హోం

28, సెప్టెంబర్ 2012, శుక్రవారం

విధ్వంసపు పునాదులపై వైవిధ్యపు సదస్సులు..



సృష్టిలో జీవం ఉన్న ఏకైక గ్రహం భూమి, భూమి పై అనేక జీవ జాతులు నివసిస్తున్నాయి, మానవుని నాగరికతలు విస్తరిస్తున్న కొలది జంతు జాలం మనుగడ కుచించుకుపోయింది, అనతికాలం లోనే భూమిపై ఉన్న జీవులన్నీ మనిషి అధినం లోకి వచ్చాయి. మనిషి స్వార్ధానికి విలాసాలకు ప్రకృతి అందించే సహజ వనరులు కాలుష్యం ఐపోయాయి, మనిషి సాంకేతిక విప్లవం మాటున అనేక జీవజాతులు అంతరించిపోయాయి. కేవలం పక్షులు జంతువులే కాదు, అనేక ఆదిమ జాతి తెగలు కూడా అంతరించాయి, మిగిలినవి వాటికే సొంతం ఐన విభిన్న ఆచారాలు, సాంప్రదాయాలను కోల్పోయి అస్తిత్వాన్ని కోల్పోయి, అంతరించడానికి సిద్ధంగా ఉన్నాయి.
మరి వీటిని రక్షించుకునేది ఎలా ..? దానికోసమే అక్టోబర్ ఒకటి నుండి 19 వరకు హైదరాబాద్ నగరం లో జీవ వైవిధ్య సదస్సు జరుగుతుంది, ఈ సదస్సుకు 193 దేశాల ప్రతినిధులు హాజరు కానున్నారు, వీరంతా అంతరించి పోతున్న జీవ జాతులు, కనుమరుగవుతున్న సహజ వనరుల గురించి చర్చిస్తారు..
1969 లో 369 మంది విద్యార్థులను తుపాకులతో కాల్చి చంపినా ప్రభుత్వం అది,అది ఎ తాలిబాన్ ప్రభుత్వమో, రాచరిక ప్రభుత్వమో అనుకుంటే పొరపాటు, ప్రపంచం లోనే అతి పెద్ద ప్రజాస్వామిక దేశంగా చెప్పుకునే భారతదేశంలో, మరి ఓట్లేసి గెలిపించిన ప్రజలనే హత్యా చేసిన ఈ ప్రభుత్వానికి అదే గడ్డపై ఈ సదస్సును నిర్వహించే హక్కు ఉందా...?
నేడు హైదరాబాద్ నగరం సుందరంగా మారింది, ఫ్లై ఓవర్ ల కింద అందమైన బొమ్మలు, దారి మధ్యలో పూలకున్దిలు, పక్కన పెద్ద పెద్ద హోర్డింగులు అన్నింటి సారాంశం ఒక్కటే వన్య ప్రానుల్ని కాపాడండి, పక్షుల్ని కాపాడండి, ధరిత్రిని కాపాడండి అని.
మూడు సంవత్సరాల క్రితం తెలంగాణా ఉద్యమానికి తలొగ్గిన ప్రభుత్వం తెలంగాణా రాష్ట్రం ఏర్పరుస్తామని ప్రకటన చేసింది, కాని అమలు చెయ్యడంలో విఫలం అయ్యింది, ఈ కారణంగా సుమారు 1000 మంది యువతీ యువకులు ఆత్మహత్యలు చేసుకున్నారు, వారి మరణాలను గుర్తించలేదు ఈ ప్రభుత్వాలు, వారి కుటుంబాలను కనీసం ఆదుకోలేదు, వెయ్యి మంది ప్రాణాలు పోతే పట్టించుకోని ఈ ప్రభుత్వాలు పిట్టలను కాపాడండి, కప్పలను కాపాడండి అంటూ నినదాలివ్వడం, దయ్యాలు వేదాలు వల్లించి నట్టుంది.
సెప్టెంబర్ 30 తెలంగాణా మార్చ్ కోసం తెలంగాణా జే ఎ సి పిలుపునిచ్చింది, ట్యాంక్ బ్యాండ్ పై లక్షలాది జనం తో సాగర హారం నిర్వహించాలని తలపెట్టింది, ఒకటో తేది నుండి జీవ వైవిధ్య సదస్సు ఉంది వాయిదా వేసుకొందని ప్రభుత్వం చెపుతుంది, 42 రోజుల సకల జేనుల సమ్మె చేస్తే కనీసం స్పందించని ఈ ప్రభుత్వం చెబితే మనం ఎందుకు వినాలి..?
ఒక వైపు తెలంగాణా లో తాగే నీటిలో ఫ్లోరైడ్ విషం కలిసి బొక్కలు విరిగి జనం బాధలు పడుతున్నారు, మరో వైపు పనులు లేక పొట్టచేత పట్టుకొని బొంబాయి దుబాయ్ అంటూ జనం వలసలు పోతున్నారు, అన్ద్రోల్లు తెలంగాణా కొండల్ని, గుట్టల్ని తవ్వుకుపోతున్నారు, బొగ్గు గనులను లూటి చేస్తున్నారు, ఇక్కడ తెలంగాణా తన అస్థిత్వాన్నే కోల్పోతుంటే సీమంద్ర సర్కార్ అదే తెలంగాణా గడ్డమీద సదస్సులు నిర్వహిస్తుంది.
హైదరాబాద్ కు వస్తున్న విదేశీ ప్రతినిధులు హైదరాబాద్ నది బొడ్డున ఉన్న మూసి నది నేడు మృత నదిగా ఎందుకు మారిందో, దానిలోని జీవజాలాన్ని పొట్టన పెట్టుకున్నది ఎవరో తెలుసు కోవాలి, హుస్సేన్ సాగర్ సరస్సు నేడు మురికి కుపంగా ఎందుకు మారిందో తెలుసు కోవాలి, అందుకే సాగర హారానికి లక్షల మంది జనం తరలి రావాలి, ఇంటికో మనిషి చేతిలో జెండా తో ట్యాంక్ బ్యాండ్ పైకి చేరి ఈ సర్కార్ తెలంగాణా జీవ వైవిధ్యతను ఎలా దేబ్బకోట్టిందో తెలియ జెప్పాలి, తెలంగాణా జీవ వైవిధ్యానికి సమాధి కట్టి , కృత్రిమ అందాలను పులిమిన ఈ సర్కార్ నిజ స్వరూపాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలి, తెలంగాణా మార్చ్ ను విజయవంతం చెయ్యాలి.

ఓటేసే జనం చాస్తేనే పట్టించుకోని మన ఓటు బ్యాంకు ప్రభుత్వాలు, కనీసం ఓటు హక్కు కూడా లేని మూగ జీవాలను కాపడుతాయనడం నిజంగా హాస్యాస్పదం...