప్రకృతి ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. కొండపైన విశాలమైన కాలి స్థలం ఉండడం వళ్ళ దీనిని విస్తరించడానికి పుష్కలం గా అవకాశాలు ఉన్నాయి.
అతి రాత్రం:
ప్రస్తుతం ఈ గుట్టపై కేరళ నుండి వచ్చిన వేద పండితుల ఆధ్వర్యంలో మహా యాగం అతిరాత్రం కన్నుల పండగగా నిర్వహించ బడుతుంది, గరుడ పక్షి ఆకారంలో నిర్మించిన భారి యజ్ఞ వాటికలో యజ్ఞాన్ని నిర్వహిస్తున్నారు, ఏప్రిల్ 24 వరకు జరిగే ఈ యాగంలో భక్తులు వేల సంఖ్యలో పాల్గొంటున్నారు.
(కీసరగుట్ట లోని ప్రకృతి సొగసులు)
20, ఏప్రిల్ 2013, శనివారం
రామప్పగుడికి 800 వసంతాలు..
ఏడాదిపాటు కాకతీయ ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటున్న ఈ సందర్భంలోనే భారత ప్రభుత్వం మన ఓరుగల్లు మహానగరాన్ని చారివూతాత్మక వారసత్వ నగరంగా గుర్తించింది. సరిగ్గా ఇదే సమయానికే, ప్రసిద్ధ పర్యాటక కేంద్రమైన పాలంపేట శ్రీ రుద్రేశ్వరాలయానికి (రామప్పగుడి) 800 సంవత్సరాలు పూర్తయ్యాయి. నిజానికి ఇంగ్లీషు క్యాలెండర్ ప్రకారం మార్చి 31కి సరిగ్గా దీన్ని నిర్మించి 800 సంవత్సరాలు పూర్తవుతాయి. తెలుగు తిథుల ప్రకారం చైత్ర శుక్ల అష్టమి అంటే ఏప్రిల్ 18 అవుతుంది. ఈ శుభసందర్భాన్ని పురస్కరించుకుని ఆ ఆలయ కళా విశేషాలను, కాకతీయుల శిల్పరీతిని వివరించే ప్రత్యేక వ్యాసం...
ఆచార్య హరి శివకుమార్:
ఆంధ్రపదేశ్ చరివూతలో కాకతీయుల పాలనా కాలం ఒక సువర్ణ అధ్యాయం. నేటి ఆంధ్రదేశాన్నే కాక, యావత్ దక్షిణ భారతదేశాన్నీ పరిపాలించిన కాకతీయులకు ‘ఓరుగల్లు’ రాజధాని. అదే నేటి వరంగల్లు. సుమారు 1000 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన ఓరుగల్లు చరిత్ర శాసనాలలోను, అలనాటి సాహిత్యంలోను మరుగున పడే ఉన్నది. కానీ, సమర్థవంతమైన కాకతీయ రాజుల పాలనలో ఓరుగల్లు ఒక వెలుగు వెలిగిందనే చెప్పాలి. వారసత్వానికి ప్రధాన నిదర్శనాలైన సాహిత్యం, శిల్పం, నాట్యం, చిత్రకళ వంటి అన్ని రంగాలలోను వారు తమదైన ప్రత్యేకతను చాటుకొంటూ, సుస్థిరమైన పరిపాలనతో పాటు, గొప్ప సంస్కృతిని భావి తరాలకు అందించి, చరిత్ర పుటలలో శాశ్వతమైన కీర్తివూపతిష్టలను సంపాదించుకొన్నారు. వారు సృష్టించిన సాహిత్య సంపద, శిల్పరీతి, లలితకళలు అన్నీ నేటికీ నిదర్శనాలుగా నిలిచి ఉన్నాయి. అయితే అవి కాలాంతరంలో తమ ప్రాచీన వైభవాన్ని కోల్పోయాయి. చివరకు వాటి పేర్లు కూడా మారిపోయాయి.
ఓరుగల్లు నగరం పేరే మారిపోయి వరంగల్ అయింది. అనుమకొండ - హనుమకొండ అయింది. అట్లాగే వారు నిర్మించిన శిల్పకళాశోభితమైన ఆలయాల పేర్లు కూడా మారిపోయాయి. అనుమకొండలోని శ్రీ రుద్రేశ్వరాలయము - వెయ్యిస్తంభాల గుడిగానే నేడు పిలువబడుతోంది. అట్లాగే కాకతీయ శిల్పకళారీతికి, నైపుణ్యానికి నిలు సాక్ష్యంగా నిలిచిన పాలంపేట శ్రీ రుద్రేశ్వరాలయం - రామప్పగుడిగా పిలువబడుతోంది.
వాస్తవానికి రేచర్ల రుద్రసేనాని తన పేర కట్టించిన ఆ దేవాలయం అసలు పేరు శ్రీ రుద్రేశ్వరాలయమే. నిజానికి, కాకతీయ దేవాలయాలలో మకుటాయమానమై, వారి శిల్పరీతికి నిలు సాక్ష్యంగా నిలిచి ఉన్న ఆ దేవాలయాన్ని ‘రుద్రేశ్వరాలయం’ అంటే ఈనాడు చదువుకొన్నవారికి కూడా తెలియదు.
రామప్పగుడి అంటేనే తెలుస్తుంది! దీని అసలు నామం గురించి ఆలయ ప్రాంగణంలోని రుద్రసేనాని శాసనం స్పష్టం చేస్తునే ఉన్నది. అట్లాగే నేటి పాలంపేట ప్రాంతాన్ని ఆ రోజులలో ‘నాతుకూరు’ (వరంగల్ జిల్లా శాసనాలు - పు.149) అనేవారని ఆ శాసనంలోనే కన్పిస్తుంది. అంతేకాక, ఓరుగల్లుకు సుమారు 65 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆ ప్రాంతం కూడా ఓరుగల్లులోని ఒక భాగమే అని అదే శాసనంలోని - ‘ఓరుగల్లు పురంలో రుద్రసేనాని కట్టించిన ఆలయం’ అన్న పదబంధాన్ని బట్టి స్పష్టమవుతుంది. అలనాటి ఓరుగల్లు విస్తీర్ణం 96 యోజనములు (155 కి.మీ.) అని 16వ శతాబ్దంలో వెలువడిన ఏకావూమనాథుని ‘ప్రతాపచరిత్ర’ (పు.128)లో స్పష్టంగా కన్పిస్తున్నది.భారతదేశంలో విలసిల్లిన శిల్పరీతులలో ‘కాకతీయ శిల్పరీతి’ ఒక విశిష్టతను సంతరించుకొంది. కాకతీయ దేవాలయాలలోని స్తంభాల నిర్మాణరీతి, వాటిని నిలబెట్టిన విధానం, గర్భాలయ ముఖద్వారాలు వంటి అనేక లక్షణాలను బట్టి అవి కాకతీయ దేవాలయాలో కాదో తేలికగా నిర్ణయించవచ్చు. అదే కాకతీయ శిల్పరీతి!
అయితే, కాకతీయ శిల్పరీతికి మార్గదర్శకమైంది కర్ణాటకలో విలసిల్లిన హోయసల శిల్పరీతి. కాకతీయ దేవాలయ నిర్మాణానికి దాదాపు 200 సంవత్సరాలకు పూర్వమే హోయసలులు బేలూరు, హళేబీడు, సోమనాథపురాలలో అద్భుతమైన దేవాలయాలు నిర్మించారు. ఆ దేవాలయాల మీద కన్పించే గజపట్టికలు, పద్మ పట్టికలు, లతలు వంటివి కాకతీయ దేవాలయాలలో కూడా కన్పిస్తాయి. అయితే, హోయసల శిల్పరీతికి కాకతీయ శిల్పరీతికి కొన్ని భేదాలు కన్పిస్తాయి. హోయసల శిల్పులు ఆలయాల బయటివైపుననే తమ నైపుణ్యాన్ని ప్రదర్శించారు. కానీ, కాకతీయులు బయటనే కాక లోపలి భాగంలో కూడా అద్భుతమైన శిల్పాలను చెక్కారు.
హోయసల శిల్పాలు అందమైన రూపురేఖలతోను, ఆభరణాలతోను కన్పిస్తాయి. కాని, కాకతీయ శిల్పులు ఆభరణాలతోపాటు హావభావాలకు కూడా ప్రాధాన్యమిచ్చారు. హోయసల ఆలయాలపై కన్పించేవి దేవతామూర్తులు కాగా, కాకతీయ ఆలయాలపై కన్పించేవి నాటి సామాన్య స్త్రీ పురుషలవి. ఆ విధంగా అలనాటి సామాన్య మానవుల వేషభాషలతో పాటు వారి హావభావాలను కూడా ప్రదర్శించిన ఘనత కాకతీయులదే! అది కాకతీయుల సామాజిక స్పృహకు నిదర్శనం! ఇలాంటి ఎన్నో విశేషాలతో ‘కాకతీయ శిల్పరీతి’ని ఆవిష్కరిస్తూ అలరారుతున్నవి కాకతీయ దేవాలయాలు! అలాంటి అద్భుతమైన శిల్పసంపదతో కూడిన శ్రీ రుద్రేశ్వరాలయ చరివూతను, విశేషాలను ప్రతి ఒక్కరూ చూసి తీరవలసిందే!శ్రీ రుద్రేశ్వరాలయ ప్రాంగణంలో ఉన్న రేచర్ల రుద్రుని శాసనంలో శక సంవత్సరం 1135 - శ్రీముఖ సంవత్సర చైత్ర శుక్ల అష్టమీ ఆదివారం కీ.శ.30-3-1213) పుష్కార్యయోగంలో ఈ దేవాలయాన్ని తాను కట్టించి శ్రీగౌరీసహిత రుద్రేశ్వరుని ప్రతిష్ఠించినట్లు రుద్రసేనాని చెప్పుకొన్నాడు. దానినిబట్టి 31-3-2013 నాటికి దీన్ని నిర్మించి 800 సంవత్సరాలు పూర్తవుతాయి. తెలుగు తిథుల ప్రకారం చైత్ర శుక్ల అష్టమి 18-4-2013 అవుతుంది. అంతేకాక, ఆ ఆలయ నిర్వహణకు ఉప్పరపల్లి, బొర్లపల్లి అనే గ్రామాలను దానం చేసినట్లు ఆ శాసనం పేర్కొంటున్నది. ఆ ఆలయానికి దక్షిణభాగంలో తన తండ్రి కాటేనాని పేర శ్రీ కాటేశ్వరాలయాన్ని, ఉత్తరభాగంలో తన తల్లిపేర శ్రీ కామేశ్వరాలయాన్ని నిర్మించి, వాటి అంగరంగ భోగాలకు ‘నడ్కుటె’ అనే గ్రామాన్ని కూడా దానం చేసాడు.
ఆలయ విశేషాలు:
శ్రీ రుద్రేశ్వరాలయంలోకి ప్రవేశించగానే ఈశాన్యభాగంలో రుద్రసేనాని వేయించిన శాసనం కన్పిస్తుంది. అందులో - రుద్రసేనాని వంశాభివర్ణనం, ఆతని పూర్వీకులు కాకతీయ రాజులకు అందించిన సేవలు, రుద్రసేనాని ప్రభుభక్తి- పరావూకమాలు, అలనాటి ఓరుగల్లుపుర వైభవం వర్ణింపబడ్డాయి.
శ్రీ రుద్రేశ్వరాలయానికి ఉత్తరం, తూర్పు, దక్షిణ దిశలలో 3 ద్వారాలు ఉన్నాయి. ఆ మూడు ప్రవేశద్వారాలు రకరకాల శిల్పాలతో పర్యాటకులకు స్వాగతం పలుకుతున్నట్లు కన్పిస్తాయి.
ప్రధానాలయానికి ఎదురుగా నంది విగ్రహం ఉంది. ఇదొక అద్భుత కళా ఖండం. కాకతీయ శివాలయాలు అన్నింటిలోనూ నంది విక్షిగహాలు కన్పిస్తాయి. కానీ, ఇంత అందమైన, శిల్పశోభితమైన నంది మరెక్కడా కన్పించదు. దేశంలో ఎన్నో ఆలయాలలో నంది విగ్రహాలు కన్పిస్తాయి. వాటి ప్రత్యేకతలు వాటికి ఉండవచ్చు. లేపాక్షి బసవన్న, యాగంటి బసవయ్య వంటివి వాటి వాటి ప్రత్యేకతలకు నిదర్శనం! కానీ, ‘కాకతీయ నంది’ అనగానే మనకు స్ఫురించేది అనుమకొండ వెయ్యిస్తంభాల గుడిలోని నంది విగ్రహం. కానీ, అది కూడా పాలంపేట రుద్రేశ్వరాలయ నంది ముందు వెల
ఇక్కడి నంది ప్రత్యేకత - దానిని ఎటువైపు నుంచి చూసినా, అద్భుతమైన శిల్పకళతో అలరారుతూ ఉంటుంది. ఆ విధంగా అన్నివైపుల నుంచి మనోహరంగాను, హుందాగాను కన్పించే ఈ నంది ముందు, దేశంలోని అన్ని నందులూ దిగదుడుపే! ఈ నంది మీద చెక్కిన రకరకాల ఆభరణాలు దాని శోభను ద్విగుణీకృతం చేస్తున్నాయి.
మదనిక శిల్పాలు :
శ్రీ రుద్రేశ్వరాలయం బయటివైపున స్తంభాల పైభాగాన్నీ, పైకప్పునూ కలుపుతూ ఏటవాలుగా నిలబెట్టిన మనోహర శిల్పాలు మదనికలు! అవి ఆనాటి సామాన్య స్త్రీలవి. దేవాలయాలమీద సామాన్యుల శిల్పాలను చెక్కించి, వారిని కూడా దేవతలలాగా మాన్యులను చేసిన ఘనత కాకతీయులదే! ఆ మదనిక శిల్పాలను వస్త్రాలకంటే ఆభరణాలతోనే నింపివేసారు కాకతీయ శిల్పులు. ఆ ఆభరణాలలో నాటి స్త్రీలు ధరించే రకరకాల హారాలు, శిరోభూషణాలు ఉన్నాయి. అవి ఆనాటి ఆభరణ విశేషాలను ప్రదర్శిస్తాయి. వాటిలో ఒక్కొక్క శిల్పంలో ఒక్కొక్క విశేషం కన్పిస్తుంది.
ఒక మదనిక పలుచని ఉల్లిపొర వంటి వస్త్రం ధరించి ఉన్నది. ఆమె చెవికి ఉన్న దుద్దులు ఆనాటి కర్ణాభరణాలకు ఒక మచ్చుతునక. ఇంకొక మదనిక తన పది చేతివేళ్ళకూ ఉంగరాలు ధరించి తన్మయత్వంతో నాట్యం చేస్తున్నది. మరొక మదనిక (నాగిని) చేతులలో ఒక పామును ధరించి నాట్యం చేస్తున్నది. ఇంకొక మదనిక తాను ధరించిన కంఠాభరణానికి ఉన్న మణులు పొదిగిన లాకెట్‌ను ఎత్తిచూపుతున్నది. ఆమె శరీరానికి తగలకుండా ఎత్తుగా కన్పించేటట్లు ఆ లాకెట్‌ను చెక్కిన శిల్పి నైపుణ్యం అమోఘం! మరొక మదనిక తన పాపిడి బొట్టులాగా ఒక ఆభరణాన్ని ధరించి, మృదంగం వాయిస్తున్నది. ఇంకొక మదనిక ఎత్తుమడమల పాదుకలు (High heels) ధరించి ఉన్నది. ఈ శిల్పాలన్నింటిలోను కన్పించే ఆభరణాలు, అలంకారాలు ఆనాటి జీవన సౌభాగ్యానికి నిదర్శనాలు!
ఒక మదనిక చీరను ఒక కోతి లాగి వేస్తుంటే, ఒక చేత్తో మానసంరక్షణ చేసుకొంటూ, రెండవచేతితో ఆ కోతిని అదిలిస్తున్నట్లు ఉన్న ఆ శిల్పంలోని ముఖంలో కన్పించే హావభావాలు అద్భుతం! మరొక మదనిక పాదంలో ముల్లుగుచ్చుకోగా, ఆ పాదం మీద ఏర్పడిన వాపును కూడా ప్రదర్శించిన శిల్పి నైపుణ్యం వర్ణనాతీతం! ఇలాంటి హావభావాలను శిల్పాలలో ప్రదర్శించటంలో కాకతీయుల ప్రజ్ఞ చూసి తీరవలసిందే!
ఈ మదనికల శిల్పాల నడుమ గజకేసరి శిల్పాలు ఉన్నాయి. ఓరుగల్లు కోటలోను, కాకతీయ దేవాలయాలలోను ఎక్కడ పడితే అక్కడ ఈ గజకేసరి శిల్పాలు కన్పిస్తాయి. పాలంపేట రుద్రేశ్వరాలయంలోనివి పెద్దగా ఉన్నాయి. కారణం - కాకతీయ రాజులలో మొదటి, రెండవ ప్రోలరాజులకు, రుద్రదేవ మహారాజుకు, గణపతిదేవ చక్రవర్తికి, రుద్రమదేవికి, ప్రతాపరువూదునికి - అందరికీ ‘గజకేసరి’ బిరుదులు ఉన్నాయి. బహుశః అందుకేనేమో కాకతీయ శిల్పాలలో గజకేసరి శిల్పాలు ఎక్కువగా కన్పిస్తాయి.
రంగమంటపం:
గర్భాలయానికి ముందున్న రంగమంటప శోభను వర్ణించలేము. నాలుగు స్తంభాలమీద చెక్కిన శిల్పాలు అద్భుతంగా కన్పిస్తాయి. స్తంభాల పైభాగాన్ని సంగడి పట్టినట్లు చెక్కారు శిల్పులు. ఇంత అందంగా చెక్కిన స్తంభాలు మరి ఏ కాకతీయ దేవాలయాలలోనూ కన్పించవనటం అతిశయోక్తి కాదు. స్తంభాల మధ్యలో చతురవూసాకార ఫలకాలమీద, గుండ్రంగా ఉన్న భాగాలపైన, వాటికి అనుగుణమైన శిల్పాలను చెక్కి, తమ చాకచక్యాన్ని ప్రదర్శించారు శిల్పులు. ఒక దానిమీద సముద్ర మథనం, ఒకదానిమీద ముగ్గురు స్త్రీలకు నాలుగే కాళ్ళు ఉన్న శిల్పం, ఒకదానిమీద పేరిణి నాట్యం, ఒకదానిమీద దండలాస్యం, ఒకదానిమీద కుండలాకార నృత్యం, ఒకదానిమీద స్త్రీలే మద్దెలలు వాయిస్తూ ఉండగా మరొక స్త్రీ నాట్యం చేస్తున్నట్లు చెక్కిన చిత్రం - వంటివి అద్భుతంగా చెక్కబడినాయి.
గర్భాలయ ప్రధాన ద్వారం:
రుద్రేశ్వరాలయ గర్భాలయ ప్రధాన ద్వారం మరొక గొప్ప కళాఖండం. చెరుకుగడలు, అరటిబోదెల మధ్య బాణాలు ధరించి, రకరకాల భంగిమలలో నిలబడ్డ స్త్రీలు జీవకళతో దర్శనమిస్తారు. ఇక్కడి శిల్పాలను చేత్తో మీటితే ఆ రాయినుంచి లోహపు శబ్దం రావటం విశేషం. వాటి పైభాగాన సింహాల వరుసలు, లతలు, వాద్యకారుల చిత్రాలు అందంగా తీర్చిదిద్దబడినాయి.
శ్రీ రుద్రేశ్వర మహాలింగం:
గర్భాలయంలో ఉన్న పెద్ద శ్రీరుద్రేశ్వర మహాలింగం, అనుమకొండలోని వెయ్యిస్తంభాల గుడిలోని రుద్రేశ్వరునితో పోటీపడుతున్నదా అన్నట్లు కనువిందు చేస్తుంది. పానవట్టంపైన భాగంలోనే కాకుండా, కింది భాగంలో కూడా సన్నని గీతలు గీతలుగా అందంగా చెక్కిన రీతి మనోహరం! ప్రధానలింగం నల్లని కాంతులీనుతూ నిన్ననో మొన్ననో చెక్కినట్లు కన్పిస్తుంది. ఇదొక అద్భుత కళాఖండం!
దశభుజ రుద్రుడు:
రంగమంటప మధ్యభాగంలో ఉన్న పైకప్పులో దశభుజుడైన నాట్యరుద్రుడు చెక్కబడినాడు. ఇలాంటి శిల్పమే అనుమకొండలోని రుద్రేశ్వరాలయం స్తంభాలగుడి)లో కూడా ఉన్నది. పరమశి వారాధకులైన కాకతీయులు వైదికరుద్రుని ఆరాధించారనటానికి - రుద్రదేవ మహారాజు, రుద్ర(మ)దేవి, ప్రతాపకుమార రుద్రదేవ మహారాజు అన్న వారి పేర్లలో కన్పించే ‘రుద్ర’ శబ్దమే నిదర్శనం. ఆ దశభుజ రుద్రునికి - కుడివైపున ఉన్న 5 చేతులలో - శూలము, వజ్రాయుధము, ఖడ్గము, పరశువు, అభయముద్ర ఉన్నాయి. అట్లాగే ఎడమవైపున ఉన్న 5 చేతులలో - నాగము, పాశము, ఘంట, అగ్ని, అంకుశము ఉన్నాయి. ప్రతాపరుద్ర చక్రవర్తికి సమకాలికుడైన పాల్కురికి సోమనాథుని ‘పండితారాధ్య చరిత్ర’ (వాద ప్రకరణం- పు.661)లో సరిగ్గా ఇదే రకమైన వర్ణన కన్పిస్తుంది. ఆ వైదికరుద్రుని వర్ణనకు శిల్పరూపమే పై రంగమంటప శిల్పం. ఆ దశభుజరుద్రుని పరివేష్టించి అష్ట దిక్పాలకులు భార్యాసమేతులై, తమ తమ వాహనాలమీద కొలువుతీరి ఉన్నారు.

ఆ రంగమంటపం చుట్టూ ఉన్న 4 అడ్డదూలాలమీద సముద్ర మథనము, త్రిపురాసుర సంహారం, గజాసుర సంహారం, వరాహమూర్తి, నాట్యగణపతి, కృత్య వంటివి మనోహరంగా చెక్కబడినాయి. ముఖ్యంగా - గజాసుర సంహారం చేసిన శివుడు ఆ ఏనుగును చీల్చి బయటకు వస్తున్నట్లు చెక్కిన శిల్పం మనోహరంగా కన్పిస్తుంది.
రంగమంటపం చుట్టూ ఉన్న పైకప్పులలో రకరకాల పద్మదళాలు, రాతి చక్రాలు చెక్కబడినాయి. ఆలయం కప్పు లోపలి వైపున కొన్ని చోట్ల ఎర్రని శిలలను చెక్కిపెట్టటంవల్ల, అవి ఈనాడు అందంగా కన్పించటానికి ఉపయోగిస్తున్న ‘టైల్స్’ లాగా ఉన్నాయి. మొత్తం మీద ఈ రంగమంటపం ఒక అద్భుత కళాఖండం!
ఆలయానికి చుట్టూ విశాలమైన ప్రదక్షిణపథం ఉంది. దానిమీద నడుస్తూ ఉంటే ఆలయం వెలుపల చెక్కిన ఎన్నో కుడ్యశిల్పాలు కన్పిస్తాయి. వాటిలో - శృంగార శిల్పాలు, క్రీడా వినోదాలు, వాద్యకారులు, మల్లయుద్ధాలు, భైరవమూర్తులు వంటి విశేషాలు కన్పిస్తాయి. అవికాక - మహిషాసుర మర్దిని, వీరభద్రుడు, సప్తమాతృకలు వంటి శిల్పాలు కూడా ఆలయ ప్రాంగణంలో ఉన్నాయి.
రుద్రేశ్వరాలయం పైభాగంలో పెద్ద గోపురం కన్పిస్తుంది. అది ‘వేసర’ శిల్ప విధానంలో నిర్మింపబడింది. ఆలయ శిఖరానికి ఉపయోగించిన ఇటుకలు నీళ్ళలో తేలుతాయి. ప్రస్తుతం అవి లభించటం లేదు. కానీ, అవి కాకతీయుల సాంకేతిక పరిజ్ఞానానికి నిదర్శనం!
ఇట్లా అనేక శిల్ప విశేషాలతో అలరారుతూ, కాకతీయ శిల్పరీతికి శిఖరాయ మానంగానూ, నిలు నిదర్శనంగానూ నిలిచి ఉన్న ఈ రుద్రేశ్వరాలయం నేడు దేశంలోనే ఒక గొప్ప పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతున్నది. అష్టశతాబ్దాలు పూర్తయిన శుభ సందర్భంలో రుద్రేశ్వరాలయాన్ని మంచి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దితే, అది చారిత్రాత్మక వారసత్వ సంపద గలిగిన ఓరుగల్లుకు కీర్తిపతాక అవుతుంది. ఆ గొప్ప వారసత్వ సంపదను భావితరాలకు అందించవలసిన బాధ్యత ప్రభుత్వానిదే కాక, ఓరుగల్లు ప్రజలందరిదీ అని గుర్తించాలి! -బతుకమ్మ నుండి
ఫొటోగ్రఫి: మధుగోపాల్ రావు
16, ఏప్రిల్ 2013, మంగళవారం
సిర్ఫ్ హమారా-ఇరానీ చాయ్..!
పాశ్చాత్య దేశాల్లో అతిథికి వైన్‌తో స్వాగతం పలుకుతారు. మన దేశంలో అయితే ‘టీ’తో స్వాగతం పలుకుతాం. అదే మన హైదరాబాద్‌లో అయితే ‘ఇరానీ చాయ్’తో ప్రేమను పంచుతాం.
కేఫ్‌లు ఎన్నున్నా ‘ఇరానీ కేఫ్’లకు ఉన్న ప్రత్యేకత అంతా ఇంతా కాదు.
నిజానికి ఇరానీ చాయ్‌కున్న ప్రత్యేకత దాని రంగు, రుచి, వాసనే..!
హైదరాబాద్ చాయ్ అలియాస్ ఇరానీ చాయ్...నగరంలో చార్మినార్‌ను ఎంతగా ఇష్టపడతారో ఇరానీ చాయ్‌ని కూడా చాలామంది అంతగా ఇష్టపడతారు. ఇరానీ చాయ్ లేని హైదరాబాద్ నగరాన్ని ఊహించలేం.
హైదరాబాద్‌లో మీనార్స్, బిల్డింగ్స్, టూంబ్స్, డోమ్స్, ఫ్యాలెస్‌లు, ఫీరల్స్, హాలీమ్, ఆర్చ్‌లు, షెర్వాణీ, బిర్యానీ, నవాబ్స్, కబాబ్స్ వంటి వాటితో పాటు ధీటుగా ఇరానీ చాయ్ కూడా తనదైన ప్రత్యేకతను సొంతం చేసుకుంది. నగరంలో చిన్నవి, పెద్దవి, మధ్యతరగతివి అన్నీ కలిపి సుమారు 25,000 వరకు కేఫ్‌లు ఉన్నాయి. ప్రతీ గల్లీలో టీ స్టాల్ కనిపిస్తుంది. మొత్తం మీద కొన్ని వందల సంఖ్యలోనైనా ఇరానీ కేఫ్‌లుంటాయి.
ప్రతి రోజు ప్రతీ వ్యక్తి ఒక్కసారైన టీ తాగకుండా ఉండలేరు. పనిపాటలతో ఆలసిపోయే సగటు హైదరాబాదీకి రిలాక్స్ నిచ్చేది సింగిల్ కప్ టీనే. జంట నగరాల్లో ఎల్లప్పుడు తమ కుటుంబసభ్యునిలా, అతిథిలా ఆహ్వానించడానికి సిద్ధంగా ఉంటుంది ఇరానీ చాయ్. పాశ్చాత్య దేశాల్లో అతిథికి వైన్‌తో స్వాగతం పలుకుతారు. అదే మన దేశంలో అయితే టీ తో స్వాగతం పలుకుతాం. చాలా సందర్భాల్లోనూ ఓ కప్పు టీ తప్పకుండా ఉంటుంది. అంతెందుకు, ఇద్దరు మిత్రులు అనుకోకుండా కలిసారంటే దగ్గర్లో ఉన్న టీ స్టాల్కు వెళ్లాల్సిందే. తలనొప్పి వచ్చినా టీ తాగాల్సిందే. టీ తాగితే వెంటనే రిలీఫ్ అనిపిస్తుంది. దీనికి కారణం టీలోఉండే కెఫెన్, టానిన్‌లు వంటివి. అందుకే, చైనాలో క్రీ.పూ.3వ శతాబ్దంలో టీని తలనొప్పి తగ్గించే ‘మెడికల్ టానిక్’గా వాడేవారట.
జంటనగరాల్లోనూ చాలామంది చాయ్‌కి బానిసలయ్యారనడంలో సందేహం లేదు. అందులోనూ ఇరానీచాయ్ తాగకుండా అనేకులు తమ దైనందిన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టరంటే అతిశయోక్తికాదు. అంతెందుకు, టీ తాగనిదే ‘రెండువేళ్ల సమస్య’ పరిష్కారం కాని వాళ్లూ ఎందరో. అందుకే, టీ ‘జాతీయ ద్రవం’ అన్నా ఆశ్చర్యపోనక్కరలేదు. భారతదేశం మొత్తంలో చూస్తే అత్యధిక టీ స్టాల్లు హైదరాబాద్, సికిందరాబాద్ జంటనగరాల్లోనే ఉన్నాయన్నది ఆశ్చర్యకరమైన విషయం.
తనకంటూ ఓ ప్రత్యేకతను నిలబెట్టుకున్న ఇరానీ చాయ్ ఎప్పుడు, ఎలా పుట్టిందన్న దానికి సరైన ఆధారాలు లేనప్పటికీ బ్రిటీష్ వారు హైదరాబాద్‌కు వచ్చాకైతే మరింత ఎక్కువ పాపులర్ అయ్యిందని చెబుతారు. వాస్తవానికి ఇరానీ చాయ్ బ్రిటీష్‌వారు ఇక్కడికి రాకముందే ఉన్నప్పటికీ అది నగరాన్ని దాటి వెళ్లలేదన్నది నిజం. బ్రిటీష్ వారు వచ్చాకే ఇరానీ చాయ్‌కి అంతటి ప్రాచుర్యం లభించిందనేది కూడా ఒక వాస్తవమే. ఒకప్పుడు పెద్ద పెద్ద హోటల్స్, కేఫ్‌లకే పరిమితమైన ఇరానీ చాయ్ ఇప్పుడు గల్లీ గల్లీకి విస్తరించింది. నగరం విస్తరించినా , జనాభా పెరిగినా, సంస్కృతిలో ఎన్ని మార్పులొచ్చినా ఇప్పటికీ తన రంగు, రుచి, వాసనలో ఎలాంటి మార్పు లేనిది ఇరానీ చాయ్ మాత్రమే. అందుకే దానికంతటి ప్రజాదరణ!
కమ్మటి రుచికరమైన ఇరానీ టీ ఎక్కడ దొరుకుతుందంటే చాలామంది షాలీబండలోని ‘షా గౌస్ రెస్టాంట్ లో’ అంటారు. ఆ తరువాత మక్కా మసీద్ సమీపంలోని ‘ఫరాషా ఇరానీ కేఫ్’, మస్లీ కమాన్ దగ్గరి షార హ కేఫ్‌ను చెప్పుకుంటారు. ఇవన్నీ చాలా ఏళ్ల నుండి ఇరానీ చాయ్ స్పెషల్ హోటళ్లుగా ముద్రపడ్డవే. అఫ్జల్‌గంజ్ మసీదుకు ఎదురుగా మనకు మరో ఇరానీ హోటల్ కనిపిస్తుంది. అదే ‘న్యూ గ్రాండ్ హోటల్’. దీని యాజమాని జలీల్ ఫర్‌క్షికోజ్. ‘మా పూర్వీకులు ఇరాన్‌లోని యాజ్ద్‌లో ఉండేవారు. వారు అక్కడి నుండి మొదట ముంబాయి, తర్వాత పుణేకు వచ్చారు. ఆ తరువాత హైదరాబాద్‌లో కాలు మోపారు’ అన్నారు. న్యూ గ్రాండ్ హోటల్ జంటనగరాల్లో తొట్టతొలి ఇరానీ కేఫ్. దీన్ని 1936లో ప్రారంభించారు. ‘హైదరాబాదీలు ఇరానీ చాయ్‌ని ఇష్టపడతారు. అది ధనవంతులైనా, పేదవారైనా’ అంటాడు ఫర్‌క్షికోజ్. అంతేకాదు ‘ఇరానీ చాయ్ హైదరాబాద్ సంస్కృతిలో ఒక భాగమైపొయిందని’ కూడా అంటాడు. ఈ మాట అక్షర సత్యం!
‘ఇరాన్‌లో తేయాకు ఆకులు, నీరు, చక్కెర తప్ప పాలు లేకుండానే చాయ్ తయారు చేస్తారు. దాన్ని కొంచెం తాగితే ఆ మజానే వేరు. అయితే, ఇరాన్‌లో సెటిలైన పర్షియన్లు మాత్రం చాయ్ అంటే పాలు కూడా కలపమనే వారు. అలా, అన్ని రకాల మిశ్రమాల కలయికతో ప్రస్తుతమున్న ఇరానీ చాయ్‌కి చక్కని రంగు, రుచి, వాసన వచ్చింది’ అని జలీల్ ఫర్‌కోజ్ అంటాడు.
బంజారాహిల్స్ రోడ్ నెం. 11లో ‘సర్వీ కేప్’ పేరుతో ఒక ఇరానీ కేఫ్ ఉండేది. ‘సర్వీ అంటే పార్శిలో గ్రీనరీ అని అర్థం’ అంటాడు ఈ హోటల్ యాజమాని మిర్జా ఆలీ సర్వీ. ‘మేం ఈ కేఫ్ పెట్టి 25 సంవత్సరాలవుతోంది. మాకు నగరంలో మూడు బ్రాంచీలున్నాయి. ఇరానీ చాయ్ అనేది సగటు మనిషి జీవితంలో ఒక భాగమైంది’ అని కూడా అన్నాడు. 200 సంవత్సరాలకు పైగా చరిత్ర గల నగరం సికింవూదాబాద్. సికింవూదాబాద్ అనగానే గుర్తుకు వచ్చేది క్లాక్ టవర్. ఆ క్లాక్ టవర్‌కు దగ్గర్లో ఉన్న సరోజినిదేవి రోడ్‌లో ఉన్న మరో కేఫ్ ‘గ్డాన్ రెస్టాంట్’. దీన్ని 1952లో ఏర్పాటు చేశారు. సికింవూదాబాద్‌లోని ఆల్ఫా హోటల్ కూడా ఇరానీ చాయ్‌కి ప్రసిద్ది.
భారతదేశాన్ని ఆక్రమించిన తరువాత ఉత్తర భారతంలో బ్రిటీష్‌వారు తేయాకు తోటల మీదా తమ ఆధిపత్యాన్ని కొనసాగించారు. ముఖ్యంగా ఆస్సాంలో అప్పుడు తేయాకు అధికంగా పండేది. దీంతో అక్కడ ప్రతి సంవత్సరం మరింత నాణ్యమైన తేయాకును పండించేలా చర్యలు తీసుకునేవారు. నాణ్యత లేకుంటే తరువాత సంవత్సరం విత్తనాలను మార్చేవారు. అలా నాణ్యమైన తేయాకు పండించడం, దాన్ని తమ దేశానికి తరలించడం వంటి కారణాల వల్ల చాలాకాలం వరకు అస్సాం టీ మనకు అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. బ్రిటీష్ వారు హైదరాబాద్‌లో అడుగుపెట్టాక ఇరానీ చాయ్‌లోని కమ్మదనాన్ని తమ సొంతం చేసుకోవాలనే ప్రయత్నం చేశారు. ఇరానీ చాయ్‌ని మించిన రుచిగల చాయ్‌ని మనదేశానికి పరిచయం చేయాలనే కోరిక వారిలో బలంగా ఉండేది. దానికోసం నాణ్యమైన తేయాకును పండించేలా తేయాకు రైతులమీద ఒత్తిడి తెచ్చేవారు. కానీ, ఇరానీ చాయ్ ముందు తెల్లవాడి ప్రయత్నాలు ‘చక్కెర లేని చేదు చాయ్’గానే మిగిలాయి.
నాణ్యమైన తేయాకు పొడి, పాలు తగిన మోతాదులో కలిపితేనే ఇరానీ చాయ్‌కి గొప్ప రుచి వస్తుందన్న వాస్తవాన్ని గ్రహించకపోవడం వల్లే బ్రిటీష్‌వారు తమ ప్రయత్నాలలో విఫలమయ్యారన్నది వాస్తవం. ఇక్కడ మరో విషయం కూడా చెప్పుకోవాలి. బ్రిటీష్‌వారు మన దేశ సంపదను కొల్లగొట్టి తీసుకెళ్లగలిగినప్పటికీ ఇరానీ చాయ్ రుచిని మాత్రం తమ సొంతం చేసుకోలేకపోయారు.
ఇరాన్ నుండి హైదరాబాద్‌కు...
హైదరాబాద్ పుట్టుకకు ఇరానీ చాయ్‌కి విడదీయరాని అనుబంధం ఉంది. తేనీరు ప్రపంచమంతా విస్తరిస్తున్న సమయంలోనే హైదరాబాద్ ప్రాంతాన్ని కుతుబ్ షాహీలు గోల్కొండ రాజధానిగా పాలిస్తున్నారు. వీరు ఇరాన్ నుండి వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు. రాజులతో పాటు వారి పరివారం కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చి స్థిరపడింది. వీరంతా క్రీ.శ 1591లో హైదరాబాద్ నగరానికి వచ్చారు. వారితోపాటు వారి అలవాట్లు, సంస్కృతి, సంప్రదాయాలను కూడా తీసుకువచ్చారు. వీరంతా కుతుబ్ షాహీలలో శక్తివంతులుగా, ప్రధానమైన వివిధ పరిపాలనా విభాగాల్లో నియమితులయ్యారు. వారు అనేక విద్య, మత సంబంధ సంస్థలు, భవనాలు నిర్మించారు. మసీదులు, అందమైన గార్డెన్‌లు కూడా ఏర్పాటు చేశారు. చార్మినార్, టూంబ్స్ తదితర నిర్మాణాల్లో మనకు ఇరానీ శైలి కనపడడానికి కారణం అదే. అందులో భాగంగా తమ ‘జాతీయ ద్రవం’ అయిన టీని కూడా వారే పరిచయం చేశారు. అలా మొదలైన టీ సంస్కృతి విస్తారంగా విస్తరించింది.
ఇరానీలు మన వాళ్ళకు పరిచయం చేసిన ద్రవం కనుక అది ‘ఇరానీ టీ’ అయ్యింది. 16వ శతాబ్దంలో స్థానికంగానే ఇరానీలు గ్రీన్, బ్లాక్ టీలను కనుగొన్నారు. 1840 తర్వాతే ఇరానీ చాయ్ దేశంలోని ఇతర ప్రాంతాలకు విస్తరించింది. ఇక మన దేశంలో అస్సాం టీ ఉత్తర భారతాన్ని తన సొంత గడ్డగా మలచుకుని దేశమంతా విస్తరించింది.
ఇరానీ చాయ్ ‘సిర్ఫ్ హమారా’!
కుతుబ్ షాహీలు ఇక్కడ స్థిరపడిన తర్వాత చాలాకాలం వరకు ఇరానీచాయ్ సామాన్యులకు చేరలేదనే చెప్పాలి. బ్రిటీష్ వారు మన దేశానికి వచ్చిన తర్వాత కుతుబ్ షాహీలు ఇచ్చే విందుల్లో మాత్రమే బ్రిటీష్‌వారికి ఆ రుచి తెలిసింది. దానికి అలవాటు పడ్డ కొంతమంది బ్రిటీష్‌వారి కోసం, ఇరానీ చాయ్ అంటే ఇష్టపడే హైదరాబాదీల కోసం ప్రత్యేకంగా ఇరానీ కేఫ్‌లు పుట్టుకొచ్చాయి. ఇరానీ చాయ్‌లో మరో రకమైన బ్లాక్, గ్రీన్ టీలను హైదరాబాద్‌లో స్థిరపడ్డ ఇరానీయన్లు ఇక్కడే కనుగొన్నారు. ఆ రుచి గత తేనీటితో పోలిస్తే భిన్నంగా ఉండడంతో పాటు ఇరానీ హోటల్స్‌లో లభించేది కనుక ఆ చాయ్‌లను ‘ఇరానీ చాయ్’ అని పిలవడం మొదలుపెట్టారు. అందుకే, జంట నగరాల్లో లభించే ఇరానీ చాయ్‌తో పోలిస్తే ఇతర ప్రాంతాల్లో లభించే సాధారణ టీ చాలా భిన్నంగా ఉంటుంది. దీనికి ప్రధాన కారణం దేశంలోని వివిధ ప్రాంతాల్లో తేయాకు పండించే విధానం, దాని ప్రాసెసింగ్ పద్ధతుల్లో తేడా ఉండడమే.
ఇరానీ చాయ్‌కి సంబంధించినంత వరకు తేయాకును వారు ఇరాన్ నుండే దిగుమతి చేసుకుంటారు. అయితే అందులో కలిపే ప్లేవర్ల గురించి ఇసుమంత కూడా చెప్పడానికి వారు ఇష్టపడరు. ఒక రకంగా చెప్పాలంటే ‘ఇరానీ చాయ్ కుతుబ్ షాహీల దత్తపువూతిక’ అనడంలో సందేహం లేదు. వారి పాలన సమయంలో కొన్ని డ్రింక్స్, లిక్కర్లు కూడా ప్రాచుర్యం పొందాయి. వాటిలో వైట్, రెడ్ వైన్స్ ముఖ్యమైనవి. అయితే ఇవి కేవలం సంబంధిత సీజన్‌లలో మాత్రమే దొరికేవి. కానీ ఇరానీ చాయ్ మాత్రం ఎల్లవేళలా దొరికేది. అందుకే ఇరానీ చాయ్‌కి ఇంతటి గుర్తింపు వచ్చింది. ఇప్పుడు ఇరానీ చాయ్ అంటే హైదరాబాదీలకు ముత్యాలు, బిర్యానీ, మీనార్స్ ఎలాగో అచ్చం అలాగే.
షాలీబండ టూ క్లాక్ టవర్: ఒకప్పుడు హైదరాబాద్ నగరాన్ని చుడితే అడుగడుగున మనకు ఇరానీ హోటల్స్ కనిపించేవి. పాతబస్తీలోని షాలీబండ నుండి సికింవూదాబాద్‌లోని క్లాక్ టవర్ మధ్యలో 29 ఇరానీ కేఫ్స్ ఉండేవి. వీటిలో ఇప్పుడు కొన్ని మూసి వేశారు. మరికొన్ని నగర అభివృద్ధిలో భాగంగా తొలగించబడ్డాయి.రకరకాల చాయ్‌లు
ఇరానీ చాయ్‌కి ప్రత్యేక కేఫ్‌లున్నట్లే వివిధ రకాల చాయ్‌లకు కూడా ప్రత్యేక కేఫ్‌లున్నాయి. జంటనగరాల్లో ప్రఖ్యాతిగాంచిన టీ కొట్లు కూడా ఉన్నాయి. బ్లూసీ, ఆల్ఫా, తాజ్ (అబిడ్స్) వంటి ప్రధాన హోటల్స్‌లో ప్రత్యేక టీలు విక్రయిస్తుంటారు. బర్కాస్, కింగ్‌కోఠిల్లోనూ వివిధ రకాల చాయ్‌లు అందుబాటులో ఉన్నాయి. మసాల చాయ్, కాశ్మీరీ టీ, గోల్డెన్ టీ, స్పెషల్ టీ, గవా టీ, బ్లాక్‌టీ వంటి ప్రజలకు అందుబాటులో ఉంటున్నాయి. ఇవేకాక మిల్క్‌పౌడర్, మిల్క్‌మేడ్, చాకొలెట్, బిస్కట్ ప్లేవర్, ఇలాచీ, అల్లం, లెమన్, పౌనా (ఎక్కువ పాలతో చేసే టీ) వంటీ వెన్నో కూడా అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ మామూలు చాయ్ ధరలతో పోలిస్తే అధిక ధర పలుకుతాయి.
కోట్లలో వ్యాపారం...
జంటనగరాల్లో ఇరానీ చాయ్ లేదా చాయ్ అనేది అతి పెద్ద వ్యాపారం. వేలాదిమంది నిరుద్యోగులకు ఉపాధిమార్గం కూడా ఇదే. పెద్ద పెద్ద హోటల్స్‌లో ప్రతి రోజు కనీసం వెయ్యి చాయ్‌లు విక్రయించబడుతున్నాయి. మరికొన్ని హోటల్స్‌లో రోజుకు 1,500 వరకు టీలను విక్రయిస్తున్నారు. ఈ లెక్కన 25,000 హోటల్స్ ఉంటే ఉదయం 6 గంటల నుండి రాత్రి 10 గంటల మధ్య కాలంలో 2.5 కోట్ల టీలు విక్రయిస్తున్నారనుకోవాలి. ఒక చాయ్‌కి సగటున నాలుగు రూపాయలు వేసుకున్నా ఒక నెలలో రూ.300 కోట్ల బిజినెస్ కేవలం టీ విక్రయాలే మీదే జరుగుతుందన్నమాట. అంతెందుకు, జంటనగరాల్లో ఉన్న ప్రతి 200 మందికి ఒక టీస్టాల్ ఉందంటే నమ్ముతారా?
ఎందందరికో ప్రీతిపాత్రం...
హైదరాబాద్ ఇరానీ చాయ్‌కి ఫిదా కానీ వారంటూ లేరంటే అతిశయోక్తికాదు. హైదరాబాదీ కవులుగా ముద్రపడ్డ పలువురు ఇరానీ కేఫ్‌ల్లోనే తమ కవితలకు ప్రాణం పోశారు. ఒక చేతితో సిగరేట్ మరో చేత్తో కలం పట్టుకుని మధ్య మధ్యలో ఇరానీ చాయ్‌ని చప్పరిస్తూ వారు ఎన్నో కవితలల్లారు. దిగంబర కవులుగా పిలువబడే నిఖిలేశ్వర్, నగ్నముని, జ్వాలాముఖి, చెరబండరాజు, భైరవయ్య, మహాస్వప్నల కవిత్వమంతా అబిడ్స్‌లోని ‘కింగ్ సర్కిల్’ ఇరానీ కేఫ్‌లోనే ఉద్భవించిందంటే ఒకింత ఆశ్చర్యమే. అక్కడ ప్రస్తుత పోలీస్‌స్టేషన్ పక్కనే ఉన్న భవనంలో మొదటి అంతస్తులో ఈ కేఫ్ ఉండేది. బన్ను, సమోసాలు, ఉస్మానియా బిస్కట్లు తింటూ ఇరానీ చాయ్ ఆస్వాదిస్తూ వీరంతా గంటలు, గంటలు తమ చర్చలు జరిపేవారట. ‘‘1966-68 మధ్యకాలంలో మూడు సంవత్సరాలు మాకు ‘కింగ్ సర్కిల్’ ప్రధాన స్థావరంగా ఉండేది.
మాకు సర్వ్ చేయడానికి ఒక తెలుగబ్బాయి ఉండేవాడు. వివిధ అంశాల మీద చర్చిస్తూ గంటలు, గంటలు అక్కడే గడిపేవాళ్లం. తరువాత ఆబిడ్స్ పోస్టాఫీస్ సందులో కూడా ఒక కేఫ్ ఉండేది. ఇప్పుడుందో లేదో తెలియదు. ఇరానీ చాయ్ అనగానే అప్పటి రోజులే గుర్తుకు వస్తాయి.’’ అని దిగంబర కవుల్లో ఒకరైన నిఖిలేశ్వర్ తన పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. వీరితో పాటు ఎందరో ప్రముఖ కవులు ఇరానీచాయ్ తాగుతూనే తమ కథలు, కవితలు, అభివూపాయాలను కాగితంపై పెట్టారంటే అతిశయోక్తికాదు. ఇట్లా ఎంతోమంది కవులకు ఇరానీ చాయ్ కలం, బలం, జీవం, జవం అవుతోందన్నది వాస్తవం.
తెలంగాణ ప్రాంతానికి చెందిన జానపద సినిమా హీరో దివంగత కత్తి కాంతరావుకు కూడా ఇరానీ చాయ్ అంటే ఎంతో మక్కువంటారు. ఆయనకు ఎన్ని పనులున్నా కూడా‘టీ డెన్ కేఫ్’కు తప్పకుండా వెళ్లి చాయ్ తాగి వచ్చేవారట. అలాగే, ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీ కూడా ఇరానీ చాయ్‌కు ఫ్యాన్. ఆయన కింగ్‌కోఠిలోని ఫ్యాన్సీ కేఫ్‌కు తప్పకుండా వెళ్తారు. అంతర్జాతీయ గుర్తింపు పొందిన చిత్రకారుడు ఎం.ఎఫ్ హుస్సేన్ నగరానికి వచ్చినప్పుడు సికిందరాబాద్‌లోని గార్డెన్ రెస్టాంట్‌కు వెళ్ళేవారట.
ఇంకా అందని ద్రాక్షలా ఇరానీ చాయ్
ఇరానీ చాయ్ ధర ఇప్పుడు సామాన్యునికి అందకుండా పోతోంది. ఒకప్పుడు 2 రూపాయల వరకు ఉన్న దీని ధర పెరుగుతూ పెరుగుతూ వచ్చి పది రూపాయలకు చేరింది. ఇప్పుడు మరింత ధర పెరిగింది. దిగుమతి సుంకాలు పెరగడం, ఉత్పత్తి తగ్గడం వంటివి కూడా ధర పెరగడానికి కారణమవుతున్నాయి. గత కొంతకాలంగా పాలు, చక్కెర, ఇరానీ తేయాకు ధరలు ఆకాశాన్నంటడంతో ఇరానీ చాయ్ ధర పెంచక తప్పని పరిస్థితి ఏర్పడిందని జంటనగరాల కేఫ్ యాజమానులు అంటున్నారు. కేఫ్‌లలో పనివారి జీతాలూ పెరగడం దీనికి మరో కారణమంటున్నారు. గడచిన కొద్ది రోజులుగా మాములు చాయ్ ధర మూడుసార్లు పెరిగింది. మొదట 5 రూపాయలున్న ధర 6రూ. తరువాత 8.రూ. ఇప్పుడు రూ. 10కి చేరింది. కొన్ని హోటళ్లు మాత్రం ధరను స్వల్పంగా పెంచాయి. వాటిల్లో రూ.9కే ఇరానీ చాయ్ ఇస్తున్నారు. టీ పౌడర్ ధర కిలోకు రూ.20 పెరగడం, చక్కెర క్వింటాలుకు రూ.400 నుండి రూ.600 ల మధ్య ఉండడం, పాల ధర లీటరుకు రూ.2 నుండి 4 రూపాయలు పెరగడంతో ఇరానీ చాయ్ ధర పెంచక తప్పని పరిస్థితి ఏర్పడింది. దీంతో ఎన్నో సంవత్సరాల చరిత్ర ఉన్న కేఫ్‌లకూ గిరాకీ తగ్గింది. చిన్న చిన్న టీ స్టాల్స్ కూడా అధికం కావడంతో పోటీని తట్టుకోవడంలో కొన్ని కేఫ్‌లు వెనుకబడుతున్నాయి. ఇరానీ చాయ్, ఉస్మానియా బిస్కట్, సమోసా, బన్ను అన్నదమ్ములే!
ఇరానీ చాయ్ అనగానే మనకు గుర్తుకు వచ్చేది ఉస్మానియా బిస్కట్. ఇరానీ కేఫ్‌కు వెళ్లి మనం చాయ్ ఆర్డర్ ఇవ్వగానే చాయ్‌తో పాటు ఎక్స్‌ట్రా కప్పు, ఒక సాసర్, ఒక ప్లేట్‌లో ఉస్మానియా బిస్కట్లు ఇవ్వడం ఆనవాయితీ. బిస్కట్స్ ఆర్డర్ ఇవ్వకున్న తెచ్చి ఇవ్వడం అనేది ఇరానీ కేఫ్‌ల సంప్రదాయంలో ఒక భాగం. తినడం తినకపోవడం మన ఇష్టం. ఇక రోజువారి పనుల్లో బిజీగా ఉండి భోజనం చేయని వారికి ఇరానీ చాయ్, బిస్కట్లే ఆహారం. ఇరానీ హోటళ్లలో మరో ప్రత్యేకత చాయ్ సమోసా, చాయ్ బన్ను. ఈ మూడు కాంబినేషన్‌లలో ఏదో ఒకటి తప్పకుండా మనకు కనపడుతుంది. ఉస్మానియా బిస్కట్లకు హైదరాబాద్‌కు ఉన్నంత చరిత్ర ఉంది. నిజాం కాలం నుండి కూడా ఇరానీ చాయ్ బిస్కట్లకు విడదీయరాని బంధం ఉంది. నిజాం చివరి పాలకుడు మీర్ ఉస్మాన్ ఆలీఖాన్ పేరు మీదే వీటికి ఉస్మానియా బిస్కట్లు అన్న పేరు స్థిరపడింది. -బతుకమ్మ నుండి...

8, ఏప్రిల్ 2013, సోమవారం
ఈ బంద్ ఎవరి కోసం ..?
గత నెలరోజులుగా జరుగుతున్న విద్యుత్ డ్రామాలో రేపు మరో ఘట్టం చోటుచేసుకోనుంది, ఏప్రిల్ 9 న కమూనిస్ట్ పార్టీలు బంద్ కు పిలుపునిచ్చాయి, దీనికి అన్ని ప్రతిపక్ష పార్టీలు మద్దతు ఇచ్చాయి, రేపు జరగబోయే బంద్ ను విజయవంతం చేయడానికి అన్ని పార్టీలు కృషిచేస్తున్నాయి, మరి ఈ బంద్ ఎవరి కోసం..? పేదల కోసమా, మధ్య తరగతి కోసమా..?
పెంచిన విధ్యుత్ చార్జీలను తగ్గించాలని వామపక్షాలు ఉద్యమ బాట పట్టాయి, పేద, మధ్య తరగతి ప్రజలపై నుండి విద్యుత్ భారాన్ని తొలగించాలని డిమాండ్ చేసారు. వామపక్షాల తర్వాత టి డి పీ, ఆ తర్వాత బిజెపి, చివరగా విజయమ్మలు దీక్షలకు దిగారు, అయితే ప్రతిపక్షాల ఎత్తులను చిత్తు చేస్తూ ప్రభుత్వం 200 యునిట్ల వినియోగం వరకు విద్యుత్ చార్జీల పెంపు కు మినహాయింపు ఇచ్చింది, ఐనా వామపక్షాలు సంతృప్తి చెందలేదు, పెంచిన మొత్తం చార్జీలు తగ్గించే వరకు ఉద్యమం ఆపమని తొమ్మిదవ తేది బంద్ కొనసాగుతుందని స్పష్టం చేసారు. నిజంగా ప్రతిపక్షాలు పేద మధ్యతరగతి ప్రజలకోసం పోరాడినట్లైతే బంద్ ను ఉపసంహరించుకొని ఉండాలి, ఎందుకంటే పేదలు, మధ్యతరగతి ప్రజల విద్యుత్ వినియోగం 200 ల యూనిట్లు దాటదు కాబట్టి, అయితే రేపటి బంద్ ఎవరికోసం చేస్తున్నారు అనేది ప్రశ్న..?
పేదలు, మధ్యతరగతి పై భారాన్ని తగ్గించిన తర్వాత కూడా ప్రతిపక్షాలు పోరాటంచేస్తున్నాయంటే అది కేవలం సంపన్నులు, పెట్టుబడిదారులకు మేలు చెయ్యడానికే అని స్పష్టం అవుతుంది, ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే చంద్ర బాబు, విజయమ్మ, కిషన్ రెడ్డి లు పెట్టుబడి దారులకు, సంపన్నులకు మద్దతు ఇస్తున్నారంటే అందులో అర్థం ఉంది, ఎందుకంటే వారు స్వయంగా పెట్టుబడిదారులు లేదా పెట్టుబడి దారుల సానుభూతిపరులు, కాని వామపక్ష పార్టీలు ఎందుకు ఉద్యమిస్తున్నట్టు.? పేదల పక్షాన నిలబడి వారి సమస్యలపై పోరాడే పార్టీలు వామపక్ష పార్టీలు, కాని నేడు అవికూడా ఓట్లు, సీట్ల కోసం జిమ్మిక్కులు చేస్తున్నాయి, ఇలాంటి సమయంలో పార్టీ బలపడాలంటే ఆర్ధిక సహకారం అవసరం అనిపించిందేమో, అందుకే సంపన్నులను, పెట్టుబడి దారులను ఆకర్షించడంకోసం ఈ బంద్ ను కొనసాగిస్తున్నరేమో..?
అసలు విద్యుత్ సంక్షోబానికి కారణం ప్రభుత్వ రంగ కంపెని లకు ప్రోత్సాహం ఇవ్వకుండా, కేవలం ప్రవేట్ పెట్టుబడిదారులను ప్రోత్సహించడం వళ్ళ అతి ఎక్కువ డబ్బు చెల్లించి వారిదగ్గర విద్యుత్ కొనుక్కోవలసిన పరిస్థితి వచ్చింది, దీనికి కారణం గతంలో రాష్ట్రాన్ని పాలించిన చంద్రబాబు, రాజశేకర్ రెడ్డి. అయితే ప్రవేట్ ప్రాజెక్ట్ ల అనుమతులకు వ్యతిరేఖం గా పోరాడి ప్రభుత్వ రంగ సంస్థలను ప్రోత్సహించే విధంగా ప్రణాళిక ఇప్పటికి రూపొందించక పోవడం దురదృష్టకరం, రేపు ఎవరు అధికారంలోకి వచ్చిన విద్యుత్ కోతలు అనేవి సర్వసాధారణం అని అనుకొవచ్చు.
చిన్న తరహ, కుటీర పరిశ్రమలు విద్యుత్ సమస్యతో ఉత్పత్తిలో తీవ్ర ఆటంకాలను ఎదుర్కొంటున్నాయి, వీరికోసం ఎ ఒక్క సంపన్నుడు, పెట్టుబడిదారుడు పోరాడలేదు, ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకురాలేదు, కాని నేడు వామపక్ష పార్టీల బంద్ ద్వార పేద మధ్యతరగతి ప్రజలు సంపన్నులు, పెట్టుబడి దారులకు విద్యుత్ చార్జీలు తగ్గించమని బంద్ పాటించాలి, ధనికులకోసం పోరాడాలి, ఇది మన ప్రతిపక్షాల తెలివి, మరి మీరు బంద్ కు మద్దతు ఇస్థారా..? ఇవ్వరా..?
5, ఏప్రిల్ 2013, శుక్రవారం
వాతలు.. కోతలు..
ప్రభుత్వం ప్రజలకు వాతలమీద వాతలు పెడుతూ గుండెల్లో రైళ్ళు పరిగేట్టేలా చేస్తుంది, మొన్నటికి మన్న రైల్ చార్జీలు విపరీతంగా పెంచింది కేంద్ర సర్కార్, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ0 వంతు వచ్చింది, భూముల రిజిస్త్రేషణ్ చార్జీలు పెంచి ప్రజల నుండి డబ్బులు పిండుకుంటున్న ప్రభుత్వం, విధ్యుత్ చార్జీలను పెంచుతూ సంచలన నిర్ణయం తీసుకుంది, విద్యుత్ శ్లాబులను 8 నుండి 10 కి పెంచుతూ చార్జీల మోతమోగించింది, ఎన్నికలకు మరో సంవత్సర కాలం ఉండగా ఇలా చార్జీలు పెంచడంపై స్వపక్షంలోనే విమర్శలు వచ్చాయి, మరో వైపు సర్ చార్జి పేరుతో సామాన్యుడి నడ్డివిరుస్తుంది, ఇంకో అడుగు ముందుకు వేసిన ప్రభుత్వం రైతులకు ఇచ్చే ఉచిత విద్యుత్ కు కోతలు పెట్టింది, సంవత్సరంలో ఒకే పంటకు ఉచిత విద్యుత్ ఇస్తానంటూ ఉన్న పథకాన్ని అటకేక్కించే ప్రయత్నం చేస్తుంది, ఒక వైపు కొండెక్కిన నిత్యావసరాలు, మరో వైపు పన్నుల మోతలు బడుగుల బతుకుల్లో గుదిబండలుగా మారయి.
నేడు రాష్ట్రం విద్యుత్ సంక్షోభంలో చిక్కుకొని ఉంది డిమాండ్ కు సరిపడా సప్లయ్ లేకపోవడం వలన రాష్ట్రంలో విద్యుత్ కోతలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి, 2012-13 సంవత్సరంలో ఎండా కాలం లోనే కాకుండా వానాకాలం, చలి కాలంలో కూడా విద్యుత్ కోతలు విధించింది, అంతర్జాతీయ సదస్సు జరుగుతున్న సమయంలో కుడా రాజధాని నగరంలో విద్యుత్ కోతలు అమలు జరిగాయంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు, ఇంత తీవ్రమైన విద్యుత్ సంక్షోభానికి కారణం ఎమిటి..? ఎవరు..?
గత ప్రభుత్వాలకు ముందు చూపు లేకపోవడమే ప్రస్తుత పరిస్థితులకు కారణం, చంద్రబాబు హయాంలో అభివృద్ధి గణనీయంగా జరిగిందని, హైదరాబాద్ కు అంతర్జాతీయ కీర్తి కలిగిందని చెప్పుకుంటారు తెలుగు దేశం పార్టీ వాళ్ళు, కాని అభివృద్ధి చెందిన సమాజం యొక్క అవసరాలను తీర్చాల్సిన భాద్యత కూడా ప్రభుత్వానికి ఉంటుందని ఆయనకు గుర్తుకు రాలెదా..? 2020 వరకు ముఖ్యమంత్రి గా ఉండాలని కలలు కన్నా చంద్ర బాబు మొత్తం రాష్ట్ర విద్యుత్ వ్యవస్థనే ప్రవేట్ పరం చెయ్యాలనే కుట్ర పన్నాడు, జెన్-కో ను నిర్వీర్యం చేసి ప్రవేట్ ప్రాజెక్ట్లకు ఇబ్బడి ముబ్బడిగా అనుమతులు కట్టబెట్టారు, విద్యుత్ కేటాయింపుల్లో అక్రమాలను తవ్వి తీస్తానని వాగ్ధానం చేసిన నాటి ప్రతిపక్ష నేత అధికారంలోకి రాగానే అవన్నీ మరచి పోయారు, ప్రవేట్ కంపని ల కేటాయింపులు మొత్తంగా కాంగ్రెస్ పార్టికి చెందిన నాయకులకే చెందడం గమనార్హం, ఉచిత విద్యుత్ బకాయిలు విద్యుత్ కంపెనీలకు చెల్లించడంలో ప్రభుత్వం చూపిన అలసత్వం కారణంగా విద్యుత్ కంపెనీలు నష్టాలపాలయ్యాయి, మొత్తంగా గత పాలకుల నిర్లక్ష్యం, ముందుచూపు కొరవడడం కారణంగా నేడు రాష్ట్రం తీవ్ర విద్యుత్ సంక్షోభాన్ని ఎదుర్కుంటుంది. భవిష్యత్ ప్రణాళికలు రుపొందించక పోవడం, ప్రభుత్వ ప్రాజెక్ట్ లకు అనుమతులు ఇవ్వకపోవడం వళ్ళ భవిష్యత్తు లో కూడా ఈ అంధకారం కొనసాగే అవకాశం కనబడుతుంది.
సమైక్యంద్ర అంటూ భుజాన జాతీయ జెండా వేసుకొని తనను మించిన దేశ బక్తుడు లేడని బిల్డప్ ఇచ్చిన లగడపాటి కి చెందినా విద్యుత్ కంపని 12 రూపాయలకు యూనిట్ విద్యుత్ అమ్ముతుంది, మన ప్రభుత్వం ధర తగ్గించమంటే అతను తమిళ్ నాడు లేదా కర్ణాటక కు అమ్ముకుంటాడు, ఇందుకే నా సమైక్య రాష్ట్రం..? తెలంగాణా లోని అపార బొగ్గు నిక్షేపాలను సీమంద్ర ప్రాంతంలో ఉన్న విద్యుత్ కంపెనీలకు తరలించి అక్కడి రైతులకు అధిక విద్యుత్ ను కేటాయించి తెలంగాణా లో పంటలను ఎండబెడుతుంది.
రాష్ట్రం లో బొగ్గు నీరు పుష్కలం గా దొరికే తెలంగాణా ప్రాంతంలో కాకుండా విజయవాడలో నార్ల తాతా రావు విద్యుత్ కేంద్రం పేరుతో జెన్-కో ప్రధాన కార్యాలయాన్ని తరలించుకు వెళ్లిన సీమంద్ర సర్కార్ తెలంగాణాలో బొగ్గు అదికం గా దొరికే సింగరేణి కాలరీస్ ప్రాంతాల్లో కాకుండా రాయలసీమ నెల్లూరు, విశాక పట్టణం లాంటి ప్రాంతాల్లో థర్మల్ విద్యుత్ కేంద్రాలను ఏర్పాటు చెయ్యడం ద్వారా నీటిని, బొగ్గు ను తరలించాల్సిన పర్తిస్థితి, దీనితో ఉత్పత్తి వ్యయం పెరగడం మూలంగా అధిక భారం ప్రజలపై, సబ్సిడీ రూపం లో ప్రభుత్వం పైనా పడుతుంది, తెలంగాణా ప్రాంతంలోని థర్మల్ విద్యుత్ కేంద్రాలు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందం గా ఉంటె సీమంద్రలో ఉన్న విద్యుత్ కేంద్రాల సామర్ధ్యాన్ని పెంచి ఉత్పత్తి కారకాల కొరత కారణంగా షట్ డౌన్ చేస్తున్నారు, నేడు జలవిధ్యుత్ ఉత్పత్తిని పెంచే అవకాశం లేదు, గ్యాస్ సరిపడా లేదు, అణు విద్యుత్ అంటే కమూనిస్ట్ లు ఒంటి కాలుపై లేస్తారు, ఇక మిగిలిన థర్మల్ విద్యుత్ ఒక్కటే మార్గం సక్రమం గా బొగ్గును ఉపయోగించుకొని లాభ సాటిగా ఉండే ప్రాంతాల్లో పెట్టుబడులు, అది ప్రభుత్వ రంగంలో పెడితే తప్ప భవిష్యత్తులో విద్యుత్ సంక్షోభం నుండి రాష్ట్రం బయట పడదు.
నేడు రాజకీయ పార్టిలన్ని విద్యుత్ కొరకు ధిక్షలకు దిగుతున్నాయి, వాస్తవానికి తిలా పాపం తలా కొంత అన్నట్టు ఈ రోజు ఆందోళన చేస్తున్న వారంతా ఏదో ఒక రకంగా ఈ నాటి ఈ సంక్షోభానికి కారకులే, కమూనిస్ట్ పార్టీ లు కూడా ఈ మధ్య రాజకీయాల్లో ఆరితేరాయి, ప్రజా సమస్యలను గాలికి వదిలి తమ ఓట్లు సీట్లు పెంచుకోవడానికి డ్రామాలు చేస్తున్నాయి, కమూనిస్ట్ ల నిరాహార దిక్షకు బి జె పీ నాయకులూ వచ్చి మద్దతు తెలపడం, విజయమ్మ రాగానే నారాయణ, రాఘవులు లేచి అభివాదాలు తెలపడం, మూడు రోజుల దిక్ష అనంతరం హాస్పిటల్ లో నిమ్మరసం తాగడం, సీన్ కట్ చేస్తే బి జె పీ నాయకులూ, విజయమ్మ, చంద్ర బాబు లు క0తులవారిగా దిక్షలు చేసి ప్రభుత్వాన్ని ఉతికి ఆరేసిన వీరి డ్రామాలు తెలిసిన ప్రజలు మాత్రం ఈ నాటకాన్ని ఆసక్తిగా విక్షిస్తున్నారే కాని ప్రతిస్పందించడం లేదు, ఈ నాయకుల్లో ఎవరూ నన్ను గెలిపిస్తే వచ్చే ఏడునుండి విద్యుత్ కోతలు ఉండవు అన్న హామీ మాత్రం ఇవ్వడం లేదు, అంటే భవిష్యత్తులో కూడా సీజన్ తో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రజలు ఈ కోతలు భరించాల్సిందే...
3, ఏప్రిల్ 2013, బుధవారం
రంగారెడ్డి జిల్లాలో ద్రాక్ష రైతు దిగాలు..
రాష్ట్రంలో ద్రాక్ష పళ్ళ ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న రంగారెడ్డి జిల్లాలో నేడు ద్రాక్షతోటలు కనుమరుగవుతున్నాయి, కీసర మండలంలో గతంలో ఒక వెలుగు వెలిగిన ద్రాక్షతోటలు నేడు ఒక్కసారిగా కంటికి కనబడకుండా పోతున్నాయి. రైతన్నలు వేల ఎకరాల్లో సాగుబడిచేసిన ద్రాక్షతోటలు నేడు పదుల స్థానాల్లోకి విచ్చేశాయి. నియోజకవర్గంలోనే మండలం ద్రాక్షతోటలకు ప్రధాన నిలయంగా ఉండేది. మండలంలోని కుందన్‌పల్లి గ్రామంలో ద్రాక్షతోటలను సాగుబడి చేసిన ఇక్కడి రైతులు రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో సంచరించి రైతులకు అవగాహన సదస్సులను ఏర్పాటు చేశారు. రానురాను ద్రాక్షతోటలు మండలంలో కనుమరుగవడానికి రైతులకు ప్రభుత్వం నుంచి తగిన ప్రోత్సాహం అందకపోవడంతో పాటు కూలీల రేట్లు, మందుల రేట్లు విపరీతంగా పెరగడంతో ద్రాక్ష రైతులు ఈ తోటల మీద అసక్తి రోజురోజుకు సన్నగిల్లుతుంది. ద్రాక్షతోటలు సాగుబడిచేసిన రైతులు ఆ పంటలను కంటికి రెప్పలాగా కాపాడుకోవాల్సి ఉంటుంది. ఈ తోటల విషయంలో ఏమైన ఆశ్రద్ధ వహిస్తే తగిన నష్టం వాటిల్లక తప్పదు. నియోజకవర్గంలోని నాలుగు మండలాల కంటే కీసర మండలమే ద్రాక్షతోటలకు ప్రధాన వేధికగా ఉండేది. పలు ప్రాంతాల నుంచి పలువురు రైతులు మండలానికి విచ్చేసి రైతులు సాగుబడిచేసిన ద్రాక్ష తోటలను పరిశీలించి ఇక్కడి రైతుల నుంచి పలు సూచలను తీసుకొని వేరే ప్రాంతాల్లో సాగుబడి చేసుకోనేవారు. రానురాను గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి ఇక్కడి రైతులు ఉన్న ద్రాక్షతోటలను తీసివేసి దానిస్థానంలో పందిరి కూరగాయలను సాగుబడి చేసే పంటల మీద అసక్తిని చూపిస్తున్నారు.
రోజురోజుకు తరిగిపోతున్న ద్రాక్ష తోటల దిగుబడి:
ఈ సంవత్సరం మండలంలో ద్రాక్ష తోటల దిగుబడి ఒక్కసారిగా పడిపోయింది. మండలంలోని పలు గ్రామాల్లో సాగుబడే చేసే రైతుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. గోధుమకుంటలో వంగేటి మల్లాడ్డి 7 ఎకరాలు, కుందన్‌పల్లి గ్రామంలో చిత్తార్ల వెంక 15 ఎకరాల్లో, కీసర మండల కేంద్రంలో 10 ఎకరాలు, చీర్యాల్ గ్రామంలో 10 ఎకరాలు, కరీంగూడ గ్రామంలో 8 ఎకరాలు, తిమ్మాయిపల్లి గ్రామంలో ద్రాక్షతోటలను సాగుబడి చేస్తున్నారు. గతంలో వేల ఎకరాల్లో ఉన్న ఈ తోటలు పడిపోవడానికి అనేక సమస్యలు ఉన్నాయి. ఒక ఎకరాలో ద్రాక్షతోటలను సాగుబడి చేయాలంటే రైతులకు కనీసం రూ.60 వేల నుంచి రూ.70 వేల రూపాయల ఖర్చు అవుతుంది. రైతులకు తలకుమించిన భారంగా ఖర్చులు ఎక్కువ కావడంతో ఈ తోటల నుంచి చాల మంది రైతులు తప్పుకున్నారు.
గత సంవత్సరం 28 గ్రోమార్ రూ.250 ఉంటే నేడు రూ.1250, డీఏపీ గత సంవత్సరం రూ.350 ఉంటే నేడు రూ.1500, ఎస్‌ఓపీ పోటాష్ గత సంవత్సరం రూ.500 ఉంటే నేడు రూ.1750 ధరలు రైతుల మీద తీవ్రంగా మోపడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. వీటితో పాటు స్ప్రే మందుల ధరలు కూడ విపరీతంగా పెరిగాయని పలు గ్రామాలకు చెందిన రైతులు దిగాలు పడుతున్నారు. దీంతో వేల ఎకరాల నుంచి వందల ఎకరాల వరకు సాగుబడులు ఒక్కసారిగా పడిపోయాయని పలువురు రైతులే పేర్కొంటున్నారు. కూలీల కొరతతో పాటు భూగర్భజలాలు ఒక్కసారిగా అడిగంటిపోవడంతో రైతుల పరిస్థితుల రోజురోజుకు ఆగమ్యగోచరంగా మారిపోయాయి.
గతంలో ఆకాల వర్షాల కారణంగా చేతికొచ్చిన ద్రాక్షతోటలు కూడా నీటిమునిగిపోవడంతో ద్రాక్షరైతులు ఒక్కసారిగా భయపడిపోతున్నారు. ప్రకృతి వైపరీత్యాల కారణంగా చాల తోటలు మట్టిపాలు కావడంతో సంవత్సరం వరకు కంటికిప్పలా కాపాడి ఒక్కసారిగా చేతికొచ్చిన పంట కళ్ళ ముందే ధ్వంసం కావడంతో రైతులు ఒక్కసారిగా దిగాలు పడ్డారు. అప్పట్లో ప్రభుత్వం కూడా ప్రకృతి వైపరీత్యాల్లో దెబ్బతిన్న రైతాంగానికి ప్రభుత్వం తగిన రీతిలో నష్టపరిహారం ఇవ్వకపోవడంతో రైతులు పడ్డ అవస్థలు వర్ణానుతీతంగా ఉన్నాయి.
బ్యాంకుల్లో పేరుకుపోయిన అప్పులు:ద్రాక్షతోటలను సాగుబడిచేసిన రైతన్నలకు ప్రతి సంవత్సరం బ్యాంకుల అప్పులు కట్టకపోవడంతో ప్రతి సంవత్సరం బ్యాంకు రుణాలు కాస్తా తడిసి తడిసి మోపడు కావడంతో రైతుల పరిస్థితులు రోజురోజుకు దుర్భరంగా మారిపోతున్నాయి. ద్రాక్షతోటలంటే భయపడే స్థితిలో రైతులు ఉన్నారు. ద్రాక్షతోటలను సాగుబడిచేసిన చాలమంది రైతులు బ్యాంకుల్లో తీసుకున్న రుణాలను సకాలంలో కట్టక ఉన్న భూములను తక్కువకు అమ్ముకొని బ్యాంక్ రుణాలను కట్టిన దుస్థితి మండలంలోని పలు గ్రామాల్లో నెలకొంది. -నమస్తే తెలంగాణా నుండి..
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)