హోం

11, ఫిబ్రవరి 2013, సోమవారం

హిందీ గడ్డపై తెలంగాణా బిడ్డ..



శ్యామ్ బెనగళ్ ప్రముఖ భారతీయ సినీదర్శకుడు, చిత్ర రచయిత. చాలా దూరదర్శన్ సీరియల్ లకు కూడా దర్శకత్వం వహించారు. అనేక అవార్డులు పొందారు. తను తీసిన నాలుగు సినిమాలు - అంకుర్ (1973), నిషాంత్ (1975), మంతన్ (1976) మరియు భూమిక (1977) తో భారతీయ సినీ రంగంలో మధ్యేవాద సినిమా (మిడిల్ సినిమా) అనే కొత్త ఒరవడిని, వర్గాన్ని సృష్టించాడు. ఈయన చేసిన కృషికి కాను భారత ప్రభుత్వం 1976లో పద్మశ్రీ పురస్కారాన్ని, 1991లో పద్మ భూషణ్ పురస్కారాన్ని ఇచ్చి సత్కరించింది. 2007, ఆగష్టు 8 న భారతీయ చలనచిత్ర రంగంలో అత్యంత ప్రముఖమైన దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని 2005 సంవత్సరానికి గాను అందుకున్నాడు. భారత జాతీయ సినిమా అవార్డులలో శ్యాం బెనగళ్ ఏడు సార్లు హిందీలో అత్యుత్తమ సినిమా అవార్డును అందుకున్నాడు.
ఆయన  1934 డిసెంబరు 14న అల్వాల్‌, హైదరాబాదులో జన్మించారు, శ్యామ్ బెనగళ్, ప్రఖ్యాత హిందీ నటుడు, దర్శకుడు గురు దత్‌ దూరపు బంధువు. ఈయన బాల్యం విధ్యాబ్యాసం పూర్తిగా తెలంగాణా లోనే జరిగాయి, ఎం. ఎ . ఎకానమిక్స్ నిజాం కళాశాల నుండి అందుకున్నారు. భార్య నీర బెనగల్, ఒక కూతురు పియా.ప్రఖ్యాత హిందీ నటుడు, దర్శకుడుగురు దత్‌ దూరపు బంధువు.
                              1959 మొదలైన ఆయన సినిమా ప్రస్థానంలో మొదట ఆయన కాపీ రైటర్ గా చేరారు, 1962 లో ఆయన గుజరతిలో తొలి డాక్యుమెంటరి "Gher Betha Ganga" ని తీసారు, ఆయన మొదట ప్రచార సినిమాలను తీసారు, ఆ సమయంలో 900 ల వాణిజ్య ప్రచార చిత్రాలను( ADVERTISEMENTS) తీసారు.
                                               ఆయన అనేక జాతీయ అంతర్జాతీయ పురస్కారాలను అందుకున్నారు, ఆ తర్వాత ఆయన ముంబై వెళ్లారు, ఆయన దర్శకత్వం వహించిన మొదటి చిత్రం": ankur ", ఈ చిత్రంలో ఆయన తెలంగాణాలోని ఆడవారిపై జరుగుతున్న ఆకృత్యాలను తెరపై చిత్రించారు, ఆయన పుట్టి పెరిగింది ఇక్కడే కావున ఆయన చిత్రాలలో తెలంగాణా జీవనచిత్రం ప్రతిబింబిస్తుంది, ఈ చిత్రానికి జాతీయ 2 జాతీయ అవార్డు లు లబించాయి. ఆ తర్వాత 1975 లో nishanth చిత్రాన్ని తీసారు, ఇది పూర్తిగా తెలంగాణా నేపధ్యంలో జరిగే చిత్రం, భూస్వామి గ్రామాన్ని పట్టి పీడిస్తుంటే ప్రజలు తిరగబడి ఎలా విముక్తి పొందారనేది చిత్ర కథ, ఈ చిత్రం హిందీ పరిశ్రమలో ఒక సంచలనం సృష్టించింది, తెలంగాణా నేపధ్యం తెలుగు చలన చిత్ర పరిశ్రమకు ముడి సరుకు కాలేకపోయినప్పటికీ, శ్యాం బెనగల్ దయ వలన జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది, Manthan (1976) and Bhumika (1977) ఆయన తర్వాతి చిత్రాలు.

                     1970 లలో ఆయన బాలల చిత్రాలను రూపొందించి ఇచ్చారు, అలాగే డైరీ డేవలోప్మెంట్ వారికి కూడా ప్రచార చిత్రాలను రూపొందించారు, ఆయన అనేక ప్రభుత్వ లగు చిత్రాలను తయారు చేసారు.1985 మాస్కో అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలకు జ్యూరి మెంబర్ గా వ్యవహరించారు, ఆయన జాతీయ సినిమా అభివ్రుది సంస్థ NFDCకి కూడా డైరెక్టర్ గా భాధ్యతలు నిర్వహించారు, 1988 లో జవహర్ లాల్ నెహ్రు రచించిన   DISCOVERYOFINDIA పుస్తకాన్ని TV ధారావాహికగా మలచారు.
                          ఆయన చిత్రాలు Satyajit Ray, in 1985, Sardari Begum (1996), Mammo (1995), Sardari Begum (1996), Zubeidaa (2001), 1992- Suraj Ka Satvan Ghoda (Seventh Horse of the Sun) ఈ చిత్రానికి ఉత్తమ చిత్రంగా జాతీయ పురస్కారం లభించింది, ఈయన సుభాస్ చంద్రబోస్ జీవిత చరిత్ర ఆధారంగా తీసిన చిత్రం Netaji Subhas Chandra Bose: The Forgotten Hero(2005),2008-Welcome to Sajjanpur, 2010- Well Done Abba., ఆయన ప్రస్తుతం  World War II చిత్రానికి పనిచేస్తున్నారు.
 ఈయన ప్రస్తుతం  Federation of Film Societies of India.అధ్యక్షునిగా కొనసాగుతున్నారు. ఆయన చిత్రాల్లోని తెలంగాణా నేపద్యాన్ని గురించి   TIMES OF INDIA లో కథనాలు కూడా వచ్చాయి.

                                తెలంగాణా గడ్డపై పుట్టిన ఆయన నేడు భారత దేశం గర్వించ దగ్గ దర్శకుడిగా ఎదిగారు, ఎంతటి స్థాయికి ఎదిగినా  జన్మించిన గడ్డ పై  ఆయనకు ఎనలేని అనురాగం, అందుకే ఆయన ప్రతి చిత్రంలోనూ తెలంగాణా నేపధ్యం కనిపిస్తుంది, ఆయన తెలంగాణా లో పుట్టినందుకు మనందరం గర్వించాలి..

2013 సంవత్సరానికి గాను అక్కినేని పురస్కారం అందుకున్నారు....
      
       

10, ఫిబ్రవరి 2013, ఆదివారం

తెలంగాణ రాష్ట్ర చిహ్నం


తెలంగాణ రాష్ట్రం ఏర్పడంగనే మన రాష్ట్ర అధికారిక చిహ్నం ఎలా ఉంటుందన్న కుతూహలం ఎవరికైనా సహజం. అయితే, అధికారిక చిహ్నాల గురించిన తమ అభీష్టాన్ని యువత ఫేస్‌బుక్ వంటి సోషల్ నెట్‌వర్క్‌లో నిక్షిప్తం చేస్తూనే ఉన్నరు. ఇప్పటిదాకా ఉన్న చిహ్నాలేమిటో చూద్దాం. మనవి ఎలా ఉండాలని వారు కోరుకుంటున్నారో కూడా గమనిద్దాం... 
పూర్వరంగం:
భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చేనాటికి తెలంగాణ ప్రాంతం పూర్తిగా నిజాం నవాబుల పాలనలో ఉండేది. అయితే, నిజాం హైదరాబాద్ రాష్ట్రాన్ని భారత యూనియన్‌లో విలీనం కావడానికి ఒప్పుకోలేదు. దాంతో వల్లభాయ్ పటేల్ నేతృత్వంలోని భారత సైన్యం ‘ఆపరేషన్ పోలో’ పేరుతో సైనిక చర్య జరిపి, హైదరాబాద్ రాష్ట్రాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకుంది. తర్వాత రాష్ట్రాల పునర్విభజన పేరుతోనూ, భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటులో భాగంగానూ అప్పటి వరకూ ప్రత్యేక రాష్ట్రంగా ఉన్న హైదరాబాద్ రాష్ట్రాన్ని ఆంధ్రపాంతంతో కలుపుతూ 1 నవంబర్ 1956న ‘ఆంధ్రప్రదేశ్’ ఏర్పాటుచేశారు. అయితే 1948-56 దాకా హైదరాబాద్ రాజధానిగా తెలంగాణ స్వతంత్ర రాష్ట్రంగానే ఉండింది. సమైక్య రాష్ట్రం అన్న భావన మన ప్రజానీకానికి ఇష్టం లేకుండేది. తీవ్రంగా ప్రతిఘటించినప్పటికీ నాటి ప్రభుత్వం అణచివేత ధోరణినే ప్రదర్శించింది. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. దాంతో అధికారిక చిహ్నాలూ ప్రత్యేకంగా ఏర్పాటయ్యాయి. ఇప్పుడు ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటే మన ఏకైక లక్ష్యం అయినందున, ఇప్పట్నుంచే మన సొంత ముద్రలకోసం అనేక ప్రతిపాదనలు, ఆలోచనలు సాగుతూనే ఉన్నయ్. 
తెలంగాణ రాష్ట్రం
మనవి:

ఆంధ్రప్రదేశ్ ముద్రను పోలినట్లే వృత్తం ఉండి ఇంగ్లిష్‌లో ‘గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ’ అని ఉర్దూ, హిందీతో పాటు మధ్యలో తెలుగులో ‘తెలంగాణ’ అని ఉండేలా రూపొందించారు. ఇక పూర్ణకుంభం స్థానంలో ‘కాకతీయ కళాతోరణం’, కిందివైపు ‘మూడుసింహాల అశోక చక్రం’ కనిపిస్తుంది. మరికొంతమంది ఔత్సాహికులు కాకతీయ తోరణం స్థానంలో చార్మినార్‌ను కూడా ఉంచారు.తెలంగాణ అధికార ముద్రగా కాకతీయ తోరణం లేదా చార్మినార్‌తో కూడిన ఎంబ్లం, మన మాతృ గీతంగా 1944-45 మధ్యకాలంలో రావెళ్ల వెంకటరామరావు రాసిన ‘కదనాన శత్రువుల కుత్తుకుల నవలీల’ అన్న గేయం అలాగే అందె శ్రీ  రాసిన ‘జయజయహే తెలంగాణ’ గీతాన్ని రాష్ట్ర గీతంగా యువత సోషల్ నెట్‌వర్క్‌ల ద్వారా బహుళ ప్రచారంలోకి తెస్తున్నారు. ఇంకా కొన్ని ప్రతిపాదనలు ఇలా ఉన్నయి... 
రాష్ట్ర నృత్యం : పేరిణి 
జంతువు : పెద్దపులి
పక్షి : పాలపిట్ట
పువ్వు : గుమ్మడి / తంగేడు/బంతి పువ్వు
చెట్టు : వేప 
ఆట : చిర్రగోనె

ప్రత్యేక తెలంగాణ ఉద్యమ ప్రభావంతో అప్పటిదాకా మనమీద బలవంతంగా రుద్దిన ‘తెలుగుతల్లి’ భావనను ప్రశ్నించడమూ మొదలైంది. ఆ క్రమంలో ఆవిర్భవించిందే ‘తెలంగాణ తల్లి’. తెలంగాణ తల్లి విగ్రహం కుడిచేతిలో ‘మొక్కజొన్న’, ‘జొన్న’ కంకులు, ఎడమ చేతిలో ఈ ప్రాంత సంస్కృతికి చిహ్నమైన ‘బతుకమ్మ’ ఉండేలా రూపొందించారు.     -బతుకమ్మ నుండి...

7, ఫిబ్రవరి 2013, గురువారం

తెలంగాణ భగత్ సింగ్-నారాయణ రావు పవార్.


నారాయణ రావు పవార్ స్వాతంత్ర సమర యోధుడు. నారాయణ రావు పవార్ 1926 వ సంవత్సరం, అక్టోబరు నెల మూడవ తారీఖున వరంగల్లు నందు పుట్టారు. ఇతనికి నాలుగేళ్ల వయసులోనే మాతృవియోగం కలిగినది. 1944 లో ఇంటర్ పాస్ అయి లా కోర్సు చేయాలని అందులో చేరగా ఆర్థిక పరిస్తితుల కారణంగా దాన్ని కొనసాగించ లేక పోయాడు. రేషన్ డిపార్ట్ మెంటులో ఎన్యుమరేటర్ గా చేరి కొంత ఆర్థికంగా నిలదొక్కుకొని లా కోర్సు చేయడానికి హైదరాబాద్ వచ్చాడు. ఇతను ఎనిమిదవ తరగతిలో వుండగానె ఆర్య సమాజంతో సంబందాలుండేవి. అందు లోని పండిత రుద్రవ్, పండిత నరేంద్ర దేవ్ లు ఇతనికి గురువులు. వారితో కలసి అప్పట్లో మత మార్పిడులను అడ్డుకునేవారు. రాత్రి పూట హరిజన బస్తీలలో బడులు నడిపి వారి పిల్లలకు విద్య గరిపే వారు. మాల మాదిగలతో తిరుగు తున్నందున తండ్రికి కోపంగా వుండేది. ఇంటోకి రావాలంటే బయటే బట్టలు తీసేసి, స్నానం చేసిన తర్వాత లోపలికి రానిచ్చే వారు. అలాగె నడుచు కున్న నారాయణ రావు గాంధీ జీ అస్పృస్యత పై వున్న ఉపన్యాసాలను తండ్రికి వినబడేటట్లు గట్టిగా చదివే వాడు. దాంతొ తండ్రి ప్రవర్థనలొ కొంత మార్పు వచ్చింది. హైదరాబాద్ కు వచ్చింతర్వాత కొంత మంది యువకులను చేరదీసి "యువ క్రాంతి దళ్" ఏర్పాటు చేశారు. దానికి కొండాలక్ష్మణ్ సలహాదారుగా వుండి కొంత ఆర్థిక సహాయం కూడ చేసే వారు. ఆవిధంగా ఆర్య సమాజ కార్యక్రమాలలో పాలుగొంటూ "లా" కోర్సును కూడ కొనసాగించాడు. 1946 లో ఒక సారి దారుసలాం మైదానంలో మహమ్మదాలి జిన్న ప్రసంగాన్ని విన్నాడు. రెచ్చగొట్టే అతని మాటలు జీర్ణించు కోలేక పోయాడు. ఏదైనా సాహసం చేయాలని అపుడే నిర్ణయించు కున్నారు నారాయణరావు మిత్ర బృందం. . కాని ఏది? అనే స్పస్టత లేదు. "లా" కోర్సు లో భాగంలో ప్రతి రోజు హైకోర్టు లో జరిగే వకాలత్ కోర్సులకు వెళ్లే వాడు. ఒక నాడు వకాలత్ కోర్సుకు వెళుతుండగా నారాయణ రావు మిత్రుడు వకాలత్ క్లాసులు ఎలా వుంటాయో చూడాలని వెంట వచ్చాడు. ఆలా వారు వెళు తుండగా నయాపూల్ బ్రిడ్జి వద్ద పోలీసులు ట్రాపిక్ ను ఆపేశారు. ప్రతి రోజు నిజాము నవాబు దారుల్ షిపా లోని తన తల్లి సమాధిని దర్శించు కోడానికి వెళ్లి వస్తుంటాడు. అసమయాలలో పోలీసులు ట్రాపిక్ ను ఆపేస్తారు. నిలబడి వున్న నారాయణ రావు మిత్రబృందం కారు లో వెళుతున్న నిజామును చూశారు. అప్పుడు మిత్రబృందలోని ఒకడు అనాలోచితంగా, హటాత్తుగా తన మిత్రులతో " నిజామును చంపేస్తె........" అన్నాడు. ఆతరవాత ఆసంగతి ఎవరు మాట్లాడు కోలేదు. కొన్ని రోజుల తర్వాత మితృడు బాలకిషన్ ఆ రోజు అనుకున్నట్లు నిజామును చంపాలని నిర్ణయించు కున్నట్లు నారాయణ రావుకు చెప్పాడు. అందరు సరే ననుకొని ప్రణాళికను రూపొందించు కున్నారు. వీరందరూ సుభాష్ చంద్ర బోస్ ఉపన్యాసాలను శ్రద్దగా చదివేవారు. అందులో అతని నినాదం "మీరు మీ రక్తాన్నివ్వండి..... నేను మీకు స్వాతంత్రం ఇస్తాను... " అన్న మాటలు వీరందరినీ ఉర్రూత లూరించింది. దాంతో ఇ మిత్రులందరు ......బాంబులేసి నైజామును చంపాలని....... ప్రాణ త్యాగానికైనా సిద్ద పడాలని నిర్ణయించు కున్నారు.
నారాయణ రావు, పండిత విశ్వనాథ్ బొంబాయి వెళ్లి బాంబులు కొనాలని బయలు దేరారు. మార్గ మద్యలో షోలా పూర్ వద్ద లక్ష్మణ రావు బాపూజీ వీరికి కనబడ్డాడు. అప్పటికే లక్ష్మణ రావు ప్రముఖ క్రిమిల్ లాయరు. బాంబు లెందుకని లక్ష్మణ రావు అడగ్గా/..... రజాకార్లను చంపడానికని అబద్దం చెప్పారు. దాంతో అతను నిజామునె ఎందుకు చంప కూడదు? అని సూటిగా అన్నాడు. దాంతో వీరు అసలు సంగతి చెప్పేసారు. దాంతో లక్ష్మణ రావు వీరికి ఆరు వందల రూపాయలిచ్చి జాగ్రత్తలు చెప్పి పంపాడు. బొంబాయిలో రెండు బాంబులు కొని తిరుగు ప్రయాణంలో షోలాపూర్ లో లక్ష్మణ రావును కసిలి రెండు రివ్వలర్లను అడిగి తీసుకున్నారు. బాంబులు విఫల మైతె రివాల్వర్ తో పని కానిచ్చాలని వీరి పథకం. చివరకు మూడు విషం సీసాలను కూడ అడిగి తీసుకున్నారు. మొదటి రెండు పధకాలు విపలమైతే మూడో మార్గంగా విషం తీసుకుని చావలని వీరి పథకం. హైదరాబాద్ వచ్చి వివరంగా ఒక ప్రతిజ్ఞా పత్రాన్ని తయారు చేశారు. వీరు నిజాంను ఎందుకు చంపాలను కున్నది? దాని సారాంశం ఒక పత్రంలో రాసి, ఆరాసిన నకలును నారాయణ స్వామి వద్ద వుంచారు. పథకం అమలు చేసిన రోజు నారాయణ స్వామి బెజవాడ వెళ్లి ఆనకలు పత్రాన్ని, ముగ్గురు మిత్రులు కలిసి తీసుకున్న పోటోను, పత్రికల వారికి, రేడియో వారికి అంద జేయాలని ముందె నిర్ణయించు కున్నారు. ప్రతిజ్ఞా పత్రంపై ముగ్గురు మిత్రులు అనగా నారాయణ రావు పవార్ జగదీష్, గండయ్య తమ రక్తంతో సంతకం చేశారు. డిసెంబరు నెల నాల్గవ తారీఖు 1947 సాయంకాలం నాలుగు గంటల సమయం..........కింగ్ కోటి రోడ్డు, నిజాం నివాసంముందు. రోడ్డు పై ముగ్గురు మిత్రులు దూర దూరంగా అక్కడక్కడా నిలబడాలి, మొదటి వ్యక్తి విఫలమైతే రెండో వాడు పని కానిచ్చాలి, అక్కడా తప్పితే మూడో వాడు పథకాని అమలు కానివ్వాలి. ఇది వారి పథకం. కింగ్ కోటి రోడ్డులో ప్రతి చౌరస్తా వద్ద ఒక పోలీసు మరొక జవాను వున్నారు. కానిస్టేబుల్ ట్రాపిక్ ను నియంత్రిస్తే జవాను ఆచుట్టు పక్కల తిరుగుతున్న జనాలపై నిఘా పెడుతున్నాడు. నారాయణ రావు గల్లీలోంచి రోడ్డు పైకి వచ్చి తన సైకిల్ ను గోడకు ఆనించాడు. ఇది జవాను గమనించాడు. అప్పటికే నిజాము కారు రెండో కానిస్టేబులు వద్దకు వచ్చింది. ఇంతలో నారాయణరావు సంచిలో నుండి బాంబును బయటి తీసి దాని 'పిన్' లాగి నిజాం వస్తున్న కారు పైకి విసిరాడు. అది పెద్ద శబ్దంతో పేలి పోయింది. అది పడ్డ ప్రదేశంలో పెద్ద గొయ్యి ఏర్పడింది. ముగ్గురు సాధారణ పౌరులు తీవ్ర గాయ పడగా ఒక చిన్న పిల్ల అక్కిడికక్కడే మరణించింది. కారు మాత్రం తప్పించు కుంది. నారాయణ రావు జేబులో చేయి పెట్టి రివాల్వర్ తీసే లోపె జవాను వచ్చి అతని చెయ్యి పట్టుకున్నాడు. అతను విషం మింగే అవకాశం కూడ లేదు. బాంబు శబ్దం విన్న మిగతా ఇద్దరు పథకం సఫలం అయిందని అక్కడి నుండి తప్పుకున్నారు. లేక పోతే నిజాముకు ఇదే ఆఖరి రోజు అయ్యెది.
నారాయణ రావును పోలీసులు చుట్టుపక్కల వున్న ప్రజలు విచక్షణా రహితంగా కొట్టారు. ఒకడు రాయి తో మూతి మీద కొట్టగా పళ్ళు రాలి పోయాయి. బాంబు పేలిన ప్రాంతంలో ఒక డాక్టర్ గారి ఇల్లు వున్నది. నిజాం కారు డ్రవర్ తెలివిగా కారును ఆ ఇంటి లోనికి పోనిచ్చాడు. నారాయణ రావు బాంబు వేస్తున్నప్పుడు మొదట చూసిన వ్యక్తి ఆ డాక్టర్ ఇంటి వాచ్ మాన్. అతను అరబ్బువాడు. వాడు నారాయణ రావు ను తన మొలలో వున్న బాకు తీసి చంప బోయాడు. అక్కడున్న ఇనస్పెక్టర్ చేయి అడ్డం పెట్టి "ఇప్పడే చంపొద్దు...రహస్యాలు రాబట్టాలి " అని వారించాడు. అతని చేతికి గాయం అయింది. కోర్టు విచారణ లో కూడ ఈ అరబ్బు కాపలాదారుడే మొదటి సాక్షి. పోలీసు స్టేషన్ లో విచారణ సమయంలో మనారాయణ రావుని నీవు హిందువువా మిస్లిం వా , నీ పేరేమిటని అడగ్గా హిందు/ ముస్లిం తేడా తెలియకుండా వుండ డానికి తన పేరు "బాబు" అని అన్నాడు. కాని పోలీసులు నారాయణ రావు బట్టలన్నీ వూడ దీసి అతను హిందువని నిర్దారించారు. ఇంతలో నైజామ్ ప్రధాని మీర్ లాయక్ అలి అక్కడికి వచ్చి నారాయణ రావునుద్దేసించి "నిన్ను ఎవరు పంపారు? రాజ కుటుంబీకులా? లేక సర్దార్ పటేలా? " అని ప్రశ్నింఛాడు. దానికి నారాయణ రావు తనే స్వయంగా ఈ పనికి పూనుకున్నానని చెప్పాడు. అలా రెండు రోజులు పలు రకాలుగా చిత్ర హింసలు పెట్టారు పోలీసులు. ఆ మరు దినం ఎదురు సెల్ గదిలో గండయ్య వున్నాడు. అతను అద్దెకు తీసుకున్న సైకిల్ పైన వున్న పేరును బట్టి దాని ఆదారంతో పోలీసులు గండయ్యను అరెస్ట్ చేశారని ఆ తర్వాతి తెలిసింది. పోలీసులు వరంగల్లు వెళ్లి నారాయణ రావు ఇంటిని శోధించారు. నారాయణ రావు తండ్రి తన కొడుకు అంత సాహసికుడు కాదన్నాడు. నిజ నిర్దారణకు, అతడిని హైదరాబాదు తీసుకొచ్చి ఖైదిని చూపగా అతడు తన కొడుకే నని ఒప్పుకున్నాడు. ఆ తండ్రి తన కొడుకు ఇంత పని చేశాడని కోప్పడలేదు, కొట్టలేదు, అసహ్యించు కోలేదు. కొడుక్కి అంతా మంచి జరుగు తుందని, దేవుడు రక్షిస్తాడని, దైర్యం చెప్పాడు కొడుక్కు. నారాయణ రావు తన కేసును వాదించ డానికి ఏ వకీలును నియమించు కోలేదు. తన కేసును తనే వాదించు కున్నాడు. విచారణ సమయంలో నారాయణ రావు తండ్రి వచ్చి నప్పుడు మిఠాయి తెచ్చి ఇచ్చే వాడు. దైర్యం చెప్పేవాడు. నారాయణ రావు విచారణ సందర్బంలో తను తయారు చేసుకున్న ప్రతిజ్ఞా పాటాన్ని మళ్లి, మళ్ళి చెప్పేవాడు. నారాయణ రావు తండ్రి తనయుడి విడుదల కొరకు, పండరి నాథుడు విఠల్ దేవునికి మొక్కుకొని జుట్టు, గడ్డం, మీసాలు పెంచి సాధువులా జీవించాడు. చివరకు అత్యున్నత న్యాయస్థానం నారాయణ రావు పవార్ కు ఉరి శిక్ష విధించింది. అపుడు నారాయణ రావు పవార్ గర్వంగా "సర్ కటా సక్తే హై లెకిన్ స్ర్జుఆ సక్తే నహీ" అని పండిత రాం ప్రసాద్ బిస్మిల్ల కవిత చరణాలను బిగ్గరగా పాడుకున్నాడు. ..................................................కాని............... 1948 సంవత్సరం, సెప్టెంబరు 17 న నిజాము నవాబు వల్లబాయి పఠేల్ ముందు లొంగి పోగా, హైదరాబాద్ స్టేట్ స్వతంత్ర భారత్ లో విలీనం అయి పోయింది. ఆ తర్వాత నారాయణరావు పవార్ ను అతని అనుచరులకు ఇతర కేసులలో వున్న నిందితులకు క్షమాబిక్ష లబించింది......................... ఇంతటి ధీరోదాత్త సంఘటనకు తగు ప్రచారం లబించ లేదు. 

                          2009 లో క్విట్ ఇండియా దినం సందర్భంగా ఆయనకు రాష్ట్ర పతి నుండి పిలుపు వచ్చింది, ఆయనను ప్రభుత్వం సన్మానించి గౌరవించింది. ఆయన డిసెంబర్12, 2010 న తుది శ్వాస విడిచారు.

5, ఫిబ్రవరి 2013, మంగళవారం

పోదాం పద.. పెద్దగట్టుకు!


కల్మశం లేని కష్టజీవులు కలిసి జరుపుకునే పెద్దగట్టు జాతర తెలంగాణలోనే రెండో అతిపెద్ద సామూహిక వేడుక. ఇక్కడ భగవంతుడికి, భక్తుడికి మధ్య వారధుపూవరూ ఉండరు. వీరిని ఏకం చేసే ఒకే ఒక దివ్యమంత్రం... ‘ఓ లింగా’.!! చలో... ఇక పోదాం పద.. పెద్దగట్టు జాతరకు..! 

జాతర.. సంస్కృతి, ఆచార వ్యవహారాలకు అద్దం పట్టే ఉత్సవం. ఆత్మగౌరవాన్ని, అస్తిత్వాన్ని, జీవన సౌందర్యాన్ని ప్రతిబింబింపజేసే సంరంభం. ప్రజలు తమకు రక్షణ కల్పించిన వారినో, యుద్ధ వీరులనో దేవుళ్లుగా తలచి పూజించే సంబురం. వందల ఏండ్ల చరిత్ర కలిగిన పెద్దగట్టు జాతరకు చాలానే పేర్లున్నాయి. దురాజ్‌పల్లి జాతర, గొల్లగట్టు జాతర.. లింగమంతుల జాతర.. పేరు ఏదైనా, దైవం మాత్రం లింగమంతుడే.. 

రెండేళ్లకోసారి జరిగే ఈ జాతరకు దాదాపు 15 లక్షలకు పైనే జనం వస్తుంటారు. మన రాష్ట్రం నుంచే గాక మహారాష్ట్ర, చత్తీస్‌ఘడ్, ఒరిస్సా, కర్నాటకల నుంచి కూడా భక్తులు పోటెత్తుతారు. సబ్బండ వర్ణాల ప్రజలు ‘‘ఓలింగా..! ఓ లింగా !!’’ అంటూ దిక్కులు పిక్కటిల్లేలా నినదిస్తూ ఆ దేవుడిని వేడుకుంటారు. ఇక్కడి లింగమంతుల జాతరలో వేద బ్రాహ్మణులు కాకుండా యాదవులు పూజారులు కావడం విశేషం. ‘ఓ లింగా ఓ లింగా’ అనే భక్తుల పిలుపే ఏకైక మంత్రం. 

లింగమంతుడికి నైవేద్యం..
పెద్దగట్టు జాతరలో లింగమంతుడు సహా చౌడేశ్వరి (సౌడమ్మ, చాముండేశ్వరి), గంగాభవాని, యలమంచమ్మ, అకుమంచమ్మ, మాణిక్యాలదేవి పూజలందుకుంటారు. వీరిలో లింగమంతుడు శాఖాహారి కావడంతో ఆయనకు నైవేద్యం సమర్పిస్తారు. తక్కిన దేవతలకు జంతుబలి ఇచ్చి సంతృప్త్తి పరుస్తారు. 
bonaluఅన్నా, చెల్లెళ్లకు ప్రత్యేకం...
పెద్దగట్టు పరిధిలో ఎటుచూసినా ఐదు కిలోమీటర్ల వరకు జాతర రద్దీ కనిపిస్తుంది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చే భక్తులు టెంట్లు ఏర్పాటు చేసుకుని విడిది చేస్తారు. ఇక గట్టు సమీపంలో కోలాహలం అంతా ఇంతా కాదు. అన్నలు తమ చెల్లెళ్లకు జాతరలో గాజులు కొనివ్వడం ఏళ్ల తరబడి వస్తున్న సంప్రదాయం. గజ్జెలు, భేరీలు, తాళాలు, పిల్లనక్షిగోవి శబ్దాలు.. బండ్లు లాగుతున్న ఎద్దుల మెడలో గణగణ మోగే గంటలు..‘ఓలింగా ఓ లింగా’ అంటూ భక్తుల తన్మయం.. మరోవైపు జెయింట్ వీల్స్, జంతువూపదర్శన శాలలు, రంగులరాట్నాల వద్ద యువతీ, యువకుల కేరింతలు, తప్పిపోయిన వారికోసం ఏర్పాటు చేసిన శిబిరాల నుంచి పోలీసుల అనౌన్స్‌మెంట్లు.. పెద్ద మర్రిచెట్టు దగ్గర ఏర్పాటు చేసిన సామాజిక చైతన్య కార్యక్షికమాలు, ప్రత్యేకంగా తయారు చేసిన మిఠాయిల విక్రయాలు, చిన్నపిల్లల బొమ్మల కొనుగోళ్లు, చెరుకు రసాలు.. ఒక ప్రతి ఏటా జాతర వస్తే బాగుండనే ఆలోచనలు మది నిండిపోతాయి. దూరం నుంచి గుట్టను గమనిస్తే మూడువైపులా ఉన్న మెట్ల మార్గంలో భక్తుల రాకపోకలు గట్టుకు పూలమాలలు అల్లినట్లుగా తోస్తుంది. 

యాదవుల ప్రత్యేక వేషధారణ
యాదవులు తమకు, తమ సంపదలైన గోవులకు రక్షణగా నిలిచిన లింగమంతుడిని ఇక్కడ ఆరాధిస్తారు. జాతరకు వచ్చే భక్తుల్లో అత్యధికులు యాదవులు. వారు ప్రత్యేక వేషధారణ, వాయిద్యాలతో జాతరకు ఒకరోజు ముందే బంధుమివూతులతో ఎడ్లబండ్లు, ట్రాక్టర్లపై ఇక్కడికి చేరుకుంటారు. మగవాళ్లు ఎరుపు రంగు బనియన్, గజ్జెల నిక్కరు ధరించి, కాళ్లకు గజ్జెలు కట్టుకుని, అవుసరాలు పత్యేకమైన తల్వార్లు) చేతుల్లో పట్టుకుని భేరీలు, తాళాల ఢిళ్లిం... భళ్లిం... శబ్దాల నడుమ లయబద్దంగా నడుస్తూ ‘ఓలింగా... ఓ లింగా!!’ అంటూ హోరెత్తిస్తారు. 

మహిళలు తడి బట్టలతో పసుపు, కుంకుమ, పూలదండలు, అగరొత్తులతో అలంకరించిన మంద గంపను నెత్తిన పెట్టుకుని నడుస్తారు. ఇంట్లోని ఆడపిల్లలు, సంతానం లేని మహిళలు బోనం కుండ ఎత్తుకుంటారు. తోడుగా వచ్చిన వాళ్లు దేవుడికి బలిచ్చే గొర్రెపోతును తీసుకొస్తుంటారు. ఇక్కడికి రావడానికి ముందుగానే గొర్రెపోతుకు స్నానం చేయిస్తారు. పూలమాల మెడలో వేసి దేవుడు ఉన్న దిక్కువైపు వదిలేస్తారు. దాంతో గొర్రెపోతు తన ఒంటిపై ఉన్న నీళ్లను దులిపేసుకోవడానికి శరీరాన్ని దులిపేస్తుంది. అలా చేయడాన్ని ‘జడత పట్టించడం’ అంటారు. అలా చేయనిపక్షంలో దాని బదులు మరో గొర్రెపోతును తీసుకొస్తారు. జడత ఇచ్చే వరకు నీళ్లు చల్లుతారు. జడత ఇస్తేనే దేవుడు మెచ్చాడని యాదవుల నమ్మకం. లేదంటే ‘నీకు ఏం తక్కువ చేశాం దేవుడా’ అంటూ నిట్టూరుస్తారు.

పెద్దగట్టుకు 200 ఏళ్ల చరిత్ర
పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతరకు సుమారు 200 ఏళ్ల చరిత్ర ఉన్నట్లు చరివూతకారులు చెబుతున్నారు. ఇందుకు పలు, ప్రాంతాల్లో ఆయా సందర్భాల్లో లభించిన శాసనాలే వారికి ఆధారం. కానీ, క్రీ.శ.11వ శతాబ్దంలో రాష్ట్రకూట వంశానికి చెందిన ధ్రువుడు అనే రాజు తన పేరిట ఇక్కడ గ్రామాన్ని నిర్మించాడని, ఆయన పేరిటే ఈ గ్రామం దురాజ్‌పల్లిగా పేరొందినట్లు కొందరి వాదన. కానీ, చరివూతకారులు మాత్రం ప్రస్తుతం పూజలందుకుంటున్న విగ్రహాలకు 200 సంవత్సరాల వయసు ఉంటుందని చెబుతున్నారు. కానీ, గతంలో జాతర జరిగిన గట్టును, అక్కడి విగ్రహాలను ఇంత వరకు ఎవరూ పరిశీలించలేదు. నేటికీ ఆ ప్రయత్నాలు జరగలేదు. ఆ పరిసరాలను గమనిస్తే ఎన్నో ఏళ్ల చరిత్ర ఉండవచ్చని సమాచారం. జాతర విశేషాలను గురించి ఇక్కడ పూజారిగా పనిచేసే 76 ఏళ్ల మట్ట రామనర్సయ్య యాదవ్ మాట్లాడుతూ ‘తమ ముత్తాతల కాలం నుంచి మా వంశీకులు జాతరలో పూజారులుగా వ్యవహరిస్తున్నారని’ చెప్పారు. దీనిని బట్టి జాతరకు దాదాపు వందల ఏళ్ల చరిత్ర ఉంటుందని తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో లింగమంతుల చరిత్ర, జాతర తదితర అంశాలపై 2009 సంవత్సరంలో ‘లింగమంతుల అధ్యయన పీఠం’ ఏర్పాటైంది. లింగమంతుల స్వామి కాలం, సమయం, జాతర నేపథ్యం, ఆధారాలు, విశేషాలు తదితర అంశాలపై పీఠం అధ్యయనం చేస్తోంది. 

ఉండ్రుగొండ నుంచి దురాజ్‌పల్లికి...
దురాజ్‌పల్లికి సమీపంలో ఉండ్రుగొండ అనే గ్రామం ఉంది. దీని శివారులో పెద్ద అటవీవూపాంతం, ఏడు నుంచి ఎనిమిది కొండ గుట్టలు ఉన్నాయి. ఇక్కడ శైవ, వైష్ణవ మతాలు వర్ధిల్లినట్లు తెలిపే ఆనవాళ్లు, రాతి కట్టడాల మధ్యన కోనేరు నిర్మితమై ఉంది. ప్రస్తుతం దురాజ్‌పల్లి సమీపంలో జరిగే లింగమంతుల జాతర గతంలో ఉండ్రుగొండకు సమీపంలోని పెద్దగుట్టపై జరిగేది. అక్కడి నుంచి పెద్దగట్టుకు మారేందుకు కారణమేదైనా... ఓ కథ మాత్రం ప్రచారంలో ఉన్నది. జాతర సమయంలో మందగంప ఎత్తుకుని వెళ్తున్న ఓ గర్భిణి ఉండ్రుగొండ గుట్ట ఎత్తుగా ఉండడంతో అదుపుతప్పి పడిపోయి మృతి చెందిందని, ఆ కారణంతో దేవుడు ఓ వ్యక్తి కలలో కనిపించి తనను పెద్దగట్టుకు మార్చమని చెప్పాడని చెబుతుంటారు. దాంతో 200 ఏళ్లుగా పెద్దగట్టులో జాతర నిర్వహిస్తున్నారు. 

ఆలయ నిర్మాతలు వీరే...
1981కి ముందు పెద్దగట్టు జాతరను వెలమదొరలు నిర్వహించగా, ఆ తర్వాత 1982 నుంచి యాదవ కులస్తుల ఆధీనంలో జరుగుతోంది. పెద్దగట్టుపై రెండేళ్ల కిందట కొత్త ఆలయాలు నిర్మించారు. గతంలో ఇక్కడ రెండు చిన్న గుడులు మాత్రమే కనిపించేవి. వీటిని కొన్నేళ్ల కిందట పెద్దగట్టు సమీపంలోని కాసారం గ్రామానికి చెందిన గొర్ల లింగమడ్డి, మెంతెబోయిన భిక్షం యాదవ్ అనే ఇద్దరు లింగమంతుల స్వామి భక్తులు నిర్మించినట్టు సమాచారం. 

ఇలా వెళ్లాలి...
నల్లగొండ జిల్లాలోని పెద్దగట్టు... హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై దురాజ్‌పల్లి గ్రామ పరిధిలో ఉంది. హైదరాబాద్‌కు 150 కిలో మీటర్లు, సూర్యాపేటకు 6 కి.మీ. దూరంలో ఉంటుంది. విజయవాడ నుంచి వచ్చే భక్తులు కోదాడ మీదుగా చేరుకోవాలి. గుంటూరు వైపు నుంచి వచ్చే వారు మిర్యాలగూడ, నేరేడుచర్ల, గరిడేపల్లి మీదుగా నేరుగా పెద్దగట్టు చేరుకోవచ్చు. వరంగల్, హైదరాబాద్ నుంచి వచ్చే భక్తులు సూర్యాపేట చేరుకుని అక్కడ నుంచి ప్రత్యేక బస్సుల్లో జాతరకు రావచ్చు. అన్ని ప్రాంతాల నుంచి భక్తులు ఇక్కడికి చేరుకునేలా ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తుంది. ఇక్కడికి రైల్వే సౌకర్యం లేదు. 

జాతర ప్రారంభం ఇలా...
‘గొల్లగట్టు జాతర’గా మరోపేరుతోనూ పిలుచుకునే ఈ జాతర ఐదు రోజులపాటు ఘనంగా జరుగుతుంది. పుష్యమాస అమావాస్య ఆదివారం రోజు (ఫివూబవరి 10)న దిష్టిపూజతో జాతర ఏర్పాట్లు ప్రారంభమవుతాయి. ఆ రోజున తల్లి, పిల్ల గొర్రెను గట్టుపై బలిస్తారు. దీనినే బలిపూజ అనికూడా పిలుస్తారు. తిరిగి మాఘ శుద్ధ పౌర్ణమికి అటుఇటుగా వచ్చే ఆదివారం (ఫివూబవరి 24) జాతర మొదలవుతుంది. కాగా, శనివారం మధ్యాహ్నం నుంచి మూలవిరాట్‌లకు అలంకరణ మొదలవుతుంది. వరంగల్ జిల్లా చీకటాయపాలెం నుంచి యాదవ పూజారులు చౌడమ్మ పల్లకి తీసుకురాగా, సూర్యాపేట నుంచి మకరతోరణం ఇతర ఆభరణాలు గుట్టకు తీసుకువచ్చి అలంకరిస్తారు.
జాతర తొలి రోజు: ఆదివారం ఫిబ్రవరి 10న జాతర హడావిడి మొదలవుతుంది. వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చే భక్తులు రాత్రి తమ ఇళ్లలో గంపలు వెళ్లదీసే కార్యక్షికమానికి శ్రీకారం చుడతారు. సంప్రదాయ ఆయుధాలు తీసుకుని ఎవరికి వారు తమ వాహనాల్లో రాత్రి లోపే ఇక్కడకు చేరుకుంటారు. 
రెండో రోజు: సోమవారం జాతరలో ప్రత్యేకమైంది. యాదవ పూజారులు పోలు ముంతలు, బొట్లు, కంకణాలు తదితర కార్యక్షికమాలు నిర్వహిస్తారు. మహిళలు తెల్లవారుజామునే బోనం వండుకుని లింగమంతుల స్వామికి నైవేద్యం సమర్పిస్తారు. ఇదే రోజున జంతుబలి కొనసాగుతుంది. ఈ రోజున భక్తజన రద్దీ ఎక్కువగా ఉంటుంది. 

మూడో రోజు: మంగళవారం ‘చంవూదపట్నం’ వేస్తారు. బియ్యం పిండి, పసుపు కలిపిన పదార్థంతో ఆలయాల ఎదుట ముగ్గు వేస్తారు. నాలుగువైపులా గురుగులు ఏర్పాటు చేసి దీపాలు వెలిగిస్తారు. 
నాలుగో రోజు: బుధవారం నెలవారం. దేవరపెట్టెను తొలగిస్తారు. ఈ దేవరపెట్టె దిష్టిపూజరోజున ఇక్కడికి చేరుకుంటుంది. తొలగించిన అనంతరం సమీపంలోని కేసారం గ్రామానికి తరలిస్తారు. తిరిగి మరో ఏడాది జరిగే జాతర సమయంలోనే ఈ పెట్టెను తీసుకొస్తారు. 
ఐదో రోజు: మకర తోరణం తొలగింపు. మూలవిరాట్‌ల అలంకరణకు ఉపయోగించే ఈ ఆభరణం మొసలి శరీరం, సింహం తలభాగం కలిసిన ఆకృతితో చెక్కి ఉండడం గమనార్హం.

పెద్దగట్టుపై కొండంత వివక్ష
తెలంగాణలో రెండో అతి పెద్ద జాతరైన ‘లింగమంతుల జాతర’పై సీమాంధ్ర పాలకులు ఏళ్ల తరబడి వివక్ష చూపుతున్నారు. జాతర ఆదాయంపై కన్నేసి, దోచుకుంటూనే.. నాటి నుంచి నేటి వరకు ఎలాంటి వసతులు సమకూర్చకపోవడం విచారకరం. జాతరలో క్రయ, విక్రయాలకు సంబంధించి వేలం నిర్వహిస్తూ వచ్చే ఆదాయంలో కనీసం పదిపైసల వంతైనా గుట్ట అభివృద్ధికి వెచ్చించడం లేదు. ఫలితంగా జాతర సమయంలో భక్తులు పడరాని పాట్లు పడుతుంటారు. నిలువ నీడలేక, తాగడానికి నీరు లేక, కాలకృత్యాల తీర్చుకునే ఏర్పాట్లు లేక అలమటిస్తుంటారు. పిల్లాపాపలు, బంధుమివూతులతో మండుటెండలో తీవ్ర ఇక్కట్లు వారికి తప్పవు. వాస్తవానికి లింగమంతుల జాతర 1967లో ప్రభుత్వ గుర్తింపు పొందింది. అప్పటి నుంచి జాతర ఆదాయాన్ని గ్రామపంచాయతీనే అనుభవిస్తోంది. కేవలం జాతర సమయంలో మాత్రం అరకొర నిధులతో సరిపెడుతోంది. ఈ నేపథ్యంలో లింగమంతుల జాతరను రాష్ట్ర పర్వంగా గుర్తించి అభివృద్ధి చేయాలని పలువురు కోరుతున్నారు. 

గోలీ సోడా సీసాలు పేలిన ఘటన
1969వ సంవత్సరం.. తెలంగాణ తొలిదశ ఉద్యమం జోరుగా సాగుతున్న సందర్భం. అదే సమయంలో పెద్దగట్టు జాతర జరుగుతుండగా గుట్టపై ప్రమాదవశాత్తూ గోలీ సోడాలు పెద్ద శబ్ధంతో పేలిపోయాయి. దీంతో అక్కడున్న భక్తులంతా భయపడ్డారు. ఆంధ్రా ప్రాంతానికి చెందిన వాళ్లు వచ్చి బాంబులు వేస్తున్నారని ప్రచారం జరగడంతో భక్తులు పెద్దగా కేకలు వేస్తూ తలో దిక్కు పారిపోయారు. జాతర చరివూతలో ఈ సంఘటన మరిచిపోలేనిది, ప్రత్యేకమైంది. ఎందుకంటే, ఆ కాలంలో చాలామంది నిరక్షరాస్యులే కావడంతో తమ పిల్లల పుట్టిన రోజులు రాసిపె కాదు. దాంతో క్రీ.శ., క్రీ.పూ. అన్నట్లు తమ పిల్లలు గోలీసోడాలు పేలిన ఘటనకు ముందు పుట్టారా లేక తర్వాత పుట్టారా అనేదే గుర్తుంచుకున్నారు.
                                                                                                                      -namaste telangana

3, ఫిబ్రవరి 2013, ఆదివారం

రహదారుల దిగ్బంధం...


హైదరాబాద్ : తెలంగాణ ఉద్యమంలో భాగంగా తెలంగాణలోని హైవేలను దిగ్బంధించాలని టీ రాజకీయ జేఏసీ నిర్ణయించింది. ఇవాళ తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్‌లో జరిగిన తెలంగాణ జేఏసీ విస్తృత స్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. సమావేశం ముగిసిన అనంతరం ప్రొఫెసర్ కోదండరాం మీడియాతో మాట్లాడారు. ఈ నెల 24న బెంగళూరు హైవేను, మార్చి 2న విజయవాడ హైవేను దిగ్బంధించాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. ఫిబ్రవరి 11, 12 తేదీల్లో శంషాబాద్ నుంచి అలంపూర్ వరకు, 27, 28 తేదీల్లో హయత్‌నగర్ నుంచి కోదాడ వరకు బస్సు యాత్రలు చేపడుతామని పేర్కొన్నారు. కాంగ్రెస్ ఖతం కరో.. తెలంగాణ హాసిల్ కరో.. అనే నినాదంతో ఉద్యమిస్తామని ఆయన తెలిపారు. 

ఈ నెల 16 నుంచి 21 వరకు కాంగ్రెస్ ఎమ్మెల్యేల నియోజక వర్గాల్లో ప్రచారం నిర్వహిస్తామని చెప్పారు. సమైక్యవాదానికి మద్దతు లేదని తెలిసినా తెలంగాణపై కాంగ్రెస్ మోసపూరితంగా వ్యవహరిస్తోందని ఆయన మండిపడ్డారు. టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీని వదిలి ప్రజా ఉద్యమంలోకి రావాలని ఆయన పిలుపునిచ్చారు. 

మార్చి 3వ వారంలో శాసనసభ సమావేశాలు జరిగే అవకాశం ఉందని కోదండరాం పేర్కొన్నారు. సమావేశాలు జరిగే సమయంలో పెద్ద ఎత్తున ‘చలో అసెంబ్లీ’ కార్యక్రమం నిర్వహిస్తామని స్పష్టం చేశారు. రాజకీయ కక్షతోనే టీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై, కోదండరాంపై కేసులు బనాయించడాన్ని టీ జేఏసీ ఖండించింది.     -namaste telangana

2, ఫిబ్రవరి 2013, శనివారం

మన దేవాలయము..

అమ్మపల్లి సీతారామచంద్ర స్వామి దేవాలయం:

హైదరాబాద్‌కు సమీపంలోని శంషాబాద్ మండలంలో ఉన్నదే అమ్మపల్లి సీతారామచంద్ర స్వామి ఆలయం. 13వ శతాబ్దంలో వేంగీ చాళుక్యులు ఈ దేవాలయాన్ని నిర్మించినట్లు తెలుస్తోంది. వందల ఏళ్ల క్రితం నాటి ఈ దేవాలయంలో సీతారాములు కొలువై ఉన్నరు. నాటి నిర్మాణ నిపుణుల నైపుణ్యానికి చిహ్నంగా ఇప్పటికీ నూతనంగా కనిపిస్తోంది. ఆలయ ప్రాంగణలో 30 అడుగుల మేర నిర్మించిన గోపురం ఇక్కడ ప్రధాన ఆకర్షణ. ఈ దేవాలయం లో అనేక సినిమాల షూటింగ్ లు జరిగాయి, ఇప్పటికి జరుగుతూ ఉన్నాయి.                                         -బతుకమ్మ నుండి