హోం

15, జనవరి 2013, మంగళవారం

యూపీఏ నుంచి తెలంగాణకు మొదటి మద్దతు ..


- అఖిలపక్షం తర్వాత యూపీఏ నుంచి తెలంగాణకు మొదటి మద్దతు
- కాంగ్రెస్‌పై మరింత ఒత్తిడి
- ప్రభావం చూపనున్న కీలక భాగస్వామి నిర్ణయం
- ఇతర పార్టీలూ మద్దతుగా నిలిచే అవకాశం

 తెలంగాణ ఏర్పాటుకు యూపీఏలో కీలక భాగస్వామి బహుజన్ సమాజ్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. తెలంగాణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెడితే మద్దతునిస్తామని స్పష్టం చేసింది. చిన్న రాష్ట్రాల ఏర్పాటును తాము కోరుకుంటున్నామని బీఎస్పీ అధినేత్రి, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతి మంగళవారం మరోమారు స్పష్టం చేశారు. తన యాభై ఏడో పుట్టినరోజును పురస్కరించుకుని ఢిల్లీలో ఓ హోటల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. 

తెలంగాణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెడితే బీఎస్పీ ఎంపీలంతా మద్దతునిస్తారని తెలిపారు. చిన్న రాష్ట్రాలు, తెలంగాణ గురించి ఆమె వివరంగా మాట్లాడారు. ‘‘మా పార్టీ మొదటినుంచి చిన్న రాష్ట్రాలకు అనుకూలంగానే ఉంది. చిన్న రాష్ట్రాలు, చిన్న జిల్లాలు ఉండటం వల్లనే దేశంలో పరిపాలన క్షేత్ర స్థాయిలోకి వెళుతుంది. మేము అధికారంలో ఉన్నప్పుడు ఉత్తరప్రదేశ్‌ను నాలుగు రాష్ట్రాలుగా విభజించాలని అసెంబ్లీ తీర్మానాన్ని కేంద్రానికి పంపాం. పశ్చిమ యూపీ, బుందేల్‌ఖండ్, పూర్వాంచల్, మధ్యాంచల్ ప్రాంతాలను రాష్ట్రాలుగా చేయాలని కేంద్రాన్ని కోరాం. ఆంధ్రప్రదేశ్ కూడా వైశాల్యంలో పెద్ద రాష్ట్రం. అక్కడ దశాబ్దాల కాలంగా స్వరాష్ట్రం కోసం తెలంగాణ ప్రజలు ఉద్యమాలు చేస్తున్నారు. మేము గతంలోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మద్దతు తెలిపాం. ఇప్పుడు కూడా పార్లమెంటులో తెలంగాణ బిల్లు ప్రవేశపెడితే మా పార్టీ పూర్తి మద్దతు తెలుపుతుంది’’ అని వివరించారు. ఈ సమావేశంలో ఆమె జాతీయ రాజకీయాలతో పాటు, ఉత్తరప్రదేశ్‌కు సంబంధించిన పలు అంశాలపై మాట్లాడారు.

మాయావతి ప్రకటనతో కాంగ్రెస్‌పై మరింత ఒత్తిడి :
తెలంగాణపై అఖిలపక్ష సమావేశం తర్వాత జాతీయస్థాయిలో బీఎస్పీ మద్దతు ప్రకటించడం కొత్త పరిణామాలకు దారితీస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. యూపీఏలో కీలక భాగస్వామి అయిన ఈ పార్టీ సానుకూలంగా స్పందించడంతో కాంగ్రెస్‌పై ఒత్తిడి మరింత పెరుగుతుందనేది స్పష్టం. అలాగే ఇతర పార్టీల నుంచి కూడా మద్దతు లభించే అవకాశాలున్నాయి. తెలంగాణ ప్రకటనకు మరికొద్ది రోజులు మాత్రమే గడువున్న నేపథ్యంలో మాయావతి ప్రకటన తెలంగాణవాదుల్లో ఆనందాన్ని నింపింది. బీఎస్పీ మొదటినుంచి తెలంగాణకు మద్దతునిస్తున్నా.. ఈ సమయంలో ఇలా ప్రకటించడం ఎంతో కీలకమని విశ్లేషకులు భావిస్తున్నారు. మాయావతి ప్రకటనతో కాంగ్రెస్ పార్టీపైన మరింత ఒత్తిడి పెరిగినట్లయిందంటున్నారు. ఎప్పుడూ ఏదో వంక పెట్టి తప్పించుకుందామనుకునే కాంగ్రెస్ మాయావతి ప్రకటనను తేలికగా తీసుకునే అవకాశం లేదని అభిప్రాయపడుతున్నారు.

ఆమె ప్రకటన యూపీఏలోని ఇతర భాగస్వామ్యపక్షాలపై కూడా ప్రభావం చూపుతుందని, పలు పార్టీలు తెలంగాణకు అనుకూలంగా స్పందించే అవకాశముందని విశ్లేషకుల అంచనా. యూపీఏ భాగస్వామ్యపక్షాలైన ఎన్సీపీ, డీఎంకే తదితర పార్టీలకు కూడా తెలంగాణలో దశాబ్దాలుగా జరుగుతున్న పోరాటాల పట్ల పూర్తి అవగాహన ఉందని, శరద్‌పవార్ లాంటి నాయకులు గతంలో తెలంగాణకు బహిరంగ మద్దతు తెలిపిన విషయాన్ని వారు గుర్తుచేస్తున్నారు. మరోవైపు.. పార్లమెంటులో సాధారణ మెజారిటీతో కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేయవచ్చని రాజ్యాంగ నిబంధన (ఆర్టికల్ మూడు) ఉన్నందున ములాయంసింగ్ లాంటివారు వ్యతిరేకించినా కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించి తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సి ఉంటుందంటున్నారు. అదే దిశగా కాంగ్రెస్ పార్టీ ఆలోచనలు కొనసాగుతున్నట్లు సమాచారం.

                         యు పీ ఏ లో మరో కీలక భాగస్వామి లాలూ ప్రసాద్ యాదవ్ గతం లోనే తెలంగాణకు మద్దతు ప్రకటించిన విషయం తెలిసినదే...http://www.naatelangaana.blogspot.in/2011/11/blog-post_3237.html

10, జనవరి 2013, గురువారం

ఆదిలాబాద్ జైలుకు అక్బర్


-ఖైదీ నంబర్ 7546
-22 వరకూ రిమాండ్
-ఆదిలాబాద్ కోర్టు ఆదేశం
- మొత్తం ఏడు సెక్షన్ల కింద అభియోగాలు
- హైదరాబాద్‌లోని ఆస్పత్రికి తరలించండి
- అక్బరుద్దీన్ తరపు న్యాయవాది పిటిషన్
- చెంచల్‌గూడ జైలుకు మార్చాలని వినతి
- రెండు పిటిషన్‌లనూ కొట్టేసిన మేజిస్ట్రేట్
- జిల్లా జైల్లోనే మెరుగైన వైద్యానికి ఆదేశాలు
- రాత్రంతా నిర్మల్ ఠాణాలోనే అక్బర్
- ఉదయం ఐదున్నరకు మేజిస్ట్రేట్ ముందుకు
- ఆయన ఆదేశాలతో ఏడున్నరకు జైలుకు

ఆదిలాబాద్, జనవరి 9 (టీ మీడియా): విద్వేష ఉపన్యాసాలు చేసిన కేసులో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీకి 14 రోజుల రిమాండ్ విధిస్తూ ఆదిలాబాద్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. జైలుకు బదులు అక్బర్ను ఆస్పత్రికి తరలించాలన్న పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది. మంగళవారం సాయంత్రం హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో అరెస్టు చేసిన అక్బరుద్దీన్‌ను అదే రోజు రాత్రి నిర్మల్ పోలీస్ స్టేషన్‌కు తరలించిన సంగతి తెలిసిందే.

రాత్రి స్టేషన్‌లోనే గడిపిన అక్బరుద్దీన్‌ను ఉదయం 5.15 గంటలకు జిల్లా అదనపు ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ అజేష్ కుమార్ ఎదుట ప్రవేశపెట్టారు. మేజిస్ట్రేట్ జనవరి 22 వరకూ జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో అక్బర్‌ను ఆదిలాబాద్ జిల్లా జైలు కు ఉదయం 7.30 గంటలకు తరలించారు. అక్కడ ఆయనకు అండర్ ట్రయల్ ఖైదీ నంబర్ 7546ను కేటాయించారు. అంతకు ముందు ఆయనను ఏడు రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై గురువారం విచారణ జరుగనుంది. అక్బరుద్దీన్‌కు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ ఆస్పత్రికి తరలించాలని వేసిన పిటిషన్‌తోపాటు.. ఆదిలాబాద్ జిల్లా జైలు నుంచి చెంచల్‌గూడ జైలుకు తరలించాలని దాఖలు చేసిన పిటిషన్‌ను కూడా మేజిస్ట్రేట్ తిరస్కరించారు. ఆయనకు మెరుగైన వైద్య సదుపాయాలు అందజేయాలని జిల్లా జైలు సూపరింటెండెంట్‌ను ఆదేశించారు.

తొలుత ఐపీసీలోని 121, 153-ఏ సెక్షన్ల కింద అక్బరుద్దీన్‌ను అరెస్టు చేసిన నిర్మల్ పోలీసులు.. విచారణ అనంతరం 120-బీ, 124-ఏ, 153-ఏ, 188,195-ఏ, 505 సెక్షన్ల కింద కూడా కేసులు పెట్టారు. 120 సెక్షన్ (నేరపూరిత కుట్ర), సెక్షన్ 121 ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించడం) 124-ఏ సెక్షన్ (దేశ ద్రోహం) కింద జీవితఖైదు పడే అవకాశముంది. 153-ఏ సెక్షన్ ప్రకారం.. మతం, జాతి, వర్గాలమధ్య శతృత్వం పెంచిన నేరం కింద ఐదేళ్ల జైలు శిక్షకు, సెక్షన్ 188 ప్రకారం ప్రభుత్వ ఉత్తర్వును ధిక్కరించిన నేరంకింద 6 నెలలు, 195 -ఏ సెక్షన్ ప్రకారం.. వేరే మతాన్ని బహిరంగంగా కించపరిచిన నేరం కింద మూడేళ్లు, సెక్షన్ 505 ప్రకా రం.. ప్రజలను దుశ్చర్యకు పాల్పడేటట్లు రెచ్చగొట్టే ప్రకటన చేసిన నేరం కింద మూడేళ్ల జైలు శిక్షలకు అవకాశాలు ఉన్నాయని పోలీసు వర్గాలు అంటున్నాయి.

అక్బర్‌కు 14రోజుల రిమాండ్ విధించిన వెంటనే నిర్మల్‌లో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. కవరేజీ కోసం వచ్చిన నేషనల్ చానళ్ల ఓబీ వ్యాన్‌లపై అల్లరిమూకలు రాళ్లతో దాడికి దిగాయి. వెంటనే పెద్ద సంఖ్యలో పోలీసులు అక్కడికి చేరుకోవడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. తొలిరోజు ములాఖత్‌లో అక్బరుద్దీన్‌ను కలువడానికి నలుగురు సమీప బంధువులు, ఎంఐఎం ఎమ్మెల్యే అఫ్సర్‌ఖాన్, జిల్లా నాయకులు సిరాజ్ ఖాద్రి, ఫారుఖ్ హైమద్ జిల్లా జైలుకు వచ్చారు. 


ఆరోగ్యంగా ఉన్నారని చెప్పాకే అరెస్టు
అక్బర్‌పై ఎక్కువ కేసులు నమోదైనందున విచారణకు చాలా సమయం పడుతుందని, అందుకే ఏడురోజులు తమకు అప్పజెప్పాలంటూ పిటిషన్ వేశామని కరీంనగర్ రేంజ్ డీఐజీ రాథోడ్ భీమానాయక్ చెప్పారు. అక్బర్‌ను జిల్లా జైలుకు తరలించాక ఆయన విలేకరులతో మాట్లాడారు. సమావేశంలో జిల్లా ఎస్పీ సర్వశ్రేష్ట త్రిపాఠి, ఇతర పోలీసు అధికారులున్నారు.

కనిపించని బంద్ ప్రభావం
అక్బరుద్దీన్ అరెస్టును నిరసిస్తూ బుధవారం భైంసా బంద్‌కు ఎంఐఎం పిలుపునిస్తే, తమను అనవసరంగా అరెస్టు చేశారంటూ హిందూ వాహిని సభ్యులు జిల్లా బంద్‌కు పిలుపునిచ్చారు. అయితే బంద్ ప్రభావం పెద్దగా కనిపించలేదు. భైంసాలో కొందరు మాత్రం స్వచ్ఛందంగా దుకాణాలు మూశారు. 

రిమ్స్‌లో అక్బర్‌కు వైద్య చికిత్సలు
అనారోగ్యంతో ఉన్నానని అక్బర్ పిటిషన్ పెట్టుకున్న నేపథ్యంలో ఆయనకు ఆదిలాబాద్ రిమ్స్‌లో వైద్యచికిత్సలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. గురువారం ఉదయం ఓ ప్రత్యేక గదిలో అక్బర్‌కు చికిత్స అందించనున్నారు. ఇక్కడ బుధవారం నుంచే భద్రత ఏర్పాటు చేశారు.

వరంగల్ జిల్లాలో రెండు కేసులు
వరంగల్ లీగల్, జనగామ: అక్బరుద్దీన్‌పై కేసుల పరంపర ఆగలేదు. బుధవారం వరంగల్ జిల్లాలో రెండు కేసులు నమోదయ్యాయి. యూ ట్యూబ్‌లో ప్రసారమైన అక్బరుద్దీన్ ప్రసంగంతో తన మనోభావాలు దెబ్బతిన్నాయంటూ కాజీపేటకు చెందిన న్యాయవాది కొత్త రవి దాఖలు చేసిన పిటిషన్‌పై స్పందించిన మేజిస్ట్రేట్ గోవిందడ్డి.. విచారణ జరపాలని కాజీపేట పోలీసులను ఆదేశించారు. ఇవే ఆరోపణలతో జనగామలో యంగ్‌ఫోర్స్ ఫర్ బెటర్ యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు కీసర దిలీప్‌డ్డి కోర్టును ఆశ్రయించారు. 

కరీంనగర్‌లో ఎంఐఎం నేతల అరెస్టు
కరీంనగర్ క్రైం/కార్పొరేషన్: జిల్లా కేంద్రంలోని తెలంగాణచౌక్‌లో ఎంఐఎం నాయకులు సీఎం దిష్టిబొమ్మను దహనం చేసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన ఎంఐఎం కార్యకర్తలను చెదరగొట్టి పోలీసులు లాఠీలకు పని చెప్పారు. మరోవైపు నుంచి వచ్చిన ఎంఐఎం కార్యకర్తలు సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. దీంతో పోలీసులు ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు వాహాజోద్దీన్, ప్రధాన కార్యదర్శి గులాం అహ్మద్, మాజీ డిప్యూటీ మేయర్ షమీని అరెస్టు చేశారు. సీఎం దిష్టిబొమ్మ దహనానికి నిరసనగా జిల్లా కాంగ్రెస్ మైనార్టీ సెల్ ఆధ్వర్యంలో అక్బరుద్దీన్ దిష్టిబొమ్మను దహనం చేశారు. దీంతో తెలంగాణ చౌక్ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. పోలీసుల చొరవతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగలేదు. గంగాధర మండలంలో ఎంఐఎం నేతలను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. 

బోధన్‌లో షాపులపై దాడులు
నిజామాబాద్ జిల్లా బోధన్‌లో ఎంఐఎం బంద్ సందర్భంగా బుధవారం ఆందోళనకారులు షాపులపై దాడులు చేశారు. పలు దుకాణాలను ధ్వంసం చేశారు. వాటిని బీజేపీ జిల్లా అధ్యక్షుడు పెద్దోళ్ల గంగాడ్డి పరిశీలించారు.

9, జనవరి 2013, బుధవారం

కుట్రలో భాగంగానే మతవిద్వేషాలు...


- చంచల్‌గూడా జైల్లోనే మతవిద్వేషాల కుట్రకు వ్యూహరచన 
- తెలంగాణ లెక్చరర్ల ఫోరం డైరీ ఆవిష్కరణ సభలో వక్తల హెచ్చరిక
హైదరాబాద్, జనవరి 8 (టీ మీడియా): తెలంగాణను ఆరు దశాబ్దాలుగా అడ్డుకుంటున్న కాంగ్రెస్ మరోసారి ఆఖరి ప్రయత్నంగా మతవిద్వేషాలను రెచ్చగొట్టి తెలంగాణను వాయిదా వేసేందుకు రాజకీయంగా కుట్రపన్నుతున్నదని తెలంగాణ జేఏసీ నేతలు, పలు రాజకీయ పార్టీలు, ఉద్యోగ సంఘాలు, ప్రజా సంఘాల నేతలు ఆరోపించారు. ఈ కుట్రను రాజకీయంగానే తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. జనవరి 27 తర్వాత కూడా తెలంగాణను వాయిదావేసేందుకు ప్రయత్నిస్తే సీమాంధ్ర నాయకులు పాదయాత్రలను ముగించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. హైదరాబాద్ రాజధానిగా పది జిల్లాల తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం తప్ప మరో ధ్యాస తెలంగాణ ప్రజలకు లేనేలేదని మంగళవారం పబ్లిక్‌గార్డెన్స్‌లోని ఇందిరాప్రియదర్శిని ఆడిటోరియంలో జరిగిన తెలంగాణ లెక్చరర్ల ఫోరం (టీఎల్‌ఎఫ్) డైరీ, క్యాలండర్ ఆవిష్కరణ సభలో వక్తలు స్పష్టం చేశారు. 

టీఎల్‌ఎఫ్ అధ్యక్షుడు కత్తి వెంకటస్వామి అధ్యక్షత వహించిన సభలో జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం, బీజేపీ శాసనసభా పక్ష నేత యెండల లక్ష్మీనారాయణ, టీఆర్‌ఎస్ నేత హరీశ్‌రావు, విద్యావంతుల వేదిక అధ్యక్షుడు మల్లెపల్లి లక్ష్మయ్య, తెలంగాణ జర్నలిస్టుల ఫోరం ఉపాధ్యక్షులు పల్లె రవికుమార్, జేఏసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్, న్యూ డెమొక్రసీ నేత సూర్యం, టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు కే స్వామిగౌడ్, టీ ఉద్యోగ సంఘాల జేఏసీ సెక్రటరీ జనరల్ వీ శ్రీనివాస్‌గౌడ్, కో చైర్మన్ విఠల్, ఎంపీజే అధ్యక్షుడు హమీద్ మహ్మద్‌ఖాన్, రసమయి బాలకిషన్, హైదరాబాద్ జేఏసీ కన్వీనర్ ఎంబీ కృష్ణయాదవ్, డాక్టర్ల జేఏసీ అధ్యక్షుడు నర్సయ్య, తెలంగాణ రచయితల వేదిక అధ్యక్షుడు జూలూరు గౌరీశంకర్, ఇంజినీర్ జేఏసీ భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు. 

సీమాంధ్ర వలస పాలకుల తాబేదార్లు మతవిద్వేషాలను రెచ్చగొడుతున్నారని, కచ్చితంగా ఇది రాజకీయ కుట్రనేనని జేఏసీ చైర్మన్ కోదండరాం స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలు ఈ కుట్రపట్ల అప్రమత్తంగా ఉండాలని, కుట్రను రాజకీయంగా ఛేదించాలని కోరారు. తెలంగాణ సంఘటిత ఉద్యమశక్తిని చాటి చెప్పాలని, ఇందుకు తెలంగాణ లెక్చరర్లు బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ఒక పరిష్కార దశకు చేరుకునే ప్రతీ సందర్భంలో రాజకీయ దుర్మార్గాలు పెరుగుతున్నాయని, మతవిద్వేషాలు ఈ దుర్మార్గంలో భాగమేనని హరీశ్‌రావు పేర్కొన్నారు. హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ కాకుండా మరే అస్పష్ట ప్రకటనలు చేసినా, తెలంగాణ సహించే స్థితిలో లేదని ఆయన పేర్కొన్నారు. కాంట్రాక్ట్ లెక్చరర్లందరినీ రెగ్యులర్ చేయాలనే డిమాండ్‌తో ఉద్యమాలను మరింత తీవ్రతరం చేయాలని సూచించారు. 

తెలంగాణ ఉద్యమ పథం నుంచి బీజేపీ పక్కకు జరిగే ప్రసక్తి లేదని, మతవిద్వేషాల కుట్రలోభాగం కాకుండా జాగ్రత్త పడుతున్నామని యెండల లక్ష్మీనారాయణ చెప్పారు. ఎంపీజే అధ్యక్షుడు హమీద్ మహ్మద్‌ఖాన్ మాట్లాడుతూ డిసెంబర్ 28, 2012 నుంచి జనవరి 8 వరకు మతఘర్షణలను పెంచేందుకు కుట్రలు జరిగాయని, ఈ కుట్రలో భాగంగానే అక్చరుద్దీన్ అరెస్టు డ్రామాను కిరణ్ సర్కార్ నడిపించిందని హెచ్చరించారు. టీడీపీ, వైఎస్సార్సీపీ ఈ కుట్రలో పాత్రధారులేనని ఆయన పేర్కొన్నారు. బీజేపీ ఈ కుట్రలో భాగం కావద్దని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌లోని గంగాజమున తెహజీబ్‌లో విషం చిమ్ముతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. చెంచల్‌గూడా జైల్లోనే మతవిద్వేషాల కుట్రలకు వ్యూహరచన జరిగిందని స్వామిగౌడ్ అన్నారు. అదృష్టవశాత్తు పాతబస్తీలో ఎలాంటి అల్లర్లు లేవని, తెలంగాణ ముస్లింలు, హిందువులు కలిసి తెలంగాణ జెండా నీడలో ఈ దుర్మార్గాలను తిప్పికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. 

మల్లెపలి లక్ష్మయ్య మాట్లాడుతూ చర్చించుకున్న విషయాలనే మళ్లీ మళ్లీ చర్చిస్తున్నామని, జేఏసీ సారథ్యంలో భారతదేశాన్ని ప్రభావితం చేసే ఒక బలమైన ఉద్యమానికి రచన జరుగాలని అభిప్రాయపడ్డారు. అద్దంకి దయాకర్ ప్రసంగిస్తూ ముస్లింలు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు తెలంగాణ ఉద్యమంలోకి రాకుండా విద్వేషాలను రెచ్చగొడుతున్నారని, చిమ్ముతున్న విషమేఘాల నుంచి తెలంగాణ ప్రజలను కాపాడుకోవాలని అన్నారు. వీ శ్రీనివాస్‌గౌడ్ ప్రసంగిస్తూ ప్రజలను రెచ్చగొ సీమాంధ్ర వలస పెత్తందార్లు చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొ జేఏసీ సిద్ధంగా ఉన్నదని చెప్పారు. న్యూడెమొక్రసీ నేత సూర్యం ప్రసంగిస్తూ తెలంగాణ ప్రజల ప్రథమ శత్రువు కాంగ్రెస్ పార్టీయేనని స్పష్టం చేశారు.పల్లె రవికుమార్ ప్రసంగిస్తూ కుట్రలను ఛేదించడానికి, తెలంగాణ తెచ్చుకోవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు.                                    - from namaste telangana

6, జనవరి 2013, ఆదివారం

కాలుష్య దీవి బడుగు జీవి..!



షాద్‌నగర్, టీ మీడియా : ఒకగొట్టంలోని పొగ ఆకాశమార్గాన ప్రయాణించి పచ్చని పంట పొలాలను లక్ష్యంగా చేసుకొని అన్నదాత జీవితంతో ఆడుకుంటోంది. మరో గొట్టంలోని రసాయనం నేలతల్లిని తడిపి భూమిలో ఇంకి పచ్చదనాలను కూకటివేళ్లతో పెకిలిస్తోంది. దాహం తీర్చే నీటిని సైతం ప్రజల కు దక్కకుండా మారుస్తోంది. స్థానికులకు ఉపాధిలేదు.. అనర్థాలు తప్పడంలేదు.. ఆందోళనలు చేసినా ఈ దారుణాలను ఆపేవారులేరు.. ఇది షాద్‌నగర్ నియోజకవర్గంలో కాలుష్యం జీవితాలను కాలరాస్తున్న తీరు.
కాలుష్యం ఇలా.. 
షాద్‌నగర్ నియోజకవర్గ పరిధిలో సుమారుగా 100కుపైగా భారీ తరహా పరిక్షిశమలు ఉన్నాయి. వీటిలో ఫార్మ, ఐరన్, బట్టలు, బ్యాటరీస్, వంటసామగ్రి వంటి వస్తువులు ఉత్పత్తి చేసే పరిక్షిశమలు ఉన్నాయి. ఈ పరిక్షిశమల్లో దాదాపు 10వేల మందికిపైగా కార్మికులు వివిధ రంగాల్లో పని చేస్తున్నారు. వందలాది ఎకరాల్లో పరిక్షిశమలు స్థాపించడంవల్ల వీటి నుంచి వెలువడే కాలుష్యతాకిడి వేలాది ఎకరాల పంట కాలుష్యం బారిన పడటమేకాకుండా వందల సంఖ్యలో మూగజీవాలు మృతి చెందుతున్నాయి. నియోజకవర్గ పరిధిలోని కొత్తూరు మండలంలో కొత్తూరు మండలం నందిగామలోని రాయలసీ మ రీరోలింగ్ మిల్, నందిగామలోని వక్షా స్టీల్స్, వీర్లపల్లిలోని శివశక్తి స్పాంజ్ ఐరన్, కొడిచర్లలోని ఆనంద్ స్పాంజ్ ఐరన్, పెంజర్ల రోడ్డులోని వివేక్ టెక్స్‌టైల్స్, కొత్తూరులోని వినాయక స్టీల్స్, తీగాపూర్ బింజు సార్య ఐరన్ ఇండస్ట్రీ, తిమ్మాపూర్‌లోని వంశీధార ఆయిల్ మిల్, దివ్యశక్తి పేపర్ పరిక్షిశమతోపాటు స్కాన్ ఐరన్ పరిక్షిశమలు విడుదల చేసే కాలుష్యబారిన పడి పల్లె ప్రజలు విలవిలలాడుతున్నారు. పరిక్షిశమలనుంచి వెలువడే కర్భన సమ్మెళనాలతో కూడిన వాయు, జల, ఘన పదార్థాల కాలుష్యానికి పల్లెజనం రోగాలబారీన పడుతున్నారు.

పాపం.. ఎంత నష్టం..
రసాయనాల దాటికి పంటలు ఎండిపోతుండగా పొగదాటికి నీరు నలుపురంగులోకి మారుతోంది. ఇళ్లల్లోని గిన్నెలతో సహా ఆహార పదార్థాలు విషంగా మారుతున్న పరిస్థితి నెలకొన్నది. మరోవైపు తాగునీరు ఎరుపురంగులోకి చేరి తాగేందుకు వీలులేకుండా మారాయి. ఇక్కడి కాలుష్యం దాటికి చెరువులు కూడా సాగునీటికి పనికిరాకుండాపోయాయి. ఫలితంగా నియోజకవర్గం ఓ కాలుష్య దీవిగా మారి రెక్కాడితేగానీ డొక్కాడని బడుగుజీవిని వేధిస్తోంది.

నష్టాలు.. ఇవి.. 
పరిక్షిశమల కాలుష్యం ద్వారా ఇక్కడ తాగునీరు పూర్తిగా క లుషితమైపోయింది. ఈ నీరు తాగితే రకరకాల రోగాలతోపా టు విష జ్వరాలు ప్రభలుతున్నాయి. ఒంటి నొప్పులు, ఎముకలు పనిచేయకపోవడం. వ్యక్తులు పూర్తిగా మంచాన పడే పరిస్థితి నెలకొన్నది. ఈ పరిస్థితులు అనుభవిస్తూనే మృత్యువాత పడిన సందర్భాలు ఉన్నాయి. మరోవైపు పశువులు కూడా లెక్కకు మించి మరణిస్తున్నాయి.

అసలుకే ఎసరు..
ఈ పరిక్షిశమలు ప్రారంభమైనప్పుడు స్థానికంగా అందరికీ ఉద్యోగాలు, ఉపాధి దొరుకుతాయని ఆశించారు. కానీ ఇక్కడ స్థానికులకు ఎలాంటి ఉద్యోగ అవకాశాలు కల్పించకపోగా పం ట పొలాలను నాశనం చేస్తూ అటు రైతులకు దిగుబడులులేకుండా కూలీలకు ఉపాధిలేకుండా చేస్తున్నారు పరిక్షిశమ యజమానులు ఇక్కడి పరిక్షిశమల్లో తెలంగాణ వాదులు ఒక్కరు కూడా కనిపించరు. సీమాంవూధవూపాంతంతోపాటు ఇతర ప్రాం తాల నుంచి వచ్చినవారే ఉన్నతస్థాయి ఉద్యోగాలు చేస్తున్నారు. కానీ తెలంగాణ ప్రజలు రోజువారి కూలీలుగానే వ్యవహరించే పరిస్థితి నెలకొంది. 

ఆందోళనపూన్నో.. 
కాలుష్యపు బారినుంచి తమకు విముక్తి కల్పించాలని ప్రతి యేట రైతులు ఆందోళన చేస్తూనే ఉన్నారు. అధికారులు మాత్రం పట్టించుకోవడంలేదు. కందివనం, ఎలికట్ట, ఇప్పలపల్లి, పెంజర్ల, తీగాపూర్ గ్రామాల పరిధిలో రైతులు ఎన్నోమార్లు ఆందోళన చేసిన సంఘటనలు ఉన్నాయి. న్యాయస్థానానికి కూడా ఆశ్రయించారు. పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలని ఉన్నత న్యాయ స్థానం ఆదేశించినా ఏనాడూ పట్టించుకున్న పాపానపోలేదు.

మాటలు.. మూటలు.. 
ఆందోళనలు జరిగినప్పుడల్లా కాలుష్య నివారణ అధికారులు, ఆర్డీఓలు, జేసీలు, కలెక్టర్లు వస్తున్నారు. పరిశీలిస్తున్నా రు. అలాగే స్థానిక ప్రజావూపతినిధులను మొదలుకొని ఎమ్మెల్యే లు, మంత్రులు వచ్చి హడావుడి చేస్తున్నారు. పరిశీలనలు, ప రామర్శలు సరేసరి కాని సమస్యలు మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా ఉన్నది. రైతుల ముందు ఏవో మాటలు చెప్పి పరిక్షిశమల యజమానుల వద్ద డబ్బుల మూటలు అందుకుంటున్నారనే ఆరోపణలు తీవ్ర స్థాయిలో ఉన్నాయి.                                  from namaste telangana

4, జనవరి 2013, శుక్రవారం

సంఘ విద్రోహక శక్తి....ఎం ఐ ఎం


గత కొంత కాలం గా పేస్ బుక్ లో అక్బరుద్దీన్ ఒవైసీ వివిధ జిల్లాల  పర్యటనలో చేసిన వ్యాక్యాలు హల్చల్ చేస్తున్నాయి, సామాజిక మీడియా లో వస్తున్న వ్యతిరేకతకు తోడు, హిందూ సంస్థలనుండి వస్తున్న వ్యతిరేఖతతో కదిలిన ప్రభుత్వం తు తు మంత్రం గా అతగాడి పై కేసు లు బనాయించి చేతులు దులుపుకుంది.అసలు విషయాన్నీ చర్చిద్దాం.
                      కాంగ్రెస్ పార్టీకి కటిఫ్ చెప్పిన ఒవైసీ ఆ వెంటనే జగన్ బాబు తన మిత్రుడని ప్రకటించేసాడు, జగన్ తో పొత్తు పెట్టుకున్తదని అందరికి తెలిసి పోయే సరికి విషయాన్నీ అర్థం కాకుండా చెయ్యడానికి చంద్ర బాబు బెస్ట్ సి ఎం అంటూ బాబు ను పొగిడాడు, ఇక అసెంబ్లీ లో అక్బరుద్దీన్ కాంగ్రెస్ పై ఉన్న అక్కసునంత వెళ్ళగక్కాడు, తెలంగాణా ఉద్యమం తీవ్రం గా జరుగుతున్న సమయం లో మాకెందుకు లే అని మౌనం గా ఉన్న ఈ ఒవైసీ బ్రదర్స్, లగడపాటి తో విందులో పాల్గొని  తమ నిజ స్వరూపాన్ని బట్ట బయలు చేసాడు.

                                   పార్టీ ని జిల్లాల్లో కూడా విస్తరించేందుకు, ముస్లిం లను సంఘటితం చేసేందుకు తాను రాష్ట్ర మంతా పర్యటిస్తానని చెప్పిన ఒవైసీ నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్ లలో పర్యటించి, అక్కడి ముస్లింలను ఆకట్టుకోవడానికి హిందూ మతం పై, హిందూ దేవతలపై, దేవాలయాలపై, గోవు పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసాదు, ఇవన్ని వివాదాస్పదం అవ్వడమే కాకుండా దేశవ్యాప్తం గా సంచలనం రేకెత్తిస్తున్నాయి, అయితే ఒవైసీ చేసిన ఈ వ్యాక్యలకు 2 కారణాలు కనిపిస్తున్నాయి.

         1) జగన్ తో దోస్తీ కట్టిన ఒవైసీ తన పార్టీ ని విస్తరించదానికి అనువైన సమయం ఇదే అని బావించాడు, తెలంగాణా ఉద్యమ దెబ్బతో వై ఎస్ అర్ సి పీ లో ఎ ఒక్క బలమైన నాయకుడు చేరకపోవడం, చేరే చోట మోట నాయకులు అంత రెడ్డి సామాజిక వర్గం వారే కావడం తో పార్టీ విస్తరణ అనేది పెద్ద సవాల్ గా మారింది, ఒవైసీ తో జత కడితే హైదరాబాద్ సిటీ లోని కాంగ్రెస్ నాయకులంతా తప్పని సరిగా జగన్ గూటికి చేరుతారు, అంతే కాకుండా ముస్లిం ప్రభావిత ప్రాంతాలలోని నాయకులు తమ పార్టీలో చేరుతారు, అందుకే ఒవైసీ తో జగన్ జత కట్టాడు, ఇక ఒవైసీ కూడా తన పార్టీ ని పెంచుకోవాలంటే తెలంగాణా లో అంతగా ప్రభావం లేని పార్టీ, అంతో ఇంతో ఆదరణ ఉన్న నాయకుడు అయితే తమ పార్టీ సులువు వివిధ స్థానాల్లో పోటి చేసి, గెలిచే అవకాశాలు ఉంటాయి కావున జగన్ వైపు వెళ్ళారు.
2) తెలంగాణా కు ఎం ఐ ఎం ఏనాడూ మధతు తెలపలేదు, నిజామాబాదు ఎన్నికలలో తెలంగాణా మీద ఉన్న అభిమానం తో అక్కడి ముస్లిం లు బి జె పీ కి ఓటు వేసారు, తెలంగాణా ఉద్యమం లో ముస్లిం లు చురుకుగా పాల్గొంటున్నారు, ఇదే జగన్ పార్టీ కి అడ్డుగా ఉంది, దీనిని దెబ్బ తీసే ఉద్దేశ్యం తోనే, ముస్లిం లను ఉద్యమానికి దూరం చెయ్యాలని సీమంధ్రులు సంకల్పించారు, అందుకు ఎం ఐ ఎం ను ఉపయోగించుకున్నారు, సీమంద్రుల ఎంగిలి మెతుకులకు ఆశపడే ఒవైసీ తెలంగాణా ముస్లిం ల ఆత్మ గౌరవాన్ని సీమంద్ర పెత్తం దారులకు అమ్ముకున్నాడు,  తెలంగాణా ఉద్యమం నుండి మతం పేరుతో ముస్లిం లను వేరు చేసి ఉద్యమాన్ని బలహీనం చెయ్యాలనే కుట్రకు సీమధ్రులు పాల్పడ్డారు, అందుకు ఈ ప్రాంతంలో పుట్టిన ఈ రజాకర్ పార్టీ నాయకుడు వంతపాడాడు, అందుకే ఈ సభలు.

                                  తమ పార్టీ విస్తరణ , తెలంగాణా ఉద్యమం నుండి ముస్లిం లను దూరం చెయ్యడం,  తెలంగాణకు ముస్లిం లు వ్యతిరేఖం అని తెలంగాణా ను అడ్డుకోవడం, తద్వారా జగన్ పార్టీ ని తెలంగాణా లో గెలిపించడం, ఇవే వీరి లక్ష్యాలు.
                          ఆదిలాబాద్ సభలో అక్బరుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాక్యాలు," మనం 25 కోట్ల మందిమి ఉన్నాము , వారు వంద కోట్ల మంది ఉన్నారు, 15 నిమిషాలు పోలీసులు దూరం జరిగితే ఎవరి సత్తా ఏమిటి అనేది తెలుస్తుంది",  మరో సభలో, " హిందువులకు వారానికో కొత్త దేవుడు పుట్టుకొస్తాడు, మనం లక్ష్మి అని విన్నాము, ఈ భాగ్య లక్ష్మి ఎవరో, మనం అందరం ఉమ్మి వేస్తే ఆ ఉమ్మిలో కొట్టుకు పోత్తుంది ఆ గుడి, భాగ్య లక్ష్మి టెంపుల్ ను కూల్చి వేస్తాం, హిందూ దేవతలు నగ్నం గా, అసహ్యంగా ఉంటారు", " హిందువులు నపుంసకులు, మనం ఎవరికీ తీసిపోము, ఈ మైక్  ఆయుధమైతే  అందరిని నారికే వాడిని," " గోవును అమ్మ అంటారు అమ్మనే అమ్ముకుంటారు, వాళ్ళు అమ్ముకుంటే తప్పు కాదు కాని మనం కొనుక్కుంటే తప్ప..?", ఇవన్ని ఎవరి రాజకీయ అవసరాల కోసం చేసినవి, అధికారం కోసం ఎంతటి క్రురత్వనికైన తెగిస్తార..? హిండువులన్ధరిని మట్టు పెడుతానని వ్యాఖ్యానించిన అది తప్పు కాదా..?, వీరు జనానికి ఏది బోదించిన తప్పులేదా..? రాష్ట్రం లో కేంద్రం లో ప్రజలను కాపాడటానికి ప్రభుత్వాలు, పొలిసు వ్యవస్థలు ఉన్నాయా, శవాలు గా మారాయ..? ముస్లిం లను చిన్న మాట అంటేనే పైకి లేచే సుడో సేకులర్ వాదులు నేడు ఏరి..?  వారికి ఇది తప్పుగా కనిపించడం లేదా..? సేకులరిసం అంటే ఏమిటి, కేవలం హిందువులకు మాత్రమె పరిమితమ..?అది ముస్లిం లకు వర్తించదా..? 

                                                 సమాజాన్ని మెరుగు పరుస్తాం, దమ్ముంది మాకు దగ్గు ఉంది  అని చాటుకునే తెలుగు డబ్బాలు ఎ బెజ్జంలో దాక్కున్నాయి, పేరుకు 20 వార్త చానళ్ళు ఉన్నాయి, అన్నింటికీ అన్ని జిల్లాల్లో ప్రతినిధులు ఉన్నారు, అందరికంటే మేమే ముందు వెలుగులోకి తెచ్చాం అంటూ క్రెడిట్ కోసం పాకులాడే చిల్లర వెధవలు ఈ విషయాల జోలికి ఎందుకు పోలేదు..? ఒవైసీ అంటే ప్యాంటు తడుస్తుందా....? లేక జగన్ డబ్బుల మూటలు  అందాయ..? నిజం చెప్పలే అని బొమ్మలు ఇచ్చుడు కాదు దేశ సార్వ భౌమత్వనికే భంగం కలిగించేలా మాట్లాడిన ఇలాంటి వాళ్ళను వీధికీడ్చాకుండా, మాది నిప్పులాంటి నిజాలను చెప్పే చానెల్, అంటూ కథలు చెప్పటం దేనికి, మీరు చేసింది ఏంటి..? దేశ ద్రోహమా.? లేక వంచన..? పేస్ బుక్, లాంటి సామాజిక మీడియా అనేది లేకుంటే నేడు ఒవైసీ చేసిన వ్యాక్యాలు బయటికి వచ్చేవ..? 20 చానెల్ లు ఉండి  ఎందుకు బంగాళాఖాతం లో దూకి చావండి, ఒకడు చంద్రయాన్ అని వాడి ముడ్డి చుట్టూ తిరుగుతాడు, ఇంకొకడు షర్మిల పాదయాత్ర అంటూ, అదే చూపిస్తాడు, మీ వార్తల్లో నిజాయితి ఎక్కడుంది..? మీ సొంత డబ్బా తప్ప...?

                                  రాజశేఖర్ రెడ్డి గతం లో చన్న రెడ్డి ని ముఖ్య మంత్రి పదవి నుండి దించడానికి పాత బస్తీలో మత కల్లోలాలు చేయించాడు, అదే ఫార్ముల లో వెళ్తున్నాడు జగన్. ముందు కనిపించేది ఒవైసీ, వెనకాల ఉండి  నడిపించేది జగన్...

                   కాశీం రజ్వి వీడు రాజకారుల నాయకుడు, వాడి పార్టీ పేరే ఎం ఐ ఎం, అదే పేరుతో తెలంగాణా లోని హిందువులపై పగ తీర్చుకోవడానికి పుట్టిన పార్టీ నే ఈ ఎం ఐ ఎం, తెలంగాణా ప్రజలు అతి క్రూరుడైన నియంత నిజాం రాజు నుండి విముక్తి పొంది విజయం సాధించారు, ఇది అందరి విజయం, ఇందులో కేవలం హిందువులే పాల్గొనలేదు, ముగ్ధుం మొహినోద్దిన్, షోయబుల్ల ఖాన్ లాంటి ఎందరో ముస్లిం లు పాల్గొన్నారు, కాని కొందఱు స్వార్ధపరులైన నాయకులు తమ రాజకీయ స్వార్థం కోసం ముస్లిం రాజైన నిజాం పై హిందువులు విజయం సాధించారని అది కలకాలం నిలువ కూడదని ముస్లిం లకు బోధిస్తున్నారు, అందుకే నేడు ఎం ఐ ఎం పార్టీ తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకు తద్వారా తెలంగాణా విముక్తికి సహకరించడం లేదు..
           2009 ఎన్నికల సమయంలో అసదుద్దీన్ ఒక వీడి రౌడి లాగా ప్రవర్తించాడు, ఓటు వేయడానికి వచ్చిన జనాన్ని చితకబాదాడు. ఆ వీడియో ..


                           అక్బరుద్దీన్ చేసిన వ్యాక్యలకు మీడియా ప్రాధాన్యం ఇవ్వలేదు, కేవలం పేస్ బుక్, ట్విట్టర్ ద్వార మాత్రమె ప్రజల్లో చర్చ జరిగింది, హిందూ సంస్థలు ఈ వ్యాక్యలపై మండి  పడ్డాయి, జావేద్ అక్తర్ లాంటి ముసలీం మేధావులు సైతం ఒవైసీ వ్యాక్యలను ఖండించారు, ఎం ఐ ఎం పార్టీ ని బ్యాన్ చెయ్యాలని బి జె పీ కోరుతుంది, కాని ఇంకా మన సుడో మేధావులు మేల్కొన లేదు, ఒక్క మాట కూడా ఖండించలేదు, సేకులరిసం అంటే కేవలం బి జె పీ కి, భజరంగ్ దళ్  కు మాత్రమె వ్యతిరేఖమా..? ప్రేమికుల రోజు దళ సభులు దాడులు చేస్తే వారి స్వచ్చకు భంగం కలిగిస్తున్నారని మొసలి కన్నీరు కార్చే నాస్తికులు, ఒవైసీ చేసిన వ్యాక్యలను సమర్ధిస్తున్నారా..?
                          గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలలో పాటించిన స్ట్రాటజి నే ఎం ఐ ఎం  2014 ఎన్నికలలో పాటించాలని తద్వారా విజయం పొందాలని చూస్తున్నారు, 50% కన్నా ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్నచోట ముస్లిం అభ్యర్థిని 50% కన్నా తక్కువ ముస్లిం జనాభా ఉన్న చోట హిందూ అభ్యర్థిని నిలబెట్టడం ద్వార ముస్లిం ఓట్లతో పాటు హిందూ ఓట్లు కూడా పొంది విజయం సాదిన్చాలనేది వీరి ఆలోచనా.. తస్మాత్ జాగ్రత్త.... 

       అక్బరుద్దీన్ పై కేసు వేసిన లాయర్ కు చంపేస్తామంటూ బెదిరింపు కాల్ లు వచ్చాయి, ఐన ఆయన దైర్యం గా ముందడుగు వేసారు.
                                    తెలంగాణాలోని  ముస్లింలు అందరు తెలంగాణా  కావాలని కోరుకుంటున్నారు, తెలంగణా జిల్లాలలోని ముస్లిం లే కాదు పాత బస్తి లోని ముస్లిం లు కూడా , తెలంగాణా వస్తే వారి బతుకులు బాగు పడుతాయి అని ఆశిస్తున్నారు, కాని వారి అభివ్రుధిని అడ్డుకుంటున్నది మాత్రం ఎం ఐ ఎం పార్టీ మాత్రమె, వారు అజ్ఞానం లో ఉన్నంత వరకే వీరి ఆటలు సాగుతాయి  అందుకే వారిని ఎధగనివ్వారు. తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాలకోసం యావత్ సమాజాన్నే బలిచేసేందుకు సిద్దమైన ఈ రాక్షసుల  స్వైర విహారాన్ని అడ్డుకోవాలి, ఆ శక్తి కేవలం జై తెలంగాణా అనే నినాదానికి మాత్రమె ఉంది.......

1, జనవరి 2013, మంగళవారం

మధుగోపాల్ ఛాయచిత్రాలలో కాకతీయ వైభవం..!




మధుగోపాల్ బాల్యం అత్యంత సాదాసీదాగానే గడిచింది. గ్రామీణ భారతంలోని అనేక గ్రామాల్లో మాదిరే, ఖిలా వరంగల్‌కు రెండు కిలోమీటర్ల దూరంలో ఒక వాడకట్టు. అక్కడ జీవితం సర్వసాధారణం. దైనందిన జీవితంలో ఆశ్చర్యానికి గురిచేసేదేమీ ఉండదు. సహజమూ, అనివార్యమూ అయిన వివిధ కులవృత్తులతో కూడిన జీవన వ్యాపారం నిదానంగా సాగిపోతూ ఉంటుంది.

ఇవాళ ఎట్లుంటుందో రేపూ అలాగే ఉంటుంది. ఆ తర్వాతి రోజూ అలాగే ఉంటుంది. ఏదైనా కాస్త విశేషమూ అంటే అది పిల్లలకు బడే. అప్పుడప్పుడూ సినిమాలు. అంతే! ఎనభయ్యవ దశకంలో టీవీ ఇంకా దిగువ మధ్యతరగతి ఇండ్లలోకి రానందున మధుగోపాల్‌కు పెద్ద ఉత్సాహవంతమైనదేమీ కనిపించలేదు. అయితే, ఇంట్లో తన అన్నయ్య మొదట్లో పెయింటింగ్ చేసేవాడు. అటు తర్వాత ఫొటోక్షిగఫీలో నిమగ్నమయ్యాడు. అలాంటి వాతావరణంలో పదో తరగతి, ఇంటర్, పిమ్మట డిగ్రీ...మధ్యలో కొందరు ఎంసెట్ ఇంకొందరు బిఎడ్...ఇట్లా విద్యార్థుల చదువులు సాగేవి.

అయితే, అన్నయ్య పెయింటింగ్స్ చేస్తుంటే చూడటం, అలాగే తన 120 బాక్స్ కెమెరాలో ఫిల్మ్ లోడ్ చేయించుకుని సైకిల్ మీద కోటలోకి వెళ్లి ఆ శిథిలాలను ఫొటోలు తీయడం - ఇవి రెండే అతడి బాల్యంలోని మధుర జ్ఞాపకాలు.

అదృష్టవశాత్తూ మధుగోపాల్‌కు డిగ్రీ రెండో సంవత్సరంలో బాలాజీ అన్న మిత్రుడితో పరిచయం కలిగింది. బాలాజీ వాళ్లకు వరంగల్‌లో ‘జయ ఫొటో స్టూడియో’ ఉండేది. అతడి చొరవ కారణంగా మధుగోపాల్ జెఎన్‌టియులో చేరాడు. బాలాజీ అప్పటికే రెండుసార్లు ఫొటోక్షిగఫీలో డిప్లొమా చేయడానికి ఎంట్రెన్స్ టెస్ట్ రాశాడు. ఆ సంగతి తెలిసి ఈసారి ఇద్దరూ కల్సి రాశారు. 13వ ర్యాంకు వచ్చింది. కానీ, ఇంట్లో ఒప్పుకోలేదు. డిగ్రీ చదివే పిల్లగాడు ఇంటర్‌కి సమానమైన డిప్లొమాలో చేరుతానంటే ఎవరికి మాత్రం ఇష్టం ఉంటుంది! వద్దన్నారు. దాంతో పొద్దున్నే రైలెక్కి మిత్రుడితో కలిసి హైదరాబాద్ చేరుకుని ఫొటోక్షిగఫీ కోర్సులో జాయినైపోయాడు మధుగోపాల్. తర్వాత వాళ్లు ఒప్పుకున్నారు. అది వేరే విషయం.

అయితే, మధుగోపాల్ అన్నయ్య ఇప్పుడు ప్రసిద్ధ ఫొటోక్షిగాఫర్ ఐన రామ వీరేష్ బాబు. తన తమ్ముడి అభిలాషను అర్థం చేసుకున్నాడు. వద్దని వ్యతిరేకించలేదు. తమ్ముడి చదువుకు పూర్తి సహాయకారిగానూ ఉన్నాడు. అలా చదువు పూర్తయినాక కొన్నేళ్లు లెక్చరర్‌గా అటు తర్వాత దుబాయ్‌లో రెండేళ్లు ఫొటోక్షిగాఫర్‌గా పనిచేసి మళ్లీ హైదరాబాద్‌కు వచ్చేశాడు మధుగోపాల్. అప్పట్నుంచి అంటే 2001 నుంచి ఇప్పటి దాకా అతడు ఫొటోక్షిగఫీనే జీవికగాను, జీవితంగానూ చేసుకుని పనిచేస్తున్నాడు.


సంపన్న కుటుంబం నుంచి వచ్చిన వారు కళా జీవితంలో నిమగ్నమైతే వారెన్నో ప్రయోగాలు చేయడానికీ వీలుంటుంది. ఆ అదృష్టం తనకు దక్కలేదని తీరిగ్గానే మధుగోపాల్‌కు అర్థమైంది. అవును మరి. సాంకేతికంగా కెమెరా కళలో అనేక ప్రయోగాలు చేయాలనుకున్నాడు. అందుకోసం అమెరికా వెళ్లి ఎంఎఫ్‌ఎ చేయాలని ప్రిపేర్ అయ్యాడు. (అప్పట్లో ఎంఎఫ్‌ఎ మన దగ్గర లేదు.) చివరి నిమిషం దాకా ప్రయత్నించాడు. కానీ, కుదరలేదు.

వీసా తిరస్కారంతో ఇక తాను ఇక్కడే ఉండి తన కళను సాధన చేయాల్సిన పరిస్థితిలో పడ్డాడు. ‘‘అది ఒక విధంగా నయమే అయింది’’ అన్నాడాయన. నిజమే. సాంకేతికత స్థానాన సౌందర్యం పట్ల, స్థానిక విషయాల డాక్యుమెం పట్ల ఆసక్తి తనలో ద్విగుణీకృతమైంది ఇందువల్లే. అతడు తన పనిని మూడు విధాలుగా విడగొట్టుకోవలసి వచ్చింది కూడా. ఒకటి, కమర్షియల్ పనులు. రెండు, డాక్యుమెం మూడు, లాంగ్‌టర్మ్ ప్రాజెక్టులు. ‘‘ఇందులో మొదటి రెండూ నాకు ఆర్థికంగా స్థిరత్వాన్ని ఇచ్చే పనులుకాగా, చివరిదైన ‘లాంగ్‌టర్మ్ ప్రాజెక్టులు’ ఆత్మతృప్తిని మిగిల్చేవి’’ అంటారాయన. అయితే, ఆ చివరి రెండూ కూడా ఫొటోక్షిగాఫర్‌గా అతడిని తెలంగాణ భూమి పుత్రిడిగా నిలిపేవే కావడం యాధృచ్చికం కాదేమో!



అవును మరి. అతడిది ఓరుగల్లు. రెండవది అతడు ఎదిగి వచ్చే సమయానికి తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష తీవ్రమైంది. అందువల్లే 2001 నుంచి ఆయన తన మూలాలవైపు దృష్టి మరల్చాడు. మలి తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన నాటినుంచీ ఉద్యమాన్ని డాక్యుమెంట్ చేయడం ప్రారంభించాడు. ఆ క్రమంలో మూడు లక్షల విలువైన కెమెరాను ‘సాగర హారం’ సమయంలో, అతడెవరో తెలియక పగలగొట్టారు. అయినా, తాను నిరాశకు గురికాలేదు. పని చేస్తూనే ఉన్నాడు. ఇక రెండవది, కాకతీయ శిల్పకళపై ఆయన చేస్తున్న ఫొటోక్షిగఫీ లేదంటే ప్రస్తుతం ఎత్తుకున్న వ్యాసం.

కాకతీయ శిల్పంపై ఆయన చేసిన ఫొటోక్షిగఫీ ఒక చూడముచ్చట. నిజానికి ఛాయచిత్ర రచనలో శిల్పం ఎప్పుడూ మానవుడికి సవాల్ విసురుతూనే ఉంటుంది. చరిత్ర పట్ల అవగాహన ఒక్కటే మంచి ఫొటోక్షిగాఫర్‌ను చేయదు కూడా. అయినా ప్రతి ఫొటోక్షిగాఫర్ మార్మికమైన వెలుగునీడలతో శిల్పాన్ని తదేకంగా ధ్యానిస్తూనే ఉంటాడు. అయితే ఒక్కో ఫొటోక్షిగాఫర్‌కు ఒక్కో దశలో కొన్ని మెలకువలు పట్టుబడతాయి. తనవైన పద్ధతులు అవలంభిస్తాడు. ఒక్కోసారి తనకూ శిల్పకళకూ సమన్వయం కుదిరే అంశాలతో భేటీ అవుతాడు. లేకపోయినా కొనసాగుతాడు. 

అయితే, మధుగోపాల్‌కు కాకతీయ శిల్పంపై పని చేయడానికి బాల్యంలో అక్కడ ఆడ్డుకున్న వైనం ఒక ముచ్చటైన తోడు ఒకటైతే, ఎదిగిన తర్వాత ఒక భూమి పుత్రుడిగా అక్కడి కళను భవిష్యత్తరాల కోసం భద్రపర్చాలన్న ఆకాంక్ష రెండవ అంశంగా తోడైంది. అయితే, అతడు కాకతీయ శిల్పంపై చిన్నప్పుడు అన్నయ్య కెమెరాతో ఫొటోక్షిగఫీ చేశాడు. కానీ, అవి బాగా రాలేదు. పెద్దయ్యాక తీసినవి బాగా వచ్చాయా అంటే ఒక దశ దాకా రాలేదనే చెప్పాలి. 2005లో జూన్ మాసంలో... తొలకరి వచ్చిన పిదప ఒక అద్భుతం జరిగింది.

‘‘అప్పుడే వర్షం కురిసి వెలిసింది. నేను కెమెరా పట్టుకుని కోటలో తిరుగుతూ ఉన్నాను. సమయం నాలుగవుతోంది. అప్పటిదాకా పనిచేయడం వల్ల అలసిపోయి ఒక పొడవాటి స్తంభం దగ్గర విశ్రాంతికోసం ఒరిగాను. కాసేపటి తర్వాత తలెత్తి చూస్తే, ఆ స్తంభం ఒక కాగడా మాదిరిగా వెలుగుతూ ఉంది. అది కలా నిజమా! అన్న భ్రాంతికి లోనయ్యాను. పైన ఆకాశంలోని మబ్బులన్నీ ఆ కాగడా నుంచి జ్వలిస్తున్న మంటల్లా కానవచ్చాయి. ఆశ్చర్యంతో లేచి నిలబడి చూట్టూ చూశాను. ఆ సరికొత్త వాతావరణానికి షాక్ అయ్యాననే చెప్పాలి’’ అని గుర్తు చేసుకున్నాడు మధుగోపాల్.


చుట్టు ముట్టూ ఉన్న శిల్పాలు, ఆ శిథిలాలూ, కాకతీయ తోరణాలు అన్నీ కూడా ఆకాశాన్ని కాన్వాసుగా చేసుకున్న పెయింటింగుల మాదిరి సరికొత్త శోభతో వెలిగిపోతూ ఆహ్లాదంగా అమోఘంగా కానవస్తుంటే అతడు విభ్రమానికి లోనై చూడసాగాడట. అప్పడర్థమైంది. శిల్పం అంటే స్థలం మాత్రమే కాదు, కాలం కూడా అని. తగిన వాతావరణంలో శిల్పం అసామాన్య వైభవాన్ని ఆవిష్కరిస్తుంది. అందుకే, భారతీయ శిల్పం సాధారణంగా ఓపెన్‌గా ఉంటుంది. ఏ శిల్పమైనా మనల్ని ఆహ్వానిస్తూ ఉంటుంది తప్ప యురోపియన్ శిల్పం మాదిరి మనల్ని కేవలం ఆశ్చర్యపరిచేలా ఉండదు. ‘‘చూస్తుంటే శిల్పం నన్ను సరికొత్తగా ఆహ్వానించింది. ఇక నిదానంగా ఆ కోటలో తిరగసాగాను’’ అన్నాడు.

ఒక్కొక్క శిల్పం తన రహస్యాలను చూపుతుంటే మధుగోపాల్ అప్పుడే కళ్లు తెరుచుకున్న బాలుడిలా తల్లిని తదేకంగా చూస్తున్నట్టు ఆ కాకతీయ వైభవాన్ని ఆ రోజు తనవితీరా ఆస్వాదించాడు. ఇక మెల్లగా కెమెరాను సరిచేసుకున్నాడు.

సంగతి అర్థమైన కొద్దీ ఇక శిల్పాన్ని కేవలం శిల్పం మేరకే కాకుండా దూరంగా నిలబడి చూడటం మొదపూట్టాడు మధుగోపాల్. ఈసారి ప్రకృతిలో అత్యంత అపూర్వంగా సృజించిన కాకతీయ వైభవం తాలూకు రహస్యాలను ఆయన మళ్లీ అనుభవించడం ప్రారంభించాడు. ‘‘ఒక రకంగా పరుసవేదినే అయ్యాను. బంగారం తయారీకి సంబంధించిన రహస్యం దొరికినంత ఆనంద పరవశుడినయ్యాను’’ అంటాడు మధుగోపాల్.

‘‘పంచభూతాలు నన్ను ఆశీర్వదించాయనే చెప్పాలి. ఇక ఆ శిల్పం నీటితో కడిగి, ముత్యంలా మెరిసే సమయం కోసం వేచి చూడటం అర్థమైంది. అంటే నీటి మహిమ తెలిసింది. చల్లటి గాలి వీస్తుండగా అలాగే ఒక్కొక్కసారి ఈదురుగాలి వీస్తుంటే వాటినుంచి శిల్పాన్ని చూడటమూ తెలుసుకున్నాను. అలా గాలి మహత్తు తెలిసింది. శరీరాన్ని హాయిగా మారుస్తున్న గాలి నుంచి, కురిసి వెలిసిన వర్షం నుంచి ఆయా శిల్ప పరిసరాలు సంతరించుకుంటున్న రూపురేఖలను చూడటం మొదలైంది. ఆ రోజు తర్వాతి రోజు...మరునాడు...ఇక నా అన్వేషణ అలా కొనసాగింది. అప్పటిదాకా వెలుగునీడల గురించి మాత్రమే గమనింపు ఉండేది. అటు పిమ్మట ఆ వెలుతురులో ఒక్కోసారి నిప్పులా మండిపోతున్న శిల్పాలను, ఆ శిల్పాల కింద గాఢంగా ఉన్న మట్టినీ గమనించసాగాను.

ఇలా తల వంచి పుడమినీ, తలెత్తి ఆకాశాన్ని మధ్యలో కాకతీయ శిల్పకళా వైభవాన్ని పంచభూతాల సాక్షిగా ఫీలయ్యానని మధుగోపాల్ చెబుతుంటే, నిజంగానే ఆయన అదృష్టవంతడనే అనిపించింది. ఎందుకంటే, ఆయన తాను అనుభూతికి లోనైన స్థితిని కెమెరా కంటితో కూడా బంధించాడు. ఆ అద్భుత చిత్రాలను మనమూ చూసే వీలూ కల్పించాడు.
ఇలా వేల ఏళ్ల కిందటి చరివూతను, ఆనాడు జనించిన శిల్ప లావణ్యాన్ని, ఒకానొక ఆధ్యాత్మిక స్థితిలో దర్శిస్తున్నట్టు సందర్శించానని మధుగోపాల్ చెప్పారు. ‘‘ఇదీ అసలైన మేలుకొలుపు’’ అంటారాయన. అంతకుముందు ఎన్నోసార్లు ఫొటోలు తీశాను. 

కానీ, అవన్నీ వీటిముందు ఇక దిగదుడుపే’’ అని అప్పుడే అనుకున్నాడట. అలా, అనాటినుంచి మధుగోపాల్ కాకతీయ శిల్ప విన్యాసాన్ని అపూర్వంగా ఆవిష్కరించసాగాడు. వేర్వేరు రుతువుల్లో ఆ శిల్ప సముచ్ఛయాన్ని బంధించ సాగాడు. అయితే, ఇదంతా తనకు పొటోక్షిగఫీలో ఒక జీవిత కాలం పాఠాన్ని బోధిస్తుండగా అతడికి విజయనగర వైభవాన్ని ఫొటోక్షిగఫీ చేసే అవకాశం రావడం, యాధృచ్చికమే అయినా అదీ ఇందులోంచి జనించిన వరంగానే అనిపిస్తుంది!

విజయనగరం శిల్పకళా వైభవాన్ని వందేళ్ల క్రితం Alexander Green Law ఫొటొక్షిగఫీలో బంధించాడు. 1983లో సరిగ్గా అయన ఎక్కడ నిలబడి ఎలా వేటినైతే చిత్రీకరించాడో అలాగే John Gollings అనే మరో ఫొటోక్షిగాఫరూ చిత్రీకరించాడు.



ఆ పుస్తకం అనుకోకుండా తనకు దొరికింది. అదృష్టవశాత్తూ తానూ సరిగ్గా ఆయా చిత్రాలను మళ్లీ అవే స్థలాల్లోకి వెళ్లి రంగుల్లో చిత్రీకరించే అవకాశం లభించింది. అలెగ్జాండర్ తీసిన అప్పటి నలుపు తెలుపు చిత్రాలు, తాను రంగుల్లో తీసిన చిత్రాలు- రెండింటినీ కలిపి 2008లో ఢిల్లీలో సుప్రసిద్ధ ఫొటోక్షిగఫీ క్యూరేటర్ ఇబ్రహీం అల్కాజీ గొప్ప ఫొటోక్షిగఫీ ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శన వల్ల మధుగోపాల్ పనితనం కూడా దేశవ్యాప్తంగా రఘురాయ్ వంటి సుప్రసిద్ధ ఫొటోక్షిగాఫర్ల మెప్పు పొందేలా చేసింది. అయితే, ఎగ్జిబిషన్ సందర్భంగానే, అలెగ్జాండర్ గ్రీన్ చిత్రించిన విజయనగర వైభవాన్ని Splendour in ruins పేరిట ఒక పుస్తకంగా తెచ్చారు. ఆ పుస్తకం చూడగానే మధుగోపాల్‌కు తళుక్కున తన ఏకశిళా నగరం... మహత్తరమైన కాకతీయ వైభవం కళ్లలో మరోసారి మెదిలింది.

‘శిథిలమౌతున్న వైభవం’ లేదా Splendour in ruins అనగానే తన జీవితంలో ఒకానొక భాగమైన ‘కాకతీయ శిల్పాలన్నీ గుర్తొచ్చాయి. ‘‘ఆ టైటిల్ విజయనగరానికి కాదు, నిజానికి శిథిలావస్థలోఉన్న మన కాకతీయ వైభవానికి, తెలంగాణకు సరిగ్గా నప్పుతుందని అప్పుడే అనుకున్నాను. ఇక అప్పట్నుంచే అదే పేరుతో కాకతీయుల శిల్పకళా వైభవాన్ని పుస్తకంగా తేవాలన్న సంకల్పం నాలో స్థిరపడింది. నాటినుంచీ కాకతీయల చరివూతపై వచ్చిన పుస్తకాలన్నిటినీ లోతుగా అధ్యయనం చేశాను. కొన్ని వందల సార్లు ఆయా స్థలాలను సందర్శించాను. అలా ఇటు చారివూతక అవసరాన్ని అటు పంచ భూతాల్లో ఒక అలౌకికంగా కానవచ్చే శిల్పాన్ని నిరంతరాయంగా ఫొటోక్షిగఫీ చేస్తున్నాను’’ అని మధుగోపాల్ వివరించారు.

చిత్రమేమిటంటే, అలెగ్జాండర్ గ్రీన్ నిలబడ్డ చోటునుంచే తానూ విజయనగరాన్ని చిత్రీకరించిన మధుగోపాల్ మరో విషయాన్నీ అందిపుచ్చుకున్నాడు. అది మన ‘రాజా దీనదయాల్’ ఫొటోక్షిగఫి. అవును. ఆ మహానుభావుడు తీసిన ఫొటోలనూ అధ్యయనం చేశాడు. మళ్లీ అతడు తీసిన పరిసరాల వద్దకు వెళ్లి సరికొత్తగా ఆ ప్రదేశాలను ఫొటోక్షిగఫి చేయసాగాడు. ‘‘అలా హైదరాబాద్ మీద కూడా పనిచేస్తున్నాను’’ అని వివరించారు మధుగోపాల్. ‘‘అదేమిటోగానీ - గత వైభవాన్ని, ప్రదేశాలను, పరిసరాలను అపూర్వంగా చిత్రీకరించే అవకాశం నాకు తెలియకుండానే, యాధృచ్చికంగానే లభిస్తూ వస్తోంది. ఆ లెక్కన నేను అదృష్టవంతుడినే’’ అన్నారాయన. నిజమే. అతడు నాలుగేళ్ల క్రితం వరదలు సంభవించినప్పుడు ఆలంపూరు దేవాలయం, ఆ గ్రామ పరిసరాలను, అక్కడి విధ్వంస చరివూతనూ అమిత శ్రద్ధతో చిత్రీకరించాడు.

‘‘కానీ, నాకొక్కటే అనిపిస్తుంది’’ అన్నారు చివరగా. ‘‘ నేను పుట్టి పెరిగిన స్థలంలో ఒక గొప్ప రాజవంశం వారు అపూర్వంగా ఒక రాజ్యాన్నే ఏలారని, వారిది అద్భుతమైన పరిపాలన అని నాకు ఇంత ఆలస్యంగా తెల్సిందేమిటా? అని ఆశ్చర్యపోతుంటాను. ఇలా ఎందుకు జరిగింది? అని విచారిస్తూ ఉంటాను?’ అన్నారాయన. 


‘‘నిన్న మొన్నటి నిజామ్స్ గురించి తెలుసు. కానీ, మనం అంతకు ముందరి చరివూతను ఎందుకు పట్టించుకోలేదని పదే పదే ఆలోచిస్తుంటాను’’ అని కూడా అన్నారాయన. ‘‘ఈ ప్రశ్నలకు జవాబుగానే ఆయన తన పనిని మలుచుకుంటున్నట్టుగా చెప్పాడు కూడా. ‘‘నా మాదిరిగా చారివూతక విషయాల పట్ల అలక్ష్యంగా కొత్త తరం పెరగవద్దనే భావిస్తున్నాను. అందుకే నా వంతుగా నేను మన వైభవాన్ని అర్థం చేసుకొని, పదిల పరిచే పనిలో ఉన్నాను. దీన్ని వెంటనే నలుగురికీ చూపించాలన్నా, పుస్తకంగా ప్రచురించాలన్నా నా ఒక్కడితో కాదు. అందుకే ఇలాంటి పనులన్నీ ‘లాంగ్ టర్మ్’ పనులుగా పెట్టుకున్నాను. నిశ్శబ్దంగా పని చేసుకుంటున్నాను’’ అని వివరించారాయన. ‘‘ఎవరు ముందుకు వచ్చినా, రాకున్నా నా పని నేను చేసుకుంటూ పోతున్నాను’’ అని ముగించారాయన.
జనవరిలో తెలంగాణ చిత్రాల ప్రదర్శణ

కొత్త సంవత్సరంలో జనవరి 3 నుంచి ముంబైలోని నారీమన్ పాయింట్‌లో ఉన్న ‘సెంటర్ ఫర్ ఫొటోక్షిగఫీ యాజ్ ఆర్ట్ ఫాం -పిరామల్ ఆర్ట్ గ్యాలరీ’లో తెలంగాణలో జరిగే పండుగలు, జాతర్లపై మధుగోపాల్ ‘ఫేసెస్ ఆఫ్ ఫేత్’ పేరిట ఛాయచిత్ర ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నారు. అయితే, ఇంతకన్నా ముందే, కాకతీయ శిల్పంపై ఆయన ప్రదర్శన ఏర్పాటు చేయాలనుకున్నారు. కానీ, కలెక్టర్ చైర్మెన్‌గా ఉన్న కాకతీయ ఉత్సవ కమిటీ ఆయన ప్రతిపాదనను ఆచరణలోకి తేనేలేదు. అయితే, 2009లో ఆయన ‘పోయెట్రీ ఇన్ స్టోన్’ పేరిట విజయనగర శిల్పం, అలాగే కాకతీయ శిల్పంపై తాను తీసిన ఛాయచివూతాలు కొన్నింటిని ప్రదర్శించారు. కానీ, ఏడాది పొడవునా ఉత్సవాలు జరుపుకుంటున్న ఈ సందర్బంలో అతడి కళను నలుగురు చూడవలసే ఉంది.

‘‘ఇలా వేల ఏళ్ల కిందటి చరివూతను, ఆనాడు జనించిన శిల్ప లావణ్యాన్ని, ఒకానొక ఆధ్యాత్మిక స్థితిలో దర్శిస్తున్నట్టు సందర్శించానని మధుగోపాల్ చెప్పారు. ‘‘ఇదీ అసలైన మేలుకొలుపు’’ అంటారాయన.’’
- కందుకూరి రమేష్ బాబు
మధుగోపాల్ మొబైల్: 93911 49981
from namaste telangana