హోం

19, ఏప్రిల్ 2014, శనివారం

తెలంగాణా జెండా ఎగరాలి


తెలంగాణ రాష్ట్రము లో జరుగుతున్న మొదటి ఎన్నికలు.. మన కలలు, ఇన్నేళ్ళుగా మనం కోల్పోయింది, మన బాష , మనా సంస్కృతి అన్నింటితో ముడిపడిన ఎన్నికలు.. ఎవరిని గెలిపిద్దమ్.. ఎవరితో అభివృద్ధి సాధ్యమ్..? విడి పోయి చేడి పోయిర్రు అని ఆన్ద్రోల్లతో అనిపించుకోవద్దు అంటే ఎం చెయలి..? మన వోటును సద్వినియోగం చెసుకొవాలి.. 
* కాంగ్రెస్స్ : మా ఎం ఎల్ ఎ లు సంతకాలు చేసి పంపిస్తే తెల్న్గాన్ ఇచ్చాను అంటుంది సోనియా గాంది. నిజమే అయితే లక్షల మంది రోడ్ లమీడకు ఎందుకు వచ్చారు, సకల జనుల సమ్మె ఎందుకు చెశారు..? వెలసి మంది బిడ్డలు ఎందుకు చనిపొయారు..?
మన అభివృద్ధి కాంగ్రెస్స్ వాళ్ళ కాదు.. ఎందుకంటే గత పదేళ్ళు, ఇంకా చెప్పాలంటే గత 60 ఏళ్ళు పాలించింది వాల్లె.. చేసింది ఏమి లెధు.. అండర్ సర్కార్ కు గులం గిరి చెయ్యడం థప్ప.  అసలు ఆ పార్టీలో రాష్ట్ర స్థాయి నేత లెడు. పొన్నాల, దామోదర, జాన, డిఎస్, శ్రీధర్ బాబు వీల్లె గెలవడం కశ్తమ్.. ఇక రాష్ట్రాన్ని పాలించేధీ ఎవరు..?
అయిన వీళ్ళ చేతిలో రాష్ట్రాన్ని పెడితే అభివృద్ధి చెస్థర..? క్రిశాంక్ కు సీట్ ఇచ్చి.. అమ్మ ఫోన్ చెయ్యగానే జెఎసి నేతలపై ఉద్యమం చేసినోనికి టికెట్ ఇచ్చరు, వీళ్ళు అభివృద్ధి చెస్థారా..? మాట పై నిలబడటం గురించి మాత్లదుథున్నరు.. 2009లో తెలంగాణా ఇస్తామని మాట థప్పలెధ.. క్రిశంక్ కు సీట్ ఇస్తమని మాట థప్పలెధ.. అమర వీరుల కుటుంబాలకు సెట్లు ఇస్తామని ఇచ్చరా..? 
* టిడిపి - బిజెపి : చంద్ర బాబు ఆంద్ర కెల్లి పొయిన్దు.. ప్రచారం కూడా చేస్తాలేదు.. బి సి లకు ఇచ్చాడట, మరి ఆంద్రాల కూడా బి సి లకు ఇవ్వ లేదు ఎందుకు ..? వీల్ తో కలిసి బి జె పీ వాళ్ళు విశ్వాస నీయత కోల్పోయారు, పది మంది జిల్లా ఆశ్యక్షులు రాష్ట్ర అశ్యక్షుడు చెప్పిన వినని, బిజేపీ పెద్దలు చంద్ర బాబు కు విలువ ఇచ్చింది. బెజేపీకి ఓటు వేసి తెలంగాణాల చెంద్ర బాబు ను బతికిన్చుడు అవసరమా అలోచిన్చండి..  పోరాపాటున  రేపు బి జె పీ రాష్ట్రము లో అధికారం లోకి వచ్చిన కిషన్ రెడ్డి మాట చెల్లదు, మోడీ దగ్గర చెల్లేది చెంద్ర బాబు మటే.. 
* టి అర్ ఎస్: జె ఎ సి లోని అన్ని పక్షాలకు సీట్లు ఇచ్చింది. ఉద్యోగుల పక్షాన శ్రీనివాస్ గౌడ్ కు, డాక్టర్స్ నుంచి నర్సయ్య గౌడ్ కు, విద్యార్థుల నుంచి పిడమర్తి రవి, గదారి కిశోర్, బల్క సుమన్, లాయర్ ల నుంచి సహోదర్ రెడ్డి, ప్రొఫెసర్ ల నుంచి సీతారాం నాయక్, ప్రజాసంగాల నుంచి రసమయి, అమరవీరుల నుంచి శంకరమ్మ, జాగృతి నుంచి కవిత. కొత్త నాయకత్వం మన ముందుకు వచ్చింది గెలిపించు కోవల్సిన్ బాధ్యత మాన్ మీదనే ఉంది.. గతం లో పని చేసిన సిట్టింగ్ టి అర్ ఎస్ ఎం ఎల్ ఎ లు ఏమి పనులు చేయలేదని కెంత మంది మీద జలకు సహనం ఉండొచ్చు, కాని వాళ్ళు పోరాదతం వళ్ళు తెలంగాణా వచ్చింది. ఇక చేసేది ముందు ఉంది. మన ప్రభుత్వం ఏర్పడుతే మనం అభివృద్ధి చేసుకోవచ్చు, మన ప్రభుత్వం ఏర్పడాలంటే మన తెరాస ఎం ఎల్ ఎ లను గెలిపించు కోవాలి, ఆశికారం లో ఉన్న మంత్రులే ఏమి చెయ్యలేదు, కనీసం తెలంగాణా కోసం రాజినం చెయ్యమంటే జాన్ రెడ్డి కేరళకు వెళ్లి రెస్త్ తీసుకున్నాడు లాంటి వారికన్నా మన కోసం పోరాటం చేసిన వారిని ఎన్నుకొని, మరో పార్టీతో పొత్తు లేకుండా పూర్తిగా 60 సీట్లు గెలిపిస్తే చూడడం ఎం చేస్తారో ఈ 5 ఏళ్ళు, ఉద్యమాన్ని విజయవంతం చేసినట్లుగా తెలంగాణా ను అభివృద్ధి చేస్తారేమో.. ప్పుడు మనకు అడిగే హక్కు కూడా ఉంటుంది.. కుటుంబ పార్టీ అంటున్న జైరాం రమేష్ సోనియా, రాహుల్, ప్రియాంక ల కుటుంబ పార్టీ కాదా కాంగ్రెస్.. బాబు, బ్బు వల్ల బాబు, హరి కృష్ణ, బల కృష్ణ, పురందేశ్వరి, ఇది కూడా కుతుబ్ పార్టీ కాదట టి ఆర్ ఎస్ మాత్రమె కుటుంబ పార్టీ అంట.. 
* ఒక పదేళ్ళ తర్వాత విడిపోయి బాగు పడ్డారు అని అందరు అనుకోవాలి, అంతే కాని విడిపోయి చెడిపోయారు అని పించుకోవద్దు, అందుకే ఆంద్ర బాబులకు సలాం కొట్టేవాల్లకు, డిల్లి కి వంగి వంగి దండాలు పెట్టె వాళ్లకు వోటు వేయకండి, సిసలైన తెలంగాణా పార్టీ కె ఓటు వెయ్యండి.  

18, ఫిబ్రవరి 2014, మంగళవారం

తెలంగాణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం


చారిత్రాత్మక ఘటన సాకారమైంది. నాలుగున్నర కోట్ల ప్రజల స్వరాష్ట్ర ఆకాంక్ష,.. లోక్ సభలో ఆమోదం పొందింది. ఇక రాజ్యసభలో లాంఛనం ముగిస్తే.. తెలంగాణ స్వయంపాలన శకం మొదలైనట్టే. అదీ ఎంతో దూరంలో లేదు.. ఇప్పుడో ..రేపో .. ఆ మహత్తర ఘట్టం కూడా ఆవిష్కారం కానుంది. మొత్తానికి ఆరు దశాబ్దాల.. ఆంధ్రా అసుర పాలన అంతమైంది! దుష్టపాలనకు తెరపడింది! తెలంగాణ తల్లి దాస్య శృంఖలాలు తెంచుకుని స్వేచ్ఛా వాయువులు పీల్చింది. వెయ్యిమంది బిడ్డల ఆత్మత్యాగం ఫలించింది! పుష్కర కాలంగా అలుపెరుగని పోరాటం చేస్తున్న కేసీఆర్ సైనికుడై తెలంగాణను ఒంటిచేత గెలిపించారు! బరిగీసి కొట్లాడి నెత్తురోడిన తెలంగాణ గడ్డ ఇప్పుడొక ఆత్మగౌరవ పతాక! ఐదున్నర దశాబ్దాల ఆరాటం.. నాలుగున్నర కోట్ల ప్రజల పోరాటం ముగిసింది! ఎన్నాళ్లో వేచిన ఉదయం నులివెచ్చగా పలకరించింది. ఉద్యమం గర్జించిన బెబ్బులిలా ఢిల్లీ మెడలు వంచేలా సరికొత్త చరిత్రను లిఖించింది. కొలిమై అంటుకున్న తెలంగాణ గొంతుక ఆరున్నర దశాబ్దాలుగా అడవి నిండుగా ప్రతిధ్వనించింది! మట్టి పెళ్లగించుకుని వచ్చిన ప్రతి మొలకా పాటై చిగురించింది! సంస్కృతిని మూలం చేసుకున్న అస్థిత్వ ఉద్యమం ఇప్పుడు విజయతీరాలకు చేరింది. మోటకొట్టిన రాత్రి మోగిన పాట.. కల్లమూడ్చిన అవ్వ కలలో గింజ.. పదునెక్కిన గళం మదిమదిలో డమరుక నాదమైంది! తెలంగాణ ఓటమి తెలియని వీరులవనంగా మారింది! ఆటుపోటు అలజడులు ఎదురుదెబ్బలు విస్మరణలు ప్రకటనలు పక్కదార్లు...!!మొత్తంగా ఈ నేల ఓ పడిలేచే కెరటమైంది! ఊరూరు ఉద్యమంలో వసంతమై చిగురించింది. దండుకట్టి డప్పులు మోగించి కదంతొక్కినా...! బతుకమ్మలాడినా...బోనాలనెత్తినా... పీరీలనెత్తి అసోయ్దూలా అన్నా.. అదంతా గడిచిన వసంతం తోడుగా సాగిన పోరాటమే ! కాలం కత్తుల వంతెన కట్టినా... పాలకుడు మెత్తని ద్రోహం చేసినా... మడమ తిప్పని మట్టిబిడ్డలంతా ఎదురు నిలబడి పోరాడి విజయతీరంలో సగర్వంగా నిలబడ్డారు. ఇప్పుడిక దిగ్భ్రాంతికి చోటు లేదు. కత్తి మొనమీద నెత్తురు చుక్కవోలె ధగధగ మెరవాలె. అమ్మా తెలంగాణమా.. నీకు వేనవేల దండాలు..!! నాలుగున్నర కోట్ల ప్రజల తరుపున నీకు బోనాలు!! సమ్మక్క తల్లీ.. ఒక్కసారి చూసుకోమ్మా.. నువుగన్న తెలంగాణ ఇప్పడు జంపన్న వాగులో శిగమూగుతోంది!

2, ఫిబ్రవరి 2014, ఆదివారం

డిల్లీలో అనుకూల పవనాలు

* తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు పెరుగుతున్న మద్దతు 

బిల్లు ఆమోదానికి కృషి ; రాహుల్ 


న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1 (టీ మీడియా): తెలంగాణ బిల్లును పార్లమెంటు సమావేశాల్లో ఆమోదింపజేసేందుకు కషి చేస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ స్పష్టం చేసినట్లు సమాచారం.శనివారం ఆయన నివాసంలో వివిధ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులతో సమావేశమయ్యారు. దాదాపు గంటపాటు జరిగిన ఈ చిట్‌చాట్‌లో పలు జాతీయ అంశాలతోపాటు రాష్ట్ర రాజకీయాలతోపాటు తెలంగాణపై కూడా తన అభిప్రాయాలను వ్యక్తపర్చారు. విశ్వసనీయ సమాచారం మేరకు.. తెలంగాణ ఏర్పాటుకు కాంగ్రేస్ పార్టీ తీవ్ర కషి చేస్తున్నదని.. రానున్న పార్లమెంటు సమావేశాల్లో తెలంగాణ బిల్లును ప్రవేశపెడుతున్నామని,  ఈ విషయంలో తాము సీరియస్‌గా ఉన్నట్లు రాహుల్‌గాంధీ పేర్కొన్నారు.

                                                 ***


 పూర్తి మద్దతిస్తాం: లాలు 
న్యూఢిల్లీ: తెలంగాణ బిల్లుకు తాము పూర్తి మద్ధతునిస్తున్నామని రాష్ట్రీయ జనతా దళ్(ఆర్‌జేడీ) అధినేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ తెలిపారు. ఇవాళ టీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుతోపాటు ఆపార్టీ నేతల బందం లాలూను కలిసి తెలంగాణ బిల్లుకు మద్దతు ఇవ్వాలని కోరారు. అనంతరం లాలూ మాట్లాడుతూ... తెలంగాణ బిల్లుకు పూర్తి మద్ధతునిస్తున్నామని ప్రకటించారు. పార్లమెంట్ ఉభయ సభల్లో తెలంగాణ బిల్లుకు అనుకూలంగా ఓటు వేస్తామని స్పష్టం చేశారు. వెంటనే బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాలని సోనియాగాందీని, రాహుల్‌గాంధీని కోరుతున్నానని అన్నారు. తెలంగాణ ప్రాంతం పూర్తిగా వెనుకబడిన ప్రాంతమని పేర్కొన్నారు. తెలంగాణ బిల్లును వ్యతిరేకిస్తూ సీమాంధ్ర నేతలు చేసిన తీర్మానాన్ని ప్రస్తావిస్తూ. . .అసెంబ్లీ తీర్మానాలు కేంద్ర నిర్ణయంపై ప్రభావం చూపవని గంటాపథంగా చెప్పారు.

                                                 ***

 ఆప్ అనుకూలం
- ఆమ్‌ఆద్మీ పార్టీ సీనియర్ నేత యోగేంద్రయాదవ్
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఆమ్‌ఆద్మీ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. చిన్న రాష్ర్టాల ఏర్పాటుకు అనుకూలమని పునరుద్ఘాటించింది. పార్టీ సిద్ధాంతపరంగా, విధానపరంగా మేం తెలంగాణకు అనుకూలం. చిన్నరాష్ర్టాల డిమాండ్‌కు మేం మద్దతు ఇస్తాం అని ఆమ్‌ఆద్మీ పార్టీ సీనియర్‌నేత యోగేంద్ర యాదవ్ శనివారం మీడియాకు తెలిపారు. రాష్ట్ర విభజన సమయంలో సీమాంధ్రవాసుల హక్కుల రక్షణకు తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు. విభిన్న సంస్కతుల కలబోత అయిన హైదరాబాద్ విశిష్ఠతను కాపాడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. నదీ జలాల పంపిణీ వంటి అంశాల్లో సీమాంధ్రులకు న్యాయ, రాజ్యాంగపరమైన హక్కులు కల్పించాలని అన్నారు.

                                                   ***



రాంవిలాస్ పాశ్వాన్‌:
న్యూఢిల్లీ: టీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తెలంగాణ బిల్లుకు పార్లమెంట్‌లో మద్దతు కూడగట్టే పనిలో తలమునకలై ఉన్నారు. ఈమేరకు ఢిల్లీలో మకాం వేసిన ఆయన పలువురు జాతీయ నేతలను కలుస్తూ బిల్లుకు మద్ధతివ్వాలని కోరుతున్నారు. ఇవాళ ఆయన లోక్ జన్‌శక్తి పార్టీ అధినేత రాంవిలాస్ పాశ్వాన్‌ను కలిసి తెలంగాణ బిల్లుకు మద్ధతు ఇవ్వాలని కోరారు. అందుకు పాశ్వాన్ సానుకూలంగా స్పందించారు. పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లుకు మద్ధతిస్తామని తెలిపారు.

                                                    ***

శరత్ యాదవ్ :

ఢిల్లీ : తెలంగాణ సమస్య చాల సున్నితమైందని జనదళ్ (యూ) అధ్యక్షుడు శరద్‌యాదవ్ అన్నారు. తెలంగాణ బిల్లుకు మద్దతు కోసం టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ శరద్‌యాదవ్‌ను ఆయన నివాసంలో కలిసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎలాంటి సమస్యలు రాకుండా రాష్ట్ర విభజన జరిగేలా జరిగేలా చూడాలన్నారు. పార్లమెంట్‌లో టీ బిల్లు ఆమోదం కు మద్దతు తెలిపిన శరద్‌యాదవ్‌కు కేసీఆర్ ధన్యవాదాలు తెలిపారు. ఇంతకు ముందే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు శరద్‌యాదవ్ మద్దతు తెలిపి లేటరు ఇచ్చిన విషయాన్ని కేసీఆర్ గుర్తు చేశారు

9, సెప్టెంబర్ 2013, సోమవారం

నిజం నిప్పులాంటిది


హైద్రాబాద్ రెవిన్యూ – నిజా నిజాలు: 

‘ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజన ఖాయం, వెనక్కి వెళ్ళేది లేదు’ అని కాంగ్రెస్ అధినాయకులు స్పష్టం చేస్తున్నారు. ఈ సందర్భంగా సీమాంధ్ర నాయకులు హైద్రాబాద్ సెంటిమెంటును తమ ప్రాంత ప్రజల్లో విస్తృతంగా ప్రవేశపెట్టారు. దశాబ్దాల తరబడి సీమాంధ్రులు రాజధానిని అభివృద్ధి చేశారని, ఇప్పుడు వెళ్లమంటే ఎలా వెళ్తాం అని పెట్టుబడిదారులు, భూస్వాములు వాదిస్తున్నారు. వారి వాదనలను ప్రజలు కూడా మోస్తున్న పరిస్ధితి కనిపిస్తోంది.
‘హైద్రాబాద్ రెవిన్యూ ఆదాయం ఎలా పోగొట్టుకుంటాం?’ అన్న సూపర్ ధనికుల ప్రశ్నకు పై రూపమే ‘హైద్రాబాద్ సెంటిమెంటు.’ రాష్ట్ర ఆదాయంలో హైద్రాబాద్ నుండి వచ్చే ఆదాయమే 50 శాతం అని కొందరు చెబుతుంటే మరి కొందరు 70 శాతం అని చెబుతున్నారు. ఇంత ఆదాయాన్ని కోల్పోతే సీమాంధ్ర ఉద్యోగులకు వేతనాలు చెల్లించడం కూడా కష్టం అవుతుందని అనేకమంది బలంగా వాదిస్తున్నారు. దానితో ఉద్యోగులు భయాందోళనలతో సమైక్యాంధ్ర ఉద్యమానికి మద్దతు ఇస్తూ అందులో పాల్గొంటున్నారు.
రాష్ట్ర విభజన ద్వారా సీమాంధ్ర ఉద్యోగులకు జీతాలు లేకుండా చేయడానికి కేంద్ర ప్రభుత్వం పూనుకుంటుందా? ఇంత పిచ్చి పనికి కేంద్ర ప్రభుత్వం పూనుకుంటుందా? ఇందులో వాస్తవాలు విచారించడం అవసరం. రాష్ట్ర విభజన సందర్భంగా అయినా రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయ వ్యయాల పైన చర్చ జరగడం ఒక ఆహ్వానించదగిన పరిణామం కాగా, ఆ చర్చ ఆరోగ్యకరమైన రీతిలో కాకుండా అపోహలతో, విద్వేషపూర్వక వాతావరణంలో జరగడం దురదృష్టకరం!
కొన్ని అంశాలు చూద్దాం.
1..రాష్ట్రాల ఆదాయం ప్రధానంగా పన్నుల ఆదాయం, పన్నేతర ఆదాయం, కేంద్రం పన్నుల ఆదాయంలో వాటా, గ్రాంట్ ఇన్-ఎయిడ్ ల మొత్తం.
2. విభజన ప్రభావం కేంద్ర పన్నుల వాటా, పన్నేతర ఆదాయం (ప్రభుత్వ భూముల అమ్మకంపై వచ్చే ఆదాయం), గ్రాంట్-ఇన్-ఎయిడ్ లపైన ఉండదు. పైగా సీమాంధ్రలో కొత్త రాజధాని వల్ల రియల్ ఎస్టేట్ ఆదాయం పెరుగుతుంది కనుక పన్నేతర ఆదాయం పెరుగుతుంది. హైద్రాబాద్ రియల్ ఎస్టేట్ పడిపోతుంది గనక ఆ ఎరకు తెలంగాణ పన్నేతర ఆదాయం తగ్గుతుంది.
3. విభజన ప్రభావం ఉండేది రాష్ట్ర పన్నుల ఆదాయం పైనే.
4. అమ్మకపు పన్ను, ఎక్సైజ్ పన్ను, స్టాంపులు & రిజిస్ట్రేషన్, వాహన పన్ను... ఇవే రాష్ట్ర పన్నుల ఆదాయంలో ప్రధానం (98 శాతం). ఇవి జిల్లాల్లోనే వసూలవుతాయి గనక విభజన తర్వాత ఎవరివి వారికే చెందుతాయి.
5. 2003-06 మధ్య కాలంలో గ్రేటర్ హైద్రాబాద్ సగటు సాంవత్సరిక పన్నుల ఆదాయం 7,704 కోట్లు అని, రాష్ట్ర పన్నుల ఆదాయంలో ఇది 37 శాతం అని అప్పటి ఆర్ధిక మంత్రి రోశయ్య గారు శాసనసభలో ఒక సభ్యుడి ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. (ఇండియన్ ఎక్స్ ప్రెస్, ఆగస్టు 28, 2013).
6. 2012-13 లో రాష్ట్ర పన్నుల ఆదాయం 66,021 కోట్లు.
7. రోశయ్య గారు చెప్పినట్లు ఇందులో 37 శాతం అంటే 24,428 కోట్లు.
8. గ్రేటర్ హైద్రాబాద్ అంటే హైద్రాబాద్ నగరం మాత్రమే కాదు. ఇందులో 54 లక్షల జనాభా నివసించే హైద్రాబాద్ తో పాటు సంగారెడ్డి, భువనగిరి మునిసిపాలిటీలు, 849 అర్బన్ గ్రామాలు కూడా ఉన్నాయి. వీటి జనాభా 19 లక్షలు. ఇవి రంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాల పరిధిలోనివి.
9. ఈ పన్నుల ఆదాయం కూడా మొత్తం హైద్రాబాద్ కి చెందినవి కాదు. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో అమ్మకాలు జరిపే కంపెనీలు హైద్రాబాద్ లో రిజిస్టర్ అయి ఉన్నాయి. అంటే రాష్ట్ర వ్యాపితంగా అమ్మకాలు జరిపినా, పన్ను (APGST) మాత్రం హైద్రాబాద్ డివిజన్ లో కడతారు.
10. రాష్ట్రం విడిపోయాక ఆయా కంపెనీలు హైద్రాబాద్ లోనే కొనసాగితే అవి సీమాంధ్రలో జరిపే అమ్మకాలు అంతర్రాష్ట్ర అమ్మకాలు అవుతాయి. కాబట్టి వాటిపైన కేంద్ర పన్నులు ఉంటాయి తప్ప తెలంగాణ రాష్ట్ర పన్నులు కాదు.
11. కంపెనీలు తమ రిజిష్ట్రేషన్ ను సీమాంధ్ర రాజధానికి మారిస్తే అవి తెలంగాణలో జరిపే అమ్మకాలపై కూడా కేంద్ర పన్నులు వర్తిస్తాయి తప్ప సీమాంధ్ర రాష్ట్ర పన్నులు కాదు.
12. కంపెనీలు తమకు ఏ పన్నులు తక్కువో బేరీజు వేసుకుంటాయి. కేంద్ర పన్నులా, తెలంగాణ పన్నులా లేక సీమాంధ్ర పన్నులా... ఇందులో ఏది తక్కువో తేల్చుకుని ఆ మేరకు రిజిస్ట్రేషన్ మార్చుకుంటాయి. కొత్తగా వచ్చే సీమాంధ్ర రాష్ట్రం తగిన సౌలభ్యం కల్పిస్తే ప్రాంతంతో సంబంధం లేకుండా కంపెనీలు తమ రిజిస్టర్డ్ కార్యాలయాల్ని మార్చుకుంటాయి.
13. కాబట్టి కొత్తగా వచ్చే ఇరు రాష్ట్రాలు కేంద్రంతో చర్చలు జరిపి తగిన రాయితీలు తెచ్చుకోడానికి పోరాడాలి తప్ప తమలో తాము తగువు పడడం సరికాదు. రాష్ట్ర విభజన వలన అదనపు రెవిన్యూ ఆదాయం ద్వారా లబ్ది పొందేదీ కేంద్రమే తప్ప తెలంగాణ కాదని ఇక్కడ అర్ధం అవుతోంది.
14. పైగా సీమాంధ్ర కొత్త రాజధాని ఏర్పడే క్రమంలో అక్కడ ఉత్పాదక కార్యకలాపాలు వేగం అవుతాయి. అంటే జి.డి.పి వృద్ధి రేటు ఎక్కువగా ఉంటుంది. ఆ విధంగా కొత్త రాష్ట్రానికి పన్నుల ఆదాయం కూడా వేగంగా పెరుగుతుంది. ప్రారంభంలో కొన్నేళ్లపాటు సీమాంధ్ర రాజధానిలో రియల్ ఎస్టేట్ మార్కెట్ అభివృద్ధి అయితే, హైద్రాబాద్ లో పడిపోతుంది. అనంతరం స్ధిరీకరణ చెందుతుంది.
15. సీమాంధ్రకు 973 కి.మీ పొడవైన సముద్ర తీరం ఉంది. దేశంలో గుజరాత్ తర్వాత సీమాంధ్ర కోస్తా తీరమే పొడవైనది. దీన్ని అభివృద్ధి చేసుకుంటే బోలెడంత రెవిన్యూ. రామాయపట్నం రేవుకి ఇప్పటికే కేంద్రం అనుమతి ఇచ్చింది. దీనికి అనుబంధంగా అనేక వ్యాపారాలు జరుగుతాయి. తద్వారా రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది.
16. హైద్రాబాద్ ఐ.టి ఉద్యోగాలు మిస్ అవుతాయనీ, ఆ ఉద్యోగాల ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కూడా కోల్పోతామని కొందరు చెబుతున్నారు. ఆ లెక్కన బెంగుళూరులోనూ తెలుగువారు అత్యున్నత ఐ.టి ఉద్యోగాలు చేస్తున్నారు. ఆ ఆదాయం మనకే రావాలని అడగొద్దా? మద్రాసు, ఢిల్లీ నగరాల్లోనూ తెలుగువారు ఉద్యోగాలు చేస్తున్నారు. అమెరికా, ఐరోపాల్లోనూ చేస్తున్నారు. అక్కడి ఆదాయాల్లో వాటా వద్దా? ఎద్దు ఈనిందంటే దూడని కట్టెయ్యమన్నట్లు ఈ వాదన ఉంటుంది. సీమాంధ్ర రాష్ట్రంలో ఆదాయాలు పెంచుకునే మార్గం చూడడం మాని వాళ్ళ ఆదాయం మనకి కావాలనడం అన్యాయం కాదా?
17. విభజన వల్ల ఒక తరం నష్టపోతుందని ఎ.పి.ఎన్.జి.ఓ నేత చెబుతున్నారు. అంటే ఆ తర్వాత తరాలకు నష్టం ఉండదు అన్న అంగీకారం ఇందులో ఉంది. కానీ 60 యేళ్లుగా (అంటే మూడు తరాలా?) నీళ్ళు, ఉద్యోగాలు లేక తెలంగాణ జనం ఎదుర్కొన్న నష్టం మాటేమిటి?

                                            
                                                     -విజయశేఖర్ గారు
                                                                                    ' జాతీయ అంతర్జాతీయ పరిస్థితులు ' బ్లాగ్ నుంచి 

8, సెప్టెంబర్ 2013, ఆదివారం

ఆట కాంగ్రెస్ ది - మరి వేట(ఓట్లు) ?


తెలంగాణా రాష్ట్రము ఏర్పదనుందా ..? కాంగ్రెస్ ఇస్తుందా..? బిజేపీ ఇస్తుందా ..? నిజంగా కాంగ్రెస్ కు  తెలంగాణా ఇచ్చే ఉద్దేశ్యమే ఉంటె సీమంద్రలో ఈ లోల్లంత ఎందుకు..? సోనియా చెప్పందే ఏ పని చెయ్యని నల్లారి  వారికి సి డబ్ల్యు సి నిర్ణయాన్ని వ్యతిరేకించే ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది ..? సీమంద్రలో కిరణ్ ను స్ట్రాంగ్ చెయ్యడానికి కాంగ్రెస్ ఆడుతున్న నాటకమే సీమంద్రలో జరుగుతున్న ఆందోళనలు... ?
* 12 ఏళ్ళుగా గుర్తురాని ప్రజల ఆకాంక్ష కాంగ్రెస్ కు సరిగా ఎలక్షన్లకు ఏడాది ముందే ఎందుకు గుర్తుకు వచ్చింది..?
* అది మోడీ సభకు 10 రోజుల ముందే తీర్మానం ఆగ మేఘాల మీద ఎందుకు చెయ్యవలసి వచ్చింది..? 

జూలై 30 తెలంగాణా తీర్మానం చెయ్యడం ద్వార కాంగ్రెస్ పొందిన లాభాలు:- 

* వై కాపా తెలంగాణా లో కాలి అయ్యింది. 
* నరేన్ద్ర మోడికి నవభారత యువభేరి లో చెప్పడానికి ఏమి లేకుండా పోయింది. బి జీ పీ ని ఎదగకుండా దెబ్బకొట్ట గలిగారు. 
*  అంతవరకు కె సి అర్ దగ్గరకు కాంగ్రెస్ వచ్చే పరిస్థితి కాని ఒక్కసారి ప్రకటన రాగానే కాంగ్రెస్ దగ్గరికే కె సి అర్ వెళ్ళాల్సిన అనివార్య పరిస్థితి వచ్చింది. 
* సమైక్యంద్ర ఉద్యమాన్నిలెవదీయడం తో చంద్ర బాబు ఇరుకునపడ్డాడు, రెండు రాష్ట్రాలుంటే తప్పేంటి అన్న చంద్ర బాబు తర్వాత గొంతు సవరించుకొని కాంగ్రెస్ను దుమ్మత్తి పొయ్యడం ప్రారంభించారు. ఎన్ డి ఎ హయాంలో రాష్ట్ర విభజనను అడ్డుకున్నది తానే అంటూ తన అసలు స్వారూపం బయటపెట్టి, సీమంధ్రుల మనసు గెలుచుకోవాలని తెగ తాపత్రయ పడుతున్నాడు. కాంగ్రెస్ ఆటలో బాబు పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా తయారయ్యింది. 
*  హైదరాబాద్ ను UT చేస్తామనే ప్రకటనలతో MIM బయపెట్టి తనదారిలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తుంది. 
* సీమంద్రలో బిజేపీని శాశ్వతంగా రాకుండా చెయ్యాలనే వ్యూహంలో భాగంగా సమైక్యంద్ర ఉద్యమాన్ని పోలీస్లు, మీడియా సహాయంతో నడిపిస్తోంది. 
* బి జె పీ సీమంద్రులకు అన్యాయం జరగా కుండా రాష్ట్ర విభజన జరగాలి అంటే అలంటి ప్రకటనలను చూపించి తెలంగాణా ప్రాంతం లో ఆ పార్టీ పై అనుమానాలు కలిగేలా చేస్తోంది. 
* వై కా పా నమ్ముకున్న రాజశేకర్ రెడ్డి సానుభూతి కాస్త సమైక్యంద్ర ఉద్యమం తో కరిగిపోయింది . ఇప్పుడు వై కా పా పరిస్థితి కాంగ్రెస్ తో కలిసి సాగడం మినహా మరో ప్రత్యామ్నాయం లేదు. 
ఇలా కాంగ్రెస్ ఆడుతున్న ఆటా నాదే.. వేట నాదే అంటూ ఆడుతున్న ఈ ఆటలో చివరికి వేట(ఓట్లు) ఎవరికీ దక్కుతుందో..?