హోం

9, నవంబర్ 2011, బుధవారం

తెలంగాణా ప్రజలకు కార్తీక పూర్ణిమ శుభాకాంక్షలు....

(10 /11 / 2011 )  తెలంగాణా ప్రజలకు కార్తీక పూర్ణిమ శుభాకాంక్షలు....

తెలంగాణా అమరవీరుల స్థూపం.


1969 లో తెలంగాణా ఉద్యమంలో అమరులైన విద్యార్థి వీరుల స్మృత్యర్థం ఒక స్థుపాన్ని ఏర్పాటుచెయ్యాలని తలచారు, ఐతే తెలంగాణా చిహ్నం ఒకటి హైదరాబాద్లో ఉండటం సీమంద్ర సర్కార్కు నచ్చలేదు స్థూపం ఏర్పాటుకు అనుమతించలేదు, ఐన పట్టువదలకుండా 1975 లో  అప్పటి హైదరాబాద్ మున్సిపల్ చైర్మెన్ సహకారంతో అసెంబ్లీ కి ఎదురుగా ఉన్న గన్ పార్క్ లో అమరవీరుల స్థూపం ఏర్పాటుచేసారు, ఐతే సీమంద్ర సర్కార్ స్థూపం ఏర్పాటును అడ్డుకునేందుకు అసెంబ్లీ పరిసర ప్రాంతాలను మొత్తం పోలీసులతో నిమ్పివేసింది, ఆ రోజు లాటి చార్జ్ జరిగింది, తెలంగాణా వాదులను తరిమి కొట్టాలని చూసారు కాని చివరికి స్థుపాన్ని గన్ పార్క్ లో ఏర్పాటుచేసారు, అయితే ఈ స్థుపాన్ని ఇంతవరకు ఎవరు ప్రారంభోత్సవం చెయ్యలేదు, స్థూపాన్ని ఏర్పాటు చెయ్యగానే నాయకులందరిని పోలీసులు అరెస్ట్ చెయ్యడంతో అల ఆ రోజు ప్రారంభోత్సవం ఆగిపోయింది, ఐన తెలంగాణా వాదులు తమ కోసం ఆత్మబలి దానం చేసిన తమ యోధులను ఆ స్తూపంలో చూసుకుంటున్నారు.
                      అమరవీరుల స్థూపాన్ని తయారుచేసిన శిల్పి అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి గడించిన యాదగిరి, ఆయనది పాలమూరు జిల్లా, కాని ఆయన హైదరాబాద్ పాత బస్తి లో జీవిస్తున్నారు, ఆయన రూపొందించిన అమరవీరుల స్తూపంలో ఎన్నో నిగూడ అర్థాలు ఇమిడి ఉన్నాయి, స్థూపం అడుగు భాగం నల్లరాయితో తయారయ్యింది, స్తూపం నారింజ, ఎరుపు రంగుల్లో ఉంటుంది, నారిజ త్యాగానికి, ఎరుపు విప్లవానికి చిహ్నం, స్థూపం నాలుగు వైపులా పుష్పాలు ఉంటై అవి అమరవీరులకు అర్పించే నీరాజనం, పై భాగంలో అశోక చక్రాన్ని తీసుకున్నారు, ఇది శాంతి, ధర్మం, సహనాలకి చిహ్నం, స్థూపం పై భాగంలో ఉండే తెల్లని మల్లెపువ్వు స్వేచ్చకు చిహ్నం, అమరవీరుల ఆశయం, వారి సాహసం, వారి త్యాగం ఎన్నటికి వాడిపోవని అది చెప్తుంది.
       తెలంగాణా రాష్ట్రము కోసం దశాబ్దాలుగా జరుగుతున్న సమరానికి, సాహసానికి, సజీవ సాక్షంగా నిలిచి ఉంది ఈ అమరవీరుల స్తూపం, చరిత్రలో సీమంద్రుల రక్త దాహానికి భాలైన తెలంగాణా వీరుల త్యాగాలను, సీమంద్రుల దౌర్జన్యాలను మనకు నిరంతరం గుర్తుచేస్తూ, పోరాటం వైపుగా తెలంగాణా ప్రజలను మరలిస్తున్నది తెలంగాణా అమరవీరుల స్థూపం.


                            

దీక్ష విరమించిన కోమటి రెడ్డి..

గత తొమ్మిది రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ రోజు తెలంగాణా అమర వీరుడు యాదిరెడ్డి తల్లి చంద్రమ్మ చేతులమీదుగా నిమ్మరసం తాగి దీక్షను విరమించారు..


నేటి వార్త ( 09 /11 /2011 )

1 . చంద్రబాబు రైతుపోరు యాత్ర పై ఖమ్మం జిల్లావాసులు మండిపడుతున్నరు. బాబు హయాంలో బషీర్ బాగ్ కాల్పుల ఘటనలో అసువులు బాసిన జిల్లా వాసి సత్తెనపల్లి రామకృష్ణ కుటుంబానికి సమాధానం చెప్పి యాత్ర చేపట్టాలని డిమాండ్ చేశారు. తొమ్మిదేళ్ల పాలనలో వ్యవసాయమే దండగన్న చంద్రబాబు ఇప్పుడు రైతు యాత్ర చేపట్టడాన్ని విడ్డూరంగా ఉందని టీఆర్ఎస్ నేతలు ఎద్దేవా చేశారు. యాత్రకు నిరసనగా రామకృష్ణ స్ధూపం వద్ద బాబు దిష్టిబొమ్మ దగ్ధం చేశారు.
2 . నిమ్స్ ఆసుపత్రిలో దీక్ష చేస్తున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి దీక్ష విరమించారు. ఢిల్లీలో పార్లమెంట్ ముందు తెలంగాణ కోసం ఉరి వేసుకుని మరణించిన యాదిరెడ్డి తల్లి చంద్రమ్మ నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు.కోమటిరెడ్డి వెంకటరెడ్డి దీక్ష గత తొమ్మిది రోజులుగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. దీక్ష విరమణకు కాంగ్రేస్ నేతలు, జేఏసీ నేతలు హజరయ్యారు. కోదండరాం, మంత్రిసారయ్య ,గుత్తా , మందా జగన్నాథం, కేకేశవరావు, తదితరులు హాజరయ్యారు.
3 . రూపాయి కిలో బియ్యం ముక్కిపోయినయన్నందు కు బాలరాజు అనే వ్యక్తిపై చేయిచేసుకున్న సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.
4 . తెలంగాణ రాష్ట్ర సమితిలోకి వలసలు జోరందుకున్నాయి. మరో నలుగురు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లోకి త్వరలో చేరనున్నారు. 11వ తేదిన చేరుతున్నట్లు ఎమ్మెల్యేలు తెలిపారు. చొప్పదండి ఎమ్మెల్యే సుద్దాల దేవయ్య, జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిందే, కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్, అచ్చంపేట ఎమ్మెల్యే సి.రాములు తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరనున్నారు. చంద్రబాబు రెండుకళ్ల సిద్దాంతం, తటస్థ వైఖరీ అంటూ తెలంగాణ విషయంలో పూటకో మాట చెబుతుండటం వలనే ఎమ్మెల్యేలు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. టీఆర్‌ఎస్‌లోకి మరో నలుగురు ఎంపీలు వెళ్లెందుకు సిద్దంగా ఉన్నట్లు తెలిసింది.తాను టీఆర్‌ఎస్‌లో చేరే ఆలోచన లేదని హన్మంత్ షిడే తెలిపారు.

8, నవంబర్ 2011, మంగళవారం

ప్రజా కవి కాళన్న యాది..


తెలంగాణ ప్రజల ప్రతీ ఉద్యమం ప్రతిధ్వని కాళోజి నారాయణరావు. రాజకీయ సాంఘిక చైతన్యాల సమాహారం కాళోజి. కవిత్వం రాసి ప్రజాకవి. హక్కులడిగి ప్రజల మనిషి. ఉద్యమం నడిపిన ప్రజావాది.హేతువాది . మొత్తంగా తెలంగాణ జీవిత చలన శీలి కాళోజి. పుటక చావులు కాకుండా బతుకంతా తెలంగాణకిచ్చిన మహనీయుడు, వైతాళికుడు కాళోజి.కాళోజీ జయంతి సెప్టెంబర్ 9 ని “తెలుగు మాండలిక భాషా దినోత్సవం” గా జరుపుకుంటున్నాము.

  • కాళోజి నారాయణరావు కాళన్నగా, కాళోజిగా ప్రఖ్యాతుడు. 1914 సెప్టెంబర్ 9 న కర్ణాటక బీజాపూర్ జిల్లా రట్టేహళి గ్రామంలో జన్మించిండు.కాళోజివరంగల్ జిల్లా మడికొండ గ్రామంల పెరిగిoడు.
  • కాళోజి న్యాయవాద విద్య అభ్యసించినా వృత్తి ముందుకు సాగలేదు.
  • హైదరాబాదుల సంచరించినా హనుమకొండలనే ఆయన జీవితం.
  • కవిత్వం రాసినా ప్రజా చైతన్య మార్గమే ఆయన లక్ష్యం. రాజకీయాలు ఆయన ప్రాణం.
  • కాళోజి రామేశ్వరరావు ఆయన అన్న, ఉర్దూ కవి.తమ్ముడికన్నా అన్న ఆరు సంవత్సరాలు పెద్ద
  • కాళోజీ అసలు పేరు-రఘువీర్ నారాయణ్ లక్ష్మీకాంత్ శ్రీనివాసరావు రాం రాజా కాళోజి-
  • తల్లి రమాబాయమ్మ, కన్నడిగుల ఆడపడుచు. తండ్రి కాళోజీ రంగారావు మహారాష్ట్రీయుడు.
  • కాళోజీ జన్మించిన అయిదారు నెలలకే రమాబాయమ్మ చనిపోవడంతో అన్నే అమ్మగా మారి తమ్ముడు కాళోజిని పెంచి పెద్దచేశారు.నా ఏడవ నెలలో అన్నగారి భుజాలమీద ఎక్కిన నేను నా 80వ ఏట కూడా ఆ భుజాలమీద అట్లనే ఉన్న. ఆయన అట్లనే మోస్తున్నాడు! అన్నాడు
  • పి.వి. నరసింహారావు, కాళోజీ ఒరే అనే టంత చనువు వున్న స్నేహితులు,
  • కాళోజీ నాన్ వెజి టేరియన్ తినేవాడు. ఇష్టం గా రమ్ము తాగేవాడు. తాపీగా భోజనం చేస్తూ బోలెడు కబుర్లు చెప్పేవాడు.
  • రాయ్ ను యూనివర్శల్ పర్సన్ అనేవారు. ఆంధ్రప్రదేశ్ కావాలని కోరిన కాళోజీ, 1969 లో ప్రత్యేక తెలంగాణాను సమర్ధించి, అలాగే నిలిచిపోయారు.
  • 1977లో సత్తుపల్లి (ఖమ్మం జిల్లా) నుండి స్వతంత్ర అభ్యర్థిగా నాటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావుపై పోటీ చేశాడు కాళోజీ. డిపాజిట్ పోయింది.
  • తెలుగు బిడ్డవురోరి తెలుగు మాట్లాడుటకు-సంకోచ పడియెదవు సంగతేమిటిరా?
                 అన్యభాషలు నేర్చి ఆంధ్రంబు రాదంచు-సకిలించు ఆంధ్రుడా! చావవేటికిరా అన్నారు కాళోజీ.

  • కాళోజీ నిఖిలాంధ్ర కవి. అందులో ఎట్టి సందేహం లేదు. ఆయనకు తెలంగాణా అంచులు గోడలుగా అడ్డునిలువజాలవు. ఆయన తన ఖండకావ్య సంపుటానికి 'నా గొడవ' అని పేరు పెట్టారు. అదే కవి ప్రతిభ. అదే కవి చెప్పవలసిందీను. ఇది కవి గొడవగానే అనిపించినప్పటికీ చదివిన వారికి ఇది తమ గొడవగానే అర్థమవుతుంది. ఇది విశాల జగత్తు ప్రజలందరి గొడవ - శ్రీశ్రీ
  • ఒక్క సిరాచుక్క లక్షల మెదళ్లకు కదలిక- కాళోజి
  • 'పుటక నీది-చావు నీది-బతుకంతా దేశానిది --- జయప్రకాశ్ నారాయణ మరణించినపుడు కాళోజి
  • 1943లోనే ఆయన కథల్ని కాళోజీ కథలు పేరుతో అప్పట్లో హైదరాబాద్‌లో ఆంధ్ర పబ్లిషింగ్ కంపెనీకి చెందిన అణాగ్రంథమాల సంస్థ తన పద్నాలుగో ప్రచురణగా ప్రచురించింది.
  • ఆర్యసమాజ భావజాలం పట్ల ఆకర్షితులై నిజాం నవాబు కారుమీద బాంబు విసిరాడు..
  • ఆంధ్రప్రదేశ్ ఏర్పడినపుడు పాములపర్తి సదాశివరావుతో కలిసి తెలంగాణా ప్రత్యేక సంచిక వెలువరించారు. విశాలాంధ్ర కావాలనీ అన్నారు. తెలంగాణాకు జరుగుతున్న అన్యాయాన్ని నిరసిస్తూ ప్రత్యేక తెలంగాణా కావాలనీ అన్నారు.
  • రెండేళ్లు రాష్ట్ర విధానపరిషత్తు సభ్యుడిగా ఏ పార్టీకి చెందని స్వతంత్ర సభ్యుడిగా ఉన్నాడు. 
  •                                                          
                 
  • తెలంగాణల నిజాం జమానాల నెలకొన్న ఇబ్బందికర పరిస్థితులను సాహసికంగా ఎదిరించిండు.
  • ఆర్యసమాజ్ సభలు, ఊరేగింపులు, కాంగ్రెస్, కమ్యూనిస్టుల కార్యకలాపాలు, రచయితల సభలు, అన్నీ కాళోజి భాగం పంచినయి.
  • సహ యువకుల్ని చైతన్యంలకి మళ్లించేటోడు. గాంధీ అహింసామార్గాన్నే శిరసావహించినా అవసరాన్ని బట్టి ప్రతిహింసను కూడా ఆహ్వానించిండు.
  • నిజాం వ్యతిరేకంగా తీవ్ర స్వరంతో కవితలు రాసిండు. నిజాం దుష్కృత్యాల్ని తన సహజ శైలిల తూర్పారబట్టిండు.
  • నిజాం ఆగ్రహించి కాళోజికి వరంగల్ నగర బహిష్కారం విధించిండు. కాళోజి మరింత తీవ్రంగా అంకితభావంతో అక్షరం సంధించిండు. 1939ల, 1943ల రెండుసార్లు జైలుకి పోవాల్సివచ్చింది.
  • ఎన్నో ఇతర భాషా గ్రంథాలను తెలుగులకి అనువదించిండు.
  • కాళోజి కథలు, నా గొడవ, జీవన గీత మొదలైనవి ఆయన రచనలు.
  • ఆంధ్ర జనసంఘం, ఆంధ్ర సారస్వత పరిషత్తు, ఆంధ్రమహాసభ, తెలంగాణ రచయితల సంఘం సంస్థల నిర్మాణంల కాళోజి భాగం ఉంది.
  • పి.వి.నరసింహారావు లాంటి ఎందరికో ఆయన సాహిత్యంల, రాజకీయాలల్ల మార్గదర్శనం చేసిండు.
  • విశాలాంధ్ర సమస్యలు గమనించి ఆయన 1969ల ప్రత్యేక తెలంగాణ ఉద్యమంల కలిసిండు.
  • అన్ని సందర్భాలల్లా అసలుసిసలైన తెలంగాణవాదిగా జీవించిండు. బూటకపు ప్రజాస్వామ్యాన్ని, కోస్తా ఆధిపత్యాన్ని వ్యతిరేకించిండు.
  • ఎవని వాడుక భాష వాడు రాయాలె. ఇట్ల రాస్తే అవతలోనికి తెలుస్తదా అని ముందర్నే మనమనుకునుడు, మనను మనం తక్కువ చేసుకున్నట్లె. ఈ బానిస భావన పోవాలె. నే నెన్నో సార్లు చెప్పిన. భాష రెండు తీర్లు - ఒకటి బడి పలుకుల భాష, రెండోది పలుకు బడుల భాష. పలుకు బడుల భాషగావాలె. - కాళోజీ
  • విద్యార్థి దశనుంచీ మిత్రుడైన పి.వి.నరసింహారావు మాటను కాదనలేక ఆయన భారత ప్రభుత్వం ప్రకటించిన పద్మవిభూషణ్ పురస్కారాన్ని స్వీకరించారు! అయితే ప్రభుత్వం అవార్డునిచ్చిందనీ, సత్కరించిందనీ తన హక్కుల పోరాటం, తెలంగాణా రాష్ట్ర వాదం ఆయన చివరివరకూ వదులుకోలేదు. 2002 నవంబరు పదమూడో తేదీ కాళోజీ కన్నుమూశారు!

  • చివరి వరకు తెలంగాణే ఆశగా శ్వాస గా బతికిన ఆయన "ప్రాంతేతరుడు తప్పుచేస్తే ప్రాంతం దాటే వరకు తరిమి కొడదాం, ప్రాంతం వాడు తప్పు చేస్తే ప్రాంతంలోనే పాతి పెడదాం అని " పిలుపు నిచ్చారు, ప్రస్తుత ఉద్యమానికి ఆయన లేని లోటు పుడ్చాలేనిదే, ఐన ఆయన ను ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలి...


నేటి వార్త (08 /11 /2011 )

1 . ఈ నెల 10వ తేదీ తర్వాత తెలంగాణపై స్పష్టమైన నిర్ణయం తీసుకుంటామని రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి గులాం నబీ ఆజాద్ వెల్లడించారు. సోనియాతో భేటీ అనంతరం ఆయన జాతీయ మీడియాతో మాట్లాడారు. 11న కాంగ్రెస్ కోర్ కమిటీ భేటీ తర్వాత కీలక నిర్ణయాన్ని తీసుకునే అవకాశం ఉంది. 
2 . కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోగ్యం మరింత క్షీణించింది..ఎనిమిది రోజుల సంది దీక్ష చేస్తున్న కోమటిరెడ్డి తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతున్నరు...అయితే ప్లూయిడ్స్ తీసుకోవడానికి కోమటిరెడ్డి నిరాకరిస్తున్నట్టు డాక్టర్లు చెపుతున్నరు.. తెలంగాణ వచ్చే దాక వెనక్కి తగ్గేదే లేదని కోమటిరెడ్డి తేల్చి చెప్పిన్రు...మరోవైపు కోమటిరెడ్డి హెల్త్ కండీషన్ పై కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నరు.
3 . ఉత్తరప్రదేశ్‌ను నాలుగు రాష్ట్రాలుగా విభజించాలన్న మాయవతి ప్రకటన కీలకమైనదని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొ. కోదండరాం అన్నారు. తెలంగాణ అంశాన్ని అధిష్టానం చూసుకుంటుంది అని అంటున్న టీ కాంగ్రెస్ నేతలు అసెంబ్లీలో ఏం చేయాలో మాయవతిని చూసి నేర్చుకోవాలని చెప్పారు. టీ కాంగ్రెస్ నేతలు అసెంబ్లీలో రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా తీర్మానం చేయించాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్, అసెంబ్లీ సమావేశాల నాటికి ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని ఆయన తెలిపారు.

7, నవంబర్ 2011, సోమవారం

నిబంధనలు, ఒప్పందాలు, ఫార్ములాలు, జి ఓ లు, కమిటిలు, ముఖ్య సంఘటనలు ...

* 1919 లో ముల్కి రూల్స్ అమలులోకి వచ్చాయి.
* 15 సంవత్సరాలు తెలంగాణాలో స్థిర పడిన వారే ఇక్కడ ఉద్యోగం పొందడానికి అర్హులు.
* 1930 లో ఆంద్ర మహా సభ ఆవిర్భావం, ఇదే కమూనిస్ట్ పార్టి గా రూపొందింది.
* తెలంగాణా సాయుడ పోరాటంలో పాల్గొన్న కమూనిస్ట్ ప్రముకులు కే వి రంగారావు, నరసింహ రావు సురవరం ప్రతాప రెడ్డి, రావి నారాయణ రెడ్డి, బద్దం యెల్లారెడ్డి, బొజ్జ నర్సింహులు , అనభేరి ప్రభాకర్.
* 1946 లో కమూనిస్ట్ పార్టీ పై నిజాం సర్కార్ నిషేధం విధించింది.
* కాశీం రజ్వి ఆధ్వర్యంలో రజాకార్లు విధ్వంసాలు, మానబంగాలు, దోపిడిలు, లూటీలకు పాల్పడ్డారు.
* వీరు మత విద్వేషాలు రెచ్చ గొట్టారు.
* ఆర్య సమాజ్ అధ్యక్షుడు రామానంద్ తీర్ధ కాంగ్రెస్స్ పార్టీని తెలంగాణాలో ఏర్పాటు చేసి పోరాడసాగారు.
* 1947 లో భారత దేశం స్వతంత్రం పొందింది.
* హైదరాబాద్ లో అలజడిని గుర్తించి భారత కేంద్ర ప్రభుత్వం కొన్ని ఒప్పందాలు కుదుర్చుకుంది.
* కే.ఎం .మున్షి ని భారత ప్రతినిధి గా పంపారు.
* 1947 డిసెంబర్ లో ఒప్పందంలో బాగంగా హైదరాబాద్ సంస్థానంలో ఎన్నికలు జరిగాయి, అందులో లాయక్ అలీ ప్రధానిగా ఎన్నుకోబడ్డారు.
* 1946 నుండే గ్రామస్థాయి నుండి రైతాంగ సాయుధ పోరాటం మొదలయింది. ఇది 1946 అక్టోబర్ లో ప్రారంభం అయ్యింది.
* మొదట నల్గొండ, బీదర్ లలో ప్రరంబమైన పోరాటం ఆ తర్వాత తెలంగాణా అంతట విస్తరించింది.
* 1948 లో వరంగల్ జిల్లా బైరాన్ పల్లి ఉదంతం మరో జలియన్వాలా బాగ్ ను తలపించింది. 
* హైదరాబాద్ ను భారత దేశం లో కలపాలన్న ప్రజల ఆకాంక్షను నిజం రాజు వ్యతిరేకించాడు.
* ప్రజల పోరాటంలో చివరికి భారత ప్రభుత్వం తోడోచ్చి, మేజర్ చౌదరి ఆధ్వర్యంలో సైనిక చర్య జరిపింది, దిని పేరే ఆపరేషన్ పోలో.
* 1948 సెప్టెంబర్ 12 న ప్రరంబమైన సైనిక చర్య 17 న నిజాం రాజు లొంగిపోవడంతో ముగిసింది. సెప్టెంబర్ 17 , 1948 లో తెలంగాణా కు విముక్తి లభించింది.
* 1948 నుండి 1952 వరకు భారత ప్రభుత్వ సివిల్ సర్వెంట్ గా నారాయణ మీనన్ ను నియమించారు.
* 1952 లో ఉద్యోగాలన్నీ మద్రాసు ప్రసిడేన్సి వాళ్ళకు ఇస్తున్నారని, నాన్-ముల్కి గో బ్యాక్ ఉద్యమం నడిచింది.
* 1952 జనరల్ ఎలేక్షన్స్ లో బూర్గుల రామకృష్ణ రావు ముఖ్య మంత్రిగా ఎన్నికయ్యారు.
* 1953 లో ఆంద్ర రాయలసీమ కలిసి ఆంద్ర రాష్ట్రంగా ఏర్పడ్డాయి.
* మొదటి ఎస్ ఆర్ సి లేదా ఫజల్ అలీ కమిషణ్ రాష్ట్రానికి వచ్చింది.
* తెలంగాణా ను ప్రత్యేక రాష్ట్రంగా ఉంచాలని, ఒక వీల కలపలనుకుంటే 1961 ఎన్నికల వరకు ఆగాలని, ఎన్నికలలో గెలిచినా అభ్యర్తులలో 2 /3  సభ్యులు ఒప్పుకుంటే అప్పుడు విలీనం గురించి ఆలోచించాలి అని చెప్పారు.
* భుర్గుల రామ కృష్ణ రావు కాంగ్రెస్ అధినేతకు రాసిన ఉత్తరం లో తెలంగాణా లో విభిన్న వాదనలు ఉన్న అధిక సంక్యలో ప్రజలు తెలంగాణా రాష్ట్రాన్నే కోరుకుంటున్నారని రాసారు.
* చివరికి ఆంద్ర వాళ్ళ ఒత్తిడి మేరకు నెహ్రూకు ఇష్టం లేకపోయినా విలీనానికి ఒప్పుకున్నారు.
* కొన్ని ఒప్పందాలపై ఇరు ప్రాంతాల పెద్దమనుషులు  సంతకాలుచేసారు, అదే పెద్ద మనుషుల ఒప్పందం.
* ఒప్పందంలోని కొన్ని ముఖ్యమైన అంశాలు:
-తెలంగాణా మంత్రులతో తెలంగాణా అభివృద్ది కొరకు " రిజినల్ స్టాండింగ్ కమిటి " ఏర్పాటు చేయాలి. తెలంగాణా లోని భూముల అమ్మకానికి, తెలంగాణాలో మధ్య నిషేధానికి ఈ కమిటి అనుమతి తప్పనిసరి.
-డోమినల్ రూల్స్: అప్పటి వరకు హైదరాబాద్ స్టేట్లోని ఉద్యోగుల ఉద్యోగాలు ఎధతధం గా ఉంటాయి.విధ్యభివ్రుద్ది పై దృష్టి, ముల్కి రూల్స్ అమలును పర్యవేక్షించడం దీని పని.
-ఉర్దూ భాషకు రెండవ అధికార భాష హోదా.
-అప్పటి వరకు తెలంగాణా లో ఉన్న మిగులు బడ్జెట్ ను తెలంగాణా అభివృద్ధికి కర్చు చెయ్యాలి.
-ఆదాయాన్ని ఎ ప్రాంతానిది ఆ ప్రాంతానికే కర్చు చెయ్యాలి, తెలంగాణా లోని ఆదయ, వ్యయాల్ని లెక్క చూపాలి.
-మంత్రి వర్గంలో 60 :40 పంపిణి,ఆంద్ర నుండి ముక్య మంత్రి ఉంటె తెలంగాణా వాళ్ళు ఉపముక్య మంత్రి ఉండాలి.
* పెద్దమనుషుల ఒప్పందం పై ఇరు ప్రాంతాల నేతలు 19 జూలై 1956 లో సంతకం చేసారు,
ఆంద్ర నుండి 1 బెజవాడ గోపాల్ రెడ్డి, 2 నీలం సంజీవ రెడ్డి, 3 గౌతు లచ్చన్న లు 
తెలంగాణా నుండి 1 బూర్గుల రామకృష్ణ రావు, 2 మర్రి చెన్నారెడ్డి, 3 కే వి రంగా రావు లు సంతకాలు చేసారు.
* ఒప్పందాల, నిభంధనల ఉల్లంగనల ఫలితంగా 1969 లో ఉద్యమం ప్రారంభమైంది.
* విద్యార్థులు, ఉద్యోగులు, డాక్టర్లు , లాయర్ లు కలిసి ఉద్యమాన్ని నడిపించారు.
* ప్రభుత్వ కాల్పుల్లో 360 మంది విద్యార్థులు మరణించారు.
* మర్రి చెన్న రెడ్డి ఉద్యమం లో చేరి తెలంగాణా ప్రజా సమితి అనే పార్టీని ఏర్పాటు చేసారు.
* 1971 ఎన్నికలలో 11 ఎం పి స్థానాలు గెలిచారు. కాని ఉద్యమాన్ని మధ్యలో వదిలేసి కాంగ్రెస్ లో చేరారు.
* 1969 నవంబర్ 11 న అష్ట సూత్ర పథకం వచ్చింది:
- తెలంగాణా నుండి ఆంధ్రకు తరలించబడిన నిధులను తీయడానికి ఒక కమిటి, నెలరోజుల్లో రిపోర్ట్.
- మిగులును తరలించుట వలన తెలంగాణా కు జరిగిన నష్టాన్ని పూరించుటకు నిధులు మంజూరు.
- అభివృద్ది కి ప్రాంతీయ అభివృద్ది మండలి ఏర్పాటు.
- ప్రణాళిక అమలుకు ప్రణాళిక సంగం అధ్యక్షుని అధ్యక్షతన ఒక అధికారుల కమిటి ఏర్పాటు, కేంద్ర హోం, ఆర్ధిక శాఖల ప్రతినిధుల తో పాటు, రాష్ట్ర ప్రతినిధులు అందులో ఉంటారు.
- రీజినల్ స్టాండిగ్ కమిటి కి అధికారాల పెంపు.
-ఉద్యోగుల విషయంలో రాజ్యంగా రక్షణలు.
-ఉద్యోగుల సమస్యల పరిష్కార భాద్యతను  యునియన్ పుబ్లిక్ సర్విస్ కమిషన్ కు అప్పగింత.
-6 మాసాలకు ఒక సారి తెలంగాణా అభివృద్ది కమిటి భేటికి ప్రధాని హాజరు కావలి.
* అక్టోబర్ 16 1972 న ముల్కి రూల్స్ రాజ్యంగా బద్ధమే నని సుప్రీం కోర్ట్ తీర్పునిచ్చింది.
* జై ఆంద్ర ఉద్యమం మొదలయ్యింది, దీని ఫలితం గా ఆరు సూత్రాల పథకం వెలుగులోకి వచ్చింది.
* సెప్టెంబర్ 21  1973 న సిక్స్ పాయింట్ ఫార్ముల వచ్చింది:
- రాష్ట్రాన్ని ఆరు జోన్స్ గా ఏర్పాటు చెయ్యడం.
- రాష్ట్ర పరిధిలో ప్లానింగ్ బోర్డు మరియు సబ్ కమిటి ల ఏర్పాటు.
- తెలంగాణా లో విద్యాభివృద్ధికి సెంట్రల్ యునివర్సిటీ ఏర్పాటు.
- ఉద్యోగుల భద్రతకు హై లెవెల్ అడ్మినిస్త్రేటింగ్ ట్రిబునల్ ఏర్పాటు.
- దీనిలో దేనికి విఘాతం కల్గిన రాష్ట్రపతి నేరుగా కల్పించుకోవచ్చు.
- పైవి అమలైతే ఇక ముల్కి రూల్స్ , రిజినల్ కమిటీలు రద్దు అవుతాయి.అయితే 15 సంవత్సరాల నివాస నిబంధన నాల్గు సంవత్సరాలకు  కుదించారు.
* 1969 ఉద్యమం తర్వాత ఏర్పాటు చేసిన భార్గవ కమిటి 1969 నాటికి 25 వేల మంది ఆంద్ర వాళ్ళు తెలంగాణా కు రావాల్సిన ఉద్యోగాలు కొల్లగొట్టారని తేల్చింది.
* అయితే ఈ మధ్యలోనే 1969 లో రాష్ట్ర ప్రభుత్వం ఐదు సూత్రాల పథకం తీసుకు వచ్చింది.
* 1969 జి ఓ నంబర్ 36 విడుదలయ్యింది దీని ప్రకారం తెలంగాణాలోని ఆంద్ర ఉద్యోగుల్ని ఆంద్ర కు  పంపి తెలంగాణా ఉద్యోగులతో కాలిలను నింపాలి.
* 1985 లో వేసిన జై భరత్ రెడ్డి కమిటి ప్రకారం 1969 నుండి 1985 మధ్యలో 58 వేల మంది ఆంద్ర వాళ్ళు తెలంగాణా ఉద్యోగాల్లో అక్రమంగా చేరారని తేల్చింది. 
* 1985 లో 610 జి ఓ వచ్చింది, ఇది జి ఓ 36 కు పుత్రిక.
* నారా వారి హయంలో వేసిన గిర్ గ్లాని కమిటి అప్పటికే ఒక లక్ష యాభై వేల మంది ఆంద్ర ఉద్యోగులు తెలంగాణా లో అక్రమంగా చేరారని తేల్చింది.
* కేంద్రం 2008 లో ప్రణబ్ ముకర్జి కమిటి వేసింది.
* 2009 లో రాష్ట్ర ప్రభుత్వం రోశయ్య కమిటి వేసింది.
* 2009 డిసెంబర్ 9 న తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు చేస్తామని ప్రకటించింది కేంద్రం.
* ఆ తర్వాత సీమంద్రుల ఒత్తిడితో సంప్రదింపుల కమిటిని వేసింది.
* కేంద్రం శ్రీ కృష్ణ కమిటి వేసింది.
* కాంగ్రెస్ పార్టీ ఆజాద్ కమిటి వేసింది.