హోం

26, జనవరి 2013, శనివారం

తొండ ముదిరి ఉండవెల్లి అయ్యింది.. ఒక పిట్ట కథ!!

                              
మొన్న రాజమండ్రిలో ఒక పెద్దాయన సభ నిర్వహించిండు, పధకం ప్రకారం జై ఆంద్ర అని ముందు ప్రకటించి తర్వాత జై ఆంద్ర ప్రదేశ్ అని మార్చిండు, దీనికి రాష్ట్ర మంత్రులు( ఆంద్ర ) , ఎం.పీలు , ఎం ఎల్ ఎ లు, కార్యకర్తల తో పాటు తెలుగు దేశం, వై ఎస్ అర్ పార్టీ ల కార్య కర్తలు కూడా హాజరయ్యారు. ఉండవెల్లి ఎం చెప్తారా అని అందరు ఆసక్తిగా ఎదురు చూసారు, ఇన్నిరోజులు సమైక్యంద్ర అంటే జనమే కనిపించలేదు, కాని ఈ రోజు ఓ మోస్తరు జనం కనిపించేసరికి సీమంద్ర ఛానల్ లు పండుగ చేసుకున్నాయి( ఈ టివి2 తప్ప, ఎందుకంటే మార్గదర్శి వ్యవహారం బయటకు తెచ్చారు కదా). దీనికి పీ సి సి చీఫ్ బొత్స కూడా హాజారయ్యారు, దీనితో ఇదో కాంగ్రెస్ పార్టీ సమావేశం ఐపోయింది.
                          సభలో సుదీర్గంగా ఉపన్యసించిన ఉండవెల్లి, నిజాం కాలం నాటినుండి మొదలు పెట్టి ముల్కి ఉద్యమం, రాష్ట్ర విలీనం, పెద్ద మనుషుల ఒప్పందం, జై తెలంగాణా, జై ఆంద్ర ఉద్యమాలు, సిక్స్ పాయింట్ ఫార్ముల, టి అర్ ఎస్ పెట్టక ముందు కె సి అర్, పెట్టిన తర్వాత కె సి అర్ ఇలా నేటి వరకు అన్ని విషయాలను తనదైన శైలి లో పిట్టకతలను చొప్పించి వీడియొ క్లిప్పులు చూపిస్తూ అక్కడున్న నాయకులను ఆకట్టుకోవాలని చూసారు,అయితే ఈ మీటింగ్ కు జై ఆంధ్రప్రదేశ్ అని పేరైతే పెట్టారు కాని అందులో ఒక్క తెలంగాణా నేత కూడా పాల్గొనలేదు, మరి అది జై ఆంద్ర ప్రదేశ్ ఎలా అయ్యిందో....

                        అబద్ధాలకు పిట్టకతలను జోడించి అందంగా సమైక్యంద్ర విషాన్ని జనానికి ఎక్కించాలని చూసాడు, నిన్న మొన్నటి వరకు తెలంగాణా ను అక్కడి ప్రజలు కోరుకోవడం న్యాయమె, వారెన్నడు మనతో కలవాలని అనుకోలేదు, మనమే కలిసాము అని సీమంద్ర విద్యార్థులతో చెప్పిన ఉండవెల్లి అకస్మాత్తుగా మాట మార్చారు, మీకు హైదరాబాద్ అవసరం లేదా అని అడిగి మరి మనల్ని వాళ్ళు కలుపుకున్నారు అని అసత్యపు మాటలు పలికారు, జవహర్ లాల్ నెహ్రు నిజామాబాద్ లో చేసిన స్పీచ్ తెలంగాణా వాదుల సృష్టి అని, విద్య ఉద్యోగాల్లో తెలంగాణా వాలు ఈ రోజు అభివృద్ధి చెందారని, విద్యుత్ వినియోగం పెరిగిందని ఇలా నోటికొచ్చినవన్ని చెప్పుకొచ్చారు, 2004 లో తెలంగాణా ఇస్తామని చెప్పలేదని తనను గతంలో చేసిన అనువాదాన్నే(సోనియా కరీం నగర్ స్పీచ్ ను తెలుగులోకి అనువదించాడు) విస్మరించాడు, సకల అభాద్ధాలు చెప్పి సీమంద్ర నాయకులను, ఆ సభ కు విత్తం సమకూర్చిన వారికి సంతృప్తిని కలిగించి తెలంగాణా వాదుల గుండెలు రగిల్చిండు, ఇన్ని ఏళ్ళ రాజకీయ అనుభవం కలిగిన ఈ వ్యక్తికి లాగడపాటి ఇచ్చిన సమాచారంతో కళ్ళు తెరుచుకున్నయట,తాను వాస్తవాలని నమ్మినవి, చూసినవి అన్ని అబద్దాలని తెలిసిందట, అందుకే సమైక్యంద్ర వాధీగా మారాడట..? నవ్వి పోదురు గాక నాకేమి సిగ్గు అంటూ విద్వేషాలను రగిల్చి మరుసటిరోజు తాను తెలంగాణా కు వ్యతిరేఖం కాదు అని, తన ఉపన్యాసం ద్వారా తెలంగాణా మేధావులలో చైతన్యం రగిలితే సంతోషం అని చెప్పుకున్నారు, ఇంత జరిగిన ఒక్క తెలంగాణా మంత్రి కూడా ఖండించలేదు, కనీసం స్పందించలేదు, తెలంగాణా నాయకత్వం పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తూ చిన్న చిన్న విషయాలను పెద్దవిగా చూపిస్తూ విషం కక్కాడు, ఈ మాత్రం కథలు మనం చెప్పలేమా..?

                                   పూర్వం ఒక ఊరిలో ఒక రైతు ఉండేవాడు అతనికి ఇద్దరు కొడుకులు, అతను చనిపోవడానికి ముందు తాను సంపాదించిన ఆవు, మామిడి చెట్టు, ఒక గొంగలి ఈ మూడింటిని ఇద్దరు సమానం గా పంచుకోండి అని చెప్పి చనిపోతాడు, అయితే పెద్దవాడు తమ్ముడిని పిలిచి తమ్ముడు నాన్న చెప్పినట్టు ఇద్దరం సమంగా పంచుకుందాం అని ఆవు ముందు బాగం నీకు వెనక భాగం నాకు, మామిడి చెట్టు మొదలు నీకు పైభాగం నాకు, దుప్పటి పగలు నీకు రాత్రి నాకు అని ఇలా పంచుతాడు, చిన్న వాడు ఆవుకు మేతవేస్తే పెద్దవాడు పాలు పిండుకునేవాడు, పేడతో పిడకలు చేసుకునేవాడు, చిన్న వాడు మామిడి చెట్టుకు నీళ్ళు పోస్తే పెద్ద వాడు పండ్లను తేమ్పుకునే వాడు, ఇక గొంగలి పగలు చిన్నవాడు ఉతికి ఆరేస్తే పెద్దవాడు రాత్రి ఎంచక్కా కప్పుకునే వాడు, ఇలా కొంతకాలం జరిగింది, ఇద్దరికి పెళ్ళిళ్ళు అయ్యాయి, చిన్నవాడి భార్య జరుగుతున్నదంతా గమనించి తన భర్త ను పిలిచి ఒక ఉపాయం చెప్పి ఆచరించమంటుంది, అలాగే అని చిన్నవాడు ఒక కర్రను తీసుకొని వెళ్లి మేత వేయకుండా ఆవును ముందు భాగంలో కొట్టడం ప్రారంభిస్తాడు, అప్పుడే పాలు పితుకుతున్న పెద్దవాడిని ఆ ఆవు తంతుంది, పాలు ఇవ్వదు, అప్పుడు ఎందుకు రా ఆవును కొడుతున్నావ్ అంటడు పెద్ద వాడు, ముందు భాగం నాది నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంట నీ కెందుకు అంటడు చిన్నవాడు , దీనితో విషయాన్ని అర్థం చేసుకున్న పెద్దవాడు సగం పాలు, పేడ ఇస్తానని ఒప్పుకుంటాడు, ఆతర్వాత చెట్టుకు నీళ్ళు పోయకుండా గొడ్డలితో నరుకుతుంటాడు చిన్నవాడు, అరె ఎందుకు రా చెట్టును నరికేస్తున్నావ్ అంటాడు పెద్ద వాడు నా మొదలు భాగం లో నేను నరుక్కుంటాను ఏమైనా చేసుకుంటాను అంటడు చిన్న వాడు, సగం పండ్లు ఇస్తా నని అంటడు పెద్దవాడు, ఆ రోజు ఉదయం కాకుండా సాయంత్రం గొంగాలిని ఉతికి ఆరేస్తాడు చిన్నవాడు, గొంగలి పచ్చిగా ఉండడంతో రాత్రి చలిలో పడుకుంటాడు పెద్దవాడు, అప్పుడు దారిలోకి వచ్చిన పెద్దవాడు, చిన్నవాడిని పిలిచి అతని వాట అతనికి ఇస్తాడు, ఈ కథలో పెద్దవాడు సీమంద్ర, చిన్నవాడు తెలంగాణా, మనం మన వాట అడుగనంత వరకు వాళ్ళు అలాగే దోచుకుంటారు,పోరాడే వరకు మనకు ఏది దక్కదు, ఆవును కొట్టినట్టుగా వీరి కుట్రలను తిప్పి కొట్టాలి, చెట్టును నరికినట్టుగా వీరి ఆర్థిక మూలాలను దెబ్బకొట్టాలి, సమైక్యంగా ఉండడం ద్వారా వారు పొందే ప్రయోజనాలను దెబ్బకొట్టాలి ఇలా చేయ గలిగితే సీమంద్ర పెట్టుబడి దారులు కూడా తోక ముడువక తప్పదు...

25, జనవరి 2013, శుక్రవారం

తెలంగాణా ప్రజలకు భారత గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు...

చిత్రం లో బాబా సాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రాజ్యంగ పరిషత్తు చైర్మెన్, మొదటి భారత రాష్ట్ర పతి శ్రీ. బాబు రాజేంద్ర ప్రసాద్ కు అందిస్తున్నారు, చిత్రంలో.. భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రు,పక్కన తొలి ఉప ప్రధాని , తోలి హోం మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్, పక్కన స్వతంత్ర భారత తోలి, చివరి గవర్నర్ జెనరల్, మద్రాస్ రాష్ట్ర ముఖ్య మంత్రి రాజగోపాల చారి (రాజాజీ), అంబేద్కర్ వెనకాల తొలి భారత విద్య శాఖ మంత్రి మౌలాన అబుల్ కలాం ఆజాద్....

24, జనవరి 2013, గురువారం

కాంగ్రెస్ పార్టీ లోకి జగన్?


-కె వి పీ ప్రయత్నాలు?
-అందుకే తెలంగాణా ప్రకటనకు బ్రేక్ ?

సీమంద్ర నాయకులంతా డిల్లి వెళ్లి రానున్న తెలంగాణా ప్రకటనను అడ్డుకున్నారు, మొదట్లో వారిని చూస్తేనే ఆగ్రహించిన డిల్లి పెద్దలు ఆ తర్వాత ఎందుకు మేత్తపడ్డారు..? ఉంటె ఉండండి లేదా వెళ్లి పొంది మేము కొత్త టీం ను వెతుకుంటం  అనే వరకు వచ్చిన వారు మల్లి వెనకడుగు ఎందుకు వేసినట్టు..? సీమంద్రలో ఎన్ని స్థానాల్లో పార్టీని గెలిపిస్తారు అంటే నీళ్ళు నములుకుంటూ వచ్చిన సీమండ్రులు ఎం మంత్రం వేసారు..? మొన్న నే ఆజాద్ క్లాసు పీకాడు, నిన్న మాట మార్చాడు ఒక్క రోజులో ఎం జరిగింది..? సీమంద్రుల డబ్బు సంచులు అందాయ..? లేక ఇంకేమైనా జరిగిందా..?
                        సీమంద్ర నాయకులందరిని డిల్లి తరలించి, డిల్లి పెద్దలతో అపాయింట్ మెంట్ ఇప్పించింది కె వి పీ, దీనంతటి వెనక కె వి పీ ఉన్నాడు, వై ఎస్ అర్ కు అత్యంత సన్నిహితుడైన కె వి పీ, జగన్ పార్టీ పెట్టిన తర్వాత కూడా కాంగ్రెస్ లోనే కొనసాగుతున్నారు, వై ఎస్ హయాంలో డిల్లి కి రిపోర్ట్ లు, డబ్బు మూటలు అందించిన కె వి పీ కి అధిష్టాన పెద్దలందరు బాగా పరిచయమే, సీమండ్రులు రాజీనామాలు చేసి అటు కేంద్రం లోను ఇటు రాష్ట్రం లోను ప్రభుత్వాన్ని పడగోడుతం అని బెదిరిస్తే కేంద్రం వెనకడుగు వేసిన్ధనుకోవడం సరి కాదు.
                  విశ్వసనీయ సమాచారం ప్రకారం " సీమంద్రలో ఎన్ని స్థానాలను ఇస్తారు అనే కేంద్రం ప్రశ్నకు సీమండ్రులు సమాధానం చెప్పలేక పోయారు, ఒకానొక దశలో కేంద్రం మీరు వెళ్లి పోతే వెళ్లి పొండి  మేం కొత్త టీం వెతుక్కుంటం అన్నది, అయితే కె వి పీ వారికి చెప్పింది ఏమంటే, సీమంధ్ర లో జగన్ హవా చాల ఉంది, తెలంగాణా ఇచ్చిన మరుక్షణం చాల మంది నాయకులు ఈ కారణంతో జగన్ పార్టీ లోకి వెళ్తారు, కొత్త టీం ఏర్పాటు చేసుకోవడానికి కనీసం నాయకులు లేకుండా పోతారు, కాంగ్రెస్ పార్టీ మొత్తంగా తుడిచి పెట్టుకు పోతుంది, కాని రాష్ట్రాన్ని సమైక్యం గా ఉంచితే తెలంగాణా లోని అందరు నాయకులు టి అర్ ఎస్ లోకి వెళ్లరు, తెలంగాణా సెంటిమెంట్  బలంగా ఉండడం వళ్ళ చాల మంది నాయకులు జగన్ పార్టీ లోకి వెళ్ళడం లేదు, అలాగే హైదరాబాద్ నాయకులు టి అర్ ఎస్ లోకి వెళ్లరు, కాబట్టి వాళ్ళు అవకాశం దొరికితే జగన్ పార్టీలోకి వెళ్ళడానికి సిద్ధం గా ఉన్నారు, మీరు తెలంగాణా ఇవ్వక పోయినా పెద్ద గా పార్టీ కి నష్టం లేదు, ఒక ఆరు నెలలు పోలీస్ బలగాలతో ఉద్యమాన్ని అనచివేయండి, నాకు జగన్ కొడుకు లాంటి వాడు, నేను ఏది చెప్పిన కాదనదు, నేను జగన్ ను ఆరు నెలల్లో కాంగ్రెస్ లోకి తీసుకొని వస్తా, కాంగ్రెస్ నుండి బయటకు వెళ్తున్న సీమంద్ర నాయకులు, తెలంగాణా లో బయటకు వెళ్లాలనుకునే నాయకులు జగన్ కాంగ్రెస్ లోకి వస్తే కాంగ్రెస్ లోనే ఉంటారు, దూరమైనా ఎం ఐ ఎం కూడా మల్లి దగ్గరవుతుంది, కాబట్టి 2014 లోను కాంగ్రెస్ విజయం సాదిస్తుంది, కాబట్టి జగన్ ను పార్టీ లోకి తీసుకు వచ్చే భాద్యత నాది." ఇది కె వి పీ మంత్రాంగం, అందుకే మీ దగ్గర ఉన్న ఈ విషయాలను ముందే మాకు ఎందుకు చెప్పలేదు అని వాయిలార్ రవి అన్నారు, అవే విషయాలను నిన్న సోనియా తో చర్చించి బయటకు వచ్చిన ఆజాద్ మాట మార్చాడు... 
              ఈ కధనం జనవరి 24 న రాసి పోస్ట్ చేశాను, 25 వతేదిన ఇదే కంటెంట్ తో "జగన్ పై రామ బాణం" అనే పేరుతో సూర్య పత్రికలో కథనం వచ్చింది...

23, జనవరి 2013, బుధవారం

మరో మోసం..!


తెలంగాణపై కేంద్రం నిర్ణయం తీసుకుంటుందని ఎదురు చుసిన తెలంగాణా ప్రజలకు మరో సారి నిరాశే ఎదురయ్యింది, కేంద్రం, కాంగ్రెస్ పార్టీ తెలంగాణా ప్రజలను మరోసారి ధోకా చేసింది, 28 లోపే తెలంగాణా పై ఏదో ఒక నిర్ణయం వెలువడుతుందని ఎదురుచుసారు తెలంగాణా వాదులు, తెలుగు మీడియా కేంద్రం తెలంగాణా ఇవ్వాలనే నిర్ణయం తీసుకుందని ప్రకటనే తరువాయి అని ఊదరగోట్టడం తో కాంగ్రెస్ తెలంగాణా ఇవ్వదు అనుకునే వారు సైతం తెలంగాణా ప్రకటన వస్తుందని ఆశగా ఎదురు చూసారు, ఈ డబ్బు స్వామ్యంలో ప్రజల ఆశలకు ఆకాంక్షలకు విలువ లేదు, కేవలం డబ్బు సంచులతోనే పని, డబ్బు చేతులు మారడం ఆలస్యం నెలకు 30 రోజులు కాకుండా పోతాయి, వారానికి 7 రోజులు కాకుండా పోతాయి. 
                         గత నెల FDI లపై ఓటింగ్ సందర్భంలో తెలంగాణా రాష్ట్ర సమితి కాంగ్రెస్ కు వ్యతిరేఖం గా ఓటు వేయ్యడం, టి కాంగ్రెస్ ఎం పీ ల ఒత్తిడి తో హోం మంత్రి షిండే 28 న అఖిల పక్షం నిర్వహిస్తామని హామీ ఇచ్చారు, హామీ ప్రకారం 28 ఆ భేటి జరిగింది, అఖిలపక్షం వట్టి డ్రామా అని టి అర్ ఎస్, బి జె పీ, సి పీ ఐ లు  మొదటినుండే చెబుతున్నాయి, అఖిలపక్షం అనంతరం అసంతృప్తి తో కె సి అర్ తెలంగాణా బంద్ కు పిలుపు ఇచ్చాడు, అఖిల పక్షం వాళ్ళ ఒరిగేదేమీ లేదని, ఇది మరో డ్రామా అని చెప్పారు, అఖిలపక్షంలో నిజానికి సీమంద్రకు చెందిన టి డి పీ, వై సిపీ లు సరైన అభిప్రాయాన్ని చెప్పలేదు, 2008 లో ఇచ్చిన లేఖ ఇంకా కేంద్రం వద్ద నే ఉందని దాని ఆధారంగా నిర్ణయం తీసుకోవాలని చంద్రబాబు లెటర్ ఇచ్చారు, కాని తెలంగాణా రాష్ట్రాన్ని ఇవ్వండి మేము మద్దతు ఇస్తామని రాయలేదు, అ అస్పష్ట లేఖ సాయం తో తెలంగాణా జిల్లాల్లో జరిగిన పాదయాత్రను పూర్తి చేసుకొని వెళ్ళిపోయాడు, ఇక జగన్ పార్టీ కి ఒక అభిప్రాయం అంటూ లేదు, నెల రోజుల్లో నిర్ణయం వెల్లడిస్తామని చెప్పిండు షిండే, టైం దగ్గర పడుతున్న కొద్ది సీమంద్ర కుట్రలు మొదలయ్యాయి, సమైక్యంద్ర అని ఒకడు, విశాలాంద్ర అని ఒక్కడు, హైదరాబాద్ రాష్ట్రం అంటూ ఇంకొకడు, హైదరాబాద్ ప్రజల రెఫరెండం అంటూ ఇంకొకడు, ఇలా కుట్రలకు తెరలేచింది, సీమంద్రమీడియా  అతి ప్రచారం జోరందుకుంది, హైదరాబాద్ లో పూర్తి పోలీస్ రక్షణల మధ్య వారి సభల నిర్వహణ ముఖ్య మంత్రి దగ్గరుండి పర్యవేక్షించుకున్నాడు, తెలంగాణా జె ఎ సి మాదురిగా సమైక్యంద్ర జె ఎ సి, మహిళా నాయకురాలితో జాగృతి, విద్యార్థి జె ఎ సి, సమైక్యంద్ర ఎన్ జి వో సంఘాలు ఏర్పాటు చేసుకొని ఉద్యమాన్ని ఉదృతం చేస్తారట, లక్ష మంది తో హైదరాబాద్ లో సభ నిర్వహిస్తారట..? మంత్రి గంటా ఉవాచ..
                        డిల్లి లో కాంగ్రెస్ పెద్దలను కలిసిన సీమంద్రులకు నిరాశ ఎదురవుతుందని, వారికి క్లాసు పీకి పంపుతున్నారని మీడియా కోడై కూసింది, ఇప్పటికైనా కేంద్రం తెలంగాణా పై నిర్ణయం తీసుకుందని, ఆనందించిన తెలంగాణా ప్రజలకు మరో సారి నిరాశే ఎదురయ్యింది, సీమండ్రుల డబ్బుకు భారత కాలమనమే మారిపోయింది, డబ్బు ఉంటె నెలకు 30 రోజులు కావు, ఎన్ని రోజులైనా కావచ్చు, డబ్బు చేతిలో పడితే వారానికి 7 రోజులు కావు భారత ప్రభుత్వం దాన్ని మార్చేస్తుంది.
                                    మరోసారి ప్రజాస్వామ్యం సీమంద్రుల డబ్బుకు అమ్ముడు పోయింది, తెలంగాణా ఆశలను ఆకాంక్షలను కాలరాసింది, మీరెప్పుడు సీమంద్రులకు బానిసలే అని చాటి చెప్పింది, మాకు ప్రజల ఆకాంక్షల కంటే డబ్బే ముఖ్యం అని నిరూపించుకుంది, భారత ప్రభుత్వం డబ్బు ఇస్తే ఏమైనా చేస్తుంది అని నిరూపించుకుంది , ప్రపంచం లో వేరే దేశాలలో డబ్బుతో జరగని ఎన్నో పనులు ఇక్కడ జరుగుతాయి, నమ్మి ఓటేసిన తమ ప్రజలనే మోసం చేసేంత గొప్పగా అమ్ముడు పోతుంది ఈ ప్రభుత్వం, ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్యం భారత దేశం, అలాగే ప్రపంచం లో డబ్బుకు అమ్ముడు పోయే అతి పెద్ద ప్రజా స్వామ్యము భారత దేశమే, ఇది నేడు ఎంతగా అమ్ముడు పోయిందంటే, ఈ ప్రభుత్వంలోని ఆరోగ్య శాఖ మంత్రి గారు ఏకంగా నెల రోజుల అర్థాన్నే మార్చేసారు, ప్రపంచం అంత నెల రోజులు అంటే 30 రోజులు అనుకోవడం సహజం కాని నెల అంటే 30 రోజులు కాదంట నెల అంటే వారికి నచ్చినన్ని రోజులు, ఇంకేం ప్రకటన వస్తుంది మన చచ్చిపోయిన పాములు(తెలంగాణా కాంగ్రెస్ లీడర్స్) తెలంగాణా ఎం తెస్తాయి..?అవి చావవు, తెలంగాణా తేవు.
                    ఇక ఇన్ని రోజులు ఏదో జరుగుతుందని ఎదురు చుసిన ఉద్యమ కారులు తమ డప్పులకు దుమ్ము దులుపి ధరువేస్తే ప్రజలంతా ఉద్యమం చెయ్యడానికి సిద్ధంగా ఉన్నారు, ఇక తెలంగాణా ప్రజల ముందు ఉన్న ఏకైక కర్తవ్యం కాంగ్రెస్ ను అంతం చెయ్యడం.. "కాంగ్రెస్ కో కథం కరో, తెలంగాణా హాసిల్ కరో".

21, జనవరి 2013, సోమవారం

ఎం ఐ ఎం పై ఒక విశ్లేషణ...

                                                                                                                      - from HMTV

20, జనవరి 2013, ఆదివారం

తెలంగాణా పోరాట యోధులు..

స్వామి రామానంద తీర్థ:

స్వామి రామానంద తీర్థ స్వాతంత్య్ర సమరయోధుడు. హైదరాబాద్ సంస్థాన విమోచనానికి పాటుబడ్డ మహా నాయకులు. రామనంద తీర్థ 1903 అక్టోబర్ 3న గుల్బర్గా జిల్లా జాగిర్ గ్రామంలో జన్మించారు. ఆయన తండ్రి సన్యాసం స్వీకరించడంతో బంధువుల ఔదార్యంతో విద్యాభ్యాసం కొనసాగించారు. 

రామానంద కమ్యూనిస్టు భావాలున్న హిందూ సన్యాసి. ఆయన అసలు పేరు వెంక భగవాన్‌రావు ఖెడ్గికర్. మొదట లోకమాన్య బాల గంగాధర తిలక్‌ను ఆదర్శంగా తీసుకున్నారు. అలాగే, గాంధీజీ ప్రారంభించిన సహాయ నిరాకరణ ఉద్యమంలోనూ పాల్గొన్నారు. కార్మిక నాయకుడు ఎన్‌ఎం జోషితో కలసి కార్మికోద్యమంలో పాల్గొన్నారు. 

1938లో కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్‌లో తన శాఖను ప్రారంభించిన అనంతరం తీర్థ నిజాంకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమించారు. విద్యాలయాలను నెలకొల్పడంతో పాటు ఆర్యసమాజ్‌తో కలసి ఉద్యమించారు. హైదరాబాద్ రాష్ట్రం భారత యూనియన్‌లోవిలీనం కావడంలో ఆయన ఎనలేని కృషి చేశారు. చివరకు 22 జనవరి 1972న రామానందతీర్థ శాశ్వతంగా కన్నుమూశారు. 

పండిట్ నరేంద్ర జీ:

పండిట్ నరేంద్ర జీ 1907 ఏప్రిల్ 10న హైదరాబాద్‌లో జన్మించారు. చిన్నతనంలోనే ఆర్యసమాజ్ పట్ల ఆకర్శితుడై సంస్థ ఉపాధ్యక్షునిగా సేవలందించారు. నిరంకుశ నిజాం పాలనకు వ్యతిరేకంగా ఎన్నో ఉద్యమాలు చేశారు. హైదరాబాద్ ఉక్కుమనిషిగా ఈయనను పిలుస్తారు. 

1938లో నిజాం ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాడినందుకు 3 సంవత్సరాలు మన్ననూరు జైలుకు వెళ్లవలసి వచ్చింది. జైలునుండి వచ్చాక వైదిక దర్శనం పేరుతో పత్రిక పెట్టి దాని ద్వారా నిజాం నిరంకుశత్వాన్ని తీవ్రంగా నిరసించారు. దీంతో నిజాం, పత్రిక మూత వేయడంతో పాటు ఆస్తులన్నీ జప్తు చేశాడు. అయినా ఆయన ఉద్యమాన్ని వదలలేదు. 

హైదరాబాద్ రాజ్యం విముక్తి కోసం తీవ్రంగా కృషి చేశారు. 1947లో మళ్లీ జైలుకు వెళ్లవలసి వచ్చింది. హైదరాబాద్ భారత యూనియన్‌లో కలిసిన తర్వాత నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడుగా నరేంద్రజీ పనిచేశాడు. 1952లో హైదరాబాద్ రాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యారు. 1975లో రాజకీయాలకు స్వస్తి చెప్పి సన్యాసం స్వీకరించాడు. 1976 సెప్టెంబర్ 24న ఆయన తుదిశ్వాస విడిచారు.

అమృతలాల్ శుక్లా:

కరీంనగర్ జిల్లా సిరిసిల్లాకు చెందిన అమృతలాల్ శుక్లా తెలంగాణ సాయుధ పోరాటంలో మడమతిప్పని సేనాని. తన సాయుధ దళంతో నిజాం సైనికులను ముప్పుతిప్పలు పెట్టిన వీరుడు. తన దళంతో సిరిసిల్ల, ఇల్లంతకుంట పోలీస్‌స్టేషన్ క్యాంపులపై దాడులు చేసి నిర్భంధంలో ఉన్న వారిని విడుదల చేయించారు. హుజురాబాద్ తాలుకా పరిధిలోని సైదాపూర్, నిమ్మపల్లి తదితర ప్రాంతాల్లోని పోలీస్ క్యాంపులపై అక్కడి సమరయోధులు దాడులు చేశారు. నిజాం రాజ్యంలో ఇవి పెను సంచలనాన్ని సృష్టించాయి. అమృతలాల్ శుక్లా గెరిల్లా దళానికి నాయకునిగా వ్యవహరించారు. నిజాం ప్రభుత్వం ఆయనను అరెస్ట్ చేసి 13 ఏళ్ల పాటు జైలు శిక్ష విధించింది. ఆయనను చంచల్‌గూడ జైలు నుంచి తరలిస్తుండగా సికిందరబాద్ రైల్వేస్టేషన్ నుంచి తప్పించుకున్నారు. అలా అమృతలాల్ తిరిగి పోరాటంలో భాగస్వామి అయ్యారు.
ఉప్పల రామయ్య:

జమీందారీ వ్యవస్థకు వ్యతిరేకంగా సాయుధ రైతాంగ పోరాటంలో కీలక పాత్ర వహించిన వారిలో నల్గొండ జిల్లా మునగాలకు చెందిన ఉప్పల రామయ్య ఒకరు. 1905లో జన్మించిన రామయ్య ఆనాటి మునగాల పరగణా జమీందారులకు వ్యతిరేకంగా ఉద్యమించారు. 1929లో పరగణా జమీందారు నాయని రంగారావు గ్రామానికి చెందిన ఇమ్మడి పాపయ్యతో పాటు మరి కొంతమంది రైతుల భూములను బలవంతంగా లాక్కున్నారు. దీనికి నిరసనగా రామయ్య తొలిసారి సత్యక్షిగహం చేశారు. అయితే, నాటి బ్రిటీష్ ప్రభుత్వం రామయ్యతో పాటు రైతులపై కేసులు నమోదు చేసింది. రామయ్య విద్యాభివృద్ధికి కూడా ఎనలేని సేవ చేశారు. గ్రామంలో ఎలిమెంటరీ పాఠశాలను ఏర్పాటు చేశారు. 

సాయుధ పోరులో ఆరుట్ల, దేవులపల్లి వెంక కలసి పనిచేసిన రామయ్య సాయుధ దళాలకు మందుగుండు సరఫరా చేయడంలో ప్రధాన భూమిక పోషించారు. నాటి ప్రభుత్వం ఆయనపై కేసులు బనాయించి జగ్గయ్యపేట జైలులో నిర్భంధించి కనీసం ఆహారం కూడా అందివ్వకపోవడంతో 1948 సెప్టెంబర్ నెలలో కన్నుమూశారు. స్థానిక విద్యార్థులు చందాలు వేసుకుని ఆయన దహన సంస్కారాలు నిర్వహించాల్సి రావడం పెద్ద విషాదం. ఆయన జ్ఞాపకార్థం మునగాలలో విగ్రహన్ని నెలకొల్పారు.

సర్వదేవభట్ల రామనాథం:


పుట్టింది జమీందారీ కుటుంబంలో అయినప్పటికీ నైజాం సర్కార్ రజాకార్లు సాగిస్తున్న దురాగతాలకు వ్యతిరేకంగా పోరాడిన తెలంగాణ కమ్యూనిస్టు నాయకుడు సర్వదేవభట్ల రామనాథం. నిజాం పాలన, జమీందార్, జగీర్ధార్ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడుతున్న కమ్యూనిస్టు ఉద్యమాల పట్ల ఆకర్షితులై పార్టీలో చేరి ఉద్యమించారు. లక్షలాది రూపాయల విలువైన తమ ఆస్తిని, వందలాది ఎకరాల భూమిని పేదలకు పంచిన గొప్ప త్యాగమూర్తి. పార్టీ కార్యక్షికమాలతో పాటు సింగరేణి కార్మికుల సమస్యల పట్ల రాజీలేని పోరాటాలు నిర్వహించిన యోధుడు. 
కార్మిక హక్కులకోసం పలువురు కమ్యూనిస్టు నాయకులతో కలసి ‘సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్’ పేరుతో కార్మిక యూనియన్‌ను స్థాపించి ప్రప్రథమ అధ్యక్షునిగా 1945లో ఎన్నుకోబడ్డారు. 1947లో అరెస్ట్ కాబడి 1948 వరకు జైలు జీవితం గడిపారు. 1948 నుండి 1949 వరకు రహస్య జీవితం గడిపారు. ఆయన ఆదర్శ కమ్యూనిస్టు. కమ్యూనిస్టు ఉద్యమ స్ఫూర్తిదాత. తన యావదాస్తిని పేదలకు పంచి తనకంటూ ఏమీ లేకుండా తన చివరి ఊపిరి వరకు ప్రజల కోసం పనిచేసిన త్యాగశీలి. 
రాంజీగోండు:

అడవి బిడ్డలను దోచుకుంటున్న నిజాం ప్రభుత్వ దమననీతికి వ్యతిరేకంగా ఉద్యమం నెరపిన వీరుడు రాంజీగోండు. ఆయన ఆదిలాబాద్ జిల్లాలో తెలంగాణ సాయుధపోరాటానికి ఊపిరిలూదిన విప్లవసేనాని. నిర్మల్ పట్టణాన్ని కేంద్రంగా చేసుకొని రజాకార్లకు వ్యతిరేకంగా ఉద్యమించారు. 

రాంజీగోండు నాయకత్వంలో గోండులు బ్రిటీష్ వారికి తొత్తులుగా ఉంటూ నైజాం సంస్థానాన్ని నడిపించిన వారిపై తిరగబడ్డారు. ‘జల్-జమీన్-జంగల్’ కోసం గిరిజనుల తరఫున పోరాడిన ఆయన పోరాటాలు, త్యాగాలు చిరస్మరణీయం. 

నిజాం పాలకులకు వ్యతిరేకంగా పోరాడినందుకు గాను 1880 ఏప్రిల్‌లో నాటి నైజాం ముష్కరులు రాంజీగోండుతో పాటు ఆయన వెయ్యిమంది అనుచరులను మర్రిచెట్టుకు సామూహికంగా ఉరి తీశారు. తరువాత ఆ మర్రినే ‘గోండ్ మర్రి’, ‘ఉరుల మర్రి’ అని పిలిచేవారు. ప్రస్తుతం ఆ చెట్టు లేదు. దాని స్థానంలో అమరవీరుల స్థూపాన్ని నిర్మించారు.

టి.బి. విఠల్‌రావు:

ప్రపంచ కార్మికోద్యమంలో మిలిటెంట్ పోరాటాలను మిలితం చేసి అనేక హక్కులు సాధించుకున్న సింగరేణి కార్మికులకు తెలంగాణ సాయుధ పోరాటమే స్ఫూర్తినిచ్చింది. సీపీఐ అనుబంధ సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ నాయకత్వంలో సింగరేణిలో అనేక ఉద్యమాలు జరిగాయి. 

నిజాం నవాబుతో పాటు స్థానిక గ్రామీణ భూస్వాముల పెత్తనం కింద ఉన్న సింగరేణి సంస్థలో 1939 నుంచే ఉద్యమాలు మొదలయ్యాయి. తొలి తరం కార్మిక నాయకులలో టి.బి. విఠల్‌రావు ఒకరు. ఒకవైపు తెలంగాణ సాయుధ పోరాటంతో పాటు సింగరేణి కార్మిక హక్కుల కోసం ఉద్యమించిన నేత విఠల్‌రావు. పనిగంటల తగ్గింపు, పనికి తగిన వేతనం, కార్మికులకు వసతులు వంటి వాటికోసం ఆయన ఉద్యమించారు. రహస్య జీవితాన్ని గడుపుతూనే ఆయన కార్మిక హక్కుల కోసం ఉద్యమించారు. 


సింగరేణి తొలినాళ్లలో వెట్టిచాకిరీకి వ్యతిరేకంగా నిర్బంధాలను ఎదిరించిన నాయకుడిగా విఠల్‌రావును కార్మికులు గుర్తు చేసుకుంటారు. తెలంగాణ సాయుధ పోరాటం జరుగుతున్న సమయంలోనే ఇటు సింగరేణి సంస్థలో కార్మిక హక్కుల కోసం పోరాడిన యోధుడాయన!

బత్తుల సాయన్న వెంకట్ రావు :

బత్తుల సాయన్న వెంకట్ రావు 1900 డిసెంబర్ 11న సికిందరబాద్‌లోని న్యూబోయిగూడలో సాయన్న, ముత్తమ్మలకు జన్మించారు. వెంకవూటావు ఎనిమిదవ తరగతి వరకు చదివినప్పటికీ, ఆయన సొంత ప్రతిభతో నిజాం ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా కూడా పనిచేశారు. జోగిని వ్యవస్థను ప్రభుత్వం నిషేధించేటట్టు వెంకవూటావు చేయగలిగారు. ఆయన ఆది హిందూ సోషల్ సర్వీస్ లీగ్, మన్నసంఘం, స్వస్తదళ్ యువజన సంఘం, హైదరాబాద్ దళిత జాతి సంఘం, అరుంధతీయ యువజన సంఘం వంటి సంఘాలతో కలిసి పనిచేశారు. 

బొంబాయి మహర్ సదస్సుకు అధ్యక్షత వహించే అరుదైన గౌరవం ఆయనకు దక్కింది. ‘ఆది హిందూ సోషల్ సర్వీస్ లీగ్’ బి.ఎన్. వెంకవూటావుకు ‘వీరరత్న’, నిజాం ప్రభుత్వం ‘ఖుస్రూ-ఎ- దక్కన్’ అనే అరుదైన బిరుదులతో సన్మానించింది. 1947లో లాయక్ అలీ మంత్రివర్గంలో చేరి విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలను నిర్వహించారు. హైదరాబాద్‌లో జరిగిన భారత మిలటరీ యాక్షన్‌లో గృహ నిర్బంధానికి గురయ్యారు. ఆ తర్వాత 1951లో ఇండిపెండెంట్‌గా రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఆల్వాల్ సమీపంలో తన స్థలాలను పేదలకు విరాళంగా ఇచ్చారు. 1953 నవంబర్ 4న ఆయన తనువు చాలించారు.

వానమామలై జగన్నాథచార్యులు:
‘రైతు వాల్మీకి’గా పేరుగాంచిన వానమామలై జగన్నాథచార్యులు శ్రీరాముణ్ని రైతుగా అభివర్ణిస్తూ ‘రైతు రామాయణం’అనే గొప్పకావ్యం రాశారు. ఆయన కరీంనగర్ జిల్లాలోని హుజురాబాద్‌లో 1908 డిసెంబర్ 19న సీతారామమ్మ, బక్కయ్యశాస్త్రీలకు మూడవ సంతానంగా జన్మించారు. వానమామలై వరదాచార్యులకు వీరు స్వయనా సోదరుడు. తెలుగు, సంస్కృతం, హిందీ, ఉర్దూ, తమిళం, ఇంగ్లీషులో ఆయనకు ప్రవేశం ఉంది. తెలంగాణ రైతాంగ పోరాటంలో పాల్గొంటూ హరికథలు చెబుతూ, పాటలు పాడుతూ నాటి పోరాట యోధులను ఉత్సాహ పరిచేవారు. నైజాం సర్కార్ నిర్భంధానికి గురి చేయడంతో మహారాష్ట్రలోని చాందకు వెళ్లి అజ్ఞాతవాసం గడిపారు. నాడు రైతులు అనుభవించిన బాధలు, అనుభవాలతో జగన్నాథచార్యులు ‘రైతు రామాయణం’ కావ్యం రచించారు. ఈ కావ్యం మొత్తం తెలంగాణ సంప్రదాయ రీతిలో కొనసాగింది. జిల్లాలోని జూలపల్లి వరాహస్వామిని కీర్తిస్తూ శతకాలు, 1968లో ఇల్లంతకుంట సీతారామస్వామి సుప్రభాతం రాయడంతో పాటు 1971లో గోదాదేవి రచించిన తిరుప్పావణిని తెలుగీకరించారు. ‘రైతు రామాయణ’ కావ్యానికి 1984లో సాహిత్య అకాడమీ అవార్డు లభించింది.
                                                                  -from namaste telangana

19, జనవరి 2013, శనివారం

సమైక్యాంద్ర ఉద్యమం కృత్రిమమే : బైరెడ్డి


కొంత మంది పెట్టుబడిదారులు మాత్రమే తెలంగాణను అడ్డుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారని, సమైక్యాంధ్ర ఉద్యమం కృత్రిమ ఉద్యమేనని రాయలసీమ హక్కుల వేదిక నేత బైరెడ్డి రాజశేఖరరెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. పెద్దరాష్ట్రాలకు సీఎం, మంత్రులు కావాలనుకునేవారే ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని, వందల సంఖ్యలో విద్యార్థులు, యువకులు చనిపోతుంటే పట్టించుకోకుండా స్వార్థకోసం రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. పెద్ద రాష్ట్రాల్లో పదవులను అనుభవించి అక్రమంగా దండుకోవాలనేవారే సమైక్యవాదాన్ని వినిపిస్తున్నారని బైరెడ్డి ఆరోపించారు. కోస్తా నేతల ఎంగిలి మెతుకులకు కక్కుర్తి పడి సీమ నేతలు సమైక్య వాదాన్ని వినిపిస్తున్నారని ఫైర్ అయ్యారు. తెలంగాణ ఇచ్చినా, ఇవ్వకపోయినా ప్రత్యేక రాయలసీమ ఏర్పాటు చేయాలని బైరెడ్డి డిమాండ్ చేశారు.