హోం

5, నవంబర్ 2011, శనివారం

తెలంగాణా సుకవి దాశరథి....

 ( 05 . 11 . 2011 ) తెలంగాణా ఆధునిక కవుల్లో కలికితురాయి దాశరథి, ఆయన జూలై 22 ,1925 లో ఖమ్మం జిల్లాలోని చిన్నగుడురు గ్రామంలో జన్మించారు, ఆయన బాల్యం ఖమ్మంలోనే గడిచిన ఉన్నత విద్యకై హైదరాబాద్ కు వచ్చారు, అప్పుడే నిజాంకు వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్నారు.
                         వారు ఆతర్వాత వరంగల్ జిల్లాకు వలస వెళ్లారు, ఆయనొక అభ్యుదయవాది, ఆయన నిజాం వ్యతిరేకంగా 150 మందితో ఏర్పాటు చేసిన సైన్యంలో ఒకడిగా పనిచేసారు, కామునిస్ట్ పార్టీలో ఉన్న ఆయన ఒక మహా సభ ను ఏర్పాటుచేసారు, ఆ తర్వాత జనాన్ని చైతన్య పరచటానికి, తెలంగాణా మొత్తం తిరిగారు, ఆయన 1946 నుండి 1948 వరకు వరంగల్, ఆతర్వాత నల్లికుదురు నిజామాబాదు జైలు లలో ఉన్నారు, అయన జైలు నుండి తప్పించుకొని, మహబూబాబాద్ అడవుల్లో అజ్ఞాత౦ లోకి వెళ్లి, తన కార్యకలాపాలు కొనసాగించారు.
                                    దాశరథి మొదటి రచన అగ్నిధార, ఈ పుస్తకం నిజాం నిరంకుశ పాలనకు సంబంధించింది. "మా నిజాం రాజు తరతరాల భూజు" అన్నారు దాశరథి, ఆతర్వాత రుద్రవీణ, పుష్పకం, గాలిబ్ గీతాలు, ఆలోచన లోచనాలు, తిమిరంతో సమరం, మొదలైన రచనలు చేసారు, 1967 లో దాశరథి కేంద్ర సాహిత్య అకాడమి అవార్డ్ను తిమిరంతో సమరం పుస్తకానికి గాను అందుకున్నారు, 1975 లో ఆంద్ర ఉనివర్సిటి కళా ప్రపూర్ణ తో సత్కరించింది, ఆ తర్వాతి సంవత్సరం ఆగ్రా విశ్వా విద్యాలయం డాక్టరేట్ తో సత్కరించింది. ఆయనకు తెలుగు, ఉర్దూ, సంస్కృతం, తమిళ భాషలు తెలుసు.
                    " నా తెలంగాణా కోటి రతనాల వీణ" అని చాటిన దాశరథి సినిమా సాహిత్యాన్ని కూడా రచించారు, ఆయన ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రానికి ఆస్థానకవిగా ఉన్నారు, ఎన్ టి ఆర్ ముక్య మంత్రి అయ్యాక ఆయనను ఆపదవి నుండి తొలగించి తీవ్రంగా అవమానించాడు, ఆయన ఆ అవమాన భారంతో 1987 లో మరణించారు..

2, నవంబర్ 2011, బుధవారం

నిప్పులాంటి నిజాల కోసం చూడండి..

(3 నవంబర్ ), తెలంగాణా, ఆంద్ర కలిసి నప్పుడు చేసుకున్న ఒప్పందాలు, ఆ తర్వాత 1969 లో చేసుకున్న ఒప్పందాలు, ఇప్పటి వరకు వేసిన కమిటి లు వాటి సిఫారసులు, GO లు, ఎన్నెన్నో ఫార్ములాలు, ఐన ఏది అమలు కాని వైనం నిప్పులాంటి నిజాలను విప్పి చెప్పింది జీ 24 గంటలు ..చూడండి..




తెలంగాణా జే ఎ సి ప్రస్థానం..

(2 నవంబర్ ) కే సి ఆర్ నిరాహార దిక్ష, విద్యార్థుల ఉద్యమంతో దిగి వచ్చిన కేంద్రం 9 .12 .2009 న ఒక ప్రకటన చేసింది అనే విషయం మనందరికీ తెలుసు, ఆ తర్వాత సీమంద్ర రాజకీయ నాయకుల ఒత్తిడికి తలొగ్గి 23 .12 .2009 న ఆ ప్రకటన నుండి కేంద్రం వెనక్కి వెళ్ళింది, ఈ పరిణామంతో కే సి ఆర్ జానా రెడ్డి నివాసానికి వెళ్లి ఉమ్మడిగా పోరాడేందుకు ఒక వేదికను ఏర్పాటు చేసారు, అదే తెలంగాణా రాజకీయ JAC , జే ఎ సి కన్వినర్ గా ప్రో.కోదండ రామ్ ను ఎన్నుకున్నారు, ఇందులో కాంగ్రెస్, టి ఆర్ ఎస్, టి డి పి, బి జే పి, న్యూ డేమోక్రసి పార్టీలు, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంగాలు, కవులు కళాకారులు, మేధావులు, గద్దర్, మంద కృష్ణ మాదిగ, ఇలా చాల మంది ఉన్నారు, ఒకటి రెండు సమావేశాలు జరిగాయి, అయితే ప్రాధాన్యతల గొడవతో గద్దర్ లాంటి వాళ్ళు , వివిధ కారణాలతో మంద కృష్ణ , కొన్ని సంగాలు జే ఎ సి నుండి తొలగి పోయాయి, అన్ని పార్టీల వాళ్ళు కూర్చొని ఒక నిర్ణయానికి వచ్చారు, జనవరి 28 2010 లోగ రాజీనామాలు చెయ్యాలని, కాంగ్రెస్ మాట నిలుపుకోలేక జే ఎ సి నుండి బయటికి వెళ్ళింది, టి డి పి రాజీనామాల జిరాక్ష్ కాగితాలు కోదండ రామ్ కు ఇచ్చి తప్పించుకునే ప్రయత్నం చేసారు, జే ఎ సి, టి డి పి ని భహిష్కరించింది, ఇక జాక్ లో కేవలం టి ఆర్ఎస్, బి జే పీ, న్యూ డేమోక్రాసి లు మాత్రమే ఉండడంతో రాజకీయ జాక్ విఫలం చెందిందని సీమంద్ర ఛానళ్ళు ప్రచారం చేసాయి, దీంతో జాక్ లో కొన్ని మార్పులు చేసారు, రాజకీయ jac ని తెలంగాణా jac గా ఏర్పరచి, చైర్మెన్గా కోదండ రామ్, కో చైర్మెన్గా మల్లేపల్లి లక్ష్మయ్య ఎన్నికయ్యారు. జాక్ మాట విని 11 మంది టి ఆర్ ఎస్ , ఒక బి జే పి ఎం ఎల్ ఎ లు రాజీనామా చేసారు.. జాక్ జిల్లా మండల స్థాయిల నుండి గ్రామ స్థాయి వరకు జాక్ లను ఏర్పరచి పూర్తిగా పరిపుష్టం అయ్యింది.

జగన్ ను అడ్డుకున్న మానుకోట: పార్లమెంట్లో సమైక్య వాద ప్లేకార్డ్ పట్టుకున్న జగన్ వరంగల్లో ఓదార్పు యాత్రకు సిద్ధపడ్డాడు, వరంగల్ జనం తమ జిల్లాకు జగన్ రావొద్దని మొత్తుకున్నారు, అతని రాకకు నిరసనగా బంద్ పాటించారు, డి జి పి కూడా వేల్లోద్దని చెప్పారు, సోనియా గాంధీ కూడా వరంగల్ వేల్లోద్దని చెప్పిన జగన్ కొండ దంపతుల అండతో వరంగల్ వెళ్ళడానికి సిద్ధమయ్యారు, అయితే జాక్ జగన్ ను అడ్డుకోవాలని పిలుపు నిచ్చారు, 27 మే 2010 న ఇంటర్ సిటీ ట్రైన్లో సికాన్ద్రాబాద్ నుండి బయలు దేరాడు జగన్, అయితే ఆ రోజు ఉదయానికే వేలాది మంది జనం మహబూబా బాద్ రైల్వే స్టేషన్ కు చేరుకున్నారు, జగన్ ను మొదట బిబి నగర్ రైల్వే స్టేషన్ లోనే జనం అడ్డుకున్నారు, అరగంట తర్వాత ట్రైన్ బిబి నగర్ నుండి బయలుదేరింది,అయితే మహబూబాబాద్ రైల్ స్టేషన్కు  కొండదంపతులు చేరుకోవడం ఉద్రిక్తతలకు ధరి తీసింది, వెయిటింగ్ రూం లో కూర్చున్న వారిపై జనం రాళ్ల దాడి చేసారు, దీనితో ఆగ్రహించిన కొండ మురళి కాల్పులకు పాల్పడగా విద్యార్థి తల నుండి బుల్లెట్ దూసుకెళ్ళి , ఆ విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. వరంగల్ జనం ఆగ్రహంతో రగిలి పోయారు కేసముద్రం ను౦డి మహబూబ బాద్ వరకు రైల్వే ట్రాక్ మొత్తం జనం తో నిండి పోయింది,  వంగపల్లి స్టేషన్ వద్ద సుమారు రెండు గంటల పాటు రైల్ ను ఆపారు, ఆ తర్వాత్ పోలీసులు వచ్చి జగన్ను అరెస్ట్ చేసి హైదరాబాద్ తరలించారు.

ఉప ఎన్నికలు: JAC  పిలుపు మేరకు రాజీనామా చేసిన తెలంగాణా వాదులకు పోటిగా కాంగ్రెస్, టి డి పి లు తమ అబ్యర్తులను నిలబెట్టాయి, జాక్ తన అబ్యర్తులను గెలిపించుకోవడానికి, విద్యార్థులు బస్సు యాత్ర చేసారు, అమరవీరుల కుటుంబాలు ప్రచారంలో పాలు పంచుకున్నై, టి ఆర్ ఎస్, బి జే పి లు ప్రచారం చేసాయి, జూలై 30 ,2010  ఎన్నికల ఫలితాలు వచ్చాయి, అన్ని స్థానాల్లో జాక్ అభ్యర్థులు భారి మెజారిటితో విజయం సాధించారు, కాంగ్రెస్ నాల్గు, టి డి పి పన్నెండు స్థానాల్లో డిపాసిట్ కోల్పోయాయి. 

సహాయనిరాకరణ: శ్రీ కృష్ణ కమిటి ఎ పరిష్కారం చూపక పోయే సరికి జాక్ సహాయనిరకరణకు పిలుపునిచ్చింది, 17  ఫిబ్రవరి 2011  న ప్రరంబమైన సహాయనిరకరణలో 3 లక్షల ఉద్యోగులు పాల్గొన్నారు, టి ఆర్ ఎస్ ఎం పి లు పార్లమెంట్ను స్తంబింప జేసారు, బి జే పి నాయకురాలు సుష్మ స్వరాజ్ కాంగ్రేస్స్ను నిలదీసింది. 25  రోజుల పాటు ఈ సమ్మె కొనసాగింది, మే లో ఐదు రాష్ట్రాల ఎన్నికలు ఉండడంతో కాంగ్రెస్ వేచి ఉండాలి అని చెప్పడంతో సమ్మెను విరమించారు, అయితే అనేక ఆరోపణలు వచ్చాయి ఈ సమ్మె విరమనపై..

మిలియన్ మార్చ్: సహాయ నిరాకరణ లో బాగంగా మార్చ్ 10 న మిలియన్ మార్చ్ కు  జాక్ పిలుపునిచింది, అయితే ప్రభుత్వం విద్యార్థులను , రాజకీయ నాయకులను ఎక్కడికక్కడ ముందస్తు అరెస్ట్లు చేసింది, రైల్వే స్టేషన్ బస్సు స్టాండ్ లలో  పోలీసులను పెట్టి జనాన్ని అరెస్ట్ చేయించింది, సిటీ చుట్టూ 13  చెక్ పోస్ట్ లను ఏర్పాటు చేసింది, ఐన వేలాదిగా ట్యాంక్ బ్యాండ్ పైకి జనం తరలి వచ్చారు, ఆరోజు 50 వేల నుండి లక్ష మంది జనం పాల్గొన్నారు, ఆంద్ర వారికి ప్రతిరూపంగా ఉన్న విగ్రహాలను పగులగొట్టి సాగర్ లో నిమర్జనం చేసారు. మిలియోన్ మార్చ్ జనాలలో ఉత్సాహాన్ని నింపింది.

జాక్ ఆ తర్వాత పట్నం రోడ్లపై పొయ్యి పెడదాం అనే కార్యక్రమాన్ని చేపట్టింది, రైల్ రోకో ను కూడా విజయ వంతంగా నిర్వహించింది.
సకల జనుల సమ్మె: గతం లో జరిగిన లోటు పాట్లను సవరించుకుంటూ జాక్ సకల జనుల సమ్మె కు పిలుపు నిచ్చింది, గతం లో సహాయ నిరాకరణ సమయంలో బస్సు ఎక్కి టికెట్ తీసుకోకుండా జై తెలంగాణా అనాలని జే ఎ సి పిలుపు నిచ్చింది, కాని ఇది సాధ్యం కాలేదు, అందుకే ఈ సారి సీమంద్ర సర్కార్ ఆర్ధిక మూలాలను దెబ్బ తీయాలని RTC ఉద్యోగులనే సమ్మేలోకి దించింది, అలగే గతంలో కరెంట్ బిల్లులు కట్టవద్దని కూడా పిలుపు నిచ్చింది, కాని అది కూడా సాధ్యం కాలేదు, అందుకే ఈ సారి విధ్యుతుద్యోగుల్ని సమ్మెలో భాగం చేసింది, అలాగే వాటర్ బిల్, ఇంటి పన్ను లాంటివి చెల్లించ వద్దని పిలుపునిచ్చారు, అయితే ఈ సారి ఏకంగా మున్సిపల్ ఉద్యోగుల్ని, GHMC ని ఉద్యమంలో కలుపుకున్నారు, మద్యం దుకాణాల బంద్ కు గతం లో పిలుపు నిస్తే అది పూర్తిగా విజయ వంతం కాలేదు, అలాగే మద్యం విషయంలో ప్రజలు స్వయం నియంత్రణ పాటించాలని జే ఎ సి పిలుపునిచ్చింది, అయితే ఈ సారి మద్యం తయారి కంపనిల ఉద్యోగుల్ని,అలాగే ఎక్షజ్ శాఖ ఉద్యోగుల్ని కలుపుకొని సమ్మెను తీవ్రం చేసారు, 12  సెప్టెంబర్ న కరీం నగర్ లో నిరవహించిన సభ తో సమ్మె ను ప్రారంబించారు, 13  వ తేది నుండి సకల జనులు సమ్మెలో పాల్గొన్నారు, అన్ని శాఖల ప్రభుత్వ ప్రవేట్ తెలంగాణా ఉద్యోగులు, వ్యాపార సంస్థలు, ఫిలిం జాక్ , సింగరేణి, RTC , GHMC  కులసంగాలు పాల్గొన్నారు, కాని రాజకీయ నాయకులూ భాగం కాలేదు, దీనితో 42  రోజులు సమ్మె చేసిన ఉద్యోగులు ఆ తర్వాత విరమించారు.

         అయితే సకల జనుల సమ్మె ముక్య ఉద్దేశ్యం ఏంటంటే ఒక నియోజక వర్గంలో లక్ష యాభై వేల మంది జనం ఉంటారు వారంతా సమ్మెలో పాల్గొనడం జరగదు, ఆ నియోజక వర్గ ఎం ఎల్ ఎ రాజీనామా చేసి సమ్మెలో పాల్గొంటే అది సకల జనుల సమ్మె అవుతుంది, కాని 42 రోజుల పాటు ఒత్తిడి తెచ్చిన కాంగ్రెస్ నాయకులూ కదలలేదు, అందుకే ద్రోహులుగా మంత్రులను ప్రజల ముందు నిలబెట్టి సమ్మెను విరమించారు ఉద్యోగులు, JAC పై కొంతమంది ఉద్యమంలో కలిసి రాని మనుషులు విమర్శలు కురిపిస్తున్నారు, అయితే వీళ్ళు గతంలో సహాయ నిరాకరణ ముగించిన తర్వాత కూడా ఇలాగె ప్రవర్తించారు, కాని ఏనాడూ ఉద్యమాన్ని ముందుకు నడిపించలేదు, కాని JAC అవన్నీ పట్టించుకోకుండా తన గత అనుభవాలను పాటలుగా చేసుకొని కొత్త కార్య చరనతో అనేక సంఘాలను కలుపుకొని సకల జనుల సమ్మె గా వహ్చింది, అలాగే సకల జనుల సమ్మె నుండి కూడా పాటలు నేర్చుకొని భవిష్యత్ ఉద్యమాన్ని మరింత పకడ్బందిగా రూపొందిస్తుంది.... 
                                  

1, నవంబర్ 2011, మంగళవారం

తెలుగు ప్రజల ఆత్మ గౌరవం, ఎన్టిఆర్ కుట్ర ...

తెలంగాణా సంస్కృతిని, అస్తిత్వాన్ని సమూలంగా నాశనం చెయ్యాలని కంకణం కట్టుకున్న వ్యక్తి తెలంగాణా ప్రజల ఆరాధ్య దైవం, అన్న అని అభిమానంగా  పిలుచుకునే ఎన్ టి ఆర్. ఈ విద్రోహ దినం నాడు ఆ తెలంగాణా ద్రోహి చేసిన ద్రోహాన్ని తెలుసుకోవడం సముచితమే, తెలంగాణా పై సీమంద్రులు రాజకీయంగా, ఆర్ధికంగా, నీళ్ళు నిధులు, నియామకాల్లో దోపిడి చేస్తే ఎన్ టి ఆర్ మాత్రం తెలంగాణా సంస్కృతిపైన తెలంగాణా అస్తిత్వంపైన దాడి చేసాడు, దానికే తెలుగు వారి ఆత్మ గౌరవం అని పేరు పెట్టాడు, తెలుగు వారి ఆత్మ గౌరవం పేరుతో తెలంగాణా అస్తిత్వం లేకుండా చేసాడు, 1985 లో తెలంగాణాలో మంచి పేరు సంపాదించుకోవడానికి 610 జి ఓ తీసుకొని వచ్చాడు, కాని దాన్ని వ్యూహాత్మకంగా అమలు చెయ్యలేదు, తెలంగాణాలోని ప్రభుత్వ రంగ సంస్థలైన ఆల్విన్, నిజం షుగర్ ఫ్యాక్టరీ, అజంజాహి మిల్లు, అంతర్గం మిల్లు, సర్ పుర్ కాగజ్ నగర్ పేపర్ మిల్లు, హైదరాబాద్ పవర్ స్టేషన్, ఫిరంగుల ఫ్యాక్టరీ, సోడా, ఐరన్, దక్కన్ బటన్, దక్కన్ గ్లాస్, డి.బి.ఆర్. ఫాక్టరీ  లను లాభాలలో ఉండగానే ముసివేసాడు ఈ ఎన్ టి ఆర్, అయితే అవన్నీ నిజాం రాజు స్థాపించిన ప్రభుత్వ రంగ కంపెనీలు. ఇతను అధికారంలోకి వచ్చే సరికే తెలంగాణాలో ఉన్న 12 పాల శుద్ధి కేంద్రాలను ఇతను అధికారం లోకి రాగానే మూసి వేసాడు. అలాగే 1983 లో ఆయన మొదటి సారి ముఖ్య మంత్రి కాగానే చేసిన మరో పని తెలంగాణా ప్రాంతీయ బోర్డు ను రద్దు చెయ్యడం.
                        ఇంతే కాదు శ్రీ శైలం నుండి ఎడమ కాలువ నీరు తెలంగాణా కు కేటాయించింది, అయితే కుడి కాలువ తో తెలుగు గంగ , గాలేరు నగరి హంద్రి నీవ లను జత పరిచి దాని సామర్ధ్యాన్ని మూడు నాల్గు రెట్లు పెంచేసాడు, ఉన్న నీరు మొత్తం వంపున ఉన్న కుడిగట్టు కాల్వలకే వెళ్ళేలా ఏర్పాటు చేసారు, ఎడమ కాల్వ నిజానికి అది ఎడమవైపు లేదు అది పూర్తిగా ఎత్తులో నీటి చుక్క కూడా రాణి ప్రాంతంలో ఏర్పాటు చేసారు, ఎదమకాల్వ పూర్తి చేస్తంమని చెప్పారు కాని అది చెయ్యలేదు, చెన్నై తనను అక్కున చేర్చుకుందని చెన్నై తాగునీటి అవసరాలకని తెలుగు గంగ ను చెన్నై వరకు పొడగించి ప్రతి ఏడు 2  టి ఎం సి లనీరు ఇచ్చిన ఎన్ టి ఆర్ కు అన్న అని గుండెల్లో పెట్టుకుని, అతని సినిమాలకు 60 % కాలేక్షన్లు తెచ్చి పెట్టె తెలంగాణా ప్రజలు, ఫ్లోరైడ్ బారిన పడి అవస్థలు పడుతుంటే కనబడ లేదు, వాళ్ళకు గుక్కెడు నీళ్ళు ఇవ్వలేదు..
      నిజం షుగర్ ఫాక్టరీ లాభాలను నష్టాల్లో ఉన్న ఆంధ్ర కంపనిలకు తరలించి ఈ కంపని ని సంక్షోభం లోకి నెట్టి తన అల్లుడికి అమ్ముకున్నాడు, అతను తర్వాత వేరే వాళ్ళకు అమ్ముకున్నాడు,.
            ఇక తెలంగాణకు చెందిన మహోన్నత కవి దాశరధి ఆయన అప్పటివరకు ఆస్థాన కవి గా ఉన్నారు, అయితే ఎన్ టి ఆర్ అధికారంలోకి రాగానే ఆయనను పదవిచుతిన్ని చేసి తీవ్రంగా అవమానించాడు, ఆ అవమానంతో ఆయన మరణించారు.అయితే ట్యాంక్ బoడ్ పై విగ్రహాలు కూడా కుత్రపురితంగా ఎంపిక చేసినవే, అందులో తెలంగాణకు ఎ మాత్రం సంబంధం లేని ఆంద్ర కు చెందిన పొట్టి శ్రీ రాములు , టంగుటూరి ప్రకాశం పంతులు, దామోదరం సంజీవయ్య, తెలంగాణా ద్రోహి బ్రమ్హానంద రెడ్డి, శ్రీ కృష్ణ దేవ రాయలు లాంటి వారి విగ్రహాలు ఉన్నాయ్, తెలుగు జాతిని మొత్తాన్ని పాలించిన రుద్రమ దేవి, ప్రతాప రుద్రుల విగ్రహాలు పెట్టని ఎన్ టి ఆర్ , కన్నడ రాజు శ్రీ కృష్ణ దేవరయలును పెట్టడంలో ఆంతర్యమేమిటి, శ్రీ శ్రీ ఉన్నప్పుడు దాశరధి ఎందుకు లేడు, అల్లూరి ఉన్నప్పుడు కొమురం భీమ ఎందుకు లేడు, టంగుటూరి ప్రకాశం పంతులు ఉన్నప్పుడు భుర్గుల రామ కృష్ణ రావు ఎందుకు లేడు, అసలు హైదరాబాద్ నగరాన్ని, ట్యాంక్ బుండ్ ను నిర్మించిన మొహమ్మేద్ కూలి కుతుబ్ షా విగ్రహం లేకపోవడం దారుణం. తెలంగాణ అస్తిత్వం పై దెబ్బ కొట్టాలనే కుట్రతో ముందుకు సాగిన ఎన్ టి ఆర్ ముమ్మాటికి తెలంగాణా ద్రోహే.....
                                                  

తెలంగాణా ముద్దు బిడ్డ పీజేఆర్..!!

పీ జనార్ధన్ రెడ్డి హైదరాబాద్ నగరం లో  జనవరి 12 1948 లో జన్మించారు, ఆయన పీ జే ఆర్ గా అందరికి సుపరిచితుడే,ఆయన తండ్రి పాపి రెడ్డి , తల్లి శివమ్మ, కార్మిక నాయకునిగా ఆయన ప్రస్థానం ప్రారంభమయ్యింది, కార్మిక నాయకునిగా ఆయన చేసిన విశేష సేవలను గుర్తించిన అప్పటి ముక్య మంత్రి టి. అంజయ్య పీ జే ఆర్ ను రాజకీయాల్లోకి ఆహ్వానించారు, ఆయన ఖైరతాబాద్ నియోజకవర్గం నుండి 1978 మొదటిసారి ఎం ఎల్ ఎగా ఎన్నికయ్యారు, పేదల పాలిటి పెన్నిదిగా అయన ప్రజల గుండెల్లో సమున్నత స్థానం సంపాదించుకున్నారు, తన నియోజకవర్గం మొత్తం CC రోడ్లు వేయించారు, ఆయన ఇలవేల్పు ఐన జూబ్లి హిల్స్ పెద్దమ్మ తల్లికి దేవాలయం నిర్మించారు, ముక్యంగా ఆయన ప్రజలకు నిత్యం అందు బాటులో ఉండేవారు, ప్రజలు ఎ సమయంలో పిలిచినా వారికోసం పరుగు పరుగున వెళ్ళేవారు, ఆయన బతికి ఉన్నన్ని రోజులు ప్రభుత్వం హైదరాబాద్ భాస్తిల వైపు కుల్చేయ్యలని కన్నెత్తి కూడా చూడలేదంటే ఆయన బస్తి వాసులను ఎంతగా  కాపడుకున్నారో అర్థం అవుతుంది, అసెంబ్లీలో చంద్ర బాబు నాయుడు కాలం నుండి రాజశేకర్ రెడ్డి వరకు తెలంగాణాకై పోరాడిన మనిషి పీ జే ఆర్, ఆయన మొత్తం ఐదు సార్లు ఎం ఎల్ ఎ గ ఎన్నికయ్యారు, 1994 నుండి 1999 వరకు సి ఎల్ పీ నాయకుడిగా ఉన్నారు, ఆయన తెలంగాణపై సొంత ప్రభుత్వాన్నే నిలదీసే వారు అందుకే ఆయనను వివాదాస్పదుడు అని ఎంతో సీనియర్ ఐన రాజశేకర్ రెడ్డి ఆయనకు మంత్రి పదవి ఇవ్వలేదు, పదవులకంటే తను నమ్ముకున్న సిద్ధాంతనికే కట్టుబడిన పీ జే ఆర్ చివరివరకు తెలంగాణాకై పరితపించారు, ఆయన 2007 ,డిసెంబర్ 28 న కార్యకర్తల సమావేశంలో పాల్గొని ప్రసంగిస్తుండగా గుండె పోటుతో మరణించారు, ఆయన లేని లోటు ప్రస్తుత ఉద్యమంలో ప్రస్పుటంగా కనిపిస్తున్నది, పేద ప్రజలకొరకు ఆయన జీవితాంతం కృషి చేసారు, వాళ్ళ మనసుల్లో ఎనలేని కీర్తిని సంపాదించుకున్నారు, అందుకే ఆయనకు ఆ ప్రజలు గుడి కట్టి పూజిస్తున్నారు, ఆయన కుమారుడు విష్ణు వర్ధన్ రెడ్డి తండ్రి బాటలో నడుస్తూ తెలంగాణాకొరకు పోరాడుతున్నాడు..
పీ జే ఆర్ అసెంబ్లీ లో తెలంగాణా గురించి రాజశేకర్ రెడ్డిని నిలదీస్తున్న దృశ్యం:

నవంబర్ 1 నలుపు దినోత్సవం....

(నవంబర్ 1 ) తెలంగాణా JAC ఇచ్చిన పిలుపు మేరకు తెలంగాణా వాదులంత నల్ల జెండాలను ఎగురవేసి తమ నిరసనను తెలిపారు, పది జిల్లాలలోని ప్రజలు నల్లజెందాలను తమ ఇళ్ళపై ఎగురవేసారు,, నాయిని నరసింహ రెడ్డి తెలంగాణా భవన్ పై నల్ల జెండా ఎగురవేసారు, రంగారెడ్డి కోర్ట్ పై నల్ల జెండా ఎగురవేయడానికి లాయర్లు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు, OU లో మరో సరి ఉద్రిక్తతలు కొనసాగాయి, కాంపస్ నుండి గన్ పార్క్ వరకు విద్యార్థులు చేపట్టిన రాలీని పోలీసులు యాదయ్య NCC గేటు వద్ద అడ్డుకున్నారు, విద్యార్థులు పెద్దఎత్తున నినాదాలు చెయ్యడంతో పోలీసులు లాటి చార్జ్ చేసారు, దీనితో విద్యార్థులు పోలీసులపైకి రాళ్ళూ విసిరారు, దీంతో రెచ్చిపోయిన పోలీసులు భాష్పవాయు గోలాలను ప్రయోగించారు, ఇలా మధ్యానం వరకు ఉద్రిక్త పరిస్థితులు కొనసాగాయి, ఉద్యోగులు నల్ల బాడ్జి లతో ఆఫీసు లకు వెళ్లారు, కార్మికులు, ఉపాధ్యాయులు కూడా నల్ల బాద్జిలతో విధులకు హాజారయ్యారు, వరంగల్లో కలెక్టర్ ఆధ్వర్యంలో జరిగిన అవతరణ వేడుకలను ఎం ఎల్ ఎ వినయ భాస్కర్ అడ్డుకున్నారు, వేదికపైకి వెళ్లి పోస్టర్ ను  చిన్చివేసారు, దీనితో అక్కడే ఉన్న పోలీసులు ఆయనపై దురుసుగా ప్రవర్తించడంతో ఆయన స్పృహ కోల్పోయారు, ఆయన పై నాన్ బెయిలబుల్ కేసు పెట్టి అరెస్ట్ చేయాలనీ ప్రయత్నిస్తున్నారు, అయితే విషయం తెలుసుకున్న కార్యకర్తలు పెద్ద సంక్యలో చేరుకొని పోలీసులను అడ్డుకుంటున్నారు,..


లండన్ లో బ్లాక్ డే:

లండన్ లో  ఉన్న తెలంగాణా NRI లు నల్ల జెండాలను ఎగురవేసి బ్లాకు డే ను జరుపు కునారు, ఈ సందర్బంగా జరిగిన కార్యక్రమం లో పాల్గొన్న వక్తలు సమైక్య రాష్ట్రంలో తెలంగాణా పూర్తిగా దోచుకో బడిందని, ప్రత్యేక రాష్ట్రమే సరైన పరిష్కారమని వారు అభిప్రాయపడ్డారు....

దిక్షా దక్షులు....

కోమటిరెడ్డి దిక్ష:
( 01 /11 / 2011 ) తెలంగాణా బిల్లు పార్లమెంట్లో పెట్టాలనే డిమాండ్ తో మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎం ఎల్ ఎ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నల్లగొండలోని తెలంగాణా చౌక్ వద్ద నేడు ఉదయం ఆమరణ నిరాహార దిక్ష ప్రారంబించారు, ఉదయం వేలాది  మంది తెలంగాణా వాదులతో కలిసి రాలిగా నిరాహార దిక్ష వేదిక వద్దకు వచ్చారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన దిక్షను సి ఎం కుట్ర పూరితంగా భగ్నం చెయ్యాలని చూస్తే ఆత్మాహుతి చేసుకుంటానని సి ఎం ను హెచ్చరించారు, దిక్షలొ ఈ రోజు ఎం పిలు మంద జగన్నాధం, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, పొన్నం, వివేక్, రాజయ్య, కేకే లు మరి కొంత మంది ఎం ఎల్ ఎ లు పాల్గొన్నారు, కాగ దిక్షకు కెసిఆర్ తన మద్దతును తెలిపారు, అలాగే ఉద్యోగ ఉపాధ్యాయ, కార్మిక సంఘాలు మద్ధతుపలికాయి, జాక్ చైర్మెన్ కోదండ రామ్ కూడా మద్దతు ప్రకటించారు, మొత్తం 140 సంఘాలు దిక్షకు మద్దతు తెలిపాయి,  దిక్షలొ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాల నాయకులూ పాల్గొని దిక్షకు మద్దతు ప్రకటించారు, అన్ని కుల సంఘలవాళ్ళు పెద్దఎత్తున దిక్ష స్థలికి చేరుకొని తమ సంపూర్ణ మద్దతు తెలిపాయి, మొదటిరోజు కళాకారుల ఆటపాటలు, ఉద్యోగ సంఘాలు, కాంగ్రెస్ ఎంపి ఎం ఎల్ ఎ లు కుల సంఘాల తోపాటు భారీగా జనం తరలి రావడంతో మొదటి రోజు దిక్ష విజయవంతం అయింది... 

కొండ లక్ష్మణ్ బాపూజీ దిక్ష...


తెలంగాణా బిల్లు పర్లిమెంట్లో ప్రవేశపెట్టాలనే డిమాండ్తో ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు  కొండా లక్ష్మణ్ బాపూజీ  ఈ రోజు ఉదయం డిల్లి లోని జంతర్ మంతర్ వద్ద దిక్ష ప్రారంబించారు, సామజిక జై ఆంద్ర కార్య కర్తలు పెద్ద  సంక్యలో వచ్చి జై తెలంగాణా, జై ఆంద్ర నినాదాలు చేసారు..
JAC మద్దతు:
కోమటి రెడ్డి, బాపూజీ ల దిక్షకు jac పూర్తిగా మద్దతిస్తుందని కోదండ రామ్ చెప్పారు, అసెంబ్లీ, పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యే నాటికి ఉద్యమాన్ని ఉదృతం చెయ్యడానికి ప్రణాళిక సిద్ధం చేసుకున్నామని ఆయన చెప్పారు...