హోం

1, నవంబర్ 2012, గురువారం

నాటి భయానుమానాలే..నేటి వాస్తవాలు..


తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఉండాలని, ఇక్కడి ప్రజల ఆకాంక్షలను గౌరవించాలని విలీనానికి ముందే విస్పష్టంగా చెప్పిన వ్యక్తి ఫజల్ అలీ. దేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిషన్‌కు ఆయన నేతృత్వం వహించారు. ఈ కమిషన్ 1955లో తన నివేదికను కేంద్రానికి సమర్పించింది. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణపై నివేదిక ఇస్తూనే ఆంధ్ర, తెలంగాణ విలీనంపై తన అభివూపాయాలను ఫజల్ అలీ విస్పష్టంగా చెప్పారు. విశాలాంధ్ర అనుకూలవాదనలు సహేతుకంగా, బలంగా ఉన్నప్పటికీ ప్రత్యేక తెలంగాణకు అనుకూలంగా వినిపించిన వాదనలు అంత తేలికగా కొట్టిపారేయగలిగినవికావని తేల్చారు. ఆంధ్ర రాష్ట్రం మద్రాస్ నుంచి వేరుపడి కొత్త రాష్ట్రంగా అవతరించినప్పటి నుంచీ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని ఫజల్ అలీ ప్రస్తావించారు. తెలంగాణతో పోల్చితే ఆంధ్ర ఆదాయం తక్కువని, తెలంగాణలో భూమిశిస్తు రూపంలో లభించే ఆదాయం ఎక్కువగా ఉండటంతో పాటు.. ఎక్సైజ్ ఆదాయం ఏటా రూ.5కోట్ల మేర లభిస్తున్నదని తెలిపారు. ఆంధ్రతో విలీనం జరిగితే తమ వనరులను కొల్లగొట్టుకుపోతారని తెలంగాణవాదులు ఆనాడే చెప్పారు. ఫజల్ అలీ కమిషన్ తన నివేదికలో ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ, ‘‘పైకి ఎలాంటి అభ్యంతరాలు ప్రకటించినా, ఆంధ్ర-తెలంగాణలను కలపడం వల్ల తమ స్థిరాదాయ వనరులను ఆంధ్రతో పంచుకోవాల్సి వస్తుందని, ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక అనిశ్చిత పరిస్థితుల దృష్ట్యా ఆ డబ్బును అభివృద్ధి పథకాలపై ఖర్చు పెట్టవచ్చునని కొందరు తెలంగాణ నాయకులు భయపడుతున్నట్లు కనిపించారు. తెలంగాణ ఆంధ్ర కంటే అభివృద్ధి పథంలో ఉంది కనుక, పరిపాలనా దృక్కోణం నుంచి చెప్పాలంటే ఆంధ్ర-తెలంగాణ ఏకీకరణవల్ల తెలంగాణ ప్రాంతానికి ఎటువంటి లాభం ఉండదన్న అభివూపాయం వ్యక్తమైంది’’ అని ఆయన తన నివేదికలో పేర్కొనడం విశేషం. విలీనం నాటి నుంచి తెలంగాణ ప్రాంతం బావుకున్నది ఏమీ లేదు. పైగా అనేక రంగాల్లో తెలంగాణ వనరులు దోపిడీకి గురవుతూనే ఉన్నాయి.

జల వనరులు, అభివృద్ధి పథకాల విషయంలో తెలంగాణవాదులు ఆనాడే భయాందోళనలు వ్యక్తం చేశారు. తెలంగాణలో పరీవాహక ప్రాంతాలు ఉన్న కృష్ణా, గోదావరి నుంచి నీళ్లను ఆంధ్ర ప్రాంతం పట్టుకెళుతుందని భావించారు. వీటిపై ఫజల్ అలీ కమిషన్ ఇలా పేర్కొంది.. ‘‘విశాలాంధ్ర ఏర్పడిన తర్వాత చేపట్టబోయే అభివృద్ధి పథకాల్లో తెలంగాణ ఆకాంక్షలకు తగిన ఆదరణ లభించకపోవచ్చన్న భయం ఈ ప్రాంతంవారిలో వ్యక్తమైంది. ఉదాహరణకు తెలంగాణలోని నందికొండ, కుష్టాపురం (గోదావరి ) ప్రాజెక్టులు తెలంగాణలోనే కాక, దేశం మొత్తం తలకెత్తుకున్న అతిముఖ్యమైన ప్రాజెక్టులలో చేరుతాయి. ఈ రెండు నదుల డెల్టాలలో ఇరిగేషన్ అభివృద్ధికి పథక రచన జరుగుతోంది. కనుక కృష్ణా, గోదావరి జలాల వినియోగంపై ఇప్పుడున్న తన స్వతంత్ర హక్కులను వదులుకోవటానికి తెలంగాణ సుముఖంగా లేదు’’ అని పేర్కొన్నారు.
ఆంధ్రతో విలీనం అయితే ఇక్కడి ఉద్యోగాలన్నీ కొల్లగొట్టుకుపోతారని నాడు వ్యక్తం చేసిన భయాలు నేడు వాస్తవరూపంలో కనిపిస్తున్నాయి. దీనిపై ఆనాడే ఫజల్ అలీ వ్యాఖ్యానిస్తూ ‘‘విద్య, ఉద్యోగాలలో అభివృద్ధిచెందిన కోస్తా ప్రజలు విద్యాపరంగా వెనుకబడిన తమను ముంచెత్తుతారని, తమ ప్రయోజనాలను కొల్లగొడతారనే తెలంగాణ ప్రజల భయానుమానాలు కూడా విశాలాంధ్ర పట్ల వ్యతిరేకతకు గల ప్రధాన కారణాల్లో ఒకటిగా కనిపిస్తున్నాయి.

హైదరాబాద్ వెలుపల, తెలంగాణ జిల్లాలు విద్యలో దారుణంగా వెనుకబడి ఉన్నాయి. ఫలితంగా ఆంధ్ర వారికంటే తక్కువవిద్యార్హతలు ఉన్నప్పటికీ ఇక్కడ ప్రభుత్వోద్యోగాలలోకి తీసుకుంటున్నారు. తెలంగాణ ప్రజల్లో వ్యక్తమవుతున్న అసలు భయం ఏమిటంటే తాము ఆంధ్ర ప్రజలతో పోటీ పడలేని స్థితిలో ఉంటామని, ఇటువంటి భాగస్వామ్యంలో పెద్ద భాగస్వామి అన్ని ప్రయోజనాలను తక్షణమే హస్తగతం చేసుకోగలుగుతుందని, చివరకు దూసుకుపోయే స్వభావం కలగిన కోస్తా ఆంధ్రులకు తెలంగాణ వలసగా మారిపోతుందనే.’’ అని ఫజల్ అలీ పేర్కొన్నారు. నాటి భయాలకు అనుగుణంగానే ఆంధ్ర వలస ప్రాంతంగా తెలంగాణ మారింది.

సొంత రాష్ట్రంగానే ఉంటే ఆర్థికంగా తెలంగాణ తనకు తానే సంఘటితమైన, లాభసాటి పాలనా విభాగంగా ఉండగలదన్న వాదన ముందుకు వచ్చిందని ఎస్సార్సీ నివేదిక పేర్కొంది. ‘‘ఈ ప్రాంతపు రెవెన్యూ ఆదాయం 17 కోట్ల రూపాయలుగా అంచనా వేశారు. కృష్ణా, గోదావరి ప్రాజెక్టులకు డబ్బు సమకూర్చాలి కనుక అది కొత్త రాష్ట్రంపై వడ్డీరూపంలో అదనపు ఆవృత భారాన్ని మోపే మాట నిజమేకానీ, తద్వారా ఏర్పడబోయే లోటు పెద్దగా ఉండకపోవచ్చు. అనుకూల పరిస్థితుల్లో రెవెన్యూ బడ్జెట్‌లో స్వల్పంగా మిగులూ తేలవచ్చు. ఈఆశావహ జోస్యాన్ని రకరకాల కారణాలతో వివరించవచ్చు, సమర్థించవచ్చు’’ అని ఫజల్ అలీ అభివూపాయపడ్డారు.

హైదరాబాద్ రాష్ట్రం గురించిన ప్రస్తావన భాగంలో ఫజల్ అలీ ఇలా పేర్కొన్నారు. తెలంగాణ విశాలాంవూధలో భాగం కాదల్చుకుంటే తెలంగాణ ప్రజల ప్రయోజనాల పరిరక్షణకు తగిన ఏర్పాట్లకు సమ్మతించడానికి ఆంధ్ర రాష్ట్ర నాయకులు సిద్ధంగా ఉన్నట్లు మాకు అవగతం అయింది. ఈ ఏర్పాట్లు (రాయలసీమ, కోస్తా ఆంధ్రల మధ్య జరిగిన శ్రీబాగ్ ఒప్పందం తరహాలో) ప్రభుత్వోద్యోగాల్లో మూడవ వంతు అవకాశాలను అంటే ఇంచుమించు జనాభా దామాషా- తెలంగాణవారికి కల్పించడానికి, తెలంగాణ ప్రాంత అభివృద్ధి పథకాలపై ప్రత్యేక దృష్టిని పెట్టడానికి హామీ ఇచ్చే రూపంలో ఉండవచ్చు’’.

ప్రస్తుతం తెలంగాణ ఏర్పాటుకు బదులు రాజ్యాంగ రక్షణలన్న వాదనను కూడా అప్పుడప్పుడు సీమాంధ్ర మేధావులు లేవనెత్తుతుంటారు. అయితే.. ఇవి పని చేయవన్న అభివూపాయాన్ని ఫజల్ అలీ నాడే వ్యక్తం చేశారు. ఈ విషయంలో కమిషన్ ఇలా పేర్కొంది.. ‘ఈ తరహాలో చేయగల ఏర్పాట్ల గురించిన వివరాలను మేం జాగ్రత్తగా పరిశీలించాం. శ్రీబాగ్ ఒప్పందం తరహాలో కానీ, బ్రిటిష్ ‘స్కాటిష్ డివల్యూషన్’ తరహాలో రాజ్యాంగపరమైన ఏర్పాట్లు పనిచేయబోవనీ, లేదా తెలంగాణ అవసరాలకు సరిపోవని మాకు అనిపించింది.’

అప్పటి ఆర్థిక, రాజకీయ, పాలనా పరిస్థితుల్లో తెలంగాణ-ఆంధ్ర విలీనానికి ఫజల్ అలీ అయిష్టత చూపారు. దీనికి నిదర్శనంగా నిలుస్తాయి ఈవ్యాఖ్యలు... ‘‘...ఆంధ్ర రాష్ట్రం ఇటీవలే అవతరించింది. కొత్త రాష్ట్రానికి ఎదురయ్యే ఇబ్బందుల నుంచి అది ఇంకా బయటపడేలేదు.. ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి విడిపడటంలో ఎదురైన సమస్యలను ఇంకా పూర్తిగా పరిష్కరించుకోలేదు. ఈ దశలో తెలంగాణ, ఆంధ్ర ఏకీకరణ ఆ రెండు ప్రాంతాలకు పాలనాపరమైన ఇబ్బందులు సృష్టించే అవకాశం ఉంది. వీటిని దృష్టిలో ఉంచుకుని మేం ఒక నిర్ధారణకు వచ్చాం. ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్రం ఒక ప్రత్యేక రాష్ట్రంగా అవతరించాలి. దానిని హైదరాబాద్ రాష్ట్రంగా పిలవొచ్చు. అయితే 1961లో లేదా ఆ దరిదాపుల్లో జరిగే సార్వవూతిక ఎన్నికల తర్వాత హైదరాబాద్ శాసనసభలో మూడింట రెండొంతుల మంది సభ్యులు సమ్మతిస్తే ఆంధ్రతో ఏకీకరణ చెందేలా అవకాశం ఉంచాలి... ప్రస్తుతానికి హైదరాబాద్ రాష్ట్రం మహబూబ్‌నగర్, నల్లగొండ, ఖమ్మం, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, హైదరాబాద్, బీదర్, ప్రస్తుత ఆంధ్ర రాష్ట్రంలోని కృష్ణా జిల్లాలో నల్లగొండ జిల్లాను ఆనుకుని ఉన్న మునగాలతో ఏర్పడాలి’’ అని ఫజల్ అలీ కమిషన్ తన నివేదికలో పేర్కొంది.

కానీ.. ఫజల్ అలీ కమిషన్ సిఫారసులను కేంద్రం పట్టించుకోలేదు. తెలంగాణకు సమర్థవంతమైన నాయకత్వం కొరవడటం, కేంద్రాన్ని, స్థానిక నేతలను బురిడీకొట్టించిన ఆంధ్ర నేతల పట్టుదల కారణంగా తెలంగాణ ప్రాంతం ఆంధ్రతో విలీనమైంది. నాటి నుంచి తన సొంత అస్తిత్వం కోసం గోస పెడుతూనే ఉంది.

               (from namaste telangaana)

NOV.1 BLACK DAY


28, సెప్టెంబర్ 2012, శుక్రవారం

విధ్వంసపు పునాదులపై వైవిధ్యపు సదస్సులు..



సృష్టిలో జీవం ఉన్న ఏకైక గ్రహం భూమి, భూమి పై అనేక జీవ జాతులు నివసిస్తున్నాయి, మానవుని నాగరికతలు విస్తరిస్తున్న కొలది జంతు జాలం మనుగడ కుచించుకుపోయింది, అనతికాలం లోనే భూమిపై ఉన్న జీవులన్నీ మనిషి అధినం లోకి వచ్చాయి. మనిషి స్వార్ధానికి విలాసాలకు ప్రకృతి అందించే సహజ వనరులు కాలుష్యం ఐపోయాయి, మనిషి సాంకేతిక విప్లవం మాటున అనేక జీవజాతులు అంతరించిపోయాయి. కేవలం పక్షులు జంతువులే కాదు, అనేక ఆదిమ జాతి తెగలు కూడా అంతరించాయి, మిగిలినవి వాటికే సొంతం ఐన విభిన్న ఆచారాలు, సాంప్రదాయాలను కోల్పోయి అస్తిత్వాన్ని కోల్పోయి, అంతరించడానికి సిద్ధంగా ఉన్నాయి.
మరి వీటిని రక్షించుకునేది ఎలా ..? దానికోసమే అక్టోబర్ ఒకటి నుండి 19 వరకు హైదరాబాద్ నగరం లో జీవ వైవిధ్య సదస్సు జరుగుతుంది, ఈ సదస్సుకు 193 దేశాల ప్రతినిధులు హాజరు కానున్నారు, వీరంతా అంతరించి పోతున్న జీవ జాతులు, కనుమరుగవుతున్న సహజ వనరుల గురించి చర్చిస్తారు..
1969 లో 369 మంది విద్యార్థులను తుపాకులతో కాల్చి చంపినా ప్రభుత్వం అది,అది ఎ తాలిబాన్ ప్రభుత్వమో, రాచరిక ప్రభుత్వమో అనుకుంటే పొరపాటు, ప్రపంచం లోనే అతి పెద్ద ప్రజాస్వామిక దేశంగా చెప్పుకునే భారతదేశంలో, మరి ఓట్లేసి గెలిపించిన ప్రజలనే హత్యా చేసిన ఈ ప్రభుత్వానికి అదే గడ్డపై ఈ సదస్సును నిర్వహించే హక్కు ఉందా...?
నేడు హైదరాబాద్ నగరం సుందరంగా మారింది, ఫ్లై ఓవర్ ల కింద అందమైన బొమ్మలు, దారి మధ్యలో పూలకున్దిలు, పక్కన పెద్ద పెద్ద హోర్డింగులు అన్నింటి సారాంశం ఒక్కటే వన్య ప్రానుల్ని కాపాడండి, పక్షుల్ని కాపాడండి, ధరిత్రిని కాపాడండి అని.
మూడు సంవత్సరాల క్రితం తెలంగాణా ఉద్యమానికి తలొగ్గిన ప్రభుత్వం తెలంగాణా రాష్ట్రం ఏర్పరుస్తామని ప్రకటన చేసింది, కాని అమలు చెయ్యడంలో విఫలం అయ్యింది, ఈ కారణంగా సుమారు 1000 మంది యువతీ యువకులు ఆత్మహత్యలు చేసుకున్నారు, వారి మరణాలను గుర్తించలేదు ఈ ప్రభుత్వాలు, వారి కుటుంబాలను కనీసం ఆదుకోలేదు, వెయ్యి మంది ప్రాణాలు పోతే పట్టించుకోని ఈ ప్రభుత్వాలు పిట్టలను కాపాడండి, కప్పలను కాపాడండి అంటూ నినదాలివ్వడం, దయ్యాలు వేదాలు వల్లించి నట్టుంది.
సెప్టెంబర్ 30 తెలంగాణా మార్చ్ కోసం తెలంగాణా జే ఎ సి పిలుపునిచ్చింది, ట్యాంక్ బ్యాండ్ పై లక్షలాది జనం తో సాగర హారం నిర్వహించాలని తలపెట్టింది, ఒకటో తేది నుండి జీవ వైవిధ్య సదస్సు ఉంది వాయిదా వేసుకొందని ప్రభుత్వం చెపుతుంది, 42 రోజుల సకల జేనుల సమ్మె చేస్తే కనీసం స్పందించని ఈ ప్రభుత్వం చెబితే మనం ఎందుకు వినాలి..?
ఒక వైపు తెలంగాణా లో తాగే నీటిలో ఫ్లోరైడ్ విషం కలిసి బొక్కలు విరిగి జనం బాధలు పడుతున్నారు, మరో వైపు పనులు లేక పొట్టచేత పట్టుకొని బొంబాయి దుబాయ్ అంటూ జనం వలసలు పోతున్నారు, అన్ద్రోల్లు తెలంగాణా కొండల్ని, గుట్టల్ని తవ్వుకుపోతున్నారు, బొగ్గు గనులను లూటి చేస్తున్నారు, ఇక్కడ తెలంగాణా తన అస్థిత్వాన్నే కోల్పోతుంటే సీమంద్ర సర్కార్ అదే తెలంగాణా గడ్డమీద సదస్సులు నిర్వహిస్తుంది.
హైదరాబాద్ కు వస్తున్న విదేశీ ప్రతినిధులు హైదరాబాద్ నది బొడ్డున ఉన్న మూసి నది నేడు మృత నదిగా ఎందుకు మారిందో, దానిలోని జీవజాలాన్ని పొట్టన పెట్టుకున్నది ఎవరో తెలుసు కోవాలి, హుస్సేన్ సాగర్ సరస్సు నేడు మురికి కుపంగా ఎందుకు మారిందో తెలుసు కోవాలి, అందుకే సాగర హారానికి లక్షల మంది జనం తరలి రావాలి, ఇంటికో మనిషి చేతిలో జెండా తో ట్యాంక్ బ్యాండ్ పైకి చేరి ఈ సర్కార్ తెలంగాణా జీవ వైవిధ్యతను ఎలా దేబ్బకోట్టిందో తెలియ జెప్పాలి, తెలంగాణా జీవ వైవిధ్యానికి సమాధి కట్టి , కృత్రిమ అందాలను పులిమిన ఈ సర్కార్ నిజ స్వరూపాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలి, తెలంగాణా మార్చ్ ను విజయవంతం చెయ్యాలి.

ఓటేసే జనం చాస్తేనే పట్టించుకోని మన ఓటు బ్యాంకు ప్రభుత్వాలు, కనీసం ఓటు హక్కు కూడా లేని మూగ జీవాలను కాపడుతాయనడం నిజంగా హాస్యాస్పదం...

4, ఆగస్టు 2012, శనివారం

తుర్రేబాజ్ ఖాన్



భారత స్వాతంత్య్ర పోరాటవీరుడు, ధైర్యశాలి తుర్రేబాజ్ ఖాన్. ఆయన హైదరాబాద్ నగరానికి చెందిన యువకుడు. క్రీ.శ 1800 సంవత్సరంలో నిజాం నవాబు బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీతో ఆర్థిక, వ్యాపార సంబంధ ఒప్పందాలను కుదుర్చుకున్నారు. దీంతో సంస్థానంలో ఆయనకు తీవ్ర వ్యతిరేకత తలెత్తింది. 1857లో దేశంలో తొలి స్వాతంత్య్ర పొలికేక ‘సిపాయిల తిరుగుబాటు’ ప్రారంభమైంది. దీన్ని స్ఫూర్తిగా తీసుకుని తుర్రేబాజ్ ఖాన్ స్వాతంత్య్ర పోరాటంలోకి దూకారు. సాహసవంతులైన 500 మంది యువకులతో, ఆ ఏడు జులై 17న కోఠీలోని బ్రిటిష్ రెసిడెన్సీ (ఇప్పటి కోఠీ ఉమెన్స్ కాలేజీ)పై దాడి చేశారు. బ్రిటిష్ సైన్యం తిరిగి కాల్పులు ప్రారంభించడంతో తృటిలో తప్పించుకున్నారు. తర్వాత జులై 22న బ్రిటిష్, నిజాం సైన్యాలకు దొరికిపోయారు. ఏడాదిన్నర జైలు జీవితం గడిపాక 1859 జనవరి 1న జైలు నుంచి తప్పించుకున్నారాయన. నిజాం ప్రభుత్వం ఖాన్‌ను పట్టిస్తే రూ.5000 నగదు బహుమతి ఇస్తామని ప్రకటించింది. ఓ ద్రోహి ఇచ్చిన సమాచారంతో 159 జనవరి 24న మెదక్ జిల్లా తూప్రాన్ దగ్గర ఖాన్‌ను బ్రిటీష్ సైనికులు దారుణంగా కాల్చి చంపారు. 

అంతేకాదు, ఖాన్ భౌతిక కాయాన్ని హైదరాబాద్ నగరానికి తీసుకొచ్చారు. ఇనుప సంకెళ్ళతో బంధించి కోఠిలోని సుల్తాన్ బజార్‌లో రెండు రోజులు నగ్నంగా వేలాడదీశారు. ఆయన స్మారకార్థం కోఠీలో స్థూపాన్ని నిర్మించారు. కోఠి నుంచి ఆబిడ్స్ వరకూ వెళ్లే రోడ్డుకు ‘ఖాన్ రోడ్’గా నామకరణం చేశారు.

ఘనత వహించిన చంద్రఘడ్ కోట



రాజులు, రాజ్యాలు కాలగమనంలో కలిసపోయినా ఆనాటి రాచరికపు వైభవానికి చంద్రఘడ్ కోట ప్రతీకగా నిలుస్తోంది. 

సంస్థానాల జిల్లాగా పేరు గాంచిన పాలమూరు జిల్లాలో శత్రు దుర్భేద్యంగా నిర్మితమై, గత చరిత్రను చాటుతోన్న ఘనమైన కోట ‘చంవూదఘడ్’. నర్వ మండలం ధర్మాపురం గ్రామ సమీపంలో కృష్ణానదికి 4 కి.మీ. దూరంలో ఎత్తయిన కొండపై ఈ కోట నెలకొని ఉంది.
అమరచింత, వడ్డేమాన్ గ్రామాల పరిగణాల నుంచి పన్నులు వసూలు చేసేందుకు రాజా తిమ్మాడ్డి చంద్రసేన యాదవుడనే సైనికాధికారిని నియమించినట్లు, అతడే తన పేర ఈ చంద్రఘడ్ కోటను, తన భార్య పేరున ధర్మాపురం గ్రామాన్ని నిర్మించినట్లు చరివూతకారులు చెబుతున్నారు. చంద్రసేనుడి అభ్యర్థనను మన్నించి రాజా తిమ్మాడ్డి ఐదు వందల అడుగుల ఎత్తున్న కొండపై ఈ కోట నిర్మాణం చేపట్టినట్లు తెలుస్తోంది. 

500 ఏళ్ళకుపైగా చరిత్ర కలిగి ఉన్న చంద్రఘడ్ కోట నిర్మాణంపై భిన్న కథనాలున్నాయి. పూర్వం ఈ పరిసరాలకు వేటకోసం వెళ్లిన చంద్రసేనుడికి వింత అనుభవం ఎదురైనట్టు చెప్తారు. ఈ ప్రాంతంలో వేటకుక్కలను కుందేళ్ళు తరిమివేసిన సంఘటన చోటు చేసుకుందట. దీంతో ఇక్కడ కోట నిర్మించాలని నాటి రాజు భావించినట్లు చెబుతారు. మరో వాదన కూడా ఉంది. ఇది ఎత్తయిన ప్రాంతమేకాక శత్రువులను కనిపె అనువైన స్థలం కావడం, నీటి ప్రాముఖ్యం ఉండటంతో ఇక్కడ కోట నిర్మాణానికి పూనుకున్నట్లు తెలుస్తోంది.

chandragat01చంద్రఘడ్ కోటకు వెళ్ళేందుకు గతంలో ఒకవైపు మాత్రమే కాలిబాట ఉండేది. ప్రస్తుతం కోట వెనక వైపు నుండి చిన్న రోడ్డు వేశారు. కోట తూర్పువైపున గల కోనేరు నుంచి కృష్ణానది వరకు సొరంగ మార్గం ఉండేదని, అందుకే అన్ని కాలాలలోనూ ఇక్కడ నీరు సమృద్ధిగా లభించేదని స్థానికుల కథనం. కోటలో శివాలయాన్నీ నిర్మించారు. ఈ ఆలయాన్ని ఇప్పటికీ భక్తులు దర్శించి పూజలు చేస్తుంటారు. ఆ కోటకు చెందిన ఎత్తయిన బురుజులు నేటికీ చెక్కుచెదరకుండా సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

చరివూతకు ప్రతిబింబంగా నిలిచిన అపురూప సంపదను పరిరక్షించుకోవడంలో ప్రభుత్వాలు ఘోర వైఫల్యం చెందుతున్నాయి. ఎంతో ఘన చరిత్ర ఉన్న ఈ చంద్రఘడ్ కోట పరిరక్షణ కోసం పర్యాటక శాఖ కానీ, పురావాస్తు శాఖ కానీ దృష్టి సారించకపోవడం దురదృష్టకరం. చంద్రఘడ్ కోటకు చేరుకొనేందుకు సరైన రవాణా సౌకర్యమైనా లేదు. ఎలాగోలా కష్టపడి ఇక్కడికి చేరుకున్న సందర్శకులకు ఈ ప్రాంతంలో నిలువ నీడలేకపోవడం తీవ్ర నిరాశకు గురి చేస్తుంది. సరైన పర్యవేక్షణ కొరవడటంతో గుప్తనిధుల కోసం కోటను ద్వంసం చేస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.

17, జూన్ 2012, ఆదివారం

పరకాల విజయం పై విశ్లేషణ ...!



పరకాల లో టి ఆర్ ఎస్ విజయాన్ని జీర్ణించుకోలేని సీమంద్ర చానెళ్ళు, సీమంద్ర రాజకీయనాయకులు ఒక దుష్ప్రచారాన్ని ప్రారంభించారు, తెలంగాణా వాదం తగ్గింది దీనికి నిదర్శనమే 1500 మెజారిటీ అని,
           ఒక చిలక జ్యోతిష్యుడైతే 67% ప్రజలు సమైక్యన్ద్రకు ఓటు వేసారని సెలవిచ్చారు. తెల్కపల్లి రవి లాంటి ఎస్ మేధావులు కూడా టి ఆర్ ఎస్ మెజారిటి పూర్తిగా తగ్గిందని సెలవిచ్చారు, గతం లో 40,000 మెజారిటీ లు సాధించిన పార్టీ క్రమంగా పతనముతుందని ఒక్క స్థానం కూడా గెలవని పచ్చ దళం మోత్కుపల్లి వాగాడు, ఇంత నోరువేసుకొని అరిచే అంబటి సైతం మేమే నైతికంగా గెలిచాం అని సిగ్గులేకుండా గర్వపడ్డాడు..
                    గతంలో పరిస్థితి ఇప్పటి పరిస్థితి వేరు, గతం లో టి ఆర్  ఎస్ ఎం ఎల్ ఎ లు రాజీనామా చేసినపుడు ఆ మెజారిటి లు వచ్చాయి, సాధారణంగా ఎ ఉప ఎన్నికలో ఐన రాజీనామా చేసిన అభ్యర్థులు గెలవడం సర్వ సాధారణం ఆ రోజు 90000 మెజారిటి తో హరీష్ రావు గెలిచారు, మిగతావారు కూడా 50000 పైగా మెజారిటీ తో గెలిచారు, అప్పుడు ఈ సీమంద్ర నాయకులు రాజీనామా చేసిన స్థానాల్లో వచ్చే ఉపఎన్నికల్లో సిట్టింగ్ ఎం ఎల్ ఎ గెలవడం సాధారణమే అన్నారు.
              మరి ఈ రోజు జరిగింది ఏమిటి..? సిట్టింగ్ ఎం ఎల్ ఎ ఒడి పోయింది, 40000-500000 మెజారిటీ రావలసిన కొండ సురేఖ ప్రత్యర్ధి చేతిలో 1500 ఓట్ల తేడాతో ఓడిపోయింది, అయితే ఇదో గెలుప.. దీనీతో టి ఆర్ ఎస్ చావుదెబ్బ తిన్నది అన్న జగన్ పార్టీ ముర్కులకు, కాంగ్రెస్ పార్టీ వెధవలకు ఒకటే సమాధానం మూడు సార్లు ఎం ఎల్ ఎ గా గెలిచి, మంత్రి పదవి వెలగబెట్టిన కొండా చావుదెబ్బ తిన్నాదా.. లేఖ అక్కడ కనీసం ఒక్క సారి కూడా గెలవని టి ఆర్  ఎస్ గెలిచిందంటే ఎవరు చచ్చారు ఎవరు బతికారు..? గతం లో 1వచ్చిన 12000 మెజారిటీ ఎక్కడ పోయింది..? ఒక వేల కొండా సురేఖ చివరి రౌండ్ లో గెలిస్తే ఎంత మెజారిటీ వచ్చేది..? అదే 1000 ఓట్ల మెజారిటీ ఏ కదా అంటే ఎంతకు దిగాజారింధన్నట్టు..? అదే సురేఖ 1500 ఓట్లు  తక్కువగా వచ్చి ఓడిపోయిన్దంటే ఇది నైతిక విజయమా... లేఖ చావుదెబ్భా..?
         గత సార్వత్రిక ఎన్నికల్లో 12000 మెజారిటీ తో ఓడిన అభ్యర్థి ఇప్పుడు 1500 ఓట్ల మెజారిటీ తో గెలిచాడంటే  కాంగ్రెస్ లో ఉన్న కొండా సురేఖను జనం నమ్మరా..? జగన్ పార్టీ లో కొండా సురేఖను నమ్మరా..? 
                         తెలంగాణా వాదం తగ్గింది అనే సుంటలకు  ఒకటే మాట, అసలు పరకాలలో రాజీనామా చేసింది ఎవరు..? బిక్షపతి అవునా కాదా..? గత ఎన్నికల్లో 12000 మెజారిటీతో గెలిచిన భిక్షపతి తెలంగాణా కోసం రాజీనామా చేసి ఉపఎన్నికలకు వెళ్తే జగన్ పార్టీ నాయకురాలు కొండా సురేఖ గట్టిపోటీ ఇచ్చి మెజారిటీ ని అమాంతం తగ్గించే సరికి అతికష్టం మీద బిక్షపతి 1500 ఓట్లతో గట్టేక్కాడు.కాబట్టి గతంలో 12000 మెజారిటీతో గెలిచినా బిక్షపతి ఈ సారి 1500 మెజారిటీ తో గెలిచాడు అంటే చావుతప్పి కన్ను లొట్ట పోయింది అన్నట్టు, తెలంగాణా వాదం గోరంగా తగ్గినట్టు ..అంతే గా కాని ఇక్కడ జరిగింది ఏమిటి..? గతంలో బిక్షపతి గెలవలేదు, ఓడిపోయినా బిక్షపతి ఇప్పుడు గెలిచాడు, అది రాజీనామా చేసి ఉపఎన్నికకు పోయిన అభ్యర్థి మీద..అంటే జగన్ వాదం మీద తెలంగాణా వాదం గెలిచింది కదా..
                ఐన సీమంద్ర ఛానల్ లు అన్ని పని కట్టుకొని గెలిచిన పార్టీ మీద లేని పోనీ కధనాలు ప్రచారం చేస్తున్నారు, తెలంగాణా లో జగన్ పార్టీ పోటికి దిగిన ఒకే ఒక స్థానం లో ఓడిపోయింది అనే విషయం వీరికి తెలియద ..? ఆంద్ర లో 30000 మెజారిటి లతో రాజీనామా చేసిన అభ్యర్థులు గెలిస్తే ఇక్కడ కొండ సురేఖ 30 000 మెజారిటీ సంగతి దేవుడెరుగు కనీసం ఒక్క ఓటు ఎక్కువతేచ్చు కొని గెలవలేఖ పోయింది, మొన్నటి దాక మంత్రి, నిన్నటి దాక ఎం ఎల్ ఎ, మరి నేడు మాజీ .... ఇక నైతికంగా ఎక్కడ గెలిచింది..? కాంగ్రెస్ లో ఉంటె మంత్రిగా ఉండే సురేఖ జగన్ ను నమ్ముకొని మాజీ ఎం ఎల్ ఎ అయ్యింది అంటే ఇది జగన్ పార్టీ కి ఆ పార్టీ కి చెందిన అంబటి కి భలే గర్వకారణం, ఇది నిజంగా గోరమైన నైతిక విజయం కదా జగన్ పార్టీకి...
                              పర్కాల లో 67% జనం సమైక్యన్ద్రకే ఓటు వేసారు అనేవారు,  సీమంద్ర ఉప ఎన్నికల ప్రచారం లో పదె  పదే  జగన్ కు ఓటేస్తే రాష్ట్ర విబజన జరుగుతుంది అని ప్రచారం చేసారు, అయితే అక్కడి జనం జగన్ కు అఖండ మెజారిటీ తో గెలిపించారు, సమైక్యంద్ర అన్న పార్టీలను ఓడించారు, అంటే సీమంద్రలో 100% ప్రజలు రాష్ట్ర విభజనకు అనుకూలం అనే కదా అర్ధం..... సీమంద్ర ప్రజల తీర్పు ఇదే కదా, మరి ఇప్పుడు ఏమంటారు..?

తెలంగాణా రాష్ట్ర శాస్త్రీయ నృత్యం - పేరిణి




రూప సంపన్నత, రసాను భావుకత, తాళజ్ఞత, గమకజ్ఞానం, శరీరంలో తొనికిసలాడే ధ్వని కలిగిన వారు పేరిణి నృత్యానికి అర్హులని చెబుతారు. అంటే యుద్ధం వీరత్వ భావనలు, కళ వేరు వేరు కాదు. వాటి మధ్య ఒక సంబంధాన్ని నెలకొల్పిన రీతికి రామప్ప కట్టడం మూలాధారం.
                      జన పదంలో పుట్టి, వీర శైవ మతాచార నృత్యంగా మారి రామప్ప శిల్పాలలో చెక్కబడిన పేరిణి ఒక అద్భుత నృత్యం. గిరిజన మైదాన ప్రాంత నృత్య సంస్కృతికి పేరిణి మకుటాయమాన ఉదాహరణ.
రామప్ప శిల్పాలను సందర్శించి ఆ నృత్య భంగిమలను అధ్యయనం చేసి, పునఃసృష్టించిన నృత్యకళయే పేరిణి. ఇది లలిత కళా రంగంలో ఆధునిక కాలంలో మన దేశంలో జరిగిన ఒక గొప్ప విషయం. గిరిజన, జానపద, శాస్త్రీయ నృత్య రీతులకు ‘రామప్ప’ వజ్రాలు పొదిగిన అద్దం. ఆనాటి సామాజిక జీవితానికి ప్రతిరూపం. కళా సంప్రదాయ రీతులకు సజీవ డాక్యుమెం కేవలం రామప్ప రుద్రేశ్వరాలయమే కాదు, అది ఒక అధ్యయన కేంద్రం. శిల్పంలో మలిచిన దృశ్య శాస్త్ర గ్రంథం.
                         శిల్పి పేరుతో వెలసిన కట్టడం ఇంకెక్కడన్నా ఉందా! లేదు. ఉన్నా ఇంత పెద్ద నిర్మాణం అసలే లేదు. ‘జాయసేనాని’ క్రీ.శ.1253 ప్రాంతంలో నృత్య రత్నావళి రాశాడు. క్రీ.శ.1213లోనే పాలంపేటలో రుద్రేశ్వరాలయాన్ని పూర్తి చేశారు. అంటే ఆ ఆలయం కనీసం ఏభై ఏళ్ళ ముందు ప్రారంభించి ఉంటారు. తటాక నిర్మాణం, రుద్రేశ్వరాలయం కట్టడం ఒకేసారి రూపకల్పన జరిగింది. అంటే, ఆలయాన్ని నిర్మించిన రామప్ప సుమారు క్రీ.శ.1168 ప్రాంతంలోనే కట్టడం నమూనా, నృత్య భంగిమ వివరాలు, సామాజిక జీవితాంశాల వివరాలు, ఏవి శిల్పాలుగా ఉండాలో నిర్ణయించుకునే ఉంటాడు. అంటే జాయపసేనాని కన్నా ఎంతో ముందు రామప్ప స్థపతి జీవించి ఉన్నాడు. కాబటి,్ట నృత్య రత్నావళికి, రామప్ప నృత్యరీతులకు సంబంధం లేదు. పైగా రామప్ప శిల్పరీతుల వల్లే జాయప ప్రభావితుడై నృత్య శాస్త్రాన్ని రచించాడని చెప్పవచ్చు. అన్ని నృత్యశాస్త్ర గ్రంథాలలో దేశీ నృత్యాలను గురించి రాశారు. కాని, రామప్పలో జానపద, శాస్త్రీయ నృత్య రీతులను చెక్కారు. 

* ఇంతకీ పేరిణి ఏమిటి?
జాయప ‘నృత్య రత్నావళి’లోని చివరి - మూడు అధ్యాయాల్లో సుమారు పధ్నాలుగు నృత్య రీతులను పేర్కొన్నాడు. ఇవన్నీ ఆనాటి నుండి నేటి దాకా ప్రచారంలో ఉన్నవే. ఐతే కొన్ని రూపం మారాయి. మరికొన్ని పేర్లు మారాయి. కొన్ని అనామకం అయ్యాయి. పేరిణి నృత్య భంగిమలు ఆ నృత్య శాస్త్రానికి ప్రేరణగా నిలిచాయి.
నటరాజ రామకృష్ణ ఆధునిక కాలంలోని ప్రాచీన నృత్యశాస్త్ర పితామహుడు. ఆలయ నృత్యాన్ని, ఆంధ్ర నాట్యాన్ని గుర్తించి అవే అసలైన తెలుగు నృత్యాలని తేల్చి చెప్పాడు. శిలలో దాగిన పేరిణిని వేల శతాబ్దాల కింది గుడ్డు అవశేషంలోంచి రాకాసి బల్లిని పునఃసృష్టి చేసినట్లు రామప్ప రాతి శిల్పాల లోంచి తెలుగు నాట్యాన్ని సృష్టించాడు. 

నిజానికి నటరాజ రామకృష్ణ తల్లి నుండి ఆలయ నృత్యాలను అభ్యసించాడు. ఆమె వల్ల ప్రేరణ పొందాడు. కళావంతుల ఇంట్లో జన్మించిన తల్లిది నల్లగొండ జిల్లా కొలనుపాక గ్రామం.
పేరిణి నృత్యం స్త్రీలు, పురుషులు విడివిడిగాను, కలగలసి చేస్తారు. గిరిజన సమాజంలో పురుషులతో పాటుగా స్త్రీలు నాట్యం చేయడం సహజం. ఐతే రానురాను పురుషాధిపత్య మతం, సమాజం రూపొందే క్రమంలో పేరిణి పురుష నృత్యం అయ్యింది. అందుకు మరో కారణం అది వీర నృత్యం కావడమే. శైవంలో ఈనాటికీ తెలంగాణలో సజీవంగా ఉన్న కత్తుల నృత్య భంగిమలు పేరిణి నృత్యంతో అతి దగ్గరి పోలికలు కనిపిస్తాయి.

రూప సంపన్నత, రసాను భావుకత, తాళజ్ఞత, గమకజ్ఞానం, శరీరంలో తొనికిసలాడే ధ్వని కలిగిన వారు పేరిణి నృత్యానికి అర్హులని చెబుతారు. అంటే యుద్ధం వీరత్వ భావనలు, కళ వేరు వేరు కాదు. వాటి మధ్య ఒక సంబంధాన్ని నెలకొల్పిన రీతికి రామప్ప కట్టడం మూలాధారం. పేరిణి ఒక్కటే కాదు వీర శైవంలోను, ఆదివాసీ జానపద నృత్యాలు చాలావరకు ఇలాంటి స్వభావం కలిగి ఉన్నవే.
గిరిజనుల వేట విధానాన్ని తిరిగి గిరిజన సమాజంలో enact చేయడమే కళకు- ముఖ్యంగా నృత్యకళకు మూలం. ఈ స్వభావం ప్రాచీన కాలం నుండి కళని అంటి పెట్టుకుని వస్తున్న వైనం గుర్తించనప్పుడు పేరిణి వీరత్వ ప్రకటన నృత్యం అని తెలుస్తుంది.
వీరశైవ కళలు చాలావరకు ప్రజా కళలే. ప్రజలతో సంప్రదాయంగా ప్రచారంలో ఉన్నవాటిని మార్చి కొత్త ఇతి వృత్తాలతో మత, కుల, భక్తుల, గురువుల చరివూతలను రాశారు. ప్రదర్శన రీతిని కథలో, ప్రదర్శనలో వీరత్వ గమకాలను ప్రవేశపెట్టారు. అందులో ప్రేంఖణం, చిందు, కోలాటం, గొండ్లి, బహురూపి, ఘట నృత్యం వంటి జానపద నృత్యాలను పేర్కొనవచ్చు. ఈ నృత్యాలన్నీ తెలంగాణలో ఇప్పటికీ ప్రచారంలో ఉన్నాయి.

జాయాప్ప పేరు జాయప అనీ, శ్రీజాయ అనీ సంస్కృతీకరించిన పేర్లు కనిపిస్తాయి. రామప్ప, జాయాప్ప ఇద్దరూ కాకతీయ రాజల కింద ఉద్యోగులు. వరంగల్ దగ్గర ములుగు రోడ్డు పక్కన ఉన్న ఏనుగుల గడ్డ వద్ద గజ సైన్యం ఉండేది. అక్కడ ఏనుగులని సంకెళ్ళతో బంధించిన బండ రాళ్ళ గుర్తులు మా చిన్నతనంలో చూశాం. అక్కడ గణపతి రుద్రదేవుడు జాయపకి గజ సాధక పదవి నిచ్చాడు. వైరి గోధూమ ఘరట్టి (శత్రువులనే గోధుమ గింజలను పిండిగా చేసే ఇసురురాయి) అనే బిరుదును కూడా ఇచ్చాడు.
ఇతను ‘గీత రత్నావళి’ అనే సాహిత్య గ్రంథం కూడా రాశాడు. ముఖ్యంగా ఇది దేశీగీత ఛందోరీతులు తెలిపే సంస్కృత గ్రంథం అయ్యుంటుంది. నేటికీ ఆ గ్రంథం లభించకపోవడం తెలుగు సాహిత్యం దురదృష్టం.
రామప్ప అనేవాడు నిర్మాణ దక్షిత కలిగినవాడు. అతని చరిత్ర కూడా లభ్యం కావడం లేదు. రామప్ప ప్రాంతంలోని కొందరు వృద్ధులతో మాట్లాడితే ‘వందల ఏళ్ళ నుండి రామప్ప గుడి అనే మేం అంటున్నాం’ అని తెలిపారు. రామప్ప అనే వ్యక్తి చరిత్ర, రామప్ప ఆలయంలో దాగిన పేరిణి వంటి ఇతర నృత్యాల డాక్యుమెం ద్వారా అధ్యయనం జరగవలసి ఉంది. తెలంగాణ పుత్రుడు నటరాజ రామకృష్ణ చేసిన అసాధారణ కృషిని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. ‘రామప్ప’లో చరివూతని తవ్వడానికి తెలంగాణ మేధావులు నడుం కట్టాల్సిన సమయం ఇది!