11, డిసెంబర్ 2012, మంగళవారం
10, డిసెంబర్ 2012, సోమవారం
తెలంగాణ ఏర్పాటుకు ‘ఆమ్ ఆద్మీ పార్టీ’ మద్దతు
న్యూఢిల్లీ: తెలంగాణ ఉద్యమానికి, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు సర్వత్రా సానుకూలత వ్యక్తమవుతుంది. ఉద్యమించిన ప్రతిచోటా బాసట దొరుకుతూనే ఉంది. తాజాగా, నిన్నగాక మొన్న పుట్టిన ‘ఆమ్ ఆద్మీ పార్టీ’ తెలంగాణ ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఈమేరకు ఇవాళ ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ఓయూ జేఏసీ విద్యార్థులు చేపట్టిన దీక్షా శిబిరానికి ఆమ్ ఆద్మీ పార్టీ నేత మనీష్ శిశోడియా వచ్చారు. తెలంగాణ విద్యార్థుల దీక్షకు సంఘీభావం ప్రకటించారు.
తెలంగాణ, సీమాంధ్రకు వేరువేరు శాఖలు
తమ పార్టీకి తెలంగాణ, సీమాంధ్రల్లో వేరు వేరు శాఖలు ఉంటాయని ఆమ్ ఆద్మీ పార్టీ నేత మనీష్ శిశోడియా తెలిపారు. ఇవాళ ఆయన జంతర్‌మంతర్ వద్ద తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం దీక్ష చేస్తున్న ఓయూ జేఏసీ విద్యార్థుల వద్దకు వచ్చిన సందర్బంగా ఈ విషయం చెప్పారు. తెలంగాణ, సీమాంధ్రలు రెండు వేర్వేరు రాష్ట్రాలుగా ఉండాల్సిందేనని ఆయన అభిప్రాయపడ్డారు.
నా తెలంగాణ
ఘనమైన సంస్కృతి
గలది నా తెలంగాణ
గొప్ప సంప్రదాయపు
వలపు నా తెలంగాణ
యాస భాషపూన్నో
కలది నా తెలంగాణ
మోసమెరగని
కల్పవల్లి నా తెలంగాణ
వీర వనితల గన్న
నారి నా తెలంగాణ
పోరుబిడ్డల గుండె
ధైర్యం నా తెలంగాణ
నైజాం పాలనలో
నలిగి నా తెలంగాణ
పోరు సలిపి వీరుల
నిల్పె నా తెలంగాణ
నల్ల బంగారం
సిరుల నా తెలంగాణ
కనక వర్షపు ధార
గిరులు నా తెలంగాణ
అడవి సంపద కళ
నిడివి నా తెలంగాణ
ఆదివాసుల జీవ
విడిది నా తెలంగాణ
కల్ల కపటం లేని
అవ్వ నా తెలంగాణ
శిల్పకళలకు పురిటి
గడ్డ నా తెలంగాణ
నిండు ముత్తైదువు
అమ్మ నా తెలంగాణ
వలస పాలకులంత
దోచె నా తెలంగాణ!
గలది నా తెలంగాణ
గొప్ప సంప్రదాయపు
వలపు నా తెలంగాణ
యాస భాషపూన్నో
కలది నా తెలంగాణ
మోసమెరగని
కల్పవల్లి నా తెలంగాణ
వీర వనితల గన్న
నారి నా తెలంగాణ
పోరుబిడ్డల గుండె
ధైర్యం నా తెలంగాణ
నైజాం పాలనలో
నలిగి నా తెలంగాణ
పోరు సలిపి వీరుల
నిల్పె నా తెలంగాణ
నల్ల బంగారం
సిరుల నా తెలంగాణ
కనక వర్షపు ధార
గిరులు నా తెలంగాణ
అడవి సంపద కళ
నిడివి నా తెలంగాణ
ఆదివాసుల జీవ
విడిది నా తెలంగాణ
కల్ల కపటం లేని
అవ్వ నా తెలంగాణ
శిల్పకళలకు పురిటి
గడ్డ నా తెలంగాణ
నిండు ముత్తైదువు
అమ్మ నా తెలంగాణ
వలస పాలకులంత
దోచె నా తెలంగాణ!
- ఆనంద మహి ,ఖమ్మం
(from namaste telangana)
3, డిసెంబర్ 2012, సోమవారం
జలదోపిడీయే హంద్రీ నీవా..!
హంద్రీనీవా ప్రాజెక్టుకు ఇటు తెలంగాణ నాయకులు అటు కోస్తాంధ్ర నాయకులు నీళ్లు వదలడం అక్రమమంటున్నారు. ప్రాజెక్టు కట్టుకున్నాక నీళ్లు వదిలితే అభ్యంతరమమేటి? హంద్రీనీవా ప్రాజెక్టు పొడుగునా మంత్రి రఘువీరాడ్డి పాదయాత్ర చేపట్టడం, దానికి అన్ని ప్రాంతాల నాయకులు, మంత్రులు హాజరవుతున్నారు గదా మరేమిటీ గందరగోళం?
-పిడమర్తి వీరేశం, ఓయూ క్యాంపస్, హైదరాబాద్
హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టు కృష్ణానదిలో లభించే సర్‌ఫ్లస్ వాటర్స్ అంటే మిగులు జలాలను 40 శతకోటి ఘనపు అడుగుల మేరకు ఉపయోగించుకుంటూ రాయలసీమలోని కర్నూలు, అనంతపురం,కడప, చిత్తూరు జిల్లాల్లోని 6,02,500ఎకరాల భూమికి సాగునీరందివ్వడమేకాక, 33లక్షల జనా భాకు తాగునీరు అందించే ఉద్దేశ్యంతో రూపొందించబడింది. ఇది ప్రధానంగా కాలువ స్కీం. ఈ కాలువను కర్నూలు జిల్లా నందికొట్కూరు మండలంలో మల్యాల గ్రామ సమీపంలో హంద్రీ అనే ఉపనది నుంచి, చిత్తూరు జిల్లాలోని ‘నీవా’ ఉపనది వరకు తవ్వుతారు. కనుకనే దీనిపేరు ‘హంద్రీనీవా’ అయింది. శ్రీశైలం రిజర్వాయర్ జలాశయం వెనుకనుంచి (బ్యాక్‌వాటర్స్) 266.60 మీటర్లస్థాయి నుంచి ప్రధాన కాలువ మార్గంగా 9 లిఫ్ట్‌ల ద్వారా మొత్తం 203 మీట ర్ల ఎత్తుకు జలాలను అంచెంచెలుగా తరలిస్తూ, మార్గమధ్యంలో కృష్ణగిరి, పత్తికొండ, జీడిపల్లి, గొల్లపల్లి చెర్లోపల్లి, అడవిపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లను ఉపయోగించుకుంటూ మొత్తం 6 కిలో మీటర్లపాటు మూడు సొరంగ మార్గాలు కూడా ఉపయోగించుకుంటూ, 500 కిలోమీటర్ల దూరం ప్రయోణంచేసి నిర్ధారిత ఆయకట్టును సాగుచేసే పథకమిది. ప్రధాన కాలువ రెండు లక్షల 54 వేల ఎకరాలకు సాగునీరందివ్వగా, పేరూర్, ఆత్మకూరు, మడకశిర, పుంగనూరు, తంబళ్లపల్లి, నీవా, వాయల్వాడు బాంచి కాలువలు 3,48,500 ఎకరాలకు నీరందిస్తాయి.
వెనుకబడిన,కరువు ప్రాంతాలకు నిలయమైన, రాయలసీమకు ఈ పథకం ప్రయోజనం కలిగిస్తుంది. ఈ బృహత్ ప్రణాళికను దశలవారీగా పూర్తి చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నది. మొదటిదశలో కర్నూలు, జల్లాలో 80 వేల ఎకరాలకు, అనంతపురం జిల్లాలో లక్షా18వేల ఎకరాలకు నీరందిస్తారు. ఈ మొదటిదశ పనులను జలయజ్ఞంలో భాగంగా 2774కోట్ల ఖర్చుతో జీవో- 2ను 3-1-2007 నాడు పాలనాపరమైన ఆమోదం తెలపడంతో పనుల ను చకచక ముగించి, హడావిడిగా ప్రారంభోత్సవం జరిపించారు. ఇటీవలే ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌డ్డి తన జీవితం ధన్యమైందని ఉప్పొంగిపోతూ హంద్రీనీవా ప్రాజెక్టులోకి నీరు వదిలారు. (ఆనీరు శ్రీశైలం జలాశయం నుంచి వదిలిన నికర జలాలు అని గమనించాలి) ఇంతవరకు బాగానే ఉన్నది. ఇంత అద్భుతమైన స్కీం మరొకటి లేదంటూ మంత్రి రఘువీరాడ్డి కాలువ పొడువునా కాలినడకన పయనిసూ,్త రోజుకో అధికార ప్రతిపక్ష నాయకుడిని తన యాత్రలో భాగస్వామిని చేస్తూ, చిలుకపలుకులు వల్లింపచేస్తూ ఈ పాదయాత్ర చేస్తున్నారు.సమస్య ఎక్కడ? అంటే.. హంద్రీనీవా స్కీం కృష్ణానదిలో వరదలు వచ్చినప్పుడు, నికర జలాలపై ఆధారపడ్డ ఆయకట్టుకు నీరంది, మిగతా నీరు సమువూదంలోకి వృధాగా పోతున్నప్పుడు, ఆవృధాగా పోయే నీటిని ఒడిసిపట్టుకుని కరవు క్షేత్రాలకు తరలించాలి. మరి ఈసంవత్సరం వర్షాలులేవు. వచ్చిన నీటి ని పైరాష్ట్రాలు తమ జలాశయాలు నింపుకుని, మిగతా నీటిని మాత్రమే మన కు వదలడం జరిగింది. శ్రీశైలం,నాగార్జునసాగర్ జలాశయాలలో కనీస నీటి మట్టాలను కూడా‘మెయిన్‌టెయిన్’చేయలేని గడ్డు పరిస్థితి ఎదుర్కొన్నాం. కృష్ణా డెల్టా రైతులు తమకు సకాలంలో నీరందివ్వలేదని ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. సాగర్ ఆయకట్టు దారులు డిసెంబర్ ఒకటిన పంటలు వేసుకోవడానికి చెరో 15 టీఎంసీలు తప్ప అధికంగా లేవనీ, కనుకవిధిగా ఆరుతడి పంటలను మాత్రం వేసుకోమని ప్రభుత్వమంటున్నది. జంటనగరాలకు, కృష్ణాబేసిన్‌లోని పట్టణాలకు, పల్లెలకు, తాగునీటి అవసరాలకు సరిపడా నీరందవ్వడమే కష్టమైన ఇప్పటి పరిస్థితుల్లో ప్రభుత్వం శ్రీశైలం నీటిని నిలువ చేస్తూ, అటు విద్యుత్తు ఉత్పత్తి చేయకుండా, ఇటు సాగర్ ఆయకట్టుదారులకు నీరందివ్వకుండా రాయల సీమకు తరలిస్తున్నారు. తమ ఇష్టారాజ్యమన్నట్టు పోతిడ్డిపాడు గేట్లు తెరిచి కొంతనీరు, ఇప్పుడు హంద్రీనీవాకు మరికొంత నీరు వదలడంలో ఉద్దేశమేమిటో స్పష్టమవుతూనే ఉన్నది. కృష్ణా నికరజలాలపై హక్కు ఉన్న సాగర్ ఆయకట్టుదారుల(కుడి,ఎడమ కాలువలు)ది. కృష్ణా డెల్టా రైతుల గోడు పట్టించుకోకుండా, ఎలాంటి హక్కులేని తెలుగు గంగకు కానీ, హంద్రీనీవాకు గాని కృష్ణా జలాలను వదలడమంటే నీటి దొంగతనం తప్ప మరొకటి కాదు. సీఎం రాయలసీమ పక్షపాతి అనడానికి ఇంకేం రుజువు కావాలి?
ఇక ప్రభుత్వం జారీ చేసిన జీవోలు ఏం చెప్పుతున్నాయో చూద్దాం. శ్రీశైలం జలాల నిర్వహణ కోసం ఇప్పటికీ చెలామణి అవుతున్న జీవో-69 జారీ చేసిం ది.15-6-1996 తదనంతరం జీవో-698(14-8-2005),జీవో-233 (19-12-2005), జీవో 3 (4-1-2006) విడుదలైనా,జీవో-69లోని నిర్వహణకు సంబంధించిన ప్రాధాన్యంగాని, నీటి మట్టాలతో ముడిపడి నీటి విడుదలపై ఉన్న ఆదేశాలను గాని మార్చలేదు. జీవో-69 విడుదలయ్యే నాటికి తెలుగుగంగ ప్రాజెక్టు మాత్రమే ఉన్నది. హంద్రీనీవా గానీ ఇంకా ఇతర ప్రాజెక్టులు-గాలేరు నగరి, వెలిగొండ, నెట్టంపాడు, కల్వకుర్తి ప్రాజెక్టులు రూపుదిద్దుకోనందున వాటి ప్రసక్తిలేదు. కనుక తెలుగుగంగ లాగే హంద్రీనీవా, ఇంకా ఇతరప్రాజెక్టులు (పైన చెప్పినవి) అన్నీ మిగులు జలాల ఆధారంగానే నిర్మాణమైన, అవుతున్న ప్రాజెక్టులు. కాబట్టి ఆ ఆదేశాలే వీటికి వర్తిస్తాయి.జీవో- 69 లో పేర్కొన్న ముఖ్యమైన అంశమేమంటే శ్రీశైలం నీటిమట్టం 875 అడుగుల (266.70 మీటర్లు)కు ఎగువన ఉన్నప్పుడు ప్రాధాన్యతాపరంగా మద్రాసు తాగునీటి అవసరాలు, శ్రీశైలం విద్యుత్తు ఉత్పాదన, నాగార్జునసాగర్ ప్రాజెక్టు అవసరాలు, శ్రీశైలం కుడిగట్టు కాలువ అవసరాలు, ఆతర్వాత తెలుగుగంగకు నీరు వదలాలని స్పష్టంగా ఉన్నది.శ్రీశైలం జలాశయంలో 885 అడుగులు పూర్తి జలస్థాయి కంటే 10అడుగుల కింద ఉన్నప్పుడు ఆరోప్రాధాన్యం తెలుగుగంగకు నీరు వదలాలన్నది ఆదేశం.ఇదే జీవోలో శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం 875 అడుగులకు దిగువన ఉన్నప్పుడు తెలుగుగంగకు నీరు వదలరాదన్నది ప్రభుత్వ ఆదేశం. ముందొచ్చిన తెలుగుగంగకే నీరు లేనప్పుడు కొత్తగా వెలిసిన హంద్రీనీవాకు నీరెక్కడిది? అంటే హక్కు లేకపోయినా హంద్రీనీవా ప్రాజెక్టుకు అక్రమంగా నీటిని ప్రభుత్వమే తరలించడం విడ్డూరం.అంటే ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలనే బుట్టదాఖలు చేసి ఇష్టమొచ్చినట్టుగా వ్యవహరిస్తున్నది.
ఇక మిగులు జలాల విషయంలో మన రాష్ట్రానికున్న హక్కు ఏమిటి? దాన్ని మనంఎలా ఉపయోగించుకుంటున్నాం అన్న సంగతి కూడా అర్థం చేసుకోవా లి. బచావత్ ట్రిబ్యూనల్ ఇచ్చిన అవార్డు ప్రకారం మనరాష్ట్రానికి 811 టీఎంసీల నికర జలాలు లభ్యమయ్యాయి. వాటిని పూర్తిగా మనం సద్వినియోగం చేసుకుంటున్నాం. నికర జలాలకు తోడు మిగులు జలాలపై సంపూర్ణమైన వినియోగపు స్వేచ్ఛను మనకు బచావత్ ట్రిబ్యూనల్ ఇచ్చింది. ఇది స్వేచ్ఛ మాత్ర మే అని, హక్కుకాదని అనేక సార్లు ట్రిబ్యూనల్ మనకు గుర్తుచేయడం గమనించదగ్గ విషయం. మనమేం చేయాలి? మనకు లభించిన స్వేచ్ఛను హక్కు అని భావిస్తూ, మన ప్రజలను కూడా భ్రమింప చేస్తూ కొత్త ప్రాజెక్టులను ఆవిష్కరించుకున్నాం. ఇందులో భాగంగా తెలంగాణలో మూడు, సీమాంవూధలో నాలుగు. రాష్ట్రంమొత్తంగా 227.50టీఎంసీల మిగులు జలాల వినియోగంతో ఏడు ప్రాజెక్టులను జలయజ్ఞ కార్యక్షికమంగా చేపట్టడమేగాక కొత్త ట్రిబ్యూనల్ ముందు కూడా ఈ ప్రాజెక్టులను అనుమతించవలసిందిగా అర్జీలు పెట్టాం. ఎలాంటి హక్కులేకుండా మిగులు జలాల వినియోగంతో చేపట్టిన ప్రాజెక్టులపైన తీవ్రమైన అభ్యంతరం వెలిబుచ్చడమే కాకుండా, వెంటనే ఈ అనధికార ప్రాజెక్టులను ఆపేయవలసిందిగా కర్ణాటక కొత్త ట్రిబ్యూనల్‌ను కోరింది.‘మేం ఎలాంటి హక్కు కోరం,మిగులు జలాల్లో ఎంత నీటినిస్తే దాన్నే వాడుకుంటాం. ఎలాంటి క్లెయిమ్స్ పెట్టం’అని అఫడివిట్ రాసిచ్చాకే మన ఈ ప్రాజెక్టులను కొత్త ట్రిబ్యూనల్ అనుమతించాలి. కొత్త బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యూనల్ మిగులు జలాలను మూడు రాష్ట్రాలకు పంచి, ఒక ప్రాథమిక తీర్పును వెల్లడించింది. అయితే ఆ తీర్పును మనం అంగీకరించక పునఃసమీక్ష కోసం ట్రిబ్యూనల్‌ని అర్థించాం. సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించాం. ప్రాథమిక తీర్పులో ట్రిబ్యూనల్ 227.50 టీఎంసీల వినియోగంతో మనం చేపట్టిన ఏడు ప్రాజెక్టులలో దేన్నీ పూర్తిగా అనుమతించలేదు. గుడ్డిలో మెల్లఅన్నట్టు తెలుగుగంగకు మాత్రం 29కి బదులుగా 25 టీఎంసీల మిగులు జలాలను కేటాయించడం జరిగింది. అంటే హంద్రీనీవాకు ఎలాంటి పరిస్థితుల్లో కొత్త ట్రిబ్యూనల్ ఇటు నికర జలాలు, అటు మిగులు జలాలను కేటాయించజాలదన్నది స్పష్టం. మరి మూడు వేల కోట్లు ఖర్చు పెట్టి నిర్మించిన ఈ కాలువ నీరులేక వెల నీళ్లు వచ్చే అవకాశంలేదని తెలిసి కూడా కేంద్ర ప్రభుత్వం నీటి కేటాయింపులేని కారణంగా ప్రాజెక్టును ఆమోదించలేదని తెలిసి కూడా హంద్రీనీవా ప్రాజెక్టును కట్టుకున్నాం. కనుక తెలిసికూడా కట్టుకున్నాక నీరు రాకపోతే వెల మరో ప్రత్యామ్నాయ మే ముంది? ప్రభుత్వం దిక్కుతోచని పరిస్థితుల్లో రిస్క్ తీసుకుని, నికర జలాలపై హక్కు ఉన్న సాగర్ ఆయకట్టుదారులు, కృష్ణా డెల్టా రైతులు ఎంత గొడవ పెట్తున్నా పట్టించుకోకుండా ఎంతో కొంత నీరు హంద్రీకి వదలడం జరిగింది.
ప్రభుత్వానికి తెలుసు, తాము చేస్తున్నది అక్రమమని. తమ అనైతిక చర్య డెల్టా రైతాంగాన్ని సాగర్ రైతులను అన్యాయం చేయడ మే నని కూడా తెలుసు. కాని సీమ వాసులకు ముఖ్యంగా తన నియోజకవర్గ ప్రజలకు మేలుకలిగించే స్కీంను చూస్తూ చూస్తూ అలక్ష్యం చేయ డం ముఖ్యమంత్రి వల్ల కాలేదు. ఇప్పుడు జరుగుతున్న డ్రామా అంతా అదే. అయితే హంద్రీనీవా కట్తున్నప్పుడు గొడవపెట్టకుం డా, తీరా మొదటి దశపనులు పూర్తయి, నీరు వదిలాక అంటే ఏడెమిదేళ్ల తర్వాత ఈ హడావిడి ప్రకటనలు ఎందుకు గుప్పిస్తున్నారని మీరగడవచ్చు. మహామాంవూతికుడు వైఎస్‌ఆర్ అన్ని ప్రాంతాల వాళ్లను బుట్టలో వేసుకుని తన పనిని కానిచ్చుకుంటూ ముందుకు సాగాడు. మహబూబ్‌నగర్ వాళ్లకు భీమా, నెట్టంపాడు, కల్వకుర్తి, ఇచ్చాడు. నల్లగొండవాళ్లకు ఎస్‌ఎల్‌బీసీ (సొరంగం) ఇచ్చాడు. డెల్టావాళ్ళకు పులిచింతల సాంక్షన్ చేశాడు. దీంతో అందరి నోళ్లు మూతపడ్డాయి. ఆహా ఓహో అన్నారు. అపర భగీరధుడు, మరోకాటన్ అని అభివర్ణించారు. అట్లాగే గోదావరిపైన పోలవరం, దుమ్ముగూడెం లిఫ్ట్ స్కీం, కంతనపల్లి, ప్రాణహిత చేవెళ్ల, ఎస్‌ఆర్‌ఎస్‌పీ స్టేజీ-2 వరద కాలువ, దేవాదుల అడిగిందే తడువుగా సాంక్షన్ చేయడంతో కాంగ్రెస్‌నాయకులు ముఖ్యంగా జీవన్‌డ్డి, చిన్నాడ్డి, ప్రతిపక్షనాయకులు యలమంచిలి శివాజీ అందరూ వైఎస్‌ఆర్‌ను పొగిడినవారే. మా లాంటి వాళ్లం మొదట్నుంచీ ఈ మెగా స్కీంల వెనుక జరుగుతున్న మోసం, కుట్రను, అస్మదీయులకు దోచిపెట్టే ప్రయత్నాన్ని ఖండించాం. పోతిడ్డిపాడు దుర్మార్గం. జీవో107 ద్వారా శ్రీశైలం కనీస నీటిమట్టాన్ని పెంచడం, దుమ్ముగూడెం, నాగార్జునసాగర్ టెయిల్‌పాండ్ లాంటి తెలంగాణను ముంచే అనేక కార్యక్షికమాల గురించి మనవాళ్లకు చెప్పినా నాయకుల్లో ఎలాంటి చలనం లేదు. మాలాంటి వాళ్ల ప్రోదల్భం మీద అప్పుడప్పుడు కొందరు మాతో గొంతు కలపడం తప్ప ఏనాడూ సీరియస్‌గా కృష్ణా, గోదావరి జలాలను అక్రమంగా రాయలసీమకు తరలించే ఈదుర్మార్గపు ప్రభుత్వ చర్యలను ఎదిరిం చలేదు. ఒక్కదివంగత పీజేఆర్ మాత్రం ధైర్యంగా పోతిడ్డిపాడు అక్రమాలపై శాసనసభలో వైఎస్‌ఆర్‌ను ఇబ్బందిపెట్టాడు. ఇప్పడనుకుంటే ఏం లాభం? చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టున్నది మన ఏడుపు. సామాన్యు డి అర్థమయ్యే భాషలో చెప్పాలంటే.. మనకు రోజూనాలుగు బిందెల నీళ్లువస్తాయని ప్రభుత్వం ప్రకటించిందనుకోండి, బాగా వరదలు వచ్చినప్పుడు ఎక్కువ నీళ్లు కూడా వదుల్తామని హమీ ఇచ్చిందనుకోండి మనమేం చేస్తాం? నాలుగు కాకపోతే మరో బిందె అదనంగా తెచ్చిపెట్టుకుని, వచ్చినప్పుడు అది నింపిపెట్టుకుంటాం.అదిమన సంస్కృతి.మన పక్కింటివాడికి నీటి కనెక్షన్ లేదు. వరదలు వచ్చినప్పుడు మీకు కూడా నీరిస్తాం అంటే మనతోపాటుగా అయిదు బిందెలు అతనూ సమకూర్చుకున్నాడు. ఇప్పుడు బిందెలు కొనుక్కున్నాను కాబట్టి మన నీళ్లు కట్ చేసైనా సరే వాడికివ్వాలని డిమాండ్ చేస్తూ జబర్దస్తీ చేస్తూ, సాధించుకుంటున్నాడు. అది పొరుగువాడి సంస్కృతి. ఇక ఈ పంచాయితీకి పరిష్కారం ఏమిటి? ప్రత్యేక రాష్ట్రమొస్తే ఎవడి నీళ్లు వాడికి వదిలేటట్టు రెగ్యులేటరీ ఏర్పాటు ఎట్లాగూ చేస్తారు.సమైక్య రాష్ట్రంలో కొనసాగితే తెలంగాణ వాడి పరిస్థితి అధోగతే. కోస్తాంధ్ర వాడికున్న ఆర్థిక సత్తా సీమవాడికున్న కండ బలం,ఈ తెలంగాణకు లేదు. పైగా ఐక్యత అన్నది మనవాళ్లలో మృగ్యం. కనుక ఆ మంచిరోజు వచ్చేదాక ఈ యాతన తప్పదు.
-ఆర్. విద్యాసాగర్‌రావు
కేంద్ర జల సంఘం మాజీ చీఫ్ ఇంజనీర్
(from namaste telangana paper)
కేంద్ర జల సంఘం మాజీ చీఫ్ ఇంజనీర్
(from namaste telangana paper)
తెలంగాణ అవసరం లేదు
- అధిష్ఠానానికి లేఖ రాస్తా.. 9న సోనియాను కలుస్తా
- ప్రత్యేక రాష్ట్రం వస్తే.. నా రాజకీయం వేరే
- డబ్బు ఉంటే రాజకీయాల్లో ఏదైనా చేయొచ్చు
-సంగాడ్డి ఎమ్మెల్యే జగ్గాడ్డి సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్, డిసెంబర్ 2 (టీ మీడియా): తెలంగాణకు ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు వల్ల ఏం జరగదని, అభివృద్ధి ప్యాకేజీ ప్రకటిస్తే చాలని మెదక్ జిల్లా సంగాడ్డి నియోజకవర్గం నుంచి అధికార కాంగ్రెస్ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే తూర్పు జయవూపకాశ్‌డ్డి (జగ్గాడ్డి) అన్నారు. ఈ విషయమై తాను కాంగ్రెస్ అధిష్ఠానానికి లేఖ రాస్తానని, యూపీఏ చైర్‌పర్సన్, కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని కలుస్తానని చెప్పారు. ఆయన ఆదివారం అసెంబ్లీ లాబీలో తనను కలిసిన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఈ నెల 9న సోనియాగాంధీని కలిసి తెలంగాణ రాష్ట్రం అవసరం లేదన్న తన అభివూపాయాన్ని చెప్తానన్నారు. రాష్ట్రం ఏర్పాటుకు బదులు అభివృద్ధి కోసం ప్రత్యేక ప్యాకేజీ కోరుతానని స్పష్టం చేశారు. తెలంగాణ ఎందుకు ఇవ్వొద్దో చెప్పడానికి తన వద్ద అనేక ఆధారాలు ఉన్నాయని తెలిపారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే ఎంఐఎం వంటి మతతత్వ శక్తులు పుంజుకుంటాయని చెప్పారు.
సిద్ధాంతాల ప్రాతిపదికన ఎదిగిన తాను తెలంగాణ విషయంలో అధిష్ఠానం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానన్నారు. అయితే తన అభివూపాయంలో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేశారు. ఈ విషయంలో తనపై ఎలాంటి విమర్శలు వచ్చినా ఎదుర్కొంటానని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే తన రాజకీయం వేరే విధంగా ఉంటుందన్నారు. డబ్బు ఉంటే రాజకీయాల్లో ఏదైనా చేయొచ్చు అని వ్యాఖ్యానించారు. తాను ఎస్సీ వర్గీకరణకు అనుకూలమని చెప్పారు. నిజాం హయాంలో ఉర్దూ తప్ప మరోభాష లేకపోవడంతో ఈ ప్రాంత యువతకు ఉద్యోగ అవకాశాలు రాలేదని తెలిపారు. ఉద్యోగ అవకాశాల కోసం ప్రత్యేక చట్టం తీసుకొని రావాలని అధిష్ఠానాన్ని కోరుతానని చెప్పారు. తెలంగాణలో భారీ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం సాధ్యం కాదని, అందుకు చిన్ననీటి సాగునీటి ప్రాజెక్టులను అభివృద్ధి చేయాలని కోరుతానని తెలిపారు. అభివృద్ధి కోసం ఒక్కో జిల్లాకు రూ చొప్పున మొత్తం పది జిల్లాలకు రూ.10వేలకోట్లు కేటాయించినట్లయితే తెలంగాణ అభివృద్ధి చెందుతుందన్నారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు కోసం రూ.40 వేల కోట్లు మంజూరు చేయాలని కోరుతానని చెప్పారు.
(from namaste telangana)
29, నవంబర్ 2012, గురువారం
నేడు దీక్షా దివస్..
- కేసీఆర్ ఆమరణ నిరశనకు నేటితో మూడేళ్లు
- ఉద్యమాన్ని మలుపు తిప్పిన అపూర్వ ఘట్టం
- కేసీఆర్ దీక్షకు ముందు.. తర్వాత..
- మైలురాయిగా నిలిచిపోయిన పోరాటం
- నేడు ఇందిరాపార్క్ వద్ద సామూహిక దీక్షలు
హైదరాబాద్, నవంబర్ 28 (టీ మీడియా):తెలంగాణ రాష్ట్ర సాధన కోసం టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కే చంద్రశేఖర్‌రావు చారివూతాత్మక ఆమరణ నిరశనకు పూనుకొని గురువారానికి సరిగ్గా మూడేళ్లు పూర్తవుతున్నాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని తెలంగాణవ్యాప్తంగా గురువారం దీక్షా దివస్‌ను టీఆర్‌ఎస్, టీజేఏసీ, ఉద్యోగసంఘాల జేఏసీతో పాటు.. తెలంగాణ ఉద్యమశక్తులు పాటించనున్నాయి. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి మహత్తర స్ఫూర్తినిచ్చిన ఆ రోజును జ్ఞాపకం చేసుకుంటూ తెలంగాణలో మరోసారి మహోద్యమానికి శ్రీకారం చుట్టనున్నారు. తెలంగాణవ్యాప్తంగా జిల్లా, నియోజకవర్గ కేంద్రాల్లో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, నాయకులు ఎక్కడికక్కడ దీక్షా దివస్‌లో పాల్గొననున్నారు. గ్రేటర్ హైదరాబాద్, రంగాడ్డి జిల్లాల నాయకులు రాజధాని నగరంలోని ఇందిరాపార్క్ వద్ద దీక్షా దివస్ పాటించనున్నారు. టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం, ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకులు జీ దేవీవూపసాద్, వీ శ్రీనివాస్‌గౌడ్. సీ విఠల్ ఆధ్వర్యంలో వేలమంది ఉద్యోగులు, కార్యకర్తలు ఇక్కడ సామూహిక దీక్షను చేపడుతున్నారు. ప్రతి శిబిరంలోనూ వేయిమందికి తక్కువ కాకుండా దీక్షలో పాల్గొనాలని నేతలు ఇచ్చిన పిలుపు మేరకు టీఆర్‌ఎస్ శ్రేణులు ఆ ఏర్పాట్లలో ఉన్నాయి.
ఇదీ నేపథ్యం..
తెలంగాణ ఉద్యోగ సంఘాల సారధ్యంలో పెల్లుబికిన ‘రాష్ట్రపతి ఉత్తర్వులలోని 14 ఎఫ్ పేరా తొలగింపు ఉద్యమం’ నిప్పు రాజుకుని.. అగ్నికీలలైనట్లు.. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమాన్ని కీలక దశకు తీసుకువచ్చింది. తెలంగాణ నినాదంతో పది జిల్లాలలో ప్రజలను మహోద్యమశక్తిగా తీర్చిదిద్దిన కేసీఆర్ 2009లో నవంబర్ 29న ఆమరణ నిరశనకు దిగారు. ఒకవైపు గిర్‌గ్లానీ సిఫారసులు, 610 జీవో అమలు చేయాలని, రాష్ట్రపతి ఉత్తర్వులలోని 14ఎఫ్ పేరా తొలగించాలని, హైదరాబాద్ తెలంగాణ అంతర్భాగమేనని ఉద్యోగ సంఘాలు 2008 డిసెంబర్ నుంచి ఉద్యమిస్తున్న సమయమది.
ఉద్యోగ సంఘాల మహాసభలలో మాట్లాడిన కేసీఆర్.. తెలంగాణ రాష్ట్ర సాధనకోసం అవసరమయితే ఆమరణ దీక్షకు దిగుతానని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించారు. ఈ క్రమంలోనే అక్టోబర్ 9, 2009లో హైదరాబాద్ ఫ్రీజోన్ అంటూ సుప్రీం కోర్పు తీర్పు వచ్చింది. దీనిపై ఉద్యోగ సంఘాలు, టీఆర్‌ఎస్ శ్రేణులు తెలంగాణలోని రాజకీయ పార్టీలన్నింటినీ నిలదీశాయి. అక్టోబర్ 12న ఉద్యోగ సంఘాలు చలో అసెంబ్లీకి పిలుపునిచ్చాయి. తెలంగాణలోని రాజకీయ శక్తులన్నీ 14ఎఫ్ పేరా తొలగింపుకోసం కలిసి ఉద్యమించాలని ఉద్యోగ సంఘాలు అక్టోబర్ 12, 2009న పిలుపునిచ్చాయి. నవంబర్ 21, 2009లో సిద్దిపేటలో ఉద్యోగ గర్జన సభ జరిగింది. కనీవినీ ఎరుగని రీతిలో లక్షల సంఖ్యలో జనం హాజరయ్యారు. నవంబర్ చివరి వరకు 14 ఎఫ్ తొలగింపుపై రాష్ట్ర ప్రభుత్వం విస్పష్టంగా ప్రకటించని పక్షంలో నవంబర్ 29 నుండి పెన్‌డౌన్ చేస్తామని టీఎన్జీవో అప్పటి అధ్యక్షుడు కే స్వామిగౌడ్, ప్రధానకార్యదర్శి జీ దేవీవూపసాద్ ఆ సభలో ప్రకటించారు. అంతే వేగంగా కేసీఆర్ నవంబర్ చివరలో ఆమరణ నిరశన దీక్ష చేపడుతానని, కొద్ది రోజులలో ఎక్కడ దీక్షకు దిగేదీ ప్రకటిస్తానని పేర్కొన్నారు.
ఈ క్రమంలో నవంబర్ 29న సిద్దిపేటలో కేసీఆర్ చరివూతాత్మక ఆమరణ దీక్షకు సిద్ధమయ్యారు. కేసీఆర్ ప్రకటన వెలువడిన మరు క్షణం నుంచి తెలంగాణలో అప్రకటిత ఎమ్జనీ వాతావరణం నెలకొన్నది. కరీంనగర్ నుంచి దీక్షావేదిక వద్దకు బయలుదేరిన కేసీఆర్‌ను.. కరీంనగర్ శివారులోని మానకొండూర్ వద్ద పోలీసులు నాటకీయంగా అరెస్టు చేసి ఖమ్మం తరలించారు. అక్కడ సెకండ్‌క్లాస్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. 14 రోజుల రిమాండ్ విధించడంతో కేసీఆర్‌ను ఖమ్మం సబ్‌జైలుకు తరలించారు. అప్పటినుండి
తెలంగాణ ప్రజల ఆకాంక్షలపైన సీమాంధ్ర కర్కశ నిర్బంధకాండ పాశవికంగా కొనసాగింది. నవంబర్ 30న కేసీఆర్ ఆరోగ్యం బాగోలేదని సాకు చెప్పి పోలీసులు ఆయనను ఖమ్మం ప్రభుత్వాస్పవూతికి తీసుకువచ్చి బలవంతంగా దీక్షను భగ్నం చేయించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ తాను జైలులో దీక్షను కొనసాగిస్తానని కేసీఆర్ ప్రకటించారు. మరోవైపు ఉద్యోగుల పెన్‌డౌన్ తారస్థాయికి చేరుకున్నది. తనకు బలవంతంగా వైద్యం చేయించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని, ఈ దుర్మార్గాన్ని ఇదే విధంగా కొనసాగిస్తే తాను ఆత్మహత్య చేసుకుంటానని డిసెంబర్ 1న కేసీఆర్ హెచ్చరించారు. తనను పోలీసులు క్రూరంగా హింససిస్తున్నారని హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. తనను హైదరాబాద్‌కు తరలించాలని న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు.
డిసెంబర్
2న మంత్రి రాంరెడ్డి వెంకటడ్డిని ప్రభుత్వం దూతగా కేసీఆర్ వద్దకు పంపింది.
అయినా దీక్ష విరమించేందుకు కేసీఆర్ ససేమిరా అన్నారు. ఖమ్మం ఆస్పవూతిలో
కేసీఆర్ ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో డిసెంబర్ 3న హైదరాబాద్ నిమ్స్‌కు
తీసుకువచ్చారు. అక్కడ ఆయన ఆమరణ నిరశనను కొనసాగించారు. డిసెంబర్ 4న రాష్ట్ర
ప్రభుత్వ దూతగా మంత్రి దానం నాగేందర్ వచ్చినా కేసీఆర్ తన వైఖరిని
పునరుద్ఘాటించారు. మరుసటి రోజు అప్పటి సీఎం రోశయ్య తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు
విషయం తన చేతిలో లేదని చేతుపూత్తేశారు. టీఆర్‌ఎస్, ఉద్యోగ, విద్యార్థి
సంఘాలు 48 గంటల తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చాయి. అసెంబ్లీ ముట్టడికి
విద్యార్థులు సిద్ధమయ్యారు. డిసెంబర్ 6న కేసీఆర్‌ను రోశయ్య పరామర్శించారు.
దీక్ష విరమించాలని విజ్ఞప్తి చేశారు.
14ఎఫ్ పేరా తొలగింపునకు అనుకూలంగా శాసనసభలో తీర్మానం చేస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ అధిష్ఠానం కేసీఆర్ ఆరోగ్యంపై శ్రద్ధ కనబరిచింది. తెలంగాణ జిల్లాలు బంద్‌తో దద్దరిల్లడంతో ఢిల్లీ పెద్దల ఆదేశాలతో రోశయ్య ఢిల్లీ నుంచి హుటాహుటిన హైదరాబాద్ చేరుకొని డిసెంబర్ 7న అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించారు. వాటి మినిట్స్‌ను ఢిల్లీకి పంపించారు. తెలంగాణకు టీడీపీ, పీఆర్పీ, కాంగ్రెస్ సై అన్నాయి. డిసెంబర్ 8న కేసీఆర్ ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. కేసీఆర్ దీక్ష విరమంచని పక్షంలో ఏదైనా జరుగవచ్చునని నిమ్స్ వైద్యులు ఆందోళన వ్యక్తం చేశారు. శాసనసభ తెలంగాణ నినాదాలతో ప్రతి ధ్వనించింది.
తెలంగాణ ఇవ్వడం మినహా మరో గత్యంతరం లేదని తెలంగాణ మంత్రులు సోనియాగాంధీకి లేఖ రాశారు. డిసెంబర్ 9న ఢిల్లీలో కోర్‌కమిటీ సభ్యులు అత్యవసరంగా రెండు సార్లు భేటీ జరిపారు. చివరకు కేంద్ర హోంమంత్రి చిదంబరం యూపీఏ ప్రభుత్వం తరఫున డిసెంబర్ 9న రాత్రి 11 గంటలకు తెలంగాణ రాష్ట్ర ప్రక్రియను ప్రారంభిస్తున్నామని ప్రకటించారు. కేసీఆర్ దీక్షను విరమించారు.
(from namaste telangana)
- ఉద్యమాన్ని మలుపు తిప్పిన అపూర్వ ఘట్టం
- కేసీఆర్ దీక్షకు ముందు.. తర్వాత..
- మైలురాయిగా నిలిచిపోయిన పోరాటం
- నేడు ఇందిరాపార్క్ వద్ద సామూహిక దీక్షలు
హైదరాబాద్, నవంబర్ 28 (టీ మీడియా):తెలంగాణ రాష్ట్ర సాధన కోసం టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కే చంద్రశేఖర్‌రావు చారివూతాత్మక ఆమరణ నిరశనకు పూనుకొని గురువారానికి సరిగ్గా మూడేళ్లు పూర్తవుతున్నాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని తెలంగాణవ్యాప్తంగా గురువారం దీక్షా దివస్‌ను టీఆర్‌ఎస్, టీజేఏసీ, ఉద్యోగసంఘాల జేఏసీతో పాటు.. తెలంగాణ ఉద్యమశక్తులు పాటించనున్నాయి. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి మహత్తర స్ఫూర్తినిచ్చిన ఆ రోజును జ్ఞాపకం చేసుకుంటూ తెలంగాణలో మరోసారి మహోద్యమానికి శ్రీకారం చుట్టనున్నారు. తెలంగాణవ్యాప్తంగా జిల్లా, నియోజకవర్గ కేంద్రాల్లో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, నాయకులు ఎక్కడికక్కడ దీక్షా దివస్‌లో పాల్గొననున్నారు. గ్రేటర్ హైదరాబాద్, రంగాడ్డి జిల్లాల నాయకులు రాజధాని నగరంలోని ఇందిరాపార్క్ వద్ద దీక్షా దివస్ పాటించనున్నారు. టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం, ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకులు జీ దేవీవూపసాద్, వీ శ్రీనివాస్‌గౌడ్. సీ విఠల్ ఆధ్వర్యంలో వేలమంది ఉద్యోగులు, కార్యకర్తలు ఇక్కడ సామూహిక దీక్షను చేపడుతున్నారు. ప్రతి శిబిరంలోనూ వేయిమందికి తక్కువ కాకుండా దీక్షలో పాల్గొనాలని నేతలు ఇచ్చిన పిలుపు మేరకు టీఆర్‌ఎస్ శ్రేణులు ఆ ఏర్పాట్లలో ఉన్నాయి.
తెలంగాణ ఉద్యోగ సంఘాల సారధ్యంలో పెల్లుబికిన ‘రాష్ట్రపతి ఉత్తర్వులలోని 14 ఎఫ్ పేరా తొలగింపు ఉద్యమం’ నిప్పు రాజుకుని.. అగ్నికీలలైనట్లు.. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమాన్ని కీలక దశకు తీసుకువచ్చింది. తెలంగాణ నినాదంతో పది జిల్లాలలో ప్రజలను మహోద్యమశక్తిగా తీర్చిదిద్దిన కేసీఆర్ 2009లో నవంబర్ 29న ఆమరణ నిరశనకు దిగారు. ఒకవైపు గిర్‌గ్లానీ సిఫారసులు, 610 జీవో అమలు చేయాలని, రాష్ట్రపతి ఉత్తర్వులలోని 14ఎఫ్ పేరా తొలగించాలని, హైదరాబాద్ తెలంగాణ అంతర్భాగమేనని ఉద్యోగ సంఘాలు 2008 డిసెంబర్ నుంచి ఉద్యమిస్తున్న సమయమది.
ఉద్యోగ సంఘాల మహాసభలలో మాట్లాడిన కేసీఆర్.. తెలంగాణ రాష్ట్ర సాధనకోసం అవసరమయితే ఆమరణ దీక్షకు దిగుతానని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించారు. ఈ క్రమంలోనే అక్టోబర్ 9, 2009లో హైదరాబాద్ ఫ్రీజోన్ అంటూ సుప్రీం కోర్పు తీర్పు వచ్చింది. దీనిపై ఉద్యోగ సంఘాలు, టీఆర్‌ఎస్ శ్రేణులు తెలంగాణలోని రాజకీయ పార్టీలన్నింటినీ నిలదీశాయి. అక్టోబర్ 12న ఉద్యోగ సంఘాలు చలో అసెంబ్లీకి పిలుపునిచ్చాయి. తెలంగాణలోని రాజకీయ శక్తులన్నీ 14ఎఫ్ పేరా తొలగింపుకోసం కలిసి ఉద్యమించాలని ఉద్యోగ సంఘాలు అక్టోబర్ 12, 2009న పిలుపునిచ్చాయి. నవంబర్ 21, 2009లో సిద్దిపేటలో ఉద్యోగ గర్జన సభ జరిగింది. కనీవినీ ఎరుగని రీతిలో లక్షల సంఖ్యలో జనం హాజరయ్యారు. నవంబర్ చివరి వరకు 14 ఎఫ్ తొలగింపుపై రాష్ట్ర ప్రభుత్వం విస్పష్టంగా ప్రకటించని పక్షంలో నవంబర్ 29 నుండి పెన్‌డౌన్ చేస్తామని టీఎన్జీవో అప్పటి అధ్యక్షుడు కే స్వామిగౌడ్, ప్రధానకార్యదర్శి జీ దేవీవూపసాద్ ఆ సభలో ప్రకటించారు. అంతే వేగంగా కేసీఆర్ నవంబర్ చివరలో ఆమరణ నిరశన దీక్ష చేపడుతానని, కొద్ది రోజులలో ఎక్కడ దీక్షకు దిగేదీ ప్రకటిస్తానని పేర్కొన్నారు.
ఈ క్రమంలో నవంబర్ 29న సిద్దిపేటలో కేసీఆర్ చరివూతాత్మక ఆమరణ దీక్షకు సిద్ధమయ్యారు. కేసీఆర్ ప్రకటన వెలువడిన మరు క్షణం నుంచి తెలంగాణలో అప్రకటిత ఎమ్జనీ వాతావరణం నెలకొన్నది. కరీంనగర్ నుంచి దీక్షావేదిక వద్దకు బయలుదేరిన కేసీఆర్‌ను.. కరీంనగర్ శివారులోని మానకొండూర్ వద్ద పోలీసులు నాటకీయంగా అరెస్టు చేసి ఖమ్మం తరలించారు. అక్కడ సెకండ్‌క్లాస్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. 14 రోజుల రిమాండ్ విధించడంతో కేసీఆర్‌ను ఖమ్మం సబ్‌జైలుకు తరలించారు. అప్పటినుండి
తెలంగాణ ప్రజల ఆకాంక్షలపైన సీమాంధ్ర కర్కశ నిర్బంధకాండ పాశవికంగా కొనసాగింది. నవంబర్ 30న కేసీఆర్ ఆరోగ్యం బాగోలేదని సాకు చెప్పి పోలీసులు ఆయనను ఖమ్మం ప్రభుత్వాస్పవూతికి తీసుకువచ్చి బలవంతంగా దీక్షను భగ్నం చేయించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ తాను జైలులో దీక్షను కొనసాగిస్తానని కేసీఆర్ ప్రకటించారు. మరోవైపు ఉద్యోగుల పెన్‌డౌన్ తారస్థాయికి చేరుకున్నది. తనకు బలవంతంగా వైద్యం చేయించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని, ఈ దుర్మార్గాన్ని ఇదే విధంగా కొనసాగిస్తే తాను ఆత్మహత్య చేసుకుంటానని డిసెంబర్ 1న కేసీఆర్ హెచ్చరించారు. తనను పోలీసులు క్రూరంగా హింససిస్తున్నారని హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. తనను హైదరాబాద్‌కు తరలించాలని న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు.
14ఎఫ్ పేరా తొలగింపునకు అనుకూలంగా శాసనసభలో తీర్మానం చేస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ అధిష్ఠానం కేసీఆర్ ఆరోగ్యంపై శ్రద్ధ కనబరిచింది. తెలంగాణ జిల్లాలు బంద్‌తో దద్దరిల్లడంతో ఢిల్లీ పెద్దల ఆదేశాలతో రోశయ్య ఢిల్లీ నుంచి హుటాహుటిన హైదరాబాద్ చేరుకొని డిసెంబర్ 7న అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించారు. వాటి మినిట్స్‌ను ఢిల్లీకి పంపించారు. తెలంగాణకు టీడీపీ, పీఆర్పీ, కాంగ్రెస్ సై అన్నాయి. డిసెంబర్ 8న కేసీఆర్ ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. కేసీఆర్ దీక్ష విరమంచని పక్షంలో ఏదైనా జరుగవచ్చునని నిమ్స్ వైద్యులు ఆందోళన వ్యక్తం చేశారు. శాసనసభ తెలంగాణ నినాదాలతో ప్రతి ధ్వనించింది.
తెలంగాణ ఇవ్వడం మినహా మరో గత్యంతరం లేదని తెలంగాణ మంత్రులు సోనియాగాంధీకి లేఖ రాశారు. డిసెంబర్ 9న ఢిల్లీలో కోర్‌కమిటీ సభ్యులు అత్యవసరంగా రెండు సార్లు భేటీ జరిపారు. చివరకు కేంద్ర హోంమంత్రి చిదంబరం యూపీఏ ప్రభుత్వం తరఫున డిసెంబర్ 9న రాత్రి 11 గంటలకు తెలంగాణ రాష్ట్ర ప్రక్రియను ప్రారంభిస్తున్నామని ప్రకటించారు. కేసీఆర్ దీక్షను విరమించారు.
(from namaste telangana)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)