హోం

8, ఏప్రిల్ 2013, సోమవారం

ఈ బంద్ ఎవరి కోసం ..?

               
 గత నెలరోజులుగా జరుగుతున్న విద్యుత్ డ్రామాలో రేపు మరో ఘట్టం చోటుచేసుకోనుంది, ఏప్రిల్ 9 న కమూనిస్ట్ పార్టీలు బంద్ కు పిలుపునిచ్చాయి, దీనికి అన్ని ప్రతిపక్ష పార్టీలు మద్దతు ఇచ్చాయి, రేపు జరగబోయే బంద్ ను విజయవంతం చేయడానికి అన్ని పార్టీలు కృషిచేస్తున్నాయి, మరి ఈ బంద్  ఎవరి కోసం..? పేదల కోసమా, మధ్య తరగతి కోసమా..?
                పెంచిన విధ్యుత్ చార్జీలను తగ్గించాలని వామపక్షాలు ఉద్యమ బాట పట్టాయి, పేద, మధ్య తరగతి ప్రజలపై  నుండి విద్యుత్ భారాన్ని తొలగించాలని డిమాండ్ చేసారు. వామపక్షాల తర్వాత టి డి పీ, ఆ తర్వాత బిజెపి, చివరగా విజయమ్మలు దీక్షలకు దిగారు, అయితే ప్రతిపక్షాల ఎత్తులను చిత్తు చేస్తూ ప్రభుత్వం 200 యునిట్ల వినియోగం వరకు విద్యుత్ చార్జీల పెంపు కు మినహాయింపు ఇచ్చింది, ఐనా వామపక్షాలు సంతృప్తి చెందలేదు, పెంచిన మొత్తం చార్జీలు తగ్గించే వరకు ఉద్యమం ఆపమని తొమ్మిదవ తేది బంద్ కొనసాగుతుందని స్పష్టం చేసారు. నిజంగా ప్రతిపక్షాలు పేద మధ్యతరగతి ప్రజలకోసం పోరాడినట్లైతే బంద్ ను ఉపసంహరించుకొని ఉండాలి, ఎందుకంటే పేదలు, మధ్యతరగతి ప్రజల విద్యుత్ వినియోగం 200 ల యూనిట్లు దాటదు కాబట్టి, అయితే రేపటి బంద్ ఎవరికోసం చేస్తున్నారు అనేది ప్రశ్న..?
                      పేదలు, మధ్యతరగతి పై భారాన్ని తగ్గించిన తర్వాత కూడా ప్రతిపక్షాలు పోరాటంచేస్తున్నాయంటే అది కేవలం సంపన్నులు, పెట్టుబడిదారులకు మేలు చెయ్యడానికే అని స్పష్టం అవుతుంది, ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే చంద్ర బాబు, విజయమ్మ, కిషన్ రెడ్డి లు పెట్టుబడి దారులకు, సంపన్నులకు మద్దతు ఇస్తున్నారంటే అందులో అర్థం ఉంది, ఎందుకంటే వారు స్వయంగా పెట్టుబడిదారులు లేదా  పెట్టుబడి దారుల సానుభూతిపరులు, కాని వామపక్ష పార్టీలు ఎందుకు ఉద్యమిస్తున్నట్టు.? పేదల పక్షాన నిలబడి వారి సమస్యలపై పోరాడే పార్టీలు వామపక్ష పార్టీలు, కాని నేడు అవికూడా ఓట్లు, సీట్ల కోసం జిమ్మిక్కులు చేస్తున్నాయి, ఇలాంటి సమయంలో పార్టీ బలపడాలంటే ఆర్ధిక సహకారం అవసరం అనిపించిందేమో, అందుకే సంపన్నులను, పెట్టుబడి దారులను ఆకర్షించడంకోసం ఈ బంద్ ను కొనసాగిస్తున్నరేమో..?
                               అసలు విద్యుత్ సంక్షోబానికి కారణం ప్రభుత్వ రంగ కంపెని లకు ప్రోత్సాహం ఇవ్వకుండా, కేవలం ప్రవేట్ పెట్టుబడిదారులను ప్రోత్సహించడం వళ్ళ అతి ఎక్కువ డబ్బు చెల్లించి వారిదగ్గర విద్యుత్ కొనుక్కోవలసిన పరిస్థితి వచ్చింది, దీనికి కారణం గతంలో రాష్ట్రాన్ని పాలించిన చంద్రబాబు, రాజశేకర్ రెడ్డి. అయితే ప్రవేట్ ప్రాజెక్ట్ ల అనుమతులకు వ్యతిరేఖం గా పోరాడి ప్రభుత్వ రంగ సంస్థలను ప్రోత్సహించే విధంగా ప్రణాళిక ఇప్పటికి రూపొందించక పోవడం దురదృష్టకరం, రేపు ఎవరు అధికారంలోకి వచ్చిన విద్యుత్ కోతలు అనేవి సర్వసాధారణం అని అనుకొవచ్చు. 
                            చిన్న తరహ, కుటీర పరిశ్రమలు విద్యుత్ సమస్యతో ఉత్పత్తిలో తీవ్ర ఆటంకాలను ఎదుర్కొంటున్నాయి, వీరికోసం ఎ ఒక్క సంపన్నుడు, పెట్టుబడిదారుడు పోరాడలేదు, ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకురాలేదు, కాని నేడు వామపక్ష పార్టీల బంద్ ద్వార పేద మధ్యతరగతి ప్రజలు సంపన్నులు, పెట్టుబడి దారులకు విద్యుత్ చార్జీలు తగ్గించమని బంద్ పాటించాలి, ధనికులకోసం పోరాడాలి, ఇది మన ప్రతిపక్షాల తెలివి, మరి మీరు బంద్ కు మద్దతు ఇస్థారా..? ఇవ్వరా..?
                

5, ఏప్రిల్ 2013, శుక్రవారం

వాతలు.. కోతలు..

       
ప్రభుత్వం ప్రజలకు వాతలమీద వాతలు పెడుతూ గుండెల్లో రైళ్ళు పరిగేట్టేలా చేస్తుంది, మొన్నటికి మన్న రైల్ చార్జీలు విపరీతంగా పెంచింది కేంద్ర సర్కార్, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ0 వంతు వచ్చింది, భూముల రిజిస్త్రేషణ్ చార్జీలు పెంచి ప్రజల నుండి డబ్బులు పిండుకుంటున్న ప్రభుత్వం, విధ్యుత్ చార్జీలను పెంచుతూ సంచలన నిర్ణయం తీసుకుంది, విద్యుత్ శ్లాబులను 8 నుండి 10 కి పెంచుతూ చార్జీల మోతమోగించింది, ఎన్నికలకు మరో సంవత్సర కాలం ఉండగా ఇలా చార్జీలు పెంచడంపై స్వపక్షంలోనే విమర్శలు వచ్చాయి, మరో వైపు సర్ చార్జి పేరుతో సామాన్యుడి నడ్డివిరుస్తుంది, ఇంకో అడుగు ముందుకు వేసిన ప్రభుత్వం రైతులకు ఇచ్చే ఉచిత విద్యుత్ కు  కోతలు పెట్టింది, సంవత్సరంలో ఒకే పంటకు ఉచిత విద్యుత్ ఇస్తానంటూ ఉన్న పథకాన్ని అటకేక్కించే ప్రయత్నం చేస్తుంది,  ఒక వైపు కొండెక్కిన నిత్యావసరాలు, మరో వైపు పన్నుల మోతలు బడుగుల బతుకుల్లో గుదిబండలుగా మారయి.    
                        నేడు రాష్ట్రం విద్యుత్ సంక్షోభంలో చిక్కుకొని ఉంది డిమాండ్ కు సరిపడా సప్లయ్ లేకపోవడం వలన రాష్ట్రంలో విద్యుత్ కోతలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి, 2012-13 సంవత్సరంలో ఎండా కాలం లోనే కాకుండా వానాకాలం, చలి కాలంలో కూడా విద్యుత్ కోతలు విధించింది, అంతర్జాతీయ సదస్సు జరుగుతున్న సమయంలో కుడా రాజధాని నగరంలో విద్యుత్ కోతలు అమలు జరిగాయంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు, ఇంత తీవ్రమైన విద్యుత్ సంక్షోభానికి కారణం ఎమిటి..? ఎవరు..?
                    గత ప్రభుత్వాలకు ముందు చూపు లేకపోవడమే ప్రస్తుత పరిస్థితులకు కారణం, చంద్రబాబు హయాంలో అభివృద్ధి గణనీయంగా జరిగిందని, హైదరాబాద్ కు అంతర్జాతీయ కీర్తి కలిగిందని చెప్పుకుంటారు తెలుగు దేశం పార్టీ వాళ్ళు, కాని అభివృద్ధి చెందిన సమాజం యొక్క అవసరాలను తీర్చాల్సిన భాద్యత కూడా ప్రభుత్వానికి ఉంటుందని ఆయనకు గుర్తుకు రాలెదా..? 2020 వరకు ముఖ్యమంత్రి గా ఉండాలని కలలు  కన్నా చంద్ర బాబు మొత్తం రాష్ట్ర విద్యుత్ వ్యవస్థనే ప్రవేట్ పరం చెయ్యాలనే కుట్ర పన్నాడు, జెన్-కో ను నిర్వీర్యం చేసి ప్రవేట్ ప్రాజెక్ట్లకు ఇబ్బడి ముబ్బడిగా అనుమతులు కట్టబెట్టారు, విద్యుత్ కేటాయింపుల్లో అక్రమాలను తవ్వి తీస్తానని వాగ్ధానం చేసిన నాటి ప్రతిపక్ష నేత అధికారంలోకి రాగానే అవన్నీ మరచి పోయారు, ప్రవేట్ కంపని ల కేటాయింపులు మొత్తంగా కాంగ్రెస్ పార్టికి చెందిన నాయకులకే చెందడం గమనార్హం, ఉచిత విద్యుత్ బకాయిలు విద్యుత్ కంపెనీలకు చెల్లించడంలో ప్రభుత్వం చూపిన అలసత్వం కారణంగా విద్యుత్ కంపెనీలు నష్టాలపాలయ్యాయి, మొత్తంగా గత పాలకుల నిర్లక్ష్యం, ముందుచూపు కొరవడడం కారణంగా నేడు రాష్ట్రం తీవ్ర విద్యుత్ సంక్షోభాన్ని ఎదుర్కుంటుంది. భవిష్యత్ ప్రణాళికలు రుపొందించక పోవడం, ప్రభుత్వ ప్రాజెక్ట్ లకు అనుమతులు ఇవ్వకపోవడం వళ్ళ భవిష్యత్తు లో కూడా ఈ అంధకారం కొనసాగే అవకాశం కనబడుతుంది. 
                      సమైక్యంద్ర అంటూ భుజాన జాతీయ జెండా వేసుకొని తనను మించిన దేశ బక్తుడు లేడని బిల్డప్ ఇచ్చిన లగడపాటి కి చెందినా విద్యుత్ కంపని 12 రూపాయలకు యూనిట్ విద్యుత్ అమ్ముతుంది, మన ప్రభుత్వం ధర తగ్గించమంటే అతను తమిళ్ నాడు లేదా కర్ణాటక కు అమ్ముకుంటాడు, ఇందుకే నా సమైక్య రాష్ట్రం..? తెలంగాణా లోని అపార బొగ్గు నిక్షేపాలను సీమంద్ర ప్రాంతంలో ఉన్న విద్యుత్ కంపెనీలకు తరలించి అక్కడి రైతులకు అధిక విద్యుత్ ను కేటాయించి తెలంగాణా లో పంటలను ఎండబెడుతుంది. 
                  రాష్ట్రం లో బొగ్గు నీరు పుష్కలం గా దొరికే తెలంగాణా ప్రాంతంలో కాకుండా విజయవాడలో నార్ల తాతా రావు విద్యుత్ కేంద్రం పేరుతో జెన్-కో ప్రధాన కార్యాలయాన్ని తరలించుకు వెళ్లిన సీమంద్ర సర్కార్ తెలంగాణాలో బొగ్గు అదికం గా దొరికే సింగరేణి కాలరీస్ ప్రాంతాల్లో కాకుండా రాయలసీమ నెల్లూరు, విశాక పట్టణం లాంటి ప్రాంతాల్లో థర్మల్ విద్యుత్ కేంద్రాలను ఏర్పాటు చెయ్యడం ద్వారా నీటిని, బొగ్గు ను తరలించాల్సిన పర్తిస్థితి, దీనితో ఉత్పత్తి వ్యయం పెరగడం మూలంగా అధిక భారం ప్రజలపై, సబ్సిడీ రూపం లో ప్రభుత్వం పైనా పడుతుంది, తెలంగాణా ప్రాంతంలోని థర్మల్ విద్యుత్ కేంద్రాలు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందం గా ఉంటె సీమంద్రలో ఉన్న విద్యుత్ కేంద్రాల సామర్ధ్యాన్ని పెంచి ఉత్పత్తి కారకాల కొరత కారణంగా షట్ డౌన్ చేస్తున్నారు, నేడు జలవిధ్యుత్ ఉత్పత్తిని పెంచే అవకాశం లేదు, గ్యాస్ సరిపడా లేదు, అణు విద్యుత్ అంటే కమూనిస్ట్ లు ఒంటి కాలుపై లేస్తారు, ఇక మిగిలిన థర్మల్ విద్యుత్ ఒక్కటే మార్గం సక్రమం గా బొగ్గును ఉపయోగించుకొని లాభ సాటిగా ఉండే ప్రాంతాల్లో పెట్టుబడులు, అది ప్రభుత్వ రంగంలో పెడితే తప్ప భవిష్యత్తులో విద్యుత్ సంక్షోభం నుండి రాష్ట్రం బయట పడదు. 
               నేడు రాజకీయ పార్టిలన్ని విద్యుత్ కొరకు ధిక్షలకు దిగుతున్నాయి, వాస్తవానికి తిలా పాపం తలా కొంత అన్నట్టు ఈ రోజు ఆందోళన చేస్తున్న వారంతా ఏదో ఒక రకంగా ఈ నాటి ఈ సంక్షోభానికి కారకులే, కమూనిస్ట్ పార్టీ లు కూడా ఈ మధ్య రాజకీయాల్లో ఆరితేరాయి, ప్రజా సమస్యలను గాలికి వదిలి తమ ఓట్లు సీట్లు పెంచుకోవడానికి డ్రామాలు చేస్తున్నాయి, కమూనిస్ట్ ల నిరాహార దిక్షకు బి జె పీ నాయకులూ వచ్చి మద్దతు తెలపడం, విజయమ్మ రాగానే నారాయణ, రాఘవులు లేచి అభివాదాలు తెలపడం, మూడు రోజుల దిక్ష అనంతరం హాస్పిటల్ లో నిమ్మరసం తాగడం, సీన్ కట్ చేస్తే బి జె పీ నాయకులూ, విజయమ్మ, చంద్ర బాబు లు క0తులవారిగా దిక్షలు చేసి ప్రభుత్వాన్ని ఉతికి ఆరేసిన వీరి డ్రామాలు తెలిసిన ప్రజలు మాత్రం ఈ నాటకాన్ని ఆసక్తిగా విక్షిస్తున్నారే కాని ప్రతిస్పందించడం లేదు, ఈ నాయకుల్లో ఎవరూ నన్ను గెలిపిస్తే వచ్చే ఏడునుండి విద్యుత్ కోతలు ఉండవు అన్న హామీ మాత్రం ఇవ్వడం లేదు, అంటే భవిష్యత్తులో కూడా సీజన్ తో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రజలు ఈ కోతలు భరించాల్సిందే... 

                            

3, ఏప్రిల్ 2013, బుధవారం

రంగారెడ్డి జిల్లాలో ద్రాక్ష రైతు దిగాలు..



 రాష్ట్రంలో ద్రాక్ష పళ్ళ ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న రంగారెడ్డి జిల్లాలో నేడు ద్రాక్షతోటలు కనుమరుగవుతున్నాయి, కీసర మండలంలో గతంలో ఒక వెలుగు వెలిగిన ద్రాక్షతోటలు నేడు ఒక్కసారిగా కంటికి కనబడకుండా పోతున్నాయి. రైతన్నలు వేల ఎకరాల్లో సాగుబడిచేసిన ద్రాక్షతోటలు నేడు పదుల స్థానాల్లోకి విచ్చేశాయి. నియోజకవర్గంలోనే మండలం ద్రాక్షతోటలకు ప్రధాన నిలయంగా ఉండేది. మండలంలోని కుందన్‌పల్లి గ్రామంలో ద్రాక్షతోటలను సాగుబడి చేసిన ఇక్కడి రైతులు రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో సంచరించి రైతులకు అవగాహన సదస్సులను ఏర్పాటు చేశారు. రానురాను ద్రాక్షతోటలు మండలంలో కనుమరుగవడానికి రైతులకు ప్రభుత్వం నుంచి తగిన ప్రోత్సాహం అందకపోవడంతో పాటు కూలీల రేట్లు, మందుల రేట్లు విపరీతంగా పెరగడంతో ద్రాక్ష రైతులు ఈ తోటల మీద అసక్తి రోజురోజుకు సన్నగిల్లుతుంది. ద్రాక్షతోటలు సాగుబడిచేసిన రైతులు ఆ పంటలను కంటికి రెప్పలాగా కాపాడుకోవాల్సి ఉంటుంది. ఈ తోటల విషయంలో ఏమైన ఆశ్రద్ధ వహిస్తే తగిన నష్టం వాటిల్లక తప్పదు. నియోజకవర్గంలోని నాలుగు మండలాల కంటే కీసర మండలమే ద్రాక్షతోటలకు ప్రధాన వేధికగా ఉండేది. పలు ప్రాంతాల నుంచి పలువురు రైతులు మండలానికి విచ్చేసి రైతులు సాగుబడిచేసిన ద్రాక్ష తోటలను పరిశీలించి ఇక్కడి రైతుల నుంచి పలు సూచలను తీసుకొని వేరే ప్రాంతాల్లో సాగుబడి చేసుకోనేవారు. రానురాను గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి ఇక్కడి రైతులు ఉన్న ద్రాక్షతోటలను తీసివేసి దానిస్థానంలో పందిరి కూరగాయలను సాగుబడి చేసే పంటల మీద అసక్తిని చూపిస్తున్నారు. 

రోజురోజుకు తరిగిపోతున్న ద్రాక్ష తోటల దిగుబడి:
ఈ సంవత్సరం మండలంలో ద్రాక్ష తోటల దిగుబడి ఒక్కసారిగా పడిపోయింది. మండలంలోని పలు గ్రామాల్లో సాగుబడే చేసే రైతుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. గోధుమకుంటలో వంగేటి మల్లాడ్డి 7 ఎకరాలు, కుందన్‌పల్లి గ్రామంలో చిత్తార్ల వెంక 15 ఎకరాల్లో, కీసర మండల కేంద్రంలో 10 ఎకరాలు, చీర్యాల్ గ్రామంలో 10 ఎకరాలు, కరీంగూడ గ్రామంలో 8 ఎకరాలు, తిమ్మాయిపల్లి గ్రామంలో ద్రాక్షతోటలను సాగుబడి చేస్తున్నారు. గతంలో వేల ఎకరాల్లో ఉన్న ఈ తోటలు పడిపోవడానికి అనేక సమస్యలు ఉన్నాయి. ఒక ఎకరాలో ద్రాక్షతోటలను సాగుబడి చేయాలంటే రైతులకు కనీసం రూ.60 వేల నుంచి రూ.70 వేల రూపాయల ఖర్చు అవుతుంది. రైతులకు తలకుమించిన భారంగా ఖర్చులు ఎక్కువ కావడంతో ఈ తోటల నుంచి చాల మంది రైతులు తప్పుకున్నారు.        
         గత సంవత్సరం 28 గ్రోమార్ రూ.250 ఉంటే నేడు రూ.1250, డీఏపీ గత సంవత్సరం రూ.350 ఉంటే నేడు రూ.1500, ఎస్‌ఓపీ పోటాష్ గత సంవత్సరం రూ.500 ఉంటే నేడు రూ.1750 ధరలు రైతుల మీద తీవ్రంగా మోపడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. వీటితో పాటు స్ప్రే మందుల ధరలు కూడ విపరీతంగా పెరిగాయని పలు గ్రామాలకు చెందిన రైతులు దిగాలు పడుతున్నారు. దీంతో వేల ఎకరాల నుంచి వందల ఎకరాల వరకు సాగుబడులు ఒక్కసారిగా పడిపోయాయని పలువురు రైతులే పేర్కొంటున్నారు. కూలీల కొరతతో పాటు భూగర్భజలాలు ఒక్కసారిగా అడిగంటిపోవడంతో రైతుల పరిస్థితుల రోజురోజుకు ఆగమ్యగోచరంగా మారిపోయాయి.
గతంలో ఆకాల వర్షాల కారణంగా చేతికొచ్చిన ద్రాక్షతోటలు కూడా నీటిమునిగిపోవడంతో ద్రాక్షరైతులు ఒక్కసారిగా భయపడిపోతున్నారు. ప్రకృతి వైపరీత్యాల కారణంగా చాల తోటలు మట్టిపాలు కావడంతో సంవత్సరం వరకు కంటికిప్పలా కాపాడి ఒక్కసారిగా చేతికొచ్చిన పంట కళ్ళ  ముందే ధ్వంసం కావడంతో రైతులు ఒక్కసారిగా దిగాలు పడ్డారు. అప్పట్లో ప్రభుత్వం కూడా ప్రకృతి వైపరీత్యాల్లో దెబ్బతిన్న రైతాంగానికి ప్రభుత్వం తగిన రీతిలో నష్టపరిహారం ఇవ్వకపోవడంతో రైతులు పడ్డ అవస్థలు వర్ణానుతీతంగా ఉన్నాయి. 
బ్యాంకుల్లో పేరుకుపోయిన అప్పులు:
ద్రాక్షతోటలను సాగుబడిచేసిన రైతన్నలకు ప్రతి సంవత్సరం బ్యాంకుల అప్పులు కట్టకపోవడంతో ప్రతి సంవత్సరం బ్యాంకు రుణాలు కాస్తా తడిసి తడిసి మోపడు కావడంతో రైతుల పరిస్థితులు రోజురోజుకు దుర్భరంగా మారిపోతున్నాయి. ద్రాక్షతోటలంటే భయపడే స్థితిలో రైతులు ఉన్నారు. ద్రాక్షతోటలను సాగుబడిచేసిన చాలమంది రైతులు బ్యాంకుల్లో తీసుకున్న రుణాలను సకాలంలో కట్టక ఉన్న భూములను తక్కువకు అమ్ముకొని బ్యాంక్ రుణాలను కట్టిన దుస్థితి మండలంలోని పలు గ్రామాల్లో నెలకొంది.                                                                            -నమస్తే తెలంగాణా నుండి.. 

26, మార్చి 2013, మంగళవారం

25, మార్చి 2013, సోమవారం

వానా కాలపు వినోదం ..


                     మరో నాటకానికి తెరలేస్తుంది, ఇందిరా గాంధీ మార్గంలో సోనియా గాంధీ పయనించడానికి సిద్దం అవుతుంది, మరో సారి తెలంగాణా ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణచివేయడానికి నయవంచన అనే పాత ఫార్ములానే వాడబోతుంది, గతంలో మర్రి చెన్నారెడ్డి పావులా మారితే ఇప్పుడు జైపాల్ రెడ్డి పావులా మారబోతున్నాడు.
                    తెలంగాణా ఉద్యమం పతాక స్థాయిలో లేవడానికి, లేచిన ఉద్యమాన్ని అదుపులో పెట్టడానికి కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న నాటకం ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు, జగన్ ను అదుపులో పెట్టాలని తెలంగాణా కు అనుకూల వాతావరణం సృష్టించడం, కె సి అర్ కు ఇమేజ్ పోతుందని జె ఎ సి బలపడేలా చెయ్యడం కాంగ్రెస్ కనుసన్నల్లో జరుగుతున్న పరిణామాలను నిశితం గా గమనిస్తే తనకు లాభం కలగక పోయిన పరవాలేదు, కాని పక్కవాడు బాగుపడకూడదు అనేది కాంగ్రెస్ పాలసీ, కోదండ రామ్ ను ఇతర జె ఎ సి సభ్యులను అరెస్ట్ చేసి బెయిల్ ఇవ్వకుండా రెండు రోజుల పాటు జైలు లో పెట్టి సడక్ బంద్ క్రెడిట్ కె సి అర్ కు వెళ్ళకుండా కట్టడి చేసింది కేంద్రం, జె ఎ సి బలపడుతుండడం కూడా కాంగ్రెస్ కు మింగుడుపడక ఇప్పుడు కొత్త డ్రామాకు తెర తీచింది.
                  ఇన్ని రోజులు హాయిగా పదవులు అనుభవించిన జైపాల్ రెడ్డి , జానా రెడ్డి లు కొత్త వేదికను ఎర్పరుస్థారట ..? ఇది ఇతర ఉద్యమ పార్టీలను జె ఎ సి ను కాతరు చెయ్యకుండా స్వతంత్ర నిర్ణయాలతో ఉద్యమాన్ని వేడెక్కిస్తారట..? అయితే జైపాల్ రెడ్డి ఇప్పుడే రాజీనామా చెయ్యడట అది మార్చ్ చివరివారంలో చేస్తారట..? ఎందుకో తెలుసా... సార్వత్రిక ఎన్నికల సమయం సంవత్సరం కన్నా తక్కువగా ఉంటె అప్పుడు రాజీనామా చేసినా ఉప ఎన్నికలు రావు, ఆ స్థానాలకు కూడా సార్వత్రిక ఎన్నికలతో పాటే ఓటింగ్ నిర్వహిస్తారు, కావున జైపాల్ రెడ్డి వానాకాలం లో రాజీనామా చేసి కొత్త పార్టీ ప్రకటించగానే కాంగ్రెస్ వారి డ్రామాలు మొదలవుతాయి, ఒక్కొక్కరుగా మన కాంగ్రెస్ ఎం పీ లు, ఎం ఎల్ ఎ లు అంత క్యు కట్టి మరి రాజీనామా చేస్తారు, ఆమోదించమని స్పీకర్ పై ఒత్తిడి తెస్తారు, రాజీనామా ఆమోదించినా ఉపఎన్నికలు రావు, ప్రభుత్వము పడిపోదు, ఎందుకంటే ఆపద్ధర్మ ప్రభుత్వంగా సార్వత్రిక ఎన్నికల వరకు ఈ ప్రభుత్వమే ఉంటుంది కాబట్టి.
                         ఇక ఉద్యమాన్ని అణచివేయ్యాలంటే జైళ్ళు నింపితే కుదరదని వంద సంవత్సరాల చరిత్ర కలిగిన కుటిల కాంగ్రెస్ కు తెలుసు, ఉద్యమాన్ని అణచాలంటే ఉద్యమ కారులు జై తెలంగాణా అంటే ద్రోహులు జై జై తెలంగాణా అంటారు, ఉద్యమాన్ని వాళ్ళ చేతుల్లోకి తీసుకుంటారు, వారి ప్రయోజనం పూర్తికాగానే ఉద్యమాన్ని గాలికి వదిలి వెళ్ళిపోతారు, ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు ఇదే విధానాన్ని ఫాలో కావాలనుకుంటున్నారు, గతం నేర్పిన పాటలను మరో సారి సోనియా నిర్దేశనంలో జైపాల్ నాయకత్వాన  నయవంచనకు ఊపిర్లుదనున్నారు. ఇప్పటికి ఇంకా ఎం నిర్ణయం తీసుకోలేదని చెప్పిన, మీడియా సృష్టి అని ఖండించిన వానాకాలం లో  మరో వినోదం చోటుచేసుకోవడం ఖాయం, నూతన వేదిక రావడం అనివార్యం, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం, రాహుల్ గాంధీ ప్రధాని పీటం ఎక్కడానికి మన నాయకులు చేస్తున్న ఆత్మవంచన క్రతువు, కావున తస్మాత్ జాగ్రత్త ..!

                                          

23, మార్చి 2013, శనివారం

రగులుతున్నది తెలంగానము..


సహకార ఎన్నికలలో గెలిచినా సంబరం ఎంతో కాలం నిలవలేదు, నాలుగు రోజులకే వచ్చిన ఎం ఎల్ సి ఎన్నికలలో స్వామి గౌడ్ ని, పాతూరి సుధాకర్ రెడ్డి ని గెలిపించుకుంటాం అని ప్రకటించి, భారి మెజారిటీ తో టి అర్ ఎస్ ఆ స్థానాలను గెలుచుకోవడం సి ఎం కిరణ్ కు నచ్చడం లేదు, ఎలాగైనా టి అర్ ఎస్ హవా తెలంగాణాలో తగ్గిపోయిందని తన సంక్షేమ పతకాలవైపే ప్రజలున్నారని నిరూపించుకోవాలనుకుంటున్న సి ఎం కు సహకార ఎన్నికలు వరంగా వచ్చాయి, 2009 తర్వాత ఇప్పటివరకు స్థానిక సంస్థల ఎన్నికలు జరగకపోవడంతో ఈ ఎన్నికలకు ఎప్పుడు లేని ప్రాధాన్యం లభించింది, ఈ ఎన్నికలలో ఎప్పటినుండో పదవి కోసం ఎదురుచూస్తున్న మాజీ నాయకులంతా పోటిపడి డబ్బు విపరీతంగా పంచారు, ఒక్కో స్థానంలో ఇద్దరు ముగ్గురు అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీ కి చెందిన వారే ఉండడం విశేషం, మొత్తానికి కాంగ్రెస్ గుర్తు లేకుండా ఉన్న ఎన్నికలలో కాంగ్రెస్ గెలిచింది, సి ఎం తన సత్తా చాటాడని, గ్రామ స్థాయిలో పట్టు సాధించాడని అనుకుంటున్న సమయంలో ఎం ఎల్ సి ఎన్నికలలో టి అర్ ఎస్ విజయ భావుటా ఎగరవేయ్యడం సి ఎం కు మింగుడుపడలేదు. 
                                  అంతే కాకుండా ప్రధాన ప్రతిపక్షం అవిశ్వాస తీర్మానం పెట్టబోమని చెప్పిన తర్వాత ఊపిరి పీల్చుకున్న కిరణ్, టి అర్ ఎస్ పార్టీ అవిశ్వాస తీర్మానం నోటీసు ఇవ్వడం, అన్ని పార్టీలను కలుపుకొని చర్చకు తేవడం కూడా ఆయనకు టి అర్ ఎస్ పై ఆగ్రహాన్ని తెప్పించాయి, అవిశ్వాస తీర్మాన చర్చ సమయంలో కిరణ్ హరీష్ రావు పై తీవ్రంగా విరుచుకుపడ్డారు, ఒకానొక సందర్భంలో తెలంగాణా కు ఒక్కపైసా కూడా ఇవ్వనని పొగరుగా మాట్లాడాడు, అంతె కాకుండా నేను ఇక్కడే పుట్టాను అంటూనే మా చిత్తూరు అంటూ తన సంకుంచిత మనస్తత్వాన్ని బయట పెట్టుకున్నారు, తెలంగాణా కు ఒక్క రూపాయి కూడా ఇవ్వను అనడం పట్ల తెలంగాణా వాదులు తీవ్ర ఆగ్రహం చెందారు, మేమేమి మీ బాబుగాడి సొమ్ము అడుగుతున్నామ మా ప్రాంతం నుండే 70% ఆదాయం వస్తుంది, మాది మాకు ఇవ్వడానికి ని అభ్యంతరం ఏమిటి అని కొంతమంది సభ్యులు సి ఎం ని నిలదీసారు, సి ఎం పూర్తిగా తెలంగాణా వ్యతిరేఖి అని తెలంగాణావాదులు మండి పడుతున్న సమయంలో సి ఎం మరోసారి తన సీమంద్ర బుద్ది ని బయటపెట్టుకున్నాడు, గతం లో విద్యార్థులపై కేసులు పెట్టి నెలలపాటు జైలు లో పెట్టిన ప్రభుత్వం ఇప్పుడు ఉద్యమ నాయకత్వాన్ని దెబ్బతీయాలని భావిస్తుంది. 
                                     మార్చ్ 21 న కర్నూల్-బెంగుళూర్ జాతీయ రహదారిని దిగ్బందించాలని జె ఎ సి పిలుపునిచ్చింది, అయితే దీనికి ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు, పైగా ఉద్యమాన్ని పోలీస్ బలగాలతో అణచివేయ్యలని భావించారు, సడక్ బంద్ కు వారం ముందు నుండే పాలమూరు నాయకులను బై0డోవర్ చెయ్యడం ప్రారంభించారు, చివరికి ఉద్యమ నాయకులను, ఎం ఎల్ ఎ లను కూడా అరెస్ట్ చేసి నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారు పోలీసులు, అయితే మధ్యానం అరెస్ట్ ఐన నాయకులను సాధారణం గా సాయంత్రం వదిలి పెట్టడం సాధారణమే, ఇప్పుడు కూడా అంతే  అనుకున్నారు పోలీసులు కాని హైదరాబాద్ నుండి వచ్చిన ఫోన్ తో పోలీస్ లు నాయకులపై కేసులు పెట్టి కోర్ట్ కు తరలించారు, అయితే ఈ ఫోన్ సి ఎం నుండి వచ్చిందా..? లేదా అనేది తెలియరాలేదు, ప్రొ. కోదండ రామ్, టి జి ఓ నాయకుడు శ్రీనివాస్ గౌడ్, ఎం ఎల్ ఎ లు ఈటెల రాజేందర్, జూపల్లి కృష్ణారావు లకు కోర్ట్ 14 రోజుల రిమాండ్ విధించింది, అరెస్ట్ ల ద్వారా ఉద్యమాన్ని అణచివెయ్యలని, ఉద్యమ నాయకులు ప్రభుత్వ ఉద్యోగులు కావడంతో వారిని ఇబ్బందులకు గురిచేయ్యడం ద్వారా దెబ్బకొట్టాలని కిరణ్ చూస్తున్నాడు. 
                            ఉద్యమ నాయకుల అరెస్ట్ తో తెలంగాణా రగిలి పోతుంది, చట్టం తన పని తాను చేసుకు పోతుంది అంటూ సబిత అసెంబ్లీ లో ఇచ్చిన వివరణ కు ప్రతిపక్షాలు సంతృప్తి చెందలేదు, ఉద్యమ నాయకులపై పెట్టిన కెసులు ఎత్తివేసి వెంటనే విడుదల చెయ్యాలని వారు డిమాండ్ చేసారు, కోదండ రామ్, శ్రీనివాస్ గౌడ్ లు ప్రభుత్వ ఉద్యోగులు కావడం వళ్ళ వారు 48 గంటలు ఎ కారణం చేతను జైలు లో ఉండరాదు, అల ఉన్నట్లయితే వారిని సస్పెండ్ చేస్తారు, కావున ఇలా కూడా వారిని ఇబ్బందుల పాలు చెయ్యాలని ప్రభుత్వం బావిస్తుంది. 
                          ఆంద్ర అనుకూల సర్కార్ జె ఎ సి నాయకులను ఇబ్బందుల పాలు చేసి తెలంగాణా ప్రజలను భయబ్రాంతులకు గురిచేసి భవిష్యత్తులో జె ఎ సి తలపెట్టిన విజయవాడ రహదారి దిగ్బందాన్ని అడ్డుకోవాలని చూస్తుంది, కాని ప్రభుత్వం ఎంత నిర్భందాన్ని విధిస్తే అంత తీవ్రంగా ఉద్యమం ఎగసిపడుతుందనే విషయం ఈ ప్రజా కంటక సర్కారుకు తెలియకపోవచ్చు, ఇప్పుడు ఎంతగా ఉద్యమ నాయకత్వాన్ని వేధిస్తే తెలంగాణా ప్రజలతో ఈ సర్కారుకు దూరం కూడా అంతగా పెరుగుతూ పోతుంది, విజయవాడ రహదారి దిగ్బండం రోజున వచ్చే జన సునామి లో కిరణ్ సర్కార్ కొట్టుకుపోతుంది... 

21, మార్చి 2013, గురువారం

తెలంగాణా పూర్ణకుంభం..


పూర్ణ కుంభం: సుసంపన్నత కు, సౌభాగ్యానికి దివ్యమైన ప్రతీక.పూర్ణకుంభ స్వాగతం అంటేనే పరిపూర్ణ వైభవానికి ప్రతీక, హైందవ ఆచారం ప్రకారం ప్రతి దేవతారధన కలశ పూజ తోనే మొదలవుతుంది, కలశం అన్నా పూర్ణ కుంభమే, ఇది ప్రధానంగా బౌద్ధమత ఆచారంగా చెప్తారు, ఇందుకు నిట్టనిలువు నిదర్శనం తెలంగాణాలో ప్రసిద్ధమైన బౌద్ధ భూమి నాగార్జున కొండలో శతాబ్దాల కిందటే తొట్టతొలుత వెలుగుచూసిన ప్రతిమాత్మక పూర్ణ కుంభాన్ని పేర్కొంటారు. 
              అపురూపమైన బౌద్ధ పూర్ణ కుంభం తో పాటు అలనాటి శిల్ప కళాకండాలను నాగార్జున కొండలో మనం చూస్తాం, ప్రసన్నవదనం తో నిల్చున్న బుద్ధ విగ్రహం, భోధి వృక్షం కింద ధ్యాన ముద్రలో ఉన్న బుద్ధ భగవానుని దృశ్య ప్రతిమల్ని దర్శించడం ఒక దివ్యానుభవం.

                                    ఇంతకి ఈ పూర్ణ కుంభ ప్రశస్తి ఏమిటి ? గుండ్రని ఇత్తడి లేదా రాగి చెంబుని సాధారణంగా కలశంగా వాడుతారు, ఇందులో నిల్లు కాని బియ్యం లేదా గోధుమలు వంటి ధాన్యాలను పోసి, పైన ఒక కొబ్బరికాయను తమలపాకులపై కుర్చోబెడతారు, గంధం, పసుపు, కుంకుమ, కంకనాలతో కలశాన్ని అలంకరిస్తారు, కలశానికి జీవనదుల సాక్షిగా పూజలు చేస్తారు, ఇందులోని జాలం లేదా ధాన్యం శుద్ధ శక్తి కలవిగా భావిస్తారు. 
      రాష్ట్ర చిహ్నంగా ఉన్న పూర్ణకుంభం గుంటూరు జిల్లాలోని అమరావతి నుండి తీసుకున్నట్లుగా ఆంద్ర వాళ్ళు చెప్పుకుంటున్నారు, కాని అమరావతి కంటే పూర్వకాలానికి చెందిన పూర్ణ కుంభం మన తెలంగాణా లోనే కొలువై ఉంది.