హోం

7, నవంబర్ 2011, సోమవారం

నేటి వార్త ( 07 /11 /2011 )

1 . తెలంగాణ కోసం మరో విద్యార్థి ఆత్మబలిదానం చేసుకున్నడు. ఓయూలో చదువుతున్న నగేష్ ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల లో ట్రైన్ కింద పడి చనిపోయిండు. నగేష్ స్వస్థలం సిర్పూర్ కాగజ్ నగర్. కేంద్రం వైఖరితో మనస్థాపం చెంది చనిపోతున్నట్లు సూసైడ్ నోట్ రాశాడు.
2 . ఖాకీల ఓవర్ యాక్షన్ తో .. ఓయూలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మంచిర్యాలలో ఓయూ విద్యార్థి నగేష్ ఆత్మహత్యకు సంతాపంగా .. స్టూడెంట్స్ ర్యాలీ తీసిన్రు. ఆర్ట్స్ కాలేజీ నుంచి తార్నాక దాకా .. ర్యాలీగా బయలుదేరిన్రు. ఐతే.. విద్యార్థుల శాంతియుత ర్యాలీపై ..ఖాకీలు జులుంచేసిన్రు. విద్యార్థుల ర్యాలీని అడ్డుకొన్నరు. టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించిన్రు.
3 . తెలంగాణా ఉద్యమంపై ప్రభుత్వ అణచివేతను తెలుసుకునేందుకు.. పౌరహక్కుల సంఘాల నేతలు మెదక్ జిల్లాలో పర్యటించారు. ప్రజలు, జేఏసీ నేతల నుంచి వివరాలను సేకరించిన్రు. మాజీ ఎమ్మెల్యే రాంలింగారెడ్డితోపాటు ఇతర నేతలు .. ప్రజలు ప్రభుత్వం చేసిన దౌర్జన్యకాండను వివరించిన్రు.
4 . రూపాయి కిలో బియ్యం నాణ్యతను ప్రశ్నించిన వ్యక్తిపై దాడిచేసిన... సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డిపై కేసు నమోదైంది. బాధితుడు చాకలి బాలరాజు ఫిర్యాదు మేరకు 323, 504 సెక్షన్ల కింద జగ్గారెడ్డిపై కేసు బుక్ చేశారు. దీనిపై తెలంగాణ వాదులు హర్హం వ్యక్తంచేశారు. వెంటనే ఆయన్ని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
5 . నిమ్స్‌లో ఏడో రోజు దీక్ష కొనసాగిస్తున్న కోమటిరెడ్డి ఆరోగ్యం మరింత క్షీణించింది. కోమటిరెడ్డి తీవ్ర కడుపు నొప్పితో, అస్తమాతో బాధపడుతున్నారు. ఆయనను పరీక్షించిన వైద్యులు దీక్ష విరమించాల్సిందేనని తెలిపారు. దీక్ష విరమించకపోతే పరిస్థితి విషమిస్తుందని వైద్యులు చెప్పారు. కోమటిరెడ్డి ఆరోగ్యంపై తెలంగాణవాదులు ఆందోళన చెందుతున్నారు. కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిన బాధ్యత మంత్రులదేనని తెలిపారు.
6 .  తెలంగాణ సాధన కోసం ఈ నెల 22న పార్లమెంట్ ఎదుట దీక్ష చేపడుతానని కొండా లక్ష్మణ్ బాపూజీ వెల్లడించారు. ఆరు రోజులుగా చేపట్టిన దీక్షను ఆయన ఈ రోజు విరమించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రత్యేక రాష్ట్రం కోసం అన్ని పార్టీలు ఏకం కావాలని ఆయన పిలుపునిచ్చారు. తన దీక్షకు అన్ని పార్టీల నేతలు వస్తారని ఆశిస్తున్నానని చెప్పారు. తమ ఎజెండా, జెండా తెలంగాణ రాష్ట్ర సాధననే అని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణవాదులు శాంతియుతంగా ఉద్యమించాలని ఆయన పిలుపునిచ్చారు.

తెలంగాణ రాజకీయ,సాంఘిక చైతన్యం సురవరం ప్రతాపరెడ్డి.


తెలంగాణ రాజకీయ,సాంఘిక చైతన్యం అంటే వెంటనే గుర్తుకు వచ్చే పేరు సురవరం ప్రతాపరెడ్డి. పత్రికా సంపాదకుడుగా, పరిశోధకుడుగా, పండితుడుగా, రచయితగా, ప్రేరకుడుగా, క్రియాశీల ఉద్యమకారుడుగా బహుముఖాలుగా సాగిన ప్రతాపరెడ్డి ప్రతిభా, కృషీ అనన్యమైనది. స్థానిక చరిత్రల గురించి, స్థానిక ప్రజల కడగండ్ల గురించి ఆయన పడిన నిరంతర తపనకు ప్రతి అక్షరం ప్రత్యక్ష సాక్ష్యం. తెలంగాణ సాంస్కృతిక చరిత్రలో సురవరం ప్రతాపరెడ్డి ఒక అధ్యాయం.

సురవరం ప్రతాపరెడ్డి 1896 మే 28 న మహబూబ్ నగర్ జిల్లాలోని ఇటికాలపాడు లో జన్మించాడు. మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో బి.ఏ, తిరువాన్‌కూరులో బి.ఎల్ చదివాడు. కొంతకాలం పాటు న్యాయవాద వృత్తి నిర్వహించాడు. అనేక భాషలు అభ్యసించిండు. మంచి పండితుడు. 1926 లో ఆయన నెలకొల్పిన గోలకొండ పత్రిక తెలంగాణ సాంస్కృతిక గమనంలో మైలురాయి. గోలకొండ పత్రిక సంపాదకీయాలు నిజాం ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించినయి. నిజాం ఆగ్రహించి సంపాదకీయాలు సమాచార శాఖ అనుమతితోనే ప్రచురించాలని నిబంధన పెట్టిండు. దాన్ని తిప్పికొడుతూ ప్రతాప రెడ్డి ప్రపంచ మేధావుల సూక్తులను సేకరించి సంపాదకీయానికి బదులుగా ప్రచురించిండు. అది మరింత సమస్యగా ఆనాటి ప్రభుత్వం భావించింది.

                              తెలంగాణలో కవులే లేరని ఒక ఆంధ్ర పండితుడు ఎగతాళి చేస్తే దానికి ధీటుగా 350 మంది కవుల రచనలతో గోలకొండ కవుల సంచిక అనే సంకలనాన్ని 1934లో ప్రచురించి తిరుగులేని సమాధానం చెప్పిండు. ఆ సంచిక ఇప్పటికీ అపురూపమైనది. తెలంగాణాలో గ్రంధాలయోద్యమంలో ప్రతాపరెడ్డి ప్రముఖపాత్ర వహించాడు. 1942 లో ఆంధ్ర గ్రంధాలయ మహాసభకు అధ్యక్షత వహించాడు. 1943 లో ఖమ్మంలో జరిగిన గ్రంధాలయ మహాసభకు, 1944లోజరిగిన ఆంధ్ర సారస్వత పరిషత్తుకు ఆయనే అధ్యక్షుడు.
ప్రతాపరెడ్డి భావుకుడైన రచయిత. కవితలు, కథలు, వ్యాసాలు రచించిండు. ఆయన రాసిన ఆంధ్రుల సాంఘిక చరిత్రకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించడమే కాకుండా ఆంధ్ర పండిత విమర్శకుల ప్రశంస పొందింది. సురవరం ప్రతాపరెడ్డి కథలు నిజాం కాలం నాటి ప్రజల జీవితాన్ని ఉన్నదున్నట్లుగా చిత్రించినయి. హైందవ ధర్మ వీరులు,హిందువుల పండుగలురామాయణ కాలం నాటి విశేషాలు మొదలైన ఇతర గ్రంథాలను రచించిండు. భక్త తుకారాంఉచ్ఛల విషాదము అనే నాటకాలు రాసాడు. రాజకీయ సాంఘీక ఉద్యమంగా సంచలనం కలిగించిన ఆంధ్రమహాసభ మొట్టమొదటి అధ్యక్షుడు ప్రతాపరెడ్డి.

1951లో ప్రజావాణి అనే పత్రికను ప్రారంభించాడు. 1952లో హైదరాబాదు రాష్ట్రానికి జరిగిన మొదటి ఎన్నికలలో కాంగ్రెసు పార్టీ తరపున వనపర్తి నియోజకవర్గం నుండిశాసనసభకు ఎన్నికయ్యాడు. న్యాయవాదిగా ఆయన జీవితం ప్రారంభించి, రచయితగా, కార్యకర్తగా, సంపాదకుడుగా జీవితం సాగించి తెలంగాణ ప్రజల హృదయాలలో ముద్రవేసుకున్నాడు. 1953 ఆగష్టు 25న ఆయన దివంగతుడైనాడు.

6, నవంబర్ 2011, ఆదివారం

మన పత్రికలు


తెలంగాణా పత్రిక రంగం పాత్రికేయాన్ని ధర్మంగా స్వీకరించింది, ఇక్కడ పత్రికలు ప్రజల ఆక్రన్దనలనుండి పుట్టాయి, అంధకారంలో మగ్గుతున్న ప్రజలకు ఉషోదయాన్ని ఇవ్వడానికి వెలుగు రేఖల పత్రికలు పని చేసాయి. ప్రజల స్వేదానికి, మట్టి మనుషుల ఆవేదనకు, ఆకలికి, ప్రతీకలయ్యాయి, అధికార మదన్ధులను అడ్డంగా నారికే కరవాలలయ్యాయి,   నిజాం రాజు అకృత్యాలు, జమీన్ దారుల జాగీర్ధరుల పెత్తనాలను ఎత్తి చుపేవి, రజాకార్ల దుశ్చర్యకు ఎదురొడ్డి పోరాడేవి, ఒక్క గోల్కొండ పత్రిక పేరు వింటే చాలు నిజాం రాజు జమీన్ దారులు జాగిర్ దారుల  వెన్నులో వణుకు పుట్టేది, అక్షరం అక్షరం చదువుతుంటే రక్తం మరిగిపోయి, పౌరుషం పొడుచు కొచ్చే కథనాలే, పదం పదం ప్రజల పక్షమే, తెలంగాణా వాళ్ళకు పత్రికలే లేవు అనే వాళ్ళ  కోరకు ఈ కథనం..
             శేద్య చంద్రిక లేదా సేద్య చంద్రిక తెలంగాణా ప్రాంతం నుండి వెలువడిన మొదటి పత్రిక గా చెప్పా వచ్చు, 1912 లో హిత బొదిని అనే పత్రిక ప్రారంభమైనది, దీనిని కూడా మొదటి పత్రికగా కూడా చెప్తారు, 1917 లో గౌళి గూడా నుండి ఆంద్రమాత, ఆతర్వాత 1922 లో తెలంగాణా సాంస్కృతిక ప్రతీకలుగా చెప్పాబడే నీలగిరి, తెనుగు అనే పత్రికలు పుట్టాయి, నీలగిరి నల్గొండ నుండి, తెనుగు వరంగల్ నుండి ప్రారంభమైనాయి, నీలగిరి తెలంగాణాలో మొదటి వార పత్రిక, 1926 లో తెలంగాణా ఆత్మ గౌరవ పతక గా చెప్పబడే గోల్కొండ పత్రిక ప్రారంబమైంది, ఈ పత్రికను సురవరం ప్రతాప రెడ్డి నిర్వహించారు, తెలంగాణా లో నిజాం రాజు నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పుట్టిన మరో పత్రికే రయ్యత్, రయ్యత్ అనేది ఒక ఉర్దూ పత్రిక షోయబుల్ల ఖాన్ అనే ప్రముక పాత్రికేయుడు నిజాం రాజు యొక్క నిరంకుశ పాలనపై అక్షర పోరు జరిపాడు, ఆయన స్వయంగా ఇమ్రోజ్ అనే పత్రికను 1947 ప్రాంతంలో తీసుకొచ్చారు.భాగ్య రెడ్డి వర్మ సంపాదకత్వంలో భాగ్య నగర్ అనే పాత్రక నడిచింది, 1946 లో శోభ అనే పత్రికను ప్రారంబించారు కాని ఇది ఒక సంవత్సరంలోనే ఆగి పోయింది, దీనిని మల్లి 1950 లో పూనా ప్రారంభించారు, దాశరథి మొదటి కావ్యాలు ప్రచురితమైంది ఈ పత్రికలోనే.




                         గోల్కొండ పత్రిక తొలుత అర్ధ వార పత్రిక గా ఉండేది, కాని ఆ తర్వాత దిన పత్రిక గా మారింది, కాని నిధుల లేమితో పత్రిక రెండుమూడు రోజులకొక సారి వచ్చిన జనం ఒకే పత్రికను రెండు మూడు రోజులు కొని చదివి పత్రికను ఆధుకున్నారు, మన పత్రికలలో గోల్కొండ ముఖ్యమైనది, తెలంగాణాలో కవులే లేరని, ఉన్న కవులను కూడా తమ కాతలో వేసుకున్న ఆంధ్రులకు గోల్కొండ పత్రిక సమాధానం చెప్పింది, తెలంగాణాలో ఉన్న కవులను, సాహిత్యాన్ని రుజువులతో సహా వెలికి తీసింది, 
                           తెలంగాణా అనే పత్రిక 1942 లో 1944 లో మీజాన్, 1951 లో సారస్వత జ్యోతి, 1946 లో కాకతీయ  పత్రికలు వెలువడ్డాయి కాని ఎక్కువకాలం నిలువలేఖ పోయాయి. కాకతీయ పత్రికను మాజీ ప్రధాని పీ వీ నరసింహ రావు చాల ఇష్టంగా చదివేవారు.
                     సుజాత పత్రిక 1927 లో మాస పత్రికగా ప్రారంభమైంది, కథలు, వ్యాసాలు, కవిత్వం ప్రచురించేవారు, తెలంగాణాలోని అనేక శాసనాలను  ప్రచురించేవారు, సుజాతలో తెలంగాణా రచయితల రచనలకు అధిక ప్రాధాన్యం ఇచ్చేవారు, గుడిపాటి వెంకట చలం రచనలకు బ్రిటిష్ ఇండియా లో నిషేధం ఉండేది, కాని సుజాత పత్రిక ధైర్యంగా ప్రచురించింది, ఆ తర్వాత సంపాదకులు శర్మ, పట్టబద్రులు కావడం తో ఆయన వెళ్ళిపోయారు, ఆ తర్వాత గోల్కొండ పత్రిక సంపాదకులే దీనిని నిర్వహించారు.నిజాం రాజు కాలం లో వచ్చ్సిన తెలంగాణా పత్రికలు ప్రజల వానిని వినిపించాయి, `రాజకారుల దుశ్చర్యల్ని ప్రశ్నించాయి, ప్రజలను మేల్కొల్పాయి, అనునిత్యం ప్రజల పక్షాన ఉంటూ ప్రజల ఆదరణను చూరగొని ప్రభువుల ఆగ్రహానికి కూడా గురి అయ్యాయి, కాని నేటి లాగా పత్రికలు అంటే రాజకీయ నాయకుల, పాలకుల  డైరీలుగా ఆరోజు లేవు, ప్రజల పక్షాన మాత్రమే ఉన్నాయి...
( మధ్య ఫోటో సురవరం ప్రతాప రెడ్డి గారిది, పైది షోయబుల్ల ఖాన్ ఫోటో)

ఇంటిని చక్కదిద్దలేనోడు, ఊరిని చక్క దిద్దుతనన్నాడట..!


పరకాల ప్రభాకర్ అనే వ్యక్తి పేరు వినే ఉంటారు, ఇతగాడు విలేకరిగా పని చేసి ఆ తర్వాత చిరంజీవి ప్రజారాజ్యంలో చేరి టికెట్ ఇవ్వలేదని అలిగి పార్టీ నుండి బయటకు వచ్చి చిరంజీవిని, పార్టీని చెడమడా తిట్టి ఆతర్వాత ఎం చెయ్యాలో అర్థం గాని సమయంలో తెలంగాణా ఉద్యమ౦ ప్రారంబం అయ్యింది, ఇంకేం విశాలాంద్ర మహా సభలు అని డిల్లి లో నిర్వహించాడు, అక్కడ జే ఎన్ యు విద్యార్థులు అడ్డుకుంటే వారికి ఏమి సమాధానం చెప్పాలో తెలియక బిత్తరపోయిన ఈయన ఆతర్వాత హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెడితే అవికూడా రసాభాస అయ్యాయి, ఇతగాడు ఈ రోజు రాష్ట్రం సమైక్యంగా ఎందుకు ఉండాలి అనే విషయం పై 101 కారణాలతో ఒక పుస్తకాన్ని తీసుకొని వచ్చాడంట.. దీనిని దేశ రాజధాని డిల్లి లో ఆవిష్కరించాడు . మీకు నిర్మల సీతరామన్ ఎవరో తెలుసా..? ఆవిడ బి జే పీ జాతీయ మీడియా ప్రతినిధి, ఆవిడ తన పార్టీ సిద్ధాంతం ప్రకారం తెలంగాణా కు సంపూర్ణ మద్దతు ఇస్తున్నారు, ఆవిడ నల్గొండ లో జరిగిన తెలంగాణా పోరు సభకు సుష్మ స్వరాజ్ తో పాటు హాజరయ్యారు.. ఇక వీరిద్దరికీ సంబంధం ఏమిటంటే , వీళ్ళిద్దరు భార్య భర్తలు..మరి పరకాల ప్రభాకర్ కనీసం తన భార్య చేత కూడా విశాలన్ద్రకు మద్దతు పొందలేక పోయాడు మరి ప్రజలను ఎలా సముధయిస్తడు...?



తెలంగాణా అంబేద్కర్ మన భాగయ్య...


తెలంగాణా దళితోద్యమ పితామహుడు భాగ్య రెడ్డి వర్మ, 1888 మే 22 న హైదరాబాద్ సంస్థానంలో జన్మించారు, ఆయన అసలు పేరు మదారి భాగయ్య , తండ్రి మదారి వెంకటయ్య, ఆయన మాల కులానికి చెందినవారు.. 
                                   ఆయన దళితులు అనుభవిస్తున్న దుర్భర పరిస్థితుల్ని చూసి, అనుభవించి ఉన్నారు కావున వారి పురోభి వృద్ది కై విశేషం గా కృషి చేసారు, దళితుల్లో అక్షరాస్యతను పెంచడం ద్వార వారిని సామాజికంగా, ఆర్థికం గా బలవంతుల్ని చేయ వచ్చని భావించిన ఆయన హైదరాబాద్ సంస్థానంలో 26 పాటశాల లను నెలకొల్పారు, దళితులే ఆది హిందువులని, దళితులకు ఆది హిందువులనే నామకరణం చేసారు భాగ్య రెడ్డి వర్మ, దళితుల గొంతు వేదికలపై నొక్కి వేస్తున్నారని, ప్రపంచానికి తమ గొంతును కూడా వినిపించాలనే ఉద్దేశ్యం తో ఆయన తన పేరును భాగ్య రెడ్డి గా మార్చుకున్నారు.
               దళితులపై జరుగుతున్న దాడులను ప్రశ్నించేవారే లేని కాలంలో దళితులకు న్యాయం చేయడానికి న్యాయస్థానాలను ఏర్పాటు చేసారు, అవే దళిత్ పంచాయత్ లు. ఇవి ఇప్పటి కోర్ట్ లలాగా పని చేసేవి.ఆయన 1906 వ సంవత్సరంలో జగన్ మిత్ర మండలి అనే ఒక సంస్థను ప్రారంబించారు, ఈ మండలి దళిత వాడల్లోని అమాయక ప్రజానీకాన్ని మేల్కొల్పుతుంది.
                    భాగ్య రెడ్డి వర్మ బుద్దున్ని పూజించే వారు, ఆయన బుద్దిజం ను స్వీకరించారు, హైదరాబాద్ పట్టణంలో ఆయన జీవించి ఉన్నన్ని రోజులు బుద్దపూర్నిమ ఉత్సవాలు ఘనంగా జరిగేవి.
ఆయన దేవదాసి వ్యవస్థకు వ్యతిరేకంగా సుధీర్గ పోరాటం చేసారు, దేవదాసి వ్యవస్థ అనేది ఉండ కూడదని, దాన్ని రద్దు చెయ్యాలని ఆయన నిజాం రాజు పై ఒత్తిడి తెచ్చారు, ఆ తర్వాత ఆ వ్యవస్థను రద్దు చేయించారు, ఆయన "భాగ్య నగర్ " అనే ఒక పత్రికను ప్రారంబించారు, దానికి అయన సంపాదకులుగా ఉన్నారు.
                        1913 లో జరిగిన ఆర్య సమాజ్ మహా సభల్లో పాల్గొన్న భాగ్య రెడ్డిని వేదికపై వర్మ అని సంబోధించారు, దాంతో ఆయన భాగ్య రెడ్డి వర్మ అయ్యారు, భాగ్య రెడ్డి వర్మ అధ్యక్షతన 1930 డిసెంబర్ 27 ,28 న లక్నో లో జరిగిన జాతీయ దళిత మహా సభలకు దేశవ్యాప్తం గా ఉన్న అనేక మంది దళిత ప్రముకులు హాజారయ్యారు , డా.బాబా సాహెబ్ అంబేద్కర్ కూడా ఈ కార్యక్రమానికి హాజారయ్యారు.
                                ఆయన ధలితులకోస౦ రాజధాని నగరం లో ఒక వేదిక కావాలని ఆకాంక్షించారు, అందుకోసం అప్పటి పాలకులను ఒప్పించి హైదరాబాద్లో కోటి కి సమీపంలో గల చాదర్ ఘాట్ ప్రాంతంలో ఆది హిందు భవన్ ను నిర్మించారు.
                                         వలసాంద్ర పాలనకులు ఇలాంటి గొప్ప సామాజిక వేత్తను తెలంగాణా ప్రజలు గుర్తించకుండా చేసారు, కాని నిజం నిప్పులాంటిది, అది ఎన్నటికైనా బయటికి రావాల్సిందే, మన ప్రముకులను వెలుగులోకి తీసుకు రావడం మన భాద్యత, మన చరిత్రను సక్రమం గా మనం రాసుకోవడం మన విధి, కావున మరుగున పడిన మన చరిత్రను వెలుగులోకి తేవడమే ఇలాంటి గోప్పవల్లకు మనం ఇచ్చే నిజమైన నివాళి....
                          2009  లో తెలంగాణా ఉద్యమం ఉదృతంగా సాగుతున్న సమయంలో విద్యార్థులు బాలయోగి స్తదిఉమ్కు భాగ్య రెడ్డి వర్మ స్టేడియం గా నామకరణం చేసారు.... 

5, నవంబర్ 2011, శనివారం

కోమటి రెడ్డి దీక్ష భగ్నం...

06/11/2011  గత ఐదు రోజులుగా ధీక్ష చేస్తున్న కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ధీక్ష ను గత రాత్రి పోలీసులు భగ్నం చేసి హైదరాబాద్ లోని నిమ్స్ కు తరలించారు, నిమ్స్ లో ఆయనకు వైద్యం అందించాలని ప్రయత్నిస్తున్నారు, కాని ఆయన సహకరించడం లేదు, ఆయన ధీక్షను హాస్పిటల్ లోనే కొనసాగిస్తున్నారు, అయితే ఈ ఘటనతో నల్గొండ ప్రజలు భగ్గుమన్నారు, రాస్తా రోకో లు , ధర్నాలు జిల్లా అంతట నేటి ఉదయం నుండి కొనసాగుతున్నై.JAC ఎల్లుండి నల్గొండ బంద్ కు పిలుపు నిచ్చింది....

తెలంగాణా వచ్చి తీరుతుంది: సుష్మ


నేడు నల్లగొండలో జరిగిన తెలంగాణా పోరు సభకు ముక్య అతిధి గా బి జే పీ అగ్ర నాయకురాలు సుష్మ స్వరాజ్ హాజారయ్యారు, ఈ సందర్భంగా ఆమె లక్షలాదిగా తరలివచ్చిన జనాన్ని ఉదేశించి ప్రసంగించారు, తెలంగాణా ఇస్తానని చెప్పి యు .పి.ఎ తెలంగాణా ప్రజలను మోసం చేసిందని, పార్లమెంట్ శీత కాల సమావేశాల్లో బిల్లుపెడితే మద్దతునిస్తామని పునరుధ్గటించారు, ఒక వేల కాంగ్రెస్ బిల్లు పెట్టకపోయినా యు పి ఎ ను జనం నాశనం చేస్తారని, అప్పుడు 2014 బి జే పి అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే తెలంగాణా ఇస్తుందని ఆమె అన్నారు, యువకులు ఎవరు ఆత్మహత్యలకు పాల్పడవద్దని, తెలంగాణా వచ్చి తీరుతుందని ఆమె అన్నారు, ఈ సభకు, పది జిల్లాలనుండి భారి సంక్యలో జనం తరలి వచ్చారు, ఈ కార్యక్రమానికి, జే ఎ సి చైర్మెన్ కోదండ రామ్, బి జే పి రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డ్డి, ఇంకా బి జే పి నాయకులూ, టి ఆర్ఎస్ ప్రతినిధులు, న్యూ దేమోక్రాసి ప్రతినిధులు హజారయ్యారు.....